Friday, August 14, 2020

క్షమా గుణం

Aug 14, 2020
క్షమా గుణం , భిక్ష  కు ప్రతి రూపం ,
జ్ఞానులు మహాత్ములు ఋషులు మునుల వంటి పవిత్ర ఆత్మలకు మాత్రమే ఆ మనో నిగ్రహం కలుగుతుంది
  వశిష్టుని నూరుగురు కుమారులను విశ్వామిత్రుడు సంహరిస్తాడు
అయినా వశిష్టుని కి కోపం రాలేదు
   అయినా యుద్దం చేస్తాడు
వశిష్టుని బ్రహ్మ దండం  అతడి అస్త్ర శాస్త్రాలను   మట్టు బెడుతుంది 
అయినా విశ్వామిత్రుని కోపం చల్లా ర లేదు ,
వశిష్ఠుని క్షమ గుణం ,తో అతడికి ఇంకా ఇంకా బెట్టు పెరిగింది
వశిష్ట మహర్షి వలె బ్రహ్మర్షి కావాలి అన్న  తపన పట్టుదల  విశ్వామిత్రుని అహంకారాన్ని అణచి ,చివరకు బ్రహ్మర్షి అనిపించు కున్నాడు
   క్షమా గుణం లో కన్న తల్లి మిన్న ,
ధరిత్రి కి తీసిపోకుండా
  తన సంతానం కోసం ప్రాణము ఇస్తుంది
ప్రాణం తీస్తుంది
  బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా
ఇంట్లో నుండి వెళ్ళ గొట్టినా
తిట్టినా కొట్టినా
అవమానించిన కూడా
తమ పిల్లలను క్షమిస్తూ ,
ప్రేమతో దీవిస్తుంది
   అందుకే
అమ్మను మించిన దైవం లేదు   అంటారు
  క్షమ యా  ధరిత్రి అన్నది అమ్మ ప్రేమ పరాకాష్ట కు మరో బిరుదు,
  క్షమ అన్నది  బ్రహ్మ పదార్థం
   మనిషి ఎన్ని తప్పులు చేస్తున్నా
తన వరాలను నిరుపయోగం చేసినా  దైవానికి కోపం రాదు
అజ్ఞానం అవిద్య అహంకారం వల్ల  మనిషిలో  క్షమా గుణం కొరవడింది
ప్రహ్లాదుడు తండ్రిని
ధృవుడు తల్లిని క్షమించారు,
కారణం  వారిలో ఇష్ట దైవాన్ని దర్శించారు కనుక
    క్షమ ను పొందడానికి కూడా  అర్హత ఉండాలి
మహితాత్ముడు భీష్ముడు ,బ్రాహ్మణుడు  గొప్ప విలుకా డు గురువు అయిన ద్రోణుడు
వీరు దేవుడు కూడా క్షమించరాని అపరాధం చేశారు
శ్రీ కృష్ణ భగవానుడు  వారికి వారి అండ చూసుకొని మదించిన దుష్ట చతుష్టయం కు  మరణ దండన యే క్షమా భీక్షగా అనుగ్రహించాడు
క్షమ  దానం వలె పాత్ర త నెరిగి ఇవ్వవలసి ఉంటుంది
  ఇకముందు అలాంటి అపరాధం చెయ్యకుండా ఉంటే ,అలాంటి  వారు మాత్రమే క్ష మ కు.  అర్హులు  అవుతారు  కదా
అంటే క్షమ వల్ల ఎదుటి వాడి  ప్రవర్తన లో.  పరివర్తన  కలగాలి ,
అందుకే
  మా అమ్మ   తన మరదులను  అత్తా మామ లను ఆడు బిడ్డలను క్షమించ లేదు ,
ఎందుకంటే ,  వారి నడక ఉదాత్తంగా లేదు
పశ్చాత్తాపం లేదు
  ఎవరూ కూడా స్వచ్చందంగా అమ్మ వద్దకు వచ్చి చేసిన తప్పులకు క్షమాపణ కోరలేదు
సరి కదా
  ఆ తప్పులను  ఇంకా ఇంకా  కొనసాగిస్తూ వచ్చారు
      క్షమ శ్రీరామ స్వరూపం
తన భార్యను అపహరించి న రావణుడు , క్షమాపణ అడిగితే   క్షమా భిక్ష ఇవ్వడానికి  ,చివరకు తన అయోధ్యా నగరానికి రాజును కూడా చేయడానికి సిద్ధపడిన. శ్రీ రాముడు
  క్షమా గుణ సంపన్నుడు
   , అందుకే రాముడు
జగదభి రాముడు ,త్రిభువన నయనాభి  రాముడు అయ్యాడు
     శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమః
జై శ్రీ రామ్.
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...