Monday, January 7, 2019

బంధాలు

Jan 6, 2019
నేను కృష్ణుని వాడను అయినచో నా తనువు మనసు మాట అతడిదే కదా.. ఇక అహంకారము నకు చోటెక్కడ.. అంతా కృష్ణమయమే...కానీ ఈ భావ సంపద అంత సులభమా.. కృష్ణుడు స్వయంగా పూనుకొని ఈ మమతా బంధనాలను తొలగిస్తే గాని వృత్తి ప్రవృత్తి కాదు.. హే కృష్ణా నిన్ను తలవాలంటే నాకు గల అడ్డంకులు నీ దయతో కృపతో గాని దూరం కావు. నిన్ను తలపై మోసిన నీ తండ్రి  వసుదేవుని బంధనాలు విడిపించిన విదంగా.. అగోలుసుల కంటే అతి భయంకరమైన సంసార బంధనాలు.. తెగవు నీవు అవి విడిపింపక.. గోపికలు  అలా నిన్ను చేరారు నీవు వారిని నీ  అక్కున  చేర్చుకుంటూ నీ ప్రేమను కురిపించావు కదా !!"" కృష్ణా.. !నీవే తల్లివి తండ్రివి ! నీవె నా తోడు నీడ.. !నిజముగా సఖుడౌ..!నీవే గురుడవు దైవము  !నీవే నా పతి యు, గతియు  !!నిజముగా కృష్ణా  !" హరే కృష్ణ !"

నేనే బ్రహ్మను

Jan 5, 2019
సర్వేశ్వరా ! నేనే బ్రహ్మను.. నేనే దేవుడి స్వరూపాన్ని . ! అనుకునే వాణ్ణి !  కానీ, ప్రభూ. ! నేనెమో ఒక జీవుడిని ! అల్ప ప్రాణిని ! నీవు మాత్రం  జగన్నాథుడవు.!  నీవలె ప్రశాంతత ను. నిశ్చలంగా ఉండే సచ్చిదానంద చిత్తాన్ని కలిగివుండడం నావల్ల  సాధ్యం అవుతుందా  ! ??ఎక్కడి ఆ వైకుంఠ పదము.?.  ఆ మహోన్నత వైభవాన్ని కనీసం  కలలోనైనా నేను  ఊహించగలనా  ,స్వామీ. ? నీ సచ్చిదానంద స్వరూపాన్ని చూడాలన్న తపన , కోరికలు  ఎక్కడ..? నాలాంటి అజ్ఞానాంధకారబంధురంలో కొట్టుమిట్టాడే కర్మబద్ధుడిని నేను ఎక్కడ  ?? ఇక నీయొక్క చింతన  ,ప్రార్థన, భజనలలో కలిగే తన్మయానంద పారవశ్యం ఎక్కడ ?  నేనెక్కడ ? దేవాది దేవా ! దివ్యప్రభావా ! నీవు పరమాత్ముడవు ! నేను జీవాత్ముడను !.కానీ ఈ జీవి , పరమ పరమ పాపాత్ముడు !రోజుకు ఎన్ని అబద్ధాలు ఎన్ని పాపపు కర్మలు చేస్తున్నామో కదా !. ఎన్నెన్ని జన్మల కర్మ ఫలాలను మూట గట్టుకొని  ,ఇది "పాపపుణ్యాల రాశి " అని ,నీ నామ స్మరణ అనే అగ్ని తో భస్మం చెయ్యకపోతే విముక్తి లేదు!" అని గ్రహించకుండా ఇదే బ్రహ్మానందంగా భావిస్తూ ఉన్న నేను  ఇక తరించేది ఎన్నడు  తండ్రీ ? నాకు అందాలన్నీ ఆనందాలని పొరబడుతున్నాను.. మారుతున్న అందాలు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వవని , తెలియని   అజ్ఞానిని నేను ! నశించని ఆనందం  నీగురించిన చింతనతో ,నీ తత్వజ్ఞానం లో ,  నీ గురించిన నిరంతర ఆరాధన లో  ఉంటుంది కదా గోవిందా ! అందుకే , కేశవా .!పరమ భక్తుల సత్సంగంలో ఆ ఆనందాన్ని వెదుక్కుంటూ  తృప్తిని పొందుతున్నాను ..! నాకున్న ఈ అల్పమైన విజ్ఞానం తో  ,నిన్ను తెలుసుకోవాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా  ! అందుకే  పరమేశ్వరా ! నీ వైభవాన్ని గుణగానం చేస్తూ , దివ్యమైన చరితలను వింటూ  ధన్యత పొందుతాను!. పరంధామా! ఇక జన్మరాహిత్యమైన ముక్తిని పొందాలి అనే భావన నా అమాయక అజ్ఞానాంధకారాన్ని సూచిస్తుంది కదా. !ఏది నిరంతర సాధన  ?ఏది సద్గురువు  ద్వారా సన్మార్గ దర్శనం ? ఏది సత్సాంగత్యం.?.  ఎక్కడ  దైవారాధన ?ఎక్కడ తత్వదర్శనం.?. ఆ వివేకం ఆ విజ్ఞానం ఆ అంతర్మధనం ,ఆత్మశోధన ,అంతరాత్మలో  నిన్ను చూడాలన్న ఆవేదన  ఎక్కడ ?  చిత్తశుద్ధి లేదు ,నిలకడ లేదు బుద్దిలో  !అందుకే స్వామీ. నీ సన్నిధిలో ఉంటూ నీ సేవ చేస్తూ ఉంటూ ఇదే ముక్తిదాయకము ,ముక్తిదామము  ,అని భావిస్తూ నీగురించిన కథలను లీలలను  ,కీర్తనలను వింటూ కలిగే భాగ్యమే. నాకు నీవు అనుగ్రహించిన కైవల్యపదవి అన్న పరమానందం తో జీవించే శాశ్వత సంపదను దయతో కరుణించు! .నారాయణా !.లక్ష్మీరమణ..!.పరాత్పరా@ పరంధామా..! ఇలాంటి సద్భావనను ,స్పూర్తిని , ,ప్రసాదించు.  గోవిందా పుండరీకాక్షా ! రక్షమామ్ ! పాహిమాం !

Wednesday, January 2, 2019

నిద్ర అంటే ఏమిటి ?

Dec 26, 2018
నిద్ర అంటే ఏమిటి ? చక్కని చిక్కని ప్రశ్న .! ప్రతీ ప్రాణికి అనుభవం లో ఉన్న  చిక్కు ప్రశ్న ! నేను నాది. అనే అస్తిత్వం కోల్పోయే నిద్రావస్థలో శరీరాన్ని కూడా త్యాగం చేస్తున్న బహు చిత్రమైన  దేహావస్థ ! 24 గంటల్లో 3వ వంతు చొప్పున  ఇలా  హాయిగా అదమరచి నిద్ర పోడానికి ,,జీవిత కాలంలో సుమారుగా. మూడవ వంతు ఖర్చు అవుతోంది..నిద్ర అంటే విశ్రాంతి.. దేహానికా. మనసుకా అన్నది మరో చిక్కు ప్రశ్న.. !  నిద్ర అనే ఆనందాన్ని భగవన్తుడు అనుగ్రహించాడు కనుకనే జీవిత కాలం పొడిగింప బడి సంతోషాన్ని సంతృప్తిని పొందుతున్నాము.. నిద్ర కు నిర్వచనం ఒక్కటే.. బాహ్యములో ఇందాక చూసిన వస్తువులను గుర్తించలేక పోవడమే నిద్ర ! నిద్రించిన వారికి బయట లోకంతో సంబంధమే లేకుండా పోతోంది.. ఒక్కోసారి అదే శాశ్వత నిద్రకావచ్చును.. ఒక్క రాత్రి యందే కాదు.. ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు నిద్రించినా కూడా బయట ప్రపంచం తో సంబంధాలు కట్ !  అందరికి అంతే.!  ఇప్పుడు అసలు ప్రశ్న వేసుకుందాం ! మనలో ఆత్మ ఉందా.. దేవుడు అంతర్యామి రూపంలో ఉన్నాడా.. అనే ప్రశ్నలకు ఉన్నాడు అని సమాదానం చెబుతాం.. ఆత్మను దేవుడిని చూడగలమా.. అంటే చూడలేము అని అంటాము.. అవే కాదు కామము క్రోధము మోహము ఈర్ష్యా. అహంకార మమకారాలు కూడా ఇదే దేహంలో కాపురం ఉంటున్నాయి.. వీటిని చూడగలమా  అంటే.. మళ్ళీ చూడలేము అని జవాబు చెప్పవలసి వస్తోంది.. వీటిని రాత్రి చూడలేము పగలు చూడలేము... మరి చూడలేని దేహావస్థను నిద్రపోవడం అంటున్నాం కదా. మరి మన జాగృతావస్థ ను అంటే పగలు అంతా మేల్కొని ఉండే  దేహఅవస్థ ను  నిద్రలో ఉన్నట్టే అనవచ్చును కదా... అందుకే నిద్ర అనే పదానికి అజ్ఞానం అవిద్య అని చెప్పుకోవడం సరియైన నిర్వచనం అవుతోంది.! అజ్ఞానాంధకారాన్ని రూపుమాపాలంటే నారాయణ మంత్ర జపం చేయాలి. అనగా పరమాత్మ ను స్మరించాలి.. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, భక్త సులభుడు. సర్వాంతర్యామి ,పూర్ణుడు సృష్టి స్థితి లయ కర్త విశ్వాంతరాత్ముడు ,జగదీశ్వరుడు అయిన   ఆ పరందాముని ఆశ్రయించడం వలన పరమాత్ముని కి దగ్గర కావచ్చును. చుట్టూరా మనల్ని ఆకర్షించి వశపరచుకునే ప్రకృతి శక్తిని దైవారాధన వల్లనే ఎదురించగలం.  ఈ చిత్తశుద్ధి కలగకపోతే ,రాత్రే కాదు ,పగలే కాదు ,,జీవితమంతా నిద్రావస్థలో గడపాల్సి వస్తుంది...లేదంటే, ప్రకృతి లోని విషయాలతో విషాన్ని చిమ్ముతూ ఇంకా ఇంకా అజ్ఞానాంధకారాన్ని పెంచుతూ ,.  ఎప్పుడూ జనన మరణ వలయాలలో  త్రిప్పుతూనే ఉంటుంది . , మనలో ఉండి మనలను నడిపిస్తున్న అంతర్యామిని జీవాత్మను చక్కని జ్ఞానమార్గంలో నడిపించుకుందాం. నిద్రపోకుండా అంటే. నారాయణ నామ వైభవాన్ని మరవకుండా అంటూ., సత్సంగము తో  చక్కని భావ సంపదతో పరమాత్ముని తో అనుబంధం ఏర్పరచు కుందాం.. మనలో ఉన్న జ్ఞానాన్ని పండించుకొంటూ పరమేశ్వరుని అనునిత్యం ,అనవరతం స్మరించుదాం  ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్ధకం చేసుకుందాం..  నందనందనుని మరవకుండా విడవకుండా ఉండే ప్రజ్ఞని ,వివేకాన్ని ,ప్రసాదించమని  దేవదేవుని ,వేణుగోపాలుని, అపద్భాందవుని వేడుకుందాం. శరణు నారాయణా. వాసుదేవా..అంతర్యామి.. నటన సూత్రధారీ.. శరణు శరణు శరణు

శ్రీకృష్ణ భక్తుడు

Jan 1, 2019
బృందావనంలో ఒక శ్రీకృష్ణ భక్తుడు అనునిత్యం రాధాకృష్ణ దేవాలయం వెళ్లి శ్రీకృష్ణ సుందర విగ్రహ దర్శనం చేస్తూ కన్నయ్య దివ్య  లావణ్య వైభవాలను, అద్భుతమైన లీలలను స్మరిస్తూ భావిస్తూ సేవిస్తూ  మనస్సును కృష్ణ కైంకర్యం చేస్తూ పూజిస్తున్నాడు.  క్రమంగా అతడి  శ్రీకృష్ణ ఆరాధనా జీవితం వృద్ధాప్య దశవరకు వచ్చింది. అయినా కృష్ణ భక్తితో. కృష్ణ దర్శనా లాలస తో ,కృష్ణయ్య లేకుండా క్షణం గడవని మానసిక భావోద్వేగాలతో  జీవిస్తూనే ఉన్నాడు.. ఒకనాడు అతడు కృష్ణుని సన్నిధిలో. ఉండగా , కొందరు భక్త్తులు శ్రీకృష్ణ విగ్రహం సౌందర్యం గురించి స్తుతిస్తూ.. ,,""ఆహా !ఏమా సొగసులు కృష్ణయ్యవి..?ధగధగా మెరిసే  ఆ పట్టు పీతాంబరాన్ని చూడండి..!  ఆ వజ్రకిరీటం! ,దానిపై మెరిసే నెమలి పింఛమ్,! నుదుట శోభాలీనే  ఆ కస్తూరీ తిలకం.,,,! మెరుపులా తళుక్కుమనే కపోలాలు.,!శంఖంలాంటి ఆ  కంఠం.  ,,చుట్టు వేలాడే కౌస్తుభం ,నవనీతంలాంటి సుకుమారంగా ఆ చేతులు.కుడిచేతిలో వేణువు..,,చేతులకు కంకణాలు  ,వ్రేళ్ళకు ఉంగరాలు.. ఎంత బావున్నాయో చూడండి ! అదిగో నడుముకు స్వర్ణఒడ్డాణం ఆ. పాద కమలాల పై జీరాడే బంగారు మంజీరాలను చూడండి..చూడ్డానికి ఈ రెండు కళ్ళు చాలడం లేదు..  కృష్ణభగవాణుని మంగళకరమైన  నీలమేఘశ్యాముని , అందమైన విగ్రహాన్ని ఎంత చూసినా కూడా  తనివితీరకుండా ఉంది..!".కృష్ణుడు నిజంగా దిగివచ్చి మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాడా అనిపిస్తోంది కదూ  !.."".అంటూ వాళ్ళు  అనుకుంటూ  ఉంటే ఈ భక్తునికి అయోమయం లో పడ్డాడు..వారు చెపుతున్న అలంకరణ లు అతడి కళ్ళకు  కనపడటం లేదు. కానీ వారి మాటలు  అతడిని  చాలా బాధిస్తున్నాయి..! మనసును  తీవ్రంగా వేదిస్తున్నాయి..కూడా ! ఇదేమిటి ? వారందరికీ కనిపిస్తున్న ఆ కృష్ణ సౌందర్య అలంకరణ తనకెందుకు కనిపించడం లేదు..  ? తన దృష్టి దోషమా ? తనలో ఏదైనా  లోపమా ? .ఎదో దోషం ఉంది !..తాను ఒక పాపిని కావచ్చును   !అందుకే కన్నయ్య రూపలావణ్యాలు ,అందరికి  ఎదుట కనపడుతున్నా ,తాను చూడలేక పోతున్నాడు !,,తన కళ్ళకి   విగ్రహం లానే తోస్తున్నది.మరి వారికి అదే అలా అంత మనోహరంగా ,మనోజ్ఞంగా అగుపిస్తోంది ? ఎందుకు ? ఎందుకు ? అయ్యో ! ఇన్నాళ్లు ,ఇన్నేళ్లు ,నా జీవితం కృష్ణప్రేమ లో గడిపానే !.. కన్నయ్య పూజలో ,సేవలో ,దర్శనంలో ,అర్చన భాగ్యంలో జన్మ పండిందని సంతోషించానే..! ఎంత దౌర్భాగ్యం నాది.! ఇప్పుడేం చేయాలి. ?! ఇక నేను ,, .ఏ ముఖం పెట్టుకొని క్రిష్ణయ్యను  దర్శించను..? నా పాపానికి ,నిష్కృతి ఉందా.?.! నేను చేసిన అంత మహాపరాధము ఏమిటి..?ఎలా తెలియాలి నా తప్పు ? ఎవర్ని అడగాలి. ?.నా భక్తిలో లోపం ఉందా ?.నా భావనలో ,నడకలో ,స్వామి సేవనం లో చిత్తశుద్ధిని కోల్పోయానా..? ఏమిటి నా గతి..?! అంటూ విలపించసాగాడు.. ఏడుస్తూ. పిచ్చివాని లా యమునా తీరానికి పరుగు పరుగునా  వెళ్ళాడు.అందులో పడి చావాలని కూడా  అనుకున్నాడు.!.కానీ.తాను ఏ తప్పు చేస్తే ఇంత ఘోరమైన శిక్ష తనకు విదిిస్తున్నాడో  , అదే కృష్ణుని అడిగి తెలుసుకోవాలని  వెనుదిరిగాడు  .,చివరిసారిగా క్రిష్ణయ్యను చూడాలని నిర్ణయించుకున్నాడుఆ బృందావనవిహారుడు. భక్తజనమందారుడు.,అయిన ఆ నవనీతాచోరుని దర్శనం కోసం  కృతనిశ్చయంతో తిరిగి  వెళ్తున్నాడు ఆ కృష్ణ భక్తుడు !  ఈ సారి కృష్ణుణ్ణి ,అందరూ చూడగలిగే అద్భుతమైన వేష ధారణలో తాను చూడలేక పోతే.  ఇక యమునా నదిలో  మరణమే శరణము ..! జీవితాన్ని చాలించడం తప్ప వేరే గతి లేదు కదా !"" అనుకుంటూ ,మనసులో మదనపడుతూ , దీనాతిదీనంగా  క్రిష్ణయ్యను వేడుకోవడం ప్రారంభించాడు. ! "కృష్ణా! నీవు నన్ను మరిచావా.? నీ సన్నిధిలో నిరంతరం నిలుస్తూ.,,. ఇదే నా పాలిట పెన్నిధి  !"అని ఇన్నేళ్లు తలిచానే.! నిన్నే  కొలిచానే.! నీవే సర్వస్వంగా భావించానే!..నీ కృప లేని జీవితం నిష్ఫలం కదా. !నీవు లేని బ్రతుకు వ్యర్టం కదా..! ఏ అర్థము , పరమార్థము కానరాని నా జీవితానికి ముగింపు పలుకుతావో.?. నీ అనుగ్రహం తో  బ్రతికించి నీ సేవలో తరింపజేస్తావో..? స్వామీ.!. నీదే భారము!..నీవే గతి.!నీకే  శరణు.!.రాదమ్మా.!. నీవైనా చెప్పారాదా!. రాధాకృష్ణులు ఒకటే అంటారు కదా.!. నీవు చెబితేనే గాని నీ కృష్ణుడు దయ చూపడు అంటారు గదా!.. ఇది నిజమే అయితే కృష్ణుని కరుణ ను  నాపై కొంచెం వర్షించమని చెప్పు..! రాధమ్మతల్లీ ! దయామయి. ! ఈ దీనునిపై దయజూడమని ,,నీ గోపాలకృష్ణుని  దివ్యదర్శనం కోసం అలమటిస్తున్న ఈ పేదవాడికి , నీవైనా దారి చూపలేవా  ? ఒక్కసారి నా మొరను వినమని  నీవైనా చెప్పరాదా .అమ్మా ! "అంటూ రోదిస్తూ,విలపిస్తూ , క్రిష్ణాలయం దారిలో వెళ్తున్నాడు.. ఇంతలో తన కాళ్ళను ఎవరో గట్టిగా పట్టినట్టు అనిపించింది. కిందకు చూస్తే ఒక కుష్ఠురోగి ! ఒళ్ళంతా పుండ్లు. రక్తము.! చూడటానికి అసహ్యంగా ,భరింపలేని దుర్వాసన తో , బక్కిచిక్కిన దేహము.తో కళ్ళనిండా నీళ్లతో దుఃఖిస్తూ   , ఎన్నాళ్లనుండో ఆలయం ప్రాంగణంలో ఉంటూన్న  బిచ్చగాడు ఆర్తితో ఆవేదనతో అడుగుతూ కనిపించాడు  ..!" అయ్యా ! మిమ్మల్ని రోజూ చూస్తున్నాను. ,మీరు అనునిత్యం కృష్ణదర్శనం కోసం ఎన్నో ఏళ్ళు ఇలా ఇదే దారిలో  వెళ్తుండటం..! నాకు భరింపలేని ఈ భయంకరమైన కుష్టువ్యాధితో  ప్రతిరోజూ ప్రతిక్షణం నరకబాధను  అనుభవిస్తున్నాను. శ్రీకృష్ణుని ఆలయ సన్నిధిలో లోనికి రాలేని దౌర్భాగ్యం నాది. ! నేరుగా కృష్ణ స్వామిని నా బాధను వివరించి  ఈ దుర్భరమైన బాధ నుండి విముక్తుణ్ణి .చేయమని వేసుకునే ప్రాప్తం నాకు లేదు.. జనావాసం నుండి నిర్దాక్షిన్యంగా వెలివేయబడ్డ నిర్భాగ్యుడిని నేను  ! కానీ మీరు నిత్యం  మరవకుండా విడవకుండా  రోజూ తప్పకుండా శ్రీకృష్ణదర్శనం చేస్తున్న పుణ్యాత్ములు.మీరు !  మహానుభావులు.!. అయ్యా  !ఒక్కసారి నన్ను దీవించండి!.నీ చల్లని చేతిని నా తలపై మోపండి  !.అయ్యా ! కృష్ణుడు ఇలా మీ రూపంలో ,నన్ను దయచూపుతాడని నేను నమ్ముతున్నాను.. !""అంటూ ప్రాధేయపడుతున్న ఆ నిర్భాగ్యుడిని చూస్తూ..బాధతో  కళ్ళవెంట అశ్రువులు  రాల్చాడు ఈ భక్తుడు !.. ""నాయనా  !నీకంటే  మహాపాపిని నేను!..ఏ విధంగా నీకు ఏ దారితెలియని చీకటి బ్రతుకు దాపురించిందో. అంతకంటే దిక్కుతోచని దుస్థితి నాది!" నీవంటున్నట్టుగా ..నేను భక్తుణ్ణి కాదు!  .నాకు ఏ మహిమలు లేవు! నేను నీవంటి సాధారణమైన మనిషిని మాత్రమే  ! . దయచేసి నన్ను పోనివ్వు.! ఈ రోజు ఆటో ఇటో ఈ కృష్ణయ్య ను అడిగి తేల్చుకుంటాను !నాయనా నేను..నీకంటే దీనస్తితిలో ఉన్నాను .సుమా  !""అంటూ  బాధతో అతడి పట్టు నుండి విడిపించు కొనేందుకు ప్రయత్నించాడు !..కానీ  ,ఆ కుష్ఠురోగి వినలేదు.  ,""అయ్యా! ఒక్కసారి మీ నోటితో అనండి  ! చాలు  ! నాకు  బాధనుకలిగించే ఈ భయంకరమైన కుష్టువ్యాధి పోతుందని ! కృష్ణుడు మీ రూపంలో వచ్చి  నాకు ఇలా బుద్దిని పుట్టించి మిమ్మల్ని ఆశ్రయించమని  అనుకున్నాడేమో. ?  ఎవరికి తెలుసు ? ఇన్నాళ్లూ అడగలేదు మిమ్మల్ని ! ఇప్పుడు ప్రార్థిస్తూ చేతులు జోడిస్తూ  ఒక్కసారి నన్ను దయజూపి  అనుగ్రహించమని వేడుకుంటున్నాను .. స్వామీ  నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు  గాక లేదు ! అయ్యా కనికరించండి !"అంటూ ఏడుస్తూ ,తన కన్నీళ్ళతో భక్తుని పాదాలు తడుపుతూ , విడవకుండా ఇంకా  గట్టిగా  పట్టాడు.! ఇక ఈభక్తునికి  తనమీద తనకే జాలి కలిగింది.   నీకు నా పై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా చూసే భారం బాధ్యత ,అదిగో ! ఆ నల్లనయ్యది !నాది కాదు..! నాకూ ,నీకూ ,సర్వప్రాణి కోటికి ప్రాణాధారము ఆ శ్రీకృష్ణ పరమాత్మ నే ! ,"" సరే.. !ఆదిగో  ! ఆ కృష్ణుని మీద ఆన ! నీవు ఆరోగ్యవంతుడౌ తావు !".అంటూ  అతడి తలపై చేయి ఉంచి దీవిస్తూ వెనక్కి చూడకుండా ,తొందర పడుతూ ,శ్రీ కృష్ణదర్శన లాలసతో, ఆవేదనతో,ఆరాటంతో ,స్వామిని చూడాలన్న తపనతో  ముందుకు సాగాడు.. ఆ భక్తుడు ! కానీ , అతడికి తెలియదు.ఆ కుష్ఠురోగి స్వస్థత పొందాడు అని.!తన పుణ్యఫలం వలన అతడు సంపూర్ణంగా కోలుకుని, ఆరోగ్యం కలిగింది అని..! ""తాను విశ్వసించిన  కృష్ణానుగ్రహమ్  "వలననే ఆ రోగికి ఆనందం తో బాటు శ్రీకృష్ణ భక్తిని అందించాడని  ,అతడికి తెలీదు !   ఈ భక్తుడు  నేరుగా కృష్ణవిగ్రహం ముందు నిలుచున్నాడు. ! ఎదుట శ్రీకృష్ణ భగవానుని సాక్షాత్కారం తో పులకించి పోయాడు.. తాను చూస్తోంది కలా ? నిజమా ? తన కళ్ళను తానే నమ్మలేకపొతున్నాడు.  ఇప్పుడు  ,అతడికి   తాను నమ్మి కొలిచిన ఇష్టదైవం , ""శ్రీకృష్ణభగవానుని  సురుచిర దరహాస సుందర దివ్య మంగళ కరమైన లావణ్యరూపం  ""ప్రత్యక్షంగా దేదీప్యమానంగా అగుపించింది. !ఆనందం పాలపొంగులా వెల్లివిరిసింది !.ఆనందభాష్పాలు కళ్ళవెంబడి కట్టలు తెంచుకొని రాసాగాయి-!వెంటనే కృష్ణుని పాదాలపై బడి  పరమానంద హృదయంతో  ప్రణమిల్లాడు  ! అతడి  ప్రగాఢమైన భక్తి తత్పరతకు మెచ్చి కృష్ణుడు విగ్రహం నుండి సచ్చిదానంద ఘన స్వరూపంతో   కదలి వచ్చాడు కృష్ణుడు. తన భక్తుడిని రెండు చేతులతో పైకి లేవనెత్తి  దగ్గరకు తీసుకొని  .సముదాయించాడు   !  ". స్వామీ  !నాకు ఇన్నాళ్లు మీ  ఈ అలౌకిక దివ్యమంగళ సుందర విగ్రహ దర్శనం ఎందుకు ఇవ్వలేదు ? అంటూ ఆర్తితో అలపిస్తున్న  తన ప్రియభక్తుడిని ఓదారుస్తూ. అతడి కంట జాలువారుతున్న కన్నేటిధారలను  తన చేతితో  తుడుస్తూ , చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పాడు.!. చూడూ!. నీవు నీ జీవితంలో నన్ను త్రికరణ శుద్దిగా నన్ను సేవించావు. అది నాకు పరమానందాన్ని కలిగించింది సుమా ! అదే భావంతో నన్నే స్మరిస్తూ. నీ గుండెను గుడిగా జేస్తూ అందులో నారూపమే ప్రతిష్టించి  ".నీవే నేను ""గా భావించి   అమితమైన అత్మానందం పొందావు ! ఇంతగొప్పగా నన్ను  ఆరాధించావు ,కదా ,నన్ను !   కానీ  నీకోసంగానీ  ,నీవారి కోసం గానీ , ఎప్పుడూ ఏదీ కోరుకుండా. నిష్కామంగా కేవలం నా ప్రేమతో  జీవించావు..నిజంగా నాకే సిగ్గేసింది సుమా.  నన్ను తప్ప మరేమీ కోరని నీకు నీకు ఏమివ్వాలో తెలియక నీవు కోరక ,,..ఏ మొఖం తో నీఎదుట నిలబడను చెప్పు !!?   అందుకే నీకు కనపడలేక పోయాను  అంతే ! కానీ నీ భక్తి విశ్వాసంలో ఏ పొరబాటు లేదు  ! తప్పు నీది కాదు నాది !..ఇక ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటావా. ?  ఇందాక నీవు ఆలయం బయట కుష్టువ్యాధితో బాధపడుతున్న కుష్ఠురోగి కి ,,ఇన్నాళ్లు కష్టపడి నీవు సంపాదించిన పుణ్యము ధారపోసి అతడిని  పునర్జీవితుడిని  ,,సంపూర్ణ,ఆరోగ్యవంతుడిగా చేశావే  !  నీ అచంచలమైన భక్తికి  అవ్యాజమైన నీ ప్రేమ కు కదిలి వచ్చాను . ,నిష్కామంగా  నన్ను ఆరాధించే నీ భక్తిప్రపత్తుల వలననే నన్ను ప్రత్యక్షంగా ఇలా దర్శించే మహాభాగ్యాన్ని  పొందగలుగు తున్నావు  సుమా  ! నేను పెట్టిన పరీక్షలో నెగ్గావు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ,ఇలా  కృష్ణభక్తిని విడవకుండా  కృష్ణప్రేమ తో,జీవించి. నన్ను మెప్పించి రప్పించి దర్షింప జేసుకొని తరించావు !... తనకంటూ ఏమీ కోరకుండా ఇతరుల యోగక్షేమాలకోసం నీలాంటి భక్తులుచేసే ప్రార్థన   నిజమైన నిష్కామ భక్తిని సూచిస్తుంది  !.  నీ ఈ నిశ్చలమైన  కృష్ణ ప్రేమ  కృష్ణ భక్తులకు మార్గదర్శనం కాగలదు. ! మానవజన్మ ను సార్ధకం చేయగలదు !  నీ  జీవన్ముక్తి తో నీవు నా పరందామాన్ని చేరగలవు .. ! జయం ! శుభం !" అంటూ దీవించి అంతర్ధానం అయ్యాడు శ్రీకృష్ణ పరందాముడు !  భక్తుడు తన భాగ్యానికి శ్రీకృష్ణ సందర్శన సౌలభ్యానికి సంతోషిస్తూ ,కన్నయ్య  లీలలను వేనోళ్ళ పొగుడుతూ, ఆ కృష్ణభక్తుడు తన  శేషజీవితాన్ని  శ్రీకృష్ణ చరణ కమలాల సేవకు అంకితం  చేస్తూ  ,తరించాడు ! . జై శ్రీకృష్ణ  !జైజై  శ్రీకృష్ణ ! జై శ్రీ రాధే ! జై శ్రీ కృష్ణ ! గోపాలకృష్ణ భగవానుని కీ జై ! సర్వే జనాః సుఖినోభవంతు ! స్వస్తి !!

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...