Saturday, October 12, 2019

భజన

Austin, Oct 8, 2019
"భజన "అంటే భగవంతుని వద్దకు భక్తులను చేర్చే మాధ్యమం,!, "భక్తి "అంటే మనసును అనగా అంతరాత్మ ను పరమాత్మ తో అనుసంధానం చేయడమే,! ఈ కలియుగం లో భజన కు మించిన భక్తి యోగం, మంత్రము, తంత్రము, యోగము, ధ్యానము, జపము, తపము, హోమము, యజ్ఞ యాగాది క్రతువులు, అర్చనలు అభిషేకాలు వంటి పూజా విధానా లు గానీ, ఇవేమీ ,భజనకు సాటి రావు,! అది ఒక దివ్యమైన లోకం,! అందులో శ్రీకృష్ణ భగవానుని అలౌకిక అగణిత అపురూప సౌందర్య మధురా నుభుతి లో చేసే నాదం తో భక్త మీరాబాయి లా, అత్మ సమర్పణ భావంతో ,తనువూ మనసు పరవశిస్తూ ఉండే అద్భుత ఆనందమయ మైన విశ్వసనీయ మైన భక్తికి,భజన ఒక పరాకాష్ట , !
,,పోతే అంతటి మనో స్థితికి, భక్తి శ్రద్ధలు అవసరం,,100% పరిపూర్ణ నమ్మకం అవసరం.,
దేవుడు ఎవరైనా, ఏ రూపంలో భావిస్తూ ఉన్నా, స్థలం ఏదైనా, పరిస్థితులు ఎటువంటి వయిన,, ఆలయం అయినా, ఏకాంతం అయినా, భజనలో లీనమైతే,, నీకు బాహ్యప్రపంచం తో సంబంధం లేకుండా పోతుంది.!! నేను అనే అస్తిత్వం దైవం లో విలీన మౌతుంది.
, భగవంతుడు అంటే అనందం,, ! ప్రశాంతత ! భజన ద్వారా ఇవి రెండూ సాధించవచ్చును,,
"అనందో బ్రహ్మ !""అంటోంది వేదం,! "దైవారాధన !లాంటి భజన లో పొందే అనందం ,, మిగతా ఏ విషయాల్లోనూ, ఇంత సులభంగా  పొందలేము, , దొరికినట్టు అనిపించినా అవి తాత్కాలికం,!, అంటే క్షణ క్షణానికి మారేటివి అని అర్థం,,!
ఈ రోజున భార్యకు భర్త పై, లేదా భర్తకు భార్య పై ఉండే ప్రేమ లేదా అనుభవించే "అనందం " రోజూ ఒకేలా ఉండవు, కదా !
,,అలాగే జీవితంలో తారసపడే అనుబంధాలు కేవలం క్షణికాలు,! అత్మ బందువు అంటే కేవలం ఆ పరమేశ్వరుడు ఒకడే,,
,,, ఇంకా చెప్పాలంటే, ఈ సంసార బంధాలు, గతజన్మ ఋణానుబంధాలు,, మాత్రమే! నీ ప్రాప్తం కొద్దీ, ఇపుడు చూస్తున్న వన్ని నీకు ఇవ్వబడ్డాయి,, ఉదాహరణకు
ఎన్నడూ పరిచయం లేని, రక్తసంబంధం కాని వ్యక్తి తో అత్యంత సన్నిహితంగా ఉంటాము,!
,, అంటే ఏ పూర్వ జన్మ సంబంధం వల్లనో, కదా, ఆ స్నేహం!
అలాంటి తెంచుకొలేని బంధాల నుండి విముక్తి కోసమే ఈ భజన అనే ఆయుధాన్ని ధరించాలి, అది వాటిని నామరూపాలు లేకుండా తెగకోసి నీకు పరమపద సాక్షాత్కార భక్తి సామ్రాజ్య వైభవాన్ని అందిస్తుంది,!
,,  దైవభజన చేస్తుంటే మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలుగుతాయి!,,
తనువూ, మనసూ కలిసే యోగస్తితి నే భజన అంటాము,,
మా అమ్మ ఉదయం 4 గంటలకు లేస్తూనే రామునికి, కృష్ణునికి, జగదంబ కు మేలుకొలుపు లు పాడుతూ ఉండేది,80 ఏళ్ల వయసులో అలా తెళ్ళార్లు, ప్రతిరోజూ ఆయాస ప్రయాసలు లేకుండా కళ్ళు మూసుకొని తనకొచ్చిన భాగవతపద్యాలు, పాటలు పాడుతూ లేనమయ్యేది,
అమ్మా నీకు నోరు నొవ్వ దా ఇలా 3,4 గంటలు ఆగకుండా పాడుతుంటే,? అన్నాను
, అతడు ఇచ్చిన నోరు, అతడి కోసం చేసే భజన లో ఉపయోగించ డం లో అనందం ఉంటోంది రా!
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని, దయయు సత్యం బు లోనుగా దలపడేని ,, కలుగనేటికి  తల్లుల కడుపు చేటు,, అంటూ భాగవత పద్యం శ్రావ్యంగా వినిపించేది,,, నిరంతరం హరి స్మరణ చేసే ఏ ప్రక్రియ అయినా భజనే కదా!!,
,, త్యాగరాజు కృతులు  భజనకు ఉత్కృష్టమైన స్థాయి నీ కలుగజేస్తు ఉంటాయి,,
నవవిధ భక్తి లో, శరణాగత భావం మహోన్నత మైనదీ,, అలాంటి అంకిత భావంతో చేసే కృతులు, కీర్తనలు,  ఆరాధన లు అన్నీ భజన కు ప్రతి రూపాలే,!!
, భజన ఒక్కరూ చేయవచ్చు, ఇద్దరితో ముగ్గురితో, సామూహికంగా చేయవచ్చు!!
ఇలా పదిమందితో చేసే భజన మహాత్మ్యం అద్భుతం, ! అది అనుభవైక వెద్యం,,!
,, ఇక్కడ అమెరికా లో ఆస్టిన్ రాష్ట్రంలో, బాబా ధ్యాన మందిరం లో నిన్న టి రోజున,, ఒక అమెరికన్ స్త్రీ గిటార్ వాయిస్తూ, సాయిబాబా గురించిన భజన గీతాలు రమ్యంగా, పరవశిస్తూ పాడుతూ ఉండటం చూశాను,!! ఆమెను
పరిచయం చేసుకొని , గిటార్ ఎలా నేర్చుకున్నావు అంటే,
బాబా కృప వల్ల అంది, బాబాను చూశావా అంటే,
గిటార్ వాయిస్తూ భజన గీతం పాడుతూ ఉంటే, బాబా చేతి స్పర్శ తన భుజాన్ని తాకుతూ,, ముఖం పై వెలుగులు పడుతూ, తనకు లోన దివ్యాను భూతి కలుగుతూ ఉంటుందట,! తనకి గిటార్ వాయించడం రాదనీ, బాబా కలలో కనిపించి గిటార్ తో తన భజన చేస్తూ ఉండమని,, చెప్పాడట.
అలా ఆరుసార్లు చెప్పడం తో, గిటార్ పై గురి, ఆసక్తి, కుదిరి, క్రమంగా బాబా భక్తురాలు అయ్యింది,
అరగంట సేపు విన్నాను, ఆమె గొంతు, గిటార్ నాదం, భజన గీతాలతో, శ్రావ్యంగా భక్తి భావంతో, తాదాత్మ్యం పొందుతూ , భజన అంటే ఇది అనిపించింది,!
ఇలా చెబుతుంటే ఆమె కళ్ళలో అనందాష్రువులు పొంగడం గమనించాను,
ఇదీ భజనలో ఉండే మేజిక్,"ఇలా ఎన్నో వింత విషయాలు అందరం చూస్తూ ఉంటాం
ముఖ్యంగా, వీణ, గిటార్, సితార్, వాయెలిన్, వేణువు, తబలా, హార్మోనియం, లాంటి వాయిద్యాల సమ్మేళనం తో చేసే భజన, ఆహా! నిజంగా ,అది అద్వైత ఆనంద నిలయం అవుతుంది!!
,, పాటలు, గీతాలు, భజనలు అన్నీ చక్కని, భావంతో, అందమైనసాహిత్యం తో ముడివడి ఉంటాయి.
,, కానీ, "తాదాత్మ్యం "అన్నది ముఖ్యం,! అది ఎవరికి వారే" స్వయంకృషి,"తో నిరంతర సాధన తో, అంకితభావంతో చేస్తూ సాధించాల్సిం దే!! భజనలు ఎన్నో రకాలు,!
""శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్,!,, హరే కృష్ణ హరే కృష్ణా!,, గోవిందా హరి గోవిందా,,!, విఠల విఠల పాండురంగ!,,, హరహర శంకర జయ జయ శంకర,,!"",, లాంటి భజనలు రెండు చరణాలు చాలు, భక్తి రస అమృతాన్ని పంచడానికి,!
,, భజన ఒక అనుభూతి! అద్భుతం, అమూల్యం, అపురూపం,! అద్వితీయమైన, బ్రహ్మానంద భరితమైన పరమానంద మైన మధురానుభూతి! దానిని మాటల్లో చెప్పలేం,,! కవితల్లో వర్ణించలేం,! కేవలం"" స్వానుభవం"" తోనే అవగతం అవుతుంది,,
,, కోతి లాంటి చంచల స్వభావం కలిగిన ఈ మనసును ,,శ్రీహరి నామ గాన మాధుర్యం తో అనుసంధానం చేస్తూ, ఈ శరీరాన్ని పనిముట్టు వలె, హార్మోనియం గిటార్, తాళాలు లాంటి ఏదైనా ఒక వాయిద్యం తో సహకరిస్తూ, , లేదా చప్పట్లు చరుస్తూ, సమయం తెలియకుండా,, అలసట లేకుండా, పరిసరాలు మరిచి,, అంతరంగం లో,, పరమాత్మను నిలుపుకుని, లోనా, బయటా,, ఎదురుగా ఉన్న చెట్టు పూవులు, కృష్ణ శిలా విగ్రహం, నీలాకాశం, నింగీ నేలా, ఆకూ, తీగా ఇలా అన్నింటిలోనూ దాగి ఉంటూ ప్రకాశిస్తున్న పరందా ముని దివ్య రూప వైభవ లావణ్య లీలలను , తాను గానం చేస్తూ వాటిని తాను భజిస్తున్న దైవంగా భావించే , భావసం పద ప్రాప్తించడం,సామాన్యమైన విషయం కాదు,!,
"భజన "అంటే ఏదో, ఒక పండుగ, ఒక పర్వదినం, శ్రీరామ నవమి, శివరాత్రి,కృష్ణాష్టమి లాంటి వేడుకల్లో కొన్ని గంటల పాటు సాగే సంగీత కచేరీ కాదు,,!
భజన అంటే జీవితం!, అదే ధ్యాస,! అదే శ్వాస,! అదే యాస!,, అదే ఘోష, తో బ్రతుకు పంట పండాలి,,! హృదయం లో అనందం నిండాలి!
,, దీనికి సమయం లేదు! సందర్భం లేదు, !సహచర్యం తో  పని లేదు,!
దేశం, కాలం, పరిస్తితి తో సంబంధం లేదు,,! కేవలం చిత్తశుద్ది ఉంటే చాలు! మనసు ను , భజన చేసే చరణాలను, ఆ శ్రీకృష్ణ పరందాముని చరణ కమలాల తో జోడిస్తే  చాలు!! జీవితం ధన్యం అయినట్టే! అదే నిజమైన భజన అవుతోంది!!,,,,
అలా నిరంతరం అనునిత్యం, అనుక్షణం, అనుదినం, పరమ పావన పవిత్ర గంగా, కృష్ణా, గోదావరీ యమునా, లాంటి పుణ్య నదీ జలాల ప్రవాహం వలె అనవరతం, అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటుంది, ఈ భజన అనబడే అనందా మృత భక్తి తరంగాల స్రవంతి!!
,,, అన్నమయ్య కీర్తనలు, రామదాసు, మీరాబాయి భజనలు మనల్ని భక్తి రసామృత ప్రవాహం లో ఒలలాడిస్తు ఉంటాయి, అలా భజిస్తూ వారు తరించారు,
అదే ,భజనలు మనమూ చేస్తుంటాము, కానీ అందులో జీవం పండదు! ప్రాణం ఉండదు,! భావ సంపద కనిపించదు,! భజిస్టూ ఉన్న సమయంలో, పరమార్థం కంటే ప్రాపంచిక విషయాల మీద నే దృష్టి ఉంటుంది!!
, అంటే సంకల్ప శుద్ది ఉండటం లేదు!, చేసే భజనకు , గడిపే జీవితానికి లింకు ఏర్పాటు చేసుకోవడం లేదు.!
, అది కేవలం ఒక "టైమ్ పాస్, లేదా ఎంజాయ్ చేయడం!", అంటే వినోదం గా భావిస్తూ ఉండడం!!,
"భజన" అంటే మనం అనుకుని చేసే ఒక పని కాదు,! అది నిస్వార్థ భావంతో స్వచ్ఛందంగా దైవానికి సమర్పించే త్యాగ భావం!
, త్యాగానికి మించిన ధనం లేదు, అది మనిషికి మాత్రమే సాద్యపడే అపురూప సాధనం!!,
భజనలో ఈ త్యాగం, అత్మ సమర్పణ భావం ఉంటాయి,!"" అంతయు నీవే హరి పుండరీకాక్ష!" అంటూ గోచరించే పరమాత్మ స్వరూప దర్శనం, ఈ భజన యొక్క ముఖ్యోద్దేశం, దాని ఆంతర్యం కూడా అదే!!
రోజుకు 24 గంటల్లో , కనీసం ఒక గంట అయినా భగవంతుని కి మనస్ఫూర్తిగా అర్పించ గలిగితే, అప్పుడు నీకు భజన చేసేందుకు నిజమైన యోగ్యత వస్తుంది, ! ఇక ఈ ""గంట సమయం"" నీది కాదు, !ఆ దైవం కు సమర్పించింది,!
రోజూ త్రికరణ శుద్ధితో మనసా, వాచా, కర్మణా శ్రీహరి నామ స్మరణ, జపం భజన చేస్తూ ఉండడమే నీ కర్తవ్యం, గా భావిస్తూ చేయాలి. గంటలు మాత్రమే కాదు రోజులు, ఏళ్లు, చివరకు జీవితాన్ని భగవద్ సానిద్యం లో భజిస్తు తరించేవారు ఎందరో మహానుభావు లను, ఇప్పటి కీ మనం గమనిస్తూ ఉంటాం!
, అతడికి సమర్పించిన ఈ ఒకే గంట లో, నీ ధ్యాస ను ఏ కొంత సేపైనా వేరే ఇతర విషయాల వైపు మరల్చే ప్రయత్నం చేస్తే, కృతఘ్నుడు అవుతావు సుమా!, నీవు స్వామి ద్రోహం చేసిన వాడివి అవుతావు ! ఎలా అంటే,
, ఒక యజమాని వద్ద జీతం తీసుకుంటూ ఆయన చెప్పిన  పనిచేస్తూ , మద్యలో నీ స్వంత పని చేయడం ఎంత క్షమించరాని అపరాధమో, ఇదీ అంతే!
, అందుకే, ఏ ఇతరమైన పని యైన చేయవచ్చేమో కానీ,, భజన విషయంలో మాత్రం దైవానుగ్రహం లేకుండా కొనసాగించ డం అత్యంత కష్టతరమైన విషయం!!
అందుకే భజన ప్రారంభం ముందు విఘ్నేశ్వర ప్రార్థన చేస్తుంటారు,, మనసు కుదురుగా ఉండడానికి పదిమందితో కలిసి భజన చేస్తూ ఉంటారు ! ఇది పది రెట్లు ఫలితాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది!!
అందుకే ,, మానవజన్మ ను ధన్యం చేసే అవకాశం ఇవ్వమని ఆ దైవాన్నే ఇలా కోరుకుందాం!!
""ఓ పరమాత్మా! ఓ విధాత! ఓ జగన్నాటక సూత్రధారి ! నీవు విశ్వం అంతటా నిండి అనంత స్వరూపం గా భాసిస్తూ ఉన్నావు, కదా! అలాంటి నిన్ను పట్టుకోవడం మానవ మాత్రులకు అసాధ్యం!, నీ కరుణ, కృప ,దయ లేనిదే నీ గురించిన నామ జపం భజన ఏకాగ్రతతో చేయలే ము తండ్రీ ! మా మనసు ను నీ పై నిలుపలే ను, కూడా,! అందుకే,
స్వామీ,!
నీ నామ రూప గానం చేసేందుకు, కావలసిన ఆర్ద్రత, భావ సంపద, శక్తి సామర్థ్యాలను, సంకల్ప సిద్ధిని నాకు అనుగ్రహించు!!
నారాయణా!!, భక్తవత్సల, దీన శరణ్యా,, భక్తజన బందో!!, నిరంతరం నీ పాద కమలాల పై  నా చిత్తాన్ని నిలి పే,మహాభాగ్యం, నాకు కరుణించు,!
కరుణా సాగరా,! కమల లోచనా,! కమలాలయా !! నీ భజన చేసుకుని తరించే అదృష్టాన్ని కలిగించు  !!  శరణు,! స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!!,

భగవద్ తత్వం

Austin, Oct 10, 2019
ప్రతీ మనిషిలో" భగవద్ తత్వం "నిబిడి ఉంటుంది, కదా! కానీ అది బయట పడాలంటే, అక్కడ పరమాత్మ స్వరూప దర్శనం కావాలి.! దేవాలయం లో దైవభక్తి ప్రదర్శింప బడటానికి కారణం, అక్కడి మంత్ర పూరిత విగ్రహం నుండి వెలువడే ధనాత్మక ప్రకంపన ల ప్రతి రూపంగా నెలకొన్న దేవతా స్వరూపం!,,,
, ఆలయం లోనే కాదు, ఎక్కడ సత్సంగం జరిగినా, దైవానికి ఆరాధనలు, జరుగుతున్న మనలోని భక్తి జాగృతం అవుతుంది,!
, అమెరికా లోని ,ఆస్టిన్ నగరం ,బాలాజీ దేవాలయం లో వేంకటేశ్వర స్వామీ విగ్రహం చాలా బావుంది , దాదాపు 10 ఫీట్లు ఎత్తై నా ఉంటుంది,,! అందంగా అద్భుతమైన అభరణాలు ,,పూవులు, అలంకారాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంది,!!,,,,,,,,
గత వారం వేణువు తో కీర్తన వినిపించాను, అక్కడ!! ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలు , స్వామి కళ్యాణ సమయంలో పాడాను,!,,,,,,,
అందరూ విని సంతోషిస్తూ, చాలామంది దగ్గరకు వచ్చి, "మాకు ఎంతో ఆనందం అనిపించింది, మీ రు భక్తితో ఆలాపించిన పాటలు !!,చాలా చక్కగా పాడారు, ,కంఠం బావుంది,! అంటూ మెచ్చుకున్నారు ! ముఖ్యంగా వృద్ద దంపతులు ఇద్దరూ, కారు వరకు వచ్చి, తాము ఎంతో  సంతోషాన్ని  పొందాం!" మీకు ధన్యవాదాలు !!"" అన్నారు..
, నాకూ అనందం అనిపించింది, స్వామి కృపా భాగ్యంగా, పాటల రూపంలో ,స్వామి ముందు సమర్పించే నా ఆర్తి, అనందం,, ఇలా కొంత మందికి అనందాన్ని కలిగించింది కదా,!"" అన్న సంతృప్తి కలిగింది !! , అంతమందిలో ఈ రకమైన ఒక గుర్తింపు  ,,నాకు మరిచిపోలేని మధురానుభూతి గా మిగిలి పోయింది,!!
,, అందరికీ ఏదో ఒక రకమైన ప్రతిభ, ఈ రకంగా అంతర్లీనంగా ఉండి, ప్రకటింప బడే అనుకూల పరిస్తితి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది,!!
ఇది బయట పడి, తనలోని విశిష్టత ఇతరులకు తెలియాలంటే, దైవానుగ్రహం ఉండ క తప్పదు!
, అది రాజకీయం కావచ్చు, విద్యా వైద్య రంగం లాంటివి ఏదైనా కావచ్చు,! ఆ రంగ ప్రవేశం చేయాలన్న,, అందులో రాణించాలని అన్నా, దైవబలం అనుకూలించాలి,!!
వెయ్యి మందిలో ఒకరు మాత్రమే ప్రముఖ కంపెనీలో ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు,! అంత మాత్రాన, మిగతా వారు అనర్హులని కాదు, కదా!! ఎంత ప్రావీణ్యత ఉన్నా, సమయానికి జవాబు తట్టాలంటే, ఆ తెలివి ప్రదర్శింప బడాలంటే, దైవం తోడ్పడాలి.! అదృష్టం బావుం డి, ఎవరికీ కలిసి వస్తుందో, ఆ విషయం, సెలెక్ట్ అయిన విజేతకు కూడా, ముందుగా తెలియదు కదా !!
, ఇక్కడే ఉంది గమ్మత్తు,! ఎందుకు ఇలా కొంతమందికి అన్యాయం, మరికొంత మందికి న్యాయం జరుగుతూ ఉంది !!
,, ఇలాంటి విచిత్రాలు, ఎన్నో జరుగుతూ ఉండడం , మనం రోజూ గమనిస్తూ ఉన్నా అది మనకు అర్థం కాని రహస్యం,, గా మిగిలి పోతూ ఉంటుంది ,,!!
అందరూ మనుషులే, !అవే వసతులు,! అవే పరిస్థితులు,! అవే సమస్యలు, !! ఒకే వేదిక !!కానీ ఆలోచన విధానం మాత్రం  వేరు,!!, ఫలితం కూడా వేరే,,!!
, ఈ విధంగా ఎందరు వ్యక్తులు ఉన్నా,, వారు చేసే పనుల్లో , ఆకారాల్లో, ప్రవర్తనా సరళి లో, పొందే అనుభవాలతో , అన్ని రకాల వ్యత్యాసాలు ఉంటున్నాయి,,,!!
,,,గతంలో  మనం చేసిన కర్మలకు అనుకూలంగా, మన బుద్దిని ప్రచోదింపజేస్తున్న అంతర్యామి అంతరంగాన్ని అంత సులువుగా పసి కట్టలే ము కదా,,! జీవితంలో నిత్యం జరిగే ఇలాంటి సంఘటనలు,
బ్రహ్మోపదే శాన్ని వివరిస్తాయి!!
,, ఎప్పుడు, ఎక్కడ ,ఎవరికీ ఏం జరుగుతుందో, ఎవరికీ తెలియదు!!, మన గురించి మనకే తెలియని విషయాలు మనలోనే ,ఎన్నో ఉంటున్నాయి,!!
, ఒక భక్తుడు అడిగిన ఇదే సందేహానికి, అరుణాచలం లో  రమణ మహర్షి ,,ఒకే సమాధానం చెప్పాడు, ""ముందు నీవు నేను ఎవరిని,?! అన్న ప్రశ్న వేసుకొని జవాబు తెలుసుకొని, అప్పుడు నా దగ్గరికి రా! ""అన్నారట,,,
వేదాలు  శృతి స్మృతి పురాణాలు , ఇతిహాసాలు,, ఉపనిషత్తులు వివరించేది ఈ"" పరిప్రశ్న ""మర్మం తెలియడాని కే ,,!!
""నేను ఒక జీవుడను,! ఒక మనిషిని,! ఒక స్త్రీ లేదా పురుషుడ ను!, ఒక ప్రాణిని!, తండ్రీ ,,గురువు కొడుకు, తాత, భర్త భార్య, స్నేహితుడు, ఒక బంధువు,! ఒక మానవుడ ను,!! ఒక శరీరాన్ని !! ఒక ఆత్మను !!ఒక గృహస్తు ,,ఉద్యోగి, కార్మికుడు, వ్యవసాయ దారుడు,!!,""  ఇలా ఎన్నో పాత్రల్లో ఆ వేష భాషలతో లతో, ఆ డైలాగు లతో, మిథ్యా ప్రపంచం లో  నటిస్తూ, నటింపజేస్తూ  ఇదే జీవితం గా బ్రతుకుతూ,, అయోమయం తో ,, సరియైన సమాధానం తెలియక,, "నేను ఇది,! నేను అది !!""అంటూ అనుకుంటూ, ఉన్నాం,!!
నిజానికి ఈ ప్రశ్న, భూమిపై పుట్టిన ప్రతీ ప్రాణి ది,!! అందులో మనిషి కి మాత్రమే ఆలోచించి జవాబు చెప్పే యోగ్యత ఇచ్చాడు ఆ విధాత ! కనుక, బాధ పడటం, బాధ్యత బరువు వహించడం కూడా చేయాల్సి ఉంటుంది మరి !!
కానీ, మనిషికి ఇన్ని ఇచ్చిన దేవుడు, ఈ ప్రశ్న కు జవాబు మాత్రం నిగూఢంగా ఉంచాడు,,,!! ఎందుకంటే ,, మనిషి తనకు తానే స్వయంకృషి తో అత్మ శోధన చేస్తూ, అన్వేషిస్తూ, సాధించి కనుక్కోవాలి,,?!!
అంతేకాదు !!తనను తాను తెలుసుకునే ఈ ప్రయత్నం లో సహకరించ మని దైవాన్ని వేడుకోవాలి కూడా,,!!
ఆ ప్రయత్నం, చిత్తశుద్దితో, స్థిర సంకల్పంతో, దైవం పై పరిపూర్ణ విశ్వాసంతో, ఆత్మ సమర్పణ భావంతో చేస్తూ ఉంటే, గానీ, దైవం దయ చూప లేడు,!!
ఈ తత్వాన్ని అనుసరించి, మన జీవిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటూ , ఈర్ష్యా ద్వేషాలు మానుకుంటే, మనలో ఇతరుల పట్ల కలిగే
,, కోప తాపాలు, కష్ట సుఖాలను సమంగా చూస్తూ ఉంటాము !!
""నేను లాభ పడినా ,,నష్ట పడినా, అది ఇతరుల వల్ల కాదు, !లోపం నాలోనే ఉంటూ , నన్ను ఆడిస్తూ ఉంది, !!"" అన్న తృప్తితో సమాధాన పడాలి,,
, ఈ రకమైన అద్భుత ప్రక్రియలో మనకు సహకరించేది భగవద్గీత మాత్రమే,,!
మనకు కలిగే ఏ సందేహానికి అయినా సంతృప్తిని కలిగించే సమాధానం గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు,!
అందుచేత ,శాంతియుత, ఆనందమయ, జ్ఞానమాయ జీవనం కోసం, ""భగవద్గీత ""ను ఆశ్రయిద్దాం, !! ఆ రకంగా
మహోన్నత మైన మానవజన్మ ను ధన్యం చేసుకుందాం
, గోపాలకృష్ణ భగవాన్ కీ జై,
హరే కృష్ణ హరే కృష్ణా!!
స్వస్తి !!!""

Saturday, October 5, 2019

బతుకమ్మ

Dallas, Sept 29 2019
అమెరికా లొ Texas రాష్ట్రం, లో డల్లాస్ నగరంలో  Frisco ప్రాంతంలో బతుకమ్మ అట, నేడు ఘనంగా జరిగింది. ఆరు బయట,,!! దాదాపు స్త్రీలు 1500 మంది పై గానే  వచ్చారు, ఒక్క ఈ ప్రాంతం లోనే ఇంతమంది మనవాళ్ళు ఉండటం అందరూ, ఇలా ఏకత్వం ప్రకటించడం చాలా హర్ష దాయకం!
. నిర్వహణ కమిటీ వారు, తెలంగాణ గ్రామీణ పదాలతో మాట్లాడుతూ, పాటలతో, మాటలతో  "తెలంగాణ దుమ్ము" డల్లాస్ లో రేపారు,. ! ఉత్సాహంగా స్త్రీలు , , యువతులు, పిల్లలు కొత్త చీరల్లో, మహాలక్ష్మి ప్రతి రూపంలో అలంకరించుకొని , చక్కగా అందంగా ముస్తాబై , తాము తెచ్చిన రంగు "రంగుల బతుకమ్మ" లని మద్యలో ఉంచుకొని ,రెండు గంటలు ఎంతోసంతోషం తో  సామూహికంగా బతుకమ్మ ఆట అడారు
, పిదప,.5 బహుమతులు కూడా చక్కని బతుకమ్మ లను సెలెక్ట్  చేయబడి బహుమతులు కూడా అందుకున్నారు ,
, మన తెలంగాణా సంస్కృతి నీ చాటే దప్పులతో, ఊరేగింపు చేస్తూ  బతుకమ్మ లను ఒక పెద్ద తొట్టిలో నిమజ్జనం చేయడం, దుర్గా మాత విగ్రహాన్ని డాన్స్ లతో సందడి చేస్తూ  ఉత్సాహం పెంచడం చేశారు,!! ఆటా పాటా అయ్యాక,
వనితలు అందరూ చేరి,, పరస్పరం ,పసుపు కుంకుమ ,గంధం ఇస్తూ, తెచ్చిన ప్రసాదాలు ఒకరికొకరు  అందరికీ అందజేశారు,.
DATA, Dallas area Telangana assosiation, కమిటీ వారు Frisco official అమెరికన్ ల తో మాట్లాడి స్తు, అందరికీ శుభాకాంక్షలు అందజేశారు.
పిదప , కళా వేదికపై ,భరత నాట్యం శైలి లో అష్టలక్ష్మీ వైభవం లాంటి పలు నృత్య ప్రదర్శనలు జరిగాయి,
,,మొత్తానికి తెలంగాణా వేదిక  ఐకమత్యాన్ని సూచిస్తున్నట్లు గా ఈ "బ్రతుకమ్మ పండుగ"" నిర్వహణ ఘనంగా జరిగింది!,
,, "అధర్మం పై ధర్మం"చెడుపై మంచి, దానవత్వం పై మానవత్వం""! సాధించిన ఘన విజయానికి. సూచనగా , తెలంగాణా రాష్ట్ర ఆడపడుచుల వైభవ చిహ్నంగా ,వెలిగే
బతుకమ్మ తల్లి కి మంగళ హారతి తో ధూప దీప నైవేద్యాలతో మంత్ర యుక్తంగా , పూజిస్తూ నీరాజనాలు సమర్పించారు,
,నిజానికి ఈ బతుకమ్మ పండుగ గొప్పదనం,ఆడపడుచులకు తమ కున్న గౌరవ మర్యాదలను, సంఘం లో గల ఔన్నత్యాన్ని  గుర్తింపును, సూచిస్తూ ఉంది,
,,అంతేకాదు,, మన తెలంగాణా రాష్ట్ర ,సనాతన సంస్కృతి సంప్రదాయాలను ,, బయట ప్రపంచానికి  బాహాటంగా సగర్వంగా ప్రకటిస్తూ ఉంది.  అదికూడా,సామూహికంగా,, , కుల ప్రాంత బేధాలు లేకుండా,, అందరూ అంతటా ఒక్కటై, ఒకే వేదిక పై, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ ఎలుగెత్తి చాటి చెప్పే తమఆనందమయ జీవన విధానం , ఈ బతుకమ్మ పండుగ !! మహత్వా న్నీ తెలియజేస్తూ ఉంది..
స్త్రీలకు ఇంత గొప్ప గుర్తింపు ను , గౌరవ మర్యాదలను ఇచ్చిన మన తెలంగాణ సభ్య సమాజం, తెలంగాణ జానపద సంస్కృతి కి గర్వకారణంగా ,తల మానికంగా ఈ తొమ్మిది రోజు లూ జరుపుకునే బతుకమ్మ పండుగ ను  అనుకోవచ్చును,,,!!
" అందం "అంటే పుష్పాలు,! "అందము "అంటే స్త్రీలు! అలాంటి అందమైన, పుష్పాలు ధరించి , ఆనందంగా పుష్పాల తో పుష్ప దేవత గా భాసిల్లే బతుకమ్మ ను పూజించే స్త్రీలు నిజంగా దేవతా స్త్రీ స్వరూపాలే కదా!
సృష్టిలో నీ సమస్త వస్తువుల కంటే , ఈ పుష్పాలు పవిత్రత కు, పరిమళానికి, అందానికి, ఆనందానికి, దైవత్వానికి చిహ్నాలు, !!
,,అందుకే ఏ దేవతా పూజకైనా ,పుష్పాలు లేనిదే పూజ అనిపించు కో దు కదా !!
,, మన హృదయాన్ని సుకుమారం అయిన పుష్పాలతో పోలుస్తూ, ఆ  హృదయ కమలాన్ని జగదంబ చరణ కమలాల ముందు సమర్పిస్తూ అనుదినం  తమ భక్తి శ్రద్దలను చూపుతూ ఉండడం మన ఇంటిలో ఒక దినచర్య గా చూస్తున్నాం,,
,, "బతుకమ్మ "అంటే ఎల్లప్పుడూ  ఆనందంగా ఉండే ఒక దేవతాస్త్రీ.వైభవం,!! అందుకే మన సంస్కృతి లో మొదటి పీట స్త్రీ కి వేస్తాం !; "మాతృదేవోభవ అంటూ మొదటి నమస్కారం తల్లికే  సమర్పిస్తూ ఉంటాం !!
ఏ ఇంటిలో స్త్రీలు, అలా నవ్వుల పువ్వుల సౌరభాలు విరజిమ్ముతూ సంతోషంగా ఉంటారో, ఆ ఇల్లు స్వర్గధామం లా శోభిస్తూ, పిల్లా పాపలతో, భార్యా భర్తల అనురాగం తో కళకళ లాడుతు రోజూ ఒక బతుకమ్మ పండుగలా, గృహిణి చల్లగా కాపాడే దేవతలా, గృహం స్వర్గ సీమ ను తలపిస్తూ నిత్యం ఆనందంగా ఉంటుంది., ఈ
పుష్పాల సొగసు, సౌకుమార్యం, పరిమళం, వైభవం, పవిత్రత ఇవన్నీ,, దైవ పూజకు  యోగ్యత ను సూచించే పరమ పావన పూజా ద్రవ్యాలు!, అందుకే పుష్పాలు దేవతా స్వరూపాలు   ,!!,
, పుష్పాలను అవమానించి అసహ్యించు కొనే వారు రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు,,
,, పూవులు తమ జడలో దాల్చుకొని,సర్వాలంకార శోభితులై సాక్షాత్తూ మహాలక్ష్మి రూపంలో ఉన్న స్త్రీ లు సాక్షాత్తూ దుర్గామాత  శక్తి స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ శోభాయమానంగా  ఉంటా రు !
,, ఇలా  వనితలంత కలిసి ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు , ఒకే చోట చేరి, తమ భక్తి శ్రద్ధలతో అ సంతోషంగా మాత వైభవాన్ని కీర్తిస్తూ చేసే ఈ ఉత్సవం , ఆనంద మంతా ఒకే చోట కుప్పలు పోసినట్టుగా పరమేశ్వరి సన్నిధానంగ , త్రిపురసుందరి మణిద్వీపం లా వెలుగుతూ ఉంటుంది., దుర్గామాత నవరాత్రుల ఉత్సవం కూడా ఈ బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల తో జరుపుకుంటూ ఉండటం అత్యంత ఆనంద కరం,! సకల పాప హరణం! భుక్తి, ముక్తి ప్రదాయకం కూడా !
"పండుగ అంటే  అందం అనందం! ఇవి రెండూ కలిసి బతుకమ్మ పండుగ అవుతోంది !!
అదికూడా అందరూ కలిసి ఆ ఆనందాన్ని ఒకే చోట చేరి పంచుకొంటూ ,పెంచుకోడం అపురూపం అద్భుతం!!
,,,,ఈవిధంగా  ,ఆడవారు,తమ అటా పాటా ద్వారా బతుకమ్మ అనబడే దేవతను ఆనందింప జేస్తూ   అర్చించే ఈ విధానం, వారికి తప్పకుండా దైవానుగ్రహం ప్రాప్తింప జేస్తుంది , కోరిన కోరికలు తీరుస్తూ ఉంటుంది అని అనుకోడం లో ఎలాంటి సందేహం లేదు, కదా!!,,,
,,,తమ స్వంత ఇండ్ల కు మాత్రమే ఈ పండుగను పరిమితం చేయకుండా,, ""సకల జనావళి శ్రేయస్సు"" ను అభిలషిస్తు సాగే ఈ "ప్రశాంత ఆనందమయ వాతావరణ ఉద్యమం "సర్వ జన సమ్మతం!, బహుళ జన ఆదరణ సమ్మిళితం కూడా,!!
,బతుకమ్మ పూలనిమజ్జనం తో జలదేవత ను కూడా సంతృప్తి పరుస్తూ, పూజించే అద్భుత ఆచార సంప్రదాయం, అటు కాలుష్య నివారణ కు ,, ఇటు ప్రకృతి దేవతా ఆరాధనా భావన పెంచుకోడానికి కూడా తోడ్పడుతుంది కదా!!
"  ఈ విధంగా ,,అందరికీ ఒక్కడే దేవుడు" అనబడే సూక్తి తో,, మన హైందవ ధర్మం లో దేవతలు దేవుళ్ళు ఎంతమంది కొలవబడుతు ఉన్నా, ఈ బతుకమ్మ పండుగ ద్వారా "అందరికీ దైవం" ఒకరే అని" భిన్నత్వంలో ఏకత్వాన్ని "సూచిస్తూ ఉండడం, చక్కని మన భారతీయ సనాతన సాంప్రదాయాన్ని  తెలియజేస్తూ ఉంది,,!
,,,,ప్రపంచంలో నే అత్యంత శక్తివంతమైన మహిళా శక్తి కి దర్పణం లా ప్రతిబింబిస్తూ ఉంది ఈ పండుగ   !!,
, అన్నీ దేశాల, అన్నీ మతాల, భాషల ప్రాంతాల మెప్పు ను కూడా పొందుతూ ఉంది మన ఈ బతుకమ్మ పండుగ!
,, అంతే కాకుండా, అద్భుతంగా, అంగరంగ వైభవంగా, వాడవాడలా, ఊరూరా, నగరం ,రాష్ట్రం, దేశం, మాత్రమే ఎల్లలు కాకుండా పరిమితి ,పరిది లేకుండా ప్రపంచం లో నలు మూలల విస్తరింప బడిన తెలంగాణా  సంస్కృతి నీ ,, కనుల పండుగ గా  రమణీయంగా , కమనీయంగా,,రంగు రంగుల పుష్పాల సౌరభం వలె విరాజిల్లుతూ విస్తరిస్తూ ప్రకృతి శోభతో పులకింపజేస్తునే   ఉంది ,!!,,
,, బ్రతినన్నాల్లు ఆనందంగా అందమైన పుష్పాల వలె, బ్రతకాలి!,,
, బతుకమ్మను ఇలా కొలుస్తూ ,"చల్లగా బతుకుదాం !""" అనే ఈ   అమూల్యమైన సందేశం ,, మన తెలంగాణా చరితకు, సమాజానికి , శాశ్వత కీర్తిని ప్రతిష్టను, ప్రపంచం లోనే ఉత్కృష్టమైన సమున్నత స్థానాన్ని , సమున్నత వైభవాన్ని, అందరికీ తెలియజేస్తూ ఉంది ,!! "బతుకమ్మ" అనే పదం లోనే మన  తెలంగాణా జానపద సాహిత్య సౌరభం "ప్రత్యేకత " నిండి ఉంది,,
బతుకమ్మ పాటలు, అందులో సాహిత్యం, అద్భుతం! తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, జీవన విధానాన్ని, ప్రతిబింబిస్తూ , పాడే వారిలో నూతనఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలగజేస్తు ఉంటాయి,
, బతుకమ్మ  ఒక్కొక్క పాట నిజంగా అమూల్యమైన ఒక్కొక్క ఆణిముత్యం,! అలాంటి భావ సంపద తో, మహదానందాన్ని అనుభవిస్తూ బతుకమ్మ ఆట ఆడే మహిళా శిరోమణులు నిజంగా అదృష్ట వంతులు!, మహా భాగ్య వంతులు కూడా!!
, ""చిత్తూ చిత్తుల బొమ్మ, శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన !"
,,"అంటూ  హుషారుగా సంబరంతో సాగే ఈ పాట సకల దేవతల ను ఆహ్వానం పలుకుతూ ఉంటుంది.. ! అలా సంతోషం తో అందరితో కలిసి తాళ యుక్తంగా భావ ప్రకటన చేస్తూ, బతుకమ్మ పాట పాడుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటం వేస్తూ, వంగుతూ లేస్తూ చేసే స్త్రీల పద విన్యాసం, బతుకమ్మ ముందు సమర్పించే గొప్ప "నాట్య ప్రదర్శన" లా తోస్తూ ఉంటుంది.
,, నవవిధ భక్తులలో, నాట్యం గొప్పది,! అంటారు ఎందుకంటే, ఇందులో హావభావాలు ,, తనువూ మనసూ, అత్మ సమర్పణ భావంతో ముడిపడి ఉంటాయి,,!
,,,, అందుకే,
"""ఏ దేశమేగినా ఎందు కాలిడినా తలపరా నీ  తెలంగాణ ( జాతి )నిండు గౌరవము!"", అనబడే విధంగా మన సంస్కృతిని ప్రతిబింబించే బ్రతుకమ్మ పండుగను   తొమ్మిది రోజులు బ్రహ్మాండంగా, బ్రహ్మానందం గా, బంగారంగా జరుపుకుందాము !!
,,,, మన సంప్రదాయాలను, దైవ భక్తి, దైవారాధన పట్ల విశ్వా సాలను , ఈ విధంగా పెంచుకుందాం!!
,, మన తెలంగాణా పట్ల మనకున్న అత్మ గౌరవాన్ని పెంచుకుంటూ, మన జాతి వైభవాన్ని  రక్షించు కుందాము,!
జై తెలంగాణా,!!
భారత్ మాతా కీ జై!!
వందే మాతరం! ,,
దుర్గామాత కి జై !!!"

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...