Aug 9, 2019
Austin
సృష్టిలో అత్యంత విచిత్రమైన విషయం ఏదైనా ఉందా ? అంటే అది కేవలం "జ్ఞానం! అనే విషయ మే !! ఎందుకంటే అది అగోచరం, !ఎవరికీ కనబడేది కాదు, , అది!అనిర్వచనీయం ,,! అద్భుతం!, అమోఘం,! పరమ పవిత్రమైన, దివ్య మైన, భవ్యమైన పరమాత్మ స్వరూపం!!,, జ్ఞానం ఇలా ఉంటుందని, అది ఇక్కడ ఉంటుంది , అనీ, ఇంతకాలం ఉంటుంది, అనీ చెప్పలేని విజ్ఞాన ఖని,! ఎల్లలు లేనిది, అపరిమితం,అనంతము, అఖండము, అద్వితీయం ! దేనికైనా కొలత ఉంటుందేమో జ్ఞానాన్ని కొలవలేము,! అది గుప్త ధనం,!, ఎంత పరిశోధించిన దాని అంతు తెలియదు! అది అంతర్వాహిని, !మెదడు లో నిక్షిప్తం గా ఉండే పెన్నిధి!, అదే పరమాత్మ సన్నిధి ! అదే కైలాసం,! అదే వైకుంఠం!, అదే బ్రహ్మ పదం,! బ్రహ్మానందం,! పరమానంద భరితం! ఏది పొందితే మానవజన్మకు, మరేమీ అవసరం ఉండదో ఆ ఆనందమే జ్ఞానం , అదొక మహా యాగం, యజ్ఞం, తపము, జపము,,, మోక్షము,,పరమపద సోపానం, కూడా ! మనిషికి వెన్నుపాము లో ఉండే ఏడు చక్రాలలో, మూలాధార చక్రం నుండి, శిరస్సు లోని సహస్రార చక్రం వైపు, యోగ సాధనతో,, నిరంతర పరిశ్రమ తో, ధృఢ సంకల్పం తో , దైవానుగ్రహం తో కదిలే, అందాకా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి యే జ్ఞానం! అంటారు.. అంతటి మహత్తరశక్తి సంపన్నుల ను" పరమహంస "లు అంటారు.!," మనిషి ఎన్నేండ్లు బ్రతికాడు?" అన్నది ముఖ్యం కాదు,! జ్ఞానంతో భగవంతుని సన్నిధానం లో, నిరంతర ధ్యాసతో , ఉన్న రోజులే అతడి "అయువు" గా పేర్కొన వచ్చును ,,,! మనిషి వృద్దుడు కావడం సహజం !, అది జంతు లక్షణం,! కానీ,జ్ఞానవృద్దుడు కావడం మనిషి లక్షణం ,! బాలురు కూడా బ్రహ్మ జ్ఞానులు కావచ్చును ! జ్ఞానానికి వయసుకు ఎలాంటి సంబంధం లేదు ; జ్ఞానం అనేది ఒక సంస్కారం! అది భగవద్ కృప! పితృ దేవతల అనుగ్రహం, ఎన్నో పూర్వజన్మ పుణ్య ఫలం,! ఇప్పటికీ అలాంటి కారణ జన్ములు, పుణ్యాత్ములు లేక పోలేదు, మన భారతావని సనాతన ధర్మ కర్మ, యోగ భూమి గా, ఆధ్యాత్మిక జ్ఞాన భూమి గా , కూడా ప్రసిద్ది గాంచింది. ! మనిషికి ఉండే జ్ఞానం అతడిని దైవానికి దగ్గరకు చేరుస్తుంది ,,,! జీవుడు దేవుడు కావాలంటే , అంతటి గొప్ప జ్ఞాన సంపద అతడికి ఉండాలి, కదా ! రాముడు ,కృష్ణుడు లాంటి దేవుళ్ళు, మనుషులు గా పుట్టినా కూడా ,,వారు "గురు కృప"తో సంపాదించిన " జ్ఞానం" తో పూజనీయులు అయ్యారు ,! పురుషోత్తములు గా పురాణపురుషులు గా గుర్తింపు పొందారు!.. అందుకే, ఏ విధమైన శాస్త్ర విజ్ఞానం, లేదా ఆధునిక, పరికరాల ద్వారా కూడా కొలవలేని ది ఈ జ్ఞాన బాండారం!!.. దీని వైభవం చెప్పగలమేమో,, కాని స్వరూపం చెప్పలేము,! జ్ఞానం అనేది ,కేవలం అనుభవైక వేద్యం మాత్రమే!!, కొంత తక్కువ, కొంత ఎక్కువా తేడాతో ,సర్వ ప్రాణుల లో జ్ఞానాగ్ని నిండి ఉంటుంది,! ఇది సకల చరాచర జగత్తు లో అంతర్యామిగా, అంతర్వాహిని గా ప్రవహిస్తూ ఉంటుంది.! మనిషి కి, ఇతర ప్రాణుల కు , ఈ "జ్ఞానమే "బేధం గా చెబుతారు. !ఆ మాట కోస్తే, మనిషి మనిషికీ కూడా ఉండే ప్రధాన వ్యత్యాసం కూడా జ్ఞానమే కదా,,! రూపం, లో మాత్రమే కాదు,, మిగతా స్వభావాలు, ఒకేలా ఉన్నా,ఏ ఇద్దరి మనుషుల్లో నైనా ,,జ్ఞానం విషయం లో మాత్రం" సమానులు "అని చెప్పలేం. !!ఎవరి ప్రతిభ పాటవాలు ,ప్రజ్ఞా, వారిదే,!, అందుకే జ్ఞాన స్వరూపిణి, సరస్వతీ నదీమ తల్లీ, త్రివేణి సంగమ ప్రాంతం లో అంతర్వాహిని గా కనబడకుండా పరమ పవిత్రంగా, ప్రవహిస్తూ ఉంటుందని చెబుతారు, శృతి స్మృతి, ఉపనిషత్తులు, పద్దెనిమిది పురాణాలు, నాలుగు వేదాలు బోధించేది ఈ" జ్ఞా నాన్నే"కదా !! ఒక్క పరమాత్మ కు తప్ప సర్వం తెలిసిన వారు, సర్వజ్ఞుడు మరొకరు లేరు,! ఋషులు, మునులు, సాధువులు, పండితులు, యోగులు, సిద్దులు, వీరంతా తమ జీవితాలను తృణ ప్రాయంగా చూస్తూ, కేవలం జ్ఞానా ర్జన కోసం మాత్రమే శ్రమించడం విన్నాం,! చూస్తున్నాం!, అలా తమ యోగ శక్తితో, దీక్షతో, దైవారాధన చేస్తూ సాధించిన యదార్థ జ్ఞానాన్ని, మనకు ఈ శృతి స్మృతి పురాణాల ద్వారా అందిం చి, వారు ధన్య జీవులయ్యారు,! జగద్గురువు శంకరాచార్యులు గారు , ఈ "జ్ఞానయజ్ఞం "లో ప్రధాన పాత్ర వహించి, సనాతన హిందూ ధర్మ శాస్త్ర, జ్ఞాన, ధర్మ, ఇతిహాసం పునరుద్ధరణ, చేసి, సాటిలేని ధర్మ ప్రబోధ గ్రంథాలను రచించి , హైందవ జాతికి ఎనలేని, తీర్చుకోలేని విధంగా, మానవజాతికి ""జ్ఞానభిక్ష "పెట్టారు.! కవులు, గాయకులు, జాతి గౌరవం కోసం దేశ భక్తులు, సంఘ సంస్కర్తలు, వేదాంతులు ఇలా, ఎందరో మహానుభావులు, తమకున్న "జ్ఞాన "శక్తిని సామాన్యులకు కూడా ఆనందంగా పంచిపెట్టారు,,! వారిచ్చిన జ్ఞానంతో, పరిస్తితి గమనించి, బ్రతుకు ల ను నవ నాగరికత, ఆధునికత లో కొత్త రీతిలో మలచుకుంటు ఉన్నాం,! నిజానికి." జ్ఞానం" అంటే ఏమిటి,? అంటే," నిన్ను నీవు తెలుసుకోవడం,!"" అది అంత సామాన్య విషయం కాదు,! అది తెలిసిన నాడు, నీవు అసాధారణ ప్రజ్ఞావంతు డిివి అవుతావు,!"" జ్ఞాననేత్రం"" అనబడే మూడవ కన్ను తెరచుకుం టుంది ,,,ఈ అజ్ఞానం, అవిద్య, అహంకార మమకారాలు తొలగి,, ఆ స్థానం లో బ్రహ్మ పదార్థం నిలవడమే జ్ఞానం ! అది ఒక అఖండమైన , అద్భుతమైన, అమోఘమైన జ్ఞానజ్యోతి !వెలిగించడం. మాత్రమే నీ వంతు ! నిన్ను సదా కాపాడుతూ నిన్ను చిరంజీవి లా,, సంరక్షించ డం నీలో ఉన్న జ్ఞానం వంతు !! ప్రతీ పదార్థంలో, అణువణువునా, ప్రహ్లాదునికి వలె దైవం గోచరిస్తు ఉంటుంది !, భక్తులంతా జ్ఞాన స్వరూపులు,;! అంటే దేహమంతా జ్ఞాన మయమే,! బ్రహ్మ, విష్ణు శివ స్వరూపాలు వేరని భావించ రు, ! పుట్టించిన వాడు తండ్రి ,,బ్రహ్మ,!! పాలిచ్చి, గురువై , పోషించి, పెంచిన తల్లీ,, విష్ణువు,!! తాను పెరిగే , ఆయువును నియంత్రిం చే ,,కాల చక్రమే ,,శివుడు,,!! అలాంటి భావ సంపద తో,, జీవు డు ,,తానే ఒక "బ్రహ్మ పదార్థం" గా ప్రకాశిస్తాడు,! భూమిపై పెరిగేది, ఎప్పటికైనా విరుగుట కొరకే కదా!!, ఏ జీవి అయినా, పుట్టడం జరిగాక, ఇక మరణం కూడా క్రమక్రమంగా సమీ పిస్తు ఉంటుంది, ! దేహం పై న ,వెంట్రుకలు రాలడం, చర్మం లో ఉన్న పొలుసులు ఊడటం, పాత రక్త కణాలు పోయి కొత్త రక్త కణాలు తయారు కావడం, ఇలా శరీరంలో మనకు న్న మిడిమిడి జ్ఞానంతో మనకు తెలియని. చేర్పులు మార్పులు రోజూ,ఎన్నో కదా,!! ఇదంతా "లయం" కావ డం , అంటే "మాయం" కావడమే,! ఏది శాశ్వతం కాదు,, నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన స్వరూపుడైన ఆ పరంధాముని గురించిన జ్ఞానం తప్ప !!! భారత యుద్దం లో మరణించిన పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం "లయం "కాకుండా ఉంటే, మనకు నిలువ చోటు ఉండేదా. ? ఎవరు పుట్టిస్తున్నారు,? ఎవ రు చంపేస్తున్నారు ?, ఏక్సిడెంట్ లో పోయేవారికి శత్రువులు ఎవరు!, ఎందుకు అలా జనాలు అకాల మరణాల పాలౌతున్నారు,? ఏమిటి సృష్టి వైపరీత్యం??, అనుకోని తుఫానులు, జల ప్రళయము, భూకంపాలు, బాంబుల యుద్దాలు, ఎందుకు జరగాలి? చంపడం, ఏమిటి? చావడం ఏమిటి,? ఎక్కడినుండి పుట్టుకొస్తున్నా రు ఈ జీవులు.? మరణించాక ఎక్కడికి వెళ్తున్నారు ఈ జీవులు ? అత్మ నిత్యం సత్యం కదా! మరి ఆత్మకు జ్ఞానం ఎలా వస్తుంది ?! ఎవరి ప్రకోపన, శాసన, సార్వభౌమ అధికారం తో ఇవన్నీ జరుగుతున్నాయి??, అపగలవారు ఎవరు,? అర్థం చేసుకునే వారెవరు,?? ఎందుకీ వినాశనం?, దేనికోసం, ఇదంతా ? ఎవరు ఎవరికి మిత్రులు, ,శత్రువులు,,??, ఇలా మానవుడే దానవు డై లయకారుడు గా మారితే, వాడికున్న జ్ఞానానికి విలువ ఉంటుందా? జంతువుల వలె స్వార్థం, ఈర్ష్యా ద్వేషాలు, కోపం, పగ ప్రతీకారం ప్రకటించడమే జ్ఞాన మా? అంటే,,"" కాదు! కాదు !!కాదు!!" అని అతి సామాన్యుడు కూడా చెబుతాడు!!, ఎందుకంటే "జ్ఞానం"" అంటే, కేవలం పాండిత్యము కాదు,! సర్వసంగ పరిత్యాగం కాదు,! భక్తి వైరాగ్య భావం కాదు, !యదార్థ జ్ఞానంతో బాటు పదార్థ జ్ఞానం కూడా అవసరమే, కదా అర్థం చేసుకోడానికి ,!ఆ మాత్రం "ఇంగిత జ్ఞానం ""ఉండాలి అంటారు కదా ! అందుకే అలాంటి పరి ప్రశ్నలకు సమాధానం చెప్పేది జ్ఞానవంతులే ! , ఎదుటి మనిషికి ఇచ్చే గౌరవం, మర్యాద, సభ్యత, సంస్కారం, భూత దయ, పరస్పర సహకారం, లాంటి నైతిక విలువలు కూడా మనిషిగా అర్జించు కోవలసిన జ్ఞాన సంపద లో భాగమే !, తలిదండ్రుల ను ప్రేమించు, !గౌరవించు,! ప్రత్యక్ష దైవాలు గా గుర్తిం చు ,,! ఇలా భావించడం విజ్ఞానం అయితే,, జీవితాంతం తలిదండ్రుల ను అలా సేవిస్తూ, వారిని సంతృప్తి, సంతోషం తో బ్రతికెలా ఆదరిస్తూ ఉండడం నిజమైన" జ్ఞానం" అవుతోంది,! అలాంటి వారిని జ్ఞానులు అని పిలువ వచ్చును, , సత్యం చెప్పాలి , అహింస పనికి రాదు, పరోపకారం చేయాలి, మూగ జీవాలను సంరక్షించాలి , గోసేవ చేయాలి, తోటి వారిని ఆదరించి గౌరవించాలి , అందరినీ ప్రేమ భావంతో చూడాలి ,ఇలాంటి ధర్మాలను ,తూ ,చా తప్పకుండా ఆచరించే వారు జ్ఞానులు !అలా మన అనుభవానికి, మనుగడకు, భగవంతు డు అనుగ్రహించిన ప్రతీ మనిషి నీ ,,వస్తువు, లను పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తూ, అంతటా ఉన్న సర్వాంతర్యామి నీ దర్శిస్తూ, అంతరంగం లో కొలువై, ఈ జీవనానికి వెలుగై,, జ్ఞాన జ్యోతికి నెలవై, అంతర్యామి గా దేహంలో ప్రకాశిస్తూ, ఒక దివ్యమైన దేవాలయంగా ప్రభావితం చేస్తూ ఉన్న ఆ దేవా ది దేవుని గుర్తించడమే జ్ఞానం !. ప్రాపంచిక జ్ఞానం వేరు,! పారమార్థిక జ్ఞానం వేరు,! నీవు ఎదిగే సమాజం చే నీకు గుర్తింపు రావడం నాగరికత, లేదా ఆధునీకరణ విజ్ఞానం అంటారు!, నీవు పరమాత్మని గుర్తించడానికి చేసే సాధనా సంపత్తిని ఆధ్యాత్మిక "జ్ఞానం "అంటారు !! .ఇల్లూ వాకిలి, అస్తి, సంపద, డబ్బు, అర్జన , కీర్తి ప్రతిష్టలు గురించిన విషయాలను "పదార్థజ్ఞానం "అనగా విజ్ఞానం అంటారు. వాటి, స్వరూపం, స్వభావం, వినియోగం గురించిన అనుభవాల సందేశాలు జ్ఞానానికి సంకేతం !! !., మనచే అనుభవింపబడేది విజ్ఞానం!, ఆర్థిక విజ్ఞాన ,, సాంఘిక, రాజకీయ, వ్యవసాయ ము మొదలగు శాస్త్రాలు వ విజ్ఞానాన్ని అందిస్తే, వాటి సారాన్ని, సారాంశాన్ని, పరమార్థాన్ని గ్రహించే ది జ్ఞానం,! ఆ సిద్ధాంతాన్ని విజ్ఞులు" వేదాంతం" అంటారు,,! అయితే సదా ఈ మారుతున్న జగత్తు లో ఏ ది పదార్థ మో,, ఏది యదార్థ మో వ్యత్యాసం , తెలియడమే జ్ఞానం, !రంగు రంగుల్లో పుష్పించే పువ్వుల్లో , వాటి లో దాగిన మకరందాన్ని , గుర్తించడం జ్ఞానం,,! ప్రాణుల తాపాన్ని బాపే తీ యని అమృతవర్షజలధార పానంలో పొందే సంతోషం, సంతృప్తి లో,, ఉంది జ్ఞానం ,,! నిండు కుండ లా, తొనక్కుండ, ప్రశాంతంగా ఉండే సప్త సముద్రాల్లో గంభీరత లో నిబిడీకృతమై ఉంది జ్ఞానం,!, నీలాకాశం లో అందంగా మెరిసే నీలి మేఘాల లో , నిత్యం వినూత్న ఆనందాన్ని అనుభ వింప జేసేఇంద్ర ధనుస్సు లో,, సూర్యోదయ , సూర్యాస్తమయ,, అరుణకాం తు లలో , ఉంది జ్ఞానం!!, చల్లని ,తెల్లని వెండి కాంతులను వెద జల్లే పున్నమి వెన్నెల లో, ఉంది జ్ఞానం,!, అకు పచ్చని చీర కట్టులో , పచ్చని చేల లో,, కొండల్లో, కోనల్లో పరచిన అకు పచ్చని తివాచీ లా భాసించే ప్రకృతి మాత, అపర మహాలక్ష్మి సౌందర్య లావణ్య ము గా ఆగుపించే "అమ్మ ల గన్న అమ్మ "వైభవము లో ఉంది జ్ఞానం! కర్మసాక్షి సూర్య భగవానుని పసిడి కిరణాల లో ఉంది జ్ఞానం,,! ఆయురారోగ్యాల తో, చరాచర జగత్తును వర్దిల్లజేస్తున్న దివ్య ఔషధాలు వెదజల్లే చంద్రుని కరుణ లో ఉంది జ్ఞానం,! సకల జీవులకు నిరంతరం తన కృపతో ఊపిరి నందిస్తూ, బ్రతికిస్తూ ఉన్న ప్రాణ వాయువుల లాలన, పాలన, వీవన లో ఉంది జ్ఞానం, !!ప్రాణుల మనుగడకు, జీవన భృతిని, తన కృపతో పంటలను పండిస్తూ, అందిస్తూ, బ్రతుకులో ఆశను, శక్తిని ,చైతన్యాన్ని నింపుతున్న ఈ భూమాత ఓర్పు లో ఉంది జ్ఞానం,! ఇలా అనంతమైన విశ్వంలో, అనవరతం ,నియమానుసారం , భ్రమిస్తూ ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఇలా, ఇన్నింటీని నియంత్రిస్తూ, పరిపాలిస్తూ ఉంటున్న ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని గురించి తెలియాలంటే పదార్థ జ్ఞానం తో సాధ్యమా,? , విష్ణు మాయ ను భేదించడం,పంచభూతాల ప్రభావాలను నిగ్రహించి, క్షణికం, అశాశ్వతం అయిన ఈ మానవ శరీరం తో శాశ్వతము,, సత్యము నిత్యము, బ్రహ్మానంద కరము అయిన ఆ పరందామునీ ,పరమ ధా మా న్నీ , మనకున్న మామూలు విషయ జ్ఞానంతో గుర్తించడం, భావించడం, అందులో జీవించడం సాధ్యమా !?? అంటే అసాధ్యం అని మనకు తెలుసు !! ఇంతకూ పరమాత్మ గురించిన ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? అంటే ,,సత్పురుషులు, సజ్జన సాంగత్యం, నిరంతర తపన, ధృఢ సంకల్ప చిత్తం, దైవారాధన, త్రికరణ శుద్ధి తో చేసే, అత్మ సమర్పణ భావంతో , దైవ భక్తితో ,, జ్ఞానాన్ని సాధించ వచ్చును, శ్రీకృష్ణుడు గీతలో సూచించిన విధంగా , ఒంటరిగా, హిమాలయ, ప్రాంతం లో హరిద్వార్, హృషికే శ్ లాంటి సిద్ధ పురుషుల క్షేత్ర ప్రాంతాల్లో , సద్గురువుల శుశ్రూష తో, నిర్మల హృదయం తో, సద్గురువుల ఆశ్రయం తో జ్ఞాన ప్రాప్తి అవుతుంది,! రామకృష్ణ పరమహంస దేవి కాళీ మాత ఉపాసకులు , సమాధి అవస్ట లో ఆమె ను నిత్యం దర్శిస్తూ ఉండేవాడు,, అంతటి శక్తి సంపన్నుడు క నుక, అతడు తన కరస్పర్ష మాత్రం తో , వివేకానంద స్వామి కి జ్ఞానాన్ని అనుగ్రహించాడు, గొప్ప జ్ఞానిగా చేశాడు, గురు కృప అంత మహనీయ మైనది. జగద్గురువు శంకరాచార్యులు , కాశీ అన్నపూర్ణ మాత ను"", జ్ఞాన వైరాగ్య సిద్యర్థం, భిక్షాం దేహి చ పార్వతీ,!"" అంటూ, సాక్షా త్తూ, సదాశివునికి "జ్ఞానభిక్ష "ను ప్రసాదించే పరమేశ్వరి గా స్తుతించాడు. శ్రీకృష్ణుడు భీష్మునికి, ఉద్దవునికి, తల్లీ దండ్రులు దేవకీ వసుదేవులకు, అక్రూరుడు,ముచికుందుడు , ప్రహ్లాదుడు, అంబరీషుడు, నారదుడు,, కలియుగంలో అన్నమయ్య, లాంటి భాగవతులకు, గోపికలకు వారి భక్తి మార్గం ద్వారా, తనను తెలుసుకున్న వారి జ్ఞానానికి సంతసించి ముక్తిని కరుణించాడు . శ్రీకృష్ణుడు !!, జ్ఞానానికికావల్సింది, "ఆర్తి,!" అంటే అంటే పరమాత్మ కృప కోసం భక్తులు పడే ఆకలి లాంటి "తపన,",ఉండాలి ,,దానితో బాటు, ఆర్ద్రత, అంటే, పరమాత్మ సాక్షాత్కారం కోసం భక్తులు అనుభవించే ఆవేదనా, పరితాపం, ఆక్రోశం , ప్రతి స్పందన,, కూడా తోడు కావాలి .! జ్ఞాన అర్జనకు ,అర్హత ను కూడా సంపాదించాలి . !!"" అనన్యా చింతయం తో మామ్, యే జనాః పర్యుపాసతే,,,,,!" అని గీతాచార్యుడు సెలవిచ్చి నట్లుగా, వేరే ఇతర విషయాల వైపు మనసు పెట్టకుండా,, ధ్యాస మరల కుండా, ఏకాగ్రతతో, పరమాత్మను ఆరాధిం చాలి, ఇక పరమాత్ముని కృపకు నోచుకునే యోగ్యత ఉండాలంటే, అత్మ సమర్పణ భావంతో," అహం బ్ర హ్మోస్మి ""అనే విధంగా, పరమాత్మ తో విడదీయరాని అనుబంధం భక్తుడు ఏర్పరచు కోవాలి ..! స్వామీ,, నీ పాదాలే శరణ్యం!, లేదా మరణమే శరణ్యం!!"" అనబడే జ్ఞానం ," యోగ్యత" అనిపించు కుంటుంది,! అయితే,, ఎంతటి జ్ఞాని అయినా గురు కటాక్షము లేనిదే పరమాత్మ కృపకు నోచుకొడు కదా,,! ఎందుకంటే ,గురువే తల్లీ దండ్రి,, దైవం కూడా ! అంతేకాదు,, గీతాచార్యుడు, శ్రీకృష్ణుని వలె జ్ఞానోపదేశం చేస్తూ, అర్జునుని వంటి శిష్యునికి కర్తవ్య నిర్వహణ బోధించిన, సద్గురువు,, శిష్యుని తలిదండ్రుల కంటే పూజనీయుడు అవుతాడు!,, జ్ఞానం తోనే మనిషి,, అనిపించు కుంటా డు,,అజ్ఞానం తో పశు తుల్యుడు అనిపిస్తాడు,, పరమాత్మను తెలిసినవాడే, నిజమైన జ్ఞాని కదా !"జీవితం" అనబడే యుద్ధరంగం లో," జీవుడు" అనబడే అర్జునుని మిషగా సూచిస్తూ, "గురువు" స్థానం లో ఉండి జ్ఞాన బోధ చేశాడు,, శ్రీకృష్ణ పరమాత్మ !!విశ్వరూప ప్రదర్శన తో తన ఉనికి నీ, మహత్తును,, ఈ మాంస నేత్రాలతో కాకుండా, కేవలం జ్ఞాన నేత్రం తో, మాత్రమే తెలుసుకొన వచ్చును అనే నగ్నసత్యం తెలియజేస్తూ, మనిషిగా జీవుడు పాటించాల్సిన కర్మయో గ, భక్తి, యోగాలతో బాటు జ్ఞాన యోగాన్ని అనుగ్రహించాడు ,, కోట్ల మంది భక్తులలో, తనను తెలుసుకునే జ్ఞాని ఒక్కడే ఉంటాడు అని కూడా సెలవిచ్చాడు కూడా! ,,, ఇహలోక విషయాల పై, ఆసక్తిని,మమతానురాగాలు చంపుకొని,, దైవాన్ని తెలుసుకునే జ్ఞాన సముపార్జన మాత్రమే ధ్యేయంగా, పెట్టుకోవాలి,!, వేదాలు ఘో షించే ది, పురాణాలు ప్రవచిం చే వి ఇదే జ్ఞానం గురించి !; ఈ భారతావని లో జన్మించిన ఎందరో జ్ఞానులు ,, భగవద్గీత ను పఠించి, జీవితంలో ఆచరించి, పొందిన అనుభవాల సారమే,తరతరాలకు తరగని జ్ఞాన సాగరం !, సకల పురాణాల,,వేదాల సారం, భగవద్ గీత !! తానే స్వయంగా, తన నోటిద్వారా చెబుతూ అందించిన అద్భుత, అపురూప జీవనప్రమాణ జ్ఞాన గ్రంధం అది ! భగవంతుని ప్రవచనాలు, చక్కని మార్గ దర్షకాలు,! జీవన సాఫల్య ప్రమానికాలు, !మానవ జీవన ఉద్దరణ కు, భక్తి జ్ఞాన వైరాగ్యసిద్ది కి సోపానాలు ! మానవుడుగా జన్మించి నందుకు చేరు కోవాల్సిన ముక్తి ధామం పొందడానికి,అందుకోవాల్సినదివ్య అమృత ఫలం మన భగవద్గీత గ్రంధం,! భక్తి శ్రద్ధలతో, చదువుతూ, భవ బంధాల నుండి విముక్తిని పొందుదాం, మనిషిగా పుట్టించిన పరమాత్మ దయకు ప్రతిఫలంగా , గీతా మృత పానం చేస్తూ, జన్మను ధన్యం చేసుకుందాం!, గోపాలకృష్ణ భగవానుని కి జై,, గీతా మాతాకు జై, జ్ఞాన సరస్వతీ మాతా కి జై,,! స్వస్తి !, హరే కృష్ణ హరే కృష్ణా !!!
Tuesday, August 13, 2019
జ్ఞానం
Wednesday, August 7, 2019
చిరంజీవి హనుమ!
Aug 2, 2019
Austin
""పరమశివుని అవతారం హనుమ,! శ్రీరామ నామతారక మహా మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ,ఉంటున్న శివుడు, తన ఇష్టదైవమైన శ్రీరాముడు ,,రామావతారం లో వనవాసం లోపడే కష్టాలను చూడలేక హనుమ రూపంలో సీతాన్వేషణ చేసి సహాయం చేస్తాడు! దానికి,, ప్రతిగా హనుమకు ఏమీ ఇవ్వలేనని తెలిసి శ్రీరాముడు అతడిని వాత్సల్యంతో, ఆలింగనం చేసుకుని చిరంజీవి గా వర్ధిల్ల జేస్తాడు!, ఆ రకంగా, పరోక్షంగా శివుడు హనుమ రూపంలో, భక్తజనుల కోరికలను తీరుస్తూ,, జనాలల్లో భక్తి భావాన్ని, హనుమద్దాస భక్తులను ఊరూరా, పెంచుతూ, వారికి సకల శుభాలను, ఆనందాన్ని, ఐశ్వర్య అభివృ ద్ది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తూ, నేటికీ,, శ్రీరామ కవచం లా రక్షిస్తూ ఉన్నాడు!!, తన ప్రభువు దైవం అయిన రాముడి నీ , అతడి ప్రాణానికి ప్రాణం అయిన సీతమ్మను రావణుడి దూరం చేసి దుఖింప జేయడం, శివునికి చాలా బాధాకరం అయ్యింది ! కానీ, అటు రావణుడు ఇటు రాముడు ఇద్దరూ తన భక్తులే,! కాని ధర్మం తప్పి, రాముని లాంటి తన శివభక్తుల కు మహా అపచారం,శివాపరాధం చేస్తున్న రావణాసురు నీ ఆగడాలు సహించ లేకపోయాడు, అతడి వద్దకు తానే హనుమ రూపంలో ,స్వయంగా వెళ్లి , నయాన భయాన చెప్పినా కూడా వినకపోతే, అతడి మూర్ఖత్వానికి కోపం వచ్చి,, లంకను తన రుద్ర నేత్రంతో కాల్చి భస్మం చేశాడు,, అయినా వాడికి బుద్ది రాలేదు, జ్ఞానం కలగలేదు..! అలాగే రాముడు కూడా తన స్వామి శివయ్యభక్తుడు అయిన రావణుడి సంహారానికి, అతడి బంధు జనా లు,లంకా పురవాసుల చంపడానికి, ఇష్టపడక రావణుడి తో ,ఎన్నో సంధి ప్రయత్నాలు, రాయబారాలు, చేశాడు,! ఫలించలేదు! చివరకు విసిగి పోయి, రామేశ్వర శివలింగ ప్రతిష్ఠ చేసి, పూజించి, సదాశివుని కరుణకు పాత్రు డై, అతడి అనుగ్రహం తో ,అనగా హనుమ తోడు కాగా, శ్రీరాముడు రావణ సంహారం చేశాడు.!. ఇలా హరి అనగా శ్రీరాముడు, హరుడు అనగా హనుమంతుడు ఇద్దరూ, దుష్ట శిక్షణ కూ, శిష్ట రక్షణకు, నడుం కట్టి న వారే !!కలిసి ఒక్కటై, జన కళ్యాణం కొరకై ,, లోక హితం కోసం, అకాన్షించే వారే!! హరిహరులు వేరుగా కనిపించినా, వారు ఇరువురూ ఒకటే అని రామాయణ కావ్య రచన ద్వారా వాల్మి కి మహర్షి సూచిస్తూ ఉన్నాడు,! హనుమకు ఉన్న భక్తుల సంఖ్య అపరిమితం,! ఆయన దేవాలయాలు అసంఖ్యాకం !! అలా అన్ని దేశాల్లో విస్తరిస్తూ, హనుమత్ వైభవాన్ని , ప్రాభవాన్ని, శ్రీరామ నామ ప్రాచుర్యాన్ని , సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంది,! అందుకే హరి హరుల బేధమేంచకుం డా, హనుమ లాంటి నిరుపమాన, అపురూప, అద్భుత అద్వితీయ, అమోఘమైన, దైవాన్ని త్రికరణ శుద్ధితో, కొలిచే భావ సంపదను, భక్తి తత్పరత ను, అనుగ్రహించ మని,, శ్రీరామ దూత ను, రామాయణ కావ్య మహా మాలా రత్నం, భక్త జన రక్ష దీక్షా దక్షుడైన , పవనసుత హనుమాన్ చరణ కమలాల ను శరణు కోరుకుందాం!", ప్రహ్లాద, నారద ,పరాశర ,పుండరీక, వ్యాసాంబరేశ, శుక, శౌనకాది మహా భక్త పుంగవులలో, అగ్రగణ్యుడు గా, పేరుగాంచిన హనుమ భక్తి గొప్పది కావడానికి కారణం, అతడి అంకిత భక్తి !" అహం బ్రహ్మో స్మి " అనినట్టుగా , రాముని, హనుమను వేరు చేయలేము, వేరుగా చూడలేము ,, రాముడే హనుమ, హనుమ యే రామయ్య !, హనుమ తన హృదయంలో శ్రీరామ చంద్రు నీఎల్లప్పుడూ , నిక్షిప్తం చేసుకుని, రామ వైభవం తో బ్రహ్మానంద భరితుడై , పోతుంటా డు, రామ సభలో, ఉన్న రామ పరివారానికి, తన వక్షస్థలాన్ని చీల్చి, తన హృదయంలో విరాజిల్లే సీతారాముల సురుచిరసుంద ర మంగళా కార స్వరూపాలను ,ప్రత్యక్షంగా చూపాడు ! అంత గొప్ప రామభక్తి హనుమది !! అలా, నిరంతరం, అతడు ,శ్రీరామ నామ గానం చేస్తూ తన్మయత్వం తో తనను తాను మరచి, బాహ్య స్మృతులను విడచి, అంతరంగం లో వెలుగుతూ ఉన్న లక్ష్మణ సమేత సీతారామ చంద్రుల ను దర్శిస్తూ, వారి కళ్యాణ గుణ కీర్తనలను శ్లాఘిస్తూ కీర్తిస్తూ పరవశిస్తూ ఉంటాడు. !అంతే కాదు,! ఒడలు మరచి,, మనసును రాముని పై నిలిపి, రామ నామ గానం చేస్తూ,, అభినయిస్తు, నృత్యం చేస్తూ,,కుడి చేతి తో తాంబూర మీటుతూ, ఎడం చేతితో చిరతలు మృోగిస్తూ తాళం వేస్తూ, భజన చేస్తూ లీనమై, సదా, రాముడే ప్రాణమై, వరలుతూ ఉంటాడు. ,! అందుకే, త్రేతాయుగం నుండి, ద్వాపర యుగం, తర్వాత, నేటి కలియుగం వరకూ ,ఎక్కడ రామ కథ జరిగినా, ఎవరు రామ భజన, కీర్తన, పురాణాి ది సత్కథల ప్రవచనాలు నిర్వహిస్తూ ఉన్నా, తాను ఉన్నానని,, ఉంటానని హనుమ ప్రత్యక్షం అవు తూ ఉంటాడు !!, చంచల చిత్తానికి ప్రతిరూపం అయిన కోతి అవతారం లో, ,భక్త జనుల ముందు సాక్షాత్కరించి,, తన ఉనికిని, శ్రీరామభక్తి యందు తనకు గల అత్యంత అనురక్తి నీ, ఆసక్తిని, అవ్యాజమైన అనురాగాన్ని ఇప్పటికీ, ఎన్నో పౌరాణిక శ్రవణ సందర్భాలలో తనకు తానుగా ,ప్రకటితమై , ప్రత్యక్షంగా , పరోక్షంగా కూడా , మనకు తెలియజేస్తూ ఉన్నాడు.! అందుచేత హనుమ లాంటి నిజభక్తి నీ ,సాధించాలంటే ,,, రాముని సేవించే హనుమ వలె నిరంతరం జపిస్తూ, సేవిస్తూ, భావిస్తూ, తపిస్తూ, సాధన చేస్తూ, ఉండాలి ! , కోతి రూపంలో, కోతి జన్మ ధారణ తో,, కూడా దైవ సాక్షాత్కార భాగ్యం పొందవచ్చు నని హనుమ తన జీవన విధానం ద్వారా నిరూపించాడు కదా,! అంతకన్నా ఉత్తమము, ఉత్కృష్ట ము, దైవానుగ్రహ ఫలము గా ప్రస దిింపబడిన మనిషి జన్మ తో శ్రీరాముని అనుగ్రహం సాధింపలేమా ? అన్న సవాలును భక్తి ప్రపత్తులతో,, దైవ ప్రార్థన తో సత్ సంకల్పం చేస్తూ ,, స్వీకరించి సద్గురువు అయిన హనుమ చూపిన బాటలో నడచు కొందాం !! అటువంటి స్ఫూర్తిని, బుద్ది బలాన్ని, అంకిత భావాన్ని అనుగ్రహించమనీ ప్రార్టించు కొందాం !, హనుమ లాంటి ఇలవేలుపు ను, పర దైవాన్ని ,మనసారా నమ్మిన తర్వాత, ఇక ఎవరికీ , ఎప్పుడు , ఏ విషయంలో నూ ,అపజయం లేదు ! ఉండదు కూడా! జీవితంలో వెనుకడుగు ఉండదు,, !నిరాశ నిస్పృహ లు ఉండవు,,!, హనుమ జీవితం చూసి మనం నేర్చుకునేది ఒకటే,! కలియుగం లో హరినామ కీర్తన కంటే, సులభతరం, సకల పాపహ రం, మోక్షదాయకం,, జన్మ సాఫల్య మంత్రం అయినది మరొకటి లేదు అని తెలుసుకోవడం,!! దానిని ఆచరిస్తూ, అందరం పవిత్ర పావన హనుమ భక్తిని ఆలవరచు కొందాం,! హే, అంజనీ తనయా,! వాయుపుత్రా, !శ్రీ రామ బంటూ,!, భక్త వరదా,,! రామతారక నామ గుణ గాన కీర్తనా చార్యుడా,, శరణు,!! ;జ్ఞాన గుణ సాగరా,! మహావీరా,! శంకర వర ప్రసాది త కపి శ్రేష్టా!! కేసరీ నందన!! రామ చరిత లు వినడానికి, రామ కార్యములను చేయడానికి అత్యంత ఉత్సాహం చూపే మహానుభావా , శరణు,!! రామ కథా శ్రవణం చేస్తూ, కన్నుల వెంట ఆనందాష్రువులను రాల్చే ఆపద్భాంవుడా శరణు! శ్రీ శ్రీ రాజా రామచంద్ర భగవాన్ కి జై ! శ్రీరామ భక్త హనుమాన్ కి జై,! కొండగట్టు హనుమాన్ కి జై ! స్వస్తి ! హరే కృష్ణ హరే కృష్ణా !!!
భగవద్గీత
Aug 7, 2019
Austin
"భగవద్గీత, "అంటే సాక్షాత్తూ భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు, స్వయంగా అర్జునునికి బోధించిన ముక్తిమార్గము ,! దేవుడు జీవునికి, తాను ఎలా బ్రతకితే, జన్మ సార్థకం అవుతుందో వివరించిన బహు చక్కని జీవన విధానాలు,, గీతా వాక్కు లు.."! గీత" అంటే మధురమైన గీతాలు,గోపాలకృష్ణ భగవానుని నోటి నుండి మనకోసం వెలువడిన అమృతాలు , అద్భుత శ్లోకాలు,! సకల జన మానవాళి అభ్యుదయానికి , అందించిన తరగని,పెన్నిధి! అమూల్యమైన కానుకలు,,! జన్మ సాఫల్య ము చేస్తున్న వరాలు.!కనుక సు"గీత"ను, నియమాలను సూచించే ఒక సరళరేఖ అనే, విధంగా మనం అర్థం చేసుకున్నా కూడా, శ్రీకృష్ణుడు మానవులకు తాను ప్రసాదించిన ఉత్కృష్టమైన మానవజన్మ ఉద్ధరణ కోసం అందించిన ఒక విశేష ప్రణాళిక !! మనిషి మనుగడ, శరీర పోషణ కోసం ప్రకృతి సంపదలనుఅనుగ్రహించాడు కదా! అతడి, అత్మ పరిశీలనకు, అనుభవ యోగ్యంగా, భగవద్గీత ను ప్రసాదించాడు ! అంతేకాకుండా, బంధు జనాలను, జ్ఞానాన్ని, తగిన ఆయువును, శక్తినీ, ఎన్నో వసతులను ,మానవుడు ఇది కావాలని అడగకుండానే ,, అనుగ్రహిస్తూ నే, ఉన్నాడు.! వాటిని ,,అర్థవంతంగా అనుభవించడానికి అందించిన మార్గదర్శకాలు కూడా ఈ సుగీత ద్వారా అందించాడు. !. భగవద్గతలోని 18 అధ్యాయాల సమ్మేళన సారాంశం , భగవంతునికి భక్తునికి ఉన్న అవినాభావ అనుబంధం !", గీత" అంటే ఇది దాటకుండా ఉండాలి అన్న నియమం,! త్రేతాయుగం నాటి మాట, చూద్దాం ,! అరణ్యవాసం లో," బంగారు జింక "భ్రమ లో పడీన సీతాదేవి , అటు రాముని పంపించి దూరం చేసుకొని, ఇటు లక్ష్మణ స్వామి, అది కేవలం "రాక్షస మాయ "అని ఎంత చెప్పినా వినకుండా, తూలనాడి,, అతడిని దూరం చేసి ,, ఒంటరిదైపోయి కూడా, చివరకు ఆమె అత్మరక్షణ కోసం గీచిన" గీత""ను కూడా దాటి, భరింపరాని, సహింపరాని కష్టాలు, శోకం,, విరహం ,తాను పడు తూ ,రామలక్ష్మణులను కూడా అనుభవింపజేస్తుంది ,! అంతేకాదు, రాక్షస సంహా రానికి , లంకా వినాశనానికి గురి చేస్తుంది,! మంచి మాట అనగా "సుగీత "చెబితే వినకుంటే , పాటించకుండా నడిస్తే, ఇలా కష్టాల పాలౌతారు కదా ; ఇదంతా, " విధి విధానము "అని సరిపెట్టుకున్న కూడా,, జీవితంలో అనుకోని అడ్డంకులు, ఎన్ని సంభవించినా కూడా, కొల్పోని ఆత్మస్థైర్యం తో, ఓర్పు తో, నేర్పుతో, ఆదర్శ జీవనం, గడపడానికి,, దైవానుగ్రహం పొందడానికి సూచనగా, హెచ్చరికగా, భగవంతుడు గీచిన గీత "భగవద్గీత "! దీనిని ఉపయోగిస్తూ,, మానవు డు , రాక్షస లక్షణాలు పొందకుండా, సత్వగుణ సంపదతో ,దైవానికి దగ్గర గా చేరుస్తూ ఉంటుంది .!, మనిషిగా బ్రతకాలంటే నియమం అంటే "గీత"అత్యవసరం !", గీత "అంటే హద్దు, ! హద్దుల్లో ఉండాలంటే, జైలు లో ఉన్నట్టు బాధ పడతారు . అంతా !" సత్యం ,ధర్మం, అహింస !""అనే విలువలు మానవుడు గా జీవించి పాటించాల్సిన అమూల్యమైన ధర్మాలు ,! అంటే హద్దులు,!" సత్యాన్ని" పాటిస్తూ హరిశ్చంద్రుడు , తాను అబద్దం ఆడకుండా ఉండేందుకు ఎన్ని పాట్లు పడ్డాడో మనకు తెలుసు ,,! ఒక మనిషి, ధర్మావతారుడు గా,చరించడానికి , శ్రీరామచంద్రుడు ఎన్ని అగచాట్లు అనుభవించా డో మనకు తెలుసు !అందుకే ధర్మం ఎంత తెలిస్తే అంత ఇబ్బందులు, హద్దులు పెరుగుతూ వుంటాయి. !ఉదాహరణకు,, భోజనం చేయాలంటే ,,1,కూర్చుని తినాలి !,,2, దేవునికి ఆరగింపు చేసి మాత్రమే తినాలి ,,3,, భోజనం అయ్యేవరకు మాట్లాడకూడదు ,!4,. దైవ నామ స్మరణ చేస్తూ మాత్రమే తినాలి .!5. ఇంట్లో స్వయంగా హరి నామ స్మరణ చేస్తూ మాత్రమే వండిన ఆహారం తినాలి!6 , ఏదైనా ఇతరులకు పెట్టకుండా ఒక్కరే కూర్చుం డి తినరాదు,!7, మాంసాహార పదార్థాలు తినరాదు,,!8, తాను, అనగా జీవుడు తింటూ ఉన్నాట్టు కాకుండా, లోనున్న అత్మారామునికి , తినిపిస్తూ ఉన్నట్టు గా భావిస్తూ తినాలి ,,! ఇలాంటి నిష్టా, నియమాలతో భుజించే సాత్విక ఆహారం తో దైవా నుగ్రహం పొందడం భక్తి ప్రపత్తులు పెంచుకోవడం ఉత్తమం !! ఇవన్నీ మామూలుగా అనిపిం చే ధర్మాలే ! కాని ఆచరణ లో పెట్టడం అంత సులువైన విషయం కాదు!, అలాగే తలిదండ్రుల ను ప్రేమించడం, పెద్దలను గౌరవించడం, కొడుకుగా, తండ్రిగా, భర్తగా, భార్యగా జీవితంలో బాధ్యతగా ఆచరించాల్సిన ధర్మాలు ఎన్నో ఉన్నాయి, !ఇవన్నీ మనిషి జీవితాన్ని హద్దుల్లో , పెడతాయి,,! కాని పొందే ఫలితం మాత్రం అధికం! అంటే ధార్మిక, ఆధ్యాత్మిక, మానవత్వ, నైతిక విలువలు పెరుగుతాయి,!" సత్యము, శివము, సుందరము అయిన నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ ను తెలుసుకొన వచ్చును,,! దేనికైనా హద్దు ఉంటుంది, !ఉండక తప్పదు, కూడా ! నగరాలలో కారు గీత దాటితే చాలు,! వేలల్లో డబ్బుల జుర్మాన విధించడం చూస్తాం!, కొన్ని రూల్స్, పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలుగకుండా సభ్యత గా మె దలాల్సి ఉంటుంది.!.,our freedom ends,where the nose of others begins.!" అన్నట్లుగా పరిధిలో ఉన్నంతవర కే మన స్వాతంత్ర్యం ఉంటుంది . !మాట్లాడాలన్నా, తినాల న్నా, త్రాగడానికి, పడుకోడానికి,, పొట్టకూటి కోసం,, మనుగడ కోసం, ఉద్యోగం, వ్యవసాయం, వ్యవహారం, ఎవరితో నైనా సంబంధాలు పెట్టుకోవడం వంటి ఏ పనీ చేయాలన్న , సత్ఫలితాలు రావాలన్నా,హద్దులు లేదా నియమాలు, గీతలు ఉంటాయి,! ఈర్ష్యా ద్వేషాలు, కోప తాపాలు, పంతాలు పట్టింపుల కు పట్టూ విడుపు లు ఉంటాయి, !అంటే శృతి మించకుండా, ఇతరులను బాధ పెట్టకుండా హద్దుల్లో ఉండాలి మనిషి. ! భగవంతుడు తన సృష్టిలో అన్నిటికీ నియమాలు , ప్రత్యేకతలు హద్దులు ఏర్పాటు చేశాడు,! కాని మనిషి మనసుకు మాత్రం హద్దులు లేవు, అందుకే , సద్వినియోగం కోసమే ,ఈ గీత ఉపదేశం చేశాడు ! దానికి దేశ కాల పరిస్తితినీ, కూడా అనుసంధానం చేశాడు, !, వేగంగా ప్రవహిస్తున్న నదులకు, ఉవ్వెత్తున పొం గుతూ, భూమి పైకి నిరంతరం పొంగుతూ వచ్చే అనంత సాగరాల కెరటా లు దాటకుండా సముద్రతీర ప్రాంతా లు సరిహద్దులు గా ఉంటున్నాయి..!, హిమాలయ పర్వత సానువుల్లో కరిగే, పెరిగే మంచు కొండల నుండి జాలువారే జీవ నదుల కు హద్దులు , ఇరువైపులా సహజంగా నే ఉన్నాయి! , కానీ ,సముద్రాల్లోనీ బడబాగ్ని కి , భూకంపాల కు,, ప్రచండంగా వీచే గాలుల కు,, అకాల వర్షాల, తుఫానుల వైపరీత్యాల కు, ఇలాంటి ప్రకృతి శక్తులు హద్దులు దాటితే ఎంత ఉపద్రవాలు , ప్రళయాలు వస్తాయో, మనం ఊహించలేం కదా !..అలాగే మానవుడు అణు శాస్త్ర విజ్ఞానం పేరుతో దుర్వినియోగం చేసే మేధస్సు తో కూడా ప్రపంచ వినాశనం కలుగుతుంది,,! పరమాత్మ తన సృష్టిలోనీ, ప్రాణికి , ప్రతీ చెట్టూ పుట్టా, కొండా కొనలకు, అన్నింటికీ విది విధానాలు విధించాడు,! ఎండాకాలం , చలికాలం వానాకాలం ,, రాత్రీ పగలూ, ఋతువులు ఒక క్రమశిక్షణా యుత మార్గంలో వస్తుంటాయి,! అలాగే మనిషి ప్రవర్తనకు కూడా గీతా బోధన ద్వారా పాటించవలసిన నియమాలను తెలియజేశాడు! , ఈ నియమాలు ఋజు ప్రవర్తనతో, పాటించాలి. న్యాయం ధర్మం, మానవత్వం, దైవత్వం, పెద్దలు, పండితులు, తలిదండ్రులు, గురువులు, సాధువుల పట్ల గౌరవ భావన, స్నేహితులు బంధువుల పట్ల ఆదరాభిమానాలతో బాటు దైవారాధన గురుపూజ లాంటి ఉన్నత భావాన్ని అలవరచు కోవాలని సూచించాడు భగవానుడు,,;! యిటువంటి నైతిక , సాంఘిక, ఆధ్యాత్మిక విలువలు కేవలం మనిషికి సకల ప్రాణుల ఆదరణ వలన కలిగే ప్రేమ వలన మాత్రమే సాధ్యం అవుతుంది. !"మానవ సేవయే మాధవ సేవగా, సర్వ ప్రాణుల అదరణయే పరమాత్ముని సేవ "గా భావించాలని గీతాచార్యుడు ఉపదేశించాడు ,,, ఆదేశించాడు కూడా! పరమాత్ముడు అనంత గుణ సంపన్నుడు,; అతడిని పరిమితమైన భావన పూజ, అర్చన సేవ లతో భావించలేము కదా! హద్దులు, ఎల్లలు లేకుండా, అపరిమితంగా, అనంతంగా, అపురూపంగా, అద్భుతంగా, నిరుపమా నంగా, నిరాపెక్ష భక్తి తో అత్మ సమర్పణ, భావంతో అతడి కింకరుని వలె దాసాను దాసుని వలె , ఆరాధన చేస్తూ ఉండాలి.! అది అవ్యాజమైన ప్రేమానురాగాలతో , అర్ద్రతతో , ఆరాధనా భావంతో కూడి ఉండాలి,,! పరిమితమైన శక్తితో, జ్ఞానంతో, విశ్వాత్మ రూపు ని, భగవానుని కొలవాలంటే కుదరదు !,అతడిపై అపరిమిత మైన పరిపూర్ణ విశ్వాసం, ప్రేమ, నిరంతర సాధన, నిష్కళంక మైన హృదయం తో సాధ్యం ! అలాంటి యోగ నిష్టతో ఎందరో భక్తులు, పరందాముని కృపకు పాత్రులు అయ్యారు అని మన భాగవతం సూచిస్తోంది,;",, గీత" లో శ్రీకృష్ణ భగవానుడు తరుచుగా చెబుతూ ఉండే హెచ్చరిక లాంటి వాక్యం,! "నేను ఉన్నాను!, నన్ను పూజించు!, నన్ను నీ హృదయం లో నిలుపుకో,; వేరే ఇతర ధ్యాస మానుకొని, సర్వదా నన్నే దైవంగా భావించి, ఆరాధిస్తే నీ యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను!, నీ రక్షణ భారం, బాధ్యత నాదే!"" అంటూ ప్రబొదిస్తాడు,. సృష్టిలోని సకల జీవ రాశుల తో బాటు మనిషికి కూడా జననం ,మరణం, జీవన విధానం, బంధు బల గం, తలిదండ్రులు సంతానం, ఆహారం, వసతులు అన్నీ భగవానుడు అనుగ్రహించిన వే కదా,! తాను కోరి తన వెంట తెచ్చుకున్నది, భూమిపై ఏది లేదు, కదా! అంతా అతడి సొమ్మే, కదా I,, ఇవ్వబడిన ఈ ఉపాధి, మన" శరీరం" కూడా భగవద్ ప్రసాద మే, కదా! అందుకే "నీది" అనేది ఏది లేదు, కదా ! మరి ఎందుకు ఈ దైన్యం, ఈ నిస్పృహ, ఆవేదన,;? అహంకార, మమకారాల తో చేజేతులా అమృతతుల్యమైన జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా, భగవానుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు!, జీవితం పరమాత్ముని కృపగా భావించు, అంతే,! అంటున్నాడు,, ఇన్నీ చేసి, నీ తప్పు ఒప్పులు, అపరాధాలు, అన్నీ క్షమిం చే బాధ్యత కూడా తానే తీసుకునే ఇంత గొప్ప ఆత్మీయులు, ఇంత మంచి ఆత్మ బంధువులు ,ఆ పరమాత్మ కు మించిన ఆప్తులు, దయమృత సాగరులు ఎవరుంటారు చెప్పండి !??" కర్త, కర్మ, క్రియ!" అతడే అన్న కృతనిశ్చయంతో, జరిగింది, జరుగుతోంది, జరుగ బోయేది అతడి లీలా విలాసమే అనే భాగవత సంప్రదాయం తో,, చక్కని భావ సంపదతో,, కర్తృత్వ భావన లేకుండా, పరమాత్మ పై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉందాం! .శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో సూచించిన విధంగా , నడచు కుంటూ, మన జీవన విధానాలను "సద్గతి"పొందే దారిలో మలచు కుందాం!, గతజన్మ కర్మ ఫలాలను, కష్టమైనా సుఖమైనా , ఇష్టమైన, కాకున్నా కూడా అవి పరమాత్ముని ప్రసాదంగా భావించుదాం,! దైవాన్ని నమ్మి చెడినవాడు ధరణి పై లేడు,! కాని ఒక్కటి మాత్రం నిజం !"పరందాముని అండ లేనిదే, కృప కోరకుండా మనం చేసే పను ల్లో విజయాన్ని , సంతృప్తిని పొందలేము !"అన్నది నిర్వివాదాంశం కదా ! అందుకే ,అతడి సేవలో మనసును నిలిపే అత్మబలాన్ని , అతడిపై అవ్యాజమైన ప్రేమానురాగాలను మనకు అనుగ్రహించ మని, మనసారా ప్రార్థించుదాం,,! హే జగదీశ్వర,! అల్పులము !అఙ్ఞానులము! అవివేకుల ము !అమాయకులం , పాపులం అని తెలిసి కూడా , మాకు కామధేనువు, కల్పతరువు లాంటి , భగవద్గీత గ్రంధాన్ని, దయతో మాకు అనుగ్రహిం చావు! చాలు,! కృతార్తులం మేము! అందుకు మేము నీకు కృతజ్ఞులం , తండ్రీ !వాసుదేవా,! అనంతా!, గోవిందా! గోపాలా,!, నిన్ను మరవకుండా ,నీ చరణ కమలాలు విడవకుండా, నిన్ను సేవించి, తరిం చే మహా భాగ్యాన్ని నీ భక్తులకు, నీపై అనురక్తులకు కరుణించు,! హే కరుణా లొలా,! శ్రిత జన పాలా !భక్తజన హృదయ మందారా,! మాధవా !మధుసూదనా ,! నీవు చూపిన గీతా మార్గములో నడిపించే భారం నీదే తండ్రీ! నారాయణా! జగన్నాథ,! శరణు !శరణు! శరణు! స్వస్తి !హరే కృష్ణ !హరే కృష్ణా!!
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...