Thursday, June 23, 2022

ఎక్కడే గోవిందుడు ?

Oct 20, 2020
గోవిందం పరమానందం_!" _!"__&-&&______
 ఎక్కడే గోవిందుడు ?
 పెట్టుకోవే వదినా వాడిని ,_!
దొరక బట్టు_! పారి పోకుండా _!__ చూడవే ,
  ఎక్కడే వాడు ,? ఎటు పోయాడు ? నీవు గానీ చూశావా ,? వదినా _!"'
 ""ఎవరూ వాడు ? వదినా ?
 ""వాడే నే ఆ ,నల్లవాడు ,_!
 ""కృష్ణుడా ? 
""అవును ,_! వాడే _!తానే వచ్చాడు ,_! పిలవని పేరంటం గా _ పొద్దున్నే _! మా ఇంటికి _! అయినా , వదినా ,,
ఎంత మాయలో డే గోవిందుడు _?? 
ఏమన్నాడు ? ఏం చేశాడు _? ఎందుకు వచ్చాడట _??
 అదే , వదినా _!
 ""వెన్న కావాలా _?!' అడిగాను ,
  అవును ,వచ్చింది అందుకోసమే గదా, __! ఇంతకూ ,నీవు తయారు చేసి పెట్టావా ,,లేదా __??""
అంటూ దబాయిస్తు_ నన్ను తోసుకుంటూ లోనికి వెళ్ళాడు _!
 చూస్తే _ చిత్రం _! దొరక్కుండా దాచిన , వెన్న వాడికి దొరకనే , దొరికిం ది_!!""
 __అయ్యో _! దొరక్కుండా దాచలే క పోయావా?"
 దాచా నే ,వాడు అడిగితే బతిమాలితే గానీ ,ఇవ్వ వద్దనీ _!
కానీ , వదినా _!
  వాడికి వెన్న ఎక్కడ దాచినా కూడా , దొరికించుకునే ప్రజ్ఞ ,, పుట్టుక తోనే ఉన్నట్టు ఉంది, __ సుమా __!!చీమలకు తీపి జ్ఞానం ఉన్నట్టు__!""
 ""పట్టుకోలేక పోయావా,_?!
  పట్టి , ఆ నంద రాణీ కి చూపే అవకాశం మనకు ఉంది కదా __!!"
 అయ్యో వదినా _! నేను అదే పని చేశాను,_!! కానీ ,వాడి , రెండు చేతులూ పట్టగానే , ,అందమైన ఆ ముద్దు నవ్వు మోమును చూస్తుంటే ,, నాకు ఎందుకో కృష్ణుని బుగ్గల పై ముద్దు పెట్టాలని , అనిపించింది _!
  ఏమైంది _! మరి _?" చెప్పు _!
 ""ప్రేమతో దగ్గరకు తీసుకున్నా __!""
  "" ఇంకేం ,,? నీ పట్టు విడిపించు కొని పారి పోయాడు ,,అవునా __??
  అయ్యో లేదే ,,,_! వాడికి భయ మెక్కడే _?? తన స్వంత ఇంటిలో కూడా అంత ధీమాగా ఉండ డేమో వదినా _??""
నేను ఆ చిన్ని కృష్ణయ్య నగుమోము నీల మేఘ శ్యామ సుందర రూపం చూస్తూ_ ఆ ముద్దు పెట్టడం కూడా , , మరచి పోయానమ్మ _!! నిజం ,ఒట్టేసి చెబుతున్నా ,,
సుమా_!
   ,"" సరే ,ఏం జరిగింది ,? నువు పిచ్చిదానిలా చూస్తూ కూర్చుం టె ,,_ ఆ గోవిందుడు కుండతో సహా ఉడాయించాడు__ అంతే కదా__!!
 ",లేదే , _ లేదు,వాడు నన్నే పట్టుకున్నాడు తన చిట్టి చిట్టి చేతులతో__!
," ఒకసారి ఎత్తుకోవా నన్ను ? అన్నాడు 
""ఎందుకంట ? ఎత్తు కోడం _??
 ""అదే అన్నాను __!
""నేను కనిపించిన పుడల్లా,పట్టుకొని , మీరంతా ,ఈ ముద్దుల నెపంతో,
 ఇలా నా లేత బుగ్గలు విడవకుండా కొరుకుతూ ఉంటే ,నాకు మాత్రం నా చెక్కిళ్ళు నొప్పి పెట్టవా__ చెప్పు _?!"అని. కోపంతో
అన్నాడు 
   ""అయ్యో , పాపం ,_! ఎంత నొచ్చిందో కదా నా కన్నయ్యకు __?? ఎంత మొరటు దాని వే __?!అంత గట్టిగా కొరికావా వదినా,,__??
అవి కన్నయ్య చెంపలు అనుకున్నావా , నీవు చేసిన నేతి బూరెలు అనుకున్నావా ,? పాపిష్టి దానా ??"" 
ఇంతకూ,
  ఏమైంది , ?? గోవిందుడి కి వెన్న పూశావా ,,లేదా ,,_?? ఎర్రగా వాడి కంది పోయిన బుగ్గలకు ?""
   "పూ స్తా _!_ మెల్లిగా రాస్తా ! నొప్పి పెట్టకుండా __!""అన్నాను , 
_" ఏం అవసరం లేదు,, కానీ నన్ను ఎత్తు కో_! చాలు ,_;అన్నాడు _!
అదిగో మళ్లీ అదే పాట __?
 __తర్వాత _ ఏమైంది __?!
 ""నిజానికి _ మొదట ఆ గోవిందుని చూడగానే , నేనే ఆ పని చేయాలి, అనుకున్నాను , __!
కానీ మనసులో ,అనుకున్నది ,ఎంతో ఆనందంతో ,__!
 నా తపన తనకెలా తెలిసిందో ?__ కదా _!!"
 ""అబ్బ , చంపకే తల్లీ ,_! చెప్పిందే చెప్పి _!
 చెప్పు నీవెం చేశావు ? తానేం చేశాడు ,!_??
 ""ఏముంది ,_! వాడు నేను అనుకు న్నంత పని చేశా డమ్మా__!""
""అంటే?
 "" చంకలో కి రాకుండా , నా ,భుజాలపై ఎక్కాడు ,!
  ""అదేంటి ,? అదేం పని?"" 
 ""చల్ చల్ గుర్రం చలాకి గుఱ్ఱం _!""
అంటూ , నవ్వుతూ నను నవ్విస్తూ ,నాతో ఇల్లంతా పరుగులు పెట్టించాడు __!
  ""అంతే కదా , _! అదృష్టం అంటేనే నీది వదినా,"__! ఆహా __;,నాకెప్పుడూ ఈ భాగ్యం ఇస్తాడో కదా ఆ అందాల కృష్ణయ్య _??""__
 ""అయ్యో _ అయిపోలేదు ,ఇక్కడికి__!! దానితో నన్ను వాడు విడిచి పెట్టలేదు వదినా _!
 ""ఇంకా ఏం చేయమన్నాడు __?!
  ""నేను మోకాళ్ళ మీద వంగి , నేల పై పాకుతూ ఉంటే ,తాను నడుముపై కూర్చుండి నవ్వుతూ, కమ్మ గా , వెన్న తింటూ అన్నాడు కదా __
""ఈ ,,గుర్రం చాలా మంచిది , _! చక్కగా చెప్పినట్టు వింటుంది ,__! బుద్ది మంతురాలు__!!
 ,అంటూ, నవ్వుకుంటూ , తన కాళ్ళతో , నా నడుం పై ,,ఎడా పెడా తన్నుతూ , నిజంగా గుఱ్ఱం లా నే నన్ను అదిలిస్తూ స్వారీ చేయసాగా డు _!_!
చూశావా _! గోవిందుడు ఎంత ట క్కరి వాడో,_?
నీ ఇంట్లోనే తింటూ నిన్నే ఆడిస్తూ ,తాను ఎంత ఆనందం పొందాడో__??
నేను అనుకున్నంతా అయ్యింది సుమా __!!
  ""నీవు అనుకున్నది ఏమిటి__?? ,అయ్యింది ఏమిటీ__??" చెప్ప వమ్మ ఊరించక __??""
"" , వామ్మో __!
వాడు పిల్లాడు కాద మ్మో __!! పిడుగు _సుమా ,_!"" "" గుఱ్ఱం ఆట తనకు తమాషా నే ,, కానీ ,నీ ఒళ్ళు మాత్రం హూనం చేశాడు ,పాపం అవునా__? 
  "" లేదే _ లేదు , అలా ఎం కాలేదు ,తానే కిందకు దిగిపోయాడు __!
  పైగా తానే అన్నాడు కదా నవ్వుతూ ,,__!
"" పాపం నా చెక్కిళ్ళ వలె ,,నీ లేత నడుము కూడా నొప్పి పెట్టిందా _? గోపికా ,, నా చేతితో రాయనా ? మెల్లిగా ,__??"
అంటూ నన్ను బుజ్జగిస్తూ అడిగాడు ,
 ""ఎన్ని నాటకాలే ,_? ఎంత గడుసు తన మే ఈ గోవిందుడి కి __??
ఎంత బుకాయింపు ,_? ""పాపం __! నీవు మాత్రం వాడి మాటల గారడీ బుట్టలో పడిపోయావు కదా __!
 ఎందుకే ,వాడిని చూస్తే అంత ఆనందం __??
  ఎంత అమాయకు రాలివే వదినా , __??
 ఇంతకూ ఏమన్నావు ,__? అది చెప్పు __?? 
" చిట్టి కృష్ణయ్య తన మెత్తని వెన్న చేతుల తో రాశాడా , లేదా?""
""లేదు ,, వాడికి అంత కష్టం కలు గిస్తానా చెప్పు _?? వాడి బాధ నేను చూడ గలనా ___?!
  "" వదినా __! ఈ గోవిందుడు ,నా కడుపులో ఎందుకు పుట్టలేదు__?? అనిపిస్తుంది నాకు _!
 ""నీకేమి టీ వదినా __అందరి పరిస్తితి అంతే __! కదా __!
"",గోవిందం_ 
పరమానందం,_!"" "కృష్ణయ్య ఎవరినీ ఏడిపించ డు ,__!
పైగా ,తనని ఇష్టపడ్డ వారికి అపరిమిత ఆనందాన్ని , అందిస్తూ , ,ఉంటాడు కదా __! , ఈ కృష్ణ తత్వం నీకు ఇప్పుడు అనుభవంతో తెలిసి వచ్చి ఉంటుంది కదా వదినా __!
""నిజమే ,, ఆ నల్లనయ్య రూపం ,నవనీతం లాంటి అమృత హస్తం తాకిన స్పర్శ ,చల్లని చూపు లో ఏం మహత్తు ఉందో కానీ,
మన సర్వస్వం కోల్పోతాం,,_!
 ఇక మనదే మీ ఉండదు ,
వాడు ఏం చెబితే అదే అలా చేస్తూ పోతూ ఉంటాం __! అంతే నమ్మా __! అందమంటే వాడే ,_ గోవిందా రూపమే ,__! ఆనంద మంటే _వాడిని చూడటం ,, తలచడమే కదా_!
""అయ్యో మళ్లీ__,, నీవు ఆ కృష్ణ లోకంలో కి వెళ్తూ ఉన్నావు కదా __!!"'
""ఏమైంది చివరకు , ?"" మరి __??""
""ఒక్కసారి వాడి చేతికి చిక్కాక ఎవరినైనా ,కూడా ,,అంత సులభంగా , వదల డే వాడు , _? 
 ఆ పట్టు విడవడం అంటే గోవిందుడు కనపడకుండా పోవడం _!!
 ""అయినా ,నిన్నెలా వదిలాడు ? నీవు ఏదో దాస్తున్నావు కదా _?""
 
"" అయ్యో ,__! అంత 
 నాకు అంత దాపరికం ఉంటే ,, నేను ఇదంతా నీకు,,నేనే పిలిచి చెబుతా నా ,,, చెప్పు వదినా ?"'
 "" సరే సరే _!!చెప్పు _చెప్పు __!!తొందరగా ,__!!ఊరించి ఊరిం చి,,__! అసలు ఆ కృష్ణయ్య, నిన్ను ఏం చేసి వెళ్ళాడో__? ఏం జరిగిందో , అది చెప్పకుండా , నన్ను ,చంపుతున్నా వు కదా వదినా__! 
__ కానివ్వు ,చెప్పు ,_!!"
  "'నేను వాడిని దగ్గరకు తీసుకున్నట్టు గానే , ఇపుడు ఆ గోవిందక్రిష్ణుడు కూడా ,నన్ను తన రెండు చేతులతో గట్టిగా నా రెండు భుజాల చుట్టూ బిగించి కౌగలించుకొని , అన్నాడు కదా __!
 "'గోపికా ,
అమ్మా __!నీకు ముద్దు పెట్టనా_!!?"'
 అంటూ గోముగా అడిగా డ మ్మా నన్ను _!!""
""ఆహా_ ఆహా _! ఏమి భాగ్యమే నీది వదినా__! అదృష్టం తనకు తానై , ఈ గోవిందుని దివ్య మంగళరూపంలో _నీ ముంగిట కు వచ్చి _ నిన్ను చేరింది కదా __!"
'" అంతకన్నా నా __! నా కన్నా ,__! నా కుమారా _;నా పూర్వ జన్మల పుణ్యాల ఫలమా ,__! నీ లేత లేత పెదాలతో , పెట్టరా ముద్దు , _! ఒకటి కాదు __! నీ ఇష్టం గోవిందా _! ఎన్నైనా పెట్టుకో,_! 
 నొవ్వ నీ నా చెక్కిళ్ళు , ఎర్రగా కానీ నా ఈ బుగ్గలు __!! భక్త జన హృద యాంత రంగ ,_!హే గోవిందా _! ఈ అమ్మ కాని అమ్మ , గోపెమ్మ. అంటే ,నీకు ఎంత ప్రేమ రా __?? ఆహా , కృష్ణా , రా ,_! నా జీవ మా ,నా ప్రాణమా ,__! ""
అంటు ఆ నీల మేఘ శ్యామ సుందర గోవిందుని గట్టిగా హృదయానికి హత్తు కొని కళ్ళు మూసుకొని గోవిందుని పరమానంద రూపాన్ని అంతరంగం ఆనందిస్తూ అలా ఎంతసేపు ఉండి పోయానో నాకే తెలీదు వదినా _!
 నిజంగా , నా కొడుకు రూపంలో కనిపిస్తూ ,నన్ను మురిపిస్తూ ,వచ్చి ఈ కృష్ణుడు నాకు ఎన్ని ముద్దులు పెట్టాడూ__ అంటే ,__!!?
ఇదిగో ఇంకా ఆ నొప్పి పోవడం లేదు ,చూడు __! వదినా __!
ఈ బాల కృష్ణుడు , ఈ నంద గోపాలుడు ,మన గోవిందుడు ఎంత దూర్తుడో చూస్తున్నావు కదా ,__!?""
 చూస్తున్నా చూస్తున్నా ,చూడక ,నేను మాత్రం ఏం చేయ గలను చెప్పు __?
 __" కృష్ణుడు వెళ్ళి పోయినా కూడా వాడు ఇంకా నీ చెంతనే ఉన్నట్టు__ వాడు నీకు ఇంకా ముద్దులు పెడుతూ వున్నట్టు _! మురిసి మురిసి పోతున్నావు కదే , వదినా _
   "ఓరి నీ సిగ్గు బంగారం __కానూ __! 
గోవిందుడు లేడే ,ఇక్కడ _! ఎందుకంత పరవశము __? బహుశా దూరాడేమో నీ గుండెల్లో ,,_ నీకు తెలియ కుండా __!
 వాడికి తెలియని విద్య ఉంటుందా _?
గోవిందా _?
ఇంతకూ అసలు ఎవరు నీవూ ,? 
 ఈ పిచ్చి దాన్ని నీ కృష్ణ ప్రేమ అనే మాయ నుండి బయట పడగొట్ట కుండా ఇలా దానితో ఆడుకుంటే , ఇది నీకు తగునా ,_?
చెప్పు _!
నీవు చేసిన బొమ్మల తో నీకే వినోద మా _!
మా ఆనందమే నీకు పరమా నందమా ??
 గోవిందా _! 
 వదినా వదినా _! ఇటు చూడు ,నేను _!
  కళ్ళు తెరచి చూడు , నన్ను _! 
ఎందుకే మనకింతా. వాడి తలపు లోనే ఆనంద మూ?   
 ఎంత గట్టిగా పిలిచినా గోవిందుని దివ్య మంగళ రూప సందర్శన పులకింత నుండి తేరు కొలేకుం డా ఉన్నావు _! మరీ
ఇంత పరవశమా _!
 "" ఆహా _! వదినా ,_; ఏమి నీ భాగ్యం _!
జీవన్ముక్తి అంటే ఇదే_! ఈ సమాధి స్థితి యే కదా ,_!
కృష్ణ ప్రేమ , కృష్ణ కృప, గోవిందుని లీల తలచు కుంటు ఉంటే నే , ఒళ్ళు జలదరిస్తుంది __!;
ఆ భావమే ఆ తేజమే అద్భుతం _!
 ఎంత మహా భాగ్యం తల్లీ ,_నీది _??
 _ నిజంగా , ఈ రోజు నీ అదృష్టం పండింది , కదా _!!
ఇలా ఎవ రు ,ఎంత గా ,, ప్రేమతో ,గోవిందుని ,,అరాదన చేస్తూ __ జపిస్తూ , స్మరిస్తూ ,తపిస్తూ సాధన చేస్తూ ఉంటారో , వారికి _ అంతగ సత్వరంగా ""_ శ్రీ కృష్ణానుగ్రహం """, ప్రాప్తిస్తు ఉంటుంది _!
 కదా ,__!
అని నిన్ను చూస్తేనే తెలుస్తోంది వదినా ,__!!
 __ఆహా , తెరిచేవా కళ్ళు _!
 ఏమైంది వదినా నీకు _??
 ఏం చెప్పను ?
ఎలా చెప్పను ?! వదినా _!
  " అప్పుడు కన్నయ్య ముద్దు ల గోవిందుడు నా బుగ్గల పై , ముద్దు ముద్దు గా ముద్దు లు పెడుతున్నప్పుడు ,
నేను పొందిన "ఆ కృష్ణ సందర్శన ఆనంద పారవశ్య వైభవం లో మునిగి పోయిన నేను__ తీరా ,, ,కళ్ళు తెరచి చూసేసరికి ఆ 
  గోవిందుడు లేడు,_!
గోపాలుడు లేడు __! ""వాడూ లేడు __!
"" వాడి వెన్న కుండా లేదు ,_;!కదా _!
 ,""కానీ వదినా ,_!
. నా జీవితాంతం మరచి పోలేని మధురాతి మధురమైన కృష్ణ లీలా అనుభూతి మాత్రం___ నా హృదయంలో గోవింద రూపం లో ,,నిక్షిప్తం చేస్తూ , వెళ్లిపోయా వు. కదా ,_! గోవిందా _!"
ధన్యనైతి కృష్ణా _!
శరణు _!
____
 ఆహా _! గోవిందా _! నిజంగా _ _ 
గోవిందం పరమానందం,_!
 గోవిందా అంటే చాలు , _ జన్మ సార్థకం అవును _!
 గోవిందం సాకారం _! 
 గోవిందం గుణా కారం _!!
గోవిందం నిర్గుణ ము _! గోవిందం నిరాకా రం _!!
 గోవిందం భువనాకారం _!,
గోవిందం జగన్మోహనం __!
గోవిందం __! 
గోవిందం _!
మాయా కల్పిత నానాకారం _!_
_____&_
""భజ గోవిందం , భజ గోవిందం ,!
గోవిందం భజ మూఢ మతే_!
 _! ఇహ సంసారే , బహు దుస్తారే_ __!
కృపయా పారే__; పాహి మురారే _!
భజ గోవిందం _!
_____-____
__ సర్వం శ్రీకృష్ణ భగవానుని సుందర దివ్య మంగళ చరణార విందార్పన మస్తు_!!""
 సర్వే జనాః సుఖినోభవంతు _!
__"సమస్త సన్ మంగళా నీ భవంతు _!
 _! సర్వే భద్రా ని పశ్యం తు_!""
     ఓమ్ శాంతి శాంతి శాంతిః_!
     స్వస్తి _!!"
 హరే కృష్ణ హరే కృష్ణా __!!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...