Aug 15, 2020
చిన్న తనంలో నే మీరా కు వివాహం కృష్ణుని తో జరిగింది
బొమ్మ ల కొలువులో సరదాగా పిల్లలు అందరూ తమ తమ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే మీరా తనకి ఎదురుగా కృష్ణుని విగ్రహం పెట్టుకొని , తలి దండ్రులను తమ ఇద్దరికీ పెళ్లి చేయమని కోరింది
కూతురు ముచ్చట పడుతూ ఉందని ,అదేదో బొమ్మల ఆటగా తలచి వారు చక్కగా అలంకరించి కృష్ణునికి ,మీరా కు దండలు మార్చి అక్షింతలు వేశారు
పిల్ల మీరా పెళ్లిని , వినోదంగా చూస్తున్న బంధువులు ,పిల్లలు చప్పట్లు కొడుతూ ఉండగా , కృష్ణుని తో జరిగిన పెండ్లి ని ,అందరూ,,తలిదండ్రులు కూడా మరచి పోయారు
,,కానీ మీరా మర వలేదు,,
సరి కదా,,, రాణా తో వివాహం అయ్యాక కూడా గుర్తు పెట్టుకొని,,భర్తను దగ్గరకు రానీయలేదు
ఇది వరకే , నాకు శ్రీకృష్ణుని తో పెండ్లి జరిగింది
,,నాకు భర్త శ్రీకృష్ణుడే _!
నీవు కాదు _!
దయచేసి,
నన్ను క్షమించండి _!
ఆనాడే
నా మనసూ తనువూ కృష్ణునికే అంకితం చేసుకున్నాను _!
కృష్ణుడే నా జీవితం ,
కృష్ణుడే నా దైవం
పతి గతి మతి నా ప్రాణం , నా ధ్యేయం , జీవిత లక్ష్యం. నా కృష్ణుడే _
నేను పుట్టింది ,బ్రతికేది. కృష్ణుని కోసం మాత్రమే _!
మీరు మరో వివాహం చేసుకోండి,
నాకు అభ్యంతరం లేదు
నన్ను శ్రీకృష్ణ భగవానును ని కి దాసిగా జీవించడానికి అనుమతి ని కోరుకుంటూ ఉన్నాను
నాకు ఈ రాజ ప్రాసా దాలు,,సుఖ వైభోగాలు అక్కరలేదు ,
కృష్ణుని విగ్రహం ఒక్కటి ఉంటే చాలు నాకు _!
,అదే నాకు ఆనందం ,, అతడి సన్నిధి యే నా పరమ ధామం ,,పరమార్ధం కూడా _!
నా వేదనను కృష్ణుని పై నాకున్న అనుబంధాన్ని అర్థం చేసుకోండి ,
అంటూ ,కన్నీళ్ళతో భర్తను వేడుకుంది మీరా _!
ఆమె భర్త రాణా ,కానీ అతడి కుటుంబ సభ్యులు కానీ,,మీరా మాటలు విశ్వసించ లేదు,_!
ఎన్నో రకాల బాధలు, కటువు మాటలు పడుతూ, ఎంతో మనో వ్యధ అనుభవించింది ,__!
ఆమె ఉన్నది అంతః పురం లో అయినా,, లంకలో సీతాదేవి వలె
తిండికి బట్టకు ఇబ్బంది పడింది మీరా__!
, ఆమెకు ప్రాణ సమానంగా పూజింప బడుతున్న కృష్ణ విగ్రహాన్ని కూడా ఆమెకు కనబడకుండా మాయం చేసి,, నగరానికి ఆవల పడవేశారు _!
,చిత్రంగా , మీరా ఆర్తితో ఆర్ద్రత తో చేసిన భక్తి గానం తో , కృష్ణ విగ్రహం ఆమె పూజా మందిరం లో ప్రత్యక్ష మైంది __!
,దీనితో వారికి మీరాను చూస్తేనే భయం పుట్టింది,__!
ఆమెను రాజ భవనం నుండి తరిమేయాలని నిశ్చయించారు _!
అలానే జరిగింది కూడా ,_!
కానీ మన మీరా కు మాత్రం ఆ సంఘటన పరమానాందాన్ని కలిగించింది ,
పోయిందనుకున్న కృష్ణ విగ్రహం తిరిగి తన వద్ద నే సాక్షాత్కారం కావడం ,,ఆమెకు పట్టరాని సంతోషాన్ని సంతృప్తిని కలిగించింది ,,_!
కృష్ణ విగ్రహం తన పూజా మందిరం కనపడకుండా పోయేసరికి ,, మీరా కు ప్రాణం పోయినట్టే అయ్యింది ,
కృష్ణుని కి తనపై కోపం వచ్చి తనను ఒంటరిగా విడిచి వెళ్ళి పోయాడు అన్న బాధతో మీరా కు విపరీతంగా దుఖం కలిగింది
ఒక దశలో ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడింది ,,
కృష్ణుడు లేని జీవితం,నరక ప్రాయంగా తోచింది ,భరించలేని శోకంతో ,కృష్ణుడు తిరిగి తనకు కనిపించే వరకూ నీరూ ఆహారం ముట్టనని నిశ్చయించింది ,
మీరా కు గల నిశ్చలమైన భక్తి ప్రపత్తులతో కృష్ణుడు నిజంగానే ప్రసన్నుడు అయ్యాడు _!
భక్తులకు భగవంతుడు ,ఇలాంటి పరీక్షలు మద్య మద్య లో పెడుతూ ,వారి భక్తి విశ్వాసాలను మరింతగా పదును పెడుతూ ఉంటాడు కదా ___!""
ఇప్పుడు,మీరా భక్తి భజనల మర్మం,, కృష్ణుడు ఉన్నాడు ,అన్న పరమ సత్యం , అందరకు తెలిసి వచ్చింది
కృష్ణుని పై ,తనకున్న భక్తి విశ్వాసాలు నిజమేనని,అభూత కల్పనలు కావు,,
అది పిచ్చి కాదు _!
పరమాత్మ పై ప్రేమానురాగాలు _!'
అని ప్రజలకు అర్థమైంది _!
ఇక మీరా బాయి కి మాత్రం,, తన భర్త ,తన నాథుడు జగన్నాథుడు తనని ప్రేమగా చూస్తు ,, అవాంతరాల నుండి , నిరంతరం తనని కాపాడుతూ ఉన్నాడు అన్న ప్రగాఢ మైన నమ్మకం,ఆమెకి ఏర్పడింది__!
__ కృష్ణుడు తన హృదయంలోనే కాకుండా ,,బాహ్యంలో కూడా ఉంటూ,తన భక్తురాలిని కనిపెడుతూ ఉంటున్నాడు అన్న విషయం ,మీరా కు అమితమైన ఉత్సాహాన్ని ,, చేస్తున్న భక్తిలో ప్రోత్సాహాన్ని,, కృష్ణుని పై గాడానురక్తిని పెంపొందించి,, ఆనందంతో , మీరా మనసు ను పరవశిం ప జేసింది,
మీరా భజన ప్రవాహం మరింత. ఉదృతంగా,,ఉజ్వలంగా కొనసాగింది ,__!
జన్మతః ,,మీరా ఒక కవయిత్రి ,_!సంగీత ప్రియురాలు ,_! ఆమె తండ్రి కూడా కవి,మరియు ,భక్తి పరుడు _!
అదే మీరా కు వారసత్వ సంపదగా లభించింది,_!
కృష్ణ భక్తి పరిపూర్ణంగా ప్రాప్తించింది _!
నేరుగా బృందావనం వెళ్ళడం ఆమె కు పరమానందాన్ని కలిగించింది ,
రాధా కృష్ణుల * ప్రేమ ధామం ,, ఆనంద నిలయం బృందావనం లో కృష్ణ దర్శనం తప్పకుండా లభిస్తుంది అన్న అభిలాష , , అపురూపమైన ఆమె కృష్ణ ప్రేమ,, ఆమెను ,ఆమె భక్త బృందాన్ని బృందావనం కు రప్పించింది ,,_!
మీరా స్వరం మాధుర్య భరితం , సహజమైన ఆమె కవిత్వంలో, సహజమైన భక్తి భావన వల్ల ,మీరా కృష్ణుని పై గల ప్రేమాతిశ యం తో పరవశించి, వీనుల విందుగా ,మీరా పాడుతున్న ప్రతీ కృష్ణ భక్తి గీతం ,, శ్రోతల ను ముగ్ధులను చేసింది ,,_!
వందలలో ఉన్న శిష్యులు వేలల్లో కి పెరిగారు ,
, బృందావనం లో,తిరుగుతూ ,మీరా__తన్మయత్వం లో,తనను తాను మరచి ,,కృష్ణుడే ఎదురుగా నిలచి వింటున్నట్టుగా తలచి ,,మధురంగా ,భావుకత తో గానం చేస్తూ ఉంటే , కొందరు వాటిని రాసుకోవడం ,,,వాటిని మరి కొందరు అనందంగా పాడుతూ ఉండడం తో ,,శ్రీకృష్ణ భక్తి శక్తి చైతన్య తరంగాలు ,బృందావనం లో నిండి పోతూ,అడుగడుగునా కృష్ణా నుభూతి,. అక్కడి ప్రజల్లో ,భక్త జనాలలో శ్రీకృష్ణ తత్వం,,అనుకంపన వెల్లివిరిసింది
ఎక్కడ కృష్ణ గీతాలు పాడుతూ మీరా బాయి ఉంటుందో ,అక్కడ భక్తులు తండోపతండాలు గా మంత్ర ముగ్ధులై వింటూ , తాదాత్మ్యం పొందేవారు ,,__
ఆమె యొక్క అపురూప ఆత్మ సమర్పణ తో చేస్తున్న భక్తి గాన మాధుర్యం ,కృష్ణుని పరవశింప జేసింది ,,అన్నట్లుగా ,,,__
మీరా ,కృష్ణుని వద్దకు పోయె బదులు ,__కృష్ణుడే సాధువు రూపంలో మీరా వద్దకు వచ్చాడు ,__!
అంటే __"" కృష్ణయ్య పట్ల _ఆమె భక్తి విశ్వాసాలు ఎంత ఉజ్వలంగా ఉన్నా యో _""మనం అర్థం చేసుకోవచ్చు__!
( ఇంకా ఉంది ,)
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా ,_!
Sunday, September 13, 2020
మీరా కే ప్రభూ గిరి ధర్ గోపాల్ 3
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment