Monday, December 28, 2020

సర్వాంతర్యామి అనంతమైన అద్భుత ఔదార్యం2

Oct 8, 2020
  "భగవంతుడా_! ,నీవు మా ప్రాణికోటికి  దయతో  ఎడతెగకుండా వర్ధిస్తూ అనుగ్రహిస్తూ వస్తున్న నీ కృపా కటాక్షాలు  వర్ణించటానికి  మేము చాలా అల్పులం_! అఙ్ఞానులం_! కడు  ,పాపాత్ముల మైన మాకు  నీ ఔదార్యాన్ని ఎన్న బూనడం  సాధ్యమా  ప్రభూ _?
మా అవివేకాన్ని నిత్యం ప్రదర్శిస్తూ ఉన్న మా  మిథ్యా బ్రతుకు ల తీరు  ఇలా ఉంటుంది   తండ్రీ_!!"
___ఒకసారి ఒకరోజు_ ఒక నగరంలో_ నీ ఒక అందమైన పెద్ద బంగళాలోకి నేను ,ఒక పల్లెటూరి రైతుని , ఆ యజమాని పిలుపు మేరకు, వెళ్ళడం తటస్థించింది _
అప్పుడు ___
నేను లోనికి వెళ్తూనే _నాకు ఒక  అందమైన డబుల్ బెడ్ రూం_ ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు , అది ఒక ఇంద్ర భవనం వ లె  విద్యుత్ కాంతులతో ధగ ధగా మెరిసిపోతూ ఉంది ,,__!
కనని విననీ వింతగా , అనిపించి ఇదీ కలా నిజమా!"
అనుకున్నాను _!
_ రూమ్ లో_ మెత్తని , సోఫా లో కూర్చుని ఉంటే_ అందులో స్ప్రింగ్స్ ఉన్నాయేమో __నన్ను  బంతివలే ఎగరేస్తూ __అటూ ఇటూగా ఊపుతూ ఉంటే__ అది ఒక సర్కస్ వలె భలే ఆశ్చర్యం గా_ గమ్మత్తుగా  తోచింది
నన్ను నా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని.  అక్కడ పనిచేస్తున్న వారు  దూరంగా చూస్తూ __ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉండడం కూడా  నేను  గమనించాను _!
  జీవితంలో  ఎన్నడూ కనని వినని విధంగా రక రకాల  కమ్మని రుచులతో భోజనం  చేశాను
ఆ రాత్రి నేను పడుకున్న బెడ్ , ఏ సీ రూమ్ ,, బాత్ రూమ్,పెద్ద హాల్ అమ్మో ఇది మాయా మహల్ కాదు కదా _? అనిపించింది
__ మామూలు మనిషిని నేను _! నాకే ఇలాంటి అందమైన విశాల భవనం ఉంటే__ అబ్బో _? దీని యజమానికి ఇంకెంత అద్భుతమైన భవనం ఉంటుందో కదా_!"" అనుకున్నాను _
మరుసటి రోజున నాకు ప్యాంటు _షర్టు  కొలతలు తీసుకొని ,కొత్తవి అప్పటికప్పు డు తెప్పించి నాకు  ధరింప జేశారు ,
నా ధోవతి కండువా పంచే బనీను జాగ్రత్తగా ఒక కవర్ లో చుట్టి ఒక మూల  ఉంచేశాను ,_!
నిజమే నేను మారు బట్ట లేకుండా వచ్చాను మరి _!
ఏం చేయను ?
వారు చెప్పినట్టు చేస్తూ పోయాను ,
కొత్తదనం చూడాలి అన్న ఉత్సుకత  వలన _!
ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం రాత్రి పసందైన విందు భోజనాలు సరిగ్గా టైమ్ కు  ఏర్పాటు చేస్తున్నారు _!
కప్పుకొడానికి ఇచ్చిన అందమైన  డిజైన్ గల మెత్తని   కాశ్మీర్ శాలువా   తో ,కమ్మని సెంటు వాసన లతో   ,కడుపునిండా తిండి , కంటి నిండా  నిద్రా  తో నా ఇల్లూ వాకిలి నా కుటుంబం మరచి పోతున్నాను  _!
మూడో రోజున నన్ను ఖరీదైన కారులో  నగరం మొత్తం తింపుతు   _మద్య మద్యలో భోజనం చేయిస్తూ ,,అక్కడి విశేషాలు చెబుతూ _ , సిటీ అంటే ఎలా ఉంటుందో తెలియు జేశారు ,
బహుశా స్వర్గం కూడా ఇలా ఉంటుందేమో అనుకున్నాను _!
రాత్రి నిద్ర పోతుంటే అనిపించింది , నాకు _!అలనాడు కుచేలుడు   కూడా ,ఇలాగే ,తన బాల్య  స్నేహితుడు ,శ్రీకృష్ణుని వద్దకు  వస్తె __ తానే స్వయంగా ఇలానే  ఆదరణ_ ప్రేమ చూపుతూ అనుగ్రహించాడు  కదా _!!
__నాల్గవ రోజున స్నానం భోజనం అయ్యాక 
వారితో అన్నాను _!
_ అయ్యా _! అనాడు ,నేను చేసిన ఒక చిన్న ఉపకారానికి _  మరచిపోకుండా కృతజ్ఞతతో  నాకు  గౌరవాన్ని  అందించిన మీకు మీ  యజమానిని  ధన్యవాదాలు _!""
__ఇక నేను  నా గ్రామం  వెళ్తాను_!
  నన్ను ఇంత గొప్పగా  అన్ని వసతులు ,ఆహారం.  ఇల్లూ సౌకర్యాలు   ఉచితంగా ఉదారంగా  నాకు అమర్చి నన్ను అమితంగా   ఆనందింప జేసిన ,  ,మీ యజమానిని చూడాలి ,_!
దయచేసి నాకు ఆ అవకాశాన్ని  ఏర్పాటు చేస్తారా _?
అని వారికి నమస్కారం చేస్తూ అడిగాను
వారు ప్రతి నమస్కారం చేస్తూ
    ""ఇక్కడికి ఎవరూ ఎప్పుడూ ఎందరు వచ్చినా ప్రతి వారికి __ఈ అతిథి మర్యాదలు అందుతూ ఉంటాయి _!
ఇకపోతే మా యజమాని__ ఇలాంటి ఫైవ్ స్టార్ రెస్టారెంట్ హోటల్ లాంటివి  దేశంలో ఎన్నో ఉన్నాయి _!
అవన్నీ స్వయంగా  తానే పర్యవేక్షిస్తూ  నిర్వహిస్తూ ఉంటాడు _
,మిమ్మల్ని కలవడానికి తనకు సమయం పడుతుంది  మరి _!
మీరు , వేచి చూసినా కూడా  చెప్పలేము ,,ఆయనకు వీలు అవుతుందో లేదో,?!"",
ఎంత బిజీ గా ఉంటాడో ఆయన ,చెప్పలేము ,మేము  సార్_!
__అయినా  మా కర్తవ్యంగా మీరు  ఇక్కడకు వచ్చి ఉంటూ న్నట్టుగా  మా యజమానికి తెలియ జేశాము,
మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండడానికి అన్నీ వసతులు , ఏర్పాట్లు చేయమని మాకు ఆదేశం ఇచ్చారు ,
మీరు మీ ఇంటికి తిరిగి వెళ్ళి పోయె సమయంలో మీకు ఇవ్వమని ఈ ఉత్తరం , కవర్ లో పెట్టి ,మీకు అందజేయమని ఆయన  అన్నారు ,
అంటూ ఒక పెద్ద కవర్ తీసి చూపి తిరిగి ఒక సంచీలో పెట్టీ నాకు  ఇచ్చేశారు వాళ్ళు
""అయ్యా _! మరో ముఖ్యమైన విషయం మీకు _!! ఏమిటంటే, ఈ ఉత్తరాన్ని మీరు మీ ఇంటికి వెళ్ళాక మాత్రమే  _ దాన్ని తీసి చదువు కోవాలని  చెప్పమని  మా యజమాని  మాతో
అన్నారు
అందుచేత ,మీరు దయచేసి  ఎక్కడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆయనగారు చెప్పినట్టు చేయండి _!""
అంటూ నమస్కారం చేస్తూ అందులో ఒకాయన వినమ్ర భావంతో    అన్నాడు ,
కంటికి కనపడని ఆ పెద్దాయన  వైఖరి _
అంతా విచిత్రం గా అనిపించింది నాకు __!
ఇక చేసేది ఏమీ లేకుండా  ""నన్ను మా ఊరుకు వెళ్ళే బస్ స్టాప్ వద్ద దిగబెడుతారా _?!""
అని అడిగాను
""అలాగే  నండి _ , ఇది మా అదృష్టం _!!
_ అంటూ కారు తేవడానికి వెళ్ళాడు   డ్రైవర్
నేను ఆ భవనం అందాలను కొంతసేపు ,, , చూస్తూ_ బయటకు వస్తూ ఉంటే ,హఠాత్తుగా నా ఆలోచన లో మార్పు వచ్చింది ,
""ఇంత గొప్ప ధనవంతుడు  _?నాకు ఏమీ ఇవ్వకుండా ,ఒట్టి చేతులతో తిరిగి పంపిస్తారా ,?, ,బహుశా నేను పేద వాడిని అన్న  అహంభావం నిర్లక్ష్యం  అనుమానం కావచ్చు __!,లేకపోతే  ఇవ్వాలని ఉంటే_నాకు  ఏదైనా ఎంతైనా ఇచ్చేవాడు  కదా _?"
అన్న పాడు ఆలోచన నన్ను  ఆ క్షణంలో  మనసులో కదిలింది ,_!,  ఏ అజ్ఞానం నాకు మైకం లా కమ్మిందో గానీ ,
వారెవరూ చూడకుండా రాత్రిళ్ళు నేను  కప్పుకుని పడుకొని ఉన్న మెత్తని కాశ్మీరీ శాలువని నేను   అదే కవర్ లో అడుగున  దాచాను ,,,_!
ఇప్పుడు బయటకు వచ్చాక ,,   మళ్లీ సంచీ తెరచి చూస్తే  నేను చేస్తున్న చేసిన   ఘోరమైన పొరబాటు తెలిసి వచ్చింది నాకు ,_!
వారు ఇచ్చిన ఉత్తరం కవర్ ,నేను దొంగతనంగా  దాచిన  శాలువా , రెండింటినీ కలిపి చూస్తుంటే ,ఎంతో బరువుగా ,పరువూ తక్కువగా , నాకు  సిగ్గుతో అవమానం తో తల తీసేసి నట్టుగా తోచింది ,
""చీ చీ _!  ఎంత సిగ్గు మాలిన సిబి పని చేస్తున్నాను ?? పాపం  అంత మంచి మనస్సు ఉన్న మనిషికి  ఎంత చెడ్డ పేరు తెచ్చాను ,ఆయనకు ,??ఇలాంటి  అత్యాశ పరుడు , మా పెద్దాయన కు   స్నేహితుడు ఎలా అయ్యాడు _?  అని వీరంతా అనుకునే  విధంగా   నీచమైన పని చేశాను నేను కదా _!
అయ్యో _! భగవంతుడ  _! నా తప్పును  క్షమించు_!
బొత్తిగా ఏమీ తెలియని నిజమైన పల్లెటూరి బైతు నైపోయాను కదా _!,
దీనికి నేను కక్కుర్తి పడ్డానా ,_?! ఛ ఛ _!
ఇందుకోసమే వచ్చా నా ,నేను _??
దేవుడు నాకు ఇచ్చినది చాలకనా ,??
అసలు నేను ఎందుకు రావాలి _?
  ఆయన నుండి డబ్బులు ఎందుకు తీసుకోవాలి ?
ఎందుకు ఇన్ని రోజులు తేరగా తిని ఉన్నట్టు _?
నా స్థాయి మరచి ఎందుకు వెధవ లా ప్రవర్తించాను ,_?!
  నేను ఇచ్చిన మర్యాద కు  ప్రతి ఫలం ,గా  ఇలా చెల్లింపు కోసమే  వచ్చా నా _?!
చీ చీ __!" అనుకుంటూ  నేను చేసిన ,చేస్తున్న పనికి నాపై నాకే అసహ్యం రోత పుట్టింది _!
తండ్రీ  ,పరమాత్మ  _!
నేను ఆయనకు ఏమి ఇచ్చాను ?
ఏమీ తీసుకెళ్తూ ఉన్నాను ?
నెమ్మదిగా  ఆలోచిస్తూ  ఉంటే ,
నాకు జ్ఞానోదయం అయ్యింది _!,,నాలోని మనిషి మేల్కొని,"" చేసిన , తప్పు దిద్దుకో*_ ఇప్పటికైనా _!" అంటూ హెచ్చరిస్తూ ఉన్నట్టు అనిపించింది,
ఇక నేను ఏం చేయాలో  నాకు తెలిసి వచ్చింది,
నేను ఎవరో ,?నేను ఏమిటో ,నా స్తోమత వేషం  భాష  స్థాయి , విషయం  అంతా మెల్లిగా __నాకు  అర్థం అయింది  
  వెంటనే  నేను , ధరించిన  ప్యాంటు షర్టు తీసేసి ,
మూల గా కవర్లో ఉంచిన నా  ఒరిజినల్ రైతు దుస్తులు దరించాను
  వారు చూస్తూ వుండగానే  కవర్ లో  అందమైన మెత్తని శాలువా ను కూడా  పెడుతూ  వారికి అందించాను
వారు నాకు ఇచ్చిన ఉత్తరం ఉన్న కవర్ ను మాత్రం భద్రంగా  బనియన్ జేబులో దాచుకుని ,  అక్కడున్న ప్రతీ ఒక్కరికీ, నమస్కారం చేస్తూ  తిరిగి వచ్చాను
ఇపుడు నాకు ఎంతో ఆనందంగా మనసు హాయిగా. తృప్తిగా అనిపించింది ,
  నాది కాని దానిని  ,ఇక్కడినుండి తీసుకుని పోవడానికి నాకు ఏం అధికారం ఉంది _?
కనీసం ,  అదృష్ట వశాత్తూ ,నాలోని మానవత్వం  మేల్కొంది_! ,,
అదృష్ట వంతు న్ని నేను _!
పెద్ద ప్రమాదం నుండి బయట పడ్డాను ,_!
ఇదంతా నేను కోరి కోరి తెచ్చుకున్న  సమస్య నే కదా _!
నాకు ఇదంతా చేయాల్సిన ,ఒకరిని యాచించాల్సిన  అవసరమా ,?
ఈ చేత్తో  నేను ఎంతమందికి అన్నం పెట్టాను ,?! ఎందరికి సహాయం చేశాను ,, ?!
  ఓ యజమాని _! ఓ  దైవమా _!, నీ మిత్రుని , ఈ పేద రైతుని, అతి సామాన్యుడి  తెలియక చేసిన చిన్న అపరాధాన్ని  దయతో మన్నించు ,_!"
అంటూ  ఆశ్రుపూ రిత నయనాలతో , పశ్చాత్తాప హృదయంతో ,నేరం చేసిన వాడిలా ,  కంటికి కనపడని ఆ భాగ్యవంతుు నికి మనసులో  క్షమాపణ చెపు తుంటే _ కాస్తా నా మనసు తేలిక పడింది ,,
   నిజమే నేను వచ్చిందీ ,__ ఇంద్ర భవ నాన్నీ తలపించే  ఈ అందాల సౌధంలోకి __ఒక సామాన్య గ్రామస్తునీ వలె వచ్చాను  
కానీ ,
ఇందులో , నాది కాని ఏ వస్తువు పైనా కూడా ఇక్కడినుండి  నాతో తీసుకు పోయె అధికారం ఉండదు కదా_!""
అని అనుకుంటూ నేను చేసిన  మూర్ఖత్వం _పిచ్చి పనికి  సిగ్గు పడుతూ ,నన్ను ప్రేమతో దయతో ఆదరించిన వారీకందరకు  కృతజ్ఞతగా నమస్కారం తెలియజేస్తూ నా ఊరికి నేను తిరిగి వచ్చేశాను __!
ఇక్కడికి  ఈ కథ అయిపోలేదు _!
ఇద కథా ప్రారంభం మాత్రమే __!!
__   ఇది ఒక ఫైవ్ స్టార్ రెస్టారెంట్ యజమాని గురించిన వ్యవహారం
అందులో నా అతిథులు ఏ కొంత మందో   అరుదుగా ఉంటారు  కదా _!
మరచిపోలేని చేదు అనుభవం ఇది _!! చిత్రమైన ఈ అనుభవాన్ని  , నా తిరుగు ప్రయాణం పొడవూ తా,,, జ్ఞాపకం చేసుకుంటూ ,,నాలాంటి , పల్లెటూరి రైతు ,     బీద వాడు  కడు పేద వాడు , ఇలాంటి ధన వంతు ల భోగ భాగ్యాలను ఇలా  దగ్గరనుండి చూస్తూ  ఉంటే , ఇలాంటి వికారాలు ,విపరీత బుద్ది కలగడం  కూడా  సహజం కదా  అనుకున్నాను ,_!
నిజానికి   ఇది  ఆ దేవుడు నా నిజాయితీకి పెట్టిన పరీక్ష ,, గా భావించాను  నేను _!
ఇందులో నెగ్గాను_ గెలిపించా డు , ఆ పై వాడు  దైవ కృప వలన __!
అంటూ  చేతులు జోడించి నింగిలో ప్రకాశిస్తూ  ఉన్ టీ ఉన్న ఆ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి   కి భక్తితో కృతజ్ఞతా పూర్వకంగా  నమస్కారాలు సమర్పించు కున్నాను ,,
  __ ఇల్లు చేరాక , జరిగిన విషయాలు , పీడకలలా మరచి పోయె ప్రయత్నం చేశాను ,  నాకు
ఒక గుణ పాఠం బోధ పడింది
భగవంతుని కరుణ వల్ల,,
నా నిజాయితీ మంచితనం పై నాకు మరింతగా నమ్మకం ఏర్పడింది ,
వారం రోజులయ్యాక ,మనసు స్థిమితం అయ్యాక , పొలం పనులలో విశ్రాంతి దొరికాక ,ఒకరోజు ,నా భార్యా పిల్లల సమక్షంలో , జాగ్రత్తగా దాచిన  ఆ పెద్దాయన   ఇచ్చిన ఉత్తరం  తీశాను  చూడగానే భయమేసింది ,__!
"" అమ్మో _!చాలా పెద్దగా ఉంది అది ,__!
ఏదో  బ్యాంకు కెళ్తే ,అక్కడా సంతకం పెట్టడం ,,కొన్ని  ,పేర్లు చదవడం , వరకూ వచ్చు ,__ నాకు _!
అంతేగానీ,  ఇంత పెద్ద ఉత్తరాలు చదవడం  నాకు సాధ్యం కావడం లేదు__!!
అయితేనేం  
  నా భార్య పద్మావతి తెలివి గలది , పదవ తరగతి వరకూ చదివింది ,
ఆవిడకు ఇచ్చాను  ఉత్తరం , __!
"" నీవు చదవమని  ""అంటూ _!
ఆమె సిగ్గు పడుతూ,,
""మీకు రాసిన ఉత్తరం నేను చదవడం ఏంటి ,? నేను చదవను _;
అంది
"లేదు_! లేదు _! , ఇంకా,నీవు ఎంటి ? నేను ఎంటీ?   ఆ పెద్దాయన దయ వలన, నీ చదువు ఈ విధంగా ,ఇలా  మనకు  ఉపయోగ పడుతు న్నందుకు  నాకు మాత్రం  చాలా సంతోషంగా ఉంది , సుమా ,, కాస్తా చదివి  పెట్టు _!
కానీ నిదానంగా ,, అంత పెద్ద ధనవంతుడు రాసిన ఉత్తరం కదా ,,_! ఏం రాశాడో ,ఏమో _?
పైగా ,ఇంటికెళ్ళాక ,మన కుటుంబ సభ్యుల మధ్య చదువుకోమని చెప్పాడు ,కూడా !! ప్రత్యేకంగా ,
చదువు పద్మా _!"
అంటూ  నేను ప్రోత్సహించటం తో ,ఆమె నవ్వుతూ  ఉత్సాహంగా ఆసక్తితో  ఉత్తరాన్ని  చదవడం   ప్రారంభించింది ,_
     (  ఇంకా ఉంది )
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...