Sunday, March 24, 2019

జీవుడు

Mar 24, 2019
సృష్టి లోని ప్రతీ ప్రాణికి, భగవంతుడు కరుణించి,అనుగ్రహించిన అమృతతుల్యమైన నిద్ర, అనే వరం  మన జీవితంలో ఏ రోజున కూడా మరవరాని , మరవలేని, ఒక అద్భుతమైన,  మధురమైన దివ్యానుభూతి,,! ఈ అనందాను భవాన్ని, ఉదయం లేస్తూనే గుర్తిస్తూ ఉంటాము, రోజంతా పనిచేస్తూ అలసి సొలసి విశ్రాంతి కోసం పరమ పదాన్ని తలపించే , స్వర్గ సుఖాన్ని మరపించే నిద్ర దేవతని శరణు వేడుకుంటాు. ఆహార పానీయాలు లేకుండా కొన్ని రోజులు జీవించగలమేమో కాని, రోజుకు కనీసం 5,,6 గంటలు పడుకొక పోతే ఆరోగ్యంగా , ప్రశాంతంగా ఆనందంగా ఏ జీవీ మన లేడు కదా ! నిద్రలో ఒడలు మరచి, బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా మరో లోకంలో ,మరో ప్రపంచం లో  విహరిస్తూ, అద మరచి నిద్రిస్తూ ఉంటాం..! అప్పుడు జీవుడు కనే కలలు స్వప్నాలు అన్నీ గతజన్మ కర్మ అనుభవాల పునరావృత స్మరణ లే...! ఒకప్పుడు  జరిగిన సంఘటనలే  ! అవి సు స్వప్నాలు అయినా, దు స్వప్నాలు అయినా, ఇప్పుడు జీవునికి అప్రస్తుతం ! అనవసరం  ! కలలో కాదు ఇలలో ఆ కర్మలు  జీవుడు అనుభవించాల్సి వుంటుంది  ., ఆ కలల సారం ఏమిటంటే, ఈ జీవితం కూడా అలాంటి స్వప్నం లాంటిదే అని ! అది ఈ జీవుడి పాంచభౌతిక శరీరాన్ని అవరించిన ,మాయాప్రపంచాన్ని , మిధ్యా జగత్తును  సూచిస్తూ ఉంటుంది  , తన, స్వప్నంలో జీవి , అలా  ఎన్నో పాత్రలు ధరిస్తూ,  దేహానికి అంటకుండా ఉంటాడు., ఆ అనుభవం జీవునిది, దేహానిది కాదు .  నిద్ర అనేది ,జీవుడు దేహంతో సంబంధం లేకుండా, ఆత్మానందం పొందే  అందమైన బ్రహ్మానంద ఉన్మాద అవస్థ !.. అలా జీవుడు తనఆత్మ అనే అమ్మఒడిలో సేద దీరుతు ఉండగా, అతడి ఉపాధి అనగా వాహన రూపమైన ఈ శరీరాన్ని , జీవుడి సుషుప్తి అవస్థ లో,భగవంతుడు అతడి శరీరాన్ని  repair చేస్తూ సంరక్షిస్తూ, జీవన చర్యలని నియంత్రిస్తూ, సక్రమంగా నిర్వహిస్తూ , బండిని మంచి కండిషన్ లో ఉంచ డానికి ఎంత సమయము అవసరమో, అంతవరకు తన పర్యవేక్షణ లో ఉంచుకొని,, అప్పుడు జీవుడి నీ నిద్రలేపి శరీరాన్ని  అప్పగిస్తాడు  ,. అలా అడగకుండానే , ఏ ప్రతిఫలం ఆశించ కుండానే,  సేవచేసినందుకు ఈ జీవు డు  ఎన్ని జన్మలెత్తినా  తీరే ఋణం కాదు అది !! అలసిపోయింది దేహం, కాని జీవుడు కాడు.. కదా! లేచింది మొదలు పడుకునే వరకు, జీవుడి కర్మలకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ శరీరం రోజంతా పనులు చేసి చేసి,, ఇక పరుగెత్త లేక నడవనని మొరాయిస్తుంది ,! ఎందుకంటే జీవుడు, శరీరానికి పెట్టిన పరిమితులు, హద్దులు దాటి దైవాన్ని దిక్కరిస్తు పోతున్నాడు. కావున అనారోగ్యంగా మారిన శరీరం, తిరిగి కోలుకునే వరకు, జీవుడు తన వాహనంగా  దానిని ఉపయోగించు కోలే డు. , ఒక వేళ , ఈ వాహనం లో ఏ కారణం చేతనైనా, గుండె కిడ్నీ , ఊపిరితిత్తు లు , రక్త ప్రసరణ వ్యవస్థ చక్కగా పని చేయకుండా పోతే,, ఈ వాహనం నడపడానికి అక్కరకు రాదు,! ఇక మరో ఉపాధి అనగా మరో శరీరం ,, జీవుడు మద్యంతరంగా ఆగిపోయిన  తన జీవన యాత్ర కొనసాగించడానికి సిద్ధమవుతుంది.. దైవనిర్ణయం ప్రకారం ! అంతటితో, జీవునికి ఈ శరీరం తో సంబంధం తెగిపోవడం తో ఇదే, అతడి శాశ్వత నిద్ర అవుతోంది.. !అంటే దీనితో జీవుడికి ఈ శరీరం తో  చేయవలసిన కర్మలు పూర్తి అయినట్టే.! ప్రాణం ఉండటం అంటే జీవునికి ఈ వాహనం అతడు నడపడానికి అనుకూలంగా ఉండటం అన్నమాట..! ఉదయం లేస్తూనే కదిలేది,, జీవుడిలో మొదట" నేను!" అనే అహంకారం, దీనితో మనస్సు బుద్ధి పంచేంద్రియాలు,5 కర్మేంద్రియాలు 5 జాగృతం అవుతాయి. గాఢమైన, నిద్ర నుండి తెలివి రాగానే మొదట కదిలేవి మన చేతులు. ! దానితో మనకు మరో రోజు  ఆయుర్దాయం పెరిగింది ,. అంటే ప్రతీ ఉదయం జీవునికి పునర్జన్మ అన్నమాట.! ఎన్ని ఉదయాలో జీవుడికి అన్నీ జన్మలు.! కొంతమందికి అదే నిద్ర, శాశ్వత నిద్రగా అవుతూ ఉంటుంది,,! గుండె పోటు, మెదడులో నరాలు చిట్లడం, పక్షవాతం, రక్తపోటు, మధుమేహం, , ఆక్సిడెంట్ ,లాంటివి తీవ్రంగా ఉంటే నిద్రలోనే  నిశ్శబ్దంగా చనిపోతుంటారు ,,అంటే వాహనం  చెడిపోయింది   ,అందుకే ఉదయం లేవగానే కుడి అరచేతి నీ చూస్తూ," కరాగ్రే వసతే లక్ష్మీ,! కర మధ్యే సరస్వతీ, !కర మూలేశు గోవిందా,!, ప్రభాతే కర దర్శనం !!""అనుకుంటూ  దైవాన్ని స్మరిస్తూ ఆ దైవాన్ని హస్తంలో దర్శిస్తూ మెల్కొనడం ఉత్తమం అని శాస్త్ర ము చెబుతోంది. ఏ దేవుడైతే మనం నిద్రిస్తూ ఉండగా, శరీర రక్షణ భారం వహిస్తూ , మన ప్రమేయం లేకుండానే ఊపిరి తీయిస్తు, రక్త ప్రసరణ చేయిస్తూ, గుండెను కిడ్నీ లాంటి లోన ఉండే సకల  అంగాలను చక్కగా నడిపిస్తూ. Servicing కోసం ఇచ్చిన బండి, మంచి కండిషన్ లో మెకానిక్ మనకు అప్పజెప్పిన విధంగా, భగవంతుడు ఆరోగ్యం, ప్రశాంతత, బలము శక్తి , లను ప్రసాదించి, మరుసటి రోజున ఉత్సాహంగా దైనందిన కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి యోగ్యంగా మన శరీరాన్ని తయారు చేసి ఇస్తుంటాడు.!  నిజానికి ఒక్క నిద్రలోనే కాదు,,, బ్రతికినన్నాళ్ళు మనం ఆనందంగా ,సంతృప్తిగా జీవించడానికి  కావలసిన బందువులు ,బలగం ,అస్తి ఐశ్వర్యం, ఇలా అనుభవించే వి అన్నీ పరమేశ్వర ప్రసాదా లే కదా.! ఏదీ జీవుడు తనతో తేలేదు ! అలాగే వెళ్ళేటపుడు తనతో పూచిక పుల్ల కూడా తనతో తీసుకెళ్ళ డు కదా ! నిజానికి ఈ జ్ఞానం ,ఈ వివేకం , కేవలం స్మశాన ,పురాణ, ప్రసూతి వైరాగ్య ముల వల్ల మాత్రమే మనకు ఈ జీవన సత్యాలు తెలుస్తాయి అనుకోవద్దు ,,! మనం భగవద్గీత చదువుతూ ,కొంత ఆత్మ విచారం చేస్తూ పోతూ ఉంటే,, లోన ,బయట ఉండే సర్వాంతర్యామినీ , మనం  కన్నులతో చూడలేకున్నా , హృదయంలో అతడి దివ్య వి భూతులను , లీలలను,, సకల ప్రాణి కోటిపై కురిపించే అపార కరుణా కటాక్షాల  అనుభూతిని, అంతఃకరణం లో, భక్తి అనే ఉపకరణం ద్వారా  దర్శింపవచ్చును .! ఈ జీవుడు ఎవ్వరి వాడూ కా దు ! ఎందరికో కొడుకు! ఎందరికో తోబుట్టువు,! ఎక్కడెక్కడో తిరుగుతుంటా డు ,,! తన వెనక జన్మమెక్కడో,  !ఎక్కడికి పోతా డో,,? ఎన్ని జన్మలు మోశా డో,, ఇంకా ఎన్ని మోయాలో  ,ఎవరికీ తెలియదు ! చివరికి ,ఆ జీవుడికి కూడా తెలియదు! ఇదంతా భగవంతుని లీల, ఆయన మాయ !  నీవు ఎవరవు ? అన్న ప్రశ్నకు సూటిగా జవాబు ఒక్కటే నేను నా లో  ఉంటూ దేదీప్యమానంగా, దైవాంశ గా వెలుగుతూ , అది అంతము లేని , నాశము పుట్టుక లేని , సత్యము నిత్యము అయిన పరమేశ్వర తత్వాన్ని   ,,! ఈ జీవుడు ఆ ఆత్మకు బంధువు !దేహ సంబంధమైన బంధువులకు బంధువు కాడు ! నేను పరమాత్మకు మాత్రమే  బంధువును ! ఎన్ని జన్మలెత్తినా అతడినుం డి నన్ను ఏ శక్తీ దూరం చేయజాల దు ! అనే తత్వమసి అనే అద్వైత తత్వాన్ని తెలుసుకునే  అద్భుతమైన ప్రక్రియ , మనిషికి మాత్రమే సాధ్యమయ్యే "భావ సంపద ,భావ ప్రకటన, !! వీటిని " మనకు  వరాలుగా కరుణించి యోగక్షేమాలు విచారిస్తున్న   ఆ దేవా దిదేవునికి  ప్రతిగా మనం ఏమివ్వగలం  చెప్పండి ? అంతా అతని సొమ్మే కదా ! పైగా  మనం కూడా అతడి సొత్తే ! అందుకే , అనునిత్యం, అనుదినం, అనుక్షణం, అనవరతం, జీవితాంతం , ఆ జగన్నాటక సూత్రధారి కి కృతజ్ఞతా పూర్వక శతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ ,ఉత్కృష్టమైన మానవజన్మ ను ధన్యత చేసుకుందాం,,! హే పరమేశ్వరా ! నిరంతరం నీ నామ రూప వైభవ స్మరణ లో మా జీవితాలు వర్దిల్లెలా, ప్రతీ ఉదయం,, మా హృదయం, నిన్ను పూజించే, సేవించే, భావించే పవిత్ర వేదిక అయ్యేలా , తగిన యోగ్యత ను మాకు అనుగ్రహించు తండ్రీ,! నారాయణా,!, పరాత్పరా,! పరందామా,!, శరణు! శరణు! శరణు !"ఓం శాంతి! శాంతి !శాంతిః ! స్వస్తి!"""

పరమాత్మా ! పరంధామా!

Mar 22, 2019
పరమాత్మా ! పరంధామా !!  మనిషికి జంతువుకు తేడా కేవలం నీవు ప్రసాదించిన ఈ జ్ఞానమే. కదా! దానిని మాటల ద్వారా చేతల ద్వారా ప్రకటించి భావించి నిన్ను తెలుసుకునే అవకాశం లభించింది  కూడా నీ కృపతో నే కదా నారాయణా  ;!!దీనితో నే సకల ప్రాణికోటి లో ఉత్కృష్టమైనది మానవ జన్మ  ,ఉత్తమమైనది ! అనిపించు కుంటున్నా ము కదా నారసింహ !, అనునిత్యం నా జీవన చర్యల్లో భాగంగా నిన్ను  భావిస్తూ సేవించే ప్రయత్నం చేస్తున్నాను జనార్దనా !  నాకున్న ఈ అవయవ సౌందర్య సంపద నీ అనుగ్రహమే కదా,పురుషోత్తమా !,, నా అంగాంగమునందు నీవే ప్రతిబింబిస్తూ నన్ను జీవింప జేస్తూన్నావు కదా పరమేశ్వరా,,! అందుకే నేను తల దువ్వుకుంటూ ఉన్నపుడు, నీ  నల్లని కేశాలంకరణకు నీకు ఇష్టమైన మల్లెలు, గులాబీ, మొదలైన పరిమళ భరితమైన మకరంద ద్రవ్యాలతో అలది నట్టుగా తలచి ఆనందిస్తూ ఉన్నాను. నేను ప్రతి రోజు చేసే స్నానం పద్మనాభ  !నీ పాద కమలాల అభిషేక భావంతో  గంగా కృష్ణా, మందాకిని, అలకా నంద లాంటి దివ్య నదీజలాల ధారల స్నాన ఫలిత మస్తు!" అంటూ నీకు స్నానం చేయిస్తున్నట్లు గా భావిస్తూ చేస్తున్నాను! , గోపీ మనోహర  ! విశాలమైన నీ ఫాల భాగాన తిరుమణి తో" కస్తూరీ తిలకం "దిద్దుతున్నా నని నా నుదుట జ్ఞాననేత్రం వద్ద తిలక ధారణ చేస్తూ, ఉన్నాను ,,!దీన జన బందొ! నీ ఈ కన్నులతో, సర్వాంతర్యామి వైన నిన్ను , మొదట నాలో, పిదప అంతటా నీ విశ్వరూపం  చూసే ప్రయత్నం చేస్తున్నాను .కమలనయనా !  ,నాలో ఉంటూ , నా జీవనచర్యలకు మూలాధారము గా వెలిగే నిన్ను నేను ధరించే ఈ బొట్టు ద్వారా జ్ఞా నానందాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. కేశవా!,, నీవిచ్చిన నేత్రాలతో నాలో ప్రకాశించే అంతర్యామివైన నిన్ను, నా ఎదుట సాక్షాత్కారం అవుతున్న నీ బ్రహ్మత్మక రూపంగా  ,ప్రాణుల లో, చెట్టూ పుట్టా, పత్ర పుష్పాలు, అందమైన  ప్రకృతి సోయగాల లో, సూర్యోదయ, సూర్యాస్తమయ రమణీయ దృశ్యాలలో నీ అద్భుత విరాట్ స్వరూప లీలా వైభవాన్ని దర్శిస్తూ, దివ్యానుభూతి నీ  పొందుతూ, నిత్యం   నిన్ను దర్శిస్తూ, ఉన్నాను. గోవిందా !. కళ్ళు మూసుకొని నీ ధ్యానం లో నేను  ఉన్న పుడు  , భుజించే సుగంధ ద్రవ్యాల, ఆహార పదార్థాల ఘుమఘుమ లు నాలో ఉన్న నీవే ఆస్వాదిస్తూ ఉన్నట్టుగాప్రతిస్పందిస్తూ ఉన్నాను, మాధ వా!. ,వీనులకింపైన సంగీతంతో నీవు పరవశిస్తూ ఆనందిస్తూ వింటున్న అనుభూతిని నేను పొందుతూ ఉన్నాను. నందనందనా ! నా కంఠం లో ధరించే బంగారు హరము, గానీ, తుల సీ దళ పూసల మాల గానీ, శ్రీకృష్ణా ! నీ మెడలో ధరించే వనమాల గా భావిస్తూ ఉన్నాను శ్రీనివాసా    !.. నా భుజాలపై గల చక్రాంకితాల్లో నీవు ధరించే పంచయుధాల ప్రభావంగా భావిస్తూ ఉన్నాను ,, రాధా మాధవ ! నీవిచ్చిన ఈ రెండు చేతులతో, ఆలయంలో అర్చాముర్తిగా , ప్రత్యక్ష దైవం గా వెలిగే సూర్యచంద్రులు , తలిదండ్రులు, గురు వులకు , భక్తి పూర్వక ప్రణామాలు సమర్పించే భాగ్యాన్ని అందిస్తూ ఉన్నావు కదా పద్మనాభ ,!, నిత్యం నన్ను నిమిత్త మాత్రునిగా చేస్తూ , నీవు  స్వీకరించే మధుర ఆహార పానీయాల లో నీవే ఉంటూ, నేనే నీవు అవుతూ, శక్తివి కూడా నీవే అవుతూ , అన్నమయ, జ్ఞానమాయ, మనోమయ, ఆనందమయ, కోశాల వినియోగం తో పరమానందాన్ని అనుగ్రహిస్తూ , ఇదంతా  కేవలం నీ ఉనికి మహాత్మ్యం గా గుర్తిస్తూ ఉన్నాను. అనంతా !. పవిత్ర క్షేత్రాల , మహాత్ములదర్శనం కోసం,, పుణ్య నదులలో స్నానం కోసం,, అంతటా నిండి ఉన్న నీ అనంత అద్భుత విరాట్ వైభవాన్ని దర్శించి సేవించి తరించడానికి, నీవిచ్చిన మానవ జన్మను , ఉద్దరించు కోవడానికి, నీవిచ్చిన ఈ పాదాలతో వెళ్లి చూస్తూ పునీతుదను అవుతున్నాను  .  అచ్యుతా ,!  ఇలా నిరంతరం ,నన్ను విడవకుండా, నేను నా పాపపుణ్యాలు అనుభవించడానికి తగిన శక్తిని ఇస్తూ, నీ పని అయిపోగానే  ,, ఈ జీవితాన్ని "గాలి తీసిన బుడగ"లా చేసి,, తిరిగి ఇదే గాలిని మరో బుడగలో కి ఊదుతూ నన్ను కీలుబొమ్మలా చేసి నాతో ఆటలాడుతూ  వినోదాన్ని పొందుతావుగదా వేణు గాన లోలా ! కానీ, ప్రభూ !.  ఈ జ్ఞానం నిన్ను తెలుసుకోడానికి సరిపోవడం లేదు కదా , తండ్రీ ! మధుసూదనా,,!, ఏ రూపము లేని నిన్ను ఎలా గుర్తించను,? ఎలా భావించను  ?ఎలా సేవించను?, అఙ్ఞానిని,! మహా పాపిని,! పైగా అహంకారి నీ,!, దయచేసి నాకు  మార్గ దర్శనం చేసి, సరియైన మార్గం లో నడిపించు   స్వామీ!" , ఎది మంచి,ఎది చెడు  " అని గుర్తించే విజ్ఞానం నాలో కొరవడింది, జగదీశా !అందుకే నిన్ను శరణు వేడుకుంటున్నాను ,, లక్ష్మీ వల్లభ ! కానీ ,, ఒక్కటి మాత్రం చెప్పగలను !, ముకుందా !నీవు ఉన్నావు! నన్ను చూస్తున్నావు! నా చర్యలు గమనిస్తూ  సాక్షిగాఉన్నావు,!, అందుకే , సర్వజ్ఞు డివి , సర్వాంతర్యామి వి. అయిన  నీకే  నా మనసును ,తనువును నీకు అంకితం చేస్తూ ఉన్నాను దామోదర  !" నాకు నీవే గతి !నీకే శరణు." జగన్నాథ , అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, శరణు! శరణు! శరణు !  స్వస్తి ! హరే కృష్ణ హరే కృష్ణా !""

Wednesday, March 20, 2019

త్యాగ ధనం

Mar 20, 2019

రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించవచ్చును . రాముడు కౌసల్య కన్న కొడుకు అయినా ,,పెరగడం పెంపుడు తల్లి కైకేయి మాత ఒడిలోనే జరిగింది . అందుకే రాముడంటే తన కొడుకు భరతుని కన్నా, కూడా వల్లమాలిన ప్రేమ, అభిమానం!, రాముని సౌశీల్యం, ధర్మ నిరత, పరాక్రమం ఆమెకి బాగా తెలుసు. !పట్టాభిషకం జరిగితే రాముడు అయోధ్య కు మాత్రమే చక్రవర్తి గా పరిమితి అవుతాడు, అది ఆమెకు ఇష్టం లేదు., రాముడిని జగదో ద్దారకుడిగా, సకల భువన పరిపాలకుడిగా చూడాలని ఉంది ఆమెకు..! అప్పుడు రాక్షసుల దాడి అయోధ్యానగరానికి చుట్టూ , అన్ని వైపులా , బెదిరిస్తూ, మాన ప్రాణాలను తీస్తూ ఉంది   .. లక్షల సంఖ్యలో అడవుల్లో రాక్షసులు యదేచ్చగా సంచరిస్తూ, అటు ఋషి ముని పుంగవుల తపస్సు, హోమ య జ్ఞా ది క్రతువులు ధ్వంసం చేయడం, క్రమంగా ధార్మికత తగ్గుతూ, దమన కాండ పెరిగి పోతుండటం ఆమెకు   చాలా బాధ కలిగించింది  . అంతేకాదు ఆమె తన రాము డిని  రాక్షసుల ,అకృత్యాలను రూపుమాపేందుకు అడవులకు పంపించాలని కూడా అనుకుంది,  . తమ గ్రామాలు నగరాల నుండి మరో గ్రామం వైపు ఎవ రు  వెళ్ళినా ,వారు  రాక్షసుల బారిన పడి ,ప్రాణాలతో తిరిగి వచ్చేవారు కాదు. , విశ్వామిత్రుని తో వెళ్లి, రాముడు, అరణ్యాలలో  నరసంచారం లేకుండా చేసిన తాటకి నీ వధించ డం తో రాక్షసుల దమనకాండ అగిపోలేదు. వా రి ఆగడాలు  ఇంకా ఉదృతమయ్యాయి  , ప్రతీకార భావంతో చెలరేగి పోయారు ,,జనసంచారం ఉంటున్న గ్రామాల లో చొరబడి, స్త్రీలను చెరబట్టి, పురుషులను క్రూరంగా చంపుతూ నరమేధం సృష్టిస్తూ, గ్రామాలు కొల్లగొడుతున్నారు , దుష్టశిక్షణ , శిష్టరక్షణ నియమంగా దీక్షగా పెట్టుకున్న రాముడు, ఇటు వశిష్ఠుడు, అటు విశ్వామిత్రుడు, వద్ద దివ్యాస్త్రాలు సంపాదించి అజేయుడై , నిలిచాడు,, రాక్షస లోకాన్ని తు దముట్టించే సామర్థ్యం , శౌర్య ప రాక్రమాలు. కలిగినవాడు అని  ఆమెకు తెలుసు..! అయితే రాముడ్ని విడిచి ఒక  క్షణమైనా  ఉండలేని దశరథుడు , తన నిర్ణయాన్ని ఒప్పుకో డు అని కూడా తెలుసు!  , కాని బలాత్కా రానికి,అత్యాచారాలకు  గురవుతూ, నరమాంస భక్ష కుల చేతిలో వి ధవలుగా.  మారుతున్న స్త్రీల దుస్తితి కైకమ్మను కలచి వేసింది.! ఆమె కూడా వీర వనిత,! దేవాసుర సంగ్రామంలో భర్తకు అండగా నిలిచి,, తన పరాక్రమం తో విజయాన్ని సాధించి,, అతన్ని కాపాడిన  వీరనారి ,సాహసిఆమె.! అందుకు కృతజ్ఞతగా దశరథుడు ఆమెకు రెండు వరాలివ్వడం,, కూడా జరిగింది. అందుకే ఈ రెండు వరాలను ఉపయోగించి, రాముని పట్టాభిషేక ఉత్సవాల ను అడ్డుకోవాలని నిర్ణయించు కుంది. సూర్యవంశ రాజులు ఆడిన మాట తప్ప రని ఆమెకు బాగా తెలుసు,! రాముడు లేకుండా దశరథుడు జీవించడ నీ కూడా తెలుసు.. ! కానీ ,ఎంతో మంది అబలలు విధవ లుగా మారుతూ, ప్రాణాలు అర చేతిలో, పెట్టుకొంటూ, దీనంగా విలపిస్తూ ఉన్న వార్తలు ఆమె వింటూ,  ఉంటే  ఆమె వీరవనిత కాబట్టి ,రక్తం ఉడికి పోతోంది .!. అందుకే  వేల సంఖ్యల్లో ఉన్న అనాధ స్త్రీల పసుపు కుంకుమలు కాపాడటానికి , తన ఒక్క పసుపు కుంకుమ ను బలి చేయడానికి, ఆమె తన  గుండెను రాయి చేసుకుంది.!  వేరే దారి లేక,  "వరాలు "అనే నెపంతో, రాముడిని వనవాసం పంపి, తన ద్యేయాన్ని సాధించి నిజంగానే వీరమాత అయ్యింది.! రాముడు ,దండకారణ్యం లాంటి దట్టమైన అరణ్యాలు తిరిగి తిరిగీ రాక్షస జాతిని నిర్వీర్యం, చే స్తూ  అడవులను నిష్కంటకం  చేశాడు,,! అలా జనావాసాలు పెంచాడు. !ఋషులు , మునులు నిర్భయంగా వారి తపస్సు, క్రతువులు చక్కగా నెరవేరుస్తూ వారి  ధర్మా లను నెరవేర్చడానికి మార్గం చాలా  సు లువయ్యింది.!  కాని ఈ మహా యజ్ఞం లో కైక మ్మ  బ్రతుకు, నడవడి , మాత్రం సమిధలా కాలిపోయింది .! అయినా  అంతిమజయం కైకమ్మదే,,! రాముని ఖ్యాతి , ధర్మా వతారు డని, పరాక్రమశాలి, శరణాగత రక్షకుడు అనీ,, పితృవాక్య పరిపాలకుడు అనీ ,ఇలా యుగ యుగాలలో ప్రజలు శ్రీరాముని నుతించడానికి కారణం,, , అతడి వెనక ఉండి కథను చక్కని ప్రణాళికా బద్దంగా నడిపించిన మన ఉక్కుమనిషి,, త్యాగ ధను రాలు,, స్త్రీజాతి గర్వించదగిన  మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మన కైకమ్మ యే.!!. అనవసరంగా ఆమెను అపార్థం, చేసుకొని, శాపనార్థాలు పెడుతున్నారు ఆమెను..! ఆమె పాత్రను అర్థం చేసుకోవాలి, మనం ! ప్రేమ కంటే త్యాగం , దేశభక్తి గొప్ప వి. అని నిరూపించింది, !రాముని పై గల ప్రేమ ను గుండెల్లో దాచుకొని, అతడి ధార్మికత ను ఖండాంతర ఖ్యాతిని చాటి చెప్పిన కౌకమ్మ వందనీయు రా లు   .! చిరస్మరణీయు రాలు,,! ""అమ్మా ! కైకమ్మా . !అందమైన రాముని కథ ను  నీవు స్వయంగా తీర్చి దిద్ది , రామాయణం చదువుతూ, అద్భుతమైన ఆనందా ను భూతినీ  పొందే భాగ్యాన్ని కలిగించిన నీకు సాష్టాంగ ప్రణామాలు !తల్లీ. !నిన్ను అపార్థం చేసుకుంటున్న వారిని క్షమించు! ప్రతీ పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ హస్తం ఉన్నట్టే, శ్రీరామ విజయం, అతని పెంపుడు తల్లి  కైకమ్మ . సంకల్ప బలం !! రాముడు రావణ సంహారం తరువాత , తిరిగి వచ్చి మొదట కైక పాదాలకు ప్రణామాలు చేస్తూ అంటాడు. అమ్మా నా విజయానికి , కీర్తి ప్రఖ్యాతుల కు నీవే కారణం , హనుమ వంటి బంటు, సుగ్రీవుడు, విభీషణుని వంటి మిత్రులు ,, లక్ష్మణుని వంటి తమ్ముడు  , సీత వంటి భార్య నాకు లభించా రు. ఇదంతా కేవలం  నీ అనుగ్రహం ! నేను ఏమి చేసినా నీ ఋణం తీర్చుకోలే ను , నా హృదయపూర్వక ప్రణామాలు స్వీకరిం చు మాతా ! ఎవరైనా నిన్ను నిందించి నీకు మనస్తాపం కలిగిస్తే వారిని క్షమించు వారి తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను అమ్మా ! నీ చల్లని దేవనలే ఈ సీతారాములకు రక్ష ! అంటూ ప్రార్థిస్తాడు ! ఇక కైకమ్మ తల్లి ఆనందానికి అవధులు ఉంటాయా మీరు చెప్పండి ! అందుకే ప్రేమ కంటే త్యాగం గొప్పది ! ఒకరిని మించిన ఒకరు రామాయణంలో త్యాగ మూర్తులు  ! అందుకే శ్రీరామ కథ అపురూపం అపూర్వం ! రామ నామం , రామ బాణం కంటే గొప్పది అయ్యింది. ధర్మాలలో కెల్లా అత్యంత మహిమాన్విత మైనది త్యాగధనం !! రామ నామ స్మరణం, సకల పాప హరణం ! జై శ్రీరామ్ ,  !!జైజై శ్రీరామ్.!! రాజా రామచంద్ర భగవాన్ కీ జై!!"    స్వస్తి !!""

Sunday, March 17, 2019

దైవా రాధన

Mar 17, 2019
బయట సమాజంలో స్వేచ్చగా ఎక్కడా కూడా బేధాలు లేకుండా, రాకుండా జాగ్రత్త పడతారు జనాలు,  ! పేకాట క్లబ్బుల్లోను,, సినిమా హాలు లో, హోటల్ లో నూ,, ఆఫీస్ లోనూ, విందు వినోదాల లోనూ ఐకమత్యం గా, అంద రం ఒక్కటే అన్నట్లు కలిసి ఉంటారు, కాని ఒక్క దైవా రాధన విషయంలో కి వచ్చేసరికి విబేధాలు వస్తాయి ."నీవు హిందూ, నీవు ముస్లిం , నీవు క్రైస్తవ,.." అంటూ విడిపోతారు.. ఎక్కడా కానరాని విచక్షణ ఇక్కడ మాత్రం ఎందుకు చూపాలి ? కారణం  పరమాత్ముని గురించిన సరి అయిన జ్ఞానం లేక పోవడమే,. ఆదిగురువు శివుడు జ్ఞానఖని..! పురాణాలు ఉపనిషత్తులు, శ్రుతులు వేదాలు తన సతి పార్వతి కి బోధించడం ద్వారా సకల భక్త కోటికి జ్ఞాన సముపార్జన చేసుకునే వీలు కలిగింది. సత్యం  శాశ్వతం !,శివం జ్ఞానం !సుందరం శాశ్వత అనందం,! ఇవి పరమేశ్వర తత్వ రహస్యాలు, !జ్ఞాన బండారాలు.! అతని నిరాడంబర జీవిత విధాన మే , ఆ సచ్చిదానంద నిర్గుణ నిరాకార శివలింగ రూపమే, మానవాళికి అందించిన అద్భుతమైన జ్ఞానో పదేశం !  ఎన్ని విద్యలు నేర్చిన కూడా "కూటికొరకు  మాత్రమే "అని భావిస్తూ , అన్నింటికీ మూలం అయిన,,పరమాత్ముని గురించి అని గుర్తించలేక పోతే, అవి కేవలం ఇహాన్ని గురించే గానీ, పరాన్ని సూచించే పరమార్థం గురించి కాదు కదా .! సృష్టిలోని ఏ జీవరాశిని గమనించినా, ఒక నీతిని బోధిస్తాయి. కుక్క విశ్వాసానికి గుర్తు.! ఇది అందరికీ తెలిసిన సత్యం !తనకు ఆహారం పెట్టిన యజమానికి ఎన్నడూ అది హాని చేయదు.! పైగా ఒక రక్షక భటుని వలె  ఇంటికి రాత్రింబవళ్ళు కాపలా ఉంటూ యజమాని నీ రక్షిస్తూ విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంటుంది !. కాబట్టీ కుక్కను ఒక "గురువుగా" స్వీకరించ వచ్చును .!. ఎందుకంటే ఆ విశ్వాసం, ఆ గురి, ఆ నమ్మకం, మనిషిలో కొరవడింది కాబట్టి.! ఇంత తిండి తింటున్న కుక్కనే, తన జీవితాంతం, తన యజమాని పట్ల అంత విశ్వాసం చూపితే ,, సకల సంపదలు, తెలివిని, శక్తి యుక్తులను, ఇలా ఎన్నింటినో ప్రసాదించిన ఆ పరమేశ్వరుని పట్ల మనిషి ,ఎంతో విశ్వాసాన్ని, కృతజ్ఞతను,వినయవిదేయ తలను చూపాల్సి ఉంటుంది. అని అమాయకంగా అగుపించే శునకపు జీవన శైలి మనిషికి ఉండాల్సిన ఆ సద్బుద్ధి నీ  గురువు వలె ఉప దేేశిస్తూ ఉంటుంది.!. అలాగే అడవుల్లో తిరిగే ఒక జింక..! "ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుం దో  కదా !""అనుకుంటూ పంచేంద్రియాలు ఉగ్గబట్టి, ఎల్లప్పుడు అప్రమత్తంగా సంచరిస్తూ ఉంటుంది. .,! కాని మనిషి "మృత్యువు తనను ఎప్పుడు కాటేస్తుందో కదా"  అని భయపడకుండా," అందరూ పోతారు, కాని తాను మాత్రం దానికి అతీతుడు!" అనుకుంటూ, ఉత్కృష్టమైన మానవజన్మ ను భోగ భాగ్యాలనడుమ విలాస వంత మైన జీవితం గడుపుతూ క్రమంగా తాను, దైవారాధన కు దూరం అవుతున్నాడు. ఇలా జంతువులు , క్రిమి కీటకాలు జ్ఞానం లేకున్నా కూడా తమ ధర్మాన్ని,తప్పకుండా ,, ఎన్ని కష్టలెదురైనా, తమ కర్తవ్యాన్ని నిర్వహి స్తు ఉంటున్నాయి. కానీ, దీనికి వ్యతిరేకంగా, అతితెలివి, దురాశా పరుడు, స్వార్థ బుద్ధితో, మనిషి మాత్రం  ధర్మ భ్రశ్టుడౌతున్నాడు  .! జంతువు కంటే తక్కువ స్థాయికి దిగజారి పోతున్నాడు. మూడవ గురువు  ఒక చెట్టు ! అది తనకంటూ ఏమీ ఉంచుకోకుండా పూవులు పండ్లు, ఆకులు, చివరకు కొమ్మలు, కాండము, వేర్లు అన్నింటినీ ఇతరుల ప్రయోజనాలకు అందిస్తూ, త్యాగబుద్దిని బోధిస్తోంది. అంతే కాకుండా, చల్లని నీడను ఇస్తూ, చల్లని గాలులు వీస్తు,,, తనను ఆశ్రయించిన ప్రాణులకు, పశు పక్ష్యాదుల కు ఆత్మానందాన్ని, రక్షణను, ఆహారాన్ని , ఉచితంగా, ప్రతిఫలాపేక్ష లేకుండా, నిస్వార్ధంగా , అందిస్తూ, మనిషికి ఉండాల్సిన త్యాగబుద్దిని, పరోపకార మహత్తును చాటి చెబుతూ, గురువులా ఉపదే శిస్తూ ఉంది. ! ఇలా ప్రకృతి మనిషికి మొదటి గురువు. అవుతోంది. ! అంతులేని విజ్ఞాన భాండాగారం ఈ ప్రకృతి  " అని అంటారు. అందుకే ,Nature is the first and the best teacher to mankind.  ! కృష్ణం వందే జగద్గురుమ్ ! భగవద్గీత ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్ని, జ్ఞానాన్ని ,, జీవిత సత్యాలను, మనిషి చేయాల్సిన విది విధానాలను శ్రీకృష్ణుడు అర్జునుడిని నెపం గా పెట్టుకొని , వివేకంతో మెదిలే ధర్మాలను అనేకం బోధించాడు. ,భారతదేశంలో శ్రీకృష్ణుని తత్వం తెలియని వారుండరు. ! శ్రీకృష్ణుని ప్రేమించే ప్రతి హృదయం  నిత్యానంద  నిలయమై వుంటుంది.!".work is worship అంటారు!".. కాని దొంగతనం, దౌర్జన్యం, హత్యలు అన్నీ పనులే, కర్మలే..! కాని వాటిని "దైవ కార్యాలు" అంటామా? అనలేము  కదా ! అందుకే good work is worship , అంటే, సత్కర్మలు పూజనీ యాలు అనవచ్చును.! ఒక భక్తుడు కృష్ణునితో ఇలా అంటాడు,," స్వామీ !ఈ ధనం , ఈ దేహం , ఈ చిత్తం , ఈ సంపద, బందువులు , బలగము అంతా నీదే , సుమా అని..! అప్పుడు  కృష్ణుడు చిరు నవ్వు తో, "మరి నీది అంటూ ఏమైనా మిగుల్చు కున్నావా లేదా ? అని . అనగానే "లేకెం  కృష్ణా! నీవు నావాడి వేగా !నేవొక్కడివి నాతో ఉంటే చాలు.! అన్నీ ఉన్నట్టే ! నీవు గానీ, నాతో విడిపోతే, ఎన్ని ఉన్నా లేనట్టే కదా , స్వామీ ! హే కరుణాసిందొ,! హే భక్త జనబందొ !"  అంటూ ఆర్ద్రత తో  అనగానే అతడి పరిపూర్ణ భక్తి విశ్వాసాలకు ముగ్ధుడై భక్తుడినీ కరుణిస్తాడు.. నీలమేఘ శ్యామ సుందరుడు,!నవనీత చో రుడు , !గోపికా హృదయ విహారు డు !రాధామాధవుడు  !మన శ్రీ కృష్ణుడు. !మన హృదయంలో కృష్ణుడు ఉండాలంటే , హృదయగతవిషయ వస్తువులు అన్నింటినీ  దూరం చేయాలి..! "దేహాభిమానం , ధనం పై, కులం, మతం,జాతి,, లింగ,, ఐశ్వర్య,, రూప సౌందర్య, పదవుల పై గల అభిమానాలు "అన్నింటినీ వదలి, కేవలం శ్రీకృష్ణ పాదార విందాల పైనే, చిత్తాన్ని కుదురుగా నిలపాలి. ! కాళీయమర్దన సమయంలో , కాళీయుని భార్యలు చిన్ని కృష్ణుని శరణు వేడుతూ ,రెండు వరాలు కోరుతారు.! ఒకటి, తమ భర్తకు ప్రాణదానం! రెండు,నిరంతర  కృష్ణ చింతన.!.. అయితే బాలకృష్ణుని సుందర లావణ్య సురుచిర రూపాన్ని  తనివారా దర్శిస్తూ తన్మయులై,," స్వామీ !నీ సచ్చిదానంద స్వరూపం చూశాక ,మాకు ప్రత్యేకంగా వేరే  కోరికలు ఉంటాయా.. ?మమ్మల్ని మా కర్మబందాల నుండి విముక్తులను చేసి మోక్షాన్ని ప్రసాదించు గోపాల కృష్ణా,  ! "అని వేడుకుంటారు.. వారి భక్తికి ప్రసన్నుడై కృష్ణుడు వారిని  ముక్తిధామాన్ని అనుగ్రహిస్తాడు ..! అనగా ఒక్కసారి పరమాత్మ నామ రూపాలు త్రికరణ శుద్ధిగా భావించి, తపించి, జపించి, దర్శిస్తే చాలు, మనం ఏమీ అడిగే అవసరం లేకుండా మన యోగక్షేమాల బాధ్యత తానే వహిస్తాడు శ్రీకృష్ణ భగవానుడు.! అందుకే హరి నామంతో ,కర్మబందాలను, సకల పాపాలను కడిగి, చిత్తశుద్ధిని ప్రసాదించే హరి నామ గాన వైభవం తో పునీతులం అవుదాం!. ఇది తప్ప జన్మరాహిత్యాన్ని పొందడానికి మరి వేరే దారి మనకు లేదు !" అని ప్రాజ్ఞులు జ్ఞానబోధ చేస్తూ ,, నామమంత్ర జప సాధన మార్గాన్ని మరింత సులభతరం చేస్తూ  శ్రీకృష్ణ చైతన్య మహా మంత్రాన్ని ప్రసాదించారు . దీనిని జపించడం వలన, , దే వాదిదేవుడై న శ్రీకృష్ణ భగవానునీ దివ్యధామము ను పొందవచ్చును.,!  " హరే కృష్ణ హరే కృష్ణా. , కృష్ణ కృష్ణ హరే హరే,! హరే రామ హరే రామ రామ రామ హరే హరే. !"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...