Sunday, September 13, 2020

ఉపాధ్యాయ మహాశయా_!ఎంతటి అవకాశమయా!

Sept 5, 2020
మా ఉపాధ్యాయుల గురించి ముచ్చటగా మూడు మాటలు చెబుతాను _
మా ఉపాధ్యాయ వర్గం _
ఈ భూతలం లో వెలసిన దైవాంశ సంభూతమైన. స్వర్గం _!
అందులో అఖండం గా,అవిరామం గా  మా ఆత్మల్లో వెలిగే అమర దీపాలూ, విజ్ఞాన జ్యోతులు, చిరు దివ్వెలూ,మా ఈ చిన్నారులు ,మన విద్యార్థులు _!"

మన కను చూపుల్లో ఉంది_ వీరి ఉజ్వలమైన భవిష్యత్తు _!"
అర్పేసినా,వెలిగించినా ,బాధ్యత మనదే
_ భారం మనదే _!
బరువూ మనదే _!
చుట్టూ ముదిరిన చీకటిని తిట్టుకుంటూ కూర్చోడం కంటే _
చిరు దీపమైనా వెలిగించే ప్రయత్నం చెయ్యాలి మనం _!"
తిమిరం పారి పోతుంది _!"
మహాశయుల్లారా _!
ప్రస్తుతం మన దేశంలో అలుముకున్న  అశాంతిని , .  అవినీతిని , పారద్రోలడం మన కర్తవ్యం _!మేధావి వర్గమా _!
ఈ దేశం మీ చేతుల్లో ఉంది _!
మన భరతమాత బిడ్డలు  ,ఎదుగుతున్న కొడుకులు కూతుళ్ళు, మీ ముందు ఉన్నారు _!
  దేశ సేవకోసం  నడుం బిగించిన యువత మీ ముందు నిలబడి ఉంది _!
జనాన్ని జాగృతం చేయండి _!"
మీ ప్రజ్ఞా పాటవాలతో పునాదులను సుస్థిరం చేయండి _!
ధృఢ సంకల్పం,,త్యాగం , మీ హృదయాలలో నింపుకొని _ అందరకూ పంచండి _!
గ్రామాలలో చైతన్యాన్ని కలిగించండి _!
మాతృభూమి పిలుస్తోంది,,మిమ్మల్ని
.గురువర్యా _!లే_ లెమ్మని _!"
సంఘట్టన లో  మీ శక్తి  చూపించమని _!
పేదలను, దళితులను, బాధితులను ఉద్దరించు సంస్కర్తలను తయారు చేయమ నీ_!""
సర్వ మానవ సౌభ్రాతృ త్వావానికి   ఆత్మార్పణం  చేసే విప్లవ వీరులను ,, ధీరుల నూ వెన్ను తట్టి లేప మనీ _!
భారాన్ని గురించమ నీ_!
భాద్యతలను నెరవేర్చ మనీ _!!
మన భారతి ఆజ్ఞాపిస్తోంది _!"
దుర్మార్గులను. సన్మార్గులను చేసే __
హంతకులను సాధువులు గా  మార్చే _ ప్రజ్ఞ,నైపుణ్యం  మీరే ప్రదర్శించే సదవకాశం ,మీదే సుమా _!
మీ   విద్యార్థుల తలిదండ్రులు  గర్వించే __
సాటివారు సమాజంలో గౌరవించే _
వివేకానంద స్వామి లాంటి_
సంకల్ప సిద్ధులను తయారు చేసే ,__
ఇంద్రజాల , మహేంద్ర జాల మాంత్రికులు మీరే సుమా _!నిజానికి ,,గురువర్యులే నిజమైన జాతి నిర్మాతలు _సుమా _!
  మన దేశ  ప్రస్తుత పరిస్థితిని   మీరు _జాగ్రత్తగా  అవలోకించండి _!
నలుమూలలా పరిశీలించండి _!
నేటి బాలలే రేపటి పౌరులు కదా _!
వారి భవ్యమైన భవిత కోసం _
ఎలాంటి అలజడి ,అశాంతి లేనట్టి _
శాంతి యుత సమాజ  స్థాపనకు  మీరు అంకురార్పణ చేయండి _!
వేలమంది అల్లూరు లు ,,పదివేల మంది భగత్ సింగ్ లు ,
లక్షల మంది  జయ ప్రకాశ్ నారాయణ్ లు ,సుభాష్ , నౌరోజీ, తిలక్, లజపతి , పటేల్ , గాంధీ ,, సరోజని నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి, వంటి దేశ భక్తులను ,సంస్కర్తలు ,వీరులను  తయారు చేసి_ మీరు, మీ  ఈ సంకల్ప బలం తో__ మాతృభూమి ఋణం తీర్చుకోండి _!
దేశంలో చెలరేగే అల్లరుల ను   తమ దక్షత తో అణచివేసే సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి గుండె  కావాలి _!
మూడాచారాలను రూపు మాపే  మరో కందుకూరి,, వంటి సంఘ సంస్కర్తలు రావాలి  _!
మేధావులు ప్రస్తుతించే ఆచార్యులు శ్రీ  సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారు మరల  మన దేశంలో  తిరిగి   ఉద్భవించా లి _!
సీ వీ రామన్ లు,, రామానుజం లూ,, తిరిగి ఆవిర్భవించా లి _!"
మన దేశ గౌరవాన్ని ,ప్రాభవాన్ని ,వైభవాన్ని ఖండాంతరాలకు విస్తరింప జేసిన స్వామి వివేకానంద లాంటి,, హిందూజాతిని   జాగృతం చేసిన ,,అభినవ వైతాళికులు , యువ కిశోరులు ,,మీ  శిక్షణ లో , మీ పర్యవేక్షణ లో  తయారు కావాల్సిన అవసరం ఉంది _!
  దేశ భక్తిని గుండెల్లో  నింపుకున్న అహింసా మూర్తులు , తుపాకీ గుండు కు , గుండె నెత్తి చూపే  ధీరులు , త్యాగశీ లురు,కావాలి _!
నాడు ఉన్న సంఘటిత శక్తి _
నాటి ఏకత్వ భావాను రక్తి
ఆనాటి జాతి సమైక్యత _
దేశ భక్తి,అకుంఠిత దీక్ష_
లను _ విధిగా మీరు_
మనిషి మనిషికీ_ అందించాలి _!
జాతిని పునరు జ్జీవింప జేసే చరిత్ర కారులు మీరు మాత్రమే  సుమా __!
మన దేశం గౌరవం , మీ భుజ స్కందాలపై మోస్తూ,,
ఉపాధ్యాయ వృత్తిని పరమ పవిత్రంగా ,దైవంగా భావిస్తూ , అప్రమత్తత తో ,
దేశం యొక్క , పరువూ, ప్రతిష్టలు  నిలిపే బాధ్యతను నిర్వహించే  ఆచార్య వర్యులు మీరే మీరే _!
అలాంటి గురు బ్రహ్మకు శతకోటి ప్రణామాలు_!
సాష్టాంగ నమస్కార ములు _!"
  గురుభ్యో న్నమః _!
  సర్వే జనాః స్సుఖినోభవంతు_!
సమస్త సన్మంగలాని భవంతు _!
ఓమ్ శాంతి శాంతి శాంతిః_!
_&____
రచన _
రేవెళ్ళీ మనోహర్ రావు_
విశ్రాంతి ప్రధానో పాధ్యాయుడు,
కరీంనగర్ _
____&&____'
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...