Saturday, September 12, 2020

మీరా కే ప్రభూ , గిరిధర్ నాగర్ __1

Aug 13, 2020
"'కృష్ణుడు నా వాడే _!
ఇక వేరెవ్వ రివాడు కాడు _! _! నా కృష్ణుడు _, నల్లవా డు ,, అల్లరి వాడు ,, గొల్లవాడు, కొంటె వాడూ,, వెన్న దొంగ తనం చేసే వాడు ,, గొల్ల వనితలను ఏడిపించే వాడు,,, ఆడపిల్లల చీరలు ఎత్తు కెళ్ళే వాడు,, మేన మామ ను చంపిన వాడు ,, జారుడు ,,చోరుడు __ అంటూ నా కృష్ణయ్యను  ఎన్ని  నీలాపనిందలు వేసినా   ఫర్వాలేదు ,_!
నా కృష్ణుడు  అందగాడు. ,తరగని  చెదరని. శాశ్వతమైన పరమ ఆనందాన్ని   ఇచ్చే ఆవి నీల మేఘ శ్యామ సుందరా కారుడు,శ్రీకృష్ణ భగవానుడు ,, తన మనోహర  దరహా సం ,, తో, మందహాసం తో _నిత్యం _నాకు  హృదయా నందాన్ని కలిగిస్తూ,,ఉంటాడు ,__!!"
   అలా ,ఎప్పుడూ నన్ను మరవకుం డా, వీడకుండా  నాకు తోడు నీడగా ఉంటూ,  ఉంటున్నాడు , నా  కృష్ణుడు _!__,
"",నేనే తానై ,తానే నేనై , మధురాతి మధురం గా రాగ రంజిత గానామృత  కృష్ణ భక్తి రస,  స్రవంతి లో నన్ను  ఓల లాడిస్తూ ,  తన సచ్చిదానంద స్వరూప గుణ నామ రూప వైభవం తో  __ నాకు అపరిమిత తన్మయత్వం  కలుగజేస్తు. __,  బ్రహ్మానందకరమైన   అనుభవాన్ని అందజేస్తూ ,నా అంతరంగం లో   కొలువై వుంటూ ,,నన్ను   నిరంతరం  తనతో  రమింప జేస్తూ ఉన్న __ఆ  ముగ్ద మనోహర దివ్య మంగళ స్వరూపుడు ,,నా  రాధా కృష్ణుడు , ఆ బృందావన దివి సంచారుడు,, వేణు గాన లోలుడు , నాట్య కళా విశార దుడూ ,, అయిన    నా కృష్ణుడు,,"" నా వాడై"" ఉండగా __ ఇక నాకు వేరే ఇతర   తుచ్ఛమైన  ఈ  ప్రాపంచిక సుఖాల పని ఏల _? 
అన్నది మీరా కృష్ణా భావ సంపద ,_!
   "హే ,కృష్ణా ,! శిఖ పింఛ మౌళీ,,! కస్తూరీ తిలక ధారీ,,,! యమునా విహారీ,! కౌస్తుభ మణి శోభిత శౌరీ ,,!,,పీతాంబర ధా రీ  ,,! రాధికా హృదయ విహారి, ,!
__ఎందెందు చూసినా అందందు  నయన మనోహరంగా  ,,ఆనంద నిలయ రూపంలో ,నాకు అగుపిం చే  , ఓ   మోహన రూపా,!గోపాలా ,,-! త్రిభువన పాలా,, !భక్త పరిపా లా.  _! గోపీ లోలా _
నంద నందనా,!!ముకుందా , !గోవిందా,!! __ నీవు సృష్టి సర్వమూ నిండి ఉండి,  కూడా ,,నా సర్వస్వము నీది గా  మార్చుకున్న.    ఓ యశోదా కిశో రా , _!
నను బ్రోవ రావే లా _?_!
నీకై పరితపించే ,నిన్ను  నా  ప్రాణం గా  ఆరాధించే , నీ దాసిని కావరా, వేలా ,_?? గోవిందా _!నిను వీడలేని ,నిను మరవలేని ,నీ తోడు లేక క్షణ కాలం కూడా , జీవించ లేని __నీ ఈ దీనురా లిని దయజూడు మా __ ప్రభో_!
_""నా కంటి దీప మా ,_!నా  జీవన ధ్యేయమా _!: నా జన్మ జన్మల  పుణ్య ఫల మా ,,_! పురుషోత్తమా _! శరణు_ శరణు_ శరణు __!"" అన్నది మీరా   ఆత్మ  సమర్పణ  భావం ,_!
ఆ విధంగా ,  త్రికరణ శుద్ధిగా ,, _శ్రీకృష్ణ భగవానునే __తన పతి గా గతి గా , మతి గా ,జతగా ,,ఊపిరిగా ప్రాణంగా ,,భావిం చి జీవితాన్ని , కృష్ణుని కోసం హారతి చేసి. వెలిగించి ,తన పవిత్ర ,ఆత్మను ,, తన స్వామికి నైవేద్యంగా సమర్పించి  ,,తరించిన ఆ   శ్రీకృష్ణ మనో హారిణీ.,,  కృష్ణ శక్తి చైతన్య స్వరూపిణి,,ఆ  మీరాబాయి వ లె ,, ఆమె  మధురంగా గానం చేసిన  "" కృష్ణ భ క్తిభజనలు , "" ఎవరు స్మరించిన __భజించినా  ధన్యులు అవుతారు కదా _!! ,    __అలాంటి భక్తులు ,కృష్ణుని  అరుణ చరణ కమలాల సేవించు కోవడానికి  తగిన " పాత్ర త"" పొందుతారు__ అనడంలో ఎలాంటి  అతిశయోక్తి  ఉండదు _!!

కృష్ణు ని  ఇష్టపడని , వాడు భువిలో ఉండడు _!
,__ నమ్మిన వారిని బ్రోచే దైవము ,,_! భక్తి తో సేవించిన వారికి ముక్తి ప్రసాదించే ఇల వేలుపు ,,_!అధర్మాన్ని  అణచి ,  ఆర్తులను ఆదరించే ,మన ఆత్మ బంధువు   మన  శ్రీ కృష్ణుడు __!""
ప్రేమ తో   వశం కానిది  సృష్టిలో ఏదీ లేదు _!
__"నీకు నీ భార్య _అంటే ఎందుకు ఇంత ఇష్టం__??"" అంటే  భర్త ఏమని చెప్పాలి ,__!
అలాగే భర్త గురించి భార్యను ,__ పిల్లలపై ప్రేమ గురించి కన్న వారిని ,__  ఎంతగా  ప్రేమిస్తూ ఉన్నావు ,??"
అని అడిగితే  _  ఇలా అని చెప్పగలమా _!??
, మనం  ఇష్ట పడుతూ  ఏర్పరచుకున్న ఈ__ బంధనాలు , బంధుత్వాల  గొప్పతనం అనుభవిస్తూ , మాత్రమే ఆనందించాలి ,,_! అంతే గానీ, ,, మాటల్లో వర్ణించ తరమా __??""
  వాటిని , మాటల్లో  చెప్పే పనేనా __??
వీలు కాదు కదా _!!""
__మామూలు మనుషుల్లో నే__  ఇంత గా ఇష్టపడే  ప్రేమతత్వం  ఉంటే __, ఇన్నింటినీ  ఒక్క చోట  అందరికీ ,అంతటా  సమానంగా  ఎవరూ ,కోరకుండానే సమస్తమూ మనకు ,,,,సమకూర్చిన  ఆ  దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు.  ఎంత కారుణ్య మూర్తి  యో కదా _?!
అందుకే కృష్ణయ్య అంటే   ,, కృష్ణ తత్వం అంటే తెలియని వారు కూడా , ,తమ ఆరాధ్య దైవం గా కొలవకుండ ఉండ లేరు  కదా _!!""
__  భక్త మీరాబాయి శ్రీకృష్ణుని ప్రియ  భక్తురాలు , ఎలా అయ్యిందో ,   తెలుసు కొందాం ,,_!
ఆమె రాజవంశం లో జన్మించింది ,,
  _,__పెళ్లికి ముందే ఆమెకు కృష్ణ ప్రేమ ప్రాప్తించింది ,_!
  బాల్యంలో  తండ్రితో వెళ్ళి , ఒకచోట __ ఒక పెళ్లి వేడుక చూసింది మీరా _!
""నాన్నా _! అక్కడ ఆ ఇద్దరూ ఎందుకు  దండలు వేసుకొని  ఉన్నారు __?"'
_  ""వాళ్ళు ఇద్దరూ పెళ్లి  చేసుకుంటూ న్నారు  ,మీరా__!"" _! __ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు    నాన్నా _??__
? ఐదేళ్ల పిల్ల అడిగిన _ అంత పెద్ద ప్రశ్న కు _ సూటిగా ఏం జవాబు చెప్పాలో తోచలేదు ఆమె తండ్రికి _!
  __,"" మీరా _!,శ్రీకృష్ణుడు భగవంతుడు , అని  నీకు తెలుసు  కదా __!
అతడికి రుక్మిణీ దేవి తో పెళ్లి జరిగింది__!
అలాగే మానవులు కూడా__ అలా పవిత్రంగా దైవ భావంతో  బ్రతుకుతూ ఉండాలి ,__ అని  ,కృష్ణుని వలె  పెళ్లి చేసుకుంటారు _!!
అందుకే వధువు రుక్మిణీ ,__ వరుడు శ్రీ కృష్ణుడు గా   భావిస్తూ ,_ ఇద్దరూ పెళ్లి చేసుకొని  జీవితంలో తాము కూడా  , అలా  శ్రీకృష్ణుని వలె ,,ఆనందంగా ఉండాలని   ఈ పెళ్లి చేసు కొంటూ ఉంటారు,మీరా __!""
అన్నాడు  తండ్రి _!
  "మరి నాన్నా _!నేను కూడా శ్రీకృష్ణుని పెళ్లి చేసు కోవచ్చా __??
   "" ఓ , సంతోషంగా  చేసుకోవచ్చు మీరా __!""
""_మరైతే నాకు  కూడా  _ఒక శ్రీకృష్ణుని బొమ్మ ఒకటి తెచ్చిపెట్టవూ నాన్నా __!"
   __""తప్పకుండా తల్లీ__! నేను అంగడి బజారు కెళ్ళి నపు డు __కృష్ణుని విగ్రహం తెచ్చి నీకు ఇస్తాను __ సరే కానీ,,, మీరా  _!"" కానీ నీవు ఏం చేస్తావు ,, ఆ బొమ్మ ను ,,_!
ముందు అది  నాకు చెప్పు __తల్లీ ,_!!
,""నాన్నా  _!  ఆ  కృష్ణుని తో ఆడుకుంటాను ,_! ఉదయమే నిద్ర లేపి,మేల్కొలుపు , పాడు కుంటాను,,_!, స్నానం చేయిస్తా,ను ,, దుస్తులు వేస్తాను ,,చక్కగా అందంగా అలంకారం చేస్తాను , పండ్లూ పాలు ,మిఠాయి తినిపిస్తాను , అతడికి ఇష్టమైన వెన్న మీగడ , మిశ్రి, జున్ను పాలు  రోజూ నివేదన చేస్తాను
__ఉయ్యాల లో పడుకో బెట్టి జోల పాటలు పాడుతా ను ,నా కృష్ణుని కోసం నృత్యం కూడా చేస్తాను ,__""
అంటూ  ఎంతో సంతోషంగా  చెబుతూ పోతూ  ఉన్న కూతురి ఉత్సాహం సంతోషం చూసి , ఆ
  తండ్రి ఎంతో సంబర పడ్డాడు _!
  ఒకరోజున ,,నిజంగానే కూతురికి శ్రీకృష్ణుని అందమైన  అద్భుతమైన బొమ్మ కోని ఇచ్చాడు అతడు _!
,__చిన్న పాప గా ఉన్న మీరా  తండ్రితో అన్నట్టుగానే . __ నిజంగానే ,,తన  కృష్ణునికి  తానే స్వయంగా సపరి చర్యలు చేస్తూ పోయింది ,కూడా _!
ఆ నాటినుండి ,మీరా  , కృష్ణునికి  చరణ దాసి యై పోయింది ,
ఆమె అంతరాళం లో  అందమైన  కృష్ణ రూపం ,  నిక్షిప్త మయ్యింది _!
  అది ఒక  విగ్రహంగా ఆ పాపకు ఆగుపించడం. లేదు _!
నిజంగా కృష్ణుడే  వచ్చి,, సజీవంగా ,, తనతో కలిసి ఉంటున్నట్టుగా  నిర్ణయం చేసుకుంది మీరా ,_!
అనునిత్యం __ కృష్ణునికి నివేదిం చిన తర్వాత అదే నైవేద్యాన్ని మీరా ఎంతో సంతోషం తో భుజిస్తూ వచ్చింది ,__!
_""కృష్ణా ర్పానం _!""అనకుండా , మీరా ఏదీ తినదు__ ఏమీ తాగ దు కూడా ,,
  మీరాబాయి కి అహర్నిశలు  అదే ధ్యాస_! __!
క్షణమైనా  ఆ కృష్ణ విగ్రహాన్ని విడిచి ఉండేది కాదు _!
అది చిన్నతనం అనుకుని ,,"" పోనీలే ,__ చిన్నతనం లో ఆడ పిల్లలు__ బొమ్మలతో  ఇలాగే ఆడుకుంటారు కదా__!!""
_!అని మీరా తలిదండ్రులు భావించారు ,__!!
,__తలిదండ్రులు ఆమె వైఖరి  మార్చాలని   చిన్నతనం లోనే,  మేవాడ్ రాణా తో  వివాహం  చేశారు__!"
  మేవా డ్  రాజు ను  భర్తగా పొందినా కూడా  ,, ఆమెకు కృష్ణ ప్రేమ తగ్గలేదు ,_!
ఆమె కృష్ణ చింతన. రవంత కూడా  మానలేదు ,_!
పైగా క్రమ క్రమంగా  __ ఆమెలో కృష్ణ ప్రేమ అమితంగా  పెరుగుతూ  వచ్చింది __!""
       ( ఇంకా ఉంది )
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...