Sunday, December 8, 2019

సుయోధన

Dec 2, 2019 Karimnagar

""టక్, టక్ టక్,!"'
ఎవరది ?, ఎవరూవచ్చింది?
""నేను తాతా , నీమనవడు ,
సుయోధ నున్ని !!
""ఓహ్ నీవా !! ఇంత అర్ధరాత్రి వేళ !!, అయినా నీవు  రావడానికి అభ్యంతరం ఏముంటుంది , రా!!
యుద్దం చేసి అలసి పోయావు గా , !మళ్లీ రేపు తయారు అవ్వాలి కూడా !, ఏం పని మీద వచ్చావు నాయనా,?!
""ఏం లేదు తాతా !, ఒక చిన్న ఆనుమానం ,! అది మీరు మాత్రమే తీర్చగలరు  అడుగుదామని వచ్చాను!! అంతే!!
""అనుమానమా ?? ఏమిటి చెప్పు ?
""ఏమీ లేదు! , మీరు ఏమీ అనుకొనంటేనే , అడుగుతాను!! తాతా!!
""వచ్చిందే అడగటానికి అయినపుడు సంకోచం దేనికీ  సుయోధన ,,చెప్పు!""
""మరేం లేదు , ఆచార్య వర్యా ! యుద్దం మొదలైన రోజూ నుండీ శత్రుపక్షంలో కంటె,, మన పక్షంలో వారే ఎక్కువ మంది చనిపోయారు, నా తమ్ములు సగానికి పైగా ఆ పాండవుల చేతిలో  హతమయ్యారు !, మీ రా అరివీర భయంకరు లు!! సాక్షాత్తూ పరశురాముని నిర్మించిన ధీరులు!! , మీ ముందు ఎదురు నిల్చి యుద్దం చేయగల వీరులు ఈ భూమిపై లేరు,! ,,.
అయినా  ఆ పాండవులలో కనీసం ఒక్కడు కూడా మీ చేతుల్లో  చావలేదు , !మీ మీ బాణం గురి తప్పదు ,! శతృవు ఏ మూల దాగినా వాడి శిరస్సు తెగిపోతుంది కదా , ! మీ పరాక్రమం ఎంతగొప్ప దొ జగమంతా తెలుసు !, మరి ఎందుకు మీ చేతిలో హతం కాకుండా ఇంకా అర్జునుడు బ్రతికి ఉన్నాడు తాతగారు ,? ఈ సందేహమే నాకు రాత్రి నిద్ర పట్టనివ్వడం లేదు !,
  నిజమే  సుయోధన !;నీ అనుమానం నిజమే !, నేను వేసే ప్రతీ ఒక బాణానికి అర్జునిని చంపే శక్తి ఉంది! కానీ అది సాధ్యం కావడం లేదు, సుయోధన ! ఏం చేయను ?!
""తాతా ! మీరు మా తరఫున యుద్దం చేస్తున్నా కూడా ,మీరు పాండవ పక్షం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ,,అవునా !??
అంత నిష్టూరంగా మాట్లాడి నన్ను బాధపెట్ట కు ,! నిన్ను "దుర్యోధనుడు" అని అందరూ ఎందుకంటా రో ,నాకు ఇప్పుడు తెలుస్తోంది, !నీవు నా నిజాయితీని శంకిస్తు ఉన్నావు , గదా!! ఇంత వృద్దాప్యం లో కూడా నీ కోసం , నీ గెలుపు కోసం విల్లు పట్టిన నన్నే ,సందేహిస్తున్నావా  ??,, నీ దుష్ట బుద్ది ని పోనిచ్చు కున్నావు కాదు,,! అయినా నీకు కావాల్సింది పాండవులను చంపడం కదా ! సరే !, అయితే  నాకు ఒక పని చేసి పెట్టు ,! అలా చేస్తే ,ఒక్క అరగంట సమయంలో పాండవులను భూమిపై లేకుండా చేస్తాను! సరేనా ?
అలాగా ,తాతా !! చాలా ఆనందంగా ఉంది ఆ మాట అన్నందుకు !;నాకు కావాల్సింది కూడా అదే ,! దానికోసం నేను ఏమైనా చేస్తాను ,! చెప్పు తాతా ,,! నన్ను ఏం చేయమంటారు ?
""చెబుతాను ,నాయనా! తొందర పడ కు !! కానీ నీవు ఆ పని చేయలేక పోతే మాత్రం , మళ్లీ ఇలాంటి వంకర మాటలు అంటూ నన్ను బాధపెట్ట వద్దు సుమా !""
మీరు ఆ మాట మీదనే నిలబడంది తాతా.!!" చెప్పండి !, మీరు నన్ను ఏం చేయమంటారు ,,?""
""ఏం లేదు ,సుయోధన; ఒక్కరోజు,!, కేవలం ఒకే ఒక్క రోజు , !యుద్ధభూమికి  ఒక్క వ్యక్తిని  రాకుండా చూడు, చాలు !!అంతే !""ఇక ఆ పాండవుల పని నేను చూస్తాను !!
""ఓ,అదెంత పని తాతా ! ఆ ఒక్క మనిషి విషయంగా ఇంత  ఆలోచన అవసరమా ,?, ఈ రోజు రాత్రికి రాత్రే, ఆ  మనిషిని లేకుండా చేస్తాను !, అయితే భయపెట్టి దూరం గా పంపిస్తా !,, లేదా హతమారుస్తా , !కాదంటే,, అమాంతంగా ఎత్తుకొని , వచ్చి,ఎవరికీ దొరక్కుండా దాచే స్తా!!"
""నాకు తెలుసు మనవడా , నీ సంగతి !! నీవు అంతటి చతురుడ వే ,!! ఇలాంటి మాయోపాయాలు నీకు నీవే  సాటి  !""
""అయితే ,ఇంకేం చెప్పండి,, ఆలస్యం చేయకుండా వెంటనే చెప్పు తాతా ,,! ఆ వ్యక్తి ఎవరూ  ?""
""పాండవులను చంపాలని నీకు ఎంత ఆతురత గా ఉందో , నాకు కూడా అలాగే ఉందని ఇప్పుడైనా నమ్ముతావా సుయోధన.?? 
  ""పాండవులను
హతమా ర్చే
ఇంత అద్భుతమైన విషయం , చెప్పి నాకు చాలా సంతోషం  కలిగించారు ! మీకు ధన్యవాదాలు సమర్పించు కుంటున్నాను !, ఇన్ని రోజులు నాకు ఇంత చిన్న విషయం చెప్పకుండా అనవసరంగా తాత్సారం చేశారు తాతయ్యా ! పోనీ, ఇప్పటికైనా నాకు విజయం కలిగే మార్గం చెప్పారు , మీకు ఎంతో ఋణపడి ఉంటాను ,!, చెప్పండి, తాతా !!ఎవరతడు?? ఆ వ్యక్తి పేరేమిటి ! ఎవరికీ నూకలు మూడాయి నా చేతిలో  చెప్పు !""??
""సుయోధన! అంత అవేశ ము వద్దు నాయనా,, ఇది నీవు అనుకుంటూ ఉన్నంత  చిన్న విషయం కాదు ,!,""అది అంత సులభమైన పని అయితే,, నేదాక తేస్తానా?? , నేనే చూసుకునే వాన్ని గదా !""
""ఓహో ,!అంత మొనగాడా , అతను ?,, ఎంతటి వాడైనా గానీ, నాకు వశం కాని వాడు , ఈ భూమి పై ప్రాణాలతో ఉండడు !, తాతా! ఇప్పుడే నేను నీకు మాట ఇస్తున్నాను ,! ఆ మనిషి ఎవరో చెప్పు ,!, ఉదయం లోగా కట్టి పడేసి,,నీ కాళ్ళ ముందు పడేస్తాను ,!, నన్ను నమ్ము !, ఇక ఆలస్యం చేయకుండా ,, ఎవరి నోట పడక ముందే తొందరగా చెప్పెయ్ తాత !,, ఎవరు అతడు ,?""
""అయితే, జాగ్రత్తగా విను, సుయోధన !! అతడు, నీకు బాగా తెలిసిన వ్యక్తి ,! పైగా నీకు దగ్గర బంధువు,! వరుసకు  నీకు బావమరిది అవుతాడు కూడా !""
""అవునా?? అంత దగ్గర సంబంధ మా ?? ఇకనేం  ,! పని  సులభంగా అయినట్టే! , ఎవరో అతడు? మరీ ఊరించకుండ  చెప్పుతాత ?""
"""అతడు ఎవరో కాదు సుయోధన ,! శ్రీకృష్ణుడే !""ద్వారకా వాసుడు శ్రీకృష్ణుడే!! అతన్ని పట్టి తెగలవా సుయోధన??,
ఏమిటి ఆ మాయావి కృష్ణుడా ,?? అతడు అర్జునుని సారథి కదా ! అయినా, తాత !, ఏదో రథం ముందు కూర్చుండి గుర్రాలను  ఉత్సాహ పరుస్తూ రథాన్ని  తోలుకొంటు ఉండేవా నికి ,, నీవు వేసే బాణాల కు  సంబంధం ఏముంటుంది ?
,, నీ బాణాల కు ఆ శ్రీకృష్ణుడు ఎలా అడ్డుపడుతున్నారు?? తాతా ,! నాకు అర్థం కావడం లేదు ,"కాస్తా వివరంగా చెప్పు !!"""
""ఆ శ్రీకృష్ణుడు అంత సులభంగా అందరికీ అర్థం కాడు సుయోధన,!! అతడేమిటో ,,ఎవరో,, ఎందుకు యుద్దం లో ఉత్సాహంగా పాల్గొంటున్నా డో ,,  ఇది నీకు ముందే తెలిస్తే ,, నీవు  ఆ శ్రీకృష్ణుడి నే c కోరుకునే వాడివి !!, ఆ  రోజున ద్వారక కు కృష్ణుని సహాయం కోసం  వెళ్ళి ,  యాదవ సైన్యాన్ని  కోరుకోని వచ్చావు కదా !!"",
""అవును!! నేను పొరబాటు చేయలేదు, సరియే,!,లేకపోతే ఆయుధం పట్టనూ , యుద్దం చేయను ,అనే ఆ కృష్ణుని కోరుకుంటే నాకు విజయం  ఎన్నడు కలగాలి తాతా ??""
""అదిగో !!అక్కడే పొరబడ్డావు మనవడా ,,! అతడు నీవు అనుకుంటున్నట్లుగా సాధారణ రథ సారథి కాదు సుమా! , విజయ సారథి! అంటే విజయాన్ని చేకూర్చే రథ సారథి ! శ్రీకృష్ణుడు ఎటు వైపు ఉంటే అక్కడ, విజయం తథ్యం !! అతడు ,నేవనుకుంటున్నట్టు కేవలం సారథి గా మాత్రమే లేడు ,!,, నేను గురి చూస్తూ ఎంత  వేగంగా వాడి యైన నా బాణాల ను వేస్తూ ఉన్నానో అంతే వేగంతో  ఆ కృష్ణుడు తన రథా న్ని చటుక్కున త్రిప్పుతూ , ఉండడం తో, నా బాణం లక్ష్యాన్ని   చేరుకోలేక పోతోంది ! అర్జునిని శిరస్సు ఖండించ డానికి నేను గురి చూస్తూ ప్రయోగించే ప్రతీ బాణాన్ని తన చతుర సారధ్యం తో దారి మల్లిస్తూ అర్జునిని సదా రక్షిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణుడు !!
ఇప్పుడు తెలిసిందా సుయోధన ,!, శ్రీకృష్ణుడు ఎంతటి చతురు డో,!?! అందుకే తన సైన్యం అంతా ఒక వైపు ,, తాను ఒకడు మరో వైపు ,చేశాడు !! దాని పరమార్ధాన్ని నీవు తెలుసు, కొలేక పోయావు గదా
సుయోధన ,!! నీవు శ్రీకృష్ణుని విజ్ఞతను సరిగ్గా అంచనా వేయలేక పోయావు ,! ఒక అక్షౌహిణి సైన్యం కాదు కదా !,18, అక్షౌహిణుల సైన్యం ఒక్కటై ఎదురించినా కూడా,, శ్రీకృష్ణుని రథ సారద్యం  చతురత వల్ల అర్జునిని కి విజయం వరిస్తుంది,,!
శ్రీకృష్ణుడు సామాన్య రథ సారధి కాడు సుయోధన ,,!""
"" అయ్యో !!ఎంత పొరబాటు చేశాను తాతా ,?? ఆ చెత్త సైన్యాన్ని కోర కుండా హాయిగా , శ్రీకృష్ణుని నేను కోరుకుంటే , నాకు ఎంత సులభం అయ్యేది విజయం ,??
శ్రీకృష్ణుని నేను  నా పక్షం వైపు నిలబెట్టి, ఉంచితే, పాండవులు యుద్దం చేసే వారే కాదు, !!ఒకవేళ చేసినా  వాళ్ళు గెలవడం మాట కల్ల ,!! తాతా! ఎంత పెద్ద  తప్పు చేశాను ! నేను అంత దూరం ఆలోచించ లేక పోయాను ,నేను ! '""
""సుయోధన !ఇప్పుడు చెప్పు ?? ఆ శ్రీకృష్ణుని పట్టి తేగల వా ?""
""నన్ను క్షమించాలి తాతా ! మిమ్మ ల్ని అపార్థం చేసు కున్నందుకు!!, ఇప్పుడు నా మనసు  ఏమీ ఆలోచించే స్థితి లో లేదు ,! దయచేసి  నన్ను క్షమించు ! ఇక, నేను వెళ్లి వస్తాను ప్రణామాలు ,!!, సెలవు,,!""
, ""వెళ్లు ,సుయోధన! , వెళ్లు,! నీవు అధర్మ మార్గంలో ఉన్నావు ,,!  ఇంత బ్రతుకు బ్రతికి , దైవాంశ సంభూతుడ ను అయినా కూడా , కేవలం ,నీ ఉప్పు తింటున్నకారణంగా అధర్మ మార్గంలో  నేను కూడా అధర్మానికి తల వంచుతూ అత్మ వంచన చేసుకుంటూ దుర్భర మనో వేదన అనుభవిస్తూ ఉన్నాను!"" నేను అన్ని ధర్మాలు తెలిసి కూడా,
పాండవులను లక్కా గృహం లో ఉండగా పోలేదు, ! నాకు నీవెం తో, పాండవులు అంతే ! అయినా గానీ ,,వారు, స్వతంత్రంగా రాజ్య పరిపాలన చేస్తున్నపుడు ,, అనందం తో ఒక్కసారి కూడా చూడటానికి  పోలేదు,!!
మాయా జూదం అని తెలిసినా, అధికారం ఉండి కూడా  వారికి జరిగే అన్యాయం ఆపలేదు,! నా కళ్లముందు, ఒక కుల స్త్రీ వధువు వస్త్రాపహరణం ఆపే ప్రయత్నం చేయలేదు,! తుదకు పరమాత్ముడే స్వయంగా రాయబారం చేసినా కూడా , తెగించి  యుద్దం లో  నేను పాల్గొన ను , ధర్మం పై బాణం వేయను, విల్లు పట్టను, రక్త పాతం కానివ్వ ను !!"" అని  ఖండితంగా  నేనుసభలో చెప్పలేదు,!
ఇవన్నీ నేరాలే,! కాదు స్వయంకృత అపరాథా లే  బాగు పడటానికి అందరికీ
అవకాశం ఇస్తాడు భగవంతుడు , అయినా  సుయోధన ,నీలాంటి దుష్ట స్వభావులు పరమాత్ము ని గుర్తించలేరు,,!  నీవు చెడ తావు చెప్పుడు మాటలు విని ! నీతో బాటు మా ఆచార్య బృందాన్ని కూడా అపకీర్తి పాలు చేస్తున్నావు గదా !   ధర్మం తెలిసినా,, నీచ సాంగత్యము వల్ల నాకు ఈ శిక్ష తప్పదు! ఈ వేదన కూడా తప్పదు కదా !
""శ్రీకృష్ణా ,! యదు నందనా !!   నన్ను కరుణించు! , నాకు ముక్తిని ప్రసాదించు,!, రేపు నీ ముందు నిలబడి యుద్దం చేసే శక్తిని ఇవ్వు,! దానితో నిన్ను నొప్పిస్తాను! , నీచే ఆయుధం పట్టిస్తాను. ! నీచే చెప్పిస్తానూ భక్తుని మాట భగవంతుని మాట కంటే గొప్ప అని !!
, నీ పట్ల నాకున్న అనుపమానమైన భక్తిని నిరూపించు కునె అవకాశం ఇవ్వు స్వామీ !
నాకు తెలుసు! , నీ తీవ్రమైన చూపు నాపై పడిందంటే ఇక, భీష్మ పర్వం ముగిసి నట్టే !
నేను కోరేది ఇదే పరమాత్మా ! సాక్షాత్తూ c నర నారాయణుల ను నిర్జించే మహ దవకా శం నాకు లభిస్తోంది చాలు! పరంధా మా! పరాత్ప రా !! ప్రభూ! దేవదేవా!
అర్జునుడు ధర్మాత్ముడు ,! నీవు దర్మావతారుడ వు,,! ధర్మం ఎక్కడో అక్కడే ఉంటా వు!!, నీవు ఎక్కడ ఉంటా వో ,,అక్కడే జయం వుంటుంది ,!
భగవంతుడు ఉండేది భక్తుని వద్ద,,!
యతో ధర్మః తతో కృష్ణ !
యతో కృష్ణ , తతో జయః !
హరే కృష్ణ హరే కృష్ణా!!"

దిశ

Nov 30, 2019 Karimnagar
మొన్న దిశ కి జరిగింది అమానుషంగా అత్యాచారం మారణ హోమం
నిన్న జరిగిందిమరో స్త్రీ సజీవ దహనం
ఈ రోజు మరో అబల కు జరుగ వచ్చు
రేపు కూడా అడ కూతురు ఎక్కడో బలి కావచ్చు
మగాడి రాక్షస ప్రవృత్తి కి గురి కావచ్చు
ఈ రావణ కాష్టం ఇలా కాలుతూ
కార్చిచ్చు లా వ్యాపిస్తూ
అమాయక వనితల మాన ప్రాణాలను ఘోరాతి ఘోరంగా
పట్ట పగలు పదిమంది
నడి చే రహ దారుల్లో
అదనుకో సం కాపు కాస్తూ
అదే పనిగా పెట్టుకొని
ఒంటరిగా వెళ్లే అమ్మాయిలకు
ప్రత్యక్ష నరకాన్ని చూపుతూ
దారుణంగా హింసిస్తూ
కాలర్ ఎగరేస్తూ
గర్వంగా తల ఊపుతూ
ఏ మాత్రం సిగ్గూ లజ్జా అభిమానం ఆవేదన పడకుండా స్వేచ్చగా తిరుగుతూ ఉంటున్న ఈ చీడ పురుగులను
నల్లిని నలిపినట్టు
కాలితో నలిచే
నిలువునా కాల్చి పారేసే
కత్తితో గొడ్డును చీల్చిన ట్టు కోసే
బహిరంగంగా జరిగిన ఒక అన్యాయాన్ని
న్యాయం గా నిలదీసే
శుభ తరుణం ఎప్పుడొస్తుంది
ఎక్కడో శంషాబాద్ లో జరిగింది
ఈ రోజు నీ ఇంట్లో నీ ఇంటి ప్రక్కనే
నీ ఊరిలో నీ నగరంలో నీ వాడలో జరగొచ్చు
ఏదైనా తనదాక వస్తేనే తెలుస్తుంది కదా
కన్న కూతురిని జరిగిన
ఘోర అవమానం తలచుకుంటూ
కన్న వారు పడే దుర్భర మైన
మానస క్షోభ
ఎంత భయంకరం
ఎంత హింసాత్మకం
పైగా
దానికి కారకుడు దొరకడం ఇంకా ప్రాణాలతో ఉండడం
చీము నెత్తురు ఉన్న ఏ మనిషైనా సహించేనా
తిండి తినేనా
నిద్ర పట్టేనా
ఇదే ఏ ఇతర దేశమో అయితే ఎప్పుడో నరకాన్ని చేర్చేది
రాళ్లతో కొట్టి
నరికి పారేసే ది కదా
రామాయణం లో స్త్రీ జోలికి వెళ్ళిన ఒక్కడు
రాక్షస జాతిలో సహా హతమయ్యాడు.
భారతం లో స్త్రీ ని భంగపరచిన దుర్మార్గులు బంధు సమేతంగా
చచ్చారు
అడ పిల్ల జోలికి అలా అనవసరంగా వెళ్లే
మగాడి కి జీవించే ఈ
పవిత్ర భూమి పై జీవించే
అర్హత లేదు
అని ప్రకటన చేయాలి
గుండెలు పిండే ఇలాంటి
అకృత్యాలు, ఏ మానవ మృగం చేయకుండా
కట్టడి చేయాలి
చట్టం తేవాలి
ఆడపిల్లల కు న్యాయం చేయాలని లేకున్నా
అన్యాయం మాత్రం చేయకండి
వారి మానాన వారిని బ్రతక నీయం డి
సిగ్గుతో చచ్చి పోతున్న
మానవత్వం ఇంకా బ్రతికి ఉందనీ
దైర్యం చెప్పండి
రెక్కాడితే గానీ డొక్కాడని
పేద వారికి
మద్య తరగతి  సంసార కుటుంబాలకు
ఊరట కలిగించి
మేమున్నాం అంటూ మీ
సత్తా చూపించి
ఆదుకోండి
ఆదరించండి
ధర్మం న్యాయం నీతి నిజాయితీ లు
ఇంకా బ్రతికి ఉన్నాయని
నిరూపించండి
నేరస్తుల ను కటినంగ దండించే
తీర్పు చెప్పండి
ఉద్యోగాలు చదువులు
తప్పవు కదా ఏ రోజైనా
బయట తిరగక తప్పదు కదా ఏ రోజైనా
ఏ ఊరైన ఎవరైనా ఏనాడైనా
మేం కనబడితే చాలు
కాల రాచే తప్పులు ఏం చేశాం
స్త్రీ గా పుట్టడమే మా నేరమా
మీరూ ఒక స్త్రీ కే పుట్టారు గా
తల్లీ చెల్లీ అక్కా లేకుండా
మీ బ్రతుకు వుండే నా కలకాలం
ఎంతకాలం మేము భయం తో బాధతో సిగ్గుతో
అవమానం తో దాక్కుంటు  బ్రతకాలి
మాకు స్వేచ్చగా తిరుగుతూ బ్రతికే
హక్కే లేదా
మేం మనుషులం కాదా
మీలో మానవత్వం లేదా
చంపడం హింసించడ ఇది మనిషి మనిషికీ చేసే పనేనా
దీని కి పరిష్కారం చూపడం
అయ్యేవరకు చూడటం
మీ ధర్మం కాదా
ఇలా చూస్తూ పోతూంటే
ఆ  మానవ మృగాలు ఇంకా ఇంకా విజృంభించి
చెలరేగి పోవా
దేశం రాష్ట్రం ఊరూ వాడా
అప్రతిష్ట ల పాలు  కావలసిందే నా
నడవండి,
నడుం బిగిం చం డి
న్యాయం జరిగే వరకు పోరాడుదాం
మాకేం అనుకోకుండా
మద్దతు చూపుదాం,
ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం
ఆడపిల్ల లకు అండగా నిలుస్తు 
మానవత్వ విలువలు నిలుపుకుందాం

మోక్షం

Nov 30, 2019, Karimnagar
జీవించి ఉండగా నే మోక్షం కావాలి , అది సాధ్యమా? అంటే సాధ్యమే.!
ఈ ప్రమాణం మన వేదాల్లో ఉంది,! గురువు ఇచ్చే జ్ఞానంతో మోక్షాన్ని పొందవచ్చు, !
ఈ అవకాశం కేవలం  మన సనాతన హిందూ ధర్మంలో మాత్రమే లభ్యం అవుతోంది, మిగతా మతాల్లో ఈ సౌలభ్యం లేదు,
అలాంటి పరమ ఉత్కృష్టమైన మన  వేదమాత కు ,గురువు సంప్రదాయానికి శతకోటి ప్రణామాలు!
"బంధం" లో ఉన్నవాడే మోక్షా న్ని ఆపెక్షిస్తాడు,! వాస్తవానికి , మన అందరం ఏదో ఒక బంధా ల్లోనే ఉంటున్నాం,; కానీ
ఈ బంధం సత్యం కాదు.! అది ఒక భ్రమ !,
బంధం లో ఉన్నట్లు అనుకుంటాం , మనం!! అది ఊహ మాత్రమే!
రమణ మహర్షి నిర్యాణ సమయంలో , భక్తులు అందరూ కలత పడుతుంటే ఆయన చిరునవ్వు తో ఎక్కడికి పోతాను, నేను! ఒక చైతన్య స్వరూపాన్ని! అయినా పోయేది పోతోంది, వచ్చేది వస్తుంది! ఇక  దుఖం , దేనికీ ??"" అన్నాడట
శాస్త్రం ఈ బంధాన్ని అంగీకరించ దు!. అవి మనం కోరి తెచ్చి పెట్టుకున్నవే ,,, కానీ, నిజంగా "బంధాలు "అనే త్రాళ్ళ తో నిన్ను ఎవరూ బందించలేదు ! ఉదాహరణకు,,
ఒక త్రాగుబోతు తన గదిలోకి వచ్చి, తిరిగి వెళ్లిపోతుంటే ఒకాయన అడుగుతాడు
""ఏమైంది ?, ఎక్కడికి వెళ్తున్నావు?"
అంటే
""అది నా గది కాదు,! నా గదికి పోతాను!" అంటాడు
ఓహో బాగా త్రాగాడు కదా, ఆనుకొని,"" నేను చూపిస్తాను నీ గది !!, రా నాతో,,!!""
అంటూ బయటకు తీసుకెళ్ళి, ఇంటి చుట్టూ తింప,ి తిరిగి,, అతన్ని అదే గదిలోకి తీసుకొస్తాడు!
త్రాగుబోతు చాలా సంతోషంగా, దండం పెడుతూ , అతడికి ధన్యవాదాలు చెబుతాడు,
నీది కాని దానిని నీది అనుకుంటావు
నీ ది అయినది నీది కాదనుకుంటా వు !
ఇలా ఉంటుంది భ్రమ అంటే,!!
నిజానికి "బంధం "అనేది లేనే లేదు!! అది కేవలం కల్పితం,!
బంధం పోతే మోక్షం కలుగుతుంది అంటాం,! కానీ అసలు ఏ బంధం నిన్ను అంటిపెట్టుకొని లేదు!!
ఉందని నీవే అనుకుంటున్నావు !!అది నీ భ్రమ అంతే!!
""త్రాడు ను చూసి పాము" అనుకున్నట్టు గా భ్రమ ఉంటుంది;
ఇక "మోక్షం" అనేది ఎక్కడో లేదు!, నీవు ఆత్మ సాక్షాత్కారం తో పొందే పరమానందం లో నే ఉంటుంది మోక్షం !!
ఈ నిత్య సుఖమే మోక్షం! ఇలాంటి ఉన్నత స్థితి లో
" బంధం ""అనే భావన పోయింది,!
జీవుడు అన్ని బంధాల నుండి విముక్తుడు అయ్యే అవకాశము ఉంది !!
ఇదే జీవన్ముక్తి,!  ఈఆత్మానంద మే మోక్షం!
బంధానికి ముక్తికి అతీతం ఈ ఆత్మ!
నీవు ఎవర వూ ?  అంటే,", నేను ఆత్మను"" అంటావు ; ఇప్పుడు, నీవు ముక్త సంగుడవు అవు తున్నావు!
ఈ బ్రహ్మానంద స్థితిలో ""ఉన్నది లేదు, !లేనిది కూడా లేదు!
నేను అనేది, నాది అనేది ఏది లే దు;
ఏది ఉన్నవాన్ని కాను, నేను !
ఎవరు న్న వాణ్ణి  కూడా కాను నేను !
ఏది లేని ,,ఎవరూ లేని"" ఏక్ నిరంజన్ ని  నేను!"
అంటావు
అంటే  నేను ఒక శుద్ధమైన ఆత్మ స్వరూపాన్ని ! ఇదే మోక్షం ; ఇదే బ్రహ్మానంద స్థితి !!
పూర్వ కాలంలో ఎందరో ఋషులు , మునులు వేలాది ఏళ్లు కష్టపడుతూ మోక్షం కోసం  తపస్సు చేశారు !, కానీ
ఇప్పుడు పరిస్తితి వేరు,! ఎలా సాధించాలి మోక్షం ? అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస,, మీరా, లాంటి భక్తులు జీవించి ఉండగా నే ముక్తిని సాధించారు.
నేను అనే అహంకారం ఎపుడైతే తొలగిపో తూ, ఉంటుందొ , అప్పుడు  నేను అనబడే అసలు స్వరూ పాన్ని  తెలు సు కోవడమే ఒక తపస్సు!!
లేదా ఒక బ్రహ్మ జ్ఞాని సమక్షంలో నీవు పొందే జ్ఞాన ప్రకాశం గురించిన విచారణ యే  మోక్షం లేదా తపస్సు అవుతుంది !
నేను అంటే" ఒక చైతన్య స్వరూ పం !"అని తెలియని కారణంగా ,అజ్ఞానం తో ఆత్మ సాక్షాత్కార దర్శనానికి నోచుకోలేక బంధం అనబడే భ్రమల ఉచ్చు ల్లో తనకు తానే స్వయంగా బందీ అవుతున్నాడు!
అహంకారమే నేను అని జీవుడు భావిస్తున్నాడు !
ఎంతటి మహాపండితుడైన, కూడా మోక్ష మార్గాన్ని పొందడానికి ఒక గురువును ఆశ్రయించి  అతడు చూపిన జ్ఞాన మార్గంలో పయనించి మోక్షాన్ని సాధించాలి కానీ,, అతడు ఎంత ప్రయత్నించి నా కూడా స్వయంగా ముక్తిని పొందలేడు ! అందుకే  ఈ ప్రపంచాన్ని
"మాయా జగత్తు!" అంటారు
జగత్తు అంతా మాయా మయం!
""లేకనే ఎంతో ,,చేసిన మాయా,,
ఎటు పోయిం దో జాడే లేదు ,!
ఏమై పోయిందో, ఎలా ఉందో,
వెదుకు దా మంటే దాని జ్ఞాపకాలే లేవు !!"""
ఈ విష్ణు మాయ తొలగాలంటే గురు కటాక్షం తప్పనిసరి !
ఇది మన సనాతన హిందూ ధర్మంలో గురువు సంప్రదాయ వైభవానికి ఉన్న అద్భుతమైన గుర్తింపు !!
అంత గొప్పది కనుక నే,,
""గురుర్బ్రహ్మ గురుర్విష్ణు,, గురుర్దే వో మహేశ్వర,, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ , తస్మై శ్రీ గురవే నమః  !""అంటూ వేద వాణి ఘోషిస్తూ ఉంది,
భగవద్గీత లో భగవాన్ శ్రీ కృష్ణుడు బోధించిన అత్మ సాక్షాత్కార సాధనా ప్రక్రియ ద్వారా ఆత్మానందాన్ని పొందుతూ , ఆత్మలో పరమాత్మ ను దర్శించే ప్రయత్నం చేద్దాం
అందుకు పరంధా ముని కృపను కోరుకుంటూ, ఆ మహా భాగ్యా నికి తగిన యోగ్యత ను అనుగ్రహించమని ప్రార్థిం చు దాము ;!
వేద మాత , కు జై!
గురు సంప్రదాయానికి జై;
శివాయ గురవే నమః
జగద్గురువు శంకరాచార్యుల కూ జై!
గీతాచార్యుడు శ్రీ కృష్ణ భగవాను ని కి జై !
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!""

అహం

Nov 29, 2019, Karimnagar
"అహం " అంటే నేను . ఇది  రెండు రూపా ల్లో ఉంటుంది.. ఒకటి భావం ఇది సదా మారుతూ ఉంటుంది , రెండవది స్వరూపం, ఇది శుద్ధ చైతన్యము , దీనినే అత్మ అంటారు..
గాఢనిద్రలో అంటే సుషుప్తి  అవస్థ లో అహం భావం ఉండదు, కానీ అహం ఉంటుంది!! అది లేక పోతే  జీవికి అది శాశ్వత నిద్ర అవుతుంది !!
ఈ అహం ఎప్పుడూ ఉంటుంది, ఈ చైతన్య స్వరూపానికి   , దేశ కాల పరిస్తితి లతో సంబంధం లేదు ! ఎందుకంటే
అది స్వయంగా చైతన్య ప్రకాశం,!
ఈ దేహం ,శరీరం, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు ,అజ్ఞానము ఇవన్నీ" నేను "కాదు!
నేను సద్రూప  చిద్రూప చైతన్యాన్ని!
""నేను చిక్కి పోయాను! అయ్యో !" అనుకున్నప్పుడు , మనకు నేను దేహాన్ని కాదని తెలుస్తోంది కదా !!
"నాకు కళ్ళు సరిగా కనపడటం లేద"ని అన్నపుడు" నీవు ,కళ్ళు"" వేరని తెలుస్తోంది కదా !!
""నాకు ఆయాసంగా ఉంది నడవలేక పోతున్నాను ప్రాణం పోతోంది !"" అన్నపుడు "నీవు ప్రాణానివి ""కూడా కాదు అని తెలుస్తోంది కదా!! ఇక మనలో ఉన్న
బుద్ది, మనసు ,చిత్తము అహంకారము కూడా"" నీవు కావు !""ఎందుకంటే నిద్ర లో అవి శూన్యం అవుతున్నాయి!!
""నీ మనసుకు ఏం తెలుసో అది నీకు తెలుసు,! నీ మనసుకు ఏదితెలియదో, ఆ తెలియద నే "అజ్ఞానం"కూడా నీకు తెలుసు !
కనుక నీవు మనసువి కావు! అఙ్ఞానివి కూడా కాదు !
అవన్నీ మిథ్యా రూపాలు!
వానిలో" నేను "అనేది లేనే లేదు !!కానీ "నాది "అనే అహంభావం మాత్రం ఉంది !!
సైకిల్ లో నీ వివిధ భాగాల సమూహం వలె ,,ఈ దేహం కూడా ఒక అసెంబ్లీ ఫిట్టింగ్,!!
రక్తం ,మాంసం ,ఎముకలు ఇలా ఎన్నో  కలిస్తే దేహం అవుతుంది,!
ఇది "నేను "అనేది ఉన్నంతవర కే ,,ఈ దేహం ఉంటుంది ,!
ఆ ""నేను ""పోతే అది శవంగా మారుతుంది, ఇక అది  కదలలేదు,! మాట్లాడలేదు!
ఇటువంటి స్థూల దేహం, నుండి, లో ఉన్న మనో బుద్ది అనబడే"" సూక్ష్మ శరీరం""  దూరం కావడం వల్ల దేహం  "శవం" "అవుతోంది!
  చావు అంటే ఇదే !!
ఈ విధంగా బయట పడిన సూక్ష్మ శరీరం మరొక ఉపాధిని ధరిస్తూ వుంటుంది !
ఎందుకంటే ,ఈ జీవుడు అనుభవించాల్సిన కర్మ అంటూ ఒకటి ఉంటుంది కనుక  !!
ఇవన్నీ చనిపోక ముందే తెలుసుకోవాల్సిన విషయాలు !
కన్ను, ముక్కు ,చెవి ,నోరు ఇందులో ఏది లేకున్నా నీవు ఉంటావు,!
అందుచేత ఆ ఇంద్రియాలు నీవు కాదు!
అవన్నీ జడాలు !! వాటికి స్వయం ప్రకాశం లేదు !
"అహం" అనే స్వరూపం మీద ఆధారపడి  అవి ప్రకాశిస్తూ ఉంటున్నాయి ,! అవి మిథ్యా బింబాలు !స్వప్రకాశం లేదు!
చైతన్యం అనేది  ఎప్పుడూ ఒకటే ఉంటుంది !అది అనేకం కాదు !
అనగా నీలో నాలో అన్నింటిలో అంతటా ఒకే చైతన్యం ఉంది!
ఈ చైతన్యమే ఆత్మ !
దీనినే "సత్తు "అంటారు అనగా సత్యము నిత్యము శాశ్వతము అయినది!!
ఈ ఆత్మను గురించిన జ్ఞానం తెలుకొడానికి  మరొక టి అంటూ వేరే ఉండదు,! ఆ జ్ఞానం అత్మలోనే ఉంటుంది !;
దానినే ""చిత్తు "అంటారు
ఆత్మ స్వరూపాన్ని "సత్" అనీ, ఆత్మ జ్ఞానాన్ని "చిత్" అనీ వ్యవహరిస్తూ ఉంటారు !
సత్ ,చిత్ , ఇవిరెండూ ఒకటే !
ఆ ఒకటి ఎవరూ ? "అంటే అది నేనే!
ఆ సద్రూపమే చిద్రూపం!! ఆ చిద్రూపమే ఈ ఆత్మ స్వరూపం  !!
జ్ఞానం బ్రహ్మ !! అహం బ్రహ్మ !
అహం బ్ర హ్మో స్మి!!
నేనే బ్రహ్మ ను!! జ్ఞాన స్వరూపాన్ని !
""తత్వ మసి ""అనగా నేను ఉన్నాను ! అని అర్థం కదా ! ఉన్నాను  అనడానికి ప్రమాణం స్వతః స్సిద్ద మైన మనర్ ఈ ఆత్మ జ్ఞాన మే !! ఇది నిరూపించుకోవడానికి వేరే ప్రమాణం అవసరం లేదు!
ఆత్మ స్వరూప జ్ఞానంతో పొందే స్వయం అనుభవం ఇది !
అద్వైతం అంటే " సత్, చిత్" రెండూ వేరు కానటువంటి ది ఈ ఆత్మ స్వరూపం !
ఇదం వృత్తి  ఎప్పుడూ మారుతూ ఉంటుంది కానీ అహం వృత్తి మాత్రం శాశ్వత చేతనత్వం కలిగి మారకుండా ఉంటుంది !!
నేను ఉన్నాను ,"సత్"!!
ఆ నేను ప్రకాశిస్తూ ఉంది ""చిత్""!
ప్రపంచం ఉంది ""సత్""!
ప్రపంచాన్ని తెలుసుకునే నేను ఉన్నాను ""చిత్!"
నిద్రలో ప్రపంచం లేదు,
అయినా నేను ఉన్నాను!!
అనగా ప్రపంచం మిథ్య
దానికి స్వయం ప్రకాశ త లేదు!!
నేను ఉంటే అది ఉంటుంది! మిథ్యా అంటే భ్రమ,!
కాబట్టి జగత్ మిథ్యా! బ్రహ్మ ఒక్క టే సత్యం ,!
జీవుడు వేరు ,,ఈశ్వరుడు వేరు కాదు!
ఇద్దరిలో ఉన్నది ఒకే చైతన్యం! ఇద్దరిలో
ఒకటే తేడా ,,!జీవునికి అజ్ఞానం పొర వల్ల తనను తాను తెలుసుకోలేక పోతున్నాడు
కానీ ఈశ్వరుడు ఈ  మాయను తన వశం చేసుకున్నాడు
అట్టి ఈశ్వర దర్శనము దుర్లభం ఎందుకంటే ఈశ్వ రుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు!. ఏ రూపంలో ఉంటాడో కూడా తెలియదు ,!
అందుచేత ఈశ్వరుడు తెలియాలంటే అతడిని గురించిన జ్ఞానం వుండాలి!
""అధాతో బ్రహ్మ జిజ్ఞాస ,!"" అంటే బ్రహ్మ ను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మనకు ఉండాలి !!
భగవంతుడు ఉన్నాడు కనుక  భగవంతుని గురించిన జ్ఞానం కూడా మనకు ఉండాలి!! మనకు కావాల్సింది దేవుని
దర్శనం కాదు  ,అతడి,,జ్ఞానం!
""సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ !!"కాబట్టి ,
నీది అజ్ఞానం తో కూడిన ఉపాధి!
ఈశ్వరుడు మాయ తో కూడిన ఉపాధి !
ఇరువురిలో ఒకే చైతన్యం  ప్రకాశిస్తూ ఉంటుంది ! ఈ రకమైన ఆత్మ శోధన నే,
ఈ జ్ఞానా న్నే మనం ""ఆత్మ సాక్షాత్కారం"" అంటున్నాము !
భగవద్గీత లో భగవానుడు చెప్పింది ఇదే,!, అత్మ అనేది  " సత్యము నిత్యము శాశ్వతము !"", అయినటువంటి అత్మ లో , అజ్ఞానం తొలగాలంటే పరమాత్మ ను ప్రతిష్ఠిం చుకోవాలి ,! అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు ,! లేకుంటే, నీవూ జడమే,, ప్రపంచమూ కూడా నీకు ఒక జడ పదార్థం లా ఆగుపిస్తు ఉంటుంది,
నీలో ఉన్న ప్రకాశ మే చైతన్యమే ప్రపంచం లో కూడా ఉంది, అది పరమాత్ముని ప్రతిరూపాలు,
అలా, విశ్వమంత టా నిండి ఉన్న ఆ పరమాత్మ స్వరూప జ్ఞాన వైభవాన్ని, అత్మ జ్ఞానంతో అణువణువునా  దర్శించ గలవు ,!  రమణ మహర్షి లాంటి మహాత్ముల వలె , నిరంతర సాధనా ప్రక్రియ ద్వారా  దేహాన్ని మరచి ,ఎవరికీ వారే అనుభవ పూర్వకంగా పొందే అద్భుత అమోఘ అపురూప
అత్మ సాక్షాత్కార వైభవం ,, అద్వితీయం ,పరందాముని ఆనంద నిలయం , బ్రహ్మ పదార్థం , అదే కైలాసం! అదే వైకుంఠం ,! అదే పరమ పథం ,! పరమాత్ముని నిర్గుణ నిరాకార  సచ్చిదానంద  ఘన స్వరూపం ;
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!""

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...