Tuesday, April 28, 2020

నేను ఎవడను? 2

Apr 28, 2020
"నేను ""అనేది ప్రాణి లో ఉంటున్న ఆత్మ యొక్క  ఒక  అద్భుతమైన శక్తి ,!
దీని  అసలు స్వరూపం,ప్రభావం ,మన  ఇంద్రియాలు , లేదా మనసు ద్వారా ప్రకటిత మౌతూ ఉంటుంది ,!"
"" ఒక వస్తువు పై  ""మనసు పడటం"" అంటే ఈ ఇంద్రియాల ద్వారా తనకు కావాల్సిన పనులు చేయించడం ,ఇష్టమైన పదార్థాలను గ్రహించడం , ఇష్టం లేని వారిని ,లేదా వాటిని ద్వేషిస్తూ ఉండడం ,ఇలా లేచింది. మొదలు పడుకునే వరకూ  మనం చేసే ఆలోచనలు ,పనులు  ఇవన్నీ ఈ మనసు " ,నేను"" అనే భావం తో చేస్తు ఉంటుంది !
"మనసు లెని మనిషి ఉండడు !"
"మనసు లెని  మనిషి___ ,మనిషి  అనిపించుకో డు !
పిచ్చివా డి కి  కూడా ఒక మనసు ఉంటుంది,
కానీ అది వాడి నియంత్రణలో ఉండదు ,
అంటే చెప్పినట్టు వినదు !
ఇలా మనసు చెప్పినట్టు మాత్రమే వినేవాడు ,లేదా చేసేవాడు నిజంగా పిచ్చి వాడే అవుతాడు !
""నా ఇష్టం !" నువ్వెవరు  అడగడానికి !??""అంటూ ఒక ఉన్మాదం అనే మదం తో పశువులా ప్రవర్తిస్తూ,తప్పు ఒప్పు తెలుసుకునే ఆత్మవీచారణ  శక్తి కోల్పోతూ ఉంటాడు! ఇలాంటివా రి మనసు  ,వారి చేతుల్లో ఉండదు !
బొమ్మ వలె మనసు ఆడిస్తున్న ట్టుగా ఆడుతూ పోతారు !,,
ఇక్కడే ,భాగవత శ్రవణ ప్రాముఖ్యత ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది !
తన మనసే తనకు శత్రువు ,మిత్రువు కూడా !  
అని గీతాచార్యుడు బోధించిన విషయం మనకు తెలుసు కదా !"" ఒక. ఉదాహరణ చూద్దాం !
,""__కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము అనబడే శత్రువులు నీలో పొంచి ఉండి నిన్ను కాటు వేయాలని చూస్తూ ఉన్నారు!!
, ఈ విషయం నీవు గమనించడం లేదు !
""ముందు వాటిని జయించు తండ్రి !""
అంటూ ప్రణమిల్లుతూ వినయ విధేయతలతో,, భక్త  ప్రహ్లాదుడు తన తండ్రి   ,హిరణ్యకశిపుని కి హితబోధ చేస్తాడు ,!!
,""అంతటా ఉన్న ఆ  శ్రీహ రి కోసం వెదుకుతూ , శత్రుత్వం,క్రోధం పెంచుకుంటూ ఉన్నావు
అసలు శత్రువు  నీ హృదయంలో నే ఉన్నాడు !,
""వాడు  అంటే శ్రీహరి  కనిపించాలి అంటే,,,
,ముందు వీడు అంటే అహం  కనిపించకుండా పోవాలి !"", తండ్రి !   అని"""
వేడుకుంటూ అంటాడు
అందుచేత ,,
""నేను ""అనే భావం  ,మనసు జాగృతం అవుతున్నం తసేపు   ""అహం""మేల్కొని ఉంటుంది  !""
మన  నిద్రావస్థలో  ఉన్నపుడు ,,మనసు  తిరిగి తన యధా స్థానం అంటే జన్మస్థానం లోకి చేరి పోతుంది !
""ఎక్కడ పుట్టిందో అక్కడే సమసిపోతుంది !!"మనసైనా ,!మనిషైనా ,! ఏదైనా ,!
నిద్రించే మనిషిలో మనసు ఉండదు ! ""నేను  ,నాది ,నీ ది""అనే అహం ఉండదు !!"
__ఇక ,ఈ మనసుకు ఉపకరించే  ఉపకరణాలు , కాళ్ళూ చేతులూ అన్నీ  అలసటతో విశ్రాంతి అవస్థలో   పూర్తిగా సేద దీరుతూ ఉంటాయి !;,
నిద్రిస్తున్న మనిషిలో  కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది !
ఇది కూడా పరమాత్ముని అనుగ్రహం ఉంటేనే !!""
అనగా "శరీరం"" అనే బండి,,నిద్రలో ,అంటే రిపేర్ షాప్ లో చక్కగా ఉచితంగా   రిపేర్ చేయబడుతూ ఉంది !
  ""రిపేర్ పని ""అయ్యేవరకు  ,,అంటే శరీరం  అలసట ,రుగ్మత లు తొలగి ,తిరిగి మంచి కండిషన్ లో చేతికి వచ్చే వరకూ,, హాయిగా  పడుకుంటాడు జీవుడు అంటే   ఈ మనసు ,!!
అదృష్టం బాగుంటే ,బ్రతికి బట్టకట్టే భాగ్యం ఉంటే ,,ఆయువు ఉంటే ,తెల్లారి లేస్తాడు ,!
లేదా  వాడికిక్ ఇదే ఆఖరు దినం అవుతుంది ,!"
అనగా ప్రతి ఒక్కొక్క రోజూ ఉదయం లేవడం అంటే , జీవుడి ఆయువు ఆ ఒక్క రోజూ పెరిగినట్టు ,!అన్నమాట !
అందుకే , ఈ ఆనందాన్ని అనుగ్రహించిన సూర్యనారాయణ స్వామికి కృతజ్ఞత తో నిత్యం నమస్కరిస్తూ ఉండాలి !!
ఈ   శరీరాన్ని ఇంత ఉత్సాహంగా  హుషారుగా ఉండేలా , లోపల ఉన్న అస్తవ్యస్త వ్యవహారాలను చక్కబెట్టే పని చేసింది  ఎవరూ?""
అంటే ,,! ఆ పరంధాముడే !!
మనలో ఉంటూ ,మన చర్యల్ని , ప్రాణ వ్యవస్థను ఉన్ కనిపెడుతూ ఉన్న ఆ అంతర్యామి చలవ యే, శ్రీరామరక్ష గా  ఉంటూ,,,చేయాల్సిన కర్మలు పూర్తి చేసేవరకూ , మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు  ఆ పరాత్పరు డు  !""
""మనసు"" అంటేనే ""ప్రాణం ,"
""ప్రాణం లేని శవానికి మనసు ఉండదు ,"!"
""ప్రాణం పోవడం"" అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ  మనసు ,,తాను ఆశ్రయించి ఉన్న  జీవుడిని ,, దేహి శరీరంలో నుండి  వాయువు రూపంలో  బయటకు  తీసుకెళ్లడం  ,!!""
ఇదే మరణం !
""మనసు ,ప్రాణం జీవుడు"" ఇవన్నీ  ఒకటే !
స్వరూపాలు వేరు ! పని చేసే తీరు వేరు ! అంతే !!
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది,!
   (ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"

నే నెవడ ను -1

Apr 27, 2020
  ఈ ప్రశ్న చాలా క్లిష్టమైనది !,, జటిలమైన ది కూడా!!
దీనికి సూటిగా జవాబు చెప్పలేము ,,,!
కానీ ,ఎవరికి వారే ,  వేసుకోవాల్సిన  ప్రశ్న !!"
ఏ శాస్త్రం లోనూ , దొరకదు !;
ఏ వేదాంత పండితుల బోధన వలన కూడా లభించదు !!
ఇలాంటి ఆత్మవిచారాన్ని కలిగింపజేసే   ధర్మ సందేహాలను " పరి ప్రశ్న "లు  అంటారు
""భగవద్గీత "లో అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అ డిగినవి ఈ పరి ప్రశ్నలే !"
భగవద్గీత గ్రంధం  అర్థం అయితే,, "నేనె వడను"" అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది !!
ఇలాంటి  పరి ప్రశ్నలకు  సమాధానాలు  సద్గురువు మాత్రమే సూచించగలరు ,,
కానీ  సందేహాలకు పరిష్కారం సాధించి  తపించి  కనుగొన వలసింది శిష్యుడే ,!!"
నదీ ప్రవాహాన్ని దాటే విధానం సూచిస్తారు గురువు ,!!
  కానీ ,కష్ట పడుతూ  ఈదుతూ ,లేదా ఓడ సహాయం తోను దాట వలసింది శిష్యుడే !""
""నేను ఎవడను ?""అన్న ప్రశ్నకు సాధారణంగా , నా పేరు ఇది ,తండ్రి తల్లి ,వీరు ,ఇల్లు ఊరు ఫలానా ,అంటూ ఆధార్ కార్డు వివరాలు చెబుతూ ఉంటాం !!"
"*నాయనా ,! ఇది నీ శరీరానికి సంబంధించిన వివరాలు ,!
జననం అయ్యాక గుర్తింపు కోసం ఇవ్వబడ్డ   ఆధారాలు  అవి !""
,కానీ ,నాకు కావాల్సింది ఈ శరీరం లేనప్పుడు  ,నీవు ఎవరవు ??"
""అదేమిటి ? నా ,శరీరం నేను ఒకటే ,! అయినా ,నాకు శరీరం లేనిది ఎప్పుడు??
"" నీవు నిద్రపోతున్నపుడు , ఈ  శరీరం  నీది గా ఉంటుందా ,?! దాని రక్షణ భారం నీవు చూసుకో గలవా చెప్పు ?""
""లేదు !,నిద్ర లో తప్ప నేను ఈ శరీరం ఎప్పుడూ విడిగా ఉండవు !""
""అంటే నీవు , నీ శరీరం వేరే అని ఒప్పుకుంటున్నావా ?""
""అవును ,నిజమే! ,నేను వేరు , ఈ శరీరం వేరు !""
,,నీవు ఈ శరీరం కానప్పుడు  , ఎవరు నీవు ,??నిజం చెప్పు ?"
,,,,,
ఇక సమాధానాలు చెప్పలేం !""
,కంటికి కనబడే ప్రపంచం గురించి చెప్పవచ్చు కానీ , ఈ "నేను"" అనేది చూడబడేది కాదు ,!
అది ఉంటుంద ని ఒక ఆకారం ,ఒక స్వరూపం ,ఒక స్వభావం తో  సూచించడం వీలుగానీ  ఉండదు కదా !;
అసలు వేదాంతం మొదలయ్యేది ఈ ప్రశ్న నుండి మాత్రమే !
"నేను "అనేది లేకపోతే ఏమీ ఉండదు !
పిచ్చి వాడికి నేను నాది అనేది ఉండదు !!""
ఈ ప్రశ్న వేసుకునే వాడు , రమణ మహర్షి లాంటి జ్ఞాన యోగులు అవుతాడు !;  నేను  లేకుంటే , ఈ ప్రపంచం ,జగత్తు , సంసారం ,జనన మరణాలు  ,అసలు  సమస్య లే ఉండవు !""
కేవలం మౌనం! ,మౌనం! మౌనం !
,నేను  శరీరాన్ని కాదు ,!ఇంద్రియాలు కాదు ,!,తల్లి తండ్రి ,బందు సఖ భార్య భర్త పుత్రా దులు కాను ,!
చలి వేడి , చెట్టూ గుట్ట పుట్టా ,జలం నీరు వాయువు   భూమి ఆకాశం ఏదీ కాను ,,,!,
అంటూ"" ,నిర్వాణ షట్కం"" లో జగద్గురువులు ,శంకరాచార్యులు  చక్కగా  విశదీకరించారు ,!
""ఎవరు నీవు ?""
అంటే నేను  ,,నిరాకార  నిర్గుణ సచ్చిదానంద  స్వరూపుడ ను ,!"
నాకు జననం లేదు! మరణం లేదు! , నన్ను బాధించేది  సుఖింప జేసెది, ఈ జగతిలో ఏది లేదు !!
నాకు ఆకలి ,దప్పిక, ఆయాసము, జననం మరణం  ఏమీ ,లేవు ,!""
అంటూ ,చెప్పిన అనేక అంశాలను అధ్యయనం చేయాలి,!
""నేతి,"అంటే  "న ఇతి""
అది నేను కాదు !,ఇది నేను కాదు! , కంటికి ఆగుపించే ఏదీ కూడా నేను కాదు !"
అని అనడం సులభమే ,కానీ , అనుకోడం, అక్షరాలా ఆచరించడం , జీవితాన్ని ఆ సాధనతో పండించు కోవడం ,ఆధ్యాత్మిక అత్యున్నత స్థాయి కి చేరుకోవడం,  ,అరుణాచలం శ్రీ రమణ మహర్షి కి   మాత్రమే చెల్లింది కదా !
   ( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

మానవ కర్తవ్యం !

Apr 27, 2020
  ప్రస్తుతం కరోనా  గురించిన భయాందోళన ప్రపంచాన్ని వణికి స్తు ఉంది ,
ఎక్కడ విన్నా , ఏ ఛానెల్ చూసినా ఇదే భయం ,!!
మనిషి  ఎంత సుకుమారి అంటే ,,చలికీ  తట్టుకోలేడు !
అమ్మో చలి !"అంటాడు
ఎండకు ఓర్వ డు,!
వామ్మో ,ఎంత ఎండ ?""అంటాడు
కష్టాన్ని భరించలేడు ,!
ఎప్పుడూ సుఖం కోసమే ఆరాటపడతా డు !!
జీవితంలో సుఖాల కంటే ,కష్టాల అనుభవాలే , ప్రతీ వాడికి ,చక్కగా  గుర్తు ఉంటాయి ,!!
ఎందుకంటే ,,కష్టాల్లో అతడి లో ఉన్న ప్రజ్ఞ ,,తెలివి తేటలు బయట పడుతూ , సమర్య్యాన్ని తెలియజేస్తున్నాయి !""
ప్రతీ మాసంలో  కృష్ణ పక్షం ,తర్వాత శుక్ల పక్షం వస్తుంది !!
తరుగుతూ ఉన్న చంద్రుడు ,మరల కాంతిని పుంజుకుంటా డు ,!;
రాత్రి అంధకారం పోయాక వెలుతురు దానంతట అదే వస్తుంది !; మనిషికీ ,కష్టాలుగాని ,సుఖాలు గానీ ,ఎప్పుడూ ఉండవు  కదా !
వస్తుంటాయి ,పోతుంటాయి  కూడా !""
""మార్పు"" అనేది , కాలచక్రం ధర్మం ,!!
నీకు ఇష్టం ఉన్నా ,,లేకున్నా
నీవు జీవించి ఉన్నా,, లేకున్నా జగతి మార్పుకు లోనౌతూనే  ఉంటుంది !!
జననం తర్వాత మరణం తప్పదు !;
అలాగే మరణం తర్వాత జననం  కూడా తప్పదు !
అది గ్రహించే జ్ఞానం మనిషికి లేదు !!
సూర్యోదయం అయ్యింది అంటే,,,
సూర్యాస్తమయం అవుతుంది  అన్నమాటే !;
ఇలా మన చుట్టూ ,మన శరీరంలో  ,,సృష్టిలో ఎన్నో ఊహించని మార్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి,!!
అందుకే ఈ కరోనా  భయం కూడా  కేవలం తాత్కాలికం ,;""
ఏ మాత్రం భయపడే అవసరం లేదు !
మనలో దాగి ఉన్న ప్రతిభను తట్టి లేపు తూ ఉంది !!"
ఏదీ శాశ్వతం కాదు ,!!"
ఇప్పుడు మనం వాడుతున్న సెల్ ఫోన్  ఎక్కడో ,ఎప్పుడో ,ఎవ్వరో కనుగొన్నారు , !;
ఏళ్ల తరబడి  ఒక ఆత్మీయుడు గా దాన్ని  ఉపయోగిస్తూ ఆనందంగా ఉంటున్నాం , !;
అలాగే టీవీ ,కార్లు ,,కంప్యూటర్ ,రైళ్లు ,విమానాలు ,ఇలా ఎన్నో సాధనాలతో సంతోషంగా బిజీ గా ,డబ్బు ఆర్జిస్తూ ,సంపదలు సమకూర్చు కుంటూ ,కాలాన్ని మరిచిపోయాం !,,
అప్పుడు పగలు ప్రతీకారాలు ,శతృత్వాలు ,తగాదాలు , ఇలా మనలోని వికారాల తో చేయరాని తప్పులు చేశాం ! దానవుల వలె ప్రవర్తించా ము ,!""
ఇప్పుడు,మూడు నెలలు గా  కాలం  తాబేలు నడక నడుస్తూ  ఉంది ,
ఇది అలవాటు లేని పని కదా !
,,కరోనా అడ్డంకి తో ,ప్రగతి ఆగింది ,!
మన నడక ఆగింది! ఆలోచనలు పనులు ,సంపాదనకు ఆగిపోయాయి ,!
కారణం కష్టకాలం వచ్చింది !
తనవారు ,ఆత్మీయులు గుర్తుకు వస్తున్నారు !
ఫోన్ చేసే టైమ్, తృప్తిగా ,సంతోషంగా మాట్లాడే  వీలు దొరికింది !
అంటే ,మనలో ఉన్న మంచితనం వెల్లి విరుస్తూ ఉంది !
మానవత్వం విలువలు తెలుస్తూ ఉన్నాయి !
ఏ మాత్రం నిరాశ పడకుండా ,ఆశా బీజాలు  హృదయం అనే క్షేత్రం లో నాటాలి ,!!
""విపత్తు ""కాలంలో అక్కరకు వస్తాయి దాని ఫలాలు !
అపద ఉన్నపుడే మనిషి దైర్యంగా ఉండాలి ,!;
ధర్మంగా ఆలోచించాలి !
ఈ శరీరం పంచభూతాలతో నిర్మించ బడింది !!
కష్టాలు వచ్చినపుడు
అవి మనసును ఆధారం చేసుకొంటూ , మనసు లోని భయము ,బాధ ,. నిరాశ నిస్పృహ లకు గురి చేస్తూ ఉంటుంది ,;!
ప్రకృతి ఒక మాయా స్వరూపం ,!
ఈ మాయా జాలం మనసును పరీక్షకు గురిచేస్తూ , మనిషికి  తట్టుకునే ఆత్మస్థైర్యం ఏర్ప డే లా  చేస్తుంది ,!!,
కష్టం ,సుఖం  రెండు రూపాయి నాణెం కు ఉండే రెండు ముఖాలు !
చేసిన కర్మలను బట్టి బొమ్మా లేదా బొరుసు పడుతూ ఉంటుంది !
ఏది పడాలో  అది ఆ పై వాడు నిర్ణయిస్తాడు !
నీవు అనుకుంటే పడదు !!
ఇలాంటి దురవస్థల లోనే , మనిషి   తన మనోబలం ,స్థిరంగా ఉంచాలి !
కష్టాలు వచ్చినపుడు బాధ పడడం ప్రాణులకు సహజ ధర్మం!
,.అయితే  చేయాల్సిన పని చేస్తూ  ,,తన యందు గల ,బాధ్యత ను ,,ధర్మంగా ,,న్యాయంగా ,పెద్దలు సూచించిన ప్రకారం  నెరవేరుస్తూ ఉండాలి!
ఇదే ప్రతీ మనిషి ప్రధాన కర్తవ్యం ,!!"
ఎంత కష్టం వచ్చినా , నీతి నిజాయితీ  మరవకూడదు;;
,అబద్దం చెప్పకూడదు ,,;!
సోమరి గా ఉండకూడదు !
చాలా జాగ్రత్తగా పరిస్తితుల ను గమనిస్తూ ,తగిన విధంగా ఆచరిస్తూ ఉండాలి !!
తాను ఉపవాసం ఉంటూ కూడా ,ప్రక్కవాడి ఆకలి తీర్చే విధంగా సేవ చేస్తూ ఉండాలి ,,!;
అన్నం దొరక్క ఆకలి కేకలు పెడుతున్న వారు ఇలాంటి ఘోర విపత్తులో ఉన్నారు !
ఇప్పుడు వచ్చిన కరోనా కష్టాలు కూడా ,మన కున్న మనోబలాన్ని గుర్తు చేసేవే ,!!""
,,కష్టాలు చెట్లకు రావు ,కదా ;
మనసున్న
మనుషులకు మాత్రమే వస్తాయి ,!!""
ఇది మన కర్మ ఫలం అని కొందరు  అంటే  మరి,కొంత మంది నాస్తికులు  ,కాదని  ఆక్షేపిస్తూ ఉంటారు ,!;
పాపం లేదు పుణ్యం లేదు అనీ ,,
కరోనా ను పుట్టించిన వాడిని చంపేయాలని !!
ఎక్కడో తయారయ్యే ఫోన్ లను ఎగిరి గంతేసి లక్షలు పెట్టీ కొంటావు కదా !
మరి ఎక్కడో తయారైన ఈ కరోనా ను ఎందుకు ఆనందంగా స్వీకరించడం లేదు !
తప్పు వస్తువు ఇచ్చేవాడి దా ?
లేక పుచ్చు కొనే వాడి దా !
అనుకూలంగా ఉంటే సంతోషం
ప్రతికూలంగా ఉంటే దుఖం ,కోపం ,  పగ ,ద్వేషం
ఇదేనా మానవత్వం !
చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా !
అంటే ఇతరుల తప్పులు నీవు లెక్కపెడి తే,మరి నీ తప్పులు కూడా సరి చేసేవాడు ఒకడు ఉన్నాడని నీకు మాత్రం తెలీకుండా ఉంటుందా ??""
ఇప్పుడు వచ్చి పడ్డ విపత్తు ఒక నగరం  కాదు ,!
దేశం ,కాదు ,!
ప్రపంచం  మొత్తం మారు మూల అనకుండా పిడుగులా  ,,ఇంతమంది మీద  ఒకేసారి  పడింది !!
ఒకేసారి ఇంతమంది తమ పాప భారాన్ని కర్మ ఫలితాన్ని మోస్తూ ఉన్నారా ?""
అంటే
""అవును ,"అనాలి !
ఎందుకంటే,,
తప్పులు మనిషే చేస్తాడు !
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా !
ఈ తప్పులు వాటి లెక్కలు ఆ పైవాడు లెక్క పెడుతూ ఉంటాడు ,!!
ఆ అకౌంట్స్ అన్నీ క్లియర్ అయ్యాక గానీ ,,
ఈ కరోనా విపత్తు నుండి బయట పడే అవకాశం మనకు  లేదు !;
అందుకు మనం చేయాల్సింది , దేవుడి ముందు తల వంచి ,చేసిన  మన తప్పును  ఒప్పుకోడమే ,ఒక మనిషిగా  మన ముందున్న  ప్రథమ కర్తవ్యం !!
నేరస్తుడు స్వయంగా ,స్వచ్చందంగా చేసిన నేరాన్ని అంగీకరిస్తే  శిక్ష  కాస్తా తగ్గే అవకాశం ఉంటుంది ,!!
"""నేను ఏ తప్పూ చేయలేదు !""అని,
మెడ మీద తల ఉన్న ఏ మనిషి అన లేడు,కదా !
తప్పు చేయనివాడు దేవుడు  ఒక్కడే !;
తప్పు చేసేవా డే  మనిషి !
"" నేను తప్పు చెయ్యలేదు !
చేసినా నేను ఒప్పుకోను !
అని మూర్ఖంగా ఎవరైనా అంటే ,,,
అసలు ""వాడు మనిషి కింద లెక్కకు రాడు!""
భూమిపై జన్మ వచ్చిందంటే అర్థం ,తప్పులు చేసినట్టే లెక్క !
వాని ఫలితాన్ని అనుభవించ డానికే  జన్మ ఎత్తింది ! అని అర్థం !!""
""ఓ భగవంతుడా ,! నేరక చేసిన
మా అపరాధాలు మన్నించు,,ప్రభో !;
మమ్మల్ని క్షమించు తండ్రి !
ఈ కరోనా ను అరికట్టే శక్తి యుక్తులను అనుగ్రహించు !" దేవాది దేవా!"" శరణు !""
అంటూ  మనం చేసిన అపరాదాలను ఒప్పుకుంటూ  ,,,మీద వచ్చి పడ్డ కష్టాలను తొలగించమని, ఆ సర్వాంత ర్యామిని , ఆ శరణాగత వత్సలుని ,,పరమాత్మ ను ఆర్తితో ,ఆర్ద్రత తో ,  వేడుకుందాం !"
ఆపదమొక్కుల వాడా ,,అనాథ రక్ష కా !"
వెంకటరమణ ,,సంకట హరణ ,గోవిందా ,;!""
శరణు ,శరణు,,శరణు !"
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

త్యాగం అంటే ?"

Apr 26, 2020
హే రామచంద్రా !" అయోధ్యా నగర ప్రజలకు కావాల్సింది ,తమకు ఆదర్శంగా నిలి చే రాజు !
అతడి కష్ట ఇష్టాలతో వారికి పని లేదు !
మచ్చ లేకుండా ఉండాలి !
ఆ రాజు ఎంతటి వీరుడు ,శూరుడు ,పరాక్రమ శాలి ,శరణాగత వత్సలుడు ,, కరుణా సముద్రుడు ,,దర్మావతారుడు ,,మర్యాద పురుషోత్తముడు , ఆడిన మాట తప్పని వాడు ,పితృ వాక్య పరిపాలకుడు ,
ఇవన్నీ వారికి అవసరం లేదు
వారికి కావాల్సింది ,వారికి ఇష్టంగా ఉండే వ్యక్తి ,వారు మెచ్చిన వ్యక్తి !వారు చెప్పినట్టు గా నడుచుకునే వ్యక్తి ,రాజుగా ఉండేందుకు అర్హుడు !
వనవాస కాలంలో నీవు వద్దని అన్నా కూడా నేను నిన్ను అనుసరిస్తూ వచ్చాను
కానీ ,ఇప్పుడు ,నేనే నిన్ను నా వెంట రావొద్దు అంటున్నాను
ఎందుకంటే, రాముడు భార్యా లోలుడు ,
అందుకే ,చెరగని మచ్చ తో ఉన్న సీతను అడవిలో వదలి రాకుండా వెంట తెచ్చాడు
తగుదునమ్మా అంటూ  తనతో బాటు ,రఘువంశ సింహాసనం పై కూర్చో బెట్టాడు  ,అంటున్నారు
ఇక ఇప్పుడు ,నీవు నాతో బాటు  , అయోధ్య విడిచి వస్తె ,,
రాముడు ఎంత కాముకుడు అంటారు
ఈ నిందను నేను భరించలేను రాఘవా !;"
భార్యా భర్తల మధ్య ఉండాల్సింది అవగాహన
నేను అడవిలో ఉన్నా ,నీవు రాజ మందిరం లో ఉన్నా , తేడా రాదు
నాలో నీవు ,,నీలో నేను ,శాశ్వతంగా ఉంటాము ,
నీవు సంతోషంగా ఉంటే చాలు ,,నేను ఎక్కడ ఉంటున్నా ,ఎంత కష్ట పడుతున్నా ,నేను కూడా సంతోషంగా ఉంటాను
మన సంతానం  యొక్క భవిష్యత్తు  ఆరోగ్యంగా సంతోషంగా ,వీరత్వం ఉండేలా చూడాలంటే ,
హే , కరుణా సిం దొ, ___నేను నీ సమక్షంలో లేకున్నా   ,సంతోషంగా ఉండాలి
చింత తో బాధ పడేరాజు ,తనని నమ్ముకున్న ప్రజలకి సుఖ సంతోషాలు ఇవ్వగల డా ??
ఇవ్వలేడు కదా !
నీవు ఆత్మలో అనుభవించే వేదనా తరంగాలు ,నన్ను బాధిస్తూ,నా కర్తవ్య నిష్టను భగ్నం చేస్తాయి,
నేను చేస్తున్న త్యాగం సార్ధకం కావాలంటే ,రఘువరా ,నీ సంపూర్ణ సహకారం నాకు కావాలి
నా యందు నీకు గల ప్రేమను ,జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూ ,,పై కి రానీయకుండా ,జాగ్రత పడుతూ , నిన్ను నమ్ముకున్న అయోధ్యా వాసులకు చక్కని పరిపాలన అందించు !!""
"త్యాగం"" అంటే  
బలి దానం !
"__ జరగబోయే  యజ్ఞం లాంటి ఉత్తమ కార్యం లో , తాను బలిగా మారుతూ ,తనను తానే ఎదుటివారికి దానంగా సమర్పించు కోవడం ,!!"
ఇన్నాళ్లు తనదై ఉన్న వస్తువును లేదా మనుషులను శాశ్వతంగా  ఇతరుల కోసం విడిచి పెట్టడం ,!"
"రాఘవా !
అయోధ్యా ప్రజలు నా శీలాన్ని శంకిస్తూ ఉన్నారు , పది నెలలు రావణుడి చెరలో బందీగా ఉన్న నన్ను ,ఇపుడు అయోధ్యా నగర పట్టపు రాణిగా అంగీకరించడం లేదు ,
ఎందుకంటే ,ధర్మాన్ని పాటించే రాజు అధర్మాన్ని ఆచరించడం వల్ల ,సామాన్య ప్రజలు కూడా ,అదే అధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారని  అయోధ్యా ప్రజల అభియోగం
హే రామభ ద్రా ,
రాజ్యాభిషేకం రోజున ,ప్రజల కోసం సన్యాసి ధర్మాన్ని అవలంబిస్తూ ,ప్రజా సంక్షేమం కోసం నీ సర్వస్వాన్ని  అవసరం అయితే భార్యను కూడా త్యాగం చేస్తానని ప్రతిజ్ఞ చేశావు కదా
హే నాథా !
నేను నీకు  సహదర్మ చారిని మాత్రమే   కాకుండా  నీకు మిత్రురాలిని కూడా
నీకు  ,నావల్ల కలుగుతున్న అపవాదు రాకుండా ,రఘువంశ కీర్తి ప్రతిష్టలకు మచ్చ రాకుండా ,నీవు రాజుగా చేసిన ప్రతిజ్ఞ  నిలబడేలా ,చూసే బాధ్యత నాపై పడింది,!
అయోధ్యా సింహాసనం పై మహారాణి గా నేను కూర్చోవడం వలన అది అపవిత్రం అవుతోంది!! అంటే , ,నాకు ఈ అయోధ్యా నగర వాసులపై  ఉన్న ప్రేమ  తగ్గుతోంది ,రామచంద్రా !""
ఏ ప్రజలకోసం రాజారాముడు దీక్షా కంకణం ధరించి ,,""నభూతో__ న భవిష్యత్ ""!
అనే విధంగా ,ప్రజా రంజంగా పాలన చేయాలని  సంకల్పించా డో , ఆ ప్రజలకు ,నేను వెళ్ళిపోయాక  ,నిజం తెలుస్తుంది ,, పశ్చాత్తాప పడుతా రు  , మన త్యాగాన్ని గుర్తిస్తారు ,!
,,___ఏదో ఒక రోజున ఈ అయోధ్యానగర వాసులకు  తమ తప్పు తెలిసి రాక పోదు !
జరిగిన తప్పిదానికి వారు నిన్ను క్షమాపణ చెప్పక పోరు !""
ఆ ప్రజలు నన్ను హేయంగ ,నీచంగా ,పతిత గా చూస్తుంటే , ,నాకు నా మీదనే అసహ్యం కలుగుతోంది !
ఏం చేయను ?
హే రామా ,! ఇపుడు ,
నీవూ నేనూ , విధి చేతిలో కీలు బొమ్మలుగా మారాం !
ఈ కాలానికి
మన ఇష్ట అయిష్టాలతో   పని లేదు !
నాకైతే  ఇప్పుడే ,ఈ క్షణమే జీవితం చాలించాలని ఉంది !
కానీ , ఆ ఘోరం ,
చేయలేను !!""
నా గర్భంలో పెరుగుతున్న రఘువంశ వారసులను  కని,పెంచి ,విద్యాబుద్దులు చెప్పించి ,నీవు గర్వపడేలా గొప్ప వీరులు గా తీర్చిదిద్ది ,తిరిగి నీకు సమర్పించే వరకు నా బాధ్యత తీరదు కదా ,,,
హే ప్రాణ నాథా ,!!"
అంతవరకూ నేను జీవించి ఉండక తప్పదు !!""
నీ వద్ద నుండి   అయోధ్యా నగరం బయటకు వెళ్ళేది శరీరం మాత్రమే !
నా ఆత్మలో నీవే ,!
నాలో నీవే నిండి ,ఉన్నావు !
అంతా రామమయం గా కనిపిస్తూ ఉంటుంది !
శ్రీరామా !
ప్రానేశ్వరా !
,నిన్ను మరవని ,నీ దివ్యమంగళ స్వరూపాన్ని క్షణమైనా విడవని ,భావ సంపద ను సదా  నాకు అనుగ్రహించు !""
నా గురించి ,నీకు మాత్రమే తెలుసు ,!
నీ హృదయం నాకు తెలుసు !
స్వామీ,!
నీ మదిలో మెదిలే ప్రతి స్పందన ,నాకు వినిపిస్తూ ఉంటుంది ,;
విధి మనపై గురుతర బాధ్యత ను భారాన్ని మోపింది !
పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ ,ఉన్న నేను  ,  మనసా వాచా కర్మణా  ,, ఏ ఒక్క క్షణము కూడా ,ఏ   దోషము ఎంచని నన్ను ,,,నీవు లేశ మాత్రం శంకించడం లేదని నాకు తెలుసు !"
కన్నీళ్లు కాలువ లై పారుతున్న ,గుండెలు బ్రద్దలు అవుతున్నా , ఈ సీతా రాముల వియోగ విరహానాల జ్వాలలు  నన్ను నిన్ను దహించి వేస్తున్నా కూడా ,  గుండె దిటవు చేసుకోవాలి !
కన్నీళ్లు కళ్ళలో నే  దాచేయ్యాలి ,!
తప్పదు !
ఏ నాడు , ఏ భార్యా భర్తలను విడగొట్టి న పాపమో ,ఇపుడు మనల్ని ఇలా నిర్దయగా వెడిస్తు , దేహాలను కాలుస్తూ ఉంది!!"
ఈ సీత లేకుండా  ,,ఈ రాముడు జీవించలే డని ,నాకు  తెలుసు ! స్వామీ !
అలాగే నీవు లేని నేను కూడా  ఉండబోదు ,,రఘుకులా తిలకా !!"" !!
___ నీ పై గల రాజ్యభారాన్ని నీవు ఏ విధంగానూ తప్పించుకోలేవు !""
సూర్య వంశ రాజుల వలె నీవు కూడా వారి అడుగుజాడల్లో  చక్కగా  పాలిస్తూ,ప్రజల మెప్పును పొందవలసి ఉంది !;""
అలాగే ఇపుడు నాపై కూడా   మన సంతానాన్ని కని,, పెంచి, ఈ అయోద్యనగరానికి  సమర్థులైన వారసులు గా తయారు చేసి మీకు అందజేసే  బాధ్యతను కూడా , నేను  నిర్వహించాల్సి ఉంది
కౌసల్యా తనయా ,!""
హే  ,నాథా !" పాపం !"
నా కోసం ఎన్ని కష్టాలు పడ్డావు ,?!
ఎంత మంది రాక్షసులను సంహరించావు ,?? అయినా బెదరకుండా , పరిస్తితులకు లొంగకుండా
ధర్మాన్ని తూ చా తప్పకుండా   ఆచరించావు కదా !?
మనిషిగా పుట్టడం వలన ,జీవితంలో  ,,అడుగడుగునా ,ఎన్ని పరీక్షలో  ,ఎన్ని కష్టా లో  చూశావా ,ప్రభో !!""
,,నీవు చూపించిన అపారమైన ప్రేమానురాగాలకు ప్రత్యుపకారం గా  నీకు నేను సమర్పించుకు నేది నాది అంటూ ఏమీ లేదు  , స్వామీ !""
ప్రస్తుత సమస్యకు  పరిష్కారం ,నీవు నన్ను వదలుకోడం తప్ప మరో దారి లేదు !""
అయోధ్య లో ప్రజల  మధ్య  నన్ను నిలబెట్టి ,,నాకు అగ్నిపరీక్ష  నీవు చేయలేవు !
చేసి నా కూడా  ఫలితం ఉండబోదు !"""
ఎందుకంటే ,
"",అలాంటి ఘోర పరీక్షలు  దేవతా స్వరూ పులు,, మీరు  మాత్రమే చేయగలరు ,!
మేము , అతి సామాన్యులం ! , మేము మీ వలె అగ్నిప్రవేశం  చేయలేము కదా !"__
అంటూ  నిజం కప్పి పుచ్చి ,,తప్పించు కుంటారు  !!""
ఒక స్త్రీ,  పరాయి పురుషు ని ఇంటిలో  విధి లేక ,ఇష్టం లేకున్నా ఒక రాత్రి   తలదాచు కొన వలసి వ స్తే , 
ఆమెను  కులట ,పతిత , గా ముద్ర వేస్తారు !పెద్దలంతా కలిసి  తీర్మానించి సంఘం నుండి  ఆమెను  వెలివేస్తారు !"
,సమాజం నుండి బహిష్క రిస్తారు !
నిలువ నీడ లేకుండా చేస్తారు !.
సాక్ష్యాలు ,పశ్చాత్తాపం ,ప్రాయశ్చిత్తం ఇవేమీ పని చేయవు !
అందరూ ఉండికూడా ,అనాధగా ,మారి ,చివరకు ఆత్మహత్య  చేసుకుంటూ ,,ఘోరమైన పాపానికి ఒడిగట్ట వలసి వస్తుంది !
ఇదేనా మానవ జాతి సంస్కారం ,సంప్రదాయం ,ఆచారం ,కట్టుబాట్లు ఇవేనా ?
ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే అధికారాన్ని ఏ ధర్మం ,ఒప్పుకుంటుంది ??"
ఏ రాజూ  ,, ఏ న్యాయ స్థానం కూడా దీనికి  తీర్పు  చెప్పలేదు !!
ఇది యుగ యుగాలుగా ఆడదానికి " శాపం ""గా,
""పురుషాధిక్యత   సమాజానికి కళంకం ""గా  మారు తూ వస్తోంది !
"""నేను పవిత్రురాలిని !
,నాకేమీ తెలియదు!
నేను ఏ పాపం ఎరుగను !"
నా వల్ల  ఏ తప్పు జరగలేదు  ;"అంటూ ఎంత మంది పెద్దల ముందు మొత్తుకున్నా  ,,ఎన్ని సాక్ష్యాలు తెచ్చినా ,,కూడా లాభం ఉండదు !
ఏ దేవుడూ ఆమె దీన స్థితి పట్ల  కరుణించడు !!
భర్తా ,అత్తా ,మామ ,తల్లీ దండ్రి బంధువులు , తోబుట్టువులు ఆమెకు రక్షగా నిలబడే దైర్యం చెయ్యలేరు !!""
ఎందుకంటే , ఈ స్త్రీని చంపకుండా విడిచిపెడితే ,, రేపు వారి ఇంటిలో ఆడది కూడా , ఇలాగే   బరి తెగిస్తూ ఉంటుందని,,వారి  భయం !;""
అందుకే తమని కాదు అన్నట్టుగా   ఉంటారు !"
. ఇలా స్త్రీలు ,తాము చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే నా ?
స్త్రీలు ఈ  దుర్మార్గ వ్యవస్థకు ఎదురు నిలిచి ,,తిరగబడే రోజు వస్తుందా !
ఆమె అపరాధి కాదు,అని రుజువు అయ్యేవరకు  ,, ఈ కరుణ లేని ఈ పాపపు సమాజం ఆమెను సజీవంగా ఉంచు తుందా ?!"
,,అందుకే ,ఆమెకు రక్షణ గా ఎవరూ రారు !"
తమను కూడా సమాజం వేలెత్తి చూపిస్తూ , ఘోరంగా అవమానిస్తుందని  వారి భయం !""
అంతవరకూ ఉన్న తనవారు ,బంధువులు ,ఆత్మీయులు  అందరూ ఆమెను  అసహ్యించుకోవడం  మొదలెడతారు !!""
,చివరకు,, ఇన్నాళ్లు తనతో కలిసి  సంసారం చేసి ,పిల్లలను  కన్నాక ,భార్య మనస్తత్వం తెలిసిన మొగుడు కూడా ,ఆమెను  అనుమానిస్తూ ఉంటాడు !!
ఇప్పుడు  , ఈ విశాల ప్రపంచంలో ఆమె ఏకాకి !"
  దిక్కు లేని బ్రతుకు !
హే రామ భద్రా !"
అయోధ్యా కు దగ్గర్లో   ,గంగానది ప్రవాహ పరిసరాల్లో  ,,వాల్మీకి లాంటి మునిపుంగవులు నివసిస్తూ ఉన్న ఆశ్రమ  అరణ్య ప్రాంతం లో నన్ను చేర్పించి ,,నా ప్రార్థన ను మన్నించు ,
భర్త అనుమతి లేకుండా ఏ స్త్రీ తన నిర్ణయాన్ని అమలు చేయలేదు కదా !
స్వామీ ,నీవు ధర్మ మూర్తి వి!
నీకు తెలియని ధర్మం లేదు !
దయచేసి ,నా ఈ ధృఢ సంకల్పాన్ని  , నెరవేర్చే చిత్తశుద్ధిని ,మనో బలాన్ని ,,ఆత్మ స్థైర్యాన్ని కలిగేలా నన్ను దీవించండి
హే రామా !
భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు
నా హృదయపూర్వక ప్రణామాలు స్వీకరించండి స్వామీ,
నీ పాదపద్మముల పై నా చిత్రాన్ని అనవరతము నిలిపి ఉండే లా నన్ను అనుగ్రహించండి
ప్రభో
నాకు ఆశ్రమాలలో ముని పత్నుల సహవాసం తో ఉండాలని  నా కు కోరికగా ఉందని ,చెబుతూ
లక్ష్మణుడితో  తోడుగా నన్ను రథం లో  ,  ఇదే రోజు ,ఇదే రాత్రి  పంపించండి
హే రామా!
నా ప్రణమాలు స్వీకరించు
స్వామీ, నాకు అనుమతి నివ్వండి !
సెలవు "
శ్రీ రామచంద్ర పరబ్రహ్మ నే నమః !
శ్రీ  సీతారామచంద్ర  భగవాన్ కి జై !
జై శ్రీరామ్ !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...