Thursday, June 23, 2022

నేను ఇంతే _! నీకోసం మార ను !

June 19, 2022 my ZZ
"" నేను ఇంతే _!""
    నీకోసం మార ను !
     ____&&&&_____
 హే పరమాత్మా _!
నీకు దగ్గర కావాలంటే_
నాది అనేది దూర మవాలి
కదా _!!
 కానీ_ నా _ బుద్ధి తెలిసిన క్షణం నుండి_
నాది _నాది "" అనుకుంటూ అన్నదానికి _ నీ కోసం 
  దూరం చేసుకోలేను __!
 అంత త్యాగం లేదు _!
మనిషి అన్నాక స్వార్థం ఉండక తప్పదు కదా _!
 అందుకే నాది అనే
దాన్ని విడిచి జీవించ లేను_! _!   
ఈ అలవాటు మాను కొలేను _!
నాదన్న దానిని వదలి _!
 క్షణ మైన బతకలేను _!
 నీవు లేకుండ ఉండ గలను_! స్వామీ _!
కానీ 
  నాది అనకుండ ఉండ లేను _!
నిను మరచి ఉంటా నేమో_
గానీ _
నాది విడిచి నిముషం మనలేను _
 ప్రభూ _;!
నా నైజం_ నా మర్మం !ఇది స్వామీ _!
  నాకు నచ్చిన ప్రతి దానిని తాగుతూ
" తాగుబోతు "లా మారాను_!
" రుచి "మరిగిన ప్రతి వంటకము తింటూ ." తిండి బోతు ""నైపోయాను _!
      సంపాదించిన ప్రతి పైసా _
మజా చేస్తూ ఆనందిస్తా _!!
 నా వాళ్ళు _నా కుటుంబం_ నా బంధు మిత్రులతో _ హాయిగా
 సరదాగా కాలం గడుపుతా _! 
నాదన్నది ఏదీ విడిచి పెట్టను _!
ఇంకా ఇంకా ఇంకా పెంచు కుంటా_ !

 ఈ జీవిత మంతా ఇంతే _!
"నాది _ నేను "అనుకో వడమే _!
నా జన్మ ఇచ్చినది నీవే_!
  సంపద తో అందమై న కుటుంబం_ భాగ్యం
 ప్రసాదించింది నీవే _!
  అనుభవించ మని _
   దయతో అందించినది నీవే_!

ఎన్ని ఇచ్చావో స్వామీ నీవూ_!
  నా ఈ జీవితం సరి పోదు_ వివరించ డానికి
 ఆనందించ డానికి_!

బ్రతుకంతా గడుస్తోంది _
ఈ "నాది ""అన్నది చూడటానికి__!
 పోకుండా కాపాడటానికి _!
  వచ్చే తరం కోసం ఆరాటం _!
  కూడ బెట్ట డానికి పోరాటం _!
   బ్రతికేది వారి కోసం _!
  సంపాదన వారి కోసం _!
 కష్ట పడటం వారి కోసం _!
 ఇష్టం లేకున్నా _ గడిపేది వారి కోసం _!
 జీవితమే వారి కోసం _!
నావారు అనుకున్న వారి కోసం !
 నాది అన్న దాని కోసం _!
కానీ _
 ఇంత ఆనంద మిచ్చిన నిన్ను _!
 ఇంత బలగమిచ్చిన నిన్ను! _! 
ఇంతజ్ఞానం _ వయసు వనరులు _ బుద్ధి _ వివేకం విచక్షణ _ తెలివి _ శక్తి ఆరోగ్యం _ఐశ్వర్యం _ గొప్ప దేశం _ కాలం _ 
  ప్రేమ దయ మంచి జన్మ !
అబ్బో _?_
ఎంతని చెప్పేది _ ? ఇంత ఇచ్చిన నిన్ను _
 ఏమని పొగి డే ది ప్రభూ ??_
నిజానికి 
  ఇవన్నీ నీవిచ్చినవి! 
 విచిత్రమైన చిత్తం నాది _;
 "నావి _నాది _నేను '"చేశా ను అంటాను _!
కానీ _ పొరబాటున కూడా_
 "నీ ఊసే _నీ పేరే _నీ జ్ఞాపకమే తల పెట్టను సుమా_!
 ఇదీ నా ఆత్మ కథ_!
ఇదీ నా స్వ గతం _!
ఇదీ నా బ్రతుకు బండారం _!
 తిన్న ఇంటి వాసా ల లెక్క చూసే లెక్క_!
 కనీస కృతజ్ఞత చెప్పకుండా _ దాటేసే తల తిక్క_!
    "నావి ""అన్న వాటికి లేనే లేదు లెక్క_!
 కష్ట మొస్తే నిను తలవడం మాత్రం పక్కా _!
 ఏం చేయను నేను _?
నాది లేకుంటే నేను లేను _!
 నేను అనకుంటే బ్రతుకు లేదు _!
 నేను అనబడే నన్ను _
పుట్టించిన నిన్ను అస్సలు లెక్క చెయ్యను _!
 ఇదీ నా వ్యక్తిత్వం !
_ నా గుణం _! నా ధర్మం _!
 ఉన్న విషయం చెప్పేస్తున్నాను _! 
తప్పో ఒప్పో నాకు తెలియదు _!
నాకంత సీన్ లేదు_!
అన్నీ తెలిసిన సర్వజ్ఞుడ వు నీవు _!
 ఇక దేవర వారి చిత్తం _!
 దరి చేర్చు తావో _ నా
ఖర్మకు ఒదిలే స్తావో _!
   నా బాధ్యత భారం నీదే _!
 నాది అన్నది నీది అనలేని _
దౌర్భాగ్యం నాది _! 
ఏం చేయ మంటావో చెప్పు _?! _!
 యుగ ధర్మ మో _ నా కర్మ ఫలమో _!
   నే నెరుగను _! ఎరు గ లేను కూడా! _దేవాది దేవా _!
నా తత్వం _గుణం ఇక మార దు _!
 పుట్టిన గుణం పుడకల తోనే పోతుందే మో_??

నేను మాత్రం ఇంతే _! నాది అన్నదానినీ విడువను _!
మరవను _!
నీకు జడువను _! వెరవను _!నా బ్రతుకు
 ఇంతే _!
 ఇక అటుపైన నీ చిత్తం _!
నా భాగ్యం _ !పరమాత్మా _!
నిను నిరతము తలచే ఓపిక _ లేవు ప్రభూ_!
అఙ్ఞానం అనుకో _!
నా అసమర్థ త అనుకో_!
కర్మ ఫలం అనుకో_!
నాది అనలేని మూర్ఖత్వం అనుకో _!
ఏమైనా అనుకో _!
అన్నీ తెలిసిన నీకు _
 ఇదంతా చెప్పాలా _?
 హనుమంతుని ముందు కుప్పి గంతులు వేసే
వెఱ్ఱి తనం కాక పోతే _!??
          సెలవు స్వామీ_!
        ___&&&&&&-___"
      హరే కృష్ణ హరే కృష్ణా

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...