Tuesday, January 14, 2020

శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం 2

శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామి వైభవం ,2
Jan 14, 2020
__________
,,,"కష్టాలూ  ఎవరికీ  శాశ్వతం కాదని,,"వెలుగు ప్రసాదించే అమృత ఘడియలు వచ్చేవరకు ఓపిక పట్టాలని  ,నాకు ప్రత్యక్షంగా  లక్ష్మీ దేవి ఉద్బోధించింది ఇక్కడే !
పరమాత్ముని దర్శించడం అంటే , ఇలా సత్సంగం లో ఉంటూ , అదే ధ్యాస గా అదే శ్వాసలో ఉంటూ పడే కష్టమే మహా ప్రసాదంగా అనుభవ పూర్వకంగా నాకు  తెలిసింది  ఇక్కడే  !
భాగవత పద్యాల అర్థం ,వైభవం ,పరమార్థం  నాకు బోధపడింది ఇక్కడే ,,!
అలనాడు గజేంద్రుడు మొసలి బారిన పడి ,,తమ బంధు బలగం సిరి సంపదలు ఎన్ని తన ప్రక్కన ఉన్నా కూడా  తనవారి కనీస ఆదరణకు,సహాయానికి  నోచుకోని దీన పరిస్తితి యే ఇపుడు నాకు దాపురించింది ,!!  అన్న సత్యం నాకు బోధ పడింది ఇక్కడే !!
""లావొక్కింతయు లేదు.,,,, ధైర్యము విలోలంబయ్యే ,,,,!!"" అన్న పద్యం నేపధ్యం లో ,, ఆపదలో నిండా కూరుకు పోయిన తనను కాపాడమని ఆక్రందించే ఆ గజేంద్రుని వలె ,,నేను కూడా ఈ కాలసర్ప దోష పీడితు రాలినై,  ఈ ఆశ్రయాన్ని పాప పరిహారంగా భావిస్తూ , ""నీవే తప్ప ఇతః పరం బెరుగ ,మన్నింపన్  దగన్ దీను నిన్ , రావే ఈశ్వర,!, కావవే వరదా.! సంరక్షింపు భద్రా త్మకా !""అంటూ ఎలుగెత్తి ఆ వైకుంఠ వాసుని పిలుస్తూ ఉండడం,,ఇప్పుడు , అది నా పాలిట పరమ భాగ్యం గా వరించింది ఇక్కడే !!
,,,అల ద్రౌపది , నిండు సభలో , తన మాన సంరక్షణ కోసం ,తన చుట్టూ అమేయ పరాక్రమ శౌర్య వంతులైన భర్తలు. ఐదుగురు ఉన్నా ,దాయాదులు తనను మానసికంగా శారీరికంగా అతి దారుణంగా పరాభ విస్తూ హింసిస్తూ  ఉంటే, చేసేది లేక , వేరే దిక్కు కానరాక ,,తన రెండు చేతులూ పైకెత్తి  విలపిస్తూ ""ప్రభో ! దీన దయాలో ! అత్యంత దయనీయ దుస్తితి లో ఉన్న ఈ అభాగ్యు రాలి ని, నీ చెల్లెలిని కృష్ణా ! పరందా మా పరాత్పర !పరమాత్మ  ,నన్ను దయజూడు !నీ సోదరిని ఈ దౌర్జన్యం నుండి ,ఈ దుర్మార్గుల బారి నుండి రక్షిం చు ! హే , ఆర్తజన బాంద వా !, అనాథ రక్ష కా ! ఆపద్బాం ధ వా ! దేవాది దేవా !శరణు , నంద నందనా ,,శరణు !!""  దీన బాందవు డన్న పేరు సార్థకం చేసుకో  అన్నా !!""అంటూ  హృదయవిదారకంగా  కన్నీరు మున్నీరుగా దుఖిస్తూ  పరమాత్మ ను వేడిన ప్రార్థన , నా  పాలిట కల్పతరువు గా   ధ్యేయంగా  గా మారింది ఇక్కడే!!
""నీ దిక్కు ఉన్న చోట చెప్పుకో ,,పో !""అంటూ కసిరి, కన్న తండ్రీ ప్రేమకు , తన వారికి దూరంగా, నిర్దాక్షిణ్యంగా తరిమివేసిన పిన తల్లి పుణ్యమా ,,అని బాల ధ్రువ కుమారుడు వాసుదేవుని పై మక్కువ,భక్తి పెంచు కొన్నాడు ,!! పరంధాముని సాక్షాత్కారం పొందాడు ,!
అలా ఈ శాపాలు, పాపాలు, కోపాలు ,తాపాలు ,కష్టాలు, కన్నీళ్లు,, బాధల సుడిగుండాలు ,, అన్నీ స్వామి కృపతో మాత్రమే పటా పంచలుగా మాయమై నాయి,,,ఆ స్థానంలో లక్ష్మీ నరసింహుని దివ్యానుగ్రహం వలన,, స్వామి సాక్షాత్కారం కోసం ఆయన సన్నిధానం లో కొనసాగించే ఈ సాధనా సంపత్తి సాధ్యం అవుతుంది కదా ! అని గ్రహించింది ఇక్కడే !!
దిక్కు లేని వారికే కాదు, భూమిపై పుట్టిన ప్రతీ జీవుడికి దేవుడే దిక్కు; అన్న విశ్వాసం ఏర్పడింది ఇక్కడే !!
స్వామి కరుణపొందడం అంటే ,, జన్మ జన్మల సాఫల్యం కదా !, హృదయాన్ని కదిలించే అమృత భాండం  ఆతని అనుగ్రహం ,అనుబంధం !
ఈ విధంగా స్వామి సేవలో,స్మరణలో , అర్చన లో , భావన లో , భజన లో సత్సంగ ములో , భక్తుల నిరంతర సహవాసం లో స్వామి చింతన తో రెండేండ్లు పరమానందంగా ,, ముక్తి దాయకం గా, ఆధ్యాత్మిక జీవితం  గడపడంఅంటే అది , నేను అనుకుంటే జరిగే పనేనా,?? నా వల్ల అయ్యే నా , అంతటి దీక్షా పర తంత్రత ,??
,, కాదు కదా !!కేవలం ,,అది స్వామి కరుణ వల్ల నాకు సాధ్యపడింది ,, !
ఎక్కడో, ఎప్పుడో చేసుకున్న పుణ్యాల ఫలం ఈ స్వామి సేవా భాగ్యం!! , ఎక్కడ పుట్టాను ?,!ఎక్కడ పెరిగాను ?, ఎక్కడి ఆ సంసారం? ఎక్కడి ఈ దివ్యమైన  పరమానంద కరమైన ,పరమ పావన కరమైన ఈ క్షేత్ర దర్శన వైభవ అనుభవం ,,?? అన్నీ మరపించి ,తన సేవతో మురిపించే స్వామీ సన్నిధి, నా పాలిట పెన్నిధి కావడం, ఏమీ నా భాగ్యం ?!
ఆహా !నా కంటే అదృష్టవంతులు ఉంటారా ఈ ప్రపంచం లో?"" అనిపించింది ,,రోజు రోజుకూ  ఇక్కడ పెరుగుతూ ఉన్న స్వామి ఆరాధనా అనందం అనుబంధం తో !!!
,, అలా  అద్భుతంగా అలవాటు అయ్యింది లక్ష్మీ నరసింహుని దివ్య ఆలయ పరిచర్య !
,, స్వామికి అనుదినం  పూలతో నిత్య దైవఅర్చనచేయడం,, నా  నిత్యకృత్యం గా మారింది !
కోడి కూత తో మెల్కోడం , వంద గజాల దూరం పొలాల గట్టు మీదుగా,  ,, ఆవల బురద దాటుకుంటూ వెళితే కనిపించే ,, ఊట లాంటి చిన్న చెలిమె నుండి నిరంతరం ప్రవహించే చల్లని తీయని నీరే, ఇటు మాకు అటు రైతులకు. జీవనాధారం గా  అన్ని కాలాల్లో  ప్రవహిస్తూ  ఉంటుంది !
, దాని లో నుండి నిరంతరం నీళ్ళు ఊరుతూ వస్తూ కింద ఉన్న ఊరి పొలాల కు పంటలు వరి పండిస్తూ ఉంటుంది  ,,! అవే నీళ్ళు స్నానం మాకు  !, ఆ నీళ్ళే  స్వామికి అభిషకం,కోసం నిత్యం పూజారి నర్సయ్య గారు వినియోగిస్తుంటారు. !
అవే మాకు అందరికీ, వంట కు త్రాగడానికి అన్నింటికీ ఆధారం గా ఉంటుంది !
, స్వామి మూల విగ్రహం తేజోవంతంగా , అద్భుత ప్రభావం చూపుతూ ఉంటూ,, ఆలయం మాత్రం సనాతనం , పురాతన కట్టడం కావడం , నాగరిక ప్రపంచానికి దూరంగా ,తెలియకుండా ఉండడం ,వల్ల , పునరుద్దరణ కు నోచుకోకుండా ఉంది! అంతా పెద్ద పెద్ద స్తంభాలతో ,రాళ్లతో  ఏ కాకతీయుల కాలంలో లోనో నిర్మింప బడి  చెక్కు చెదరకుండా ఉంది ,, కానీ,జన ఆదరణకు నోచుకోని విధంగా కనీస వసతులు లేకుండా,పరిసరాలు 
చుట్టూ పొలాలు చేనులు ఉండడం తో  పెద్ద పెద్ద సర్పాలు కూడా ఆలయం లో ఆలయ పరిసరాల్లో రాత్రీ పగలూ రోజూ కనిపించేవి,!!
మేము  వాటికి నమస్కరిస్తూ దూరంగా వెళ్లి పోయేవాళ్ళం ,! చలికాలం గజగజ వణికే చలి రోజుల్లో,వర్షాకాలం భోరున కురిసే వానలో తడుస్తూ మండే ఎండల్లో మాడుతూ  కూడా దేనికీ భయపడలేదు ,,
స్వామిని విడువని, ఆయన సేవ మరవని దీక్షా భావంతో ,,స్వామి మూల విగ్రహాన్ని  దర్శిస్తూ,ఉదయం ,సాయంత్రం స్నానం చేసి, అవే తడి బట్టలతో ,ఆలయం చుట్టూ,, ప్రతి రోజూ,108 ప్రదక్షిణలు చేసేవాళ్ళం !; పూలతో పూజిస్తూ వచ్చిన భక్తి గీతాలు  సామూహికంగా చదువుతూ భజన చేసే వాళ్ళం !!, వచ్చే పోయే భక్తజనాల సందడి తో ఆలయ పరిసరాలు నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా విరాజిల్లుతు ,,మాకున్న ఈతి బాధల ను మరపించేవి ,,
,,  ఇక్కడే స్వామి ఆశ్రయం లో ఉంటూ పలు వ్యాధులు  నయం చేసుకోడానికి వచ్చిన అనేక భక్త జనాలే మా  కుటుంబం అనుకుంటూ , వారే బందువులు గా భావిస్తూ, నా బాధలు ,  అన్ని మరచాను,
నా జీవిత ఉద్దేశ్యం ,ఒకటి కర్తవ్య నిర్వహణ అంటే నా మీద ఆధారపడి ఉంటున్న ఈ పిల్లల సంరక్షణ ,పోషణ, పెంచే బాధ్యత మొదటిది అయితే, నన్ను బ్రతికించి, బ్రతుకు మీద ఆశ కల్పించి,ఒక అర్థం పరమార్థం చూపించి,తన అభయ హస్తాన్ని  దయ తో అనుగ్రహించిన ఈ లక్ష్మీ నరసింహుని ఆఖరు శ్వాస విడిచే వరకూ ఆరాధిస్తూ ఉండడం రెండవది !
ఇదే నా జీవితాశయం , అనుకుంటూ స్వామికి ఎడమ భాగాన ముందు కొలు వై పద్మాసనంలో కూర్చుని చిరునగవు తో ఆగుపించే,అమ్మవారిని ,అనుక్షణం భక్తిభావం తో వేడుకున్నాను
""అమ్మా !దేవీ,,! జగన్మాత !!తల్లీ !!నిన్ను నమ్ముకుని నీ పంచ న చేరాను!!  నీ పాద ముల ను, నా కన్నీటితో అభిషేకిస్తూ నిన్ను  అర్తిస్తు ఉన్నాను ! అమ్మలగన్న యమ్మ !, నాపై దయ రాదా,? ఈ చిన్నారి పసి కూనల పై జాలి చూపవా,,? నా దీన స్థితిని కనలేవా? ,, అమ్మా !లోక పావని! , నీవు చెబితేనే గానీ, స్వామి నా మొర వినడు గదా ,,? జగజ్జననీ,! ఎన్నాళ్లీ  తీరని వేదన భరించ ను, ? ఇదిగో! ఈ పిల్లల బాధ్యత  ఇక నీదే సుమా ,!, వీరు  నా పిల్లలు కాదు ,,నీ బిడ్డలు !!నేను ఏమైనా ఫర్వాలేదు. అమ్మా ! మహాలక్ష్మి,,, విష్ణు పత్నీ !నీవు, స్వామి తొడపై కూర్చొని అతడితో సంతోషంగా సదా మాట్లాడుతూ ఉంటావు గదా !!ఒక్కసారైనా ,నా దీన గాథ  అతడితో నీవైన చెప్పరా దా దయామయి ,??"",,
అంటూ విన్నపం చేస్తూ  అమ్మ దయ కోసం ఆత్రంగా ఎదురు చూస్తు కాలాన్ని మరచిపోయాను ,!!
అదేం చిత్రమో కానీ ,భజన బృందం పాడుతూ ఉండే భాగవత పద్యాలు, మేల్కొలుపు పాటలు, భజన గీతాలు  చాలా వరకూ కంఠతా వచ్చాయి , గుడిలో కూర్చున్న ,గుడి చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఉన్నా కూడా ధారాపాతంగా పద్యాలు నోటినుండి  దొర్లి పోతూనే ఉన్నాయి
అమ్మ చెప్పిందో ఏమో,, స్వామి అనుగ్రహించాడో అన్నట్లుగా , లక్ష్మీనరసింహ స్వామి పై అపారమైన భక్తి శ్రద్ధలు,, నమ్మకం అంకితభావం నా హృదయంలో స్థిర పడ్డాయి
చెప్పలేని అనందానుభూతి, మనో దైర్యం,ఆత్మానందం , గుండె నిబ్బరం అమ్మ అనుగ్రహించింది , చిత్రంగా,,
మొక్కవోని దైర్యం, దైవభక్తి, నాలో అలవడినాయి , తమను ఆశ్రయించి వచ్చిన బిడ్డలకు
ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో , అమ్మకు తెలినట్టుగా మనకు తెలియదు కదా !!
అమ్మ దయకు నోచుకునే యోగ్యత పొందేవరకు ఈ నిరీక్షణ తప్పదు కదా !!
అమ్మ ఒడిలో బాధలకు అతీతంగా ఉండే ఆనంద లోకం అనే "స్వర్గం" ఉంటుందని  అనుభవం ద్వారా నాకు తెలిసింది !
స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా !!

Saturday, January 11, 2020

భీష్మాచార్యుడు,పరమ వైష్ణవ భక్తుని"" కృష్ణ ప్రేమ""

Jan 10, 2020
""శ్రీకృష్ణ భగవానుని ప్రియ భక్తుడు , విష్ణు సహస్ర నామస్తోత్రం  మనకు అందించిన పరమ భాగవతం తోత్త ముడు,, భీష్మాచార్యు డు,పరమ వైష్ణవ భక్తుని"" కృష్ణ ప్రేమ""గురించిన కవిత! అద్వితీయమైన ,అనుభవైక వే ద్య మైన,పరమానంద కరమైన  మధురానుభూతి!"
___________________
ఏమీ నా భాగ్యము ??,ఇంతింతని చెప్పరాని ,
ఏమీ నా భాగ్యం ?!"
____నా కోసమే పరమాత్ము డు
స్వయముగా  తా వచ్చు చుండె ,!!""
!!ఏమీ నా భాగ్యము !!
,,,ఉరుకులతో పరుగులతో, అతి రౌద్రా వే శము తో,
నను కడ తేర్చి  ,నాకు మోక్షం కరుణించు టకై,, స్వయముగా  అరుదెంచు శ్రీహరిని కాంచ , నా కనులు ,,
ఏమీ నా భాగ్యం !!!!!!
నీలమేఘ శ్యాముడు ,!
నీరజ దళ నేత్రుడు,!
సామజవర గమనుడు,!
సరసిజ దళ నేత్రుడు,!
సామ గాన లోలుడు,!
భక్తజన మం దారుడు ,!
జగదేక సుందరుడు ,!
షోడోశ కళా పరిపూర్ణుడు ,!
శంఖచక్ర పీతాంబరుడు,!
శిఖిపించ మౌళి  ,శ్రీకృష్ణుని ,
ఘనశ్యామసుంద రునీ  గన
ఏమీ నా భాగ్యం !_
______________1
ఎవడు శివుని మెప్పించెనో,!
పాశుపత ము సంపాదిం చి
సవ్యసాచి పేరు గాంచి ,
విజయు డని కీర్తి గాంచె నో,,
ఎవనికి తన చెల్లెి నిచ్చి
నిరతము కాపాడుచుండె నో,, ,
మహా భారత సంగ్రమాన ,
ఎవనికి రథసారథి యై జయము కట్ట బెట్టేనో,
ఎవని ధర్మ నిరతి చాట
తాను దీక్ష బూనే నో ,
తానే ప్రత్యక్షమయ్యి
తన విశ్వరూపమేచూపెనో,,
భగవద్గీత బోధిం చి యుద్దమే చేయించేనో,,
ఆ ప్రియ అర్జునుడే
నా  బాణాల ధాటి కోప లేక,
బేలగ నుండు ట జూసి,
వానిని గాచుట ,కొర కై,,
పగ్గాలను పారవేసి ,,
చెంగున రథము నుండి  కుప్పించి  దుమికి,,,కింద!
రుద్రుని వలె కోపముతో కన్నెర్ర జేసీ చూస్తూ,,
కొదమ సింహం వోలె వస్తూ,
"అర్జునా !ఈ భీష్ము జంపి ,
విజయము నొన గూర్తు నిపుడే ,
ఈ చక్రాయుధ మున ,. నే.!"
ననుచు  హుంకరించి,,పలికి,
నిశిత దృష్టి నను చూచు చు ,
వడి వడి నా దెస కేతెంచు
శ్రీ  లక్ష్మీ నారసింహ ,,రూపము తలపించు  శ్రీ
కృష్ణ పరమాత్ముని గాంచిన
ఏమీ నా భాగ్యము ??!_ఇంతింతని_చెప్పలేని,!
________________2
హరికి అంజలి ఘటిం చెద!
సాగిల పడి ప్రణమిల్లేద !
ఆత్మార్పణ గావించేద !
వేల వేల ఏండ్లు ఘోర తపస్సు లు చేసిన ను దొరకనిపరమాత్ముడు ,
  తానే సాక్షాత్కరించి 
ప్రత్యక్షమయ్యే గదా,!
నా జీవన సర్వస్వము !
నా పుణ్య తపః ఫలము!
నా జపము, నా తపము!
ఫలించు చున్న శుభ తరుణం!
అపబోకు అర్జునా,,!
ఆపద్భాం ధవు, దనాధ రక్షకు,!
ఆర్త జన సంరక్ష కు,!
నాపకు,! నాపాబోకు!
నను కటాక్షించి ,బ్రోచుటకై,,!
ఏ తెం చు పరాత్పరుని,!, జగన్మోహనాకారుని ,,!
మోమున సౌందర్యాన్ని,!
భువన మోహన రూపాన్ని,!
నా ఎదురుగా నడయాడే  సౌందర్య రాశి పరమాత్మను!
చూడనీ కనులారా,!,
గాంచనీ తనివారా,,!
దర్షించనీ మనసారా ,,!
వర్షించనీ భాష్ప ధారా,,!
మ్రొక్కనీ   ప్రేమ మీర,,!
ఏమీ, నా భాగ్యము !"". ఇంతిన్ తని చెప్పరాని
ఏమీ నా భాగ్యము! ,,3
______
"ప్రియ శిష్యుడవు నీవే!
నా మనసేరిగి న మనవడవు నీవే,,!
పంచప్రాణ ము  నీవే. సుమా,!
నా ఆరాధ్య దైవాన్ని,
నా పూజా ఫలాన్ని ,,
నా భాగ్య ము ,నాప్రాణము!
నా జీవము, నా భావమైన
శ్రీకృష్ణ పరమాత్ముని,,!
నా ఎదుట నిలబెట్టి ,,
నను ద న్యుని జేసితివి,!
విజయీభవ అర్జునా!
యశస్వి భవ ఫల్గుణ!
ఎక్కడ  కృష్ణుడు కిరీటి
జతగా కలిసి ఉందురో,
అచట విజయము తథ్యము సుమా!
అధర్మము నశించును !
ధర్మము వర్ధిల్లు నిజము!
మీ ఇద్దరినొకచోట గాంచి,
నా జన్మము ధన్య మయ్యే!
నా తపము ఫలి యించే !
శ్రీకృష్ణా ,!య దుభూషణా !
నినునే బాగుగ ఎరుగుదు !
నీ భక్తుడ ,,అనురక్తుడ  ,!
పరమాత్మ వు నీవే,! పరంజ్యోతి వీ నీవే!
లీలా మానుష విగ్రహ
రూప ధారి నీవే !!,
నటన సూత్రధారి నీవే!
కపట వేషధారి నీవే!
ఆది మద్యాంత రహిత
దేవాది దేవుడవు నీవే!
దుష్టులను పరిమార్చి,
శిష్యులను కాపాడగ,!
అధర్మ వర్తను ల  అణచి,
ధర్మము  నవ ని లోన! ఉద్దరింప  దీక్ష బూని
వసుదేవ  తనయుడిగ!
ఇల నవతరించిన  ఈ
దేవాది దేవుని గన !
ఏమీ నా భాగ్యము_
_______________4.
నీ రూప  సౌందర్యం ,,
నీ లీలలు , నీ గాథలు  నీగుణ గానం ,సర్వం
మధురాతి మధురం కదా!
చూచిన కన్నులు తనియవు,
పలికిన నాలుక తనియ దు
వినిన చెవులు తనియవు కదా
కృష్ణా నిన్నెం త జూచిన,
తీరదు ఈ తాపము!
తనివి తీర దీ మనస్సు!
చాలదు ఈ జీవితం,!
తీరదు కద ఈ వేదన!
యశోదా నందులకు ముద్దు
పట్టీవై పెరిగిన  ఓ
నంద గోపా లా!
గోవర్ధన గిరిని కేల,
నిలిపిన విభుడవు నీవేగదా!
గోకులం ,బృందావనం,!
గోవర్ధన ఉద్ధరణ మ్ ,!
గావించిన   గోవిం దా!"
పూతనాది రాక్షసులను ,
కంస జరా సం దాదుల,,
శిశుపాల దంత వక్ట్రుల,
హతమార్చిన  పరమాత్మ !
నా మనసు, నా భావన!
భరింపలేని ఆవేదన ,! తెలిసిన ఓ పరమ పురుషా!
నాకు ముక్తి నొసగి, అత్మ
శాంతి నొసగి బ్రోచవయ్య!
అల గజేంద్రుని గాచు శ్రీ
హరి వలె కనపడుచు నున్న   నాదెస కరుదెంచుచున్న
మాధవా ,,!నీకిదే శతకోటి ప్రణామాలు ఇవిగో!
ఏమీ నా భాగ్యము_
_______________5
తెలుసు నాకు నీవెవ రవో,,!
తెలుసు నాకు నేనె వరో,!
తెలుసు నాకు జరిగినది!
జరిగేది, జరుగ బోయేది! తెలుసు నీవు పరమాత్మ వని ,
తెలుసు నా కథ ముగియునని !!
తెలుసు. నీవు అవతార
పురుషుడవని ,దేవుడవని!
  తెలుసు నాతప్పిదములు!
అధర్ములను కాసిన నా,
అపరాధము లూ తెలుసు!
మానిని ద్రౌపది మాన
సంరక్షణ చేయలేని,
క్షమించరాని ఘోరమైన
ఆపరాధము తెలుసు!
భయంకర రణాంగణమున!
ఎందరో అమాయకులను !
బలి చేస్తున్న ఈ యుద్దాన్ని!
,, శక్తి ఉండి,ఆపలేని
నరమేధం , మారణ హోమం
కారకు డ నని తెలుసు !
నీ భక్తుడ నయ్యుం డి ,,
ధర్మ ము ,తెలిసి ఉండి
చేసిన నేరాలకు శిక్ష  ,
నీవే విధించ వయ్య!
క్షమించ కుండ నన్ను ,,
దండిగ శిక్షించు మయ్య!
కటినంగా దండించవయ్య! ఏదైనా  మహా ప్రసాదము !
నా పాప పరిహారంగా ,
సంతసించి స్వీకరింతు !నను
దయజూడకు ,జాలి పడకు! వృద్దుడు అని వెనుకాడ కు!
నీ చక్రాయుధ జ్వాల ల్లో
మండించి మసి చేయుమా! నీ క్రోధానల జ్వాలలో
ఆహుతి చేయుమయ్య!
రుద్రుని వలె ఏ తెంచిన,
ఓ,జ్వాలా నరసింహ ,
కరుణించి కడ తేర్చుము!
గోపాలా! పాలించు నన్ను !
నీలో ఐక్యము జేసీ,
నాకు శాంతి ప్రసాదించు !
ఇంతకన్న ఆనందము
ఇల లోనా ఉండదు కదా!
కనులారా నిన్నిటుల గాంచ
ఏమీ నా భాగ్యము_?
ఇం తింతని చెప్పరాని ?
_________________6
"స్వామీ !సర్వాంతర్యామి! నిను
కనులారా చూతామంటే ,!
కను రెప్పలు అడ్డమా యే,!
వృద్దాప్యం ప్రభలమాయే,!
పరమాత్ముని దర్శనమున
జారిన భాష్ప ధారలతో ,
మసక బా రె నూ  కళ్ళు,,!
గోవిందుని సుందర వదనార వింద సోయగాలు!
కనలేని నను, కనికరించి
రావేలా, మురళీలోలా!
గోపాలా! హే ,కృపాల!
నా దైన్యం కన వేెలా!
నా మొరనూ వినవేల!
నను నీలో చేర్చ వేల!
హృదయమ నే కమలములో ,
నీ సుందర వదనమును
పదిల పరచుకొందు  కృష్ణా!
కళ్ళ ముందు జరిగిన ,
ఘోర దౌర్జన్యాలు తలచి ,,
పశ్చాత్తాపంతో నామది,
రగులుతోంది నిరంతరము!
అది కాల్చుచుండె గుండెలను,
ఇకనైనా కరుణించి ,
ముగించుము ఈ జన్మము!
భవ్యమైన దివ్యమైన
నీ మంగళ కర రూపము /గన
ఏమి నా భాగ్య ము_
________________7
ఏ మా మోహనరూపము?
ఏమా సౌందర్యము , స్వామీ,!
నీవు రథం పై నుండి ,
కుప్పించి ఎగసిన పుడు,
ధరణి కాలు మోపినపుడు,
నీ కుండలాల కాంతి తో
నీలగగన భాగమంతా
మెరుపులతోవెలిగి పోయె !
కరిపై కి దుమికే ఒక
కొదమసింహము వోలె
,వేగముగా ఉరికినపుడు
నీ కుక్షిలో  దాగి ఉన్న,,
సకల భువన బ్రహ్మాండాలు
ఒక్కసారి కంపించే ,
భుజము పై నున్న పసిడి
చేలాంచలము జారుచుం డే,
కదలి వచ్చు కమలాక్షుని,
కాళ్లకు అడ్డం పడుతూ
""ప్రభో !దీన దయాలో !
పరమ కృపాలో !, నన్ను,
మన్నించి, మరలి రమ్ము!
నా చేతగాని తనాన్ని,
శతృవులకు చాటబోకు!
పదిమందిలో నన్నిలా,
నగుబాటు చేయబో కు!
పౌరుషము చూపించి ,
ప్రాణం ఫణంగా పెట్టీ ,
క్షాత్ర తేజం తో పోరాడే
కర్తవ్యం బోధించా వు,!! బావా,! నా మొరాలించు!
నమ్ముము,,!నా ప్రతినను!
నమ్మవయ్య ,,నీ పార్థు నీ!""
అనుచు  దీనంగా బ్రతీమి లాడుచున్న అర్జునునీ
లక్ష్య పెట్టక, చూపు దిప్పక !
""విడువుముఅర్జున,నన్ను ఇపుడు ఈ  ముసలి వాడి
అహంకార మ ణగించెద!
పరిమార్చే ద, నిపు డే !! నిన్ను
జగజ్జేత గ నిలిపించెద !!""
అనుచు  నీపై కోపమును!
నా పైఅపార వాత్సల్యము!
ఒకేమారు ప్రదర్శించు !
పరమాత్మా !నీవే దిక్కు!
పరంధామా  !నీవే గతి!
నీకే నా శరణాగతి!
నాకిక ఈ బ్రతుకు వద్దు!
వద్దు, వద్దు !ఈ దైన్యం!!
వలదు ,వలదు ఈ పాపం!
ఇన్నాళ్లూ నా కెదురుగా!
విజయ సారథి గా వెలిగిన!
నిను  దర్శించి పరవశించి!
పోందితి, పరమానందం!
గాంచితీ , నా జన్మా ధన్యం!
ఆర్పించితి ఆత్మార్పణ!
నా ప్రార్థన స్వీకరించి
దయ యించి బ్రోవవయ్య!
ఈ కన్నుల నీ రూపము!
చివరి వరకు నిలుపు మయ్య!
ఈ నోటితో నీ అద్భుత !
పవిత్రనామాలు వేయి !
పలికించి ఈ దీను ని!
పాపం కడిగేయు మయ్య!
తండ్రీ !ఇక చాలు చాలు!
చాలించు ఈ నాటకము!
చాలు నా జీవితము!
చాలు పడిన క్లేశములు!
పరంజ్యోతి,పరమ పురుష !
శతకోటి ప్రణామాలు !
సమర్పింతు సర్వేశ్వరా!
పాహి పాహి జనార్దనా!!
రక్ష రక్ష గోవిందా!
శరణు శరణు కేశవా!
శరణు శ్రీమన్నారాయణ!
శరణు శరణు శరణు !"
స్వస్తి!!""
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు !"
హరే కృష్ణ హరే కృష్ణా!!"

సుందిల్ల లక్ష్మి నరసింహ స్వామి వైభవం 1

Jan 9, 2020

గోదావరి ఖని NTPC  ,, సమీపంలో   గల సుందిల్ల గ్రామం లో వెలసిన  శ్రీ లక్ష్మి నర సింహస్వామి క్షేత్రంలో 4_1_ 2020  నుండి 11_01__2920 ఆదివారం వరకూ  జరుగుతున్న 110 వ భజన సప్తాహ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగుతోంది ,
సుందిల్ల గ్రామస్తులే కాకుండా హైదరాబాద్ చెన్నూర్ మంథని మంచిర్యాల లాంటి వివిధ ప్రాంతాలనుండి  భజన పరులు స్వచ్చందంగా వచ్చి పాల్గొంటూ తమ దైవభక్తి , నీ ,లక్ష్మీ నరసింహ స్వామి పట్లతమ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు,
ప్రతి రోజూ 24 గంటలు, రాత్రీ,పగలు అనకుండా ,నిర్విరామంగా , స్వామి సన్నిధిలో,స్వామి దివ్య విగ్రహానికి ఎదురుగా కూర్చుండి, ఆపకుండా  ఆగకుండా అనేక భక్త జన బృందాలు అఖండ  హరినామ సంకీర్తన  చేస్తున్నారు,keyboard తబలా సహకారంతో  వాయిద్యాల లో చక్కని ప్రావీణ్యం నైపుణ్యం కలిగిన వారు స్వచ్చందంగా ,, సమూహాలు గా కదలి వచ్చి  తమ ప్రతిభను ,భక్తిని ,ఐక్యతను చాటుతున్నారు ,,
భక్తి శ్రద్ధలు కలిగి వస్తున్న భక్తజన సందోహం అందరికీ ఉచితంగా అన్నదానం నిర్వహిస్తూ,వారికివుండ డానికి తగిన  వసతి కల్పిస్తూ ఉన్నారు ,,
ఈ దేవాలయం సనాతనమైన ది,స్వయంభువు గా  పవిత్ర  గోదావరీ తీరాన  వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి దక్షిణా భిముఖంగా దర్శనమిస్తూ నమ్మి కొలిచే భక్తుల ఇలవేల్పుగా కోరిన కోర్కెలు దీర్చే దైవంగా ఆరాధించ బడుతూ ఉన్నాడు,,
65 సంవత్సరాల క్రితం మా అమ్మ ఇక్కడ , ఇదే ఆలయంలో అనారోగ్యం వల్ల ,,రెండేళ్ల పాటు ఆశ్రయం పొందింది ,,
అప్పుడు  కరెంటు , బావి , ఫోన్ లు రవాణా సౌకర్యం ఏ మాత్రం లేవు ,,
రాత్రి  అయితే ,స్వామి ముందు గర్భగుడిలో పూజారి వెలిగించిన దీప కాంతి తప్ప, గుడి చుట్టూ అంతా అం ధకారమే,,!
ఆలయం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మింప బడి ఉన్నా,, చుట్టూ పొలాలు చేన్లు , చిన్న అరణ్యం లా ఉండడం తో, పాములు , ఎలుగు బంటి లాంటి వల్ల  భయం కూడా ఉండేది ,
నీటి వసతి కూడా ఆలయానికి 100 గజాల దూరంలో ఉన్న ఒక చెలిమె ద్వారా  మాత్రమే కలిగేది ,
మా అమ్మతో అక్కడ ఆ రోజుల్లో అంతగా కష్టపడుతూ ఉన్నా  కూడా స్వామి దయ వల్ల అమ్మ  దీక్ష ,సంకల్పం చక్కగా  నెరవేరాయి ,
మా అమ్మ ఆరోగ్యం చక్కబడింది ,స్వామి అమ్మకు స్వప్నంలో సాక్షాత్కరించి అందించిన అమ్మవారి భజన గీతం తో , అమ్మ స్వస్థత పొందింది
అంతవరకు బాధించిన కష్టాలు ఇబ్బందులు   తొలగిపోయి, జీవితంలో సుఖ శాంతులు లభించాయి ,
ఇదంతా స్వామి అనుగ్రహం వల్లనే,అని మా అనుభవ పూర్వకంగా తెలుసుకున్న నగ్న సత్యం! ఆ రోజునుండి మాకు పిలిస్తే పలికే ఇష్టదైవం మా ఇంటి ,ఇలవేల్పుగా , స్వామిని భావిస్తూ కొలుస్తూ దర్శిస్తూ ఉంటున్నాం ,,
ఇప్పుడు అక్కడ  అన్నీ రకాల వసతులు ఏర్పడినాయి,,
వేల సంఖ్యలో వచ్చే భక్తుల రాకపోకలకు రవాణా, రోడ్డు సౌకర్యాలు ఉన్నాయి,,
ఆలయం ఆధునీకరించ బడి ఉంది,,,
భజన చేస్తున్న భక్త బృందం తో. అందమైన స్వామి మూల విగ్రహం  ముందు ఒక్క గంట సేపు కూర్చుంటే చాలు  ,, మనకు అపారమైన అనందం ,ఉత్సాహం ,ఉత్తేజం , కలుగుతాయి
స్వామి విగ్రహం లో ఉండే  మహత్తు వల్లే,  దైవాన్ని విశ్వసించే భక్త జనానికి ఇంత శక్తి ,బలం ప్రగతి, ప్రతిభ , చదువూ,భక్తి శ్రద్ధలు  ప్రాప్తి స్తు ఉన్నాయి ,,,
స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు,తన జీవితంలో సంతోషంగా ,సంతృప్తిగా ఉండగలిగే  ఉపాధి అవకాశాలు ,ప్రగతి నీ పొందుతూ ఉన్నాడు,,
ఎంత విశ్వాసం మో అంత ఫలితంగా , ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత గా ,భక్తుల పాలిట కొం గుబంగారమై విరాజిల్లుతున్న శ్రీ సుందిల్ల లక్ష్మీ నరసింహుని అనుగ్రహం పొందడం కోసం, మన వంతు గా వెళ్లి స్వామిని దర్శించి జన్మ ధన్యం చేసుకుందాం,! మళ్లీ మళ్లీ రావాలి చూడాలి   అని  అనిపించే  ప్రభావం కలిగిన , అమోఘమైన లక్ష్మీ నరసింహ స్వామి మూర్తి వైభవాన్ని తిలకిస్తూ, ఆనందకరమైన అనుభూతిని పొందు తూ,,  స్వామి కృపకు పాత్రులం అవుదాం ,
సుందిల్ల లక్ష్మీ నరసింహ భగవానుని కి జై !!

తాత మనవడు

Jan 7, 2020

""తాతయ్యా , ఇంత ప్రొద్దున్నే ఎటు వెళ్తున్నారు ?""
""ఎవరూ ,ఓహో చిన్ని కృష్ణుడా ? ఆహా ఏమి నా భాగ్యము , శ్రీకృష్ణ దివ్య మంగళ  ,ముగ్ద మోహన సుకుమార సుందర శ్యామసుందరుని దర్శనం లభించిన  ఈ రోజు  నా జన్మ ధన్యం కదా ! గోపాల కృష్ణా , నందనందన ఇవే నా సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను , స్వామీ స్వీకరించు !!"" ఎన్నేళ్ళు గా ఎదురుచూస్తూ ఉంటే, ఇప్పుడు దొరికావు కదయ్యా ,వెన్నదొంగా !""
""నేను నీకు దొరకడం ఏమిటి తాతా? నేను నీ లోనే నీ తోనే ఉంటాను ,,అది నీవు గుర్తించక పోవడం ,అది నీ తప్పు కదా ! అయినా నన్నెందుకు జ్ఞాపకం చేసుకోడం ,,నాతో నీకేం పని ??
""కృష్ణా !రోజూ ఉదయం  ఇలా ఈ గ్రౌండ్ లో నేను వాకింగ్ చేస్తుంటాను కదా ,!అపుడు నీవు నా ప్రక్కన ఉండి నాతో మాట్లాడుతూ స్నేహితుడి లా ఆప్యాయంగా నడుస్తూ ఉన్నట్టు  హాయిగా ఎంతో ఆనందంగా భావిస్తూ ఉంటాను , సుమా!!"
""అదేంటి తాతా ??ఒక్క ఈ సమయంలో మాత్రమే నన్ను గుర్తు చేస్తున్నావా ?""
""లేదు , స్వామీ !!ఎపుడూ నీ రూపం ,మదిలో , నీ నామం హృదిలో మేదుల్తూ ఉంటుంది రా కన్నయ్యా ,!"" నిజం చెబుతున్నా గోపాలా! నీ వంటే నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను రా ,,!""
""నీవు చెప్పేది అంతా అబద్ధం తాతా ! ,నీవు నీ మనవడు ,  మనవరాలు  స్నేహితులు ,బందువులు,,ఎందరితో నో ఎంజాయ్ చేస్తూ ,ఉండడం నాకు తెలియదు అనుకున్నావా, ఎమిటి?""
""కృష్ణా నా వరాల పంట !,నా బంగారు కొండ !,నా పుణ్య ఫలమా ,!ఎవరితో నైనా నేను సంతోషంగా ఉంటున్నాను ,అంటే వారిలో నిన్ను చూస్తూ ఉంటాను అన్న విషయం ,,నీకు ఎలా చెప్పను రా ,,గోపీ మానస చోరా !; ఇది నా పూర్వజన్మ, భాగ్యం కాకపోతే ,ఇలా  మనసు విప్పి నీతో మాట్లాడే అవకాశం అదృష్టం నాకు ఇస్తావా తండ్రీ!! ,వేణుగానం లోల ,!భక్తజన పరిపాలా ,!""
"తాత గారూ "నాకు అన్నీ తెలుసు !,కానీ ఒక్కటే తెలియడం లేదు !""
""కృష్ణా ! రుక్మిణీ వల్లభ !!నీకు కూడా అర్థం కాని విషయాలు ఉంటాయా ,నారాయణా ?
"అదే తాతా !ఎందుకు ఈ మనుషులు  నిత్యం అబద్దాలు చెబుతూ , వాటి మధ్య జీవిస్తూ ఉంటారో ,నాకు అర్థం కావడం లేదు !!""
""అంటే , కృష్ణయ్య,నన్ను కూడా అబద్దాల కోరు గా భావిస్తూ ఉన్నావా ??నేను కూడా నా??""
""కాదా  తాతా ,?,వాకింగ్ చేస్తున్నపుడు  నన్నుగుర్తు చేస్తావు ;,ఎందుకంటే నీకు తోడు అవసరం కనుక ,,కదా!!
అదే ఇంటికెళ్ళాక ,నీకు బోలెడు మంది ఉంటారు ,,అప్పుడు నాఅవసరం ఉండదు కదా,జ్ఞాపకం పెట్టుకునేందుకు ??""
""నీవు చెప్పేది నిజమే కృష్ణ , ! కానీ,వాళ్లను ప్రసాదంగా ఇచ్చింది నీవే కదా  ముకుందా !??,గౌరవించక తప్పదు కదా గోవిందా !""
"",,చూశావా?? ఎలా తప్పులు కప్పి పుచ్చు కుంటారో ఈ మానవులు ??,,నా ముందే నీ తెలివి చూపిస్తువున్నావు కదా  ??""
"లేదు  స్వామీ !  నిన్ను జ్ఞాపకం చేయని క్షణం లేదు !"
""అదిగో మళ్లీ,, అదే భజన !"" పోనీ, రోజూ భోజనం చేస్తున్నప్పుడు,నన్ను తల చుకుంటు ,," కృష్ణార్పానం" అంటున్నావా ?""
""జ్ఞాపకం ఉన్నపుడు అంటూ ఉంటాను కృష్ణా!""
""మరి తాతా ,నీవు పడుకుంటున్నపుడు ?""
""కృష్ణా !నీ దగ్గర నిజం  దాచలేను,కానీ  ,ప్రయత్నం చేస్తుంటా ను  నందగోప కుమారుని స్మరిస్తూ నిద్రించాలని !,,కానీ మరిచి పోతూ ఉంటానురా, నంద కిషోరా ,!""
""తాతా !ఇది చెప్పు !!ఉదయం లేస్తూనే నేను నీకు  జ్ఞాపకం వస్తుంటానా ??"
""కృష్ణా !లేస్తూనే ,కళ్ళు తెరిచి నీ చిత్రాన్నే చూస్తూ ,నీ నామం జపిస్తూ నే  మొక్కుతూ  లేస్తాను ,కానీ అది కూడా నీవు జ్ఞాపకం వస్తేనే  సుమా !""
""పది నిముషాలు నా స్వరూప దర్శనం కోసం, ధ్యానం  చేస్తున్నావా?"స్నానం చేస్తూ ,మాట్లాడుతూ ,తీరిక సమయాల్లో , పూజ,జపం, చిత్త శుద్ధితో నా ధ్యాస నీకు ఉంటుందా ,,నిజం చెప్పు !?"
""ప్రభో ! కృష్ణా !;ఇన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే,!,నీవు మా ఆనందం కోసం అనుగ్రహించిన  ఈ సంసార సాగరంలో మునుగుతూ ,,తేలుతూ ,నిన్ను మరిచిపోతున్నాం పరమేశ్వరా !! అహంకార మమకారాలు అనే ఇనుప గొలుసులతో కృత్రిమ అనందం అనే ముసుగులో ,,అజ్ఞానంతో , మాకు మేమే బందీల మై  , నీ గురించిన ధ్యాస లేకుండా ,నిన్నువిడచి  మరచి,  బ్రతుకుతున్నా ము రా నల్లనయ్య !""
""అదిగో ,చూశావా ??నీవు కూడా నన్ను ""నల్లనయ్య"" పిలుస్తున్నావు , కదా!పిలవకుండా  వస్తె , అంత చులక నయ్యానా తాతా ?""
""కృష్ణా!   నిర్గుణ నిరాకార సచ్చిదానంద స్వరూపుడైన నీకు  , మా వలె రంగులు ,గుణాలు ఉంటాయా రుక్మిణీ మనో నాయకా, ? నీ
ఈ నలుపుదనం ఒక మాయా జాలం,అని మాకు తెలుసు లే!, ఆ భ్రమ తొలగించి, నీ సహజమైన  ""సత్యం జ్ఞానం అనంతమైన ""నీ బ్రహ్మ స్వరూప సందర్శన భాగ్యాన్ని అందుకోవాలంటే , దేవకీ నందనా ,రాధా రమణా !,,నీ కృప లేకుండా సాధ్యం కాదు కదా?? మాధవా! ,ముకుందా ,! అచ్యు త ,!""
""మరి నా లో ఏమి చూస్తూ నాపై అంత ఇష్టాన్ని,, ప్రేమను పెంచు కుంటు ఉన్నావు తాతా?""
""కృష్ణా జనార్దనా !!" రాధా రమణా !!ఎల్లప్పుడూ ఇలా  నిరతిశయ అనందంతో, శాంతాకారం తో, జ్ఞానజ్యోతిని వలె  ప్రకాశిస్తున్న నీ రమణీయ కమనీయ ముగ్ద మోహన సురుచిర సుందర సౌందర్య లావణ్య వైభవ కాంతులను విరజిమ్ముతూ ఉండే దివ్యమైన పరమానంద కరమైన సుందర మనోహర స్వరూపాన్ని  జగన్మోహన ఆకారాన్ని  ,అంతరంగంలో దర్శిస్తూ పరవశిస్తూ ,తన్మయం పొందుతూ ఉంటానురా ,పురుషోత్తమా , పురాణ పురుషా , భక్తవత్సల !; గోవిందా !, మోక్షదాయకం ,,సకలపాప ప్రశమనం, భుక్తి ముక్తి దాయకం, ,అయిన నీ చరణార వింద ద్యానామృత పానంతో నా జన్మ ధన్యం చెయ్యి! నంద గోపాలా ! ఆ ఆనందానుభూతి తో  తరించెలా  నన్ను అనుగ్రహించు నంద నందనా! ,నవనీత హృదయా ,!""
""అబ్బో !చాలు చాలు! నీ పొగడ్తలు ! తాతా! ,,దొరికితే విడిచిపెట్ట వు కదా !ఇలా ఏదో ఏదో స్తోత్ర పాఠం చెబుతూ ,నన్ను మాట్లాడని వ్వవు కదా !!""
""కృష్ణా! క్షమించరా కన్నా!! నిన్ను చూసిన అనందం లో నేను ఏం మాట్లాడు తున్నా నో  నాకే తెలియ డం లేదు!, అయినా నన్ను ఇలా పలికించి ,భారంగా , ఉన్న ఈ బాధితహృదయాన్ని తేలిక పరచింది నీవే కదా !!,నీవు లేని నేను,,లేనే లేను రా నాన్నా! నీవే నా అస్తిత్వం ! తల్లివి తండ్రివి , దైవాని వి, నీవే ! గతి, శృతి, దృతి, మతీ, శ్వాస,ధ్యాస, నా జీవన సర్వస్వం నీవే శ్యామసుందర ! , గిరిధారీ, మురళీ ధారి,, కృష్ణా,, కాళీయమర్దనా,, !!
నిన్ను ఒక్కటి అడగాలని ఉందిరా గోపీ మనోహర ?!""
"" నీకు నేను ఏం తక్కువ చేశానని , అడుగుతున్నావు చెప్పు?? నీకు నేను బాకీ ఉన్నానా ?? నీవు నాకు బాకీ ఉన్నావా ??
కృష్ణా ;, నీవు దాతవు ! ఙ్ఞానివి ! సర్వజ్ఞుడ వు నీవే ! మా అవసరానికి మించిన వసతులు భాగ్యం బలగం  అన్నీ కోరకుండానే నీ ప్రసాదంగా  ఇచ్చావు ,, కరుణా లోల! కారుణ్య మూర్తి ! అవి కావాలని కాదు !! నీ సాన్నిధ్యం లో నీ సన్నిధిలో ఉండాలని నా కోరిక !
నీవు ఎటు వెడితే నన్ను అటు తీసుకెళ్ళు  అంతే !!"కృష్ణా !!""
""తాతా !ఆ మాట  నీతో నేను అనాలి ,!నీవు కాదు!! అయినా  ,నేను ఎటో వెళ్ళడం ఏమిటి ,??అంతటా ఉంటాను అని నీవే అందరికీ చెబుతూ ఉంటావు కదా !""
""సరే  కృష్ణా !నీవు చెప్పినట్టే సదా నిన్ను స్మరిస్తూ ,అనుక్షణం గడిపే ప్రయత్నం చేస్తాను! ,కానీ అలాంటి భావ సంపద నీవే అనుగ్రహించా లి కదా!!నిరంతరం నిన్ను మరచిపోకుండా , ,నీవే నాతో నీ గురించిన ధ్యానం చేయిస్తూ ఉండాలి సుమా !;""
""ఓహో ;! ఏమి చాతుర్యం తాతా ! అనుభవ జ్ఞానం బాగానే అబ్బింది ! కానీ ,ఫలితం నీదీ ,,ప్రయాస నాదా ?""ఇదెక్కడి న్యాయం ?!
కృష్ణా నీకు తెలియని న్యాయం ధర్మం ఉంటుందా ?? వాసుదేవా ,,నాతో అందమైన వర్ణ చిత్రాలు వేయిస్తూ ఉన్నావు గదా ,! ఇలానే మీ రాధా కృష్ణుల రమ్యమైన చిత్రాలు వేస్తూ తరించే మహా భాగ్యాన్ని ప్రసాదించు నారాయణా !"",
""తాతా! ఇది  నీమొదటి కోరిక!;
కృష్ణా !! యదు కుల భూషణ !; శ్రావ్యంగా పాడుకునే కంఠం ఇచ్చావు, జీవితాంతం  సుమధురంగా , గానం చేయిస్తూ  పాటలు పద్యాలూ పాడిస్తు ఉన్నావు ,  నాతో ఇలానే జీవితాంతం  పాడిస్తూ ఉండాలి ,,అది కూడా కృష్ణా నీ కీర్తనలు మాత్రమే సుమా!!"
""రెండవ కోరిక  తాతా ,ఇది !""
  ""దేవకీ పుత్రా ! గురువాయూర్ కృష్ణా !;, నీ పవిత్ర దివ్య ధామం లో నాకు  రెండు వేణువు లు అనుగ్రహించావు ,వానిని అద్భుతంగా మృోయిం చే ప్రతిభను కూడా కరుణించా వు కదా మురళీధర !!, ఆ వేణుగానం నిరంతరం ఆహ్లాదంగా  మధుర మనోహరంగా , ఉండాలి !!,అది కూడా నీ వేణు గానాన్ని తలపిస్తూ ఉండాలిరా ,,వంశీ ధరా !""
""తాతా నీ మూడవ కోరిక ఇది .!""
""కృష్ణా !నీ గురించిన లీలలు మధురాతి మధురంగా నాతో ఎన్నో రాయించావు కదా ,!,అదే సంపదను మహా భాగ్యం గా భావిస్తూ ఆనందిస్తూ, నీ గురించిన అనం దామృత భావ తరంగాలతో హాయిగా సంతోషంగా గడిపే మధురం అనుభవాలను  జన్మ సాఫల్యం అయ్యేలా ఇలానే కొనసాగిస్తూ ఉండు స్వామీ!!""
""నాలుగో కోరిక కూడా  ఉందా  తాత గారూ ??""
""ఉంది కృష్ణా ! ఆదరించి అనుగ్రహించే సర్వాంతర్యామి వి ! దిక్కు నీవే దశ దిశ నీవే కదా కేశవా!; నీ  , భక్తజన బృందం లో ,భజన సంగం లో,పురాణ శ్రవణం లాంటి సత్సంగం లో నాలుగు మంచి మాటలు పాటలు,భజన చేస్తూ  వారి ముందు  పలికే మహ దవ కాశాన్ని కూడా కరునించాలి దేవదేవా !!""
""అయినవా ,,ఇంకా ఉన్నాయా!
కృష్ణా ఇదంతా నిన్ను చేరే తాపత్రయం ఆవేదన ఆరాటం ఆతృత !; ,నిన్ను భజించే,స్మరించి ,భావించి ,సేవించి పూజించే  అపురూపమైన దివ్యమైన భావ సంపదను స్ఫూర్తిని సంకల్పాన్ని అవకాశాన్ని  మాకు ,ప్రసాదించు గోపికా మనోహర !;""
""అబ్బో ఎన్ని కోరిక లో కదా , ఈ మానవులకు?? ,,తీర్చే వాడు ఉండాలి గానీ, అంతు లేదు కదా మీ ఆశలకు.!!""
""నిజమే బాల ముకుందా !!,,చిన్ని కృష్ణా !, నీ గురించిన ధ్యాస భాష ,ఎంత కోరుకున్నా తక్కువే కదా !,, అయినా నీరజాక్ష ,!నీల మేఘ శ్యామ సుందరా,!ఎన్ని ఉన్నా ,,నీవు మాకు ఎన్ని ఇచ్చినా , మా అనుభవానికి తెచ్చు కునేది అందులో ఎంత ,,అన్నది మా ప్రాప్తం మా భాగ్యం !""
చేసుకున్నంత మహాదేవ అని ఊరకే అన్నారా కన్నయ్యా ??""
"" ఈ ఒక్క మాట మాత్రం చక్కగా చెప్పావు తాతా ! కానీ చెప్పడం వేరు,చెప్పింది చేయడం వేరు;సరే! నీతో walking చేస్తూ నీకు తృప్తి కలిగించాను కదా, నా కోసం ఎందరో నీ వలె, ఎదురుచూస్తూ ఉంటారు కదా!; నేను ఇక వెళ్లి రానా ??""  పాటల తాత! బొమ్మల తాత!రచనల తాత! ఫ్లూట్ తాత! ఈ వయసులో ఇంత బిజీ గా ఎలా ఉంటున్నావ్ తాతా ?.
అంతా నీ దయ , నీ కరుణ, నీ వాత్సల్యం , కృష్ణయ్యా! కన్నా ! నీ ఈ దివ్య సందర్శన భాగ్యాన్ని మరచిపోకుండా , హృదయంలో పదిలంగా భద్రపరచి చివరి శ్వాస వరకూ, నీ భువన మోహన రూప లావణ్యాన్ని , వేణు నాదం ను  అనుభవం లోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ నీ సన్నిధానం లో ఉండే లా కరుణించు తండ్రీ !""
అయినా ,నా హృదయం లో ఇంత భద్రంగా చెదరని ముద్ర వేసి,నీవు  ఎక్కడికి పోగలవురా నంద  గోపాలా  ?!,
""తాతా! ఇలా ఇంత గా నాపై అనురాగం చూపుతూ, నన్ను ఆరాధిస్తూ ఉండే నీ లాంటి భావుకులను విడిచి నేను మాత్రం  క్షణమైనా  దూరం ఉండగలనా, చెప్పు తాతయ్యా !?""
""చాలు కృష్ణా ! ఈ ఒక్క మాట ! చాలు పరందామా! పరా త్ప రా ! పరమేశ్వరా  ! చాలు ,!
ఇంతకన్నా మహా భాగ్యము  ఉండదు గాక ఉండదు! కదా ;!""
""తాతా ,నా పై ఎవరు  ఎంత విశ్వాసం కలిగి ఉంటారో  అంత ఫలితం వారికి అందిస్తూ  ఇస్తూ ఉంటాను ,ఇది నా ప్రతిజ్ఞ!అని నీకు తెలుసు కదా ;!"" ""తెలుసు కృష్ణా ! శ్రీకృష్ణ భగవానుడు గా గీతాచార్యుడు గా అవతరించింది భగవద్గీత ను మానవ జీవన కళ్యాణానికి అందిస్తు,, ఆ పరమ సత్యాన్ని. మాకు  చెప్పడానికి  నీవు ఎంతో శ్రమించావు కదా  విజయ సారథి నామ ధేయా, శ్రీకృష్ణా!!"
"గీతను అధ్యయనం చేస్తూ , నీ గీతను మార్చుకో తాతా! సరేనా ; ;ఇక నేను వెళ్లి వస్తాను! 
""ధన్యుడను  శ్రీకృష్ణా !నీకు జేజేలు !""
హరే కృష్ణ హరే కృష్ణా,,
కృష్ణ కృష్ణా హరే హరే!
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే!
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు !.
స్వస్తి !""

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...