Aug 29, 2020
ఇది అందరూ తరుచుగా అనుకునే తొందరమాట,_!
"సీతా మాత _ విచక్షణా రహితంగా మాట్లాడి తొందర పడింది _!
అనీ,
,లక్ష్మణుడు , ఓపిక పడితే బావుండును _
అనీ,
అంటారు ,_!
కానీ ,, అలా రాముడు వేసే ప్రతీ అడుగూ కష్టాల మార్గంలో పడుతూ ఉంటుంది._!
ఈ కష్టాలు _ రాముడు కోరి తెచ్చుకున్న వి కాదు,, _! కావాలని అనుకున్నవి అంతకంటే కాదు ,_!
అలా ఎవరూ కోరుకోరు కూడా ,_!
కానీ ,,మనిషి జీవితంలో వచ్చే కష్టాలు,, బాధలు,కన్నీళ్లను ఎదుర్కొనే అత్మ స్థైర్యం ,గుండె నిబ్బరం,తనలో ఉందనీ,తన ఆచరణ లో ,మాటల్లో , తలపుల లో చూపించాడు శ్రీ రాముడు ,_!
_"" ధర్మరాజు, యుద్ద సమయంలో, ఒక అబద్దం ఆడి నందుకు ,అంపశయ్య మీద ఉన్న భీష్ముని కి తెలుస్తుంది _!
ఆయన కోపానికి వచ్చి,
""నాకు గానీ ,శక్తి ఉంటే ఇప్పుడే ధర్మరాజును హతమా ర్చే వాడిని _!""
అంటాడు
ఇది విని శ్రీకృష్ణుడు అతడికి ఇచ్చిన జవాబు , మనలను కాస్తా ఆలోచింప చేస్తుంది
""ఓ మహితాత్మా. _!
ఎదుటి వాడు చేసే తప్పులు మనకు కనబడతాయి __
కానీ _
ఎవరి తప్పులు వారికి కనపడవు కదా _!
"" ఆనాడు , నీవు చేసిన భీష్మ ప్రతిజ్ఞ గొప్పదే ,_!
దాని ఆచరించిన తీరు కూడా గొప్పదే __!
కానీ _
ఇదంతా దేనికీ __?
కేవలం నీ తండ్రికి ఇచ్చిన మాట నిలపడం కోసం , అతడిని సంతోష పెట్టడం కోసం _!
అంటే వ్యక్తి గతం _!
దేశం కోసం కాదు,
ప్రజల బాగు కోసం కాదు_!!
కదా _!!
అది అప్పటి వరకే వహించింది ,_!
__దాని పరిణామం అప్పుడు మంచిది అనిపించింది _!
కానీ ఇపుడు చెడుగా సంక్రమించింది ,_!
కాలక్రమేణా ,
అదే ప్రతిజ్ఞ మీ ధర్మాచరణ కు కూడా అడ్డు పడింది,_!
కనకపు సింహాసనము మీద శునకాన్ని కూర్చోపెట్టి
నట్టుగా. గుడ్డి రాజును కూర్చోబెట్టి , నీ పరాక్రమం ప్రతిజ్ఞ కేవలం దుర్మార్గాన్ని ప్రోత్సహించ టానికఉపయోగ పడతాయని నీవు అప్పుడు ఊహించ లేదు _!
అయ్యో _! అనుకుని కుమిలి కుమిలి పోయారు బాధతో _!
భవిష్యత్తు లో ఇలా పరినమిస్తు ఉంటుందని తెలిస్తే. __ అంతటి ఘోర ప్రతిజ్ఞ చేసే వాడివి కాదు__!
పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం కురు వంశ నాశనానికి , కేవలం నీ ప్రతిజ్ఞ ఒక్కటే కారణం అయ్యింది _!!
రాజభవనం కూలి పోతుండగా చూస్తు కూడా , రాజ ద్వారాన్ని రక్షించే కాపలా దారుగా ,అదే ధర్మంగా భావిస్తూ , కళ్ళ ముందు జరుగుతున్న అక్రమం అధర్మం , ఎదురించే శక్తి ఉండి కూడా, మౌనంగా సహిస్తూ ,కళ్ళు మూసుకొని,, మానసిక వేదన అనుభవిస్తూ , నరక వేదన అనుభవిం చావు,,_!
కారణం __?
మీ రు చేసిన
భీష్మ ప్రతిజ్ఞ ,_!
,__ తన స్వార్థానికి ఉపయోగించే ఇలాంటి కటిన నిర్ణయాలు , సమాజ శ్రేయస్సుకు అవరోధంగా మారితే ,అపుడు నిర్ణయము మార్చుకోవాలి _!
అంటే చేసిన ప్రతిజ్ఞ ను విర మించు కోవాలి _;
కాని,మీరు
అలా చేయలేదు _ పితామహ__!""
," యుద్ధంలో ఆయుధం పట్టను నేను ,_!"' అని ప్రతిజ్ఞ చేశాను నేను _!!
కానీ __
""మిమ్మల్ని యుద్ధంలో ఎదిరించి నిలిచే వీరులు పృత్వీలో నే లేరు_;
అలాగే ద్రోణాచార్యుడు చేతిలో విల్లు ఉన్నంతవరకు అతడిని నిర్జించేవారు కూడా పాండవుల లో లే రు _! అని మీకు చక్కగా తెలుసు _!
అలాంటి మహా వీరులు,
మీరు __!
ధర్మం తెలిసి,ధర్మం కోసం పోరాడవలసిన మీరే __అధర్మానికి మద్దతు ఇస్తూ __ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే , _ చూస్తూ __భరించలేక
నేను నా ప్రతిజ్ఞ ను విరమించి ,_ యుద్ధంలో చక్రాయుధాన్ని చేత పట్టాను ,_!
,అధర్మాన్ని ఎదుర్కొనే సత్తా ధర్మానికి లేనప్పుడు__
అధర్మ మార్గంలో ,ప్రయత్నించి అధర్మాన్ని మట్టు పెట్టడం లో తప్పు లేదు కదా,,__; _!
ముల్లును ముల్లు తోనే తీయాలి కదా ,_!
యుధిష్ఠిరుడు ఆడిన ఒక అబద్దం ,తమకు జరిగిన అన్యాయానికి ,అధర్మానికి కారకులైన వారిని శిక్షించడానికి చక్కగా ఉపయోగపడింది ,_!
పరిస్తితి మారుతూ ఉంటే, పరిణామాలు కూడా మారుతూ ఉంటాయ_!ి,,
ప్రాజ్ఞులు ,విజ్ఞులు , చూడవలసిం ది __
,తమ కృషి, ప్రజ్ఞ ప్రతిభా పాటవాలు, సమాజ శ్రేయస్సుకు వినియోగించే సమయస్ఫూర్తి తో తాము ఇతరులకు దర్శకత్వం చేస్తున్నామా లేదా , అని _!!""
జీవితంలో గుర్తు ఉంచుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం, సమాజ శ్రేయస్సు _!
అయ్యో ,ఇలా చేయలేక పోయానే _?
అనుకోవడం విజ్ఞత అనిపించుకోదు కదా _!!
అంటూ. భీష్మా చార్యునికి శ్రీకృష్ణుడు ఆత్మ శాంతిని స్వాంతన కలిగిస్తాడు ,__!
తన వల్ల జరిగిన అyధర్మాలకు ,పరిహారంగా పితామహుడు ,అంపశయ్య పై పడుకొని ,,యుద్ధంలో హతమౌతూ ఉన్న తన వారసులను చూస్తూ , బాధపడుతూ ఉంటాడు _!
ఎవరికోసమైతే తన జీవితాన్ని ఫణంగా పెట్టాడో,వారంతా తన కళ్ళముందే చనిపోతూ ఉంటే,, శరీరంలో బాణాలు గుచ్చుకోవడం వలన కలిగే బాధ కన్నా ఎక్కువగా దుఖించాడు,భీష్ముడు _! దేహ బాధను భరిస్తూ
కళ్ళ ముందు హతమౌతు ఉన్న కురు వంశ నాశనా న్ని చూస్తూ ఉంటే,కలిగే మానసిక వేదన అనుభవిస్తూ, పశ్చాత్తాప తప్త హృదయం తో ,పరితపించి పోయాడు _! చివరికి, పాప పుణ్యాలు దగ్ధం కావడం వలన,, , అంత్య సమయంలో__ శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ దర్శనం వలన మోక్షాన్ని పొందుతా డు మహితా త్ముడు భీష్మ పితామహుడు __!
, "_అయ్యో ,ఇలా చేస్తే బావుండేది కదా__?"
""ఇలా అవుతుంది అని తెలిస్తే జాగ్రత్త పడే వాడిని కదా __!
ఆ విధంగా చేయక పోయె వాడిని కదా _!"'
అనుకుంటూ ఉంటాం _!
"కరోనా వల్ల బంగారం ధర ఇంతగా పెరుగుతుంది__!" అని తెలిస్తే , అప్పుడే పది ఇరవై తులాల బంగారం కొని పెట్టేసే వాడిని కదా _!
అని కొందరు విచారపడుతూ ఉంటారు ,_!
ఈ విధంగా విషయం చేయి దాటి పోయాక __"అయ్యో,_! అయ్యో,, _! నీ జాగా లో నేను ఉంటే అలా జరగ నివ్వ క పోయె వాడిని ,_!
నాకు చెబితే బావుండేది కదా _!!"
అంటారు,
అంటే __అర్థం_?
ఎదుటి వాడు చేసేవి తనకు తప్పులు గా అనిపిస్తూ ఉంటాయి ,కనుక _!
""తన తప్పు ను ",తప్పు " అని ఎవరూ ఎప్పుడూ, అనుకోరు కదా _!
చేసింది "తప్పు "అని తెలిసినా ఒప్పుకో రు_!
_ కనీసం పశ్చాత్తాప పడరు, కూడా ,_!
దేవుడి ముందు చెంపలు. వేసుకోరు కూడా _!!"
అందుకు : వారి అహం అడ్డు వస్తుంది __!
, __ఆ సమయంలో నేను ఉంటేనా__ ఆ సీతమ్మ ను అస్సలు పోనిచ్చే వాణ్ణి కాదు __!"" ప్రగల్బాలు పలుకుతూ __
అనుకుంటారు _!, అంటారు కూడా _!
__ వాస్తవానికి ,,అలాంటి నిస్సహాయ స్థితి అందరి జీవితాల్లో అనుభవానికి వస్తుంది,,_!
కానీ అలా జరగా ల్సి ఉంది అని అనుకోరు_కదా _!
మరో చిత్రమైన విషయం ఏమిటంటే __
సీతమ్మ , లక్ష్మణుడు లాంటి పాత్రల్లో తప్పులు దొరికిం చు కున్నట్టే,
తోటివారి తప్పులు కూడా వేలెత్తి చూపే వారు__ మనలో,, బోలెడు మంది ఉన్నారు._!_;
_ తప్పులను గుర్తించి నట్టుగా ,ఒప్పులను ,, విజయాలను మాత్రం , ఒప్పుకోరు _!
సరి కదా __! కనీసం , వారిని,
అభినందించి ప్రోత్సహించ డం కూడా చేయ రు ,,,,_!!
, ఇదే వారి అహం_!
ఇదే అవిద్య _!
ఇదే అజ్ఞానం _!
ఇదే half knowledge_! , కూడా _!
మనిషి మనసు ఎదగటం అంటే __ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం __!
తమ దుఖాన్ని ,కష్టాన్ని ,భగవద్ ప్రసాదంగా ఆనందంగా స్వీకరించడం__!
"_సంతోషం ఎలా వచ్చిందో __ తిరిగి పోయిందో __
అలా కష్టకాలం కూడా వచ్చి పోయేది అనుకోవడం_!
మానవత్వం అవుతుంది _!
దుఖం అనేది భగవంతుని పెట్టే పరీక్ష అనుకో వాలి _!,
నీటిమీద అలల వలె , కష్ట సుఖాలు కూడా అనుకోవడం ఉత్తమం_!
అన్నింటికీ మించి ,
ఈ నాటకం నడిపించే వాడు ఒకడున్నాడు__!,
అతడిని పట్టుకుంటే ఇక _",,అంతా సుఖమే _;
అంతా ఆనందమే _!
అందరూ మావారే_!"
అన్న భావ సంపద కలుగుతూ ఉంటుంది _!
అందుకే __
అన్ని కష్టాలు పడ్డ సీతమ్మ__ తన పరమాత్మను ,ఆ శ్రీరాముని మాత్రం ఎన్నడూ మరవలేదు_!
విడవలేదు కూడా _!"
అందువలన సీతామాత
కష్టాలు _పటా పంచలు అయ్యాయి_!;
నిరంతర రామ నామ స్మరణ చేస్తూ ఆత్మారాముని మదిలో నిలిపి,:లంకలో ఉన్నా ,,మానసికంగా ఆమె సదా
రాముని చెంత నే ఉంది__!
అలా , హరి నామ స్మరణ చేయువారికి కష్టాలు దూది పింజ లవలే తేలిక అవుతుంటాయి కదా ,!"
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా
No comments:
Post a Comment