Sunday, September 13, 2020

మీరా కే ప్రభూ 4

Aug 20, 2020
  మీరా వలె ,,తన  , సద్గురువు బోధనల  పై విశ్వాసం ఉంచి ,, తన   సంకల్పంలో  శ్రద్దా ఆసక్తిని నిలిపి , చిత్తశుద్ది తో ,  సాగించే వారి సాధనా ప్రక్రియ ,__ తప్పకుండా , ఫలిస్తుంది _!
వారి జీవితాశయం  ,నిశ్చయంగా  ఫలీ భూత మౌతుంది __!
  తన చిత్తము "",ద్రవీ భూతము ""కాగానే ,భక్తుడు  దైవానికి ఆధీనుడు అవుతాడు ,_!
అంటే తన ఆస్తిత్వాన్ని కోల్పోతాడు _!
తన సర్వస్వాన్ని సమర్పించు కుంటా డు _!
  _ ఇక ,,తన స్వామి చెప్పినట్టుగా  వింటూ చేస్తూ పోవడం తప్ప ,,తనకంటూ ఒక  వ్యక్తిగత అభిప్రాయం ఉండదు_!!
,తన సంకల్పం  ,తన నిర్ణయం ,ఆలోచన శక్తిని   అంతా దైవ ప్రేరణ గా ,దైవ శాసనం గా ఆదేశం గా తలదాలుస్తూ జీవిస్తారు _!
,,శ్రీకృష్ణుడు భక్త పరాధీనుడు _!
కనుక  తన  భక్తుని  యోగ క్షేమాలు చూసే బాధ్యత_ పరమ సంతోషంగా ,, తన దిగా  చూస్తాడు _!
   రామకృష్ణ పరమహంస గారి  అంకితభక్తి జీవనం  గురించి మనకు తెలుసు __!అతడు  కాళికా దేవి గొప్ప  ఉపాసకుడు , _!భక్తి తత్పరత తో  పరాకాష్ట పొందిన స్థితిలో,,ఆతడు  తన అంతరంగం లో , అమ్మవారి సన్నిధిలో   గడుపుతూ , తన్మయ అవస్థ  అనుభవిస్తూ ,బాహ్య స్మృతులను మరచి ,   దేవీ  వైభవ  దర్శనం పొందిన ,, పరమానందంలో ఓల లాడుతూ  ఆత్మానందం తో ,,, కొన్ని గంటల పాటు  సమాధి స్థితిలో ఉండేవాడు
__   జీవాత్మ పరమాత్మ తో అనుసంధానం కావడం అంటే  తమ జీవితాన్ని అలా,   సమాధి స్థితిలో గడపడం __!
_పాలలో నీరు కలిసి నట్టుగా , దేవుడి నుండి ,జీవుడిని   వేరు చేయలేని  అలౌకిక అపురూప  అద్భుతమైన  అద్వైత  స్థితి  అది _!
అనుభవైక వే ద్యము,, మధురాతి మధురమైన, అద్వైతా నంద స్థితి అది _!
  చిత్తము ద్రవీభూతం కావడం అంటే ,  మనసు బుద్ధి  కలిసి ,ఆత్మలో నెలకొన్న పరమాత్మ స్వరూప వైభవం లో లీనం కావడమే ,
ఈ స్థితిలో భక్తుడు ఒక రకమైన ఉన్మాద దశను అనుభవిస్తూ , దేహ ధ్యాస ను  , మరచిపోతా డు
  ఏడ్చుట , నవ్వు ట,, మాట తత్తర పడుట,,గద్గద స్వరంతో   ఆనంద భాష్పాలు రాలుస్టూ ,, నోట మాట రాక పోవుట ,,  ఇలాంటి లక్షణాలు  అపారమైన భక్తికి సూచనలు ,
భక్తుడు నిద్రిస్తూ ఉంటే ,అది అతడి సమాధి స్థితిగా అనుకోవాలి ,
అతడు  రామ నామం స్మరిస్తూ ,వేసే ప్రతీ ఒక్క అడుగు  కూడా ,రామాలయం చుట్టూ తిరుగుతూ అతడు చేస్తున్న ప్రదక్షిణ గా తెలియాలి
  కృష్ణ భక్తునికి గల కృష్ణ ప్రేమ , శ్రీకృష్ణ భగవానునికి సుగంధ పరిమళ భరితమైన సువాసనా ద్రవ్యాలు అవుతాయి
మీరా బాయి కృష్ణ భజన చేస్తూ ఉండగా ,ఎవరైనా కృష్ణ భక్తుడు ,,ఆమె వద్దకు వెళ్ళినపుడు ,అప్పుడు ,,అక్కడ ఆ భక్తునికి ఇద్దరి దర్శనం లభ్యమౌతుంది
  ఒకరు మీరా బాయి_!  భౌతికంగా కనిపిస్తూ ఉంటుంది,
మరొకరు  శ్రీకృష్ణ భగవానుడు _!
ఆమె రూపంలో శ్వాస లో భావంలో ,పాడుతున్న గీతంలో , ఆమె  అనుభవిస్తున్న బ్రహ్మానందం స్థితి లో , అణువణువునా  కృష్ణ పరమాత్మ యొక్క తేజోవంతమైన   ఉజ్వల ప్రకాశాన్ని  దర్శిస్తూ , ఉంటే ,భక్తుని ఒళ్ళు పులకాంకిత మౌతుంది ,
రోమాలు నిక్క పొడుస్తూ ఉంటాయి కూడా 
ఆ దశలో ఈ భక్తుడు కూడా  ప్రభావితుడై ,పరమాత్మ అనుభవం లో ప్రకాశాన్ని పొందుతాడు ,,
ఎదురుగా భగవద్ దర్శనం పొందుతూ ఉన్నట్టుగా , ఈ మనసూ తనువూ కృష్ణ పరమై , పరవశిస్తూ ,ఆనందం ప్రవాహంలో  మునిగి తేలుతూ ఉంటాడు,
మహాత్ములు , సాధువులు , నిష్కామ  భక్తితో  భజన చేస్తూంటే , అది లోక కళ్యాణానికి హేతువై పోతుంది
ఎందుకంటే  భగవంతుని కరుణా కటాక్షాలు అనబడే ధనాత్మక తరంగాలు , వాతావరణాన్ని  శుభ్ర పరుస్తాయి
మనసు తేలిక పడుతుంది
ఆత్మ లకు ఆనందం అనబడే అమృతా న్ని  ఆస్వాదించే మహా భాగ్యం లభిస్తూ ఉంటుంది ,
ఆత్మా  సమర్పణ భావంతో భక్తుడు , పరమాత్ముని ప్రేమ రసానుభూతి పొందేందుకు పాత్రుడు కావాలి ,,
అందుకు ఆచార్యుని కృప అత్యావశ్యకం. కదా ,,
  మీరా బాయి  తన భక్త బృందం తో  రాధాకృష్ణుల   ప్రేమ ధామ మైన ,  అపర గొలోకం లా భాసించే   బృందావనం చేరుకుంది _!
అక్కడ  సంతువులు సాధువులు చాలా మంది ఆశ్రమాల లో నివసిస్తూ , శ్రీ కృష్ణ నామ రూప గాన లీలా ధ్యానంతో కృష్ణ కృపకు పాత్రులు అవుతూ ఉన్నారు
  మీరా బాయి తన బృందంతో ఒక ఆశ్రమానికి వెళ్ళి , ,తలుపు తట్టింది
ఎవరూ వచ్చింది ?
లోనుండి
అనడం వినిపించింది ,_
మేమూ బహు దూరం నుండి వచ్చాము ,మీ దర్శనానికి లోనికి రావచ్చు నా , స్వామీ _?
  మీరు స్త్రీలే నా _?
అవును స్వామీ _!'
అయితే రావద్దు _! మా ఆశ్రమం లో స్త్రీలకు , స్త్రీ మాత లకు ,, ఎవరికి  ప్రవేశం  లేదు _! దయచేసి  వెళ్ళండి _!
అన్న స్వరం  మళ్లీ  మీరాకు  వినిపించింది ,,
  స్వామీ ,పురుషులలో స్త్రీల లో ఉండే దైవము ఒకడే కదా _!
అంది మీరా _!
అంతే ,_!
లోనుండి ఒక మహాత్ముడు ,, సాధు పురుషుడు బయటకు వచ్చి ,, మీరా బాయిని చూస్తూనే ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి ,
అమ్మా,_! నన్ను ,నా అజ్ఞానాన్ని ,అహంకారాన్ని మన్నించు _!
అంటూ పశ్చాత్తాప హృదయంతో క్షమాపణ వేడుకున్నాడు ,,_!
        (ఇంకా ఉంది)
     స్వస్తి _!
  హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...