Monday, June 29, 2020

మట్టి

June 29, 2020
"ఈ మహిలో నీ మహిమ ఎంతో__చూపావయ్యా _!
  ఈ మట్టిలో  నీ ప్రతిభ ఎంతో __ దాచేవయ్యా_!"
మట్టిలింగము లోని శివయ్యా_!
భలే చతురుడవు ,, నీకూ_ దండాలయ్యా _!!
మట్టి లోనే పుట్టేది, _
మట్టి తోనే పెరిగేది_
మట్టిలోనే కలిసేది, _
మట్టితో నే తిరిగేది,_
ఈ జీవుడే కదా_!_
      !!మట్టి లింగము !!
మట్టిలో న మాణిక్యాలు ,_! వజ్రాలూ  ,రత్నాలూ _
వెండీ ,బంగారాలను_
మట్టితో నే సృష్టి చేసి , _
మట్టియే  మాతో నిలిచే_ సత్యమని నిత్యమని ,_
భ్రమతో  మము బ్రతికించే వూ_
  మా బ్రతుకును  పండించే వు_!
      !!మట్టి లింగము!!  
మట్టి తోనే చెట్టూ ,చేమా_
మట్టి తోనే కొండా ,కోనా_
మట్టి తోనే నీరూ పారు _
మట్టి తోనే గాలి వీచు_
మట్టి తోనే ఇల్లూ వాకిలి _
మట్టి తోనే ఈగా ,దోమా_
మట్టి తోనే భార్యాభర్త_
మట్టి తోనే బంధాలు_
మట్టి తోనే ఆత్మీయులు_
మట్టి తోనే అనుబంధాలు _
మట్టి తోనే , ప్రేమా, రామా_
మట్టి తోనే నాది, నీదీ_
మట్టి తోనే నేనూ, నీవూ_
మట్టి తోనే మంట  పుట్టు_!!
      !! మట్టి లింగము !!

"మట్టి లేని బ్రతుకు లేదు_!
మట్టి లేని ప్రాణి లేదు_!
మట్టి తోనే ఆనందం _!
మట్టి తోనే ఆరోగ్యం  _!
మట్టి తోనే వాసన లు_!
మట్టి తోనే పెండ్లిల్లు_!
మట్టితోనే చావూబ్రతుకు,_!
మట్టి తోనే అనుభూతులు,
మట్టియే అని తెలిసి, మళ్లీ
మట్టి పూసుకు తిరిగేము _!
     !!మట్టి లింగము !!

"మట్టి తోనే భక్తి, ముక్తి_!
మట్టి తోనే పుట్టు శక్తి_!
మట్టి తోనే కలుగు రక్తి _!
మట్టి తోనే జీవన్ముక్తి _!
మట్టి తోనే వైరాగ్యం _!
మట్టి తోనే వేదాంతం _!
మట్టి తోనే జ్ఞా నం_!
మట్టి తోనే సాధనం _!
మట్టి తోనే జన్మ వచ్చు_!
మట్టి తోనే జన్మ పోవు_!
మట్టి యే తింపీ చంపు_!
మట్టి యే రంగుల రాట్నం _
మట్టియే నాటకరంగం_!
మట్టి తోనే పుణ్యం ,పాపం_
మట్టి తోనే దానం, ధర్మం_!
    !!మట్టి లింగ ము!!

"మట్టి తోనే దేవుళ్ళు _!
మట్టి తోనే శిలా మూర్తులు_!
మట్టితో మందిరాలు _!
మట్టి తో మసీదులు
మట్టి తోనే చర్చి_!
మట్టి తోనే పంటలు,_!
మట్టితో గాలీ నీరూ_!
మట్టి లో సముద్రాలు
మట్టిలో భూకంపాలు_!
మట్టిలో అగ్నిజ్వాలలు_!
    ఎంత గొప్పవాడవూ_ నీవు శివయ్యా _!
     చిన్న మట్టి లింగము లో కుదురుగ_ ఇమిడే వయ్యా _!!    మట్టి లింగము!!

"మట్టి తోనే  సిరులు_
మట్టి లో వైభవ లక్ష్మి ,_!
ధాన్య లక్ష్మీ,థనలక్ష్మీ,,_
మట్టి లో నారాయణుడు
మట్టి లో నే బ్రహ్మ _!
మట్టి లో సకల దేవతలు _!
మట్టి తోనే అన్నం ,నీళ్ళు
మట్టి తోనే  మనుషులు, పశువులు _!
మట్టి తోనే బొమ్మలు_ బొరుసులు_!
మట్టి తోనే చెలగాటం _!
మట్టి తోనే  జీవుని ఆటా, పాటా_!
   ;;  మట్టి లింగము !!

"మట్టి తోనే  జలచరాలు,_!
_చేపలు,మొసళ్ళు, తిమింగలాలు _!
మట్టి తోనే పాములు  కప్పలు
మట్టితోనే  నావలు నౌకలు_
మట్టి తోనే ఇసుక తిన్నెలు మట్టి తోనే మానము ,ప్రాణము _!
మట్టి తోనే మంచీ, చెడ్డా,_!
మట్టి తోనే జమా ఖర్చు_!
మట్టి తోనే మానమభిమానాలు ,_!
మట్టితోనే దీపాలు _!
మట్టితో నే పాపాలు ,శాపాలు_!

   !!మట్టి లింగము !!
మట్టితో  నే పుట్టిల్లు _!
మట్టి తోనే  మెట్టినిల్లు _!
మట్టితో నే   కొత్తిల్లు _!
మట్టితో నే  పాతి ల్లు_!
మట్టితో నే  ఆశ_!
మట్టి తోనే  శ్వాస_!
మట్టి మీదే  ధ్యాస_!
మట్టి తోనే ,_భాష _!
మట్టితో వేషాలు _!
మట్టి తో ద్వేషాలు _!
మట్టి తోనే   నాటకాలు_!
మట్టి మీదే   ఆన_!
మట్టి యే  అందరికీ తల్లి_!
మట్టి యే తండ్రీ, గురువూ_!
మట్టియే బ్రోచే దైవం _!
     ! మట్టి లింగము !!

"మట్టి తో స్నానము _!
మట్టితో పానము _!
మట్టితో దేవుళ్ళు _!
మట్టి తో నోములు _!
మట్టితో పూజలు _!
మట్టితో  నమాజు_!
మట్టి తో ప్రార్థనలు _!
మట్టి తో యాత్రలు _!
మట్టి తో దానాలు _!
మట్టి తో యజ్ఞాలు_!
మట్టి తో యాగాలు _!
మట్టితో దేశాలు _!
మట్టితో  ఆలోచనలు_!
మట్టితో అందాలు _!
మట్టి తో బంధాలు_!
      !!మట్టి లింగము!!

"ఈ మట్టియే కదా,
_ శివ లింగమైనదీ_!
ఈ మట్టియే కదా
    _విష్ణుమూర్టై నది_!
ఈ మట్టియే కదా,
   __సూర్యచంద్రాదులూ_!
ఈ మట్టియే కదా
_!బ్రహ్మాండ భువనాలు _!
_నింగిలో మెరయు ఆ
నక్షత్రాల పుంతలు _!
ఈ మట్టియే కదా_
_అండాండ పిండాలు_!
మట్టితోనే కదా
_గ్రహముల ,గమనాలు_!

    !!  మట్టి లింగము!!
మట్టితోనే సృష్టి ,_!
_మట్టి తోనే వృష్టి _!
మట్టితోనే దృష్టి, _!
__మట్టి తోనే పుష్టి_!
మట్టితో జీవనము _!
మట్టితో భావన ము_!
ఈ మట్టితో భోగ_
_ భాగ్యాల అనుభవము_!
ఈ మట్టితో ఆత్మ _
_,పరమాత్మనే   చేరు _!
ఈ మట్టి సాధనము _!
_, ఈ మట్టి బోధనము_!
ఈ మట్టియే తల్లి,_!
_తండ్రి _ఈ మట్టియే_!
మట్టియే గురువూ,,_!
మట్టియే దైవము_!
మట్టి యే సర్వమూ,_! సర్వమూ బ్రహ్మము _!
    అని తెలుపుటకే కదా _!
_ పార్థివ శివ లింగ_
రూపంలో కొలువుండీ_
మా పూజ లందుచూ_
, __మమ్ము కరుణీంచేవూ_!
      !;మట్టి లింగము!;

మట్టి కానిది ఒకటి_! _అదియే పరబ్రహ్మము_!
మట్టి కానిది_ మాసి _
పోనిది _అదె ఒకటి_!
సత్య ము, అనంతము , బ్రహ్మము అది ఒకటే,_!
మట్టి బ్రహ్మము , మట్టి_ _బొమ్మ లూ  బ్రహ్మ మే_!
మట్టి కుండలు_ బ్రహ్మమే_! కొండలూ బ్రహ్మమే,_!
మట్టి తో చేయబడు_ ప్రతి పదార్థమూ  బ్రహ్మమే,_!
మట్టి అణువణువున  _
ఉన్న చైతన్య  రూపమే_
పరంజ్యోతియై వెలుగు ,_   ఆ పరమాత్మ తత్వమే_,
నదులలో,వాగులో
,చెరువులో ,బావిలో,
నీటి యందగుపించు _సూర్య దేవుని వలె
ఒక్కటై   తావెలుగు,_! అనేకముగ భాసించు,,_!_
అన్నింటిలో తాను_!
,తాను అన్నింటిలో_! సర్వాత్ముడై  యుండు
తానే అంతై ఉండు_!

   !; మట్టి లింగము !!
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని  కొలువ
ఈ మట్టి దేహమే
,_, దీపమై తోడుండు_!
ఈ జీవునికి  మోక్ష__ _మార్గమును చూపించు,_!
ఇది మట్టి దేహము కాదు_!
వట్టి దేహము  కాదు_!
భగవంతు డిచ్చి నా 
అపురూప అవకాశం_!
అమూల్యమైన వరము _!
ఈ మానవ జన్మము _!
సకల ప్రాణుల కన్న బహు_
_ ఉత్కృష్ట మైనది _!
దీనికోసమే కదా_ _రాముడూ ,కృష్ణుడూ
వివిధ అవతారాలతో ,
_భువికి దిగి వచ్చినది_;
నాలుగూ వేదాలు,
స్మృతి ,శృతి, పురాణాలు_
యోగము ,శాస్త్రము
,ధర్మము చెప్పినది_!
  _ దేహ వాసన తొలగి ,, పరము కావాలంటే ,_
జీవాత్మ పరమాత్మ_
,_ యందు కలవాలంటే_,
ఈ మట్టి దేహమే
_,శోధించి _సాధించు,_!
ఆత్మానుభవముతో
భాసించు _శోభించు_!
పుణ్య భారత_భూమి మట్టి లో పుట్టి, నా,
ఈ మట్టి లో గిట్టినా,
జన్మ రాహిత్యమౌ_
  భక్తి శ్రద్ధలు కలుగు _!
అందుకే __!
ఈమట్టియే శరణము_!
మట్టి యే దైవము_!
మట్టి యే మార్గము_!
మట్టి యే బ్రహ్మము_!
మట్టి యే జీవుడు,_!
మట్టి యే దేవుడు _!

మాతృ భూమి కీ జై
భూమా త కి జై
గోమాత కి జై
శ్రీ మాత కి జై

ఆనందమే కృష్ణుడు

June 27, 2020
"ఆనందమే కృష్ణుడు"_!
భువి లోన _
అందమంటే కృష్ణుడు _!"
______&&&&_____
ఆనంద మానందము_
పరమానంద మానందమూ_!
కాళీయమర్దనము చేయూ,
కృష్ణ _,
నీ తాండవమే  ఆనందము _!"
         !! ఆనంద!!

""బ్రహ్మాండము లు కదలగా _ మో దమున ,
వర యమునయే  పొంగగా_
నర్తించు_  గోవింద గోపాలుడే_
   , డెందమున  _ కానంద మానందము _!!
         !!ఆనంద!!
 
కాళీయఫణి  మంటపముపై___
భాసించు  కృష్ణు డే  ఆనందము _!
  శ్యామ సుందరుని చూచే _కన్నులదే  ఆనంద మానందము __!!
        !!ఆనంద !!
_,
కృష్ణ , వేణునాద శ్రవణము
వీనులకు _,
అనంద మానంద ము _!
చిన్ని కృష్ణుని
అందెల రవళి యే_
హృదయమున  ఆనందము _ ఆనందము _!!
          !!  ఆనంద !!

నలినలోచను   నాట్యము_
మనసునకు  _ఆనంద మానందము _!
తాళ యుక్తము గ చేయు _
కృష్ణ పద ఘట్టనము లానంద మూ_!
          "!!ఆనంద !!

భువనాలు ఆడించునే _ ఆటగా_!
తానే ఆడుచు పొందునే_
ఆనందము _!
దుష్ట శిక్షణ వ్రతము గా_
పాలించు శిష్ట రక్షణ దీక్షయే_
భక్తులకు మానంద
మానందము!
         "!!ఆనంద !!

బృందావన  సీమలో  , _ దివ్యమౌ _యమునా నదీ జలములో _
కృష్ణ  తాండవ నృత్యమే _
తలచిన  ప్రతి ఆత్మ ఆనందము _!
        !!!ఆనంద !!

గోప గోపీ జన ము లో_
కనిపించు_ ప్రేమయే
   ఆనందము _!
కృష్ణ  భరత నాట్యమే  _
జగతి కి _
ఆనందమా నందము_!
         !!ఆనంద!!
        
పులకించు
ప్రకృతిమాత దే _ఆనందము_!
నందా యశోద  జంట దే ఆనందము   _!
నంద వ్రజ స్త్రీల దే, ఆనం దము_!
   మునిజన డెందము న_ కానందము  _!


నాట్య మానం దము_! _పరమాత్మ
లీలలానందము_!
అందాల కృష్ణుని ,_ అనురాగ మూర్తిని _
  ఎంత స్మరియించిన   అంత ఆనందము_!

  అందించు కృష్ణయ్య అలరించవయ్యా_!
నీ ఆనంద లహరి లో
తేలించవయ్యా__!""

వాసనా బలం

June 26, 2020
నర మాంసం తిన మరిగిన పులి , ఆ వాసన తో అడవంతా  మనిషి కోసం  గాలిస్తు ఉంటుంది
పిల్లి ఎలుక మాంసం రుచి తెలుసు కనక ఆ  ఎలుక వాసన  పసిగడుత్   మెల్లిగా దాన్ని  పట్టేస్తుంది
అలాగే ఈ మనిషి అనే  జంతువుకు కూడా వాసన ఉంటుంది
, వాసన అంటే  బలమైన కోరిక,  ఎలాగైనా కోరింది పొందాలి
రావణుడు చేసింది అదే పని
దుర్యోధను ని రాజ్య కాంక్ష కూడా అతడి వాసనా తీవ్రత యే,
మధిర మగువ జూదం మాంసం , మత్తు పానీయాలు  వీటికి దాసుడు కావడం అంటే అతడిలో వాసన సూక్ష్మ స్థూల కారణ శరీరాల్లో నిండి పోవడమే
, వాసన లు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
ఒకటి దేహ భావన ,
ఇది అందరికీ తెలిసిందే
అయినా
   దీన్ని అర్థం  చక్కగా  చేసుకోవడానికి చిన్న ఉదాహరణ చూద్దాం
ఒక రాజుగారి మహల్లో  మహారాణి కొలువులో ఒక ముసలి దాసి  ఏళ్ల నుండి  ఆమెను సేవిస్తూ  ఉంది,
ఆమెకు ఒక కొడుకు ,యువకుడు ఉన్నాడు
ఒకరోజు ఆ యువకుడు రాణి గారి అంతః పురం లోకి తల్లి కోసం వచ్చి,అక్కడే ఉన్న రాజకుమారి నీ చూసి  ఆమె అందానికి  , మోహితుడై  పోయాడు
ఇంటికి వచ్చాక తల్లీ కి తెలిసింది
ఇది కుదరని పని అని ఎంత చెప్పినా కూడా అతడు వినకుండా  ,అన్నం నీళ్ళు మానేసి  , పిచ్చి వాడి లా తిరుగుతూ ఉన్నాడు
తల్లి విచారంగా కనిపిస్తూ ఉంటే ఒకరోజున మహారాణి అడిగింది  ,కారణం ఏమిటి అని !
దాసి ఆమె వద్ద దాచకుండా విషయం చెప్పింది
ఆమె నవ్వుతూ
ఓస్ ఇంతేనా !  రేపు ఉదయం  నీ కొడుకు ను నా వద్దకు తీసుకు రా !_
అంది
  మరునాడు రాణీ తన ముందు  బుద్దిగా కూర్చున్న యువకుడి ని  పరిశీలనగా చూస్తు అడిగింది
చెప్పు  నీ సమస్య ?
  రాకుమారిని ప్రేమించాను !
ఆమెలో ఏం చూసి ప్రేమించా వు ?
అందం -_!మరచిపోలేని  కళ్ళు.  ఆధారాలు. ,వదనం ,అవయవ సౌందర్యం , మరవలేక పోతున్నాను
ఒక్కసారి చూస్తేనే ఇంత ప్రేమ కలిగిందా ?
అవును ,ఆమెను తప్ప ఇంకెవరి నీ పెళ్లి చేసుకోను ,
సరే  ,ఒక రాకుమారిని చేసుకోవాలంటే ,నీవు ఆ స్థాయి కి ఎదగాలి కదా ,
  నాకు ఆ హోదా స్థాయి కోరిక లేదు
    ఈ కోరిక తీరాలంటే నీవు ఇదే రాణీ వాసం లో ఒక గదిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి ,
బయటకు రావడం , కుదరదు
నీకు ఆహారం వసతి ఏర్పాటు చేస్తాను ,నేను చెప్పినట్టుగా నీవు ఏ ది చేయమంటే అది చేయాలి ,
నేను పంపించిన వ్యక్తుల తోనే నీవు మాట్లాడాలి  , నీవు ఈ నియమాలు పాటిస్తే , సంవత్సరం గడిచాక నేను నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను ,
సరేనా నీకు
  ఆమెను పెళ్లి చేసుకోడం కోసం నేను ఏమైనా చేస్తాను  __!
    అలాగే  ఉన్నాడు , విన్నాడు ,
సంవత్సరం గడిచింది
రాణీ గారు అతన్ని పిలిచి
  రాకుమారిని పెళ్లి చేసుకుంటా వా అంది
, ఎవరు ఆమె ,నాకు ఎవరూ  తెలియదే 
అన్నాడు
అయితే ఆమెను మరచి పోయావు ,సరే  ఇన్ని రోజులు గదిలో ఉండి ఏం నేర్చుకున్నావు
గీతా సారం బోధ పడింది , మీరు పంపించిన ఆచార్యులు రోజూ నాకు , భగవద్గీత ను చక్కగా బోధించారు
దాని వల్ల నాకు దేహ భ్రాంతి ,దేహ వాసన తొలగి పోయింది ,
బాహ్యంలో  ఇంద్రియాల ప్రలోభ వలన కంటికి అగుపించే  ఈ భౌతిక శరీరంలో  అందాలు సత్యం కాదు   నిత్యం ,శాశ్వతం కాదు  ,
అందం ఆనందం అంతా ఆత్మా నందం లో అంతరంగం లో  కలిగే అనుభవం లో ఉందని అర్థం అయ్యింది
నాకు జ్ఞానభిక్ష పె ట్టి, అజ్ఞానం లో కొట్టుకు పోతున్న నా  ,కళ్ళు తెరిపించినందుకు  మీకు కృతజ్ఞుడిని
అమ్మా మీకు ప్రణామాలు
అంటూ ఆ యువకుడు తన  ఇంటికి తిరిగి వెళ్ళాడు ,
అతడికి  ,తన ఆత్మ విచారం తో ,,దేహ వాసన తొలగి పోయింది
       అతడిలో కలిగిన మార్పుకు తల్లీ , రాణీ సంతసించారు
ఈ శరీరం అందం ,అనందం ఆరోగ్యం ,సుఖ భోగాల వాసనలు పూర్తి చేయడం  కోసం   జననం నుండి మరణం వరకూ  దేహం పై మమకారం తో జీవుడు   పడరాని పాట్లు పడుతున్నా డు కదా !
  శరీరం అందంగా కనిపించేందుకు   దుస్తులు ,   నాలుక తో నానా రుచులు ,ముక్కుతో వాసనలు  ప్రభావంతో ,ఎన్ని  క్వింటాళ్ల ఆహారం ,పానీయాలు , తినరాని తిండి, తాగకూడ ని మధ్యం , ఈ జానెడు పొట్టలో పోస్తున్నామో , లెక్క కట్టలేం కదా !
శరీరానికి కష్టం కలగకుండా , ఏసీ లు కూలర్ లు ,సబ్బులు , కమ్మని వంటకాలు ,, మెత్తటి పాన్పులు , సోఫాలు,,సుగంధ ద్రవ్యాలు సెంట్లు ,పూసుకోడం ,నిత్యం ఈ దేహాన్ని అందంగా అలంకరించి  అందులో అనందం  పొందడానికి,ఉదయం లేచి నప్పటినుం డి పడుకునే వరకు,,  ఈ శరీర సౌందర్యం కొరకు ,,ఎన్ని అగచాట్లు పడుతూ ఉంటా మో ,__ఎంత ఖర్చు పెడుతూ ఉంటామో,, మనకందరకు తెలుసు
చెప్పుకుంటే చేంతా డం త అవుతుంది ,

రెండవది  లోక వాసన __
____
తల్లి అడిగింది కొడుకును
,ఇలా పుస్తకాలు చదువుతూ ,ఒంటరిగా ఉంటూ ,,బయటకు వెళ్ళ కుండా , పది మంది తో కలిసి తిరగకుండా  ఉంటే లోకులు నిన్ను గూర్చి ఏమనుకుంటారు. చెప్పు నాయనా ?
   అతడు  మందహాసం చేస్తూ ,నింపాదిగా  జవాబు చెప్పాడు తల్లికి 
అమ్మా !నేను ఏమిటో ,,ఇన్ని రోజులు నేను  చేసింది  ఏమిటో,ఇక ముందు నేను చేయాల్సింది ఏమిటో ,, అత్మ విచారణ ద్వారా   తెలుసు కున్నాను
ఎవరికోసమో నేను మారలే ను
వారి కి ఇష్టం ఉన్నట్టుగా నేను నడవలేను _ వారి లో  గొప్ప కోసం ,గుర్తింపు కోసం ,వారిని మెప్పించడం ,లేదా మెప్పు పొందడం కోసం, నా స్వార్థం కోసం వారిని ఉపయోగిస్తూ ఉండడం కోసం,, నా అవసరాల కోసం వారి చెప్పు చేతల్లో ఉంటూ,, వారు చెప్పింది చేస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు 
, నా జ్ఞానాన్ని  అలా వ్యర్థ కలాపాలలో ,వృథా చేయను.  అమ్మా
,అలాంటి క్షుద్ర సంతోషం కంటే
ఆ పరాత్పరుని ధ్యాన వైభవం లో  పొందే పరమానందం నా ధ్యేయం ,,
ఎందరో వ్యక్తులు ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటాయి
నాకు యుక్తమని అనిపించింది నేను చేస్తాను ,
ఇన్నాళ్లూ భగవద్గీత , ఉపనిషత్తుల అధ్యయనం చేస్తూ నేను ఎవరో  తెలుసు కొనే ప్రయత్నం చేస్తున్నాను
అమ్మా ! నా గురించి నీవు  ఏ మాత్రం బాధ పడకు ,
నేను ఈ బాంధవ్యాల కు , అతీతుడు గా ఉండాలని,ఇందుకు నీ ఆశీస్సులు ఉండాలని  నిన్ను కోరుకుంటూ ఉన్నాను అమ్మా !__
     ధ్యాన యోగం వలన తన ఇంద్రియాలను నియంత్రిస్తూ తన మనసును ఆత్మతో అనుసంధానం చేస్తూ , ,పరమాత్మ సాక్షాత్కారం కోసం సాధనా మార్గంలో పయనిస్తు బ్రహ్మానందం పొందే ప్రయత్నం చేస్తున్నా డు
( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !_
  ఇక మూడవది
శాస్త్ర వాసన ,
అంటే ధర్మం తెలుసుకుంటూ , అన్వయం చేసుకుంటూ,జీవితం లో ఆచరిస్తూ ఉండడం

శ్రీ రామ కోటి

June 26, 2020

శ్రీ రామ కోటి పుస్తకాలు రాస్తూ , పుణ్య చరితు డ య్యాడు,
ఇంటి కేదురుగా వాకిలి లో ఆ చెక్క బల్ల పై కూర్చుని ,   చెక్కపెట్టే పై  పెద్ద  రామ కోటిపుస్తకాన్ని  ఉంచి , కలం సిరాతో ముంచుతూ శ్రీ సీతా రామ అని మనసులో  అనుకుంటూ ,, తల వంచి ,, రామ  నామాలు  రాస్తూ,ఇలా   అనేక బైండు బుక్ లు రచించి    భద్రాచలం దేవాలయం సన్నిధానం లో సమర్పించిన  శ్రీ రామ భక్త వరే న్యుడు మా తాతగారు ,
కీర్తి శేషు లు     చల్లూరు వేంకటేశ్వర రావు గారు
  గోడలకు నాల్గు వైపులా రామ చంద్రుని చరిత్ర సూచించే తైల వర్ణ చిత్రాలు దాదాపు పన్నెండు ఉండేవి
,, అవి రెండు వెడల్పు ,నాలుగు  పొడవు  ఫీట్ల కొలత లతో అందంగా ఉండేవి
75 ఏళ్ల కిందటి విషయం ఇది ,
  ఆయన తో బాటు , ఆయన  కుటుంబం  అంతా , శ్రీ రాముని ఆరాధన లో  పూజిస్తూ కొలుస్తూ ,తరించారు ,
ఆ ఇంటిలో ఒక పెద్ద గది కేవలం పూజ కోసం ఉండేది
ఆరుగురికి సరి పోయె ఒక గద్దె పై  కూర్చుండి  గంటల కొలది పూజలు చేస్తూ ఉండే వారు
,, భార్య శ్రీమతి వెంకటమ్మ , ,రామడుగు సంస్థానం ఆడబడుచు , ఆరుగురు కొడుకులను , ఇద్దరు బిడ్డలను  కడుపారా కన్న తల్లి ,
,మేము రాముని వారము అనిపించేలా , రామ నామం గానం , రామ కోటి రచన చక్కగా జరిగాయి ,
ఆయన పెద్ద కొడుకు , అపర భక్త రామదాసు,
ప్రతి రోజూ ఉదయాన్నే లేచి ,, గొంతెత్తి   సుమధురంగా ,,సుప్రభాత గీతాలు పాడుతూ
తొక్కుడు హార్మోనియం వాయిస్తూ, ఆనందంలో మునిగి పోయేవాడు
ఆనంద రామాయణం కూడా తన స్వంత కవితలతో రాసి, శ్రీ రాముని సేవలో  తరించాడు
శ్రీ రామ నవమి రోజు సందర్భానా తొమ్మిది రోజు లూ ,, ఆముదం నూనె దీపాలు  వెలిగించి  తబలా చిరతల వాద్య కారుల సహచర్యం తో , హార్మోనియం సంగీత విభావరి లో అద్భుతంగా శ్రీ రామ చరిత కవితా గీతాలు భజనలు పద్యాలు , గానం చేస్తూ , తెల్లార్లు , మేల్కొని ఉంటూ,, ఆ ప్రాంగణము , అపర  శ్రీ రామ చంద్ర భగవానుని  దర్బారు వలె , దివ్యంగా రామ నామ గానం చేస్తూ ఉండే వారు,
అలాంటి సంస్కారం సంప్రదాయం ఆచారం కట్టుబాట్లు మధురం
అలా  దైవ సాక్షాత్కారం చేసుకుంటూ జీవన్ముక్తి నీ సాధించిన ఆ పుణ్య జీవులు మా పూజ్య పితరులు  , పితృ దేవులు నిజంగా ధన్యులు ,
వారి పేరు తలచిన ,వారి బాటలో నడచిన , వారు చేసిన రామ  భజన లో ఏ కొంత సేపైనా చేసినా ,
మన జన్మ ధన్యం అవుతుంది కదా,
మనమూ రాముని వారమే అని నిరూపించు కొందాం
హే శ్రీ రామచంద్ర కరుణా సాంద్రా , నీ నామం మధురం
నిన్ను సేవించిన వారి బ్రతుకే మధురం
నీ నామ స్మరణం , నీ నామ భజన ,రచన , భావన సేవన పూజన అర్చన శ్రవణ ,తో ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను చరితార్థం చేసుకునే వారి బ్రతుకే మధురాతి మధురం కదా
జై శ్రీ రామ్
జై జానకీ మాతా
జై హనుమాన్
స్వస్తి
హరే కృష్ణ హరే కృష్ణా

అద్దె కొంప

June 24, 2020
స్వంత ఇంటిపై కంటే _
అద్దె కొంప లపై  ఎక్కువ  ప్రేమ,మమకారం_ జాగ్రత్త,అలంకరణ,, భక్తీ, భయం, జ్ఞాపకాలు , శ్రద్ద ఉంటాయి_!
,,, ఎందుకంటే నెల నెలకు మరవకుం డా , నగదు అద్దె గా ,_ చెల్లించాలి ,_!
ఈ దేహం కూడా నిజానికి ఒక అద్దె కొంప యే_!
దీనికీ కిరాయ  ,గత జన్మ పాప పుణ్యాలు, జరా రోగ బాధల రూపంలో   అనుభవిస్తూ , తగిన మూల్యం చెల్లించక తప్పదు కదా_!
ఒక వాహనం పై  ఎలాంటి అడ్డంకులు లేకుండా వెళ్తుంటే  ప్రాణం హాయిగా ఉంటుంది
,ఒక ఆక్సిడెంట్,లేదా రిపేర్ ,కోసం పెట్టే ఖర్చులు పొందే బాధ, లాంటిదే,, ఈ శరీరం అనబడే వాహన సపరిచర్యలు ,,_!
అందుకే జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు,
ఆటుపోటులు తప్పవు,_!"
_ఇల్లు అయినా,దేహం అయినా ,,శుభ్రంగా ఉంచక పోతే, అనారోగ్యం అశాంతి , బ్రతుకు భయం గా   ఉంటూ  సంతోషం కరవై ,__ముందుకు   నడవదు_! _పూటగడవదు _! బ్రతుకు మహా  ప్రమాదం లో పడుతుంది,_! ,  పైగా యజమాని కోపం చేస్తాడు కూడా _!
, నిర్లక్ష్యం తో అక్కరకు రాకుండా చేస్తే,, నిర్దాక్షిణ్యంగా వెళ్ళ గొడతా డు,,యజమాని ,_!
  " ఘటాని కి ఒక మఠం" అనుకుంటాము కానీ,_
ఇలాంటి మొండి ఘటానికి   కిరాయకు ఇల్లు ఇవ్వడానికి ,కూడా,దేవుడు ఎన్ని అర్హతలు చూస్తాడు ?
బుద్దిగా ఉంటాడా_?
చెప్పినట్టు వింటాడా ?
ఇల్లు బాగా చూస్తాడా _?
పరిమిత కుటుంబం, తో     ఆలోచనలతో ఉంటాడా,?
  తాను గమనిస్తూ ఉంటాడన్న జాగ్రత తో , ఉంటాడా,,_?
తనకి కోపం తెప్పిస్తే ,ఏ క్షణంలో నైనా  బయటకు ఈడ్చి పడే సే ప్రమాదం ఉందని ,  అప్రమత్తత తో ఉంటాడా_?
ఇంటి అలంకరణలో ప్రేమ చూపుతూ_,  ఆ ఇంటిలో _మూల మూలలా దాగిన యజమాని కారున్యాన్ని గుర్తిస్తూ  _కృతజ్ఞతా భావం చూపిస్తూ , ఉంటాడా,_?
" మంచివాడు కదా,_ పోనీలే,చూద్దాం లె __"!'అని జాలి పడితే , అహంకారం అజ్ఞానంతో , "ఈ ఇల్లే నాది _;నాది,_!నేను పోను_!,ఇన్నేళ్లు ఉన్నాను,_! ఇది నా స్వంతం ,ప్రాణం పోయినా ఖాళీ చేయను _!""
రూల్ ప్రకారం ఒక ఇంట్లో ఎవరు  పాతికేళ్ళు ఉంటే _ఆ ఇల్లు వారిదే _!అని చట్టం చూపిస్తాడా _!"",
,   అయినా _ ఇంత మంచి ఇల్లు మరొకటి దొరకాలంటే , వీడి ప్రవర్తన గురించి నేను ఓ కే చెప్పాలిగా _!""
   స్వంత ఇంటిలో ఉన్నా ,"నాది "అనుకోడం వరకే , కానీ, అది కూడా_ ఏదో  ఒక రోజున ,_ ఖాళీ చేయక తప్పదు కదా_!
ఎవరికో ఒకరికి అప్పగించి ,వెనక్కి చూడకుండా పోవాల్సిందే కదా _!"",
    వస్తువు పైనే ఇంత అభిమానం చూపిస్తే,__అది అస్తిరం అని  తెలిసిన నీకు_. పక్కాగా తెలిసిన  కూడా __దేహం పై ఇంతగా  మమతా నుబందాలు పెంచుకుంటున్న ఓ  కీరాయ జీవుడా,_!, చిప్ప చేతపట్టుకుని ,, ఆత్మ చింతన చేయకుండా,_,అంతరాత్మ లో వెలుగొందే పరమాత్మ ను  దర్శిం చు కు నే ప్రయత్నం చేయకుండా_ ఎన్ని ఇండ్లు మారుస్తూ _ఇలా పిచ్చివాడిలా  తిరుగుతూ , _ఉంటావు_!
నీది కానిది నీది అనుకోడం , తప్పు అన్న బుద్ది జ్ఞానం నీకు  కలిగేది ఎప్పుడు_ చెప్పు _!""
కనీసం ఈ మనిషి జన్మతో పుట్టాక నైన _ కృతజ్ఞతా పూర్వకంగా , _ ఇంటి యజమాని పై  విశ్వాసం చూపుతూ ,_నిత్యం నమస్కారం చేస్తూ ఉండక పోతే,_ నీ బ్రతు క్కు అర్థం ఉండే నా,_??"
, కరోనా చావులు చూసైనా , మనసు మార్చుకోలేవా_?"
   _"ఆ సెగ _నీకు అంటకుముందే   _ సద్గతికి దారి వెదుక్కోరాదా,!,_"
_ నీ మంచితనం చూసి_నిను నమ్మి _ ఇల్లు కీరాయకు ఇచ్చిన యజమానిని మోసం చేయ కూడదు సుమా _!"
నీది కాని ఇంటిపై అనవసరం గా వెర్రి భ్రమలు ,పెట్టుకొంటూ,__ వేరే ఇల్లిల్లూ తిరగకుండా_ నీ మీద దయతో నీకు ఇచ్చిన
ఇదే ఇంటిలో ఉంటూనే__
మంచి పేరు తెచ్చుకో కూడదా ,_!"
" అయ్యో'  ఈ ఇల్లు ఖాళీ చేసి పోవాల్సిందే నా __?,అనుకునే కన్నీళ్ళ ఘడియలు రాకముందే ,__ 
  వివేకంతో మెద లుతూ _,
  __విధిగా  నీవు వెళ్లాల్సి వచ్చిన నాడు __ ప్రక్కవాడు  బాధతో,జాలిగా __ఒక్క కన్నీటి చుక్క  నైనా రాల్చే భాగ్యానికి నోచుకునే లా ,అందరితో సఖ్యంగా , ఉండ రాదా _??"
నీ ఇంటి యజమాని ఔదార్యం గురించి ప్రశంసిస్తూ ఉండు_!!_"
" తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం  మామూలు తప్పు కాదు,__ అది  దేవుడు కూడా   క్షమించ లేని ఘోర అపరాధం  అవుతుందని __కాస్తా నీవు
గుర్తు పెట్టుకోవాలి సుమా _!"" ,
ఈ ఇంటిలో ఉండగా నీవు ఎన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నావో ,__ ఇంటి యజమాని లెక్క పెడుతూ ఉన్నాడని , మరవకు_!""
అంతే కాదు, మద్య మద్య నీకు హెచ్చరిక లు కూడా చేస్తూ ఉన్నాడని , కూడా, మరవకు _!""
   నీకు ఇచ్చిన ఇల్లు ఒక సాధనం _!ఒక పని ముట్టు,_!  చక్కగా పనికి వాడుకో_!_ అది నీది కాదు_!, నీవు దానిని తయారు చేయలేదు_!,అందుచేత దానిపై నీకు అధికారం హక్కులు లేవు,_!
సర్వ హక్కులు ఇంటి యజమాని వే,_!
అందుచేత రెడీ గా ఉండాలి,_నీవు_!ఎప్పుడంటే అప్పుడు ఈ ఇల్లు   ఖాళీ చేయడానికి _!
మంచితనం ,_పుణ్యం ,దానం , భక్తి,జ్ఞాన వైరాగ్యాలు అనబడే  భావ సంపద లను మూటలు మాత్రమే _నీ వెంట తీసుకొని పోవడానికి యజమాని  సమ్మతిస్తాడని తెలుసుకో, తమ్ముడూ _!""
అంతే కానీ,, ఈ అద్దె ఇల్లు __శాశ్వతం కాదు _!,నిత్యం కాదు _!, నీ తో రాదు_!""
అన్న జీవిత సత్యాన్ని  అర్థం చేసుకో,, నాయనా_!""
  ఓ జీవు డా_!
ఈ ఇంటిలో వుండగానే , బుద్దిగా ,జ్ఞానం అనే దీపం వెలిగించు కో_!
_ దైవం పై విశ్వాసం తో, బ్రతుకు దిద్దుకో _!
ప్రశాంతత తో_ పరమానందం ,, పొందుతూ  _ జీవన్ముక్తి నీ
సాధిం చు _!
_"" నీలో ఉన్న _నీ స్వామిని విడిచి , మరచి _ మూర్ఖంగా ,ఎక్క డో  వెదకు తూ  __అమూల్యం, అమోఘం , అద్భుతం __ ,భగవద్ ప్రసా దితం _   అయిన  నీ  జీవన కాలాన్ని  వ్యర్థం చేసుకోకు ,, నాయనా,_!""
"నీవె బ్రహ్మవు _!
"నీవె దైవానికి_!"
"నీవే_ నీ అత్మ ఉద్దార కుడవు_!
"తత్ _త్వం_ అసి_!"
ఆ సచ్చిదానంద స్వరూపం_  నీవే_ నీవే_ నీవే _సుమా _!""
నీవూ _ ఆ బ్రహ్మము,__ వేరు కాదు_!
నీవే అతడు _;!
అతడే నీవు_!
నీది కాని నీ  ఇల్లును, ఈ దేహాన్ని ,_ ఎంత జాగ్రత్తగా చూస్తూ ఉన్నావో__
_నీలో ఉన్న _"ఆత్మ "అనే నీ ""స్వంత  ఇంటి""ని కూడా  _అంతకంటే గొప్పగా చూస్తూ ఉండాలి_ సుమా _!""
,, ఎంతసేపూ బయటకే చూస్తూ ఉంటే _ అక్కడ ఘోరమైన ఉదృత రుద్ర రూపంలో విలయతాండవం చేస్తున్న ఆ_కరోనా  ప్రభావం తప్ప  మరేమీ కనిపించదు _ నాయనా _!"
__ ఇప్పుడైనా_లోన చూడు_!
అంతరాత్మ లో  వెదకి పట్టుకో_
అక్కడే ఉంది నీకు కావాల్సింది_!
నీకు శాశ్వత అనందాన్ని ఇచ్చేది _!""
  అక్కడ ,నీకు,__ఏ  కరోనా భయం లేని, ,  బ్రహ్మానందం కలుగుతోంది,,_!"
  "చెప్పడమే నా ధర్మం ,_!
వినక పోతే నీ ఖర్మం _!
అంటాడు గీతాచార్యుడు , ఆ శ్రీకృష్ణ భగవానుడు _!""
అందుకే ,
""తృప్తి "అనే  ధనం నీ హృదయంలో  పొందనంత వరకూ __   నీ మనసు ఇంద్రియాల కు వశమై ,_ కుక్క వలె తోక ఊపుతూ__ అది చెప్పినట్టు వింటూ __ ఆత్మ విచారణ లేకుండా_ ,బుద్ది పనిచేయకుండా _ జీవితంలో ఒక , ధ్యేయం  అంటూ లేకుండా _ దాని తో వెళ్లాల్సిందే కదా _
అందుకే " అద్దె కొంప"  అనబడే ఇదే దేహాన్ని ,ఒక దేవాలయంగా  మార్చుకో_!
అందుకోసం పెద్ద శ్రమ ,ఖర్చు  పెట్టుబడి ఏమీ పెట్టే అవసరం  లేదు_సుమా _!"
ఇష్ట దైవాన్ని మరవకుండ _, నిరంతరం మనసులో తలచుకుంటూ_  బయట , నీ పనులు సాఫీగా చేస్తూ_ ఉండు_!, చాలు_!
"ఇహమూ _పరమూ రెండూ నీ స్వాధీనం అవుతాయి_!
"ఇదే అద్దె ఇల్లు_ నీకు పునరావృత్తి రహితమైన   మోక్ష మార్గాన్ని సూచిస్తూ _,పరమాత్ముని ఆనంద నిలయం గా శోభిల్లుతూ __ జన్మ సార్ధకం చేస్తుంది ,_!""_
   ఓమ్ శాంతి శాంతి శాంతిః_!
స్వస్తి_!
హరే కృష్ణ హరే కృష్ణా_!"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...