Oct 7, 2020
భగవంతుడు దయాసాగరుడు , సకల ప్రాణి కోటిపై అతడి కున్న కరుణ అపారము అనంతము , అంతటా నిండి ఉండి , అన్నింటినీ తన సార్వభౌమ అధికారం తో నియంత్రిస్తూ చక్కగా పాలిస్తున్న ఆ పరాత్పరుని అనుగ్రహం ఈ సృష్టి ,
ఈ ప్రకృతి ఈ జీవుల మనుగడ ,
తరాలు యుగాలు , ఎన్ని మారినా , మార్పు లేని సూర్య చంద్ర నక్షత్ర గ్రహ సంచారము ,పంచ భూతాల కదలికలు , ప్రాణులను చైతన్య పరుస్తూ శక్తి నింపుతూ ఉన్న పంచేంద్రియాలు ,,ఇలా ఎన్నెన్నో అద్భుతాలు ,అలౌకిక అపురూప చిత్ర విచిత్ర సృష్టి రహస్యాలు , నీలాకాశం లో నిత్య నూతన ప్రకాశం తో మెరిసే వర్ణ చిత్రాలు సూర్యోదయ సూర్యాస్తమయ , , ఇంద్ర ధనుస్సు లు , ప్రకృతి శోభతో పులకరించి పరవశించే పచ్చని చేలు ,ఉరుకులు పరుగులతో ప్రవహించే గంగా కృష్ణా గోదావరి యమునా నదీ తరంగినులు , అబ్బో ఎన్ని అందాలు ,ఎంత ఆనందము ఏ మూల చూసినా ఏ కొండ కోన సెలయేర్లు , పచ్చిక బయళ్ళు , గులాబీ ,మల్లె ,చేమంతి కలువ పువ్వుల నవ్వులతో , రకరకాల చెట్లు పూల మొక్కలు , ఎత్తైన హిమగిరి , గుట్టల వరుసలో నివశించే పులి సింహ ఎనుగులాంటి ఎన్నో మృగాలు ,, కోకిల కుహూ కుహూ పాటలతో పచ్చని చిలుకమ్మ ల ముద్దు మాటలతో , ఆకుపచ్చని చీర ధరించి , తన బిడ్డలకు అందించి పోషిస్తూ వారి సంతోషంలో తాను పొంగి పోతూ ,బంగారు పంటలతో మన బ్రతుకులో సింగారాన్ని ఒలికిస్తూ ఉన్న ధరణీ మాత , చల్లని గాలుల వీవనతో , జీవన మాధుర్యాన్ని ఇనుమడింప జేస్తూ , ప్రకృతి అందాలను ఆరబోసి అందజేస్తూ ఉంటున్న
ఓ సర్వాంతర్యామి. నీవు ఎక్కడో , ఎలా ఉంటావో , కానీ. ప్రభూ. ఎందెందు చూసినా నీ మహిమాన్వితమైన. ప్రతిభ మహత్తు ,, కల్పనా శిల్ప చిత్ర కళ చాతుర్యం , అణువణువున అందాలు కలబోసి రంగరించి శృంగారం తో నీ సృష్టి స్థితి లయ నైపుణ్యాల తో అద్భుతంగా ,కమనీయంగా కడు రమణీయంగా ,నయన మనోహరంగా ఈ చరాచర జగత్తుకు అందిస్తూ ,ఉంటున్న దేవాది దేవా
నీకు శతకోటి సాష్టాంగ ప్రణామాలు పరందా మా ,పరమేశ్వరా ఏమని వర్ణించను స్వామీ నీ నిత్య నూతన శిల్ప కళా చాతుర్యం
, హే నారాయణా ,,
నాలో పెల్లుబికి పోతున్న నీ గురించిన అనంత అద్భుత అపురూప సృష్టి వైభవాలని నాకు వచ్చిన పదాలలో చెప్పాలని చేస్తున్న ఈ సాహసాన్ని మన్నించు ,తండ్రి ,
హే జగన్నాథ _!
నేను ఒక పేద రైతును నగరాలకు బహు దూరంగా కుగ్రామం నివశిస్తూ ఉంటాను ,
ఒకరోజున నా కుటుంబంతో పొలాల్లో పని చూసుకుంటూ ఉండగా , దూరంగా రోడ్డుపై వేగంగా దుమ్ము రేపుతూ వెళ్తున్న ఒక కారు ఒక్కసారిగా ఆగిపోవడం చూశాను
, కాసేపటికి అందులో నుండి ఇద్దరు దిగుతూ కనిపించారు ,
వారు కారు చుట్టూ తిరుగుతూ ,ఫోన్ లో మాట్లాడుతూ , అయోమయం గా కనిపించారు
అసలే మధ్యాహ్నం , మండే ఎండ ,, మట్టి రోడ్డు , దరిదాపుల్లో తల దాచు కునేందుకు చిన్న చెట్టైన లేదు ,
అలా రోడ్డుపై దిక్కు లేకుండా నిలబడి ఉన్న వారిని చూస్తుంటే చూడలేక నా చేతిలో పని భార్యకు అప్పగించి , రోడ్డు వైపు వెళ్ళాను
నాతో బాటు ,నీరు ఒక గొడుగు ,చిన్న స్టూల్ చపాతీలు పట్టుకెళ్ళాను
తీరా దగ్గరికి వెళ్లి చూసేసరికి అందులో ఒకరు గొప్ప ఆఫీసర్ వలె ,కనిపించాడు
మరొకరు కారు డ్రైవర్ ,
పాపం ,,నేను పట్టు కెళ్ళి ఇచ్చిన స్టూలు పై ఆ పెద్దాయన కూర్చున్నాడు , చక్కని నీరు తాగి ఇద్దరూ ఎంతో సంతోషించారు
కారు ఇంజన్ లో ఏదో సమస్య రావడం , అనుకోకుండా ఇక్కడే ఆగిపోవడం , తో వారు ఎటూ పోలేక , ఏమీ చేయాలో తోచని స్థితిలో ఉండగా నీవు దేవుని వలె వచ్చి ఆదరించి ,నీడను కమ్మగా చపాతీ ఆహారం అందించి మాకు ప్రాణం నిలబెట్టా వు కదా
అన్నారు
ఫర్వాలేదు మా ఇంటికి బంధువులు , మీ లాంటి పెద్దవారు వస్తె , గౌరవంతో మర్యాద చేయడం మనిషిగా ధర్మం కర్తవ్యం కదా మానవత్వం ,
అన్నాను
ఆ ఆఫీసర్ చేసిన ఫోన్ కాల్ తో దగ్గరే ఉన్న సిటీ నుండి మరో కారు రావడానికి రెండుగంటలు పట్టింది
అంతవరకు వారికి దగ్గరలో ఉండి ,మాట్లాడుతూ , మర్యాద చేశాను
మరో కారు వచ్చింది , ఈ కారు బాగు చేసి అందరూ వెళ్ళి పోయారు
ఆ పెద్దాయన మాత్రం నన్ను దగ్గరికి తీసుకొని , నేను నా జీవితంలో మరచి పోలేని సహాయం చేశావు , నీకు ఏదైనా చెయ్యాలి ఇవ్వాలి అని ఉంది
అన్నాడు
అయ్యా భగవంతుని దయ వలన నాకు ఏ కొరతా లేదు
అదిగో ఇక్కడికి 80 మైళ్ళ దూరంలో ఉన్న సిటీ నీవు చూశావా
లేదు మా ఊరు విడిచి ఎన్నడూ బయటకు వెళ్ళ లేదు
నీకు ప్రయాణం ఖర్చులు నా అడ్రస్,,నా విజిటింగ్ కార్డ్ తీసుకో ఇదిగో వీలు చూసుకొని రా ఈ కార్డ్ ను చూపిస్తే ఎవరైనా సరే నా దగ్గరికి నిన్ను తీసుకొస్తారు ఇక వెళ్తాను చాలా థాంక్స్
అంటూ నమస్కారం చేస్తూ వెళ్ళి పోయారు
మరి కొన్ని రోజులకు వ్యవసాయం పని లేని పది రోజుల్లో ఆ పెద్దాయన రమ్మన్నాడు గదా పైగా డబ్బులు కూడా ఇచ్చాడు చూద్దాం అనుకుని వెళ్ళాను అతడు ఉన్న నగరానికి
బస్సు దిగాక కార్డ్ చూపిస్తే , సులభంగా దొరికింది అతడి అడ్రస్ ,.
అది ఇల్లు కాదు ఒక పెద్ద ఫైవ్ స్టార్ రెస్టారెంట్ , ఆ మహా నగరంలో పేరు మోసిన గొప్ప ఖరీదైన హోటల్
దాని ముందు కనపడిన నన్ను ,నా ధోవతి తలకు కట్టిన రుమాలు ,భుజంపై కండువా , పొలం మట్టితో మాసిపోయిన నా శరీరం బక్కచిక్కిన దేహం ,ఇవన్నీ చూస్తూ అక్కడి సెక్యూరిటీ గార్డు లోనికి పోనీయ లేదు
ఏం అనాలో ఏం చేయాలో తోచని స్థితిలో మా ఊరుకు తిరిగి వెళదామని వెనుదిరిగి పోయేసరికి , ఆ సెక్యూరిటీ గార్డు ఏమనుకున్నాడో కానీ , ఏమయ్యా ,ఇటు రా _!
అని పిలిచాడు
వెళ్ళాను
నిజంగా ఈ కార్డ్ నీకు ఆయన ఇచ్చాడా ,? ఎక్కడైనా దొరికిందా _?
జరిగిన విషయం వివరించి చెప్పాను
నా మాటల్లో గురి కుదిరింది వారికి ,
లోనికి పంపించారు నన్ను
ఈ మాసిన బట్టల పల్లెటూరు మనిషీ ఇక్కడ
మన ఫైవ్ స్టార్ రెస్టారెంట్ పెద్దాయన ఎక్కడ ?
అంత పెద్దాయన ,కు ఎక్కడో చిన్న రైతుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చే సమయం ఉంటుందా _? ఏమో ,మనమెందుకు కాదనా లి ,,, వెళ్ళ నీ
అని అక్కడి వాచ్ మెన్ లు అను కుంటు ఉన్న మాటలు నాకు వెనక నుండి నాకు వినబడుతూనే ఉన్నాయి
( ఇంకా ఉంది ),
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Monday, December 28, 2020
సర్వాంతర్యామి అద్భుత అనంతమైన ఔదార్యం
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment