Sunday, December 8, 2019

నాకు నీవే దిక్కు, నీకు ఎవరు ?

Dec 5, 2019 Karimnagar
""స్వామీ, ! లీలా మానుష విగ్రహ రూపా ! అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ! జగన్నాథ !! నీవే మిటో,,?ఎక్కడుంటా వో,? ఏ రూపంలో, ఎలా ఉంటావో ?, ఏం చేస్తు ఉంటావో ??, నాకు తెలీదు గానీ,, జనార్దనా! నీవు సర్వాంతర్యామి వని ,,నీకు ఏవో  అద్భుత శక్తులు ఉన్నాయని అందరూ అంటు ఉంటారు. ,
ఎన్ని ఉన్నా ,,నీకు ఎందరున్న , ప్రభూ !నీ కంటే నేనే మేల య్యా !
నీకంటే నేనే ఘనుడ ను, ! అహం కారం తో కాదు, ఆర్ద్రత తో ఆర్తి తో, నీవంటే నాకు ఉన్న ఇష్టం తో అంటున్నాను,,! ఎందుకంటే,, చూడూ!
నాకు దిక్కు నీవని  నేను అందరికీ చెప్పుకో వచ్చు కదా,,! కానీ శ్రీకృష్ణా ,! నీకు దిక్కు ఎవరని  ఎవరైనా అడిగితే ,,ఏం చెబుతావు చెప్పు  ?
నాకు ఆధారము నిన్నుగా గుర్తిస్తా ను ,!
కానీ ,,రాధా మాధవా! , నీకు ఆధారము ఏది, ?అంటే ఏం చెబుతావు అనం తా ??
నిన్ను పూజిస్తే కొలిస్తే నా, జన్మ ధన్యం అవుతుంది,,! కానీ కమలాక్షా,! నీకు ఎవరున్నారయ్యా  తనివారా కొలిచేందుకు ??
నేను కోరిన వరాలిచ్చే పెన్నిధి గా నాకు నీవు కామధేనువు గా  ఉంటున్నావు !! కానీ,,
నీవు కోరింది   ఇవ్వడానికి ఏ దైవం ఉన్నాడు సిద్దంగా ! చెప్పు గోపాలా ??
నాకైతే ,నా అంతరాత్మ లో నీవు కొలువుంటావు !, కానీ దేవకీ నందనా ,,,  ఎవరున్నరయ్యా నీకు,, అంతరంగం లో నిలుపుకోవడానికి , ప్రభూ ?
నాకు స్వాతంత్ర్యం ఉంది ! స్వేచ్ఛ ఉంది , !ఇష్టం వచ్చి్నట్టుగా తిరగ నూ వచ్చు !తినవచ్చు,! తాగవచ్చు,! పడుకో వచ్చు,!
నన్ను అడిగే వా రే  లేరు,!
సంతోష మైనా ,,బాధలైనా , రోగం వచ్చినా నొప్పి గా ఉన్నా , నాకు చెప్పు కోడానికి బంధువు బలగము, భార్యా, పిల్లలు, స్నేహితులు  ఇలా ఎంతో మంది ఉన్నారు సుమా, ఓదార్చడానికి !! కానీ,
దేవదేవా ,! పరమాత్మా !! పరాందామా !,నీకు ఎవరున్నార య్యా ,, ""నావారు  ""అని చెప్పుకోడానికి,?! నీ వు పడుతున్న కష్టం సుఖం ఆవేదన అనందం పంచు కోడానికి
నేనున్నాను,, భయపడకు,, బాధ పడకు !""అంటూ ఓదార్చే దిక్కు లేకుండా ఒంటరి బ్రతుకే గడుపుతూ ఉన్నావు గదయ్య స్వామీ నీవు ??
నిలవడానికి , నీడ లేదు,! విశ్రాంతి తీసుకుందామని  అనుకుంటే ఒక ఇల్లు లేదు,! వాకిలి లేదు,!
పోనీ ఏమైనా అస్తి ఐశ్వర్యాలు ఉన్నాయా అంటే మచ్చుకు కానరావు!
కనీసం ,నంద నందనా ,! నిన్ను, దగ్గరకు పిలిచి ప్రేమతో, బుజ్జగిస్తూ ఇంత బువ్వ పెట్టే నాథుడే లేడు కదయ్యా! నాకు జాలి గా ఉంది,మధుసూదనా , నిన్ను చూస్తుంటే !,, నిత్యం నీ భక్తులు నీ ముందు నైవేద్యం  ఉంచి ,నివేదిస్తు ఉంటారు,,కానీ, మురళీ మనోహర, !నీవు ఇలా చేయి పెట్టగానే, నైవేద్యం పళ్ళెం లాగేస్తుంటారు ,కదా! ఇక నీ ఆకలి తీరే దెలా, నంద గోపాలా??
""స్వామీ,,! నీకు లాలి పాట లు  మధురంగా పాడేందుకు "అన్నమయ్య" లేడు,!"
""నీ సురుచిర సుందర సుకుమార లావణ్య వైభవ దివ్య మంగళ మూర్తికి , కళ్యాణ కరంగా , పరమానంద భరితంగా మంగళ హారతి పడదామంటే నీ ప్రియ సఖుడు "త్యాగ య్య "లేడు
తండ్రీ,, !!
నీకు చక్కని శ్రావ్యమైన భక్తి గీతాలు ఆత్మానుభూతి తో అనుభవిస్తూ ,వినిపించే నీ భక్తురాలు మీరాబాయి, ఇపుడు,, నీ వద్ద  లేదు గదా కృష్ణా??"
""పోనీ, నీవే ప్రాణంగా,, నీవే తన కంటి దీపంగ భావిస్తూ,, ప్రేమతో , గోరు ముద్దలు పెట్టడానికి, వెన్న ముద్దలు ,మీగడ ,పెరుగు, జున్ను పాలు, త్రాగించ డానికి నంద యశోద లు , కూడా ఎక్కడా కనపడటం లేదురా ,,కన్నా!!
""కన్నతల్లి ఒడిలో సేద తీరాలని , కొంత అలసట, ఆయాసం ,తగ్గించు కొవాలని నీకు  ఉన్నా గోవిందా !! ఆ దేవకీ దేవి కూడా  అందుబాటులో లేదు కదా
అచ్యుతా, !!""
తాను పుట్టుక తో అంధు డైనా కూడా , నీవు తన ముందు కూర్చుని వుంటున్నవన్న   తన్మయత్వం తో ,,మైమరచి  నీగురించి న  సు మధుర గీతాలు  పాడే ఆ ""సూరదాసు" ",,ఎక్కడ వేదకినా అగుపించడం లేదురా కన్నయ్యా!!
ఏం చేయను ??
నీ ప్రియ సఖి, నీ ఆరాధ్య దేవత, అపర గోలోక వాసిని ఆ రాధాదేవి తో నీవు చేసిన రాసలీల వైభవాల ను అత్యంత మధురంగా,, శృంగార రస భరితంగా , అద్భుతంగా అష్టపదుల లో వర్ణించి చెప్పిన ఆ జయదేవుడు లేడ య్యా , నీ ఒంటరితనం పోగొట్టడానికి !!
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చెప్పడం తప్ప నిన్ను ఆదరించి , స్వాగతించి, షోడశోపచార ముల తృప్తి పరిచే ఆత్మ బంధువు లు ఎంత వెదకినా ఆగుపించడం లేదు వేణుగోపా లా !! ఏం చేయను? ఎలా నీ సేవ చేయను ?
నాకు అంత భక్తి శక్తి శ్రద్ధలు లేవు గానీ,గోపాలబాలా, నీపై,కాస్త ఆర్తి ఆసక్తి,,ఉందయ్యా నాలో !""
నీకు ఇష్టమైన వారెవరూ నా పిలుపుకు అంద డం లేదు,,!
అందమైన కీర్తనలు రాసి పాడి అందరితో ఆడుతూ అందంగా అనందం తో పాడించిన నీ దాసుడు ఆ ""రామదాసు "కూడా నీ మాట విని వచ్చే వీలు లేదు కదా కేశవా!!
""రాధా మనోహర ,! గోపికా వల్లభ,! ఇక మిగిలింది ఆ గోప గోపికలు!! వారు నీ నామా స్మరణ ధ్యానం లో మత్తులై, తమను తామే మరచి ,ఈ లోకంతో ,నీతో ఏ సంబంధం లేకుండా ,నీ లీలా వినోద వైభవ స్మృతుల లో మునిగి లీనమయ్యారు  ఆ గోప గోపీ జనాలు !"
  అలా ఎందరో ఉన్నారు రా కృష్ణయ్యా  ,నా వాళ్ళు అని  నీవు చెప్పడానికి !!
కానీ ఇప్పుడు  నీ అక్కరకు రావాలి కదా ,,నీ మంచి చెడు చూడాలి కదా
మాధవా, !!
అలాగే,, నేను కూడా నీ కోసం ఆరాటపడు తూ ఉంటానురా,, చిన్ని కృష్ణా ! నా ప్రాణమా ! నా ఆరాధ్య దైవమా ! నా జీవనాధార మా !! పరందామా !! పరాత్పరా !!
నీ వాళ్లంత ప్రేమను నేను  కురిపించ లేను,! ఆత్మార్పణం చేస్తూ, జీవితాలను కృష్ణార్పనం చేశారు వారు, నీ భక్త బృందాలు,  చేసే భక్తి జ్ఞాన వైరాగ్య సంపదలు  నాలో అంతగా లేవు శ్యామసుందరా !! వారికున్నం త వాత్సల్యం త్యాగ నిరతి, అత్మ సమర్పణ భావం, భక్తి శ్రద్ధలు , సంకీర్తనలు చేసే సంగీతం సాహిత్యం , నీతో సాంగత్యం ,,నాకు లేవు రా నల్లనయ్య!"
కానీ ,నీ చిత్రాలు గీస్తూ, నీ గీతాలు పాడుతూ, నీ గురించిన దివ్య వైభవ గాథలు రాస్తూ,  నిరంతరం ,నీ బంగారు శృంగార లీలలను  చింతిస్తూ వుంటాను రా కన్నా!
నా  ఈ దేహం ఆలయంగా,, హృదయం రత్న సింహాసనం గా , నా ప్రేమ దివ్య జ్యోతిగా భావిస్తూ ,,నిన్ను నా లో చూస్తూ, భావిస్తూ పూజిస్తూ ,నిత్య నైవేద్యంగా నీకు ఇష్టమైన జున్ను ,పాలు ,వెన్న మీగడలు ఆరగింపు చేస్తాను ,దేవాది దేవా!!
నీవు రాముడివో ,,కృష్ణుడువో,, శివుడ వో ,,లక్ష్మీ ,వాణి భవానీ, రూపాని వో, గణపతి వో ,ఎవరివో  తెలియదు గానీ, నీవు మాత్రం ""ముద్దుగారే  ఆ యశోద ముంగిట ముత్యము ""లా బాల కృష్ణు డి రూపంలో నన్ను అలరింప జేస్తూ అనందాన్ని కలుగజేస్తు వుండాలి రా ముద్దుకృష్ణా !
ఓ నటన సూత్రధా రీ !
, నీ వు  ప్రసాదించిన వేణువు తో  నీకువేణు గానం వినిపిస్తూ నిన్ను ఆనందింప జేస్తూ ఉంటాను! చిన్ని కృష్ణా!
నీవు రాధమ్మ తో విహరించిన చిత్రాలు  నిన్ను రంజింప జేయగలవు అని అనుకుంటూ ఉన్నపుడు, నా లో మ్రోగే నీ వంశీ నాదం నాకు మధురా నందాన్ని కలిగిస్తూ ఉంటుంది గోపికా వల్లభ!!"
నీ లీలలను రాగ తాళ భావ యుక్తంగా పాడుతూ నిన్ను సంతోషిం ప జేసే ప్రయత్నం జేస్తూ ఉంటానురా బాల ముకుందా!!
యదు నందనా ,!
నీ వంటే నాకు  చెప్పరాని ""పిచ్చి ప్రేమ,!"" నీ ముగ్ద మనోహర సుందర లావణ్య రూపాన్ని తలుచుకుంటూ  ఉంటే ఆర్ద్రత తో కళ్ళు చెమ్మగి ల్లుతూ ఉంటాయి!
ఆనంద భాష్పాలు  పొంగి పొర్లుతూ పోతుంటాయి! ఒక్కమాట లో చెప్పాలంటే,, వెన్నదొంగా, నీవు నాలో నర్తిస్తు, వేణువు వినిపిస్తూ, నన్ను మైమరపిస్తు, నాతో నీ గురించిన వర్ణ చిత్రాలు వేయిస్తు, నాచే నీ వేణువు పలికిస్తూ, నీ గాథలు వినిపిస్తూ, రమణీయంగా వాటిని తిరిగి నాచే రాయిస్తూ, ఇలా నీవు నన్ను ఎడబాయకుండ ,నీకోసం నన్ను ఏదో ఒక విధంగా వినియోగిస్తూ, నా జన్మను సార్థకం చేస్తూ ఉంటున్నా వు గదా శిఖి పించ మౌళి!
కృష్ణా! నీ రూపం మధురం, నీ పిలుపు తలపు వలపు, మధురాతి మధురం కదా ! జగతి పై నీవంటే ఇష్ట పడని వాళ్లుండరు కదా ! లీలా మృత గానం వింటూ ఉన్నప్పుడల్లా ,మనసు ఏరులా పరవళ్ళు త్రొక్కుతూ పరవశిస్తూ  బ్రహ్మానందం కలుగుతూ ఉంటుంది
జగన్మోహన !!, నీ వర్ణ చిత్రాలు వేస్తున్నా, నీ లీలలను వేణు గానం చేస్తూ  ఉన్నా, నీ పై పాటలు  ఆనందంగా కీర్తిస్తూ ఉన్నా ,ఆకలి నిద్రా, సమయము , పరిసరాలు, ఏమీ తెలియ వు కదా ,,వాసుదేవా ! ఎంత దయ గల వాడవు, గోవిందా!
నిన్ను ఎప్పుడూ ఎడబాయ ని భావ సంపద ఇచ్చావు!
నీ మోహన రూపం తో మమేకం అయ్యే మనసును ఇచ్చావు!
తరగని పెన్నిధి లాంటి నీ సన్నిధి కి నన్ను చేర్చు కున్నా వు,,!
చాలు, భగవన్! ఇది చాలు!
"నిత్యం త్వచ్చరణారవింద యుగళ ధ్యానామృత స్వాది నామ్,. ,, అస్మాకం , సరసీ రుహాక్ష ,! సతతం,సంపద్యతాం ,, జీవితం !!"
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!

అర్జున

Dec 4, 2019 Karimnagar
""ప్రణామాలు,, గురుదేవా!!"
""ఎవరూ అర్జును డే నా?""
""మీకు సాష్టాంగ ప్రణామాలు  చేస్తున్నాను , స్వీకరించండి !""
""అభీష్ట ఫల సిద్ధిరస్తు ! అర్జునా ! విజయోస్తు!""
""",మహాత్మా ! మిమ్మల్ని చూసి, మీ పాద పద్మాలు తాకి ,,మీ పాద ధూళి శిరస్సు పై గ్రహించిన నేను, ధన్యుడ నయ్యా ను;!"" ,
  ""అర్జునా ! యుద్దం ఆరంభమయ్యే క   అగుపించావు కదా ! పాతికేళ్ల క్రితం చూశాను , నిన్ను రాజసూయ యాగం సమయం లో,! ఇన్నాళ్ళ తర్వాతే  నా ప్రియ శిష్యుని చూస్తున్నాను ,,! నాయనా! ఒకసారి నిన్ను అక్కున చేర్చుకోవాలని ఉంది ,! దగ్గరకు రా ,,, వత్సా!!""
""గురుదేవా !!  ఇంతకన్నా మహా భాగ్యం ఉంటుందా ?? నాకు చాలా ఆనందంగా ఉంది  !""
,""ఈ రోజు నా తపస్సు ఫలించింది! , నా లక్ష్యం నెరవేరింది. అర్జునా!""
""గురుదేవా !ఈ మాట నేను అనాలి, ! అపర మహేశ్వర స్వరూపం గా మూర్తీభవించిన మీ దర్శనం తో నా జన్మ తరించింది,!
పాద రేణువు లా మీ పాదముల చెంత ఉండాల్సిన నన్ను,, మీరు,,మీ హృదయానికి హత్తుకు ని నాకు మహదానందం కలిగించారు ,!! నిజంగా నా అదృష్టం ఫలించింది స్వామీ!;""
""ఆహా !అర్జునా ! నిన్ను చూసి ఒక గురువుగా గర్వంగా ఉంది,  నాయనా !!నా శిష్యుడు అర్జున ఫాల్గుణ పార్థ కిరీటి ధనుంజయ సవ్యసాచి విజయ మొదలైన  పది నామాల  మహోన్నత బిరుదులతో భారతదేశం అంతా  కీర్టింపబడుతున్నాడు!
పరమేశ్వరుని మెప్పించి, పాశుపత అస్త్రం పొంది, దేవేంద్రు నిచే సన్మానింపబడిన  అస్త్ర శస్త్ర కోవిదుడు,!" సమరం లో విజయమే "తప్ప ఓటమి ఎరుగని  నా శిష్యునికి  ,, ,సాక్షాత్తు ఆ నారాయణుడే  శ్రీకృష్ణ అవతారి యై ,,స్వయంగా, నా ప్రియ శిష్యునికి ,రథ సారథి గా "విజయ సారథి"" యై నీకు విజయాన్ని ,, ధరణి పై ధర్మాన్ని , నెలకొల్ప నిశ్చయించాడు,!! ఏ గురువు కైనా
ఇంతకంటే  శిష్యుని నుండి ఆశించేది ఏముంటుంది చెప్పు! అయితే,
అంతటి మహనీయ త ,,గుర్తింపు  తనకు ఉండి కూడా ,  మరచి పోకుండా తన గురుసంప్రదాయానికి గౌరవం ఇస్తూ  , గురువు పట్ల తనకున్న వినయ విధేయతలు,, భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ గురుదేవుల ను దైవంగా భావిస్తూ ఆశీస్సుల కోసం  స్వయంగా వచ్చి ప్రణామాలు సమర్పిస్తూ ఉండడం  నీ గురువుగా నాకు, నా శిష్యుడు గా నీకు అత్యంత సంతోష దాయకం , అర్జునా!
ఏ శిష్యుడైన , ఎంతటి మహోన్నత పదవీ, యశస్సు పొందినా , తన ప్రతిభకు , విజయానికి తన గురు కటాక్షమే కారణంగా భావిస్తూ , గురువు పాదాలకు నమస్కరించి తన శిరస్సును తాటించిన  శిష్యుడు నిజంగా  ధన్యుడు.!! , అతడి ప్రతిభా పాటవాలు, గౌరవాలు శాశ్వత కీర్తిని పొందుతాయి,!!
ఇది నిశ్చయం !నా మాట వేద సమ్మతము !!""
"" స్వామీ, మీ ప్రేమ, వాత్సల్యము, మీ ఆశీస్సులను అందుకున్న నా జన్మ ధన్యం , గురువరా!  వాస్తవానికి ,నేను వేసే ప్రతీ అడుగు  మీ దీవ నా బలం తోనే ముందుకు సాగుతోంది  !""
""అర్జునా ! ఇంతకూ నీ రాకకు కారణం ఏమిటి ,! యుద్దం మద్యలో అర్ధాంతరంగా వచ్చావు ,! నీవు వచ్చిన పనేమి టో నిస్సంకోచంగా చెప్పు నాయనా ??""
""గురుదేవా!  నేను వచ్చింది, కేవలం మీ దీవన లు పొందడానికి మాత్రమే ,! అయితే,
స్వామీ ! ఒక్క అనుమానం  నన్ను పీడిస్తోంది  ,ఈ యుద్దం ప్రారంభం అయిన రోజు నుండి !
గురుదేవా !, భారత సమర సంగ్రామం లో శ్రీకృష్ణ సారధ్యం లో ,నేను భీష్మా ది ఆచార్య ప్రముఖులతో యుద్దం చేస్తున్నపుడు , కౌరవ సేన ముందు ఒక తేజోవంత మైన ఆకారం  అటూ ఇటూ వేగంగా కదులుతూ నాకు గోచరిస్తుంది , ప్రతీ రోజూ ,!!
అది ఎవరు? అక్కడ ఏం చేస్తోంది ,? ఎక్కడినుండి వచ్చిందో, ఎందుకు వచ్చిందో ,తెలుసుకోవాలని ఉంది స్వామీ !!""
""అర్జునా!  నీకు  సారధ్యం వహించే  గోవిందుని అడగ వచ్చు కదా ?""
గురుదేవా , ! నాకు ఏది  అవసరమో   అది మాత్రమే చెబుతాడు, చేయిస్తాడు కూడా,! అదీ గాక, ఇది చిన్న విషయం కావచ్చు, లేదా అనవసర అనుమానం కావచ్చు, అందుకే అడగ లేక పోయాను, !అదీగాక,,
మీ పక్షాన. మీ వైపు న  ఉంటూ,,, మీకు అభిముఖంగా నిలుస్తు  కనిపిస్తున్న ఆ విచిత్రమైన  విషయం మీకు తప్పకుండా తెలిసి వుంటుంది ,! ఎందుకంటే మీరు బ్రహ్మ నిష్టా గరిష్టు లు  ! మహా తపో సంపన్నులు,! పరమేశ్వరుని ఉపాసకులు ,!,మీకు తెలియ కుండా యుద్ధరంగం లో ఏదీ జరగదు  కదా ,స్వామీ! దయచేసి  నా సందేహ నివృత్తిి చేయండి !.""
""సరే అర్జునా ! కానీ , నీకు అగుపించే ఆ ఆకారం ఎలా నీకు కనిపిస్తూ ఉంటుం దొ చెప్పగలవా??"
""గురుదేవా ! అది లీలగా , అతి దూరంగా, ఒక ధూపం లా  మాత్రమే చూస్తూ ఉంటాను!!""
""ఇంకా జ్ఞాపకం చేసుకొని చెప్పు ,నాయనా!!""
అది ఒక్క చోట ఉండదు ,! వాయు వేగ , మనో వేగాలతో యుద్ద రంగంలో తిరుగాడుతు ఉన్న ట్టు కనిపిస్తూ ఉంటుంది ,గురుదేవా!!"
""అర్జునా!   ఈ సారి, ఆ ఆకారాన్ని అంతరంగం లో ,ధ్యానిస్తూ  తిరిగి దర్శించే  ప్రయత్నం చెయ్యి అర్జునా ,!!""
""గురుదేవా! మీరు చెప్పినట్టే ధ్యాన సమాధి లో వెళ్తున్నాను ! అదిగో,, అదే ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది,  !""
""అర్జునా!! చూడు,,! ఆ ఆకారం  చేతుల్లో ఏమైనా ఉందా ?!!"
""ఉంది , స్వామీ ,! తేజోవంతమైన ఒక పెద్ద పొడవాటి త్రిశూలం,,!!""
""అర్జునా !ఆ ఆకారాన్ని ఇంకా పరిశీలించి చెప్పు,,!!"
""గురువరేన్యా ,! ఆ ఆకారం శిరస్సు పై నుండి  జడలు  దశ దిశల్లో విస్తరిస్తూ కాల సర్పం లా బుసలు కొడుతూ ,వేడి వేడి పొగలు గ్రక్కుతూ  ఉన్నాయి,!!
""అర్జునా ! బాగా చూడు;, ఆ ఆకారం మెడలో ఏమైనా చూస్తున్నావా,??"
""అవును ,,గురుదేవా! అవును!! చూస్తున్నాను ,,!ఆ  కంఠాన్ని చుట్టుకొని ఒక మహా సర్పం వ్రేలాడుతూ అగ్ని జ్వాలలు క్రక్కుతోంది ,! , అమ్మో! ఇంకా చూస్తుంటే భయమేస్తోంది  !కళ్ళు తిరుగుతూ న్నాయి !, మహాత్మా !నేనింక  చూడలేను ;!""
""అర్జునా,,అర్జునా! భయపడకు !!నీకు ఏమీ భయం లేదు !ఇక కళ్ళు తెరువు ,! నీకు శుభం జరుగుతుంది!""
,, ""గురుదేవా!  ఏం జరుగుతుంది ?, ఎవరు అతడు ?""
""నీకు ఇంకా తెలియడం లేదా , అర్జునా,! మీ కు జయం చేకూర్చడానికి  యుద్ధరంగం లో దిగి  వీర విహారం చేస్తున్న వాడు ఎవరో కాదు ,, అతడు సాక్షాత్తూ ఆ  పరమేశ్వరు డే !!"
ఏమిటి శంకర భగవానుడే ,!! మహాదేవు డే ,!కానీ ,,గురు వరా ;, మా కు జయం  సమకూర్చాలంటే , అతడు మా వైపు నిలుచుం డి,,  శత్రు సైన్య తో పోరాడాలి గానీ , కౌరవు సైన్యం వైపు ఉండి, ఎలా మాకు విజయాన్ని సమకూరుస్తారు స్వామి ?!!""
. ""అదే శంకరుల చిద్విలాసం,, అర్జునా! , కౌరవ వీరులు పాండవుల పై  వేసే అస్త్ర శస్త్రాలను  వారి ప్రక్కనే ఉంటూ , అక్కడి కక్కడే నిర్వీర్యం చేయ డం ద్వారా ఈశ్వరుడు  మీకు పరోక్షంగా సహాయం చేస్తూ జయాన్ని అందజేస్తూ ఉన్నాడు,, ఆ పరమ దయాలువు పరమేశ్వరుడు , !
అర్జునా ,! ఈ విధంగా ఆ హరి హరులు ఇరువురూ కలిసి, యుద్ధంలో, ధర్మ బద్ధంగా పోరాడుతున్న మీకు విజయం కలిగించ డానికి  సహకరిస్తూ ఉన్నారు  ! జయీ భవ!""
"""మహాత్మా ! గురుదేవా నాకు పరమేశ్వర దర్శనం కలిగించి నన్ను దన్యుని చేశారు !!మహాదేవ మహాదేవ ! గౌరీ శంకరా నమో నమః ! పాహిమాం  పరమశి వా ,,!రక్షమాం, సదాశివ !""
, గురువ రా !, మీకు శతకోటి ప్రణామాలు!ఇక నాకు సెలవు ఇప్పించండి !
రేపు యుద్ధరంగం లో కలుసు కుందాం,ప్రణామాలు!"  ,,
""అర్జునా !విజయోస్తు , శుభమస్తు ! వెళ్ళి రా,నాయనా!
ధర్మం ఎక్కడో, అక్కడే భగవంతు డు !భగవంతుడు ఎక్కడో, విజయం అక్కడే!!
జయం ,శుభం,!""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !!

బియ్యపు గింజ

Dec 4, 2019 Karimnagar
మా చిన్నతనం లో అంటే 60, సంవత్సరాల క్రితం, పల్లె గ్రామాలలో, స్త్రీలు, పొలాల లో స్వయంగా కష్టపడుతూ ,వరి ధాన్యం పండించిన ట్లుగా నే ,,తామే స్వయంగా వడ్లు దంచి దంపుడు బియ్యం తయారు చేసు కునే వారు,! పండగ, పెళ్లి రోజుల్లో అయితే అందరూ ఒక్కచోట చేరి , ఉచితంగా , ఉదార స్వభావంతో ఆ ఉత్సవాన్ని ,కలిసి మెలిసి ఆనందంగా  చేస్తుండే వారు,!
ఇది వారి నిత్యకృత్యం గా ఉండేది ! ఇది కుటీర పరిశ్రమ , అంటే ఇంట్లో నే ఉండి కావాల్సిన పదార్థాలు తయారుచేసుకునే విధానం,
తర్వాత గిర్నీ లు అంటే కరెంటు తో నడిచే మర యంత్రం floor mill ద్వారా నేరుగా వడ్లగింజలను ఆ మర యంత్రం లో పోసి ఏ మాత్రం శ్రమ లేకుండా బియ్యాన్ని తీస్తున్నారు,
కానీ ఈ విధానంలో పొందే బియ్యంలో ఉన్న పోషక పదార్థాలు అన్నీ తొలగించ బడి, మనం పొందే బియ్యం  నిస్సారమై పోతూ,, ఆ ది తినడం వల్ల నీరసం నిస్సత్తువ తో మనిషి బలహీనుడు గా తయారై రోగాల పాలౌతు ఉన్నాడు, అనే విషయం అందరికి తెలుస్తు ఉంది కూడా ! సరే , కుందెన అసలు విషయాన్ని తెలుసుకుందాం !,
,,,,,వడ్లు పోసే దానిని "కుందెన" అంటారు ! ఇది ఇనుప రేకుతో , స్తూపాకారం గా , పైకి ఎక్కువ  వెడల్పుగా కింద తక్కువగా తయారు చేయబడి ఉంటుంది!, దీని అడుగున  పెద్ద రోలును ఉంచుతారు . ఇప్పుడు అందులో వడ్లు పోస్తారు, అవి లోపల రోటిపైన, కుందెన లోపల కుప్ప లా పడి ఉంటాయి.
  ఈ వడ్ల ను , బలంగా రోకళ్ళ తో దంచినపుడు వడ్లగింజల పై న ఉండే పొర ఊక  తొలగి, తెల్లని బియ్యపు గింజ కనిపిస్తు ఉంటుంది, ఆ కాలంలో ఆడవాళ్ళకు ఇది చక్కని వ్యాయామంగా ఉంటూ , వారి మనో భావాలు చెదరకుండా ఉంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఉండేవాళ్ళు !!
ఈ విధంగా వడ్లు దంచడం ద్వారా లభించే బియ్యాన్ని "దంపుడు బియ్యం" అంటారు
ఈ బియ్యం పుష్టి కరం! శ్రేష్టం ,! పుష్కలంగా పోషక పదార్థాలు ఉండటం వలన  అలాంటి భోజనం తో అప్పటివారు బలంగా దృఢంగా రోగాలు నొప్పులు లేకుండా హాయిగా  దీర్ఘాయువు తో జీవించేవారు,!;
ఆ కాలంలో ఏది చేసినా అందరూ కలిసి చేసేవారు ,! కలిసి పంచుకొని తినేవారు,! కలిసి సుక్షేత్రాలకు వెళ్లే వారు కూడా,!
""పదిమందిలో పరమాత్ముడు ""ఉంటాడు అన్నట్టుగా  అలా ఆడుతూ పాడుతూ కలిసి పని చేసే వారి ప్రక్రియ తో సమైక్యత  భక్తి భావన  వాతావరణం ఏర్పడేది అందరిలో..!!
ఈ వడ్లు దంచే విధానం లో కూడా ఒక పరమార్థం దాగిఉంది,! అది గమనించాలి మనం!!
ఆ పరమాత్ముడు ,,ఈ ,జీవులను హాయిగా కులుకుతూ సంతోషంగా ఉండనీయకుండా,  బ్రహ్మాండం అనే  ఈ కుందెన  లో ,,"వడ్ల గింజల" వలె ఈ "జీవులను" వేసి, వారి "కర్మబందాలు"" అనబడే  ""ఊక"" (ఉనుక )పొర ఊడే విధంగా," వ్యామోహం  అనే రోకళ్ల తో ," జ్ఞానం" అనబడే తెల్లని స్వచ్చమైన ముత్యం లాంటి బియ్యపు గింజ బయట పడే వరకూ దంచుతూ ఉన్నాడే. !! అంటే కుందెన లో నే గుండ్రంగా త్రిప్పుతూ  ఉన్నాడు కదా!!
ఆ జీవులకు  ,,ఈ అజ్ఞానపుపొర ఎన్నడు ఊడేను? ఈ రోకటి పోటు వారికి  ఎన్నడు తోలగేను పల్లె వనితలారా !!
అందుకే మీరు ,""హరీ హరీ, సువ్వీ సువ్వి !""అంటూ ఆ శ్రీహరిని కీర్తిస్తూ,, వేడు తూ మాకై, కోరుతూ, చేయండి శ్రమ!పొందండి సౌభాగ్యం! చూడండి సత్ఫలితం !; దారుణమైన ఆ రోకటి పోటుకు తాళ లేని అల్ప జీవుల మైన  మాకు సత్వరంగా ముక్తిని ప్రసాదించ మని చెప్పండి,,దయగల ఓ తల్లుల్లారా !!"
మీరు కుందెన లో ఉన్న వడ్ల గింజల పై పోటు వేయడానికి ఒక చేతితో రోకలి ని మధ్య లో పట్టుకుంటూ పైకెత్తి,, రెండవ చేతితో  బలంగా కుందెనలోకి దింపుతూ ఉంటారు కదా,!! ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా,
వేగంగా , మీ శక్తి కొద్దీ ,మీరు వేసే ఆ పొడవాటి  రోకళ్ళ కర్ర దెబ్బ లకు తట్టు కొలేక వడ్ల గింజలు చెల్లా చెదురుగా ఎగురుతూ పడి పోతూ ఉంటాయి,!
ఓ పడతులారా !! రోకలి పట్టుకొని గట్టిగా పోటు వేసేముందు మీరు ,, మీ దృష్టిని  అటూ ఇటూ పోనీకుండ , మీ రెండు కళ్ళూ  సరిగ్గా కుందెన లోని వడ్ల గింజల వైపే కేంద్రీకరించి, ఏకాగ్ర చిత్తంతో రోకల్లు క్రమ పద్దతి లో వేస్తూ ,,వడ్లు దంచుతూ ఉంటారు కదా!!
అలాగే ఆ పరమాత్ముడు కూడా "రాత్రి పగలు" అనబడే తన రెండు కను రెప్పలను  ఒకేసారి "సంగడి" చేసిజీవులనూ చూస్తూ,,"ఈ  నాలుగు దిక్కులు ""అనబడే తన నాలుగు చేతులతో   , రోకళ్ళ వరుస ఘాతాల కు ఓర్వలేక భీతిల్లు తూ, దూరం తొల గే, జీవు లు ప్రక్కలకు తప్పించుకు పోకుండా , సరిగ్గా  పోటుకు గురి అయ్యేలా రోకలి కిందికి వచ్చేలా    కదుపుతూ ,, పొర తొలగించే ప్రయత్నం చేస్తూ నే ఉన్నాడు  ,,
కానీ జీవితం పై ఉండబడే వ్యామోహం అనబడే మాయలో గిల గి లా కొట్టుకుంటూ ,"" పునరపి జననం ,పునరపి మరణం,"" పునరపి జననీ , జఠం రే శయనం ,!!""అను రీతిలో , బావిలో కప్పల వలె,  తమ  వాస్తవ దుస్థితిని గ్రహించకుండా ఉంటున్నాయి కదా ఈ  వడ్ల గింజ స్వభావం కల ఈ జీవులు,!
" అజ్ఞానం" అనబడే "మాయా పొర ""లాంటి అవరణ  లో   ఉంటూ "అదే లోకం ""అనుకుంటూ,, భరించలేని ఈ రోకటి దెబ్బ లు అనుభవిస్తూ కూడా,, ""అదే సౌఖ్యం! అదే మహదానందం!""గా  భ్రమ పడుతూ  ,, పిచ్చి అనందం తో ఎగిరెగిరి పడుతున్నా డు జీవుడు,!!
కానీ, భగవంతుని  ఈ" దంపుడు విధానం" తమను ఉద్ధరించడానికి , తనలో బియ్యం గింజ వలె మెరిసే జ్ఞానం ఆనబడే రత్నాన్ని వెలికి తీసే ప్రయత్నం అని గ్రహించడం లేదు !! జీవితంలో నిరంతర సంఘర్షణ సమస్యలు, ఆటు పోటు లు ఇవన్నీ పరమాత్ముని సృజనలే అనీ, తట్టుకొడానికి తన సామర్థ్యం చాలద నీ, పరమాత్మ ధ్యానం వల్లనే మాయావరణం పొర తొలగి ముక్తి లభిస్తుందని  జీవునికి తెలియాలి, ఇదే అత్మ దర్శనం, ఆత్మలో పరమాత్ముని దర్శించడం ,! అలా చేస్తే , రోక లి  పూల మాల అవుతుంది , కుందెన భగవంతుని కోవెల అవుతుంది ,,, అపుడు ఈ బియ్యపు గింజ కు పరంధాము ని  ప్రసాదంగా వినియోగించే యోగ్యత. సిద్ధిస్తుంది. !! తమను ఈ విధంగా  "ఆడించే ""వాడు  తమకు మేలు చేస్తున్నాడు,, అని భావించడం లేదు ఈ జీవులు ,!!
అందుకని ఓ పల్లె పడుచు లారా,, !! మీరు వడ్లు దంచడానికి , రెండు చేతులూ ఎత్తి,  చెమట పడుతూ ఉన్నా , ఎంతో శ్రమిస్తూ, కూడా, స్వామి కార్య దీక్షతో, నిరంతరంగా రోకల్లను కదుపుతూ , ఏకాగ్ర చిత్తము తో ,కుందెన లో సామూహికంగా పోటు వేస్తూ, స్వచ్చమైన బియ్యాన్ని పొందుతారు. ! దానినుండి, పరిశుద్ధమైన, భగవద్ నివేదన కు యోగ్యమైన ఆహారం  తయారు చేసుకునే క్రమంలో ,,మీరు అంతా కలిసి ""హరి నామం గానం"" తో , శుద్ది చేస్తూ ఉత్తమ పౌష్టిక పోషక పదార్థం గా రూపొందిస్తూ ఉన్నారు ,,
ఆ పరందాముడు కూడా ఇలాగే , జీవులను ఉద్దేశించి ఇదే పరమార్ధాన్ని సూచిస్తూ ఉన్నాడు !
ఓ జీవులారా!, మీలో  ""అణిముత్యం "లా  అంతరంగం లో  మెరుస్తున్న తెల్లని బియ్యపు గింజను నాకు ప్రసాదంగా. భావిస్తూ సమర్పించండి !!
మీకు "జీవన్ముక్తి" అనుగ్రహిస్తాను !!,,అనగా ఈ " సంసారం"" అనబడే కుందెన నుండి తప్పిస్తాను !,
ఎన్నాళ్ళ నుండో ,ఇలా  వరుస దెబ్బలు తింటు ఉన్నా  కూడా, నా గురించిన ధ్యాస లేకుంటే,, ఇక మీ గతి ఇంతే !"ఇదంతా నేను అనీ, నా అనుగ్రహం అని, మీరు అనుభవిస్తూ ఉంటున్న కర్మ బంధాల నుండి, నా దయ లేనిదే విడి వడ లేరనీ తెలుసుకోండి !!
"హరి నామం '""పలకండి , మీరు తినే దెబ్బలు పుష్పాలు గా మారుతాయి!
మీలో జ్ఞానం వికసించి, ఉడికిన బియ్యపు గింజ రక్తం లో జీర్ణం అయినట్టుగా, మీరు నాలో ఐక్యం అవుతారు!! అని భగవంతుని గీతా వాక్యం!!
ఇదిమానవ జీవన రహస్యం!!
ఈ విధంగా ,,మన సనాతన హిందూధర్మ శాస్త్ర జీవన చర్య లను, ఏ కోణం నుండి చూసినా ,,"అడుగడుగునా  ""దైవ భావన" ప్రస్ఫుటంగా కనిపిస్తుంది!
అందుకే చూసే కన్నులు ఉండాలి గానీ, ""ఎందెందు వెదకి చూచిన ,,అందందే కలడు పరమాత్ముడు ,!""
""యద్భావం తద్భవతి !"అంటుంది వేదం ! అందుచేత , అలాంటి చక్కని భావ సంపదను ప్రసాదించమని , ఆ లీలా మానుష వేషధారిని, ఆ జగన్నాటక నటన సూత్ర ధారి ని,, ఆ శ్రీహరిని, ఆ సర్వేశ్వరుని , ఆ దీన జన బాందవుని,, కోరుకుందాం !;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!!

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...