Monday, December 28, 2020

పద్యాలు

గాలి తాకున క దలాడు ఆకు వోలె__
ఏల భీతిల్లెదవు_ హరిణేక్షణ _ నీ కడ నేను లేనే _!
"దొండ పండ ని భ్రమసి  కొరుక వచ్చు చిలుక _!
తెలియకున్నది ,!దేవి_! నీ అధర కాంతి _!"

"ఏది తన చేతిలో లేదు "యనునే   గానీ_
ఏది ఏమైన చేయుచు_ వగచు చుండు_!
ఏది చదివిన_ వినిన అర్థంబు గానీ _
ఏది జగమున ఉండు ?  మనుజ చిత్తంబు గాక _!""_

"కనుల ముందున్నది_ మాయ మగుట వింత _!
కనని  వేషాలు కనుట_ మరొక్క వింత_!
కనని  వినని  భావాల_ చింత వింత _!
కనని  సత్యము_ తానునిత్య" మనుట వింత _!"

""ఏమీ చేయుదు ,?  నా మాట  మనసు వినదు ,_!
"ఏమి తెలియని కోతి వలె , గెంతు చుండు_!"
" ఏమి చేసినను _ తిక్క గా , వెక్కి రించు _!"
""ఏమి చేయక యున్న ,నెత్తిపై  మొట్టు చుండు __!""

"ఎంత బావుండు _!? నేన లా   చేసి యున్న _!?
ఎంత పని చేసితి ? నా మతి కాలి పోనూ _!?
  ఎంత అవునన్న _ కొంతైనా కాక పోయే_!??
ఎంత అనుకొన్న  నేమీ, చేయి దాటినాక _!""

""నిన్ను  పూజించి కొలువ నా చేత కాదు _!
""నిన్ను  ధ్యానించి స్మరియించ వీలు  కాదు _!"
""నిన్ను ఊహించి భావించ నా తరము కాదు_!""
""నిన్ను పట్టుట , కృష్ణ , ఆ విధము చెపుమా _!!""

""నేను హీనుడ!దీనుడ! ,పిరికి వాడ _!
నేను  ఎరుగను " ఏది, అని తెలియ నోడ!
నేను   ఎవరిని ? అని ఎపుడు తలచనొడ,_!
నేను అనునది " విషమని తెలియ నోడ _!!""

నాకు తెలుసును ,, నా జన్మ  గొప్ప దనియు
నాకు తెలి సెను , పశువును కాను నేను!
నాకు తెలిసిన వన్నియు వట్టి బూటక ములు!
నాకు తెలుపుము కృష్ణ _! నిను పట్టి  వేడు విధము""

కృష్ణ నీ చూపులో కరుణ ,   కలచి వేయు _!
""కృష్ణ _! నీ రూపమే తలచ  మేను మరతు _!"
""కృష్ణ _! నీ నామ గా""నమున  మది మత్తెక్కి పోవు _!"
""కృష్ణ _! ఎందుకు నీవే నా ఆత్మ  కావూ ??""

""అత్మ తెల్లన ,   శుద్ధ  మానస సరోవరమ్ము _!
పాలు వెన్నెల , తెల్లని వెండి కాంతి _!
శార దా దేవి    చల్లని  భావ మహిమ__!
సత్య మహింస లు _ తెల్లని పూలు కావే _!!""

మాయ ఈ జగము అని నాకు తెలియ ద య్యా_
మాయ లో బ్రతుకు మాదని తెలియ న య్యా _!
మాయ కాదిది బ్రహ్మ మని ఎరుగ నయ్యా__!
మాయ ఏదియో  కృష్ణ,ఆ  మర్మ మేదో చెపు మా !!""

""కష్టము నాదు జన్మము _!
""కష్టము కోసమే పుడితి_నేననే__!
""కష్టము నష్ఠమౌ నెపుడు?? _?
కష్టము కృష్ణా_!నీవు కృప జూప కుండి నన్_!!""

కడలి కెరటాల  వడి వలె , రాత్రి పగలు __!
""క్రమ్మి వేయుచు నుండే,తేరుకొకమునుపే _!!
కనికరమ్మింత చూప దు,_నిను తలచ నీదు __!!""
కరుణ జూపుము ,  కృష్ణా_! విధి కాటు పడక ముందే __!"

""వానలు ,ఎండలున్ _ తిరుగు కాలము _!
""వారధి ,గాలులు, చావు పుట్టుక ల్_!
""వాడిగ వచ్చు చు పోవుచుండే_! నేను నీ వాడిని గానే  _!
వారి బారి బడనీక _కృష్ణా_! కృపన్ నను జేరి కావుమా _!""

""ఎన్ని నటన లు చేసితి నింత వరకూ__!
""ఎన్ని నటన లు చేయ వలె,దీని కంతు లేదే _!
""ఎన్ని నటనలు    నటనా గ్రేసర,_ నే  జేతు నయ్య ?
ఎన్ని జన్మలు  నటియించ     నీ కృప  కలుగు కృష్ణా  ?""

ఎన్ని మారులు నీ గుడికి వచ్చి యుంటి?
ఎన్ని మారులు నీ ముందు నిలిచి యుం టి?
ఎన్ని మారులు  మరవక దలచి యుం టి ?
ఎన్ని మారుల  అటు జేయ  కృష్ణ_! నీ కృపను  గొందునేను?

నిన్ను నుతియించు  ప్రతి రోజు , శుభ దినమ్ము _!
నిన్ను నుతియింప కున్న అది ,దుర్ధినమ్ము _!
నిన్ను నుతియింప నేరని నోరు , పశువుకు మూతి గాదె _!
నిన్ను నుతియింప గల నెట్లు ?నీ కరుణ లేక __?

నేను పాడె ద , నీ నామ మద్భుతము గా_!
నేను ఆడె ద , మై మరచి అలుపు దీర_!
నేను వే డె ద, తనివార,నోటి తీట దీర_!
నేను చే సెద, ఏదైన,కృష్ణ_! నీవు దయ జూపినంత __!!"

"నన్ను నీ వాడని చెప్పు , పద్మ నాభా_!"
నన్ను నీ వాడిగా ప్రకటించు ! రాధ ప్రియుడా_!
నన్ను నీ వాడని ,నీవు నమ్ము వరకూ__
నన్ను నేనును , ఏ నాడు క్షమి యించ బోవ , కృష్ణా_!

""నిన్ను దలచిన  ప్రతి క్షణ ము సార్ధకమ్ము _!
"నిన్ను దలచిన జన్మ యేజన్మ నిజము _!
""నిన్ను దలచని ప్రతి జీవిబ్రతుకు రణము _!
నిన్ను దలచిన కృష్ణా_! వృథా కాదు, ఈ జగమ్ము _!""

ఏమి జేసితి, కృష్ణా_! నీ కొరకు నేను __!"?
ఏమి జీసితి,_? నను నీవు జూచు కొరకు _!"?
ఏమి జేసిన వినిపించు ,నీకు నాది ఆర్తి ?
ఏమి చేయు దు _? కృష్ణా, నీ కృప లేక యున్న _!""

నీవు నిరాకార నిర్గుణ రూపివి _!
సచ్చిదానంద విశ్వాత్మ భావుకు డ వు _!!
నేను  దీ నత తో ,కర్మల మోయు చుండ__!
నిన్ను భావింతు నెట్లు?  నా బరువు తగ్గించు వరకు  __!""

""నరము లేనట్టి నాలిక నాకు ఇచ్చి _
నరము తెగిపో వు వేదన కల్పించి నా వు _!
నర ము బంధించలేని కృష్ణ ప్రేమ నిచ్చి__
నరము నారాయణా అని పలుకు కృప ను ఇమ్మా _!""

ఇచ్చె డీ హస్తము గొప్పది_
ఇచ్చె డి వాడె పు డు , దివ్య తత్వము వాడే _!
ఇచ్చె డి దొడ్డ గుణమ్ము తెలియక __
ఇచ్చె డీ వారి నిందించుట , కృష్ణ_!నీకు నచ్చదు కాదా _??""

""జరిగినది , జరుగ నున్నది _
జరి గెడునది , నేవెరుంగు దువు _!"
"*జరిగిన నా జీవిత కాలము  జరుగదు కద, మరల_!
విలువ తెలియుట ఎటులో _??"

తెలియును భూమియు,గ్రహములు
తెలియును అవి ఆగకుండ భ్రమియించు ట యున్ __!
తెలియును నీవు నను తింపుట_
తెలియును  నీకిది ఆటని_!
నిజమే దో తెలియ జేయుము, కృష్ణా _!""

"ఆత్మ సమర్పణ భావము_
ఆత్మలో పరమాత్మ గనుట_
ఆత్మలో  _నిను శోధించి తరచి,_
ఆత్మలో నిను దర్శించుట, నీదు దయతో గా దే _!""

ఎంత ముద్దు రా , నీ నగు మోము కృష్ణ_!?
  ఎంత ముద్దుర, దొంగ నవ్వు , కృష్ణా?
ఎంత ముద్దు రా, నీ చల్లని చూపు కృష్ణా?
ఎంత ముద్దు రా, నీ కాంతి రూపు  కృష్ణా?"

"నిన్ను తన బిడ్డ డని మురిసే యశోద మాత_!
నిన్ను తన ప్రాణమని యెంచే ధన్య చరిత _!
నిన్ను తన స్తన్య పానమున  పెంచి పెద్ద చేయ,,
నిన్ను తనయుడు గ పొం దిన ఆమె భాగ్య మెంతో ??

నంద రాణీ కి అల్లారు ముద్దు కొడుకు _!
నంద రాణీ కి ఒడిలో నిదురిం చు కొడుకు _!
నంద రాణీ ని మురిపిం చు  వరాల కొడుకు _!
నంద రాణీ కి  కొడుకు వా, నిజము చెపు మా ??""

"కృష్ణ,!నీ రాధ, నీ కొరకు వేగు చుండే_!
కృష్ణ_! తన శ్వాస నిట్టూర్పు సెగలు చూడు _!"
కృష్ణ_! తన ప్రాణము నీ కొరకు నిలుపు _!
కృష్ణ_! ఆమె అచేతన దీన స్థితిని చూడు _!""

సా విరహే తవ ధీనా , రాధా
"" కృష్ణా_! నీవు లేకుండ _నీ రాధ జీవించ లేదు _!
కృష్ణా! ,నిరతము నీధ్యాసతో తన శ్వాస వదులు _!
కృష్ణా_! తానెటు చూసినా, నీ రూపు తలచు _!
""కృష్ణ,, ఆమె దుఖము మాటలో ఎటుల చెపుదు ??"

""ఎటుల ఓర్తువు , నీ రాధ  దీనత ను   కృష్ణా _!
ఎటుల కరుగ దు నీ కటిన చిత్త మింక _!
ఎటుల దయ జూ తు  వయ్య, మా చెలిని , సఖి నీ_!
కృష్ణ, చిత్తరు వోలె మారిన ఆమె తీరు చూడు _!""

కృష్ణ,నిను  స్మరియించ మీరా బాయి గానూ
కృష్ణ, నిను స్తుతియించ సూర దాసు గాను
కృష్ణ నిను భావించ చైతన్య ప్రభువు గానూ
కృష్ణా, నిను సుంతైన తెలియని అల్ప జీవి నేను _!

ఎంత ఎలుగెత్తి పిలిచిన నను జూతు వయ్య
ఎంత దీనత వేడిన నీవు దయ చేతు వయ్య
ఎంత పాడిన నీ లీల తరుగ దయ్య
ఎంత గోలిన నా మొర ,,నీవు విందు వయ్య"_!

కృష్ణ, నీ ప్రేమలో రాధ ఎంత మురిసే_!?
కృష్ణ, నీ తత్వ మెట్లు గోపికల కెట్లు తెలిసే_!?
కృష్ణ, నీ భక్తి యమునమ్మ ఎట్లు గ్రోలే?
కృష్ణా, నీ చరణ ముల వ్రజ భూ మి  ఎట్లు  ధన్యమయ్యే_!""

లోకములో బాధలన్నీ
యోగము తో నీకు అర్పించిన ,,
వ్యాధులు నిక్కము మాయము _!
కృష్ణా, నీవే దిక్కు అని
గురి ఉంచిన చాలు కృష్ణా _!""

మేము నేర్చితి విద్య లనేక ముగను,_!
మేము ఆర్జించిన ఆర్థిక, సాంకేతికత ను
మేము పొందిన సంస్కార గౌరవముల,,
భక్తి మీరగ నీకనిన ,అవి మాకు శక్తి కృష్ణా__!"

బాధ లేనట్టి మనుజుడు కానరా డు,
బాధ పడువాడు ఎన్నడూ బాగు పడడు
బాధ లేకున్న వాడసలు మనిషి కాడు
బాధ పెట్టుట కృష్ణ,మాకు నీ పరీక్ష కాదా

""నీవు రాధవు కాలేవు , కృష్ణ! ఎపుడు __!""
రాధ హృదయా న గల కృష్ణు ని కదిలించలేవు _!
రాధ నీవుగా , మాధవుడు నేనై,
ఎన్ని వేషాలు మార్చిన , నను గెలవ లేవు కృష్ణా_!""

స్త్రీకి మాత్రమే తెలుసు ఆత్మ సర్పణమ్ము _!!
స్త్రీకి మాత్రమే సాధ్యము , తన విభుని గెలు వ _!
స్త్రీ కి మాత్రమే  సహనము , సహజ గుణము _!
స్త్రీ వి నీవై న గానీ, తెలియదు, ఆమె గొప్ప తనము _!"'

""రాధ హృదయా న , మాధవు డొక డే ఉండు _!
రాధ మనసంత మాధవ మయము  నిజము _!
రాధ డెందము అందము , మాధవుని కొరకే _!
రాధ మాధవుల అనుబంధ మపురూప అద్భుతమ్ము _!!"

దూరము తన తలిదండ్రులు ,
దూరము తోబుట్టు పుట్టి నింటి వారంద రు తగన్ ,
దూరము వారైరి దగ్గర , ఆడ కూతురి విధిలో ,
దూరము దగ్గర చేసిన ,నిను దూరు దునా,కృష్ణా,_!
ప్రేమ కొనియాడు దు నా _!!"

""సుఖమనిన కాదు  ,_ధనము లు _!
_సుఖము లు కావు _మేడ ల్ మిద్దెల్_!
సుఖము తిని తిరుగుట కాదు _!
సుఖ  మనగ నీతో చనుట, సుఖ దాతా , కృష్ణా _!

""కష్టము నిను గని తలచుట__!
_కష్టము నిను విడిచి మనుట _!,కష్టము తలపన్ _!
కష్టము నిను గుర్తెరుగుట_! ఈ కష్టము ఇష్టము చేయుము ,_!
కష్ట నివారణ _!ముగ్ద మోహన  కృష్ణా _!!

వీడు అబద్దాల కోరు,_! వీడి సిగ తరగా !
_ వీడు పుట్టుకతో నే  అబద్ధము  _ తట్టలు తట్టలుగ పలుక పుట్టెను_!
,అది నాలికనా_? తాటి మట్టా_? ఎందుకు వీడికి నోరును ,_ఇస్తివి_?
  ఇది ఏమి ఆటర కృష్ణా ,?

"క్రీ_!" యనుచు ఉచ్వాసము ,
"ష్ణా_!  యనుచు నిశ్వాస ము ,
క్రి__!" యని ఊపిరి పీల్చు చు
"ష్ణా_!" యని బయటకు వదలు చు ,
శ్వా స లో నీ ధ్యాస ను  నిలిపిన ,
సాధ్యము కాదా,నిన్నుపట్ట  ముగ్ధ మోహన కృష్ణా_!""

వెన్న దొంగ వని నిన్నందురు !
నీ హృదయము వెన్న గ, తెలియగలేరు _!
వెన్నవన్నెల చిన్నెల రేడా _!
వెన్న ల వెన్నెల  కన్నా మిన్నా __!
,నీవే , కన్నా,_! నీవే మిన్నా_!"" _!"

విషమును విషమని అందురు ,
విషయము కూడా విషమ ట _!
విషము విషయ వాసన యను
విషయము ఎరిగించ రా దా,  విషయ విహారి _!

పూతన స్తన్యము గ్రోలీ, దాని
పాతకములు   దునిమి  ముక్తి నొసగి తివంట !
ఆ "పూతన "గ  నను పుట్టించుము , _!
_కోపమున నీకు విషము కుడిపి , మరణించుటకున్ _!!"

తెలియదు ఇది నీ మాయ ని_!
తెలియదు  లోకమంత నీ మాయా మయమని_!
తెలియదు నా అజ్ఞానమే మాయనీ _!
తెలియదు నిను మరచుట మాయని _!
తెలుపుము  ఆ  మాయా జ్ఞానము _!
,తెలుపుము ఆ తెర  తొలగు విధానము _!,
తెలుపుము కృప జేసీ,
కృష్ణ,!"మాయా తీతా _!""

తెలియను _ నా  జీవనము ,!
తెలియను_నీ చిత్ర విచిత్ర మాయా మహిమన్ _!
తెలియను _ఇది మాయా జగమని _
తెలియను _  నీవింత గొప్ప మాయావి   వనీ _!
తెలిసీ తెలియని జ్ఞానము ,
నీ మాయే కాద ,?ముగ్ద మోహన కృష్ణ _!"

"జగమే నిత్యము ,_సత్యము_!
"ఈ జగమే బ్రహ్మము ,నాకు పరమ ధామము కూడా _!
జగముల కుక్షిలో ను నుచి_ జగముల నేలె డి  స్వామీ_!"
నీ జగతిలో _నేనేమి టో_!? ఈ జగమెరుగుట  ఎలాగో _?
జగదీశ్వర  ఎరకజేసి  కావర  కృష్ణా _!""

"నా ప్రక్కన ఉందువు కానీ,, నాకు  నీవు కనపడ వు _!
నాతో నే  పని చేయింతువు _ నాకు తెలియకుండ  నీవు _!
నా ప్రతి పనికి సాక్షీగ ఉంటూ, నా పని  పట్టు చుందువు _ కదా _!!
నా కిప్పుడు తెలిసే నూ, నీవెంత వింత  పనివాడవొ కృష్ణా !"

"భాగవతము "వింటే, మనము "బాగవుతము " అని తెలుసు_!
" భాగవతుల" సాంగత్యము _! మనల బాగు చేయు నని తెలుసు _!
ఈ భాగోతము ఏమిటో ? ఈ బాగవుట ఎందుకో_?
బాగుగ నను చేయుట కై_  బాగుగ వివరించు కృష్ణా_!
నేను బాగు పడంగన్_!"

"హరే _!"యనిన తొలగింతువు  పాపము_!
"కృష్ణా _! " అనిన రక్షింతువు  _!
"హరే కృష్ణ" తో  మరి దగ్గరరౌదు వు !
"హరే కృష్ణ,"  పిలుపెంత మధుర మో_?
""హరే కృష్ణ _!"  అని
నిను పిలిచెద కృష్ణా_!""
_!"

""సుఖమనిన కాదు  ,_ధనము లు _!
_సుఖము లు కావు _మేడ ల్ మిద్దెల్_!
సుఖము తిని తిరుగుట కాదు _!
సుఖ  మనగ నీతో చనుట,
సుఖ దాతా , కృష్ణా _!

""కష్టము నిను గని తలచుట__!
_కష్టము నిను విడిచి మనుట _!,కష్టము తలపన్ _!
కష్టము నిను గుర్తెరుగుట_!
_ఈ కష్టము ఇష్టము చేయుము ,_!
కష్ట నివారణ _!ముగ్ద మోహన  కృష్ణా _!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...