Thursday, May 19, 2016

భగవంతుని శరణుకి ఆరు నియమాలు

మనం భగవంతునికి శరణు వేడుకోడానికి ఆరు నియమాలు ఉన్నాయి -
1- భగవంతుని శాసనం -మేరకు మన పనులు -కర్మలు పరిమితం కావాలి !--మనం ఆయన సేవకులం మాత్రమే --ఆయన మనకు ప్రభువు !-సేవకుని విధి యజమాని ఆజ్ఞలను పాటించడమే !- కష్టం అయినా -సుఖం అయినా - భగవంతుని లీలగా -అనుగ్రహంగా -ప్రసాదంగా స్వీకరించడం చేయాలి - ఒక ఎండిన ఆకు గాలి వీచడం వలన క్రింద పడినా -తనను తిరిగి చెట్టు కొమ్మ పైకి చేర్చ మని అడగదు - అలాగే భగవంతుని విధివిధానంలో ఎలా జరిగినా సంతోషం -సంతృప్తి పొందాలి ! శరణు కోరడం అంటే ఇదే ! 
2--భగవంతుడు ఇచ్చిన దానితో మనం త్రుప్తి పడాలి -అది మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా భావించాలి --ఎంత ఇవ్వాలో-ఎప్పుడు -ఎలా ఇవ్వాలో అతడికి తెలుసు -మనకున్న సంపద -ఐశ్వర్యం -కేర్తి వినోదం -సుఖాలు భగవద్ అనుగ్రహాలు -అది గుర్తించ కుండా ఏ కొంచెం కష్టం కలిగినా "-నాకే ఈ కష్టం భగవంతుడు ఎందుకు కలిగించాలి ?"అని నిందిస్తూ ఉంటారు -జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు సంభవించినా భగవంతున్ని తప్పు పట్టడం -మనం చేసే మరొక తప్పు 1 అతని ప్రేమ అందరికి సమానమే !అందరు అతని పిల్లలే -అందులో హెచ్చు తగ్గులు ఏ కన్నతండ్రి అయినా చూపిస్తాడా ! అలా భావించి పరమాత్ముని మనసారా శరణు వేడాలి 1
3- మనలను అన్ని విపత్తులలో రక్షిస్తాడని -భగవంతుని పై నమ్మకం లేకపోవడం -మన యుక్తులే మనకు రక్షణ అనుకోవడం మన అజ్ఞానం !-పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టం ! అతడు మనకు శాశ్వతంగా జన్మ జన్మలకు తండ్రి! -ఈ సృష్టిలో సకల జీవరాసులను సదా సంరక్షిస్తుంటాడు -కోట్ల కొలది చీమలకు ఆహారం అవసరం -- అందులో వేల చీమలు ఆహారం లేకుండా చనిపోతూ ఉండటం మనం గమనించామా !అలాగే ఏనుగులకు పెద్ద మొత్తంలో ఆహారం తింటాయి ప్రతి రోజు -వాటికి కూడా భగవంతుడు తగిన విధంగా సమకూరుస్తాడు -ఒక తండ్రి తమ సంతానాన్ని ఎంతో ప్రయాసపడి వారికి కూడు -గుడ్డా -గూడు - సమకూర్చి పోషిస్తాడు-కదా !జగత్తును శాసించే వాడు -పాలించేవాడు తన బిడ్డలను పోషించకుండా ఉంటాడా !అతని రక్షణలో మనం సురక్షితంగా ఉండగలమని విశ్వాసం కలిగి ఉండటం కూడా శరణాగతి అవుతుంది 
4- కన్నతండ్రి పట్ల కుమారునికి వినయ విధేయతలు ఉండాలి -అలా కాకుండా -"అతని తండ్రి అతన్ని పోషించాడు -అలాగే నన్ను మా తండ్రి పోషించాలి -"అని కృతజ్ఞతా భావం లేకుండా ఉండటం -తప్పు కదా ! అలాగే -జగద్రక్షకుడు - పోషణ కర్త -పరమాత్మునికి మనం కృతజ్ఞత చూపక పోవడం కూడా అజ్ఞానం -అవివేకం -అపరాధం అవుతుంది 1 కర్త -కర్మ క్రియ అన్నీ నీవే స్వామీ 1అన్న భావంతో శరణు కోరాలి 1 
5-మన సంపద బంధువులు వనరులు -అన్నీ మనకు భగవంతుడు అనుగ్రహించినవే -మనం జన్మించడానికి ముందు ఉన్నాయి -చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి -అందువల్ల అన్నింటికీ నిజమైన యజమాని భగవంతుడు మాత్రమే- అందులో కొన్ని మనవి అనుకుంటే తప్పు !-ఇతరుల ఇంటిలో జొరబడి అతని అనుమతి లేకుండా -అతని దుస్తులు -ఆహారం- పడక వాడుకోవడం లాంటిద్ ఇవన్నీ మనవి అనుకోవడం 1అందుచేత జగత్తులో ఉన్నప్రతీదీ భగవంతుని వస్తువే అనుకోవడం -అలా భావించడం కూడా శరణా గతి 1
6-మనం చసిన మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం -కూడా తప్పే !"-భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు !"-అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది - అతడి మనం ఒక పరికరాలం మాత్రమే !- శివుని ఆజ్ఞలేనిదీ చీమ అయినా కుట్టదు -అలాగే మనం చేసే కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని --"నేను చేశాను !- నా వల్లే ఇది జరిగింది! - నేను గొప్పవాడిని !"- - ఇలాంటి భావాలు అహంకారాన్ని -అహం పెంచుతాయి -ఫలితంగా భగవంతుని దయకు -కరుణకు -దూరం అవుతాం -
" అన్యధా శరణం నాస్తి ! త్వమేవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన రక్ష -రక్ష- పరమేశ్వర ! " అంటూ మన విధిని మనం సక్రమంగా నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించకుండా పరమేశ్వరార్పణం గా చేస్తూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ సాగి పోవడమే జన్మకు సార్థకత -ఇదే నిజమైన సిసలైన శరణాగతి !

NOV 23, 2015

చెన్నై కన్నీరు

కన్నీరు మున్నీరైన - చెన్నైమహానగరం --!- ఆపదనుండి కాపాడమని 
-ఆపన్న హస్తాలు అందించ మని -దీననగా విలపిస్తున్న చెన్నైజనం --!
హరి నామం జపించే పెదవుల కన్నా -ఆర్తులకు సాయం చేసే చేతులే మిన్న 1
మానవ సేవయే మాధవ సేవ 1 మానవత ఉన్న ప్రతి మనిషి దేవుడే 1
సాటివారి పట్ల సానుభూతి చూపి సాయం అందించిన హృదయం ఒక -దేవాలయమే కదా 1
అవి వరదలు కావు 1 కన్నీటి వరదలు 1-చెన్నై ప్రజల ఇళ్ళు -కష్టాల లోగిళ్ళు 1
ప్రక్కలో బల్లెం -లా బంగాళా ఖాతం - మహా సముద్రం 1 భయంకర జల గండం1
సునామీలు -అల్ప పీడన విపత్తులు -అకాల వర్షాలు -అరిష్టాలు అనర్థాలు !
ఈ మహానగరానికి ఎప్పుడూ పొంచి ఉన్న ప్రమాదాలే 1 అంతులేని నష్టాలే 1
చెరువులు - డ్రైనేజీ లు - త్రాగు నీరు అన్నీ ఒకటై కాలువలై -
కట్టలు తెంచుకుని పొంగి పొర్లు తున్నాయి1 ఇళ్ళన్నీ జలమయ మయ్యాయి 1
సామాన్యుడి బ్రతుకును -చిన్నా భిన్నం చేశాయి 1
మనుషులు -ముగ జీవాలు రిక్షాలు -కార్లు -సైకిళ్ళు --
ఇళ్లలో దాచుకున్న - పెట్టె బేడా అన్నీ నీటి పాలయ్యాయి 1
తినడానికి తిండీ -నిలడానికి నేలా -పాడుకోడానికి స్థలము -కరువైనాయి 1
సామాన్యుడికీ -శ్రేమంతునికీ -ఒకే ప్లాట్ ఫారం 1 ప్రక్క బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ !
ఈ మాత్రం తల దాచుకోడానికి -భద్రత కరువైన వారు ఎందరు "బలి అయ్యారో కదా 1
"-ఏమౌతుందో 1" అన్న భయం -ఆందోళనలతో -క్షణం -క్షణం' వణకిపోయారు -1
దైవ బలం కరువైతే -మనిషి కైనా -జంతువుకైనా-మనుగడ కష్టం -కదా 1
ప్రభుత్వాలెన్ని మారినా -ప్రజల అగచాట్లు -తల రాతలు మారవు కదా 1
విజ్ఞానం ఎంత పెరిగినా- విధి నిర్ణయానికి ఎదురు ఏముంటుంది ?
ప్రకృతి భీభత్సం ముందు -మానవ సంకల్పం తల వంచాల్సిందే కదా 1
ఎన్నాళ్ళు పట్టాలి 1 ఈ దుర్గతి - దుస్థితి నుండి కోలు కోడానికి --?
గతం లో ఇలాంటి ఉపద్రవాలు - జల ప్రళయాలు -ఎన్నో వచ్చాయి -
ఇలాగే జనాలు మృత్యు వాత పడ్డారు -నానా అగచాట్లు అనుభవించారు 1
అకాల వర్షాలకి -బంగాళా ఖాతం తుఫానులకీ -మన ఈ చెన్నైమహానగరం -
అల్లల్లాడి పోయింది !-ప్రజా జీవనం పూర్తిగా స్తంభించి పోయింది 1
గతం లో తాకిన దెబ్బను -మరచి పోయేలోగానే- మరో పెద్ద దెబ్బ 1
"ఓ దైవమా 1 మమ్ము సదా పోషించి రక్షించే నేవే" దయ్యమై" కబళిస్తే-
ఇంకా దిక్కెవ్వరు ? నీవు వినా దీనులను -ఆర్తులను కాపాడే స్వామి ఎవరు ?
ఆర్త జనావళి దీనాలాపాలు విన రావడం లేదా ? భగవాన్ !
ఇక నైనా కనికరించు ! ప్రమాదం లో ఉన్న ప్రాణి కోటికి ప్రమోదాన్ని కలిగించు -!
ఇలాంటి విపత్తులు రాకుండా కాపాడు మము గన్నతండ్రీ !"


Dec 8, 2015

siya ke ram

siya ke ram -- tv episode - star plus లో ప్రతి రోజు 8 am --8 pm వస్తోంది - రామాయణం లోని మనకు తెలీని చాలా విషయాలు కళ్ళకు కట్టినట్లు రసవత్తరంగా చూపిస్తున్నారు ముఖ్యంగా సీత పాత్రను ఎంతో గొప్ప సంస్కార వంతంగా -రాముని ఉత్తమ గుణాలకు తగినట్లుగా వీరోచితంగా - ఉన్నతంగా ఉన్నాయి -రాజు మరియు ఋషి అయిన జనకుని రాజ్య పాలన పరశురాముడు కూడా మెచ్చుకుంటాడు -"ఇలాంటి రాజు siya ke లూ ఆర్యావర్తంలో ఉంటె జనం క్షేమంగా -రాజ్యం సుభిక్షంగా ఉంటుంది "అని మెచ్చుకుంటాడు - సర్వ సంగ పరిత్యాగి జనకుని పాలన ప్రజా రంజకంగా ఉంటుంది -నిరంతరం ధర్మ నిరత తో నిరాడంబరంగా స్త్రీల పట్ల కారుణ్య భావం తో ఉంటాడు -నిత్యం అలంకార ఆడంబరాలు బహు భార్యా విధేయుడు - రాగద్వేషాల మధ్య ఎప్పుడు అయోమయంలో పడిపోయే దశరథునికి - రుషి లాంటి జనక మహారాజుకు భేదం చక్కగా కనబడుతుంది
పాత్ర దారులు వారి హావ భావాలు - చక్కని సంభాషణలు - దృశ్యాలు - సెట్టింగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి - మనకు తెలిసిన రామాయణం వలే కాకుండా కొన్ని అద్భుత సన్నివేషాలు -సంఘటనలు మనకు తెలుస్తున్నాయి -పంచదార చిలుకను ఎటు రుచి చూసినా తియ్యగా ఉన్నట్లు ఒక కొత్త తరహా లో వైవిధ్యంగా సీతా రాముల గాథను రోజూ దర్శించడం ఎంతో ఆనందంగా ఉంటోంది - -



గతం చాలా గొప్పది-- సమయం ఇంకా చాలా గొప్పది

"ఇప్పుడు అనుకొంటే ఏం లాభం !"
నిజానికి గతం చాలా గొప్పది-- సమయం ఇంకా చాలా గొప్పది - దానిపైనే మన భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది -ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది -- అది తానే స్వయంగా రాసుకుంటాడు -కాలం క్రమంగా తెలీకుండా గడిచి పోతోంది -ఒక్కొక్క మధుర క్షణం -విలువైన కాలం -తిరిగి మనకు ఎత్తి పరిస్థితిలోను దొరకని అమృత ఘడియలు -మన ఆయువు -మెల్లిగా మన చేయి జారిపోతోంది -
అందుచేత కాలం విలువ గుర్తించి -మనం జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించు కోవాలి -గడచిన మన గతం -మన పూర్వీకుల గతం దృష్టిలో ఉంచుకొని -మనిషిలా బ్రతకాలి -దేవుడిచ్చిన మానవ జేవితాన్ని మేధస్సును - మన సక్రమ జీవన విధానానికి -చుట్టూ ఉన్నవారి శ్రేయస్సుకు - ధార్మిక ఆధ్యాత్మిక విషయాలకు కేటాయిస్తూ -ఇహం తో బాటు పరాన్ని కూడా గుర్తిస్తూ బ్రతకడం నేర్చుకోవాలి -
మనిషి కూడా జంతువే -ఒక్క మేధస్సు విషయంలో తప్ప! దానితో తనలో ఉన్న అహంకారం - అనవసర కోపం -అలసత్వం ---ద్వేషం -భగవంతుడు ప్రసాదించిన అందమైన ప్రకృతి -అనుబంధాలు -అనురాగాలు ప్రేమా -సానుభూతి అనబడే మానవ సంబంధ మైన నైతిక విలువలు గుర్తించకుండా -యాంత్రికంగా -బాహ్య ఆడంబరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ఆత్మ శోధన లేకుండా నడుచుకోవడం - మన చరిత్రను వక్రమార్గంలో రాసుకుంటూ ఉన్నామని గుర్తు చేసు కోవాలి --
పెద్దతనం వచ్చాక " అయ్యో ! అలా చేయ లేక పోయామే ! అనవసరంగా కాలాన్ని వ్యర్థం చేసుకున్నామే ! ఎంత పని జరిగింది ! ఇప్పుడు ఎం చేద్దాం ! ఎందుకు ఇలా చేశాం ! ఎం చేస్తే అది బాగు పడుతుంది --" ! ఇలాంటి మనోవ్యధతో భవిష్యత్తులో బాధ పడకుండా చక్కగా వర్తమానాన్ని సమర్థవంతంగా మనతో బాటు మన అందరి శ్రేయస్సుకు ఉపయోగ పడేలా కృషి చేద్దాం !
అట్టి స్పూర్తి నీ -పరిజ్ఞానాన్నీ -సమయాన్నీ -సంకల్పాన్నీ -బలాన్నీ ప్రసాదించ మనీ భగవంతున్నికోరుకుందాం !
" సర్వే జనాః స్సుఖినో భవంతు ! సమస్త సన్మంగళాని -భవంతు ! సర్వే భద్రాణి పశ్యంతు !"
ఓం శాంతి 1 శాంతి ! శాంతి :;!


Dec 9, 2015

నీది కానిదేది లేదు నాలో --నిజానికి నేనున్నది నీలో

నీది కానిదేది లేదు నాలో --నిజానికి నేనున్నది నీలో --"
అన్న భావ కవిత మాదిరి -నిజానికి మనం అంతా ఆ పరమాత్ముని కను సన్నల పైన ఆధారపడి ఉన్నాం -- మన" జీవితం "అనే మోటార్ రిమోట్ తన చేతుల్లో ఉంచుకొని మనల్నిఒక ఆట ఆడిస్తూ ఉన్నాడు - మన ఈ శరీరం -పైన ఆకారం -అన్నీ అతని ప్రసాధమే - చుట్టూ ప్రకృతి -పరిసరాలు - బంధువులు స్నేహితులు సంపదలు ఇండ్లూ -రాష్ట్రము -దేశము -అన్నీ అతడు కల్పించినవే - ఏ ఒక్కటీ మనము తయారు చేయలేదు - తేలేదు - మన శరీరం లోని అవయవాలు ఏవీ మనం చెప్పినట్టు వినవు - ఎప్పుడు - ఎక్కడ ఎలా -ఎవరికీ -పుట్టాలో -మనకు తెలియదు ---చివరకు శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు --
ఒక్క "మనసును -జ్ఞానాన్ని" మాత్రం మనకు ఇచ్చాడు -వాడుకోడానికి ! మనసు - జంతువులకు కూడా ఉంటుంది -- కాని మేదస్సుతో మనిషి -- జంతువుదశ నుండి ఉత్తమ మానవజన్మను పొందాడు -సక్రమంగా వాడుకుంటే "-మనిషి! --లేదా పశువు '"అవుతాడు ఒక్క ఆకారం లో తప్ప -!--కాని మనసును నియంత్రించడం మాటలా ! "శ్వాస ను ఆపడం "ఎంత కష్టమో "మనసును నిలపడం" అంతే కష్టం !మనసు మనల్ని దేవునికి దూరం చేస్తోంది దగ్గరకు కూడా చేస్తుంది -అది మన భావనపై అనగా మనసు పై ఆధారపడి ఉంటుంది -అన్నింటికీ తానే "కర్త "నుఅనుకుంటాడు -తనను సృష్టించిన దైవాన్ని మరచి --తన అంతరంగంలో ప్రాణంరూపంలోనూ -బాహ్య ప్రపంచంలోను అంతటా నిండి ఉన్న దైవం ఉనికిని విస్మరించి చరించడం మూర్ఖత్వం కనీసం -నిత్యందర్శనం ఇచ్చే ఆ కర్మసాక్షి సూర్యభగవానునికికూడా తెలియజేయకుండా ప్రవర్తించడం కృతఘ్నత -కదా ! 
ఈ శేరీరం - మనకు దేవుడిచ్చిన అద్దె ఇల్లు- ఒక ఉపాధి మాత్రమే -దీనిమీద సర్వహక్కులు అతనివే -1 బ్రతికినన్ని రోజులు ఈశరీరంతో బాటుగా ఆనందంగా -ఉండటానికి - చక్కగా ఉపయోగించుకోడానికి సమయాన్ని- జీవితాన్ని- అందమైన ప్రకృతినీ -చక్కని గాలినీ ప్రాణవాయువునీ -కమ్మని స్వాదుజలాన్నిఇచ్చే జీవనదులని -తీయని పండ్లను ఇచ్చే చెట్లనీ - శరీర పోషణకి కావాల్సిన ఆహారాన్ని అందించే చెట్లనీ వృక్షాలనీ అందించాడు - -మనలాగే- ఇవన్నీ అనుభవించడానికి ఎన్నో ఇతర జంతువులనీ -పక్షులనీ -జలచరాలనీ పచ్చని పరిసరాలని - సంపదలని - బంధువులను -స్నేహితులను -చక్కని సమాజాన్ని ఇలా సకల ప్రాణి కోతికి సరిపడే ఎన్నో వనరులను - సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు 
" పాత్రపోషణ "అయ్యాక -నాటకం నుండి విధిగా నిష్క్రమించినట్లుగా అన్ని ప్రాణులవలె మనంకూడా జననంతోబాటు మరణాన్ని అంతే గొప్పగా సంతోషంగా స్వీకరించాలి -మనపైన పూర్తి అధికారం ఉన్న దైవం ఎప్పుడైనా తీసుకొని పోవచ్చును -" జన్మనిచ్చినవానికి -ఆ -జన్మను తీసుకొనిపోయే అధికారం "ఉంటుంది కదా 1 అది "-ఎప్పుడు "అనేది -ఎవేరికి తెలీదు -- "ఎక్కడికి" అనేది అంతకంటే తెలీదు - 
అందుచేత "శరీర పోషణ"' తో బాటు-" నేను ఎవరిని ?- ఎక్కడి నుండి వచ్చాను ? " అన్న ఆత్మశోధనకూడా మనజీవన ప్రయాణంతోబాటు సాగాలి అప్పుడు మాత్రమే మానవజన్మకు సార్థకత - ఆత్మశాంతిని పొందగలుగుతాం -
సృష్టిలో రెండు పరమ సత్యాలు -కనబడుతాయి -"-ఇతరులు తప్ప- తాను మాత్రం తప్పు చేయను " -అనుకోవడం --ఎందరో తన కళ్ళముందు మరణించడం చూస్తున్నా "-తాను మాత్రం దీనికి అతీతుడ"ననుకోవడం !- ఇది అజ్ఞానం -భ్రమ -పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం -కృతజ్ఞతా భావం లేక పోవడం-"తానే జ్ఞాని "అనే అహంకారం !- తుచ్చమైన సంపదలు -శరేరం పై మమకారం! మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి 
దేవాలయదర్శనం- సద్గురువుల సేవ - రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం - నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం

12 Dec 2015

ఏడుకొండలవాడా !- వెంకటరమణా

 ఏడుకొండలవాడా !- వెంకటరమణా -1 గోవిందా ! గోవిందా -!
ఆపదమొక్కులవాడా -అనాధ రక్షకా 1 గోవిందా ! గోవిందా !" 
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం సులభమైన విషయం కావచ్చును - కాని ఆయన లీలలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు - స్వామిదర్శనానికి మనకు -అనగా సామాన్య జనాలకు -లభించే సమయం కొన్నిక్షణాలు మాత్రమే కావచ్చును - కాని స్వామిని చూసిన తర్వాత కలిగే సంతోషం అనంతం - త్రుప్తి అద్భుతం - అపరిమితం - ఇది" క్షేత్రం మహిమయో - !లేక స్వామి మహిమయో !"- చెప్పలేము - తిరుమలయాత్ర సంకల్పించుకొని బయలుదేరిన ప్రతీయాత్రీకునికి తిరిగి తన ఇల్లు చేరేవరకు అలసటగాని -దేహఅవస్థలు గాని ఉండవు - 
ఇక తిరుమలకొండపైన ఉన్నసమయంలో -అక్కడి చలి -వాన -ఎండ - లేదా స్వామిదర్శనానికి నడకద్వారా వెళ్ళడంవలన కలిగే శ్రమగానీ - మనలను ఏమాత్రం బాధపెట్టవు- జ్వరం - నొప్పి - రోగ బాధలు -అవస్థలు - కాలినడకద్వారా కొండఎక్కిరావడంవలన కాళ్ళకి నొప్పులుగానీ - -ఇలాంటివి" స్వామి"మహత్తువల్ల మనకు కలుగవు - స్వామిని చూడాలనే ఆరాటంలో అవన్నీ కొండమీద ఉన్నంతసేపూ మరచి పోతాం -- అదే ఏడుకొండలవాని గొప్పతనం !- ' ఆకాశ గంగ -పాపవినాశిని ' లాంటి పవిత్ర దివ్యజలాలు సేవించడం వల్లనో -- కొండ పైనగల స్వచ్చమైన -పవిత్ర మైన -ఆధ్యాత్మిక వాతావరణంవల్లనో -- ఎత్తైన దివ్యమైన ఏడుకొండల అద్భుత మహాత్మ్యం వలననో - మనకోసం "-కలియుగ దైవం'లా- తానే స్వయంగా "సాలగ్రామ"రూపంలో వెలసిన ఆ "సాక్షాత్ మహావిష్ణువుయొక్క మూలవిరాట్టు "యొక్క గొప్పదనమో- -స్వామి ఆవిర్భవించిన "స్థలమహత్తు" వల్లనో - దేవాలయ" వాస్తు" విశిష్ట గుణమో -- ఆలయ నిర్మాణం గావించిన రాజుల" సంకల్ప" బలమో - ఆగమశాస్త్రప్రకారం శాస్త్రయుక్తంగా స్వామికి పూజలు ఉత్సవాలు - నిత్య కళ్యాణాలు- బ్రహ్మోత్సవాలు -అభిషేకాలు -అలంకారాలు -నైవిధ్యాలు -ఇలా ఎన్నెన్నో విధి విదానముగా చక్కగా పనిత్యము నిర్వహించే అర్చకుల దక్షత -దేక్ష అంకిత--" భక్తిపూర్వకమైన" కార్య క్రమాల ప్రభావం వల్లనో - "తరిగొండవెంగమాంబ సత్రం" లో నిత్యం వేలమంది భక్తులకుజరిగే "అన్నదానం " వల్లనో - లక్షలమంది భక్తుల కోరికలు లక్షణంగా నెరవేర్చినందుకు తమ కృతజ్ఞతగా స్వామికి తమమొక్కులు చెల్లించడానికి మళ్ళీమళ్ళీ వచ్చే భక్తులనమ్మకమో -మనకు తెలియదుకానీ - స్వామి దర్శనానికి వచ్చిన ఏఒక్క భక్తునికీ ఏ ఇబ్బందీ కలుగదు -ఇక్కట్టులు రావు - అవస్థ ఉండదు - ఎవరుకూడా అనారోగ్యం పాలుకారు -- 
పైగా రెట్టింపు ఉత్సాహంగా సంతోషంగా సంతృప్తినిపొంది తిరిగి వెళ్తారు -రెండు గంటల్లో దర్శించు కున్నవారికికలిగే ఆనందంలాగే -రెండురోజులు స్వామిదర్శనానికి కేటాయించిన గదుల్లో ఓపికగా వేచిఉన్నవారుకూడా అంతే "ఆత్మానందం" పొందుతారు -- అదీ "ఏడుకొండల వేంకటేశ్వరస్వామి గొప్పదనం" !-- పిల్లలు -వృద్ధులు అంగవైకల్యం ఉన్నవారు -దేశంలోని అన్ని రాష్ట్రాల వారు -విదేశస్థులతో ఎప్పుడు రద్దీగా "-నిత్యకల్యాణం -పచ్చతోరణం "లా -రాత్రీ పగలు అనకుండా ఇరవై నాలుగు గంటలు -మూడు వందల అరవై రోజులు - భక్తులు వేలసంఖ్యలో తిరుమల కొండపై కనిపిస్తారు - ప్రతీరోజు స్వామిసన్నిధిలో భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం చూస్తాము - పుష్కరిణి స్నానం - దర్శనం -ప్రసాదం -ఉచిత అన్న సత్రం లో లభించినకమ్మని రుచికరమైన మృష్టాన్నం -లభించిన త్రుప్తివలన -తమకు ఈ యాత్రలో కలిగిన శ్రమను -ఖర్చును -ఆయాస ప్రయాసలను అవస్థలను ఇట్టే మరచి పోతారు -జ్ఞాపకం ఉండేది "స్వామిదర్శనం"మాత్రమే అదే -మహాభాగ్యంగా మరీమరీ తలచుకుంటూ '-పునర్ధర్శనాన్ని " కోరుకుంటారు 
అందుకే "గోవిందుని గొప్పదనం "-కొనియాదతరమా !- చూసి ఆనందించి "అంతరంగంలో ఆత్మానందం "పొందడం తప్ప వర్ణించ తరమా !అనువైకవేధ్యమైన వెంకట రమణుని -కృపాకటాక్షాలు -ఎన్ని అపరాధాలు చేసినా క్షమించబడి -మనకు అనుగ్రహింపబడాలనీ --" గోవిందుని దివ్య మంగళ విగ్రహాన్ని" తిరిగి మళ్ళీ మళ్ళీ దర్శించే భాగ్యం కలగాలనీ - ఆ భాగ్యాన్ని ప్రసాదించమన-" అలిమేలుమంగాసమేత వేంకటరమణుని " వేడుకొందాం -! స్వామి" దివ్యమంగళ పాదారవింధదర్శనము"నకై -"పరంధాముని కటాక్షవీక్షణ క్షణా"లకై కోరుకుందాం !- "--తిరుమలేశుని పునర్దర్శన ప్రాప్తిరస్తు !- "
14 Dec 2015

తిరుమల యాత్ర -వైభవం శ్రీవారి దర్శనం --దివ్యానుభూతులు -

భగవంతుడు అంతటా ఉంటాడు - కాని ఎందుకో" తిరుమల శ్రీనివాసుని
సన్నిధానం" లో   భక్తులు పొందే ఆనందం -త్రుప్తి ఎనలేనివి  !- మెట్ల
దారిలో ఏడుకొండలవానిని స్మరిస్తూ -"గోవిందా -! గోవిందా 1" అంటూ వందల
మందితో నడుస్తుంటే -" దొరకునా ఇటువంటి సేవా !"అనిపిస్తుంది - ఇక తలనీలాలు
స్వామీవారికి సమర్పిస్తుంటే - మనలోని అహంకార -మమకారాలు త్యజించి
-"స్వామి!  నీకు సేవలు -పూజలు చేయలేను -నిన్ను శరణు  వేడుకుంటున్నాను
"-అన్న భావం కలుగు తుంది - ఇక స్వామిదర్శనంవల్ల కలిగేఅనుభూతి- తన్మయత్వం
అంతా ఇంత కాదు - అన్నమయ్య గీతంలో చెప్పినట్లుగా -"నీ వంటి దైవాలు లేరు-
నిఖిల లోకము లందు !"--లక్షలమంది భక్తులకు ఆశ్రయం -అభయం- ఆనందం -తో బాటు
-మళ్ళీ దర్శించుకోవాలన్న అనుభూతినీ అనుగ్రహించిన ఆ దేవదేవుని దయకి-
ప్రణామాలు సమర్పించడం తప్ప -ప్రతిగా మనం ఏమి చేయగలం -!ఇదంతా నీదే - నేను
మేము నీ వారమే - నీది నీకే సమర్పిస్తున్నాం స్వామీ !-
                       1-నాకు గల పెద్ద వయస్సు - మోకాళ్ళ నొప్పులు -కాలి
మడమపట్టు- కాలుకింద పెట్టలేనంత  బాధఉన్నా - డెబ్బై లోపడుతున్న వయసులో
కూడా నన్ను తనవధ్హ్ధకు రప్పించుకుని- అన్నిమెట్లు కూడా అవలీలగా ఎక్కించి
-దివ్యమైన తనదర్శనం ఇప్పించాడు-" స్వామి వైభవం "అంటే ఇదియే కదా ! 2-
బంగారు వాకిలి -వెండివాకిలి - ద్వారములవద్ద ఎనలేని ఉత్సాహంతో -
భక్తిప్రపత్తులతో -స్వామిని చూడాలన్న తపనతో -దూరమనక - భారమనక- ఎన్నో
ప్రయాసలకు ఓర్చి - స్వామిసన్నిధిని ఆనందంతోచేరిన- భక్తజనంతో  "గోవింద
నామాన్ని " ముక్త కంఠంతో  నాద్వారా" స్వామీ' అనిపించడంబ్రహ్మానందం గా
తోచింది  -3- దివ్యమైన -అద్భుతమైన -ఆనందకరమైన -అపురూపమైన  తన సుందర
రూపాన్ని -సర్వఅలంకార -అలంకృత- మందహాస మంగళమోహన విగ్రహాన్ని  దర్శింప
జేసి - ఇందరి జన్మలను జన్మను తరింప జేశాడు -శ్రీ వేంకటేశుడు -4-  తనతల్లి
వకుళామాతకి- కొడుకుగా శ్రీనివాసుడు తన కుడి ప్రక్కన నిలుపుకొని - ఇచ్చిన
మర్యాద -భక్తి గౌరవాన్ని చూస్తే - మన తలి దండ్రులనుకూడా మనం అలా ప్రేమతో
చూదాలి అని స్వామీసూచన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకు--1 అప్పుడుకదా
నిజంగా మనం -'స్వామి కరుణ"కు పాత్రులం అవుతాం -అన్న మధుర భావన  ఎవరికైనా
కలుగకమానదు - అక్కడేగల  వైకుంఠదారం వద్ద స్వామిని దర్శించుకుని వచ్చి
కూర్చుని ఆదివ్యమంగళ విగ్రహాన్ని మదిలో స్మరించుకుంటున్న భక్తులచే - తన
గోవింద నామాన్ని-అన్నమయ్య గీతాన్ని "-పొడగంటిమయ్యా !నిన్ను పురుషోత్తమా
1" అన్న అమృతతుల్యమైన అమర గానాన్ని  నానోటపలికిస్తూ- దానిని అందరితో
అనిపిస్తూ  స్వా మి సన్నిధిలో అరగంటసేపు -గడపడం నిజంగా నా
పాలిటపెన్నిధికదా" -ఇలాంటి స్వర్ణఅవకాశం అక్కడ అంతసేపు నాకు లభింపజేయడం
నా భాగ్యం గా భావిస్తున్నాను - ' స్వామిదయ -అపారమైన కరుణ "ఈ - జన్మను
ధన్యంచేసిన మధుర  దివ్య స్మృతులుగా గుర్తు ఉండిపోతాయి  - 5- గతఆదివారం
రోజున  -స్వామి బంగారు వాకిలి ముందు  నెల్లూరు బృందం వారు -యువకులు
-యువతులు ఏభై మంది - సాయంకాలం - స్వామి వారి నాలుగుమాడలగుండా  ప్రతిరొజూ"
నిత్య కల్యాణం -పచ్చ తోరణం 'లా జరిగిన ఊరేగింపు తర్వాత - అక్కడ కోలాటం
ప్రదర్శించారు - అందులో  అప్పుడు - నా నోటస్వామివారు పలికించిన" రామ-
కృష్ణ-  గోవింద" భజనకు ఒక అరగంటసేపు వారంతా కలిసి -తమ కోలాటనృత్యంద్వారా
అద్భుతంగా ప్రదర్శించడం  సామూహికంగా  అభినయం చేయడం --అందరికీ త్రుప్తినీ
సంతోషాన్ని కలిగించింది - -
            ఇలా  "ఎన్నిదివ్యానుభూతులో - ఎంత కృపయో !"- వేలాదిమందికి తన
దివ్యమైన వరదహస్తంతో -తన భక్తులకోరికలను తీర్చేవాడు- వారిఆపదలను తొలగించే
వాడు -  తన అభయహస్తంతో దివ్యదర్శనంతో  -భక్తులలో అమిత విశ్వాసాన్ని
-భక్తి శ్రద్ధలనుపెంచేవాడు -అందరికీ ఇలవేలుపు - పిలిస్తే పలికే
ఆపద్భాందవుడు -మన ఈ " ఏడుకొండల వేంకటరమణుని లీలలు -పొగడ తరమా -  1
వర్ణింపవశమా !శరణు కోరుతూ సవినయంగా  స్వామికీ నమస్కరించడం తప్ప 1" : ఓం
నమో వేంకటేశాయ " అనే మంత్రాన్ని -అంటూ అనునిత్యం స్వామిని మనసులో
తలచుకొంటూ -ఆ రూపాన్ని నిలుపుకోవాలి -- ఇదేకదా మన మానవజన్మ సార్ధకత-
సాఫల్యత  !     -  -

April 4,  2016

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...