Thursday, August 13, 2020

రామో ధర్మస్య విగ్రవాన్

Aug 5, 2020
"రామో  ధర్మస్య విగ్రవాన్ _!'
,_____&""_____
   హే రామచంద్ర ప్రభో,_-
నా భర్తను చంపి నన్ను ఏకాకిని చేశావు ,_!
ఇన్నాళ్లూ భర్త తో ఆనందంగా గడిపిన నేను , నీ మూలంగా  ఇపుడు దుఃఖంలో మునిగి పోయాను _!
"పతియే  ప్రత్యక్ష దైవము_!" అని త్రికరణ శుద్ధితో నమ్మి __ఇన్నాళ్లూ   పతిని క్షణమైనా ఎడబాయక ఆనందంగా జీవించాను _!
_నా భర్త  _ సామాన్యుడు కాడు _!మహా వీరుడు_! బల  పరాక్రమం లో  , కానీ  రాజ్యాధికార నిర్వహన లో గానీ,, అతడి కె దురు లేదు _!!
బ్రహ్మ చేత అనేకవరాలు పొందిన _ రాక్షస రాజు ,రావణుడిని __తన  సందిట బంధించి _ఏడు సముద్రాల లో ముంచి ,,చివరకు శరణు కోరగా_ తన తోకతో    అతడిని చుట్టి లంక వరకు విసిరిన మహా  బలశాలి నా భర్త__!
ఇపుడు అంతటి వీరుడు  నన్ను విడిచి వెళ్ళిపోయాడు ,నాతో లేడు ,_,ఇక రాడు_!  భర్త లేని భార్య జీవితం ఎంత దుర్భర మో నీకు తెలుసు కదా  రామచంద్రా _!!అతడితో బాటు  సహగమనం  చేయడం పతివ్రత  గా నా ధర్మం _!
అందుచేత _నా భర్త శవం తో బాటు దహనం చేసుకునేందుకు_ నాకు  అనుమతి  అనుగ్రహించు రామచంద్రా _!
ఈ బ్రతుకు పై విరక్తి కలుగుతోంది  నాకు _!"
ఎంతపని చేసితివి రామా __!
నిన్ను ఏమనందును  సార్వ భౌమా _?
పతి లేని ,నా దుఖాన్ని  నేను భరించలేను  ,_ప్రభో_!
   _ తల్లీ _! ఓ సాద్వీమణీీ ,_! దుఖించకు_ _! ఇలా స్మశాన వైరాగ్యం ఇలాంటి   విపత్కర సమయాల్లో కలగడం సహజం _!
ఇది నీకు నీ భర్త పై గల ప్రేమను సూచిస్తూ ఉంది _!
_"" అమ్మా _!
నీకు సకల ధర్మాలు తెలుసును __!
అందుకే _ నీ భర్త  చేస్తున్న అధర్మాన్ని ,అత్యాచారాన్ని నీవు ఖండించావు _! వారించావు.  కూడా _! అతడికి  నయంగా_ ప్రేమతో నచ్చ జెప్పావు _! అయినా అతడు వినలేదు _!,
  అధర్మాన్ని అణచి ధర్మాన్ని స్థాపించే ఉద్దేశ్యం తో  __నీ భర్తను చంపా ల్సి వచ్చింది _!
ప్రాణ భయంతో, సుగ్రీవుడు నన్ను శరణు కోరాడు , _!
  అతడికి ఇచ్చిన అభయం ప్రకారం నేను ఈ పని చేశాను __!
అంతేగానీ ప్రతిఫలం ఆశించి. కాదు _!
ఇక భర్త తో నీ  సహగమనం  అనే విషయం __ఎంత మాత్రం  ధర్మ సమ్మతం కాదు,_!
బ్రతికి ఉన్నపుడు నీవు అతడితో _ ఎలా ప్రేమతో  గడిపావో _ఇపుడు కూడా అతడి రూప గుణ వైభవాలను ఆత్మయందు నిలిపి    నిత్యం  స్మరిస్తూ ఆనందిస్తూ తృప్తిగా  జీవించు_!
భార్యా భర్తల  మద్య ఉండే ప్రేమ __ కేవలం కామ వాంచ లకోసం ,శారీరిక సుఖాల కోసం మాత్రమే కాదు _!
  నీవు ప్రేమించింది ఈ  దేహాన్ని కాదు _! అందులో ఉండే ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించా వు _!
ఇపుడు అదే  శరీరం పంచ భూతాలలో కలిసి పోతుంది __!
భర్త పై నీకు ఉన్న ప్రేమ__ నీ ప్రాణం కంటే మిన్న ,  గా భావిస్తూ ఉన్నావు కదా _!
__ఆ అనుబంధం  భర్త యొక్క పాంచభౌతిక శరీరం తో  మాత్రమే ముడి వడి ఉండ లేదు ,,కదా  _!!అతడి శరీరం పోగానే  ప్రేమ పోవడానికి  __!
నీవు జీవిస్తూ ,అతడి ఆశయాలను జీవింపజేయాలి అమ్మా _!
భర్తపై గల  ఇదే ఇష్టాన్ని ప్రేమను _నీ _నిజజీవితంలో  కూడా ఆచరించి చూపుతూ నీ సతీ ధర్మాన్ని నెరవేర్చాలి ,_!
భర్త  జీవించి ఉండగా  ఎంత అనురాగం అన్యోన్యత చూపావో , భర్త లేనప్పుడు కూడా అంతే ప్రేమను  అంతరంగంలో అనుభవించాలి ,_!
ఇది  నీ లాంటి పతివ్రత లకు  ఒక కటిన పరీక్షా సమయం ,_!
  అందుకే _ఆత్మ సంయమనం కోల్పోకుండా ,ఆత్మ విశ్వాసం తో  అమూల్యమైన జీవితాన్ని ,విలువలను , సతీ ధర్మాన్ని పాటిస్తూ , స్త్రీ జాతికి   నీవు ఆదర్శంగా నిలవాలి ,,_!
ఇటువంటి కష్ట సమయంలో   నీవు  ప్రదర్శించే వివేకం , ఆత్మ విచారణ  వలన ,  ఇహ పరాలలో శాంతి సౌఖ్యాలను , జీవన్ముక్తి నీ కలుగ జేస్తూ ఉంటుంది ,
,_ నీ ఆత్మలో  నీ భర్త జ్ఞాపకాలు  సుస్థిరంగా ఉంటూ , భర్త కు ఉన్న  దైర్యం , అత్మ బలం నీకు నూతన జీవనాన్ని   ,ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండాలి _!
పుట్టిన ప్రాణి.  ఒకనాడు గిట్టక తప్పదు కదా _!
ఇది ప్రకృతి సహజం ,_!
  కానీ దీనికి భిన్నంగా    ఆత్మహత్య లాంటి  బలవన్ మరణాన్ని  కొని తెచ్చుకోవడం  ,మహా పాప కార్యం అవుతుంది ,
ఇతరులకు మన జీవన విధానం అనుసరణీయం  కావాలి కాని ,   ప్రాణ సంకటం కాకూడదు కదా _!
పైగా నీ ప్రాణ త్యాగం వలన__ వీర మరణం పొందిన  నీ భర్త ఆత్మ మనః శాంతి కోల్పోయి ,  బాధ పడుతూ ఉంటుంది _ ఎందుకంటే !నీవు పొందే దుఖం అతడి ఆత్మను  దుఖింప జేస్తుంది  కదా _!!
అందుకే   నీవు  నీ  సహగమనం మాట ఎత్తకుండా , నీ  భర్త  నీ పై ఉంచిన  నీ కుమారు డు , అంగదుని సంరక్షణ భారాన్ని  మోస్తూ నీ  ,భర్త ఆత్మకు శాంతిని. , రాణిగా    విశాల వానర సామ్రాజ్యానికి   సుస్తిరత్వాన్ని  నీవు సమకుర్చాలి _!
ఇది పతివ్రత గా నీవు పాటించాల్సిన    అతి  ముఖ్యమైన ధర్మం ,_,_!
  __నీ భర్తకు ధర్మం తెలుసు _!
కానీ ఆచరించ లేదు _!
అహంకారం అడ్డు వచ్చింది ,_!
ఫలితంగా తన  అమూల్యమైన ప్రాణాలు కోల్పోయాడు  కదా _!
అందుకే  నీకు తెలిసిన ఈ ధర్మం ఆచరించడం లో  నీవు నిష్టను విశ్వాసాన్ని చూపాలి తల్లీ __!
మనసులో కలిగే వైరాగ్యాన్ని నిరాశ లను త్యజించి ,నీ  కర్తవ్యాన్ని   నిర్వహించాలి  _!
తండ్రిని కోల్పోయిన నీ కుమారునికి తల్లిని కూడా లేకుండా చేస్తావా ,_?
దుఖం లో మునిగిన అంగదుని ఊరడి కలిగించి,తండ్రికి
అతడు చేయాల్సిన  అంత్య క్రియలను   దైర్యం ఇస్తూ చేయించాలి _! ఇవన్నీ దృష్టిలో ఉంచుకుం టూ ,
నీవు నీ ధర్మాన్ని పాటించి , వానర రాజ్యాన్ని సుస్థిరం చెయ్యి తల్లీ _!
  సకల ధర్మాలు తెలిసిన పతివ్రతా శిరోమణి వి నీవు  ,_!
   నీ భర్త ఆత్మను  తృప్తిగా ఆనంద పడేలా  నీవు నీ కర్తవ్యాన్ని బాధ్యతల ను నిర్వహించు తల్లీ _!
  హే రామచంద్రా ,దుఃఖ సముద్రంలో కొట్టుకు పోతున్న నాకు కర్తవ్యాన్ని బోధించి,. నీ ధర్మ ప్రబోధం తో  ,,నా మనస్సుకు శాంతిని ప్రశాంతత ను ,చేకుర్చావు
నీకు శతకోటి ప్రణామాలు ప్రభూ _!
అందుకే నిన్ను ధర్మా వతారుడు అన్నారు
రామో ధర్మ స్య విగ్రవా న్
   అయోధ్యా రామా _!
నమో నమః
రాజారామ చంద్ర భగవాన్ కి జై _!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...