May 9,2019
దినకరుని ఉదయ అస్తమయ, పర్యటనలో, జగతిలో, అనుక్షణం మార్పులు, చేర్పులు, తీసివేతలు,, మారుతున్న ప్రకృతి సౌందర్యం తో బాటు,,దినచక్రం, పగలు రాత్రులు, మాసాలు, సంవత్సరాలు, ఒక క్రమ పద్దతిలో మారుతూ నే ఉన్నాయి,,, ప్రాణుల జననం మరణం, అనవర తం జరుగు తూ ఉన్నాయి. అలాగే, ప్రాణులలో,, తల్లీ దండ్రులు,భార్యా భర్త, బందువులు, ఇవన్నీ అనుకోని విధంగా సంక్రమి స్తున్నాయి, ఇప్పుడు చూసిన మనిషి మరో నిముషంలో ఉండటం లేదు. గతం ఎలాగో, భవిష్యత్తు కూడా చేతిలో లేనిది. ఏ సంతోషం, సౌఖ్యం అయినా వర్తమానం లోనే అనుభవించాలి,, ఈ ఊరిలో, ఈ నగరంలో పుట్టాలని కోరుకోని ఎవరూ జన్మ ఎత్తలేదు. అలాగే, ప్రవహించే నదిలో కలుసుకునే కట్టెల వలె, ఎవరు ఎంతకాలం,దగ్గర అవుతారో, తెలీదు,! పుట్టిన ప్రతిదీ, చెట్టైన, పుట్టైన, చావడం ఖాయం, ! తిరిగి వెళ్ళేటపుడు, పిరికెడు మట్టిని తీసుకెళ్ళ ము ,అని తెలిసీ కూడా, మనిషి ఇంతగా రాగద్వేషాలు ఎందుకు పెంచుకుంటా డో, కదా! ఏ విష్ణుమాయ, ఈ సత్యాన్ని మరిపిస్తుందో అర్థం కాదు!". నాకంటే పెద్ద వారు, పిల్లలు, బందువులు అందరూ పోతారు ,,కాని నేను మాత్రం ఉంటాను,!" అనే బ్రతుకు పై దురాశ, చావదు, కష్టాలు, బాధలు, బరువులు, ఎన్నైనా ఎత్తడం చేస్తాడు కానీ, తన అదుపు, ఆజ్ఞ, జ్ఞానం, సత్తా తెలివి ముందు,, విది విధానాలను, జరిగే విపరీత పరిణామాల ను, ప్రకృతి వైపరీత్యాలను అపలే డు,Heart attack,cancer,accidents,, అనాధ ఆశ్రమాలు, నరకాన్ని తలపించే రోగాల తో నిండిన హాస్పిట ల్స్, ఇలా ఎన్నో హృదయ విదారక ఘట్టాలు సినిమా, టీవీ, నిజజీవితం లో చూస్తూ కూడా, ఆత్మజ్ఞానం, కలగడం లేదు, ప్రవర్తనలో పరివర్తన రావడం అసలే లేదు, అదీ, తనదాక వస్తె తప్ప,!!,, ఏది మన చేతిలో లేదు, అనడమే కానీ, ఆ "ఏది" అనబడే మూలాన్ని గుర్తిం చే ప్రయత్నం చేయడం లేదు, అందుకే ఇన్ని కోపాలు ,తాపాలు, ఈర్ష్యా,, పగ,! ఇదంతా ఎందుకో, దీనికి మొదలు తుది, ఎవరికి తెలియదు, కాని, మనకు అర్థం కానిది ఏదో ఉంది, ! అది ఇందర్ని ఆడిస్తోంది, !ఏడిపి స్తూ ఉంది. !ఎగిరిస్తు, కింద పడేస్తూ, నాటకాలు ఆడిస్తోంది,!, అది దేవుడో దెయ్యమో, మనకు తెలియదు ..కాని దాని చేతిలో మనం కీలు బొమ్మల ము,, అని మాత్రం తెలుసు .. ఇన్ని తెలిసి కూడా తప్పులు చేస్తూ పోతూ ఉండడం, మనిషి చిత్రమైన అర్థం కానీ, విపరీత తత్వం, జంతువును అర్థం చేసుకోవచ్చు కానీ,, మనిషి తత్వం ఆ దేవుడికైనా అంచనా వేయలే డెమో. రోజుకు ఎన్నో మార్పులు ఈ శరీరం లో,!, పెరుగుదల, తరుగుదల, చావు పుట్టుకలు, దేనిని ఆపలేం,! కాలం ఆగదు,! పనులు చేయడం ఆగదు,! కర్మ ఫలితాలు ఆగవు, ఏది కూడా ఆగవు,,! తిండి నిద్ర,, భోగం, దుఖం, సుఖం, అన్నీ ఉన్నాయి అనుకుంటే ఉంటాయి,! లేదు అంటే లేదు. !కళ్ళు మూసుకుంటే అంతా శూన్యం!, నిద్ర పడితే, అంతా మిథ్య,,! దేహం లోని అవయవాలు, నరాలు, రక్త నాళాలు ఎముకలు, కండరాలు ఎన్నో, అసంఖ్యాకంగా మనలో ఉన్నాయి, అవన్నీ సక్రమంగా ఒక్క బోల్ట్, స్క్రూ, పట్టి లు లేకుండా, ఎవరూ గట్టిగా బిగించే పని లేకుండా, జారిపోకుండా, ప్రక్కకి జరగకుండా, గట్టిగా పట్టుకొని ఉన్నదెవరు,? నడిచినా పరుగెత్తిన, తలక్రిందులు చేస్తూ ఉన్నా అవయవాలు స్థాన మార్పు చెందవు. కదా! గుండె పనిచేయడం, ఊపిరి తీయడం, రక్త ప్రసరణ, కిడ్నీ లు, ఇలా వాటి పని అవే చేస్తూ పోవడం విచిత్రం,! తిన్న ఆహారం జీర్ణం కావడం, మల మూత్ర ములు, వెళ్లిపోవడం, ఇంద్రియాలు బలవత్తర ప్రభావం తో, బుద్దిి చేడు దారి పట్టుతూ ఉండటం, బొమ్మల్లా చూస్తూ, తప్పు అని తెలిసినా ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉండడం శోచనీయం,! ఇదంతా మనకు తెలీకుండా, మనలో ఉంటూ, మనకోసం శ్రమించే అంతర్యామి కి ఎన్నిసార్లు కృతజ్ఞత లు సమర్పించిన కూడా సరిపోదు కదా. ! ముఖ్యంగా ,, నేటి ఆధునీకరణ వ్యామోహంలో, మనచేత దుర్వినియోగం చేయబడే ఫోన్లు, టీవీ లు, కంప్యూటర్ ల ధర్మమా అని "బంధాలు" దూరమవుతూ ఉన్నాయి, అనుబంధాలు, అనురాగాలు, మాటల్లోనే కనిపిస్తూ, పిల్లలను తలిదండ్రలకు దూరం చేస్తూ, వారిని అనాధ ఆశ్రమాల పాలు చేస్తూ ఉన్నాయి, చదువూ ఉద్యోగం, వ్యాపారం, విదేశీ యానం పేరు తో మానవతా విలువలు అడుగంటి పోతున్నాయి, "మమ్మీ ,డాడీ "ల విదేశీ సంస్కృతి, ఆంగ్ల భాషావ్యామోహం తో, సనాతన ధర్మాన్ని, ఆచారము సంప్రదాయము , పురాణ వాంగ్మయం, భగవద్గీత లాంటి సద్గ్రందాలను చదవడం లాంటి సదాచారాన్ని , వాని విలువలను,పాటించడం లేదు,, నేటి విద్యార్థులు, యువతరం, ఫోన్, లకు బానిసలై, కన్నవారికి, ఉన్న ఇంటిలోనే పరాయి వారవు తున్నారు,,, అలా వ్యక్తిత్వం లేకుండా యాంత్రిక జీవనం గడప కుండా, మనిషి తనలో నిద్రాణంగా ఉన్న దైవిక శక్తిని జాగృతం చేయాలి. !, భౌతిక ప్రపంచం లో, వ్యాయామం, యోగా, కరాటే, జిమ్నాస్టిక్స్, లాంటి అద్భుతమైన విన్యాసాలకు తన శక్తినీ బయటకు బహిర్గతం చేస్తూ ధార పోస్తున్నాడు,, అదే శక్తిని అంతరంగం లో అన్వేషించి చూస్తే,అసాధారణమైన ప్రజ్ఞా పాటవాలు లభిస్తాయి కదా, ! ఇదే శక్తి నీ అత్మ పరిశీలన కు ఉపయోగిస్తే, మనిషి సంకల్ప బలం తో, సాధనా పటిమ తో, తాను పరిమితి గల దేహాన్ని విడిచి, అపరిమిత ము, అద్వితీయం, అపురూపం అయిన దైవిక శక్తితో, అత్మ బలం తో, జ్ఞాననేత్రం లాంటి మూడవ కన్నుతో ప్రపంచాన్ని మరో కోణంలో చూస్తాడు. !దేహాన్ని ఆయుధంగా మార్చి కరాటే లాంటి అద్భుతమైన యోగ ప్రక్రియ ద్వారా, శక్తిని కేంద్రీకరించ డం ద్వారా ప్రదర్శించి విధంగానే,, అంతరంగంలో ఆత్మలో మనసుని బుద్దిని నిలిపి ధ్యాన యోగం తో, ఆధ్యాత్మిక జ్ఞానంతో, మానవాతీత శక్తుల ను,సాధించవచ్చును .. స్వామి వివకానందుని వలె, రమణ మహర్షి వలె, రామకృష్ణ పరమహంస వలె, షిర్డీ సాయిబాబా వలె, పుట్టపర్తి సత్యసాయి వలె ప్రకాశవంతం, జ్ఞానవంతము, ప్రతిభా మహిమా వంతము, అయిన దివ్యమైన శక్తులను సాధించి, దానిని మానవ, సేవ కోసమే కాకుండా మాధవ సేవగా వినియోగించ వచ్చును.! వేదకాలం లో మహర్షులు, సిద్దులు, యోగులు, అలాంటి యోగ సాధన తోనే దివ్యజ్ఞాన ము పొందారు, ఎక్కడ ఏం జరిగేది ఆ సిద్దితో గ్రహించారు, ఎక్కడికైనా తమ ఆత్మబలం తో, నేటి అఘోరా ల వలె వాయువేగ, మనోవే గంతో వెళ్లగలిగారు, గాంధీ జీ లాంటి మహాత్ములు, భక్త పోతన లాంటి మహా కవులు, త్యాగరాజు లాంటి సంగీత కారులు, సుబ్బులక్ష్మి లాంటి గాయకులు, అన్నమయ్య లాంటి సంకీర్తనా చార్యులు, మీరాబాయి లాంటి అపర శ్రీకృష్ణుని భక్తురాలు,, ఇంకా ఎందరో మహానుభావులు ,, తమ అంతర్మథనం ద్వారా సిద్ధులను పొందారు. రాముడు, కృష్ణుడు లాంటి అవతార మూర్తుల చరణ కమలాల స్పర్శతో పునీతమైన,, గంగ కృష్ణా, యమునా, గోదావరి లాంటి స్వా దు జలాల ప్రవాహంతో" సుజలాం, సుఫలాం "అంటూ ఆసేతు సీతాచ లం సస్యశ్యామలం చేస్తూ, కమ్మని తీయని త్రాగు నీటిని అందిస్తూ ప్రవహిస్తూ ఉన్న, మన పరమ పవిత్రమైన, పుణ్యభూమి, భారతావని లోనే ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉండడం, మనం భారతీయులుగా గర్వింప దగిన విషయం,,! ప్రాణులలో అంతర్యామిగా మన శరీరంలో సాక్షిగా ఉంటూ, జీవితంలో మానసికంగా శారీరికంగా ఆనందంగా అన్నీ అనుభవించడానికి కావల్సిన శక్తి నీ, చైతన్యాన్ని మనకు అనుగ్రహి స్తున్న ఆ పరమాత్ముని, ఈ జీవాత్మ తో అనుసంధానం చేస్తూ, ప్రాపంచిక ప్రయోజనాలతో బాటు, పారమార్థిక భావ సంపదను సముపార్జించి , సంసార సాగరం లో ఎదురయ్యే కష్ట సుఖాలు, లాభ నస్టాలు, జనన మరణాలు వంటి ఈతి బాధలకు అతీతంగా ఎదుగు దామ్,,!, భగవద్ భక్తిని, దైవం పై విశ్వాసాన్ని పెంచుకుందాం,! మౌనంగా, తదేక ధ్యాన చిత్తం తో, శక్తిని అంతా కూడగట్టుకొని, ఆత్మలో పరమాత్ముని దర్శించే ప్రయత్నం చేద్దాం,,! మారుతున్న సమాజం, సంస్కృతి, నాగరికత లోని,దుష్పరిణామాల ను కేవలం మన ఆత్మబలం తో, మనోనిబ్బరం,, దైవం పై అచంచమైన నమ్మకం తోనే సరిచేయ వచ్చును,,!" కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు, మహా పురుషులు ఔతారు,!" అన్న మాట సత్యం.! మనిషి,మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఎదగాలంటే యోగాధ్యయనం అవసరం, !జీవుడు బుద్ధితో ఆత్మలో లీనమై అంతర్యామినీ దర్శించే భాగ్యం కలగాలంటే, అంతః కరణ శుద్ది, ఆత్మశుద్ధి,, చిత్తశుద్ది అవసరం ! దానికి తోడు దైవకృప, గురు కటాక్షం లభించాలి..! అప్పుడు మాత్రమే, పరమాత్మ వైభవం అనుభవం లోకి వస్తుంది,! మనిషి నిజమైన శక్తి శాలి అవుతాడు,, అనుకున్నది సాధిస్తాడు కూడా. ! కావున, అందరం భగవద్గీత ను చదువుదాం, , సాక్షాత్తు శ్రీకృష్ణ భగవనుడే స్వయంగా తానే మానవాళి ఉద్దరణ కోసం అందించిన పరమ యోగ సాధన సంపత్తి నీ గ్రహిం చుదాం. ! భక్తి ధ్యాన, యోగా ద్యాయాలు, ఆత్మానుభూతి పొందుతూ ఆకళింపు చేసుకుందాం,,! దేహ భ్రాంతిని వదలు దాం.! దేవుడిచ్చిన ఈ మనిషి జన్మ ఎంత మహిమాన్విత వరమో,తెలుసుకుందాం !, మూడవ నేత్రంతో, పరమాత్మ వైభవాన్ని, ఆత్మలో దర్శిస్తూ రమిస్తూ,పరమానందాన్ని పొందుదాం,!" అహం బ్రహ్మో స్మి,!" అన్న "తత్వమసి ""జ్ఞాన ప్రకాశంతో జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా, సంతృప్తి కరంగా , సంతోషంగా, సకల జనుల హితంగా, గడుపు దాము,,! "హే పరమేశ్వరా;!, మాకు నీ దర్శన భాగ్యం సద్బుద్ధి నీ, సన్మార్గాన్ని, సత్సంగ భాగ్యాన్ని, నీ పై తరగని నిశ్చలమైన బుద్దిని కరుణిం చు తండ్రీ, దయానిధి,,సర్వాంతర్యామి , దేవాది దేవా,, శరణు, స్వామీ, నారాయణా శరణు, జగదీశ్వర, శరణు. హరే కృష్ణ హరే కృష్ణ ! స్వస్తి!"
Thursday, May 9, 2019
విష్ణుమాయ
విశ్వ మూర్తి
శాంతి కపోతం, !స్వేచ్చా విహంగము,, !తెల్ల దనం స్వచ్చత, పవిత్రత,! నీలం రంగు, ప్రశాంతత,,!! కలిసి అనందం, అందం,! జీవాత్మకు పరమాత్మ తో గల అనుబంధం!!, ఎంత గొప్పవాడు భగవంతుడు,? పక్షుల్లో, ప్రకృతిలో, ప్రపంచం లోని అణువణువునా అందాలు పొదిగిన విశ్వ మూర్తి,! ఎంత చక్కని చిత్ర శిల్ప రచనా కారుడు,, !అందాల ఆనందా లు కుప్పలు కుప్పలుగా వేదజల్లాడు,! ఇంతకీ ఎక్కడ ఉన్నాడు, ఆ సృష్టి కర్త,, ?ఒక్కసారి చూడాలని ఉంది,! ఇన్ని సోయగాలు లావణ్య వైభవాలని వాడని పరిమళ కుసుమాల హారంగా ధరించిన ఆ విశ్వంభర స్వామిని, కనులారా దర్శించాలని కోరికగా ఉంది ! ఆ జగన్మోహన ఆకారుని పాదాల ను తాకాలని, ఈ శిరస్సును ఆ ప్రభువు చరణ కమలాల కు తాకించాలని మనసు ఉవ్విళ్లూరుతోంది,! దయచేసి చెప్పరూ, మా నీల మేఘ శ్యామ సుందరుడు ఎక్కడున్నాడో,! ఎలా ఉంటాడో,,, !అతడిని చూడటానికి, ఏం చెయ్యాలో,,? ఎప్పుడు చూడవచ్చు నో,,,? , అయినా ఆయనకు అంత తీరిక ఉంటుందా,,? జగాల నేలే దొరకిి,,? సకల ప్రాణి కోటి నీ సంరక్షించే ప్రభువుని దర్శించడానికి , ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వెళ్ళడానికి, మనం స్వేచ్చా విహంగాల మా?, కర్మ పాశ బద్దులం,!, అజ్ఞానమే కాని సుజ్ఞానం లేని రెండు కాళ్ళ జంతువుల ము,,! స్వామీ,!,, సముద్ర పు ఇసుకలో ఒక చిన్న ఇసుక రేణువు ను, నేను. ! అనంత కోటి బ్రహ్మాండ నాయకు డి వి నీవు,,! ఊహించ నలవి గానీ, శక్తి చైతన్య మూర్తి వి నీవు,,! నేనో, అల్పు డను!, హీను డను, !అహం భావిని,,! డంబా చారిని,!, అందుచేత, నారాయణా,, నవనీత హృదయా,,! నా దీనస్థితి మీద దయ ఉంచి నన్ను రక్షించు, ! తండ్రీ,! రోజుకు ఎన్ని తప్పులు చేస్తున్నానో నాకు తెలియదు, !క్షమించు, పరమాత్మా,! శరణు, దయానిధి,! శరణు,, !శరణు!
Tuesday, May 7, 2019
కృష్ణార్పణం
May 6, 2019
అలనాడు బృందావనం లో కృష్ణయ్య తన స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఉండగా,, ఒకరోజున మధ్యాహ్నం ఎండకు అలసి పోయి గోవులు దూడలు అలమందలతో బాటు , వారంతా చెట్ల క్రింద, నీడలో, విశ్రాంతి కోసం పడుకున్నారు,,, అక్కడికి దగ్గర్లో నే ,, ఒక మామిడి తోట పండిన పండ్లతో, వారికి కనపడుతోంది ... కమ్మని రసాల పండ్లను చూస్తుంటే, గోపాలురకు నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి,,! ఆపుకోలేక పోతున్నారు తినాలి అనే కోరికను, కళ్ళు మూసినా తెరిచినా పండ్లే కనపడుతున్నాయి. వారికి! కృష్ణయ్య కాస్త కళ్ళు మూసి నిదుర నటించగానే, అందరూ తోటకేసి చప్పుడు చేయకండా వెళ్లారు,! ఎక్కడా, తోటమాలి కనపడటం లేదు వారికి! అడగకుండా పళ్ళు కోయడం దొంగతనం, అవుతుందని వారికి తెలుసు. ! పండ్లను చూసే కళ్ళ కు అది తప్పు అని తెలుసు, !కాని కావాలి, వాటిని తినాలి! "" అన్న జిహ్వ చాపల్యం ఎక్కువగా ఉంది.., కాని కళ్ళు పండ్లను కోయాలేవు! తినలేవు.! కదిలాయి కాళ్ళు, చెట్ల్ల వద్దకు,! కాని కాళ్ళు పండ్లను తెంపలేవు తీనలేవు కదా,! అప్పుడు చేతులు కదిలాయ,,ి పండ్లను తెంపాయి. కూడా !కాని అవి కూడా తినలేవు, కదా,,! అందించాయి పండ్లను నాలికకు!", ఆహా !ఏం రుచి.?, ఏం మాధుర్యం,? అంటూ లొట్టలు వేసుకుటూ మామిడి పండ్లను తిన్నారు, రసాలు జుర్రుకోసాగారు. !ఇంతలో రానే వచ్చాడు బెత్తం తో తోటమాలి,! చూశాడు పిల్లలను!, తనను అడగకుండా తోటలో జొరబడి దొంగతనంగా పండ్లను తెంపి తింటున్నందుకు వాడికి పట్టరాని కోపం వచ్చింది,! తలా ఒక దెబ్బ వేశాడు వారి వీపులపై,!", అమ్మా! అబ్బా ! అయ్యో,! వామ్మో!"" అంటూ బాధతో పరుగో పరుగు!.... దొంగనిద్ర నటిస్తున్న.కృష్ణయ్య లేచాడు ,చూశాడు. , ఏమయింది అన్నాడు ఏది తెలియనట్టుగా !. గోపాల కులు అడిగారు, ఏడుస్తూ,, కళ్ళల్లో నీళ్ళు కారుతు ఉండగా,!, కృష్ణా! ఆ, మామిడి పండ్లను చూసినవి ఈ కళ్ళు కదా!, మరి ఏ పాపం ఎరుగని ఈ వీపు ఎందుకు దెబ్బలు తిన్నది? అంటూ... అమాయకంగా.. అంటుంటే,, గోవిందుడు నవ్వుతూ నవ్విస్తూ, వారి వీపులు నిమురుతూ, అకు పసరు రాస్తూ, సము దాయిస్తు చెప్పాడు,! "" దెబ్బలు వీపుపై పడినా, ఏడ్చే ది ఈ కన్నులేగా! మీ కళ్ళనుండి వచ్చే ఆశృ ధారలు, బాధతో పాటు, పశ్చాత్తాపాన్ని కూడా సూచిస్తున్నాయి కదా, ఈ మీ కళ్ళ లోని చూపులు! తప్పు జరిగింది, పండ్లను చూసిన ఈ కళ్ళ వలన కదా,! అందుకే శిక్షతో కూడిన బాధను అనుభవించేది కూడా అవే కళ్ళు,,! అందుకే ఎవరు చేసిన కర్మను వారు అనుభవించక తప్పదు ,! ఎన్ని ఎత్తులు వేసినా, తప్పును ఎవరితో చేయించినా, ఫలితం కర్తకు, అనగా ప్రణాళిక సిద్దం చేసిన వారికి తప్పక అంటి తీరుతుంది, !అది దేవుడి కైన, నరుడి కైన, ఏ జీవి కైన కర్మ ఫలం అనుభవించక తప్పదు,! ప్రక్కన కృష్ణయ్య ఉన్నా కూడా,!"" అంటూ, పరిహాసం చేస్తూ, చెప్పాడు.." ఇకముందు, మీరు ఈ కళ్ళు చెప్పినట్టు వినకండి,! కళ్ళతో చూసినదం తా నిజం కాదు,! ఏ పనీ అయినా చేసే ముందు, మీ బుద్దిని ప్రభావితం చేసే, ఆత్మ విచారం చేయండి,! అయినా కూడా తోచకపోతే పెద్దవారిని అడగండి,! జ్ఞానం అంటే ఇదే,! ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోడ మే,, !అయినా నాకు పెట్టకుండా, నాకు తెలియకుండా, నన్ను ఏమార్చి చేయాలని అనుకుంటే, ఇదిగో ఇలాగే అవుతుంది, మరి,,! కనీసం తినేటప్పుడు అయినా నన్ను తలచుకున్నారా.,? లేదే,,!' కృష్ణార్పణం!" అన్నారా? లేదే,,! దేవుడికి సమర్పిం ఛని "" తిండి"" దొంగతిండి అవుతుంది, తెలుసా,! మీరు అనుకుంటారు ,, కదా మిమ్మల్ని ఎవరూ చూడటం లేదని! కాని దేవుడు అంతర్యామి,! సర్వాంతర్యామి ! మీలోనే, మీతోనే, మీ ముందే, మీ చుట్టూ ఉండి, మీరు చేసే ప్రతీ పనీ చూస్తూ లెక్క గడుతుంటాడు సుమా!!,ఇకముందు, ఏది తిన్నా",కృష్ణా !నీకు అర్పణం!!"" అనాలి సుమా!, జ్ఞాపకం పెట్టుకోండి,, ఇది ! మీరే కాదు ఎవరైనా కూడా ! ఎందుకంటే ఆ పండ్లు దేవు నీ ప్రసాదం ; ఆ భావన ఉండాలి మీలో !! ఎప్పుడూ నాకు తెలియకుండా, చాటుగా ఏ సాహసం చేయకండి,! ఇది అడవి,! భయంకర మృగాలు, రాక్షసులు,, సర్పాలు ఉంటాయి, కూడా ! మనం అందరం కలిసి ఉండాలి,! ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి, !ఏది చేసినా కలిసి చేయాలి,!", అంటూ, గోపాల కృష్ణుడు,నందనందనుడు, మురళీ మోహ నుడు,, నవనీత చో రూడు,, రాధామాధవుడు, నటనాగ్రేసర. చక్రవర్తి,, నటన సూత్రధారి, లీలా మానుష దేహుడు, నీల మేఘ శ్యామ సుందరుడు,, యశోద ముద్దుల తనయుడు, అన్నమయ్య ఆరాధ్య దైవం,, భక్త పోతన హృదయ మందారం,, మీరాబాయి హృదయ విహారి, సూర దాసు కీర్తన లాలసుడు,, సక్కుబాయి హృదయ అంతరంగుడు,, చైతన్య మహా ప్రభు కృష్ణ చైతన్య భక్తి తరంగం,, త్రిజగన్మోహ నుడు,,భక్త చింతామణి,, కరుణాసాగరుడు,గోపాలబాలుడు,, అలా , తన విష్ణుమాయ జాల ప్రభావంతో, తన సురుచిర సుందర దివ్య మంగళ విగ్రహ దర్శనం తో, ఎన్నో లీలలను, మహర్షులకు కూడా అర్థం కాని, తన రచనా నటనా, చతుర వైభవాలని శ్రీకృష్ణ లీలామృత రసధా రల ద్వారా భక్తలోకానికి అనుగ్రహించాడు! ",, శ్రీ కృష్ణా, నీకు అర్పణం!, జై శ్రీకృష్ణ! జై జై శ్రీకృష్ణ !స్వస్తి!"
Sunday, May 5, 2019
మనసు ,బుద్ధి, మరియు అత్మ,
May 5, 2019
"మనసు ,బుద్ధి, మరియు అత్మ, ఇవి మూడు మన శరీరానికి ధాతువులు. అనగా జీవునికి ప్రమాణాలు.
ఇక, మనసు అంటే జీవుడు ! ఈ. జీవుడు దేహమంతా వ్యాపించి ఉంటాడు!, కాలికి ముల్లు కుచ్చితే " అయ్యో!!" అంటూ బాధతో విల విల లాడుతాడు, కొంతసేపు,!!"", నేనే ,ఈ దేహమై ఉన్నాను !!"" అన్న అహంభావంతో జీవుడు " మనసు" అనే ఆయుధంతో నిరంతరం ప్రశాంతత ను, సంతృప్తిని కోల్పోయి, సంచరిస్తూ ఉంటాడు , జీవుడు ఒక్క నిద్రా స్థితిలో తప్ప, మనసు నిల xxకడగా ఉండదు, కదా... ! .
ఇక "బుద్ది" అనేది మెదడు లో స్థిరంగా ఉంటుంది, మనసు తో ఆలోచించి, సంకల్పించి జీవుడు బుద్ధి కుశలత తో కార్యాన్ని అనుకున్నది సాధిస్తూ ఉంటాడు.!. అస్తి ఐశ్వర్యాలు, బంధు బలగం, సంసార జీవితం సాగించడం, ఇదంతా మనసు బుద్ది ఏకమై తగిన ప్రణాళిక రూపొందిం చి, సంపాదిస్తా యి, ఇదే జీవితం, ఇదే అనందం, ఇదే గమ్యం, అనుకుంటాడు జీవుడు తన నిజ స్వరూపం ఏమిటో తెలుసుకోకుండా, అర్థవి హీనం గా బ్రతుకు జంతువు లా ఈడుస్తూ ఉంటాడు.
,ఇక మూడవది"అత్మ!" అది పరమాణువు కంటే అతి సూక్ష్మ రూపంలో గుండె కు దగ్గరగా ఉంటుంది అని పురుష సూక్తం చెబుతోంది,! అత్మ, పరమాత్మ వలె అగోచ రము, అవినాశము,, కోటి సూర్యప్రకాశ ము, అవిచిన్నము, అద్భుతము కూడా,,! జీవుడు పొందే ఆనందము ఆత్మానుభూతి పొందితేనే తప్ప అనుభవం కాదు,, కదా! ఈ జీవునికి కలిగే దుఃఖము, తో ఆత్మకు ఏ మాత్రము సంబంధం లేదు,! పైగా కేవలం సాక్షి లా చూస్తూ ఉంటుంది!, అత్మ లేకుండా జీవుని మనుగడ లేదు, నిజమే,, కాని ఈ అత్మ వైభవం తెలిసేది కేవలం మనిషికి మాత్రమే..! ఇతర ఏ ప్రాణికి అనందం తెలియదు .నాశము లేనిది,ఆనంద మయము, ప్రశాంత నిలయ ము, సచ్చిదానంద స్వరూప ము,, పరమాత్మ అంశము అయిన ఈ ఆత్మానుభవం , అద్భుతమైన ఆత్మానందం, అది కేవలం అనుభవైక వెద్యము, మాత్రమే! ఆ బ్రహ్మానందం, ఆ,,పరమానందం,, దైవానుగ్రహము వల్లనే లభ్యం అవుతోంది ఎవరికైనా, వారి భక్తి తత్పరత ను బట్టి,,!
అయితే ఇంతటి అద్భుత అలౌకిక అపురూప అద్వితీయ మైన, ఆనంద స్థితిని జీవుడు పొందాలంటే, మనసును, బుద్దిని కుదురుగా, ఆత్మలో నిలిపితెనే, సాధ్య పడుతుంది! అలా, ఎంత సేపు దృష్టిని ఏకాగ్రతతో, దృశ్యం పై నిలిపితే అంతే అనందం అనుభవానికి వస్తుంది.! .
కొడుకు పుట్టాడని ఆత్మానందం పొందుతాడు మనిషి, అనగా జీవుడు . ఆ ఆనందంతో జీవుడు ఆత్మతో మమేకం అయ్యి,, అనగా జీవాత్మ సంయోగం తో ఆనందాన్ని పొందుతాడు, అదే విధంగా తీరని నష్టం గానీ కష్టం గానీ వస్తె, జీవుడు మనసును ఆశ్రయిస్తాడు,, బుద్దిని కాదు,! అలా జీవుడు ఆత్మకు దూరమై, అత్మ విచక్షణ కోల్పో తాడు. అలాంటి ఈతి బాధలు, కష్టసుఖాలు కేవలం దేహానికి, అనగా, మనసుకి కానీ₹ ఆత్మకు కాదు !"అన్న వివేకం కోల్పోతాడు,
జీవుడు, దేహాన్ని ఆశ్రయించి ఉన్నా అది తాను కాదు, అది తనది కాదు కదా!, బట్ట చిరిగిన వెంటనే దానిని పారవేసి కొతబట్ట వేసుకున్నట్టు, దేహంతో ముడివడిన జీవుడి "కర్మ పరిపాకాలు!", అన్న జ్ఞానంతో, శరీరాన్ని ఒక పనిముట్టు లా ఉపయోగిస్తూ, అత్మ ఉద్దారణ కోసం జీవుడు, తాను శరీరాన్ని కాదు అన్న వైరాగ్య భావన తో తపించాలి, !అందుకు జీవుడు అంటే మనిషి, కోరికలు అంటే మనసును నియంత్రిస్తూ, దేవుడిచ్చిన మెదడు లోని బుద్దిని, తదనుగుణంగా ప్రభావితం చేయాలి,
"ధియో యోనః ప్రచోదయాత్,!" అని గాయత్రి మంత్రం లో చెప్పబడి నట్లుగా," ఓ భగవంతుడా!, నా బుద్దిని, జ్ఞాన దిశలో, నిన్ను తెలుసుకునే మార్గంలో, నిరంతరం నన్ను నడిపించు తండ్రీ !""అంటూ అనునిత్యం విధిగా త్రికరణ శుద్ధితో దైవాన్ని ప్రార్థించాలి,, ఎందుకంటే దైవకృప లేనిదే ఎంతటి మహానుభావులు అయినా,జీవితసత్యాన్ని తెలుసుకోలేరు కదా! అదుపు చేయలేని, నిలకడ స్థితి ఎరుగని" పరుగు గుఱ్ఱం ""లాంటి మనసు మాట వింటూ బుద్దిని ప్రాపంచిక మార్గంలో నడిపిస్తూ,, ధ్యేయం పరమార్థం లేకుండా, దైవా న్ని మరచి, విలువైన మానవ జీవితం వ్యర్థ భోగాల విలాసాల కోసం గడపాలా,?, లేక, అదే బుద్దిని ఆత్మతో సంయోగం చెందిస్తు,, అత్మ విచారణ తో, మనసును, దేహాన్ని, బుద్ది చెప్పిన దారి వైపు మళ్ళిస్తు, పారమార్థిక దృక్పథం తో, దైవభక్తి తో, ఆత్మను పరమాత్మ తో అనుసంధానం చేస్తూ, జీవితాన్ని సార్థక ము చేసు కోవాలా ?? అన్నది జీవుడు వివేకంతో విచక్షణతో, సద్గురువుల ఆశ్రయం తో, సత్సంగ ముతో, దీక్షతో, తపనతో, ఆర్తితో, దైవారాధన తో నిర్ణయిం చి తేల్చుకోవాల్సిన విషయం,!
"విజ్ఞానం" అంటే గోచరము అయ్యే పదార్థ ము గురించి తెలుసు కోవడం, అనీ,, "జ్ఞానం "అంటే అగోచర ము,, శాశ్వతము, సత్యము నిత్యము,, అయిన ఆ పదార్థ మూలాన్ని, అనగా యదార్థ మును, జీవిత పరమార్థాన్ని, పరంధా ముని సర్వాంతర్యామి తత్వాన్ని, గ్రహించడం అన్నమాట,, !
అలా దేవుడు ప్రతీ జీవునికి, అపురూపం, అద్భుతమైన వివేకాన్ని, జ్ఞానాన్ని, "పలుకు" తో పాటు,ఇస్తూ, దానిని వినియోగం చేసుకునే అవకాశం కూడా మనిషికి అంటే ఈ జీవునికి అనుగ్రహించాడు ,! కావున, మనం, మనకున్న పరిజ్ఞానం తో, మనం రోజూ చేసే జపము, అర్చన, పూజా, స్మరణం, భజన, కీర్తనం, సేవనం, ధ్యానం, గానం, భావన, ఆరాధన, పురాణ శ్రవణం, భగవద్గీత మొదలగు సద్గ్రందాల పఠనం,, ద్వారా, ఇవన్నీ, పరమాత్మ గురించిన,జ్ఞానం పై, చిత్తశుద్ధిని కలిగించి, మనసును దైవంతో లగ్నం చేయడానికే చేసే ప్రయత్నం, మాత్రమే,, కనుక, లక్ష్య సిద్దికై, శ్రమ చేద్దాం, ఈ సంకల్ప సిద్ధికి తోడ్పడే వి, గురుకృప దైవానుగ్రహం తో బాటు, మన అలుపెరుగని, వెనుతిరగని, ధ్యేయం మరువని నిరంతర సాధన సత్పురుషుల సాంగత్యం, అవసరం!,
గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా," దేహం అనిత్యం, !"అత్మ అంటే బ్రహ్మం నిత్యం,!"అని భావిస్తూ, శరీరం, పాంచభౌతిక స్వరూపంగా, అనుకుంటూ, దైవాన్ని హృదయం లో అంటే అత్మ లో ప్రతిష్టిం చుకుందాం,,
అలా ఆ,సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమైన ఆ పరమాత్మ వైభవాన్ని హృదయం లో దర్శించడానికి తగిన స్ఫూర్తిని, భావసంప దను, సాధనా పటిమను అనుగ్రహించమని,, ఆ రాధాకృష్ణునీ, నవనీతచో రుని, బృందావనవిహా రుని, గోపికామనోహ రునీ,,, యశోదాకిశోరుని, నందనందనుని,, వేణు గానవిశారదుని,, గోవర్ధన గిరిధారిని, కాళీయ మర్ధనుని, జగన్నాటక సూత్రధారినీ,, లీలా మానుషవేషధారినీ, శిఖి పింఛమౌళిని,, కస్తూరీ తిలకధారి నీ, కౌస్తుభా లంకారిని, పీతాంబరధారి నీ, నగుమోము గలవాడిని,, ఆ నల్లనయ్య, నీ, ఆపద్భాందవు డిని, విజయసారధిని,, ఆశ్రిత జనవత్సలుని, ఆనందనిల యుని, బాహ్యంలో దుర్లభము, ఆత్మానుభవం వల్ల హృదయ అంతరాళం లో మాత్రమే దర్శింప గల అపురూప సుందర ఆనందకర ము,
జగన్మోహన,మంగళకరమైన దివ్యమైన, శ్రీకృష్ణ భగవాను నీ చరణాల ముందు," శరణం మమ!"" అంటూ భక్తి వినమ్రతతో సాగిలపడి, సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, అనునిత్యం, అనవరతం, అనుక్షణం, ఆ పరందాముని ప్రార్థించి, ఆ భావ సంపదలో, ఆ ధ్యాన తత్పరత తాదాత్మ్యం తో, పరమేశ్వర ప్రసాది తమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకుందాం,,!
ఓమ్ నమో నారాయణాయ! నారాయణా, విశ్వంభర, విశ్వే శా, విశ్వనాథ, ప్రభో, శరణు, ! శ్రీకృష్ణా శరణు!,, దీన జన బాందవా, శరణు,! స్వామీ శరణు!"""సర్వే జనాః స్సుఖినో భవంతు! సమస్త సన్మంగాళాని భవంతు,!"ఓం శాంతి శాంతి శాంతిః!! స్వస్తి!!
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
Mar 28, 2020 "తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది! ఒకరికి మరొకరు సహాయం చేసుకునే...
-
Oct 24, 2019 Austin "రాధే శ్యామ్, రాధే శ్యామ్, రాధే శ్యామ్, !""అనే నామం లో , ఆ నామ గానం లో ఏదో తెలియని అనందం అద్భుత శక్తి ఉం...