Jul 25, 2020
"మనస్సు "అనే అంగం ప్రత్యేకంగా మనలో లేదు,_!
మన ఆలోచనల స్వరూపమే మనస్సు _!
ఈ మనస్సు అనేక రూపాల్లో _మనకు అనుదినం మన ముందు_ మనలోపల _ప్రత్యక్ష మౌతూ ఉంటుంది_!
__కోపం ,ఈర్ష్య ,పరితాపం, దుఖం ,సంతోషం , ఉత్సాహం లాంటి భావోద్వేగాలు __మనస్సు ప్రకోపన తోనే _ బయటికి ప్రకటిత మౌతూ ఉంటాయి_;
" మనస్సు " అనే భావ సంపద మనిషికి దేవుడిచ్చిన అపురూప వరం _!
దానితో నే దివ్యమైన అనుభూతి పొందుతూ ఉంటాం ,,_!
""ఆవేశం _ఆరాధన_ ఆనందం _ఇలా మనిషికి జీవితంలో కలిగే సుఖ సంతోషాలు,కష్ట నష్టాలను మనసు తో అనుభవిస్తూ అనుభూతి పొందుతూ , ఉంటాం _!
మనసు అంటే "నేను అనే అహంకారం""_!
,దాన్ని ఆలోచన ద్వారా భావిస్తూ పనులు చేస్తూ ఉంటాం _!
ఈ మనస్సు ఎంత గొప్పదో ,అంతకంటే గొప్పది అద్భుతం అయినది మన ఈ దేహం _!!
దేహం లేక పోతే అనుభూతులు ఉండవు _!,
చెట్టు రాయి కొండ , జంతువు ల వలె యాంత్రికంగా ఉంటుంది జీవితం _!;
,జీవుడు ,అంటే మనసు ""_!
ఈ ఆలోచనల దర్శనాన్ని రెండు విధాలుగా చూడవచ్చును _!
ఒకటి_ దేవత_!
రెండు _దెయ్యం _!
_""శాంతం,, సంతోషం, సహనం , సత్వ గుణం, స్పందన,లాంటివి_ దేవతా
స్వభావాలు అనుకుంటే__ __కోపం, తాపం, దురాశ , అహంకారం _లాంటి
రాజస తామస గుణాలు దెయ్యం అవహించి చేయిస్తూ ఉన్న పనులు అనుకోవచ్చు_!!"
మనిషికి చెడు. ఆలోచనలు పనులు చేయడం _ చాలా సులభం _!
వాటికి అంతగా కష్టపడే అవసరం లేదు,_!
ఎందుకంటే . మన చుట్టూ ఉండే వాతావరణం అలాంటిది _!
టీవీ, పేపర్ వ్యక్తులు చేసే పనులు మాటలు కుటుంబ సంస్కారం వీటి నుండి తప్పించుకునే వీలు లేదు _! కదా ,
వాటి ప్రభావం మనపై మన మనసుపై తప్పక ఉంటుంది _!
అని అందరికీ తెలుసు _!
__దేవతా గుణాలు లభ్యం కావడం చాలా కష్టం _!
ఎందుకంటే అలాంటి సంస్కారం , పెంపకం దొరకడం చాలా అరుదు కదా ,_!
స్వతహాగా ఏ మనిషీ చెడ్డవాడు కాదు కదా _!
అందరం సంఘం చెక్కిన శిల్పాల మే కదా _!
ఎవరూ పూర్తిగా మంచి_ లేదా పూర్తిగా చెడ్డ వారు కాదు _!
కర్మలను బట్టి అవి ప్రకటిత మవుతు ఉంటాయి _!
_మాట్లాడకుండా _మౌనంగా ఉంటే మాత్రం__లోన వచ్చే ఆలోచనలు కదలకుండా ఉంటాయా_??
ఉండవు కదా _;
మౌనంగా ఉన్నపుడు__ మన ఈ మనసు _ తాను ప్రేమించిన మనిషి ,, డబ్బు , వస్తువు ,చుట్టూ తిరుగుతూ ఉంటుంది
లేదా __
తాను ద్వేషించే వ్యక్తి ,వస్తువు గురించి ఆలోచిస్తూ ఉంటాడు _!
ముఖ్యంగా అతిగా ప్రేమించే ,, మనసు పడే భార్య ,,భర్త లేదా మరొకరు , ఈ మనసుకు ""ప్రభువు ""అవుతూ ఉంటారు_!
, తమ స్వార్థం తో అదే భావిస్తూ ,అదే లోకంలో జీవిస్తూ, దానినుండి బయట పడలేక సతమత మౌతూ ఉంటారు _!
, జడ భరతుడు. ఒక జింక ను పెంచి ,_ ప్రేమించి ,మరుసటి జన్మలో జింక గానే పుడతాడు _!
వేల ఎండ్లతపస్సు నష్టపోతా డు కూడా _!
దృతరాష్ట్రుడు _ తన ""రాజ్య కాంక్ష ""తో కురువంశ నాశనానికి కారకుడౌతాడు _;
రావణుడు కాంతా మోహంలో _కన్నూ మిన్నూ కానకుండ _అకృత్యాలు చేసి , స్వర్ణ లంకా నగరాన్ని _"మరుభూమిగా"" మారడానికి కారకుడు అవుతాడు ,_;
పురాణాలలో మాత్రమే కాకుండా , ఇంటింటిలో నిత్యం __ మనం చూస్తున్న విషయాలే ఇవి _
"" తల్లా _?పెళ్ళామా ,_! ఇద్దరిలో నీకు ఎవరు కావాలో చెప్పు _??
అంటే ఏం చెబుతాం _?
ప్రేమలో హెచ్చు తగ్గులు ఉండవు కదా _!
,
ఇలా తాము అమితంగా ప్రేమించే వ్యక్తి కోసం__ పోటీలు పెట్టుకుంటు,__ కొట్టుకుంటూ ఉంటారు _!
"ప్రేమ "అంటే పోరాటమా?
పంచుకునే పదార్థమా _?. కాదు కదా _!
ప్రేమ ఒక్కరికే స్వంత మా _?
ఇది పూర్తిగా వ్యక్తి గతమా _!
తమ వారు అనుకునే వారందర కూ పంచడం వలన "ప్రేమ" బలహీనం అవుతుందా _?
ప్రేమ కు మరో పేరు విశ్వాసం _!
__ఎక్కడ తన మంచి కోరేవాడు అన్న నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ బీజం పడుతుంది కదా_!!
అమితంగా ప్రేమ ఎక్కడో అక్కడ స్వార్థం కూడా ప్రారంభం అవుతూ _ అది ఏ మాత్రం బెడిసి కొట్టి నా__ ప్రాణాంతకం అవుతుంది _!
_"" దాన్ని ఎలాగైనా పొందాలి _! అంతే _!;
,అది ఇంకా ఎవరికి దక్కవ ద్దు _!
నాకే దక్కాలి _!,మరెవరికీ దక్కినా చంపేస్తాను ,_!""
అనబడే . క్రూరమైన ప్రేమ నాటకాలు చూస్తుంటాం_;
ప్రేమ అంటే పగ__ ప్రతీ కారాలేనా _? కాదు కదా _!
_ అందుకే _ ప్రేమ ఎప్పుడూ " త్యాగాన్ని" కోరుతూ ఉంటుంది. ,_!
, ఆ యజ్ఞంలో , దాత,ఒక బలిపశువు అవుతాడు
, అనంతము అపురూపం అయిన ఇదే ప్రేమను భగవంతుని పట్ల ప్రదర్శిస్తే __,అద్భుతాలు జరుగుతాయి_!
వ్యక్తి పట్ల , ఇల్లు వాకిలి ఆస్తి పైన నీకున్న ప్రేమ ను. చూపితే ,, అది సంకుచిత ప్రేమ అవుతుంది _;;
, దైవం పై విశ్వాసంతో చూపే అనంతమైన ప్రేమతో నీకు ప్రశాంతత పరమానందం , జీవన సౌఖ్యం ,జీవన్ముక్తి లభిస్తాయి కదా ,__!!
' శ్రీరామ భక్తుడు , తులసీదాసు_ దైవభక్తి పొందక ముందు __
అతడు తన భార్యను అమితంగా ప్రేమిస్తూ ,వచ్చాడు _!
ఒకరోజు భార్య తన తలిదండ్రులను చూసి రావడానికి , తన పుట్టింటికి వెళ్ళి పోయింది _!
తులసీదాసు ఆమె విరహాన్ని భరించలేక_ హద్దులు మీరిన వ్యామోహం తో _అదే అర్ధరాత్రి వేళ __ఉదృతంగా పారుతున్న ఏరు ను కూడా లెక్కచేయకుండా __ దాటి, ఆమె ఇల్లు చేరుకుంటాడు _
ఆ ఇంటి తలుపు గడియ పెట్టి ఉండడం తో _ఆ రాత్రి సమయంలో ,, గోడ దూకే ప్రయత్నం లో _దానికి వేలాడుతున్న ఒక " త్రాచు పాము "ను తాడు అనుకుని దాన్ని గట్టిగా పట్టుకుని__ పైకి పా కుతూ భార్య పడుకున్న గదికి చేరుకున్నాడు_!
_ నిద్ర పోతూ ఉన్న ఆమె కలవర పడుతూ ఉన్న ఆమెకు ,,అతడిపై విపరీతమైన కోపం వచ్చింది,_!!
అతడి దుస్సాహసం , పిచ్చి ప్రేమ , చూసి అంది _!
నాపై చూపిస్తున్న
ఇదే ప్రేమ ను నీ ఆరాధ్య దైవం అయిన ఆ శ్రీరామచంద్రుని పై చూపి నీ బ్రతుకును దిద్దు కోవచ్చు కదా _!
నలుగురూ ఏమనుకుంటారు అన్న మానం అభిమానం విడిచి పె ట్టి మూర్ఖుడవయ్యావు _!
ఇంత దుర్బలుడు ,మానసిక బలహీనుడు అయిన భర్త నాకు అవసరం లేదు _;
ఇక నీ ముఖం నాకు చూపించ కు_!
ఎక్కడికైనా వెళ్ళిపో ,_!మళ్లీ ఇటు వైపు రాకు _;
అంటూ దుఖిస్తూ అతడిని బయటకు నెట్టేసి తలుపు వేస్తుంది _!
ఆమె మాట తులసీ దా సు మనస్సు కు బాణం లా గుచ్చు కుంది ,_!
మారు మాట్లాడకుండా ,
"మౌనంగా ""వెనుదిరిగాడు _!
" కామి గాని వాడు_ మోక్ష కామి కాడు _!"
అని యోగి వేమన చెప్పినట్టుగా__
,నిస్పృహ ,నిరాశ లో ఉన్న
తన కామాన్ని ఇపుడు దైవానుగ్రహం వైపు మళ్ళించాడు ,_;
మౌనం లో చేసుకున్న ఆత్మ విచారణ _తులసీదాసు ను అపర రామ భక్తుని గా మార్చింది ,_!
నేరుగా అతడు కాశీ నగరం చేరుకొని _రామ నామం కోట్ల సంఖ్యలో జపిస్తూ _ శ్రీరామ చంద్ర ప్రభువు అనుగ్రహం పొంది , "శ్రీ రామ చరిత మానస అను అద్భుతమైన_ మహిమాన్విత మైన _ రామకావ్య రచన చేసి _, రామ భక్తి సామ్రాజ్యాన్ని ఇనుమడింప జేస్తూ , జీవన్ముక్తి ని పొందాడు _!
ఒక్క మౌనం మనిషి జీవిత గతిని మార్చేస్తుంది _ కదా
" మౌనం" అనేది గంభీరమైన మహా సాగరం __అనుకుంటే అందులో కదిలే ఆలోచనలు , సాగరాన్ని మథనం చేసే మేరు పర్వతం లాంటి ది _!
మనసు మంచిదైతే _ చిలికి నపుడు _ అమృతం లభిస్తుంది _!,
రాక్షస ప్రవృత్తి తో దుష్ట చతుష్టయం వలె మంతనాలు చిలికితే _ విషం పుడుతుంది _!
మహా భారత సంగ్రామం జరగడానికి మూల కారణం_" దృతరాష్ట్రుని మౌన మే ,కదా _!
__""మౌనం కలహ నాస్తి _! _!
అంటారు విజ్ఞులు _!
రెండు చేతులూ కలిస్తే నే కదా చప్పట్లు మృోగేది _!
ఒక చేయి మౌనంగా_ కదలకుండా ఉంటే _ రెండవ చేయి ఎంత కదిలినా _ఏం చేయగలదు
చెప్పండి _?"
( ఇంకా ఉంది )
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
Saturday, July 25, 2020
మౌనం అంటే _3
మౌనం అంటే "_2
Jul 24, 2020
" మౌనంగా ఉండటం అంటే మాట్లాడకుండా ఉండటం ,_!"
"మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ఆలోచనలు వస్తాయి _!
_అదే నడుస్తూ ఉన్నపుడు కూడా ఆలోచనలు అంతగా రావు _!
కానీ నడిస్తుంటే మాత్రం వాని ధార వేగం తగ్గుతుంది_!
మనిషి ఆగితే ఆలోచనలు ప్రవాహం లా వెంబడిస్తూ ఉంటాయి _!
__అంటే మౌనంగా ఉండటం అనేది ఎంత భరింపరాని విషమ పరిస్థితి గా ఉంటుందో కరోనా పుట్టించిన ఈ ఉపద్రవం వలన మనకు ప్రత్యక్షంగా అనుభవ పూర్వకంగా తెలుస్తోంది _!
దయచేసి సమయం తీసుకొని అడగండి , మీరు నివసిస్తున్న నగరాల్లోని వీధులను , రాజధా ని రహదారుల ను ,గ్రామాలను __
ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అనీ _!?""
ఏటేటా మనం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా మన పట్టణాలలో__ విధిగా నిర్వహించే _ బోనాల పండుగ , గణేష్ నవరాత్రులు , రంజాన్ , లాంటి పండుగ రోజుల్లో_ హోరెత్తిపోయె పాటలతో__ లక్షలాది జనాల కేరింతల తో రాత్రి అని తెలియకుండా విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఉత్సవాల సందడి , హుషారు , ఆ జోరు , ఆ సంతోషం ,,ఏమైంది అని అడగండి _?
ఎందుకు ఈ మౌనం ,?ఒక నగరం కాదు
ఒక దేశం కాదు ,
ప్రపంచం మొత్తం రాత్రి వేళల్లో స్మశాన వాతావరణం లాంటి మౌనం ఎందుకు ? అని అడగండి ?
మీ వారు మీ వాడ వారు ఎవరైనా పోయారా ?
అందుకే మౌనం పాటిస్తూ ,,కన్నీటితో ,శ్రద్దాంజలి ఘటిస్తూ ఉన్నారా ?
అని అడగండి _??
కరోనా మృోగిస్తు వస్తున్న ఈ మరణ మృదంగం విషాదంతో. ప్రపంచంలో ని ప్రతీ నగరం గ్రామం. ఊరూ వాడా చిన్నబోయాయి _!
ప్రజలలో చైతన్యం_ ఉత్సాహం _ఆనందం కరువై ,జీవితం బరువై,_ఎవరి మొహాన కూడా నెత్తురు చుక్క లేకుండా , వెల వెల బోతున్నాయి కదా _!
దిన దినము ఈ నైరాశ్యం ,స్మశాన వైరాగ్యం పెరుగుతూ , బ్రతుకు పై తీపి తగ్గుతోంది _!
గతంలో, అర్ధ రాత్రి వేళ కూడా_ పబ్బులు _క్లబ్బు లు_ సినిమాలు , ఆఫీస్ లు ,బస్సులు ఆటోలు ,విమానాలు ఎంతో రద్దీగా , బిజీ బిజీ గా తినడానికి ,పడుకోడానికి టైమ్ లేకుండ ఉరుకులతో పరుగులతో జీవితం గడిచింది _!
,ఇవన్నీ ఇప్పుడు ఎక్కడి వక్కడ మంత్రం వేసినట్టుగా స్తంభించి పోయాయి _!
మౌనం బ్రహ్మ రాక్ష సిలా _ ప్రపంచ వ్యాప్తంగా అంతటా రాజ్యమేలుతు వస్తోంది _!
నేటి జీవన విధానం _ ప్రస్తుత పరిస్తితి _ఎంత దారుణంగా మారింది _ అంటే
అనాథ అనేవాడు గతంలో ,, నా అన్నవారు , ఎవరూ లేని వాడు అనుకునే వాళ్ళం _!
కానీ,
ఇప్పుడు ఆ నిర్వచనం మారింది _!
ఎవరికి కరోనా సోకితే ,,వారు అన్ని ఉండి కూడా " అనాథ "లు అవుతున్నారు _!
అంతే కాదు_!
సంఘం వారిని
వెలి వేయడం తో బాటు , ఓటరు జాబితా నుండి ,బహిష్కరణ చేస్తూ వస్తోంది కూడా_;
కరోనా తో బాధ పడేవా రి వద్దకు రావడానికి , డాక్టర్ కానీ ,పోలీస్ , సిస్టర్స్,, ఒప్పుకోవడం లేదు _!
కనీసం సానుభూతి చూపించి ,కన్నీటితో సాగనంపే భార్యా పిల్లలు బంధువులు స్నేహితులు కూడా చివరి చూపుకు కూడా నోచుకోకుండా దూరంగా ఉంటున్నారు ,_!
మృత్యు దేవతను చూస్తున్నంత భయంతో జంకుతున్నారు _;
బ్రతికి ఉండగా నే కన్నీటితో_ టా టా బై బై లు వీడ్కోలు చెబుతూ ఉన్నారు __!
ఎంత దీనంగా , మారిపోయింది
ఉన్నతమైన మానవ జన్మ ఎత్తిన జీవుడి అవస్థ _! పరమ దౌర్భాగ్య స్థితిలో అయోమయంలో భయాందోళన లో పడి దిక్కు తోచక ఉన్న మన సమాజ వ్యవస్థ __! హుందాగా దర్జాగా జల్సాగా ఉన్న కోట్లకు పడగె త్తి న ,మనిషి బ్రతుకు నేడు సత్య హరిశ్చంద్ర సినిమాలో స్మశాన వాటిక లో పాడిన పద్య సారాంశం లా నికృష్ఠమైన గతి దాపురించింది కదా _!
ఎన్ని బంగళాలు ,_ ఎంత మంది బంధువులు _,ఎంత బంగారం _అస్తి పాస్తులు _ ఎంత బ్యాంక్ బ్యాలన్స్ లు_ ఉంటే మాత్రం _ఏం లాభం చెప్పండి _? _,సమయానికి అవి తనకు అక్కరకు రాకుండా పోతే _!
ఆదరణకు నోచుకోకుండా పోతే _!"
ఇప్పుడు కరోనా నివారణ అనేది సామాజిక బాధ్యత అయ్యింది _!
చుట్టూ తిరిగే మన వారిలో కరోనా దొంగ ఎవరో ఎలా కనిపెట్టే ది ??"
__అందరూ చిత్తశుద్దితో కలిసి_ ఉద్యమం లా చేపట్టి _ స్వచ్చందంగా ,తమ ఇంటినుం డే కట్టుబాటు వ్యవస్థ ను , కొనసాగిస్తూ వస్తేనే తప్ప
__ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునే వీలు లేదు_!
మాస్క్ లు ధరిస్తూ,సామాజిక దూరం పాటిస్తూ, ఇల్లూ ఒళ్లూ పరిసరాలు శుభ్రంగా ఉంచుతూ , అప్రమత్త గా ఉంటే తప్ప
మరో మందు మాకు పరిష్కారం కనుచూపు మేరలో లేదు _!;
అలాంటి సామాజిక దృక్పథం రానంతవరకు._ కరోనా మారణ హోమం ఆగదు_!
అర్థం లేని ఈ మౌన పోరాటం కు అంతు ఉండదు _!
ఎప్పుడూ ,ఎక్కడ ఏం జరుగుతుందో , చాప కింద నీరులా కరోనా వ్యాప్తి జరుగుతోంది _!
__ , ఎంతో మంది _కరోనా చేతిలో బలి పశువు అవుతున్న దౌర్భాగ్య దుస్తితి __
నీ వరకూ రాకుండా జాగ్రత్తలు తీసుకో _!
కనపడని దొంగను పట్టాలి_ __అంటే అది నీ వల్ల కాదు _! నీవు దానిని చూడలేవు _!
నీకు కనపడ కుండా మౌనంగా ఈ చోద్యం చూస్తూ ఉన్న , ఆ భగవంతుడు ఒక్కడే __ఈ కరోనా ఆటను కట్టడి చేయగల సమర్థుడు _!
"అడగందే అమ్మైనా అన్నం పెట్టదు _!అంటారు కదా _!
అందుకే కంటికి అగుపడని భగవంతుడిని._ కళ్ళలో నింపుకొని ,మనసులో పెట్టుకొని ,గుండెల్లో దాచుకుని ,ఆర్తితో ,ఆవేదనతో ప్రార్థించడం ఇప్పుడైనా నేర్చుకో_!
ఎప్పటికైనా ఈ శరణాగతి చేయక
తప్పదు కదా _!
ఇది నీకోసం మాత్రమే కాదు _!
సకల జనుల సంక్షేమం కోసం ,_!
""సర్వే జనాః సుఖినోభవంతు ,_!""
అంటూ మనసుతో వేడుకోవాలి _!
మరణ సదృశ మైన ఈ కరోనా మహమ్మారి ""మౌనంగా"" కొన సాగిస్తున్న _ఈ హింసా పూరిత జన సంక్షోభాన్ని నియంత్రించ మని __ ఇప్పుడైనా దైవాన్ని కోరుకోవాలి కదా _!
నెత్తురు చుక్క కారకుండా _ కత్తి కటారు లేకుండా ,,మానసిక వేదనతో బాటు , శారీరిక బాధలతో నరక యాతన కు గురిచేస్తూ __ దొంగ దెబ్బ తీస్తూ ,, లక్షలాది జనాలని నిర్దాక్షిణ్యంగా చంపేస్తోంది ఈ రాక్షసి _!
కరోనా బాధితులకు నిరంతరం , త్యాగ భావంతో , వారికి సేవచేస్తు వారు కూడా__ క్షత గాత్రులు అవుతున్నారు కదా _!
ఇక కరోనా తో మరణించిన వారి పరిస్తితి మహా ఘోరంగా తయారైంది _! , ఇలాంటి పైశాచిక కృత్యం , బహుశా ఎక్కడా వినలేదు_! చూడలేదు_! జరగలేదు కూడా _!
శ వాన్ని బయట పడేయడానికి కూడా ఒక్క మనిషి కూడా ముందుకు రావడం లేదు _!
అందరికీ ప్రాణ భయం_;
పోయిన వాడు ఎలాగూ రాడు__!
"నేనెందుకు వాడితో చావ డానికి పోవాలి ,_!"
అన్న స్వార్థం _! బ్రతుకు పై తీపి __మమకారం _!
"తనకు మాలిన ధర్మం లేదు _!
అంటే ఇదేనేమో కదా _!
,_అందుకే విజ్ఞులు ఎవరూ నోరెత్త డం లేదు ,_!
"అపరాధి "వలె "_నేరస్తుల వలె _ చేతులు కట్టుకొని మౌనంగా ,శ్రద్దాంజలి ఘటిస్తూ ఉంటున్నారు_!
అంతా మౌనం _!
సమస్య మౌనంగా పెరుగుతూ వస్తోంది _!
పరిష్కారం కూడా చేతకాక _ మౌనంగా ఉంటోంది _!
కరోనా వ్యాధి రాకుండా
ఆధ్యాత్మిక చింతన_ అలవాటు చేసుకుంటే మంచిది_; _!
ప్రస్తుతానికి ఇదే పరిష్కారం _!
మనః శాంతి లభిస్తుంది
_!అంటే
మౌనమే శరణ్యం ,_!
మౌనమే దిక్కు _!
మౌనమే మానవత్వం _!
మౌనమే దైవత్వం _!
మౌనమే పరమానందం _!
మౌనమే సర్వ జన సమ్మతం _!
మౌనమే సచ్చిదానంద స్వరూపం _!
మౌనమే జీవాత్మ_!
మౌనమే పరమాత్మ _!
మౌనంగా సంచరించే పంచ భూతాల సాక్షిగా ,__
మౌనంగా ఉంటూ చుట్టూ జరుగుతున్న పరిణామాలను సాక్షిగా గమనిస్తూ _మౌనంగా నిన్ను నడిపించే
కర్మ సాక్షి ని ,__ ప్రత్యక్ష పరమాత్ముని గా భావిస్తూ__ ఆత్మార్పణ గావిస్తూ , ఆత్మ సాక్షిగా ,శరణాగతి చేస్తూ ఉండాలి _!
""ఈ కరోనా సమస్య , మాది కాదు స్వామీ _!"
కరోనా సమస్య నీది _!
పరిష్కారం చేసే బాధ్యత కూడా నీదే _నీదే _నీదే _!
ముమ్మాటికీ నీదే ప్రభూ_!
హే పరమేశ్వరా _;
హే దీన బాందవా_!
హే ఆపద్బాంధ వా_!
శరణు_ శరణు _శరణు_!
____ (ఇంకా ఉంది )
___ స్వస్తి _ !"
హరే కృష్ణ హరే కృష్ణా _!
((ఇంకా ఉంది )
హరే కృష్ణ హరే కృష్ణా _!
కరోనా భయం
Jul 23, 2020
" నాకు భయం లేదు_" అంటూ ఇన్నాళ్లూ డాంబికాలు పలికిన ప్రతీ వాడికి ,ఇపుడు పుట్టింది కరోనా భయం _;!
""నేను నీ తాత కు_తండ్రికి ఆఖరికి
ఆ దేవుడికి కూడా భయ పడను _! అన్న వాడికే వణకు పుట్టించిన భయం _!
నన్ను చూస్తే భయాని కే భయం _!"
ఇదంతా మొన్నటి మాట _!"
ఇపుడు అంతా భయం మయమే_!
నిన్ను చూస్తే భయం _!
నన్ను నేను చూసుకుం టే భయం _!
మనిషిని మనిషి నమ్మలేని భయం _!
భర్తను భార్యను విడదీస్తున్న భయం _!
అనుమానం పెనుభూతం కాదు
అనుమానం మహమ్మారి కరోనా అన్న భయం _! _!
అందరికీ భయమే _;
ఏ వస్తువును ముట్టుకున్నా భయం _!
,లేదా పట్టుకుంటే భయం _! అసలు
వస్తువు ను చూస్తేనే భయం_!
వస్తువు ను బజారు నుండి తేవా లన్నా భయం _!
దాన్ని తాకాలన్నా భయం_!
బజార్ లో ఎవరిని చూసినా భయం _!
ఎక్కడికి వెళ్ళినా భయం _! ఏది కొన్నా, భయం _!"
ఇంటికి ఎవరు వచ్చినా భయం _!
దైర్యం చేసి మాస్క్ తీసి చూడాలంటే భయం _!
మాట్లాడితే భయం _!
మాస్క్ వేయక పోతే భయం _;
మాస్క్ తీయాలంటే భయం_!
గట్టిగా ఊపిరి పీల్చడం భయం _!
కూతురి పెండ్లి నిశ్చయం అయితే భయం _!
సంబంధం కోసం తిరగాలంటే భయం _!
రాత్రి మోషన్ అయితే భయం _!
డాక్టర్ వద్దకు వెళ్తే భయం
వెళ్లకుంటే భయం _;
టెస్ట్ లు చేసు కోవాలంటే భయం _!
చేసుకోకుం టే భయం _;
టీవీ లు చూస్తే భయం _!
డైలీ పేపర్ చూడ భయం _!
పెండ్లికి బంధువులను పిలవడం భయం _!
వారిలో ఎవరికి పాజిటివ్ ఉందో అని భయం _!
వచ్చిన వారిని పలకరించడం భయం _;
వారు పని అయ్యాక వెళ్లకపోతే భయం _!
పాపం అని పక్కిం టీకి వెళ్తే భయం _!
మామూలు జ్వరం వస్తె కూడా భయం _!
దగ్గు వస్తె భయం _!
ఎవరు దగ్గినా ,తుమ్మినా ,, వాంతి అయినా భయం _;
చేత కాక పోతే భయం _;
తల నొప్పి వస్తె కూడా భయం _;
బీపీ షుగర్ టెస్ట్ కోసం_ హాస్పిటల్ వెళ్తే భయం _;
కి రాణం కొనడం _భయం _!
కూరగాయలు తేవడం
భయం_;
పక్కింటి వాడు మాములుగా వృద్దాప్యం తో చనిపోయినా కూడా భయం _!
కరోనా తో చస్తే , ప్రేతాత్మ లకు కూడా భయమే _!
దగ్గరకు రావు ,రానీయవు కదా _!
శవాన్ని కాల్చాలంటే భయం ,_!
స్మశానం తీసుకెళ్లాలి అంటే భయం _!
దగ్గరి వారు దూరం ,
దూరం వారు దగ్గర అవుతుంటే భయం _!
శవం దగ్గరకు పోను భయం _!
చూడ భయం _!
మనసారా ఏడవడం కూడా భయమే _;
ఆత్మీయు లైనా_
కన్న వారైనా __
ఎవరైనా _
కరోనా సోకిందని తెలిస్తే చాలు __!
తిన భయం _;తాగ భయం _!
నిద్రపో ను భయం _!
తద్దినాలు పెట్టడం కూడా భయం_!
ఏ శుభ కార్యం తలపెట్టినా భయం _!
పట్ట పగలు,తన ఇంటి తలుపులు బిగించుకొని , ఎవరికి కనపడకుండా , దాక్కుంటూ , బిక్కు బిక్కు మంటూ , వెఱ్ఱి గా , గోడల వంక చూస్తూ బ్రతికే బతుకు చూస్తుంటే భయం _!
బాధ చెప్పుకునే దిక్కు లేదని భయం ,_!
ఫోన్ లు టాబ్ లు చూస్తుంటే భయం _!
చూడకుంటే భయం _!
అంతం లేని కరోనా చావులు చూస్తుంటే భయం_!
ఎక్కడో కాకుండా నీ ఊరిలో నీ నగరంలో నీ దేశంలో వేలల్లో చస్తున్న కరోనా వార్తలు వింటూ ఉంటే భయం _!
బ్రహ్మ వద్ద వరం అడిగి తెచ్చుకున్న దేమో _ఈ కరోనా __ దేనితో చావు లేకుండా _!
మందు లేకుండా _!
అన్న వార్తవింటుంటే భయం _!
ఏ ఛానల్ చూసినా , ఎవరి నోట విన్నా,, ఏ పేపర్ చూసినా , దేవుడి స్మరణ కాకుండా దిక్కుమాలిన కరోనా చావుల గురించిన నిజాల గురించి న భయం _;
కరోనా చావులకు దేశాలు ,పట్టణాలు పోటీ పడుతూ ఉంటే _ ఒంట్లో వణకు పుట్టించే ,భయం _!
, ఇండ్లు భవనాలు కట్టడం భయం _!
రెక్కాడితే డొక్కాడని పేద కూలీలను చూస్తుంటే భయం _!
ఏ పోలీస్ ను చూసినా_
ము న్సి పాలిటి పారిశుధ్య కార్మికులను చూసినా__
డాక్టర్ లను __సిస్టర్ లను చూసినా __భయం భయం _;
బస్సు ఎక్కడం భయం _!,ఆటో ఎక్కడం ఇంకా భయం _!
ఉన్న ఊరు విడిచి వెళ్ళడం భయం .._;
ఇంటి గడప దాటడం భయం _!
పిల్లలను బయట తింపడం భయం _;
శ్రావణ మాసంలో నోముల భయం _!
వ్రతాలు చేయటం భయం _;
పితృదేవతల ముక్తి కోసం తద్దినాలు పెట్టడం భయం_;
చచ్చిన వారికి కర్మలు చేయడం భయం _;
కరోనా తో చచ్చిన వాడి అంత్య క్రియలు చేయడం_ అమ్మో చాలా భయం_!
శ్రాద్ధ కర్మలు చేయడం భయం_!
ఒంటరిగా ఇంట్లో ఉంటే భయం _!
నాలుగు గోడల మధ్య వాటిని చూస్తు ఇలా ఇంకా ఎన్ని రోజులు , రోజులు గడపాలో కదా _! అని భయం _!
చిన్న పిల్లలు బయట కెళ్లకుండ ఇంటిలోనే బంజేరు దొడ్డి లో నెలల తరబడి , బందీలుగా ఉంచాలంటే భయం _!
వారిని అదుపు చేయాలంటే భయం _;
వారి ప్రశ్నలకు జవాబు చెప్పాలంటే భయం _;
వారి తిండి భయం _!
వారి ఆరోగ్యం భయం_!
పెద్దవాళ్ళు ఉంటే చాలా భయం _!
వారి ఆరోగ్యం భయం_;
వారి సంరక్షణ ఇంకా భయం _;
కన్న పిల్లలు దూరం ఉంటే భయం _;
భార్య లేని భర్తకు భయం _!
భర్త లేని భార్యకు భయం _! ఒంటరి జీవితం భయం _!
బయట కు వెళ్లి సామాన్లు తెచ్చే దిక్కు లేకుండా పోతే ముసలి ప్రాణాలు బయటకు వెళ్లాలంటే భయం _!
వెళ్ళకుం డా ఉండాలంటే భయం _!
అందరూ ఉండి , ఎవరూ అక్కరకు రాకుండా పోతూ ఉన్న కరోనా మహమ్మారి విలయ తాండవం చూస్తుంటే భయం _!
అన్నీ ఉండి ఆదరణ మాటకు నోచని అనాథలకు భయం _!
ఇలా చెపుతూ పోతూ ఉంటే , రాయడానికి కాగితాలు చాలవేమో అని భయం _;
ప్రేమ కు ఆప్యాయతలకు ఆత్మీయతకు నోచుకోకుండా , దూరంగా విదేశాల్లో తల దాచుకుని__ ఉంటున్న తమ వారిని_ తల్చుకుం టూ ఉంటే దుఖం _ భయం _!
దిన దిన గండం
నూరేళ్ళ ఆయుస్సు వలె ,
రోజూ చస్తూ బ్రతుకుతూ గడుపుతూ ఉన్న ఈ యాంత్రిక జీవితా న్ని చూస్తే భయం _!
_"ఓ దేవుడా ,_; బ్రతికి ఉండగా నే మా బ్రతుకు ను భయంకరంగా మారుస్తూ ఉంటున్న నీవు_ ఎందుకు కరోనా ను పంపించావు మా పైకి _??""
, మా భయాన్ని పోగొట్టి
భయం నుండి విముక్తిని ప్రసాదించ లేవా _?
పరమాత్మా _!
జంతువులకు లేని ప్రాణ భయం ___!
మాకెందుకు కలిగించావూ
తండ్రి_??""
దయచేసి ఈ కరోనా పీ డ ను తొలగించి __ మా భయాన్ని పోగొట్టు ప్రభూ_!!'"
మా చేత కాదు స్వామీ_ కరోనా ఆగడాలు ఆపడం _!""
నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు _లేదు_ లేదు_!
అందుకే __
నీకు సాష్టాంగ ప్రణామం చేస్తూ వేడుకుంటూ ఉన్నాం_!""
హే పరాత్పర _!
దీన బాందవా ,_!"
తప్పులుంటే మన్నించి రక్షించు _!""
ఈ దీనులను __
నీ బిడ్డలను __
ఆర్తులను __
కాపాడు _ తండ్రి ,_!""
శరణు _!
హే భగవాన్ _!""
శరణు _!"
స్వస్తి_!"
హరే కృష్ణ హరే కృష్ణా _;""
,
మౌనం అంటే
Jul 22, 2020
భగవద్గీత లో గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా
మనసే మిత్రుడు ,మనసే శత్రువు కూడా _
మనసు అంటే ఆలోచన లు
మౌనంగా ఉన్న కూడా లోన తలచే చెడు ఆలోచనలు మనిషిని పాపాత్ముడు గా నూ ,మంచి ఆలోచనలు వస్తె పుణ్యాత్ముడు గా మారుతూ ఉంటాడు ,,
అందుకే మౌనంగా ఉండటం ,అనేది తన చుట్టూ జరిగే పరిణామాల పై ఆధార పడి ఉంటుంది,,
దానికి అనుకూలంగా ఆలోచనలు కదులుతూ ఉంటాయి ,,
మౌనం ప్రశాంతత నూ ఇస్తుంది
ప్రళయాన్ని తెలుస్తుంది ,
__మౌనంగా నే ఎదగ మనీ మొక్క నీకు చెబుతోంది ,
ఎదిగిన కొద్దీ ఒదగ మనీ అర్థ మందులో ఉంది ,_!""
అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు ,
మౌనం అనేది మనస్సు యొక్క భాష ,_!
మౌనం అంటే మాట్లాడకుండా ఉండటం మాత్రమే అనుకుంటాం _! ,
మాటలు లేకున్నా. ఆలోచన పరంపర ను ఆపలేము కదా ,
_""మాట్లాడటం అనేది వెండి_"" అయితే
"మౌనం అనేది బంగారం _!" అంటారు
మౌనంగా ఉండటం ఎంత భయంకరమైన వ్యవస్థ నో అనుభవిస్తే తెలుస్తోంది
ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్నలకు విద్యార్థి ఏ సమాధానం ఇవ్వకుండా ,నిశ్శబ్దంగా ఉంటే ,ఉపాధ్యాయుడికి పిచ్చి కోపం వస్తుంది
,అలాగే ఎదుటివాడు వదురు తూ వుంటే , వినే వాడు ఏమీ మాట్లాడకుండా ఉంటే ఇక జన్మలో వాడితో మాట్లాడకూడదు అనిపిస్తుంది
భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం మాట్లాడటం _
ఎదుట కళ్ళ ముందు జరిగేది అన్యాయం అని తెలిసి కూడా ప్రతిఘటన చేయకుండా " మౌనం "గా ఉంటే కూడా నేరమే కదా _!
అన్యాయం చేసినవారే కాదు. జరిగే ,అన్యాయం చూసేవారు కూడా అంతే నేరం చేసినవారు అవుతున్నారు
ద్రౌపది వస్త్రాపహరణం సమయం లో ,శక్తి ఉండి కూడా మౌనంగా ఉన్న భీష్ముడు ద్రోణుడు లాంటి మహానుభావులు కూడా మహాభారత సంగ్రామం లో నిర్దాక్షిణ్యంగా వధిం పబడ్డారు _!
మూగ వాడు ఈ భాగ్యానికి నోచుకొరు కదా ,_! ఎల్లప్పుడూ మౌనంగానే ఉంటాడు _!
మాట్లాడేవా రి మధ్య మౌనంగా మూగవాడు గా ఉండడం ఎంత భయంక రంగా ఉంటుందో అనుభవిస్తే తెలుస్తోంది
మాట్లాడటం విలువ తెలియాలంటే ఒకరోజు అంటే 24 గంటలు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి
అప్పుడు తెలుస్తుంది ,పాపం మూగవారి ఆవేదన , దీనావ స్థ ,ఎంత భయంకరమైన వ్యవస్థ నో _!
మాటలతో నే _మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది ,_!
కొందరు నయవంచకులు ఉంటారు
తేనె పూసిన కత్తి వలె తియ్యగా మాట్లాడుతూ వెనక వైపు గోతులు తీస్తూ ఉంటారు ,_!
ఇలా మాటల తో ఎన్నో, ఇబ్బందులు _!
నాలుక ను నియంత్రిస్తూ _ మెదడుకు పదును పెట్టవచ్చును
ఎక్కువ మాట్లాడితే
వదురుబోతు అంటారు
తక్కువ మాట్లాడితే నంగనాచి అంటారు
మౌనంగా ఉంటే అమాయకుడు అంటారు
మొత్తానికి ,మాటతో నే శత్రువైన మిత్రువైన మంచి చెడూ , అనేక వ్యవహారాలు ,లావాదేవీలు ఉంటాయి
ఫోన్ లు ,మైక్ , స్పేకెర్ ఇవన్నీ మాటలతో కోటలు కట్టే సాధనాలు _!
ఇక మౌనం అంటే ఏమిటి?""
అన్న విషయం చూద్దాం ,
మహాత్మా గాంధీ గారు వారానికి ఒక రోజు మౌనంగా ఉండేవారు _!
అవసరం ఉంటే పలక పై రాసి చూపించే వాడు _!
మనసును నియంత్రిస్తూ ,ఆయన తన లక్ష్య సాధనలో విజయం పొందాడు ,
ఋషులు మహా మునులు ,భక్తులు మౌనంగా ఉంటు తమ ఆలోచనలను కేవలం పరమాత్ముని పై సంధించి మోక్షాన్ని పొందారు
అందుకే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మనస్సును అదుపులో ఉంచుకుని, గమ్యం కేసి సాధన చేస్తూ వెళ్ళాలి
మౌనం ఒక తపస్సు ,
మౌనం ఒక దీక్ష
ఒక యజ్ఞం ,ఒక వ్రతం ,ఒక సాధనా యంత్రాంగం
మౌనంగా ఉండాలంటే జ్ఞానం ముఖ్యం ,
సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు ,జ్ఞానం తప్ప
అందుకే మరణా వస్త సమయంలో కూడా జ్ఞానాన్ని మరవకూడదు
జ్ఞానం ,అత్మ సాక్షాత్కారం వల్ల మాత్రమే ప్రాప్తిస్తుంది
ఆ పరమాత్ముని సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం గురించిన జ్ఞాన సముపార్జన కొరకై మన ఋషిగణం వేలాది సంవత్సరాలు మౌనంగా ఉంటూ ఘోర తపస్సు చేసి మనకు స్మృతి శృతి పురాణాలు అనుగ్రహించారు ,
మౌనం లో మధురానుభూతి పొందవచ్చును
పరమాత్మను తదేక ద్యానం తో ఆరాధిస్తూ ,, ఎక్కడికి వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట కూర్చుండి భువి నుండి దివికి తప్పించుకునే అవకాశం ఈ మౌనం అనే అద్భుతమైన అమోఘమైన , పరమానంద కరమైన సుషుప్తి అవస్థ లో ఉంటుంది _!
మౌనం అర్థాంగీకారం గా సూచిస్తారు ,
అంటే ఎదుటివాడు చెప్పిన దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు అన్నమాట
మౌనం తో విశిష్టమైన ప్రయోజనాలు ఉన్నాయి ,,
ఋషులు మునులు తమ తపస్సు ను వేలాది సంవత్సరాలు మౌనంగా ఉంటూ చేశారు ,
మనస్సును ఆత్మతో అనుసంధానం చేయాలంటే మౌనంగా ఉండడం తప్పని సరి,
చెప్పేది ఒకటి ,చేసేది మరొకటి చేయడం అంటే మనసు అదుపులో ఉంచుకుని శక్తినీ కోల్పోయిన ట్టె కదా
నిజానికి మౌనంగా ఉండటం అనేది చాలా కష్టమైన పని.
యోగ విద్య నభ్యసించుటకు , మౌనం గా ఉండటం ప్రధానం
మాట్లాడ వద్దు , మనస్సును ఎటూ పోనీయ వద్దు
మొదటిది మొదట్లో ఇబ్బంది అనిపించినా , అలవాటు అయ్యాక ,,సాధన చేస్తూ,, మౌనంగా ఉండవచ్చును
కానీ మనసును ఎటూ పోనీయకుండా ,ధ్యేయం వైపు మళ్ళించడం అనేది కష్ట తరమైన విషయం
,శ్వాస పీల్చడం ఒకటి రెండు నిముషాలు ఆపవచ్చు
కానీ మనసును చలించకుండా ఆపడం అనితర సాధ్యమైన విషయం ,
స్థిరంగా ఉండకుండా అనవరతం చలించే దానినే మనసు అంటాము ,,
అసలు ఈ. మనసు అంటే ఏమిటీ ? ఎలా ఉంటుంది ? ఎక్కడ ఉంటుంది ? దాని స్వరూపం ఏమిటీ !? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు _!
ఎందుకంటే,మనసు అనేదే లేదు , _!
మనసుకు రూపం ఆలోచనలే ,
ఏ ఆలోచన చేస్తే మనసుకు ఆ రూపం వచ్చేస్తూ ఉంటుంది ,
అరటి పండు గురించి ఆలోచిస్తూ ఉంటే మనసుకు అరటి పండు ఆకారం అంటే స్వరూపం వస్తుంది
ఎక్కడో అమెరికా లో ఉన్న స్నేహితుడి గురించి ఆలోచిస్తూ ఉంటే మనసుకు అదే ఆకారం అదే స్వభావం గుణం , స్పందన ,కలుగుతూ ఉంటాయి కదా
, అనగా మనసు ఎప్పుడూ మారుతూ ఉంటుంది ,
కోతిలా ఒక విషయం పై నుండి మరొక విషయం పైకి గెంతుతూ మారుతూ వుంటుంది ,
క్షణాల్లో రంగు రూపు ,స్వభావం , ప్రవృత్తి మారుతూ ఉంటాయి
మనసు ను బట్టే మనిషి గుణం నడక స్వభావం ,వ్యక్తిత్వం బయట పడుతూ ఉంటాయి
అందరూ మనుషులే ,అందరికీ మనసు ఉంటుంది
ఏ మనిషీ ఎలాంటి వాడో తెలిపేది అతడి మనస్సే
అతడి మాట ను పలికిం చేది, పాటలు పాడించేది , పనులు చేయించేది ,నడక నేర్పేది ,, తెలివి తేటలు ప్రదర్శించే ది అంతా మనస్సు వల్లనే
నిజానికి మనస్సు మహావిష్ణువు వలె విశ్వ రూపం దాలుస్తుంది
వాయు వేగంతో ఎక్కడో ఉన్న బంధువు గురించి ,సెకండ్ల వ్యవధిలో విచారం చేస్తుంది
130 కోట్ల ప్రజానీకం భారతీయులు మన దేశంలో ఉన్నారు
వారిలో ఉన్న మనసులు వేరు
అంటే వారి ఆలోచనా విధానం వేరు
ఒకే సినిమా ను ఒక వేయి మంది చూస్తూ వుంటే వేయి రకాల భిన్నమైన అభిప్రాయాలు ప్రకటిస్తూ ఉంటారు
అంటే ఆలోచన విధానం లో అన్ని తేడాలు ఉంటాయి అన్నమాట ,
ఎందుకు ఇన్ని తేడాలు అంటే
ఒకే సమాధానం
వారి కర్మలు వేరు వేరు గ ఉంటున్నాయి
( సశేషం )
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...