Monday, December 28, 2020

సర్వాంతర్యామి అనంతమైన అద్భుత ఔదార్యం3

Oct 10, 2020
  " రైతు సోదరా ,_నీకు నా
నమస్కారములు ,_!
నా ఆహ్వానాన్ని మన్నించి ,
నీవు మా అతిథి గృహానికి సంతోషంగా వచ్చావు  ,
నీకు హృదయ పూర్వక ధన్యవాదాలు  _!"
నీ అంత మంచి పుణ్యాత్ములకు    ఆతిథ్యం ఇచ్చే భాగ్యం , నీ రాక వల్ల నా కు  అనుకోకుండా  దైవానుగ్రహం వలన   లభించింది
_  ప్రత్యేకంగా  నా కోసం వస్తే ,,నేను నిన్ను కలవలేదని  అనుకుంటూ ,నిరాశగా వెళ్ళి వచ్చావు కానీ __"
_  నీవు ఇక్కడ ఉన్న  ప్రతీ రోజూ ,ప్రతీ క్షణం   నేను నిన్ను గమనిస్తూ నే  ఉన్నాను సుమా ,, నా గది నుండి,_!!""
,అంటే నీకు  ఇది ఆశ్చర్యం కలిగించే విషయం అని నాకు తెలుసు ,_!
కానీ ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞాన  వలన , సీసీ కెమెరాలు అమరిక తో ,ఎక్కడ ఏం జరుగుతూ ఉంటుందో నేను  నా గదిలో ఉంటూ నే __ ఎక్కడికి  కదలకుండా చూడ గలుగుతూ ఉన్నాను _!!
అయినా __నీవు వెళ్లి పోయే సమయంలో కూడా వచ్చి కలవలేదు అని  నీవు అనుకోవడం నేను చూశాను ,_!
""బాధ పడకు నేస్తమా _!
నీ నిజాయితీ మంచితనం నీలోని ఉదార గుణం,మానవత్వం ,,నిన్ను అతి దగ్గరలో ఉంటూ  గమనించాను ,నేను _!!
, ఆ అమాయకత్వం , అత్మ విశ్వాసం  నన్ను ముగ్దున్ని చేశాయి  సుమా ,_!!
ఇంతవరకు నీవెవర వో ,నేను ఎవరో ,కదా
కానీ నాకోసం నీవు , నీ కోసం నేను _  ఆరాట పడటం ,,ఇదంతా ,ఆ
__ భగవంతుడు ఆడిస్తూ ఉన్న ఈ విశ్వ నాటక రంగం  _! అందులో  నీవూ నేనూ , అందరం పాత్ర దారులం మాత్రమే సుమా __!,
అసలు నియంత సూత్రధారి _ఆ జగన్నాథుడు ,__!
ఆ రోజున  నీ పొలాల గట్టున నా కారు ఆగిపోవడం , నీ పరిచయం , నిన్ను  నా జీవితంలో కి   అనుకోని అతిథి గా పంపించడం ,,,
ఎందుకు ఈ సంఘటన జరిపించాడు అన్నది ఇపుడు నాకు  క్రమంగా తెలుస్తోంది ,,_!
నీ వల్ల జరగాల్సిన పని ఒకటి నాకు , స్పురింప జేస్తూ ఉన్నాడు
   మొన్న టి  రోజు న __ 
   ఒక ధనవంతు ని  హోదాలో ,, ఈ పెద్ద బంగళా లో నిన్ను  కలవడం,నాకు బాధ గా తోచి ,, ఆ సాహసం చేయలేక పోయాను,__!!
మిత్రమా , _! నీ విలువ నాకు తెలుసు ,నాకు __!
మరోలా అనుకోకు_!
ఇక  బాధ ఎందుకూ __?? నాకు__! అన్నది కూడా  విను ,చెబుతాను __!!
  నీవు అనుకుంటున్నావు __ ఒక సామాన్యుడ వు నీవు  అని _!
కాదు_! కానే కాదు _!
నీవు మాన్యు డ వు,
దేశంలో నీ ప్రజలచే గౌరవించి పూజింప బడే యోగ్యత ,, ఆ దేవుడి దయ వలన పొందిన వాడవు __!
పది మందికి _ పట్టెడు అన్నం పెట్టే చేయి నీది _! ఆ స్థానం  ఎప్పుడూ కూడా గొప్ప దే సుమా _!
నీవు పెడితే తిని బ్రతికే వాళ్ళం మేము _!
మీరు లేకుంటే మాకు ఉనికి శూన్యం సుమా _!
నీ విలువ నీకు తెలీదు _!,
నేను కూడా_ ఈ మహా నగరంలో  వేల మందికి ఉపాధి కల్పిస్తున్నా  _!!
కానీ , ఇంత మందికి పని చేసే శక్తిని ఆరోగ్యాన్ని ఆనందాన్నీ అందించేది నీ అమృత హస్తం మాత్రమే  సుమా__!
నీవు అన్న దాతవు మిత్రమా _!
అన్న దానం కంటే మించిన దానం ,ఐశ్వర్యం మహ భాగ్యం , ఈ పృత్విలో మరొకటి లేదు
భూమాత ముద్దు బిడ్డలు మీ రైతన్నలు __!
పచ్చని పంటలు పండించి  గ్రామం రాష్ట్రం దేశం సుభిక్షంగా   సమృద్దిగా పుష్టిగా  ఉండేందుకు__ నిరంతరం అహర్నిశలు శ్రమించి చెమట ధార పోస్తూ ఉన్నారు  మా కోసం _! ,  దేశం సౌభాగ్యం కోసం  ఎండా వానా లెక్క చేయకుండా , కష్టపడుతూ ఉన్న  శ్రమ జీవులు , స్వచ్ఛందకార్మికులు మీ రైతన్నలు ,__!!
ఇక మేము __
మా వద్ద ఉన్న కోట్లాది రూపాయల ఆదాయం,మా స్వార్థం కోసం ,,అజమాయిషీ అధికారం డబ్బు కీర్తి  పెత్తనాల  కాంక్ష ,  లాంటి దురాశ లను  సూచిస్తూ ఉంటాయి_!
   ఓ అన్న దా తా _!
ఈ బంగళా లోని పై పై మెరుగులు , జిగేలు మనే వెలుతురు కాంతులు చూశావు _!!
కానీ __
ఈ భవనం నిర్మాణం వెనుక ,దీని పోషణ నిర్వహణ వెనుక ఎంత  మోసం , దగా వంచన , అన్యాయ సంపాదన ,అబద్ధాలు , బిజినెస్ లావాదేవీ లు ,  లంచగొండి ,అవినీతి వ్యవహారాలు దాగి ఉన్నాయి నీకు తెలియదు ,కదా __!!
ఇది నా స్వార్జితం అని ఎప్పటికీ అనుకోను __!!
ఎందరి కడుపులు మాడ్చి ,వారి ఆదాయాలు గండి కొట్టి ,నాకు అనుకూలంగా మార్చుకుంటూ , ఇలా బంగళాలు ,పెద్ద పేరు ప్రతిష్ట ఫైవ్ స్టార్ హోటల్ రెస్టారెంట్ లు ఇలా  పెంచేస్తూ వచ్చాను నీవు ఊహించలేవు ,,,
""  డబ్బు కోసం దాసోహం ,""అన్నట్టుగా , ఈ డబ్బును  ఎరగా చూపి , నేను గొప్ప వాడిగా  ఈ మిథ్యా జీవితం  లో సరదాగా సందడి తో , ఉంటూ బహు  ఆవేదన తో గడుపుతూ ఉన్నాను
,నా ఈ జీవితం  అంతా__ డబ్బు దర్జా అధికారం ,_కోసం _!
!ఈ   పోటీ ప్రపంచం లో ఎలా నెగ్గుకు రావాలా అన్న ఆరాటం __ పోరాటం ,జంజాటం తో బ్రతుకు లో ఆనందం ,మానవత్వ  విలువలు __మరిచి పోతున్నాము __!
మిత్రమా
ఇప్పుడు చెప్పు __??
హాయిగా పచ్చని చేల మధ్య బంగారు పంటలు పండించు కుంటు __నీవు_ నీ కుటుంబం  జీవిస్తూ పోగా _ పదిమందికి సంతృప్తి సంతోషం కలిగించే విధంగా ,,పుష్టికరమైన ఆహారాన్ని సమృద్దిగా  అందిస్తూ , ఆనందంగా  జీవితాన్ని గడిపేస్తూ ఉంటున్న నీవా ,  థన వంతుడవు   _!???"
లేదా __
ఎప్పుడూ ఆశ డబ్బు కక్కుర్తి ఇతరుల శ్రమ దోచుకుంటూ ,, స్వార్థంతో  , విశ్రాంతి అనందం ,సంతృప్తి కరవై , పశువుల వోలె ,యాంత్రిక జీవనం గడుపుతూ  ఉన్న నేనా థన వంతుడను __??
ఇప్పుడు
నీవే చెప్పు ___??
  సోదరా __!
నా వ్యధ  లు ,బాధ  లు చెప్పి  _నీకు చెప్పి ,ఇలా నిన్ను బాధ పెట్ట దలచు కోలేదు__!
నీవు ఎంత అదృష్ట వంతుడ వో  నీకు గుర్తు చేస్తూ ఉన్నాను _!
అంతే __!!
  జీవితంలో ,భగవంతుడు నీకు  ఇచ్చిన బహు చక్కని అవకాశాన్న సద్వినియోగం చేస్తు ఆనందం గా ఉన్నావు __!
నా బంగాళా కంటే నీవున్న పెంకు టిల్లు,  ఎన్నో రెట్లు గొప్పది  సుమా __!
నీవు నీ ఇంటి  ఆరు బయట  మంచం వేసుకొని__ రాత్రి వేళల్లో  పడుకుంటే  నీకు  పైన ,ఆకాశంలో కనిపించే  నక్షత్రాలు   చందమామ  దివ్యమైన అమృత అద్భుత  అపురూప సహజమైన  వెండి కాంతుల వల్ల నీవు పొందే  ఆనందం  ముందు ___, మా బంగళా  లోంచి వచ్చే కృత్రిమ విద్యుత్ కాంతులు ఎందుకూ పనికి వస్తాయి చెప్పు ??
భగవంతుడు నాకు"" ఫైవ్ స్టార్ హోటల్ రెస్టారెంట్ """లు ఇచ్చాడేమో
కానీ
నీకు అతడు  అందమైన అద్భుతమైన , సకల సంపదలకు ,  శాంతి నిలయం అయి విరాజిల్లే "" ఆల్ స్టార్ రెస్టారెంట్"" లాంటి ప్రకృతి సౌధా న్నీ బహూకరించాడు , అనుగ్రహించాడు ,
పైన  అనంతమైన అందమైన ఆకాశం
కింద పచ్చని ధరిత్రి , పసిడి పంటల వరి చేలు
పక్షులు జంతువులు క్రిమి కీటకాలు , వన్య ప్రాణులు , బీద వారు , బిచ్చ గాళ్ళు, నీవు పండిస్తూ ఉంటున్న  ధాన్యాన్ని కడుపారా సంతృప్తిగా తింటూ ఉంటాయి కదా___!
అయితే  ఇవన్నీ ఆనందంగా ,అతడి ప్రసాదంగా అనుభవించు , పుట్టినప్పుడు ఎలా భూమిపై కి వచ్చావో అలాగే వెళ్ళి పోవడానికి తయారుగా ఉండు _!
నా బంగళా కి  నీవు ఎలా  వట్టి చేతులతో వచ్చి  , ఖాళీ గా వెళ్ళావో , ఈ జీవితంలో కూడా.  అంతే కదా ___!!
పూచిక పుల్ల కూడా మనతో రాదు అన్న విషయం నీకు తెలుసు __;;
ఇక __
  నీతో బాటు గ్రామంలో దేశంలో , రైతు సోదరులు కూడా , అన్న దాతలు గా  సమస్త మానవాళికి ప్రాణికోటికి  పట్టెడు మెతుకులు  కడుపునిండా తినే భాగ్యానికి నోచుకుంటూ ఉన్నారు అంటే __
ఇంతకన్నా  అదృష్ట వంతులు  మీరు కాక__ భూమిపై మరి   ఎవరైనా ఉంటారా  చెప్పు _?
అక్కడ, ఆ రోజున , నా కారు ఆగిపోవడం , నేను  ఇబ్బంది పడటం ,నీతో పరిచయం కావడం ,,నాకు  నీవు ఆశ్రయం ఇవ్వడం ,__ తద్వారా  మన స్నేహం పెరగడం చూశావు కదా __!;
ఇదంతా యాదృచ్ఛికం ,  దైవ నిర్ణయం ,_!
అంతా ఇదివరకే  పక్కా గా ఆ దేవుడు ప్లాన్ చేసి ఉంచాడు ,, _!
అలానే జరిగింది ,జరుగుతుంది కూడా __!
మనం చేసే ప్రతీ పని , అతడు చేస్తున్నదే ,, అని గ్రహించాలి ,సుమా __!
మిత్రమా
స్వర్గం నరకం అవి రెండూ ఎక్కడో లేవు __! ఇక్కడే మన  కళ్ళ ముందే మనకు ,జాగ్రత్తగా గమనిస్తూ  ఉంటే  కనిపిస్తాయి ___;
""ఇతరులకు సహాయం చేయడం , ప్రేమతో నవ్వుతూ  మాట్లాడటం,ఉన్నదానితో  తృప్తిగా  , జీవించడం   అందరినీ సమానంగా చూడటం ,,  ఎదుటి వారి ఆనందంలో మన ఆనందాన్ని  పొందుతూ ఉండడం   , ఈ మధురానుభూతి  అనుభవం లోకి తెచ్చు కోవడం  , దేవుడు ఇచ్చిన సహజ  సంపద  ,దైవానుగ్రహం గా చింతిస్తూ జీవితం గడపడం   , ఇదంతా మన పాలిట "నిజమైన స్వర్గం ""
అని నా అభిప్రాయం __!
ఆ స్వర్గం లాంటి అనుభవాన్ని  , నీకు అందించాలి __!,నీలో దాగిన ప్రతిభ, అందరూ   దర్శించే లా  చేయాలని __  నా ఈ తాపత్రయం ,__!
ఇక ""నరకం ""అంటే కూడా ఎమిటో అనుభవ పూర్వకంగానే చెబుతూ ఉన్నాను __!;
ప్రస్తుతం నేను అనుభవిస్తూ ఉన్న దీనావ స్త అదే __!
ఇక్కడ __కేవలం స్వార్థ ప్రయోజనాల చింతన , ఇతరుల ను వంచించి మోసం చేసి, పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండడం,_ క్రమంగా  ,శాడిస్టు గా మారడం ,
ఎదుటి వారి ఆనందం అభిప్రాయం గౌరవించడం కాకుండా తన కీర్తి గౌరవం మర్యాద తన సంపాదన    సమాజంలో గుర్తింపు కోసం , పెత్తనం నిర్వహిస్తూ ఉండడం ,ఇలాంటి  దురహంకార వ్యవస్థ ,,కృత్రిమ సంతోషం__  మనిషిలో నీ వికారాలు అన్నీ కలిపి  జీవితాన్ని  , నరక ప్రాయం గా మార్చేస్తాయి __!!,
అయితే
అందుచేత  ఇపుడు
సమస్య  ఎక్కడ  అంటే __?
అది నీ వద్దనే ,_!
మీ గ్రామంలో నే _!
మిత్రమా ,_!
మనకు తెలుసు ___!!సమస్య ఎక్కడ కనిపిస్తూ ఉంటుందో ,మనకు దాని పరిష్కారం కూడా అక్కడే దొరుకుతుంది , అనీ __!!
పోతే దైవానుగ్రహం మనకు  తొడుంటేనే  అది సాధ్యపడుతుంది _!!
అయితే , నీవు చేయాల్సిన బృహత్తరమైన పని ఒకటుంది ,,
అది నీ తోనే  ప్రారంభించాల్సి   ఉంది,
ఈ  కార్య భారం నీవు మాత్రమే నిర్వహించవలసి ఉంది , కూడా __!
అందుకే  ఆ దైవం __ఈ పవిత్రమైన పుణ్య కార్యం   చేయడం  కొరకై మన ఇద్దరినీ ఇలా యాదృచ్చికంగా  ఆ రహదారిలో కలిపిం దేమో !?""
"" నీవు అనుకోవచ్చు ,,మిత్రమా_!  నా వద్ద  అలాంటి వసతులు ఎన్నైనా చేయగలిగే డబ్బు సామర్థ్యము , ఉన్నాయి కదా , అదే పని నేను ఎందుకు చేయ గూడదు ,? అన్న అనుమానం నీకు  రావచ్చు __!!
అది సహజం __!
కానీ  __ నాది రాక్షస రాజ్యం సుమా ___!
నీవు అనుకునే  రామ రాజ్యం కాదు ఇది __!!
ఇది ఒక రావణ లంక __!!,ఇందులో ఏ ఒక్క పైసా , నాది కాదు,__! ఇతరుల రక్త మాంసా లు పిండి   ఇన్నేళ్ళు అదే పనిగా కూడ బెట్టి , ప్రోగు చేసిన   పాపపు పెంట ఇది _! చీ చీ __!
తలచుకుంటే  నా బ్రతుకే నాకే  అసహ్యంగా అనిపిస్తూ ఉంది ,__;
కానీ నేను ఈ విషవలయం నాకు నేనే స్వయంగా కావాలని  ఏర్పాటు చేసుకున్నది కదా __!
అందుచేత ఇందులో నుండి బయట పడే అవకాశం నాకు ప్రస్తుతం  లేదు ,__!
చేసిన పనులకు పశ్చాత్తాపం పొందుతూ ఇలా హృదయ నైర్మాలిన్యాన్ని ఇలా కడిగేసు కోవడం తప్ప  నాకు వేరే దారి లేదు
కానీ , సోదరా _!
భగవంతుడు  నీలాంటి ఒక పుణ్య మూర్తి ముందు తన పాప ప్రక్షాళన చేసుకునే సదవకాశం  నాకు ,ఇలా నీ రూపంలో ఇప్పుడు  అనుగ్రహిస్తూ ఉన్నాడు __!
ఇందుకు ,
స్వామికి , ఆ దేవ దేవుడికి ,, ఆ సర్వాంతర్యామి కి   సంతోషంగా __ శతకోటి వందనాలు సమర్పిస్తూ ఉన్నాను_!
మళ్లీ చెబుతున్నాను 
, నా సంపాదన పూర్తిగా అక్రమం , అన్యాయ ఆర్జితం , పరుల సొమ్మును దోచుకుంటూ గడించిన ఈ కోట్లాది రూపాయల  ఆదాయం ,,  పరమ పాపిష్టి ది,
దేవుడి నైవేద్యానికి  కూడా పనికి రాదు __!!
అలాంటి నీచమైన సొమ్మును,,  దైవ కార్యం కోసం    వెచ్చించడం , ఆ విధంగా చేతులు దులిపేసు కోవడం నాకు ఇష్టం లేదు  ఆత్మ బంధు ___!!
ఇంత గొప్ప వాడిని ,కోటీశ్వరుడు అయ్యాను అంటే    ఆ భగవంతుడు నాకు ఆ ప్రజ్ఞా పాటవాలు ఇచ్చాడు
అందులో  ఏ మాత్రం సందేహం  లేదు , __!!
నా అజమాయిషీ లో వేలాది మంది రోజూ పని చేస్తున్నారు ,__!!
ఎవరి తో ఏ విధంగా ఏ పని చేయించాలి అన్న అనుభవ జ్ఞానం నాకు బాగా ఒంట బట్టింది __!;,
కాబట్టి __ నిన్ను అక్కడ ఆ రోజు  చూస్తూనే ,  నేను ఏం చేయాలో ,నా కర్తవ్యం ఏమిటో భగవంతుని అనుగ్రహం వలన నాకు అప్పటికప్పుడు  మనసులో స్ఫురించింది ,
ఇది నిజం _!
అందుకు ,
నీవే యోగ్యుడ వు , అని కూడా  నిర్ధారణ చేసుకున్నాను __!
   ఓ అన్న దాత__!;
ఓ దేశ ప్రజల  ప్రాణాలు   పోషించే వాడా __!!
నీకున్న బలం శక్తి యుక్తులు నీకు తెలియవు ,
నేను  ఈ  ఉత్తరం ద్వారా     దేవుడు  సహజంగా  ప్రతీ మనిషిలో అనుగ్రహిస్తూ వస్తూ ఉన్న  ఆత్మబలం మనో నిబ్బరం , నేను నీకు గుర్తు చేస్తూ ఉన్నాను,
కష్టాలు  సమస్యలు లేని వారు భూమిపై ఉండరు సోదరా __!
  ఎవరి సమస్య వారికే పెద్దగా అనిపిస్తుంది __!;
కానీ , దైర్యం తో  ఎదుర్కొనే అవకాశం తనకు తానుగా వెతుక్కోవాల్సి ఉంటుంది సుమా,__!
నేస్తమా __!
గాలికి దీపం వెలిగించి ""దేవుడా నీదే భారం కాపాడుకో _!"  మనిషి మూర్ఖత్వానికి నవ్వుకుంటా డు అతడు  __!
స్వార్థానికి తన తెలివిని చక్కగా ఉపయోగించు కుంటాడు
కానీ  ఇతరుల కోసం మాత్రం ఆ తెలివిని దాచుకుంటూ ,దైవాన్ని నిందిస్తూ ఉంటాడు కదా __!!
ఆ మాత్రం దానికి దేవుడు మనిషికి మాత్రమే ఇంత విషయ పరిజ్ఞానం ఎందుకు ఇస్తాడు చెప్పు ?
నీలో ఎంత శక్తి యుక్తులు మిగిలి ఉన్నాయో ,అదంతా వినియోగించే కనీస ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది కదా
ఒకవేళ నీవు చేయలేని పరిస్తితి వస్తె ,అప్పుడు నీలోనే అంతర్యామి గా విరాజిల్లుతూ , జీవితాన్ని హాయిగా ఆనందంగా  నడిపిస్తూ ఉన్నతను ,ఇది కూడా తన వంతు బాధ్యత గా స్వీకరిస్తూ నిన్ను విజయ పథం లో నీ వెన్ను దట్టుతూ నడిపిస్తాడు
నా మాటలో విశ్వాసం ఉంచు  స్నేహితుడా _! నా ద్వారా  ఈ మాటలు ఆ సర్వాంతర్యామి పలికిస్తూ ఉన్నాడు  నేను కాదు సుమా
నాకు అంత సీన్ ,అదృష్టం లేదు  సోదరా _!   దేవుడు  నీకు ఆ పనిలో ఎదో ఒక రూపంలో నీకు మార్గ దర్శనం చేయడానికి , నన్ను ఈ  అల్ప జీవిని  ,సాధనంగా  ఎంచు కొన్నాడు
అంతే గాని ఇందులో అవగింజ మాత్రం కూడా నా  గొప్ప తనం లేదు సుమా _!
  నీవు  మన దేశానికి వెన్నెముక లాంటి వాడివి ,_!
అందుకే ,
  నీకు నీ కుటుంబానికి నీ  గ్రామానికి  పేరు దక్కాలి అన్నది నా అభిమతం
 
అందుకే  ఈ రోజు నుండి ఈ శుభ సంకల్పాన్ని  మనసులో దృఢంగా పదిల పరచుకొని __దేవుడిపై భారం వేసి ఆత్మవిశ్వాసం తో    నీవు ముందుకు సాగాలని ఈ పేద స్నేహితుడి అభ్యర్థన ,,_!
ఆ   కొండంత దేవుడు  సహజంగా ప్రకృతి వనరులతో నీకు అండగా ఉండగా  ఒంటరి వాడి నని , ఎందుకు బెంగ మిత్రమా ,??"
   ఆగిపోయింది   శబ్దం  _ అంతా 
నిశ్శబ్దం , ,
తల పైకెత్తి చూసే సరికి,,
    పద్మావతి ఇక చదవ లేక పోతోంది ,ఆమె కళ్ళ నుండి ఆశ్రువు లు ధారాపాతంగా స్రవి స్తూ చేతిలో ఉత్తరాన్ని తడిపేస్తూ ఉన్నాయి
పొంగి వచ్చే దుఖం ఆపుకోలేక ఉత్తరాన్ని నా చేతిలో పెట్టేసి  చీర కొంగుతో ముఖం చాటు  చేసుకుంటూ  చటాలున   లోనికి  వెళ్లింది ,__!
  నా పరిస్తితి అంతే , మగాణ్ణి కదా అలా పైకి ఏడవలెను  __!!
ఏదో మరో లోకం నుండి ఊడి పడ్డట్లుగా ,ఉంది నాకూ కూడా _!
   కడుపులో ఎదో దేవి నట్టుగా ,   గందరగోళం గా ఉంది,
__నిజానికి _నేను చాలా మొరటు వాడిని ,_! సాధారణంగా నా కళ్ళకు నీళ్ళు రావు _!
చిన్నప్పుడు ఏదీ తెలియని వయస్సులో  ఎప్పుడో మా  తండ్రి పోయాడు ,
అప్పుడు ఏడ్చానో లేదో తెలియదు కానీ అప్పటినుండి మా
అమ్మ నన్ను  ""తానే అమ్మా నాన్నా మిత్రుడు  సర్వస్వం __అయి  స్వయంగా అన్నీ చూసి పెంచి పోషించి శాశ్వతంగా ఒక రోజున నన్ను విడిచి పోయింది ఆ దయాలువు పరమాత్ముని సన్నిధికి ,__!
అప్పుడు ఎంత ఎడ్చానో నాకే తెలియదు
అప్పుడే కాదు __!ఎప్పుడూ అమ్మ జ్ఞాపకం వచ్చినా కూడా కళ్ళ వెంట అశ్రు ధారలు ఆగకుండా కట్టలు తెంచుకుని స్రవిస్తూ పోతూ ఉంటాయి
గట్టు మీద రాయి వలె , రోడ్డు మీది చెట్టు వలె  బండ వలె కటినం  గా ఉంటున్న నా శరీరం__ పొలం పనుల్లో తీరిక లేకుండా , ఎండల్లో ఎండుతు వానల్లో నానుతూ  నా , మనసూ శరీరం మొద్దు వారాయి ,వాస్తవంగా ,,__!
కానీ_ ఇపుడు _ ఈ ఉత్తరం సారాంశం   మాత్రం   నా    మనసును అతిగా  కలచి వేస్తోంది ,
   ఎవరో తెలియని ఆత్మీయుడు ఆ పెద్దాయన_?
ఏ జన్మ సంబంధం ?, ఎవరు ఆయన ?
నేను ఎవరూ ??
ఎక్కడిది ఈ   అనుబంధం  ??
ఇక  మనసు ఆపుకోలేక __
   పద్మావతి చదవకుండా  విడిచిన  ఆయన సందేశాన్ని ,,ఎక్కడ ఆపిందో ,,అక్కడినుండి , పూర్తి గా చదవాలని  అనుకున్నాను __!
ఈ ప్రేరణ ,,ను
ఆ పెద్దాయన నాకు ఏదో తెలియని అజ్ఞాత శక్తితో , ఆసక్తిగా   అందిస్తూ ఉన్నట్టుగా అనిపించింది ,
   అలా నా లో నీ ,శక్తి నీ, తెలివిని , అంతా  కూడగట్టుకొని ఓపికగా   ఒక్కొక్క పదాన్ని జతచేస్తూ  జోడించి నెమ్మదిగా  నాకున్న కొద్దీ పాటి అక్షర పరిజ్ఞానం తో ,  చదివే  ప్రయత్నం చేశాను
,,  మిత్రమా _!
    నీ ముందు ఉన్న  బృహత్తర కార్యక్రమం నిన్ను  చేయించేది__ నీవు  చేసేది , నిజానికి  ""నీవు కానీ ,నేను కానీ కాదు అన్న విషయం  బాగా జ్ఞాపకం పెట్టుకో _!""
ఈ  కథ మాటలు  నిర్వహణ దర్శకత్వం  బరువూ బాధ్యతలు  అన్నీ , ఆ పై వాడు  మాత్రమే    స్వయంగా నీ వెంట ఉంటూ నిర్వహిస్తూ  ఉంటున్నాడు   అన్న సత్యం నీవు అనుక్షణం  గుర్తుంచు కో  వాలి  సుమా_!
దేవుడు నీలో  నాలో అంతర్గతంగా  అజ్ఞాతంగా ,ఉండి  ఆడిస్తూ ఉన్న  వింత  నాటకం  ఇది _!__ __
    ఇక  ముందుకి చదవడం నా వల్ల కావడం లేదు,
కంటి నీరు అక్షరాలను  మింగి వేస్తోంది __!
ఇప్పుడు  లోనుండి పొంగి వచ్చే దుఖాన్ని తువ్వాల అడ్డం పెట్టుకొని లోనిక్ వినపడకుండా ,లోలోన  వెక్కి వెక్కి ఏడవడం _నా వంతు అయ్యింది ,
  మౌనంగా రోదిస్తూ    పిచ్చిగా ఉత్తరాన్ని చూస్తూ ఉంటే , చిన్న తనంలో మా అమ్మ  ప్రేమతో నన్ను తన ఒడిలో కూర్చో బెట్టుకొని , తల నిమురుతూ ,నెమ్మదిగా నాతో చెప్పిన   మాటలు,,తేనె మూటలు ,, ఒక్కొక్కటిగా గుర్తుకు  వస్తున్నాయి
అమ్మ దయ__ అమ్మ  వాత్సల్యం __ అనురాగం ,అమ్మ మనసు ,అమ్మ చల్లని వొడి ,అమ్మ మనసు , అమ్మ మాటలోని కమ్మదనం  అమ్మ ప్రేమ , ,అమ్మ కళ్ళ నుండి   కాంతులు విరజిమ్మే  ఆ  లాలన ,,బుజ్జగింపు ,,ఓదార్పు ,,పుత్ర వాత్సల్యం తెరలు తెరలుగా  ఎదలో  కదులుతూ వచ్చాయి
నిజంగా దేవుడు   ఎంత మంచి వాడు ,
. ఈ భూమిపై  వాస్తవంగా ,
అదృష్ట వంతులు ఎవరంటే  తమ వెంట అమ్మ ఉన్నవారే   కదా _!
అమ్మ అనే వరాన్ని__ ప్రత్యక్ష దైవం  గా , ఆటు పాటు లలో చెదరని ఆసరాగా ,అందిస్తూ , బ్రతుకు లో ఆనందం , పరస్పర అనురాగం  జీవకోటికి తన  ప్రసాదం గా  ,అనుగ్రహించాడు కదా__!;
" ఆహా  _!ఓ పరమాత్మా_! ఓ పరందామా __! ఓ పరాత్పర __!
నీవు ఎక్కడ  ఎలా ఉన్నావో గానీ ,ప్రభూ _!  ఎన్ని జన్మ లేత్ఠి నా  ,,నీ ఋణం  ఈ మాతృ ఋణం ,ఏ విధంగా  కూడా తీర్చు కొన లేము గ దయ్యా ,__?
స్వామీ__! ఓ అనంతా , అచ్యుత , అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా _!
జగన్నాటక సూత్రధారి,ప్రభూ _! ఓ  సర్వాంతర్యామి
అంటూ   కనరాని ,కనలేని ,    ఆ విశ్వ ప్రభువుకు ప్రణామాలు  సమర్పిస్తూ,, అంతరంగం లో  నా ,బాల్యంలో ""  అమ్మ చెప్పిన మధురమైన మరవలేని , మరచి పోలేని,  మాటల జ్ఞాపకాలు  ,,గుర్తు చేసు కుంటు  ఎంతసేపు , కళ్ళు మూసుకుని , ఉండి పోయా నో నాకే తెలియదు
      (ఇంకా ఉంది )
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా

     (ఇంకా ఉంది )
స్వస్తి _!
   హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...