Sunday, September 13, 2020

కరోనా కుంభ కోణం

Sept 12, 2020
"నమస్కారం  సబ్ ఇన్స్పెక్టర్ గారూ !"
_""నమస్కారం , _! రండి ,ఇలా కూర్చోండి _!""
""థాంక్స్ అండి _! ""
""చెప్పండి  ,_! ఏం కావా లి మీకు_?"
""నా పేరు రాజ శేఖర్ ,_!: ఇక్కడే ,ఇదే బెంగళూర్ సిటీ లో , నేనొక  సాప్ట్ వేర్ ఉద్యోగిని , ,_!
" అవునా,,సంతోషం ,,_! మీకు నాతో ఏం పని  పడింది _!?
   ""  పెద్ద సమస్య వచ్చి పడిందం డీ ,_! నిన్న మా తల్లి గారికి కిడ్నీ   సమస్య కోసం ఇక్కడే  ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళాను  ,,_! కానీ వాళ్ళు  ముందు కరోనా పరీక్ష చేయాలి అన్నారు _!'"
  ,",మంచిదే  కదా _! ఇప్పుడు , ఇది మామూలు వ్యవహారం అయ్యింది  ప్రతీ  హాస్పిటల్ లో  _!చేశారా  ? _ ఏమన్నారు ??"
""చేశారు _!"
""ఏమైంది ,  తర్వాత ?""
  తమ పరీక్షలో  ""కరోనా పాజిటివ్"" అని తేల్చారు వాళ్ళు  _!
""అవునా ,అయితే ముందు మీరు లేచి దూరంగా ఉండండి  రాజూ _గారూ _!"
  _""అంత భయపడకండి  మీరు , ఇన్స్పెక్టర్ గారూ _! పూర్తిగా నన్ను చెప్పనీ యం డీ _!
  __"" కరోనా అంటేనే వణకు వస్తోంది_! చెప్పండి _ తొందరగా _!""
""మా అమ్మ సంపూర్ణ ఆరోగ్యం గా  ఉంది,, బీపీ షుగర్ లు లేవు _!  ,జెనరల్, చెకప్ కోసం పోతే    ఇలా కావడం ఆశ్చర్యంగా అనిపించింది,, ఆ రిపోర్ట్, మేము నమ్మకుండా ,మళ్లీ వేరే పెద్ద హాస్పిటల్ లో  పరీక్ష  చేయించాను ,_!"" నిన్ననే వెంటనే _!"
""   ఏమైంది మరి  అక్కడ _?
""_ అక్కడ" నెగటివ్ ""అని చెప్పారు _!""
_""ఏమిటీ ,ఒకే మనిషికి , ఒకే రోజున , రెండు రకాల రిపోర్ట్స్ వచ్చాయా _? __"చెప్పండి_! చెప్పండి _!,తర్వాత   మీరు ఏం చేశారు _?,ఎక్కడికి వెళ్ళారు _?
__ఎక్కడికి వెళ్ళలేదు సార్ _! ,, ఏం చేయాలో తోచక  ఇంట్లోనే  ఉండి పోయాం _!"
_"" తర్వాత _?
  "" ఈ రోజు ఉదయం మున్సిపాలిటి వారు వచ్చారు మమ్మల్ని వెతుక్కుంటూ __!""
""దేనికీ _ రాజు గారు ?  ఇంత త్వరగా  వాళ్లకు ఎలా తెలిసింది ,,?
,__హాస్పిటల్ వాళ్ళు  వారికి ఫోన్ చేసి చెప్పారా , ఈ విషయం _?
""అదే అడిగాను  , నేను _! వాళ్ళు , అవునన్నా రు _!""
మేము ఇల్లు చేరామో లేదో వాళ్ళు దిగారు ""కరోనా  రంగం"" సిద్దం చేయడానికి_! _!, మా అమ్మ కరోనా పేషంట్ కనుక  మా లోకాలిటీ మొత్తం కంటోన్మెంట్ బోర్డు తగిలిస్తూ బ్లీచింగ్ పౌడర్, చల్లుతూ రోడ్లు ఇల్లూ  కరోనా విస్తరించకుండా నివారణ చర్యలు  చేస్తూ ఉన్నాము అన్నారు _!""
  _ "మరి , రాజూ గారూ ,_!అమ్మ గారికి పాజిటివ్ కాదు  __!మళ్లీ పరీక్ష చేయించాను __! నెగెటివ్ వచ్చింది __!అని చెప్పారా లేదా __?!""
"" అదీ చెప్పాను_! రిపోర్ట్ కూడా  చూపాను _ వారికి !!మాకు అదంతా తెలియదు ,_! వార్డ్ మెంబర్ ,,కౌన్సిలర్ చెప్పినట్టు చేస్తున్నాం అన్నారు _!""
""_ రాజు గారు , _!వాళ్ళు అలా కరోనా హడావుడి చేస్తుంటే మీ colony వాళ్ళు చూస్తూ ఉన్నారా _?""
పాపం  వాళ్ళు మాత్రం    ఏం చేస్తారు _ చెప్పండి _; కరోనా అంటే అందరికీ భయమే కదా _! ఇపుడు  _;అంతా  ఇళ్ళల్లో కెళ్ళి డోర్ లాక్ చేసుకొని కిటికీ లనుండి తమాషా చూస్తూ ఉన్నారు _!__  నాకు ఏమీ తోచక __మీ సలహా కోసం ,మాకు సహాయం చేస్తారని  వచ్చాను _!""
__""రాజు గారు _ చాలా మంచి పని చేశారు మీరు _! మీకు తెలియదు ,ఈ కరోనా వ్యవహారం కూడా ఇపుడు  రాజకీయం చేస్తున్నారు ,హాస్పిటల్ వాళ్ళు _!""
   ""   ఇందులో రాజకీయం చేయాల్సిన అవసరం  ఏముంది,? సార్ ,_!"
   ""  రాజు గారు _!మీ రు తెలుసు కోవాల్సిన  విషయం ఇక్కడ  ఒకటి ఉంది _!, అది  మీకు చెబుతాను  _!కానీ మీరు మాత్రం  ఆ విషయం ఎక్కడ  __ఎవరితోనూ చెప్పవద్దు సరేనా _!""
"" అయ్యా నా కెందుకు ఆ కరోనా  గోల , _?ఎక్కడా చెప్పను కానీ__
  ఈ కరోనా మిస్టరీ  ఎదో కాస్త    క్లియర్ చేయండి , సార్ _!మీకు పుణ్యం ఉంటుంది ,__!""
__ అదే చెబుతున్నాను  రాజు గారు __ ఆ హాస్పిటల్ సిబ్బందికి __ఈ మున్సి పాలిటి వాళ్లకు  _ వార్డ్ మెంబర్ లకూ మధ్యే ఒక ఒప్పందం ఉంటుంది _!
   ". ఒప్పందమా ?_ దేనికీ,, _?""
__ అవును  సిటీలో ఎక్కడైనా , కరోనా పేషంట్ ఉంటే ,అతడు  ఉన్న   ప్రాంతంలో కట్టుబాటు చేసేందుకు_ కరోనా నియంత్రణ కోసం ,_ అధికారులు  ఆ ప్రాంతం వార్డ్ మెంబర్ కు నాలుగు లక్షలు మంజూరు చేస్తారు ,__!;"
""  మంచిదే కదా _!"
""అందులో ఒక లక్ష ఖర్చు అయ్యింది _""అనిపించి మిగతా సొమ్ము స్వాహా చేస్తారు _!""
""అమ్మ బాబోయ్ _!ఇంత గూడు పుటా నీ ఉందా  దీని వెనుక _?
  ""  అలా జరిగినా  కొంత డబ్బు  జేబుల్లో వేసు కున్నా , ఫర్వా లేదు కరోనా పేషంట్స్ ని రక్షించేందుకు _! కానీ ఘోరమైన ,నమ్మలేని విషయం ఏమంటే  కరోనా వ్యాధి లేనివారికి కూడా __ ""పాజిటివ్ ""అని పరీక్షలో వచ్చిందని   రిపోర్ట్ ఇస్తారు , వారు ఉంటున్న వార్డ్ మెంబర్ కు ఫోన్ చేసి చెబుతారు ,  కూడా
""అంటే తప్పుడు రిపోర్ట్ ఇస్తారా ,_?
""అవును మీకు ఇచ్చినట్టే "" _!
"" ఇంత  అన్యాయమా _?  పెద్ద హాస్పిటల్  అని నమ్మి వెళ్తే _?   దేనికోసం   రోగులను ఇంత  మోసం చేయడం _?
హాస్పిటల్ వారూ, రాజకీయ నాయకు లు   కలిసి కేస్  పోకుండా  బయటకు పొక్కకుండా  , చాటు మాటున , ""టై అప్ "" అంటే ఒడంబడిక చేసుకుంటారు _!
  _""తమ చేతికి_దొరికినంత దోచుకో వడానికి __ఈ కరోనా వ్యాధి బాధితులను  కూడా ,అడ్డం పెట్టుకొని లక్షలు సంపాదిస్తూ ఉన్నారు __ ఇలా  కరోనా ను  రాజకీయం చేస్తూ _!
__"" సార్ ,! నేను మళ్ళీ కరోనా పరీక్ష చేయించు కోవడం  చాలా మంచిది అయ్యింది , బతికి పోయాను_! అమ్మో _! లేకపోతే  , తనకు ,కరోనా నిజంగానే సోకిందని  _ 80 ఏళ్లు నిండిన  మా అమ్మగారు  దిగులుతో  _మంచం పట్టేది కదా _!""
_""_రాజు గారు,_!  డాక్టర్స్ లను హాస్పిటల్ ను పూర్తిగా నమ్ముకొని   ప్రాణాలు కాపాడుతారు అని విశ్వాసం తో వచ్చే ప్రజలను __ఇలా మోసం చేస్తూ దొడ్డి దారిన డబ్బుకు  కక్కుర్తి పడే వారు , __దేనికైన తెగిస్తారు_! వారికి సిగ్గూ శరం,మానం,అవమానం  అభిమానం వుండవు కదా _!""
  ,"" అయ్యా _!సబ్ ఇన్స్పెక్టర్ గారూ  _!నన్ను _ మా అమ్మ గారిని  _ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించారు _!!మీకు   ధన్యవాదాలు , _! మీకు  రెండు చేతులూ జోడించి,,మా  కృతజ్ఞత తెలియ జేస్తూ ఉన్నాను __!; ఇపుడు  మా ఇంటి చుట్టూ జరుగుతున్న   అబద్ధపు కంటోన్మెంట్   నాటకం నుండి మేము బయట పడేది ఎలా_? __ సార్ ,_!ఇంత  ఉపకారం చేశారు _!,ఇక
దయచేసి  ఆ   కంటోన్మెంట్ చిక్కునుం డీ కూడా మమ్మల్ని    రక్షించండి _!,,మీ ఖర్చు  లు ఏదైనా ఉంటే ఇచ్చుకుంటాం _!""
   _ ""రాజు గారు _!ఆ దిగులు కూడా మీకు అవసరం లేదు,_! వెళ్ళి మీ ఇంటిలో ప్రశాంతంగా  ఉండండి ,_! జరిగినది అంతా మరచి పొం డీ  _!""
  ""మా కాలనీ వాళ్లకు ఏం చెప్పాలి నేను  సార్_?""
_"" వాళ్లకు ఏదో తప్పుడు సమాచారం అందింది  అట _!,అందుకే వచ్చారు  వాస్తవం  చెప్పాను వెళ్ళి పోతున్నారు , అనండి _! అంతే _!""
"" నేను అంటాను  వారితో_! కానీ వెళ్ళి పొమ్మని వారితో  ఎవరు చెబుతారు సార్  _?""
  __ఆ విషయం నాకు వదిలేయండి  రాజు గారు _! నేను మీ కాలనీ వార్డ్ మెంబర్ తో ఇప్పుడే ఫోన్ లో మాట్లాడుతాను ,_!,  మీరు ఇంటికి వెళ్లేసరికి   అంతా క్లియర్ చేస్తా రు వాళ్ళు సరేనా _!"",
_"" సార్ చాలా థాంక్స్ అండి మీకు _!
__ రాజు గారు _! నా దగ్గరకు వచ్చారు కదా , అడగకున్నా ,మీకు ఒక సహాయం చేస్తాను ,_!""
__"" చాలా సంతోషం సార్ _! దానికి  నన్ను ఏం చేయమంటారు చెప్పండి _?!""
ఏం లేదు ,_  ఈ కరోనా డబ్బులు _కుంభ కోణం,రాజకీయం ,తప్పుడు సమాచారం , మన మధ్య జరిగిన ఈ మాటలు , ఇవన్నీ  ఇక్కడే మరచి పొండి , ,అంతే _!""
""సరే సార్ _! గాలికి కొట్టుకు పోయె కంప ,నాకెందుకు _? ఎక్కడ అనను _!""
_""రాజు గారు __! మీ వార్డ్ మెంబర్ తో చెప్పి _  రేపే,మీ అమ్మగారికి,మీరు కోరుకున్న హాస్పిటల్ లో __ ఉచితంగా కిడ్నీ పరీక్ష చేయిస్తాను , _; మళ్లీ ఏ  కరోనా పరీక్ష చేయాల్సిన అవసరం లేకుండా _!_"" మీకు ఓ కే నా ,చెప్పండి _??""
     _""వద్దు సార్ , _! ఇక మేము ఇక్కడ ఉన్న ఏ హాస్పిటల్ లో  కూడా__  ఏ పరీక్ష చేయించు కోము ,_!  ఇంత ఘోరం కళ్ళారా చూశాక  కూడా , ఇంకా  ఇక్కడి హాస్పిటల్  కు వెళ్ళడమా _? _ అమ్మో _!!"" హాస్పిటల""్  అన్న  పేరు వింటేనే _ ఆ" కరోనా"" పేరు కంటే ఎక్కువ గా వణుకు , భయం ,దడ పుడుతోంది , _!    థాంక్స్ సార్ _!  నన్ను కరోనా కుంభ కోణం నుండి బయట పడేసి నందుకు _!!"
ఇక వెళ్తాను ,,సార్ _!;
""_ ఓ అమాయక పు  భారతీయుడా _! చూస్తున్నావు గా  నా ఈ  బాధ _??
_""ఎలా  తట్టుకుంటూ ఉన్నావయ్యా , నీవు    స్వామీ _!   ఈ రెండు చెంప దెబ్బల కొర్చుకుంటు కూడా , _?"" నిజంగా  నీకు పెట్టాలి  కోటి దండాలు _!!""
_ సబ్ ఇన్స్పెక్టర్  గారూ _!  జరిగింది చాలు _! ఏ పరీక్షలు  వద్దు _!,చూద్దాం కొన్ని రోజుల తర్వాత ,__! _ముందు మమ్మల్ని ఈ కరోనా కుంభ కోణం షాక్ నుండీ పూర్తిగా  కొలుకో నివ్వండి సార్ _!"
""ఏమైనా మీ మేలు మరచి పోలేం.  _!   ఎంత జ్ఞాన బోధ    చేశారు_  సార్  మీరు_!   ఆహా _!""
""ఇంటి ముందు కాలు పెట్టాలి_!""
,,ప్రశాంతంగా బ్రతకాలి అంటే ,,_
ఇలా _"_ లోక జ్ఞానాన్ని  బోధించే వారిని_  ఎంతమందిని  ఆశ్రయించా లో కదా _?
హే భగవంతుడా ,, _!
నా దేశాన్ని ఈ దళారుల నుండి మాఫియా గ్యాంగ్ ,  ల నుండి రక్షించు , స్వామీ _!; లక్షలాది మంది ప్రజల ప్రాణాలు తీస్తున్న _ఈ దుష్ట  మహమ్మారి  కరోనా వ్యాధిని కూడా  __తమ స్వార్థానికి  వాడుకుంటూ_  _,, కరోనా బారిన పడి,  మరణించిన వారి శవాల గుట్టల పై ,  జిత్తులమారి నక్క ల వలె కాపు కాస్తూ,, ఆబగా  డబ్బులు ఏరుకుంటూ ఉన్న __ మనుషుల రూపంలో  కనిపించే ,,ఈ నికృష్ట దౌర్భాగ్య పాపపు  రాక్షసులను ,నీవు ఎలా  చూస్తూ __ భరిస్తూ ,ఉన్నావయ్యా,  నారాయణా,, స్వామీ _!
కరోనా కంటే  నీచాతి నీచులు వాళ్ళు _!
   హే   దేవా దిదేవా,_! దీన బాం ధవా_!
ఎందరో అభాగ్యులు అమాయకులు ,పేదవారు , నా కన్నా దీనులు , కన్నీళ్ళతో  , నిన్ను వేడుకుంటూ ఉన్నారు తండ్రి _! కరుణించు వారిని _!!"'
ఈ   కరోనా కాటుకు బలికాకుండ,,  సకల జనావళిి నీ  రక్షించు పరమాత్మా ,_!
  __""ఈ నర రూప రాక్షసుల  అకృత్యాల బారి నుండి ,, మాత్రమే కాకుండా  ఆగకుండా అన్ని దేశాల్లోనూ , కరోనా  సాగిస్తూ ఉంటున్న ఈ దారుణ  మారణ కాండను  నీవు  మాత్రమే ఆపగలవు ,, ప్రభూ
మమ్మల్ని మేము రక్షించు కొలేకుండ ఉన్నాము _!!
   అందుచేత ,, పరమేశ్వరా _! కరుణతో  ఈ పాడు కరోనా వ్యాధి నుండి ,ఈ  లోకాన్ని కాపాడు , పరమాత్మా  _!",
నీవే గతి _ మాకు _! వేరే దిక్కు లేదు  ఇక _!!
నీకే శరణు ,_! నీవే శరణు _!"
పాహిమాం  పరంధామా _!, రక్షమాం ,  పరమాత్మా _!! _!
      స్వస్తి _!
    హరే కృష్ణ హరే కృష్ణా _!"

కరోనా దుమారం

Sept 11, 2020
_!"హలో , ,హలో _!
ఎవరూ మాట్లాడేది ?
ఓహో నీవా _?, నరేష్_! బావున్నా వా ? మీరు, మీ భార్యా పిల్లలు  బావున్నారా _?
ఏమిటీ విషయం ,? నాకు ఎందుకు ఫోన్ చేశావు ?
ఏమిటీ ,? ,మన  దగ్గర బంధువు లక్ష్మన్ __ ఆయన !.  మొన్నటివరకు మనమంతా  కలిసి ఉన్నాం.  కదా _?
పాపం ,,ఆయనకు వచ్చిందా కరోనా ? నిజమా  ?  అయ్యో ,పెద్దాయన __!  కాస్తా కనిపెట్టాలి మనం వారిని _!
_! నాకు  ఇపుడు నీవు చెప్పే దాకా  ఆ విషయం తెలియదు సుమా _!
  మేము  అతడితో ఎక్కడికి వెళ్ళాం _?
మేము  వెళ్ళలేదు   _! నాకు ఈ ఉద్యోగం తో నే బిజీ _!
అసలు ,,ఒక ఆదివారం తప్ప తీరిక ఉండదు కదా_ ఎక్కడికైనా పోవడానికి _!""
ఇవి అసలే కరోనా రోజులు _!""
సరే ఇంతకూ అసలు విషయం చెప్ప నే లేదు నీవు _! ఎందుకు ఫోన్ చేస్తున్నావో _?
ఏమిటీ,? నాకు వచ్చిందా కరోనా ? అని ఎవరు చెప్పారు _?
నీ కు 
  _తెలిసిందా  ,ఎవరో అనుకుంటే _??
__మా బంధువు ఎవరికో   __ కరోనా సోకితే , వాడికి సంబంధించిన చుట్టాలు అయినందుకు మాకు  అందరికీ వచ్చినట్టే ,అనుకున్నావా _?
భలే చిత్రంగా ఉంది ,__నీవు ఈ మాట చెబుతూ ఉంటే _!
ఆ ఫంక్షన్ కు వెళ్ళిన వారికందరకు వచ్చింది ,అంటావా _?
__వస్తే రావచ్చు _!కానీ ,మేము వెళ్ళలేదు కదా _! అయినా వస్తుంది అంటావా _? _?
ఎందుకురా బాబూ నీకు, ??
, మా సంగతి మేము చూసు కోమా _?
_అయినా నాకు ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి  చెబుతూ ఉన్నావు ,_? ఎందుకింత ప్రేమ మా మీద పుట్టింది నీకు _??
_ నీవు చేసే ఫంక్షన్ కు రావద్దు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నావా ,_? మంచిదే _!
, నీ జాగ్రత్తలో నీవు ఉండడం  ,బావుంది _!;
కానీ నాకు కరోనా వ్యాధి వచ్చిందని  నీకు  చెప్పింది ఎవడు ?
__ఇపుడు ఇదంతా ఈ విషయం చాటింపు చేసి పది మందికీ  చెబుతున్నా వు  కదూ _!
__ఇందువల్ల   నీకు ఒరిగిం ది ఏమిటీ చెప్పు _?
ఓ సాడిస్టూ _!
ఇలా  ఫోన్ చే యడం వల్ల మేము బాధ పడుతామని  _ తెలియనంత  అమాయకుడ వు కాదు కదా నీవు ?
  ఇది మా ఆఫీస్ టైం _! ఈ  టైమ్ లో నీవు చేసిన ఫోన్ కాల్ విని __ మా స్టాఫ్ అందరూ నాకు కరోనా వ్యాధి సోకిందని __భయంతో నన్ను  బయటకు  తరిమి వేస్తారు అని నీకు  తెలియదా _?
నా భార్య కూడా నన్ను  ఇంటిలోకి   రానీయ దు __ అని నీకు  తెలియదా _?
__హాస్పిటల్ లో కూడా ఉండనీయ ని  దిక్కుమాలిన రోజు వచ్చిందని తెలియదా ?__
__ గతంలో  ఎవరైనా ,తమవారు  బాధపడ టం  తెలిస్తే  తనవారు వచ్చి  ఆదరించి,, కష్ట సుఖాలు తెలుసుకొని  వెళ్ళేవారు _!"
, ఇప్పుడు కాకికూడా, ఒక ఇంటినుండి మరో ఇంటి పైకి వాలని దుస్థితి దాపురించింది అని నీకు  తెలియ కుండా ఉందా  ,చెప్పు ,?""
నిజం తెలియకుండా , ,నీకు సంబంధం లేకున్నా ,ఇలా   తప్పుడు ప్రచారం చేస్తూ ,సమాజం నుండి   నన్ను ఇలా దూరం చేయడం,మనిషి బ్రతికి ఉండగా నే   మానసిక హింసకు గురి చేస్తూ నిలువునా   చంపేయడం  ,_ నీ లాంటి దగ్గరి  బంధువు_, మనిషి అయినవాడు  చేసే పనేనా చెప్పు  _!?
అసలు
నీ మెదడు   సరిగా పని చేస్తోందా ,లేదా _? అన్నది నా అనుమానం _!
వాస్తవం తెలుసుకోకుండా ,అనవసరం గా ఫోన్ చేసి ఇలా  బాధ పెట్టడం
తప్పు అని   తెలియడం  లేదా  నీకు _?
__ఫోన్ ఖర్చు  ఎలాగూ తగ్గిందని ,ఎదో ఒకటి ,ఎవరో ఒకరితో  ,నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉండడం , ఎదో ఒకటి వాగుతూ ఉండడం ,  కరోనా వ్యాధి లక్షణం లో ఒకటి గా   మారి పోయింది,,_ ఏ పనీ బాధ్యతా లేని  నీ లాంటి   వెదవ లకి _!
__""హలో _! నీవు చెప్పింది నేను  విన్నాను పూర్తిగా_!!"
ఇపుడు నేను చెప్పేది కూడా నీవు విను ఓపికగా  _!
నాకు కరొ నా వచ్చిందని, ఏ గాడిద అన్నాడో ,,నీవు పుట్టించావో నాకు   తెలియదు కానీ ,,
__ ఇపుడు ఉల్టా ప్రచారం గా ,, నీవు నాకు  చెప్పినట్టే ,నేను కూడా నీకు  అదే కరోనా వ్యాధి ఉందని  నీ వాళ్ళకి చెబితే నీ పరిస్తితి ఎలా  అవుతుం దో  కాస్తా  గమనించు _!
ఏదైనా తన దాకా వస్తె గానీ,,ఇలాంటి సీరియస్ విషయాలు  తెలిసి రావు కదా _!
__ హలో ,చేసిందంతా చేసి,   నాకు "సారీ " అని ఒక్కమాట చెబితే సరిపోదు _!  దేవుని ఫోటో ముందర నిలబడి ,గట్టిగా రెండు
చెంపలు వేసుకోవాలి _ ,నీవు ,,ఇకముందు ,ఇలాంటి పిచ్చి మాటలు ఎవరితో కూడా  మాట్లాడ కూడదు అని _!
__ బంధువు  అంటే అర్థం  ఆత్మీయుడు _!
పరిస్థితిని అర్థం చేసుకునే వాడు _!
కానీ నీలాంటి వాడు బంధువు కాదు ,రాబందువులు ,
బ్రతికి ఉండగా పీక్కు తినేవాడు _!
చీ చీ  రోత పుడుతోంది ,,నీతో మాట్లాడుతూ ఉంటే _!_;  బంధువు అన్నవాడు  ,సహాయం చేయాలి ,_! వచ్చిన ఆపద ను  తొలగించే ప్రయత్నం చేయాలి _!,  బాధ్యత తో  తగిన జాగ్రత్తలు చెప్పాలి __!
కానీ   ఏ మాత్రం సామాజిక స్పృహ లేకుండా,, మూర్ఖంగా ఇలా ప్రవర్తిస్తారా చెప్పు _??".
ఎవరితో కూడా  ఇలా  ఫోన్ చేసి ఆటలాడు తూ తమాషా చేయవద్దు, సుమా _!
జాగ్రత్త _!
నిజానికి
నీ మీద పోలీస్ కేస్  పెట్టాలి
కానీ  నీ  భార్యాపిల్లలను. దృష్టిలో ఉంచుకొని  నిన్ను ,క్షమించి వదిలేస్తూ ఉన్నాను _!
__ మళ్లీ నాకు నీ మొహం చూపించకు _!
ఇక ముందు  పొరబాటున కూడా
నాకు ఫోన్ చేయకు
తెలిసిందా _!
ఇక
పెట్టేయ్ ఫోన్   _!
బద్మాష్ _!
    భగవంతుడా ,,ఈ రోజున నన్ను ఈ కరోనా దుమారం లో చిక్కుకొనకుండా  బ్రతికించావు ,
పెద్ద  ప్రమాదం తొలగించి  ,
రక్షించావు కదా _!
స్వామీ,పుకార్లు వింటేనే ఇంత భయం అనిపిస్తూ ఉంది
ఇక నిజంగా జరిగితే?
అమ్మో _!
అది తలచుకుంటే నే వణకు పుడుతోంది _!
  ""హే  పరమాత్మా   _! ఇంకా ఎన్నాళ్ళు  మాకు ఈ అగ్ని పరీక్ష _?
ప్రభూ _!!
ఈ దుష్ట  కరోనా మహమ్మారి బారిన పడకుండా,,నన్నే కాదు, అన్ని దేశాల్లో ని ప్రజలను ,,  అందరినీ కాపాడు _ తండ్రీ _!
ప్రపంచంలో మానవాళిని పట్టి పీడిస్తూ __ చంపుతూ ఉన్న__ ఈ కరోనా వ్యాధిని_ భూమిపై నుండి ,, శాశ్వతంగా తొలగిం చు పరమేశ్వరా _!
పాహిమాం , రక్ష మాం _!
శరణు శరణు శరణు_!
   స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!""

నీవు లేక నేను లేను కృష్ణా_!

Sept 10, 2020
1_"_నీవు లేక నేను లేను కృష్ణా_!
   _నీవే నా ప్రాణము రా కృష్ణా_!
   _నా తనువూ, నామనసూ కృష్ణా_!
__నీకే అంకితమురా కృష్ణా__!

2_ ఎన్నాళ్ళని వేచి         ఉందు ?
   __ఎక్కడ నిను వెదకి
చూతు ?
__ఎలా నిన్ను మరచి
ఉందు ?
__ఏమి చేసి నిను పొందుదు ?
ఏమని నిను తలచు కొందు _?""

!! నీవు లేక నేను లేను కృష్ణా
నీవే నా ప్రాణము రా కృష్ణా!! _!

_3 _నిను కొలుచుట చేత కాదు_!
_పూజించుట చేత కాదు_!
__మనసు నిలుప చేత కాదు_!
__"కృష్ణ నామ గాన మొకటే
___చేయుట నా చేత నౌను కృష్ణా _!

!!నీవు లేక నేను లేను కృష్ణా_!
నీవే నా ప్రాణము రా కృష్ణా_!!!!

__3__నీ వంశీ నాద మూ_
___నీ మోహన రూపమూ_
__నీ మధుర నామ మూ_
__నిరతము నా మదిలో  మెదలు కృష్ణా _!
  _ఇదే నా భాగ్యము రా కృష్ణా _!""

  !!నీవు లేక నేను లేను కృష్ణా_!
నీవే నా ప్రాణము రా కృష్ణా !!""

Corona Katha

Sept 9, 2020
" హలో అన్నయ్యా __!"
"హలో తమ్ముడూ  , గిరీ బావున్నావా _?
బావున్నాను అన్నయ్యా _!
ఎలా ఉన్నారు  మరదలు లక్ష్మీ ,పిల్లలు   మధు ,సుధ లు _?
"  అంతా బావున్నా రు  అన్నయ్యా _!" మీరు వదిన  జ్ఞాపకం వస్తున్నారు _!
మేము అందరం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం రా తమ్ముడూ ,_! కానీ తమ్ముడూ _! నీవు ఏదో ,బాధ పడుతున్నట్టు  గా అనిపిస్తోంది ,రా గిరీ _!
అన్నయ్యా _!,,__ "
""అరే , ఏమైందిరా ,,? ఏడుస్తూ ఉన్నావా ,_? తమ్ముడూ _!,ఎందుకు _?
""ఏమీ కాలేదు అన్నయ్యా_!, అంత  కంగారు పడకండి ,మీరు _!""
""తమ్ముడూ ,నా ముందర దాపరికమా  నీకు ?
నాకు చెప్పు కొలెని  ఆపద  ఏమీ వచ్చింది రా _!
_ మమ్మల్ని రమ్మంటావా ,_?ఇప్పుడే  కారు తీసుకొని వస్తున్నాము _!""
""అదే ,వద్దు _! అన్నయ్యా,_! , మీరే కాదు , ఎవరూ కూడా రావద్దు అన్నయ్యా _!"
అం టే  తమ్ముడూ_! ,మీలో  కరోనా వచ్చిందా ఎవరికైనా ,?_
  ""_____-___ __!"
భయపడకు రా గిరీ,_! ఇప్పుడు _ఇది మామూలు విషయం అయిపోయింది _!, డాక్టర్ కు చెప్పావా , లేదా _?_నన్ను చెప్పమన్నావా _?
చెప్పాను  అన్నయ్యా  _!"
ఏమన్నాడు ఆయన _?
  ఇంట్లోనే వేరు వేరు గ,జాగ్రత్తగా  ఉండమని   చెప్పాడు _!
టాబ్లెట్స్  సూచనలు అన్నీ చెప్పాడు , డాక్టర్ _!"
మీరు వెళ్ళారా హాస్పిటల్ కి _?
వెళ్ళాము పరీక్షలు చేశాడు కూడా _!"
  ""ఒరేయ్  గిరీ, _!జరిగింది అంతా వివరంగా చెప్పరా ,_!నాకు  చాలా టెన్షన్ గా ఉంది _!"
""_అదే అన్నయ్యా ,_!అందుకే ఫోన్ చేస్తున్నాను ,మా బాధ మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాం చెప్పు _?"
"" ,అది సరేరా,తమ్ముడూ , నస పెట్టక  తొందరగా చెప్పరా బాబూ _!""
""అన్నయ్యా,_! మేము నలుగురం  ఎక్కడికి వెళ్ళినా కారులో
వెళ్ళి వస్తుంటాము కదా ,!
ఆ డ్రైవర్ , తనకు. కరోనా సోకిందని తెలియక  మన ఇంటికి , వస్తూ పోతూ ఉన్నాడు _! ఆ విషయం తర్వాత చెప్పాడు మాకు ఫోన్ చేసి _;_! వెంటనే ,  మేము భయపడుతూ ,, హాస్పిటల్ కు
,వెళ్ళి అందరం కరోనా పరీక్ష  లు చేసుకున్నాం  _!"" అన్నయ్యా _!
"" అలాగా _!  టెస్ట్ లు చేయించుకుని చాలా మంచి  తెలివి గల పని చేశారు , మీరు __! తర్వాత ఏమయింది రా గిరీ ?"
   "" లక్ష్మికి , సుధ కు ,, నాకూ నెగెటివ్ అని వచ్చింది అన్నయ్యా _!""
""  సంతోషం _!  మరి   మధు కు  _?
  ""మధుకు పాజిటివ్ ""అని చెప్పారు అన్నయ్యా ,_!"
అందుకే ,,ఏమీ తోచక ,,నీకు ఫోన్ చేస్తున్నాం  అన్నయ్యా _!""
  ""ఏమిటీ,నాలుగేళ్ల పిల్లాడికి కరోనా  వచ్చిందా _?" అయ్యో _!ఎలారా ,? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ?
ఎలా ఉంటున్నారు _? ఇద్దరు
చంటి పిల్లల తో ,_!??""
  మీ ఇంట్లోనే మీరే ""హోమ్ క్వారంటెన్ లో   ఉండాలి _!" అని డాక్టర్  మాతో అన్నాడు  అన్నయ్యా _!""
"" ఎలా రా _? అంతా కలిసి ఒక ఇంట్లో ఉండలేరు_! ,చిన్న పిల్లాడిని ఒకే ఇంటిలో  వేరుగా ఉంచలేరు , _!వాడు ఒక్క డిని ఉంచడం కష్టమే _! వాడితో  కలిసి  ఉండడం కూడా  కష్టమే , _! ఈ విషయాలు ఏమీ తెలియని ,అమాయకపు  చంటి పిల్లా డి ని   విడిచి ఉండలేక  పట్టుకొని ఉండలేక ,మీరు ఎంత బాధ పడుతున్నా రో కదా __! తమ్ముడూ __!ఎంత కష్టం వచ్చిందిరా   మీకు ? ,
ఈ దిక్కుమాలిన కరోనా రోగం , ఇంత చిన్న పిల్లలకే రావాలా _?""
" అన్నయ్యా ,నీవు  అలా బాధ పడకు _! మీరు దైర్యం గా ఉం టెనే కదా __ మాకు దైర్యం __! _ వదిన ఉందా అక్కడ _? కాస్త పిలువు అన్నయ్యా _!""
ఉన్నా నయ్యా _! ఇక్కడే _,అంతా వింటున్నాం_! ,  ఈ కరోనా అంత ప్రాణాంతకమేం కాదులే ,,_! అంత బెదిరి పోకు _!"  కాకపోతే __మీరు ఇద్దరూ,,కొన్ని రోజులు,,  కొంచెం జాగ్రత్తగా ఉండాలి _!, అంతే  _!టైమ్ కు మందులు వేయాలి ,_!పరిశుభ్రంగా ఉండాలి_!. , చేతులూ మొహం కడుగుతూ ఉండాలి ,_! కరోనా ఉన్నా లేకపోయినా, మీ  ఇంట్లో  మీరు ఉంటున్నా కూడా  మాస్క్ వేసుకోడం  మాత్రం మరచి పోకు సుమా _!"
""వదినా , _!చిన్న పిల్లాడిని ఎలా చూడాలో_ వీడికి ఎలా చెప్పాలో  మాకు అర్థం కావడం లేదు _! ,మెదడు పని చేయడం లేదు వదినా _!""
_"" మరేం ఫర్వాలే దయ్యా_! కాస్తా ,నేను చెప్పినట్టు చేయండి మీరు, _ నీ ప్రక్కన లక్ష్మీ ఉందా , _?"
ఉన్నా ను అక్కయ్యా ,_! _"ఇప్పుడే వచ్చాం హాస్పిటల్ నుండి ,,_! వస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాం ,_;!  మధు గాడిని చూస్తుంటే  దుఖం ఆగడం లేదు అక్కా _!"  __వీడికి కరోనా రావడం ఏమిటి_!? అదేదో ,నాకు వచ్చినా బావుండేది _!!""
__""ఆగాగు _! చిన్న పిల్లలా ఏడవద్దు అలా _!
ఎందుకు ఏ డవడం చెప్పు _?? _!? , ""లక్ష్మీ__! ఇప్పుడు ఏమైందని _?  ఒక పని చేయండి,మీరు _!""
__""చెప్పు అక్కా _! ఏం చేయాలో _?
"" లక్ష్మీ ,_!,నీవు  చంటిదాన్ని సుధను తీసుకొని  ,మీ ఇంట్లోనే క్రింద పోర్షన్ లోనే ఉండండి_! సరేనా _! ఇక _! మీ ఇంట్లోనే , లోనుండి  పై పోర్షన్ కి మెట్లు ఉన్నాయి కదా _! ,పైన మీ ఆయన  , మధు తో కలిసి ఉండాలి ,  ఖచ్చితంగా 14 రోజులూ _!
   _"ఆయనకు  కరోనా అంట దా , అక్కా ,_?
"" అంట దు లే _! తన జాగ్రత్త లో తాను ఉంటాడు _! అతడికి రోగ నిరోధక శక్తి కూడా  ఉంది,,_!
పిల్లలు వేరు _! తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కదా _! అయినా  కొడుకు కోసం మీరు వేరుగా ఉండక తప్పదు,_! ఈ 14 రోజులూ బాధ పడక తప్పదు లక్ష్మీ _!"
""వాడిని చూడకుండా అన్ని రోజులు నేను ఉండగలనా అక్కా _?
   ""చూడటానికి భయ మెందుకు లక్ష్మీ ?   వారు సగం  మెట్ల వరకూ వచ్చి కూర్చో వచ్చు కదా_! ,చక్కగా అన్నం , పండ్లూ నీళ్ళు అన్నీ తయారు చేసిర్ వారిని ముట్టకుండా అక్కడ పెట్టవచ్చు  కదా _!, దూరం నుండి చూస్తూ హాయిగా మాట్లాడు కోవచ్చు కదా _!"
_"" అవును అక్కయ్యా _!  ఈ ఆలోచన చాలా  బావుంది _!'"
""లక్ష్మీ,,_!ఒకే ఇంట్లో అందరూ ఉంటారు , ఎప్పుడూ కావాల్సి వస్తె,అప్పుడు,,దూరంగా ఉంటూ  చూసుకోవచ్చు,కబుర్లు చెప్పుకోవచ్చు కూడా _!
   "తమ్ముడూ _గిరీ_! వింటున్నావా __ వదిన చెప్పింది ,,_?? ఉండగలవా  మధుతో   నీవు  ?",,ఇప్పుడు నీవు తండ్రి వి మాత్రమే కాదు రా _! డాక్టర్ వి కూడా కావాలి  _! అంటే  జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ ఉండాలి సుమా _!,  నీవు సంతోషంగా ఉండాలి , _! కొడుకు మధుకు మందులు వేస్తూ , మాస్క్ వేస్తూ  వాడిని కూడా సంతోషంగా  సరదాగా ఉంచాలి ,_! ఫోన్, టాబ్   వాడికి     చూపిస్తూ,_ అమ్మను చెల్లిని మరపించాలి నీవు, ఈ నాలుగు రోజులు _!; మీరు వేసుకునే బట్టలు, తిండీ శుభ్రంగా ఉంచాలి రా , తమ్ముడూ ,_!
"సరే అన్నయ్యా _!
"భయ పడకండి , మీరు _; ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి అంటే దైర్యం,జాగ్రత్తలు  ముఖ్యం , అంతే _!"
""సరే అన్నయ్యా ,,వదినా_!" _!
  మీరు చెప్పినట్టే ,మేము అలాగే వేరు వేరు గా ఉంటాం _!
మాకు ఫోన్ చేస్తూ ఉండండి సుమా _!"
""అలాగే వదినా_! ,కొండంత అండగా  మీరు ఉండగా మాకు  ఏ కష్టం రాదు వచ్చినా భయం లేదు  _!
ఇక ఉంటాం అన్నయ్యా_!
    ఇటువంటి కష్టాలు వచ్చినపుడు ,జై శ్రీ రామ్ , అనుకో _
ఎందుకంటే ,  పది నెలల వరకు సీతా రాములు  వియోగంతో   ఘోరారణ్యం లో గడిపారు , అంత దుఃఖంలో ,కష్టాల్లో కూడా  ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా  దుర్భర పరిస్తితులను ఎదుర్కొన్నారు కదా _!
"ఆ సీతా రాముల  కష్టాలు"" ఎవరికీ రావద్దు_!" అంటూ  ఇన్నాళ్ళు  మనం  అనుకున్నాం _!
కానీ , తమ్ముడూ,,_!ఇపుడు భార్యా భర్తల ను , తండ్రీ బిడ్డలను  బంధువులను,ఇలా  ఘోరంగా , బ్రతికి ఉండగా నే ,దూరం చేస్తూ ,_ ,,ఒకరినొకరు చూసుకోకుండా , విడదీస్తున్న ,ఈ ""  పాడు కరోనా కష్టాలు "" మాత్రం శత్రువుకు కూడా రానీయకు భగవంతుడా_!""
అని   పరమాత్ముని ప్రార్టించు కునే  దరిద్రపు రోజులు  ,,ఇపుడు దాపురించాయి , ప్రపంచ మంతటా _!  ఈ కష్టాలు మనకు భగవంతుడు పెడుతున్న  పరీక్ష  అనుకోవాలి, తమ్ముడూ _!
వీటిని చాలెంజ్ చేస్తూ, మీరు నలుగురూ కలిసి, ఒక్కటై  కరోనా ను మీ ఇంటి నుండి  తరిమేయాలి _!అందుకు మొదట
మీ భార్యా భర్తలు ఇద్ద రూ,  గుండె నిబ్బరం చేసుకోవాలి ,_! దైర్యంగ ,అప్రమత్తంగా ఉండాలి ,,,_!  ఇకముందు ,, దుష్ట కరోనా  ,,మీ   దరిదాపులకు  రాకుండా  చూడాలి తమ్ముడూ ,_!
జై శ్రీ రామ్ _!"
   తమ్ముడూ _!ఇక నీవు  పైకి వెళ్లి పో,, కొడుకు ను తీసుకొని _!  ఈ 14 రోజులు . నీవు కిందకు రాకు _! వాడిని రానీయ కు _! వాడు ఎంత అల్లరి చేసినా ,,  అక్కడే ఉండాలి _!నాకు తెలుసు ,వాడికి నాన అంటే ఎంత ప్రేమ నో _! బుద్ది మంతుడు మధు _! చెప్పినట్టు వుంటాడు బంగారు కొండ __!   బుజ్జి తండ్రి _!
సుధ ను పైకి పోకుండా జాగ్రత్తగా చూస్తు ఉండాలి సుమా _!
""_ సరే అన్నయ్యా ! దారి చూపుతూ మాకు  దైర్యం ఇచ్చే _; నీవే ,,రామన్నయ్య వు,, నాకు _!
దయ గల   మనసుతో ,మమ్మల్ని ప్రేమతో సంరక్షించే  సీతమ్మ యే  మా వదిన మ్మ _!
మీకు మా దంపతుల నమస్కారం _! ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష ,_అన్నయ్యా ,_!!
జై జై  శ్రీ రామ్ ,_!"
ఉంటాను అన్నయ్యా, ""ఉంటాను  అక్కయ్యా _!"
"సరే లక్ష్మీ _!"
_జయం _ శుభం ,_!
    "  స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...