Aug 14, 2020
ఒకరోజు _ మీరా తన భక్తి పారవశ్యం లో తనకు _ఎదురుగా కృష్ణుడు ఉన్నట్టుగా భావిస్తూ __ తాను అతడితో మాట్లా డుతూ ఉండడం _ ఇదంతా గది బయట నుండి ,, సేవకుల ద్వారా విని ,,ఆమె భర్త_ పరుగున వచ్చాడు మీరా వద్దకు __!
పట్టరాని క్రోధంతో , కత్తి తీసి ,,
__""ఎక్కడ ఆ పరాయి పురుషుడు __?""
నీవు ఏ మాత్రం , ఇది నీ అత్తవారి ఇల్లు,, __ అన్న భయం లేకుండా ,, ఎవరితో అలా మాట్లాడుతూ ఉన్నావు__??" చెప్పు _??
అని గద్దించి ,అడిగితే
అతడికి మీరా ,,జవాబు సౌమ్యంగా చెప్పింది __!
""భక్తి భావన లేని వారికి ,కోపం అసూయ శం క ఉన్నవారికి తన కృష్ణుడు కనపడ డు__! __!"అంటుంది__
నా కృష్ణుడు ""పరమ పురుషుడు ,!
,"" అతడు నాకు పరాయి పురుషుడు కాడు ,, ,_!!'
__ అతడిని పట్టుకోవాలి అని మీకు అనిపిస్తే ,,ఇలా బాహ్యంలో కాకుండా __మీ అంతరంగం లో శోధన చేస్తే. , వెతుక్కుంటే కృష్ణుడు , మీకైన,, ఎవరికైనా దొరుకుతాడు ,__!!""
కానీ , ఆ సాధనకు మీరు శరణాగతి చేయాలి _!: ఏ మాత్రం ,,అహంకారము పనికి రాదు సుమా __!""
అంటూ విన్న విస్తుంది ,తన కృష్ణ ప్రేమా నురా గాన్ని __!!"'
అదే ,రాజభవనం లో ,తన నివాస గృహంలో నే ,, ఒక గదిని కృష్ణ మందిరం గా మార్చి __ అచట శ్రీ,కృష్ణుని దివ్య మంగళ. శ్యామసుందరా కార విగ్రహాన్ని నిలిపి , కృష్ణ గీతాలు మధురంగా గానం చేస్తూ ,అదే ధ్యాస గా అదే శ్వాసగా ,అదే తన జీవిత పరమార్ధం గా ,భావిస్తూ ఉంది మీరా _!, రాణీ వాసంలో ,,రాజ మహల్ లో ,, దాస దాసీ జనం తో సేవలు అందుకుంటూ ,,మహా రాణిగా__ దర్జాగా __ హుందాగా బ్రతకాల్సిన మీరా బాయి,, కృష్ణ దాసిగా,,నిరాడంబరంగా నిశ్చలచిత్తం తో,, కృష్ణుని సదా సేవిస్తూ__ కృష్ణుడే తన పతిగా, గతి గా భావిస్తూ ,పరమ ఆనందంగా గడిపింది
మీరా ,,_!!
'__అలా తన భక్తితో__ శ్రావ్య మైన ,, గానాలాపన తో__ అనన్య భక్తితో_ నిశ్చల చిత్తం తో, సేవిస్తూ ,ఉంటే "" అది భర్త గృహం"" ,అన్న స్పృహనే లేకుండా పోయింది మీరా కు ,,__!"
_ తన పతి స్మరణ కన్నా , తన పతిత పావనుని, ధ్యానమే తన జీవిత ధ్యేయం అయ్యింది ఆమెకు __! ,నంద కిషోరుని మన్మథ సుందర రూపాన్ని, మనసులో స్థిరంగా నిలిపి ,కృష్ణుని స్మరణ యే మిన్నగా ప్రాణ సమానంగా భావిస్తూ ,, అతడి కోసమే ,జీవించింది మీరా,__!!
రోజు రోజుకు తన భార్యలో ముదురుతున్న ఈ కృష్ణ ప్రేమ పిచ్చిని చూస్తూ భరించలేక ,,పోయాడు రాణా _!
ఆమె భక్తిని శంకించి , ,,ఒకరోజున ,, ఆమె పడుకునే మంచం పై,__ పగిలిన గాజు ముక్కలు పరచి__అవి కనపడకుండా ,, దాని పైన తెల్లని బట్ట వేయిస్తాడు రాణా __!""
ఇది మీరా గమనిస్తుంది , అయినా ఖేద పడకుండా ,, తనని విడవకుండా,తన మదిలో ఉన్న "" తన కృష్ణునికి ఇది ఒక పూల పాన్పు కావాలి_!"_"" అని కోరగా __ఆ గాజు ముక్కలు _సుగంధ పరిమళ,,పుష్పాలు గా మారుతాయి_!
ఆమె కృష్ణ ప్రేమలో చూపుతున్న యోగ సాధన__ భక్తి భావన అతడిని. ఆశ్చర్య చకితు డిని చేస్తుంది __!
అయినా రాణా కు ఆమె పై ఉన్న అనుమానం పోలేదు __!!
అదేదో ఆమె నేర్చిన గారడీ విద్య అనుకుని ,, ఈ సారి తానే స్వయంగా మంచి నీటిలో ""విషం" కలిపి__
""ఇదిగో ,ఇది నీ కృష్ణుని తీర్థం ,_! ,,తీసుకో __!అంటూ ఇస్తాడు
__మీరా మహదానందం తో ఆ తీర్థం గ్రహించి ,అంతర్యామిగా ,,తన అంతరంగం లో కొలువై ఉన్న కృష్ణునికి __ ఆ విష యుక్త మైన _ ఆ తీర్థాన్ని నివేదన చేస్తుంది ,__!
తక్షణమే ఆ విషం , అమృత తుల్య మైన తులసీ తీర్థం గా మారుతుంది ,,_!
__ విషం , తులసీ తీర్థంగా మారడం ,అది త్రాగిన మీరా భక్తి తన్మయత్వం లో,__ తాదాత్మ్యం పొందుతూ__అద్భుతంగా ,అత్యంత మధురంగా , కృష్ణుని పై గీతం పాడుతూ ఉండడం చూసి ,,అప్పుడు యదార్థం గ్రహిస్తాడు. రాణా _!
మేవాడ్ ప్రజలకు కృష్ణుని పై మీరా కు గల భక్తిశ్రద్ధలు తెలిశాయి __!
ప్రతి రోజు మీరా వద్దకు అనేక మంది సాధువులు ,సంతువులు ,మహాత్ములు , భక్తులు రావడం చూసి. రాజ మహల్ సభ్యులు నివ్వెర పోయారు
మీరా ఈ రాజ మహలు లో అంతః పురం లో తన కృష్ణ సేవకు అడుగడుగునా అంత రాయం కలుగుతూ ఉండడం చూసి
తన గురువు గోస్వామి తులసీదాసు గారికి, లేఖ రాస్తుంది , __తనకు తరుణోపాయం చూపించమని ,,__!""
__గోస్వామి __మీరా కు గల అపరిమిత కృష్ణ ప్రేమకు ,,ఆనంద పరవశుడై ,తిరుగు జవాబు రాస్తాడు __!
""తల్లీ , _!నీ కు కలిగిన కృష్ణభక్తికి ,,అందులో నీవు పొందుతూ ఉన్న ఆనందానికి , _
నీకు నీ గురువు పట్ల గల గౌరవ భావనకు ,,నీ దైవం పట్ల నీకు గల విశ్వాసం ,,అంకిత భావానికి ,,,నాకు ఎంతో సంతోషంగా ఉంది_!
__నన్ను మార్గ దర్శనం వేయమని నీవు అడిగావు _!
నీకూ_ నాకూ _ సమస్త భక్తులకు_ తరుణోపాయం సూచిస్తూ ,తగిన దారి చూపించే వాడు ,,నీవు నమ్ముకున్న ఆ గోపాలకృష్ణయ్య నే ,అమ్మా__!!""
_ కుచేలుడు , విభీషణుడు ,ప్రహ్లాదుడు ,,నారదుడు ,,అంబరీషుడు లాంటి భక్త శిఖామణి పుంగవులు ,,తమ దైవారాధన మార్గంలో కలిగిన అడ్డంకులు __ వారు ,ఎలా అధిగమించారో నీకు తెలుసు కదా _!
, నీవు కూడా ,,వారి మార్గంలో నడవాల్సి ఉంటుంది ,,,
_"కృష్ణ భక్త మీరా బాయికి నేను గురువు ను _""!"అని చెప్పుకోవడం నాకు చాలా గర్వకారణం గా ఉంది , సుమా ,_!""
ఆర్తితో ఆవేదన తో , గమ్యం తోచని పరిస్తితిలో సద్గతి కోరుతూ,,దారి సూచించమని , అర్తించిన నీకు , నేను ఎలాంటి సహాయం చేయలేని దుర్బలుడను ,,_!"
అంత మాత్రాన ,,
__ నాలేఖను చూసి దిగులు పడకు ,_!!
నా పై కోపగించకు __! తల్లీ _! నీవు నమ్ముకున్న ఆ శ్రీకృష్ణ భగవానుడు నిన్ను సరైన దారిలో నడిపించాలని కోరుకుంటూ ఉన్నాను __!"
తనను నమ్మినవారిని కృష్ణుడు ,తన చేయి పట్టి_ సన్మార్గంలో , నడిపిస్తూ ఉంటాడు _!
_నా మాట పై విశ్వాసం ఉంచు__!"
_ శ్రీకృష్ణుని అపార కరుణా కటాక్షాలు నీపై సదా ఉంటాయి అని ఆశిస్తూ ఉన్నాను ,_!,
జై శ్రీ కృష్ణ _!!!"
అంటూ తులసీదాస్ గారు తన అమూల్యమైన సందేశాన్ని తిరిగి మీరా బాయి కి పంపించా డు
,,. (ఇంకా ఉంది )
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!!"
Sunday, September 13, 2020
మీరా కే ప్రభూ గిరిధర్ నాగర్ 2
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment