Thursday, November 28, 2019

దైవ బంధం

Nov 28, 2019 Karimnagar
ఈ ప్రపంచం లో ఒకరినొకరు ప్రేమించు కోకుం డా ,ఎవరూ కనిపించరు, !
,,ఏదో ఒకదానిని ,,ఎవరో ఒకరిని మరొకరు విధిగా  ప్రేమిస్తూ ఉంటారు,!
కానీ భక్తుడైనటువంటి వాడు మాత్రం,, కేవలం భగవంతుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు,
ప్రతీ వాడి అంతరంగంలో  ప్రేమ దాగిఉంటుంది,! కానీ,దానిని మనకు ఇష్టమైన వారికి మాత్రమే పంచుతూ ఉంటాం,! అందరికీ పంచ ము !;
ఈ జగత్తులో మనకు ఇష్టమైన వాళ్ళు ,ప్రియమైన వాళ్ళు ఎవరూ ?? అంటే ఎవ్వరం కూడా  ఖచ్చితంగా చెప్పలేం, ! ఎందుకంటే,,
ఎవ్వరిని కలిసినా ,, ప్రేమించినా ,వారు ఎదో ఒకరోజు  మనల నుండి శాశ్వతంగా వెళ్లి పోవాల్సిందే , లేదా మనం అయినా పోవాల్సిందే!!
ఈ దేహాలు ఒకరోజు స్మశానంలో నిలిచి పోతాయి,!, దాని తో  ఇన్నాళ్లు  కాపురం చేసిన  ప్రాణాలు పైకి లేచిపో తాయి,!!
అందుచేత ,ఈ మధ్యలో ఇలా మనం ఏర్పరచుకున్న  ఈ ప్రేమలు,,సంబంధాలు తాత్కాలికం, మృగ్యం అవుతున్నాయి,
,,, అయినా  ఇదంతా చోద్యం లా చూస్తూ కూడా ,వీరితో ప్రేమలు పంచుకుంటూ పెంచుకుంటూ,, వారు దూరమైతే రోదిస్తూ, గుండె పగిలేలా ఏడుస్తూ, జబ్బులూ, రోగాలు తెచ్చుకుంటూ ,దుఖిస్తు ఉంటున్నాం,!! అలాంటి ప్రేమల వలన , క్రమంగా మన జీవితాల్లో ,
చివరకు ఒక అసంతృప్తి, వెలితి ని , శోకాన్ని మిగులుస్తు ఉంటున్నాయి  .
ఇలా ఎంత కాలం, ఎంత మందిని  ప్రేమిస్తూ, బాధపడ తూ ఉంటామో మనకు తెలియదు,!
అందుకే నిత్య సంబంధం,శాశ్వత సంబంధం మనతో ఉన్న ఆ  పరమేశ్వరుని తో నే పెట్టుకోవాలి , అతడిని మాత్రమే గుర్తిస్తూ  ప్రేమించాలి.!
.మిగతావన్ని అనిత్య సంబంధాలు!! ,,ఉంచాలనుకుంటే ఉంచవచ్చు!, లేదా తెంచు కోవచ్చు,,! దానితో పెద్దగా  బాధ పడాల్సిన అవసరం లేదు,!
కానీ ,,దైవంతో మాత్రం మనకు నిత్య సంబంధం ఉంది, ఇదే సత్యం ,! ఇదే నిత్యం!
ఇదే ప్రేమను శాశ్వతమైన భగవంతుని చరణాల ముందు సమర్పించ గలిగితే అది భక్తి అవుతుంది ,!
   ఈ భక్తి రెండు రకాలు !!
ఒకటి భావా త్మక భక్తి, రెండవది సాధనా భక్తి !!,  భావా త్మాక భక్తి ,భగవంతుని గురించిన జ్ఞానం తో  ముడివడి ఉంటూ ,మనసులో భక్తి భావం  ఏర్పడుతుంది,!
సృష్టిలో అంతటా నిండి ఉన్న పరమాత్మ గురించి అవగాహన ఉంటే, అర్థం చేసుకుంటే ,,మన ప్రేమను అటువైపు మళ్ళిస్తే ,,అది నిత్య సంబంధం గా భక్తి, భావ తరంగా లుగా మారి, ""దైవభక్తి ""అవుతోంది,!
ఇదీ, మన అంతరంగం లో ఆంతర్యం లో నే ఉంటుంది,,! బయటకు కనబడేది కాదు,!!
కానీ దానితో మానవత్వం దైవత్వం తో పరిమలిస్తు ప్రకాశిస్తూ  ఉంటుంది, !
భక్తి కలిగిన తర్వాత దానిని కార్య రూపంలో పెట్టకుండా, ఏ  భక్తు డూ ఉదాసీనంగా ఉండలే డు ,!ఇక భక్తి యొక్క రెండవ  రూపం ఇదే , క్రియా భక్తి,!; సాధనా భక్తి!;
సుగంధ భరిత మై పరిమళం కలిగిన ఒక పుష్పం , తన సౌరభాన్ని ఎలా పరిసరాలకు వెదజల్లుతూ ఉదారంగా అందిస్తూ ఉంటుం దో, అలాగే భక్తుడు కూడా,ఏదో ఒక సాధనా ప్రక్రియ ద్వారా ఇతరులకు అందజేస్తు , అంతటా అందరిలో భగవంతుని స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటాడు,,, ఎందుకంటే,
భగవంతుడు, ఎన్నో రూపాల్లో మన చుట్టూ  ఆవరించి ఉన్నాడు, చెట్టు పుట్టా కొండా కోనా నీరు గాలీ, నీలో నాలో ఉంటూ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, అది తెలియాలంటే అతడిని ప్రేమించడం తెలియాలి, అదే భక్తి! అదే ప్రేమ! అదే జ్ఞానం!
జననం కాకముందే మనకు కావాల్సిన సకల ఆహార పదార్థాలు, బంధు జాలము , ప్రకృతి సంపదలు మనం అడగకుండానే పరమాత్ముడు  ,రెడీ చేసి పెట్టాడు , అంతటి అపార కరుణా సాగరు ని అనుగ్రహం వల్లే మనం బ్రతుకుతూ ఉన్నాం,,
ఇది గుర్తిస్తే కృతజ్ఞత,! గుర్తించకుండా అహంకా రిస్తే కృతగ్నత!! ద్రోహం! అవుతుంది,,,,
ఈ దేహంలో" రక్తం"" ఉండడం వల్లనే  తినే ఆహారం లోని పోషక పదార్థాలు  శరీరానికి  అందుతూ దానికి శక్తిని కాంతిని, ఆయువును, ఇస్తూ ఉన్నాయి,
ఇలా ప్రాణులకు జీవనాధారంగా ఉంటున్న , ఈ రక్తం ఎక్కడినుండి  వచ్చిందో  ఎవరి దయ వలన ప్రవహిస్తూ ఉందో, మనం గుర్తించాలి ,!
పీల్చే గాలిలొ, నడిచే నేలలో ,,త్రాగే నీటిలో అంతటా తానై ఉంటూ మన అవసరాలు తీరుస్తూ ఉంటున్న భగవంతుని తో నే  నిత్యం సంబంధం పెట్టుకోవాలి ! , మన ప్రేమను అతడితో నే పంచుకుంటూ పెంచుతూ పోతూ ఉండాలి.!
అనగా ఉదయం నుండి రాత్రి పడుకునే వరకూ ఏ పనీ చేస్తూ ఉన్నా, ఎటు వెళ్ళినా , త్రాగిన తింటున్నా పరమాత్మని మరవకుం డా స్మరిస్తూ గడపాలి,
మన బ్రతుకు నకు ఒక అర్థం ఏర్పడాలంటే  భగవంతుని ధ్యానిస్తూ కీర్తిస్తూ మన పనులు చేసుకుంటూ పోవాలి
అలాంటి భావ సంపద, సాధనా పటిమ ను దృడతరం చేస్తూ , భగవంతుని కి చేరువ గా ఉండే ప్రయత్నం చేద్దాం,.;"" సర్వం శ్రీకృష్ణా ర్పణ మస్తు!
స్వస్తి రస్తు, శాంతి రస్తు!
శుభమస్తు !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !!

అంతా రామ మయం

Nov 27, 2019 Karimnagar
""శ్రీరామచంద్ర , !!సద్గుణ సాంద్రా,! కారుణ్య సాంద్ర,,!, సకల గుణాభి రామా, ప్రభో !
ఈ హనుమ ,నీ దాసుడు,, నీకు నమ్మినబంటు,,!
ఇహము నిమ్ము శ్రీరామా !
పరము నిమ్ము రఘురామ !
ఒకే ఒక వరాన్ని కరుణతో నాకు ప్రసాదించు  , రఘుకుల సోమా!
నీ పాద పద్మాలను, నా మనస్సు ఆకర్షించ నీయి తండ్రీ,,!
ఎక్కడ నీ  ""శ్రీరామచరిత" అనే సంత కనబడితే ,,లేదా వినబడితే ,,అక్కడికి నా జీవన యాత్ర సాగ నీ, సీతా రామా !!
సాకేత్ రామా, !నిరంతరం నేను నీ నామమే పలుకుతాను,!
నీ శౌర్య ప్రతాపాల గురించి అనుక్షణం ఏమరక వింటూ ఉంటాను ,!
పావన నామా , !రామా!
నిన్ను తలచు కోవడం లో ఉన్న అందం , మరెక్కడా అగుపించ దు కదా! కౌసల్యా రామా,!
అమర గణాలు, ముని శ్రేష్ఠుులు నిన్ను తలుస్తారు! నిన్నే దైవంగా కొలుస్తూ ఉంటారు,! నీ దయాగుణాలే స్ఫూర్తిగా తీసుకుంటారు ,!
ఈ జగతిలో నిన్ను మించిన దైవం ఎవరున్నారు?? అయోధ్య రామా ,,!
మన భారత దేశంలో ఎన్ని జాతులు ,ఎన్ని విభిన్న రీతులు ఉన్నా , కళ్యాణ రామా,!! వారంతా ముక్తకంఠంతో అనందం తో  నీకు నీరాజనం  పడుతూ ఉంటారు కదా రామయ్యా!!
నీవు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడివి,!! షోడశ కళా ప్రపూర్ణ ప్రకాశ కుడివి,, కదా ,,! పట్టాభి రామా,,!
అంతటి నీ విశ్వరూపం లో కేవలం ఒక చిన్న ముత్యం అంతటి నీ మహనీయ రూపాన్ని చేగొని,, సకల భువనాలు తిరిగి ,,నీ సౌందర్య ప్రతాప లావణ్య గుణ గణాలను చాటి చెప్పి వ స్తాను , దశరథ రామా ,,!!
అలా భూమి చుట్టూ నేను తిరుగుతూ ఉండగా, ఎవరైనా ,ఎక్కడైనా నీ గుణగణాలను పొగుడుతూ ఉండగా చూసినపుడు,, నేను  ఆనందం పట్టలేక మేరు పర్వతమంత ఎత్తుగా  పెరుగుతూ ఉంటాను
జానకీ రామా ,,!!
అలా భూమండలం అంతా వ్యాపించే నీ లీలలు, నీ పుణ్య పురాణ కథలు వైభవాలను నేను నీటిని పీల్చుకునే మేఘం వలె వాటిని సంగ్రహించి, మరల నీటిని వదిలే మేఘం వలె  , నేను తిరిగి తిరిగి  అలసట ఆయాసం లేకుండా అంతటా ,, శ్రీరామ భక్తులందరితో  కల్పవృక్షం లాంటి రామాయణ కావ్య గానం చేయిస్తూ ఉంటాను ,,!
రామ రామ జయ రాజా రామా ,,!!
ఆ నింగిలో మెరిసే సూర్య చంద్రులు కానీ, తలుక్ తళుక్కున మెరిసే తారా గణం, నక్షత్ర సముదాయం గానీ, నీ నవ్య దివ్య ముగ్ద మోహన సుకుమార సుందర సురుచిర లావణ్య వైభవ ప్రకాశ కిరణాల ముందు సాటిరావు కదా ,!! శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా,,! కాలాత్మక పరమేశ్వర రామా,,! శేష తల్ప సుఖ నిద్రిత రామా,! బ్రహ్మాది అమర ప్రార్తిత రామా !!
,  అంతా రామ మయం !ఈ జగ మంతా రామ మయం !,
హే రామ్ !!నాకున్న పని ఒకటే !! శ్రీరామ భక్తులకు రక్షణ ఇవ్వడం!! , రామ కథను వింటూ ,ప్రోత్సహించడం !! ధర్మాన్ని రక్షించడం !, రామనామ గానం చేయడం!! అంతే .
శ్రీరామా సుగుణ ధా మా ,!
నీ పాద పద్మాలు అనబడే బంగారు పంజరంలో మానస రాజహంస లాంటి నా మనసు అనే చిలకను ఆ పంజరం లో బందీ ని చెయ్యి ,,! దయ యించి కనికరించి ఈ ఒక్క వరాన్ని అనుగ్రహించ వా,!! తారకనామా ,! జగదభి రామా !త్రిభువన జన నయనాభి రామా,!!, భూమి సుతా కామా ,! కోమల నీల సరోజ శ్యామా,! రఘువరా !, రామ ప్రభో !!పాహిమాం,, రక్ష మాం , శుభ కర శ్రీ రామా !!
నమో నమః !!
హరే కృష్ణ హరే కృష్ణా !!

Tuesday, November 26, 2019

వేణు నాదం

Nov 26, 2019 Hyderabad
రాధా మనోహరుడు,,శ్రీకృష్ణుడు వేణు నాదం లో నిపుణుడు.! దానికి గోపికలు  ముగ్దులు అవుతున్నారు , వారికే కాదు, ఆ వేణుగానం విన్న ప్రతీ జీవికి మధుర మనోహరంగా ఉంటుంది!!
ఆ విధంగా శ్రీకృష్ణుడు మురళీ గా నం చేస్తూ,, తన సఖులతో గోవులను అరణ్యమునకు తోలుకొని పోవు దృశ్యం చూడగలుగు కన్నులకు నిజమైన "సంసిద్ది ""ప్రాప్తిస్తుంది!!
అలా బాహ్యంతరం లో ఆ కమనీయ, రమణీయ దృశ్యాన్ని నిరంతరం స్మరిస్తూ ,,ధ్యాన నిమగ్ను లై ఉన్నట్టి వారు ఉత్తమ సమాధి స్థితిని పొందుతారు.. కూడా!!
""సమాధి "అనగా ఒక నిర్దిష్ట వస్తువుపై సమస్త ఇంద్రియ కార్యాలను కేంద్రీకరించ డం,, కదా!!
శ్రీకృష్ణ భగవానుని లీలలన్నీ, ధ్యాన మరియు సమాధుల పరమ లక్ష్యమౌతూ ఉంటోంది,!
ఆ విధంగా నిరంతరం శ్రీ కృష్ణ చైతన్యంలో నిమగ్నులై ఉండు వాడు యోగులందరిలో శ్రేష్ఠుడు అవుతున్నాడు!!.
అతని చేతిలోని వేణువు అదృష్టాన్ని ఊహించలేము కదా, మనం,!!
, గోపికలకు మాత్రమే స్వంతమైన శ్రీకృష్ణుని అధరామృతాన్ని ఆస్వాదించడం  కోసం,, ఆ వేణువు ఎన్ని పుణ్యకర్మలు చేసిందో కదా ??
శ్రీకృష్ణుని వేణు నాదము వింటూ నెమళ్ళు పిచ్చెక్కి పోతూ విహరిస్తూ కృష్ణ దర్శన భాగ్యం కోసం తిరుగుతూ ఉన్నాయి,,
గోవర్ధన్ పర్వతం పై,, ఉంటూ   లోయ లలో  కూడా ఉంటున్న, సకల జంతువులు ,,వృక్షాలు, మొక్కలు కూడా నర్తిస్తూ ఉంటున్న నెమళ్ళ ను చూస్తూ నిశ్చేష్టులై శ్రీకృష్ణుని వేణు నాదాన్ని శ్రద్ధగా ఆలకిస్తు ఉన్నాయి,,
గోపికలు ,, నిజానికి పల్లె పడుచులు అయినా శ్రవణం ద్వారా వేదశాస్త్రాల లో చెప్పబడిన అత్యున్నత సత్యాలను గ్రహిస్తూ ఉంటారు,,!! అది మన వైదిక సంస్కృతి ప్రభావం,!!
"కృష్ణ వేణు నాదం "వింటూ గోవులు సైతం పరవశిస్తూ ఉంటాయి, అవి తమ పొడవాటి చెవులను నిక్కపొడుచుకొని వింటూ కన్నుల నుండి నీరు స్రవిస్తూ  ఉండగా తదేకంగా కృష్ణయ్య ను చూస్తూ ఉంటూ,, పరమాత్ము ని దర్శన భాగ్యం కొరకై జీవుడు ఎలా రోదించా లో మనకు సూచిస్తూ  ఉన్నాయి.
ఇదే సమాధి స్థితిలో పక్షులన్నీ కొమ్మలపై,, రెమ్మలపై నిశ్చలంగా కూర్చుండి నల్లనయ్య ను చూస్తూ అతడి వేణు గానానికి స్తబ్దులై సర్వమూ మరచి, వేణు గానం లో లీనమై ఆలకిస్తూ ఉన్నట్టు ఆగుపిస్తూ ఉన్నాయి,!!
అవి సాధారణ పక్షులు కావనీ, ఏ మహర్షు లో,, మహా భక్తు లో, విద్వాంసు లో అయి ఉంటారు, అలాంటి వారే , అనితరసాధ్యం అయిన ఆ వేద విజ్ఞానం పట్ల ఆసక్తి చూపుతుంటారు, కదా!
,,, సహజంగా ,శరద్ ఋతువులో ఎండ తీవ్రంగా ఉంటుంది. కానీ కన్నయ్య వేణు నాదం తో , గోల్లపిల్ల ల పై దయ ఉంచి, ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ,,వారికి అలసట కలగకుండా గొడుగుల్లా ఉంటున్నాయి.!!
వేణు గానం చేస్తూ ఉంటున్న శ్రీకృష్ణుడు,, సకల చరాచర జీవులతో సన్నిహిత మైత్రిని కలిగి బృందావనం లో సంచరిస్తూ ఉండగా, అందలి ప్రతీ వస్తువు అద్భుతంగా అగుపిస్తు ఉంది.!!
చరములైన జీవులన్నీ తమ పనులన్నీ నిలిపి వేస్తూ ఉన్నాయి, ఇక ఆచరము కైన చెట్టూ ,పుట్టా ,కొండా, కొనలన్ని పారవశ్యం తో  తో చలించి పోతూ ఉన్నాయి,,!
బృందావన తీరాన్ని ఒరిసి, ప్రచండ వేగంతో వెళ్లే యమునా నది మాత,, ఈ నల్లనయ్య వేణు నాద స్వర మాధుర్యాన్ని గ్రోలుతూ ,,తన్మయంగా సొలుతు ,తూలుతూ, తన దూకుడు వేగాన్ని తగ్గించి, చప్పుడు కాకుండా, వింటూ మెల్లిగా ప్రవహిస్తూ ఉంది,!!
నింగిలో ని  దేవతా గణం,, నందనందనుని వేణు గానానికి అనుగుణంగా రాగ తాళ భావ స్వర యుక్తంగా, వివశులై , ఆనందంతో నాట్యం చేస్తూ ఉండి పోయారు ,!!
ఇక శ్రీకృష్ణుడే తమ ప్రాణంగా ఊపిరిగా జీవన చైతన్యంగా భావించే గోప గోపాల కుల మనస్తితి చెప్పవశమా .??
ఎక్కడివారు అక్కడే చైతన్యాన్ని కోల్పోయి , పిల్లన గ్రోవి మాధుర్యంతో రాతిబొమ్మల వలె , మంత్రముగ్ధుల వుతూ ఉన్నారు!
,చంటి పిల్లలకు  పాలిచ్చే తల్లులు కూడా మైమరచి వేణు గానం వింటూ ఉంటే, ఆకలితో ఉండి కూడా,
చనుబాలు కుడిచే పాపలు  పాలు త్రాగడం  మాని అలాగే ఆలకిస్థు తల్లి పొత్తి ల్లలో చూస్తూ ఉండి పో తున్నారు!!
అలాగే అవు లు గడ్డి మేయడం మానేస్తే, ఆ ఆవుల వద్ద పాలు త్రాగుతున్న లేగ దూడలు కూడా పాలు త్రాగడం మానేసి, వేణు గానం వినిపించే దిశలో మోర సారించి చూస్తూ ఉన్నాయి,!!
నాగుపాములు , పుట్టలో నుండి బయటకు వచ్చి ఎత్తిన పడగను కదపకుండా మంత్రం వేసినట్టుగా వేణుగానం లో లీనమై పోతున్నాయి,!!
గోపికలు తమ భర్తలకు అన్నం వడ్డిస్తూ ,,వేణు నాదం వినబడగానే చకితులై వడ్డన మానేసి ఇంటి గుమ్మానికి ఆనుకొని వింటూ చిత్తరువుల వలె నిలబడి పోయారు.
గోపాలకులు అయితే , బొమ్మల్లా నిలబడి ఎక్కడివారు అక్కడే చేష్టలుడిగి పోతున్నారు!
,,  యశోదా నందనుడు ఊదే వేణు నాదం లో నుండి, సంగీత సప్త స్వరాలు, సుమధుర ధ్వనులు వెలువడుతు ఉంటాయి, !రాగం తాళం భావం సాహిత్యం ఇవన్నీ, సంగీత పిపాసకులకు,విద్వాంసుల కు మాత్రమే అవగాహన ఉంటుంది.
కానీ బృందావనం లో అలాంటి విద్వత్తు , స్వర జ్ఞానం ఉన్నవారు లేరు, అయినా  సర్వప్రాణికోటి నీ,, తన స్వరమాధుర్యం తో  పరవశింప జేసే  సమ్మోహన శక్తి ,,ఆ వేణు నాదం లో నిబిడి  ఉంది,!
అపర గోలోక దేవతా స్వ రూపిణీ , శ్రీకృష్ణ భగవానుని అనురాగ ఆరాధ్య దేవత, అతడి ప్రాణం అయిన రాధాదేవి యే ,,,శ్రీకృష్ణుని ఉచ్వాస నిశ్వాస రూపంలో, సాగుతూ ఉంటుంది,,
ఆమె తన శక్తి చైతన్యానికి ప్రతీక గా, అతడి నోటినుండి  ,, అతడి పెదవులను సున్నితంగా ఆనుకొని యున్న వేణువు రంధ్రం గుండా లోనికి. వెళ్లే వాయు వై ,సప్త రంధ్రాల నుండి వెలువ డే సప్త స్వరాల మేళవింపు గా బయటకు వస్తూ, వీనుల విందుగా , మృదు మధురంగా, మనోహరంగా , విశ్వంలో వినిపిస్తూ ఉంది,,
, రాధ యే మాధవుడు,! మాధవుడే రాధాదేవి ""గా అవినాభావ సంబంధం తో, అద్వైత ప్రేమామృత స్వరూపం తో విరాజిల్లే  అనురాగ ఆదర్శ దంపతులు, రాధాకృష్ణులు!!""
""వేణువు "అంటే శ్రీకృష్ణుడు ""వేణునాదం"" అంటే రాధాదేవి. ప్రేమామృతం, !!
వేణు గాన లోలుడు, వేణు గాన విశార దుడు, వంశీ లోలుడు, మురళీ మనోహరుడు,, మురళీ మోహనుడు,, వంశీ ధరుడు,, ఇలాంటి ఎన్నో వేణువు గురించిన బిరుదులు గల ఓ గోపాల కృష్ణా !,
బృందావనం లో నీవు ఇప్పటికీ రాత్రివేళ ల్లో రాధాదేవి తో సంచరిస్తూ, ప్రకృతిని  భువన మోహనంగా ,పులకింపజేస్తూ  వేణుగానం చేస్తూ పరవశిస్తూ ఉంటావు , కదా !
ప్రభూ !!, అలాంటి నీ సురుచిర సుందర జగన్మోహన ఆకారాన్ని , సౌందర్య లావణ్య స్వరూపాన్ని, రాధా సహిత వేణుగానం చేస్తున్న గోపాలకృష్ణ భగవానుని మూర్తిని, భావిస్తూ , స్మరిస్తూ, తరించే భావ సంపద ను మాకు  దయ యుంచి అనుగ్రహించవా,గోవిందా!!  మాధవా ,శరణు! గోపాలా శరణు,! గోపీజనవత్సలా, వేణు గాన విలోలా, శరణు !.
స్వస్తి .!
హరే కృష్ణ హరే కృష్ణా !!""

సత్సంగము

Nov 25, 2019 Hyderabad
సత్సంగ ము ఎంత గొప్ప విషయ మో అనుభవం ద్వారా తెలుస్తుంది,
అందరూ వెళ్తారు ఆలయానికి , ఏదో ఒక టీ నివేదిస్తారు, ఎవరికీ వారే ఏదో నోటికి వచ్చింది చదివే స్తారు, లేదా పూజారితో అర్చన లాంటిది చేయిస్తారు,
ఇలా ఎంతో మంది భక్తులు ఎంతో ఆరాటంతో , భక్తి శ్రద్ధలతో , దైవాన్ని సేవించు కోవాలన్న ఆపెక్షతో దేవాలయాన్ని దర్శిస్తూ ఉంటారు,
కానీ  వారు తాము దేవుని సన్నిధిలో ఎంత సేద తీరాలో అంతగా తృప్తి  దొరకడం లేదు,
అందుకే వారు, ఎవరూ దొరికితే వారితో ఏదో మాట్లాడుతూ వెళ్ళి వస్తూ ఉంటారు
, నిజమైన ఆనందం తృప్తి ,కలగాలంటే తనలో ఉన్న భక్తిభావాలు  , దేవుని సన్నిధిలో వెలిబుచ్చాలి, కానీ ఏమీ మాట్లాడని  దేవునితో మన ఆవేదన ఆరాటం మనో భీష్టాలు ఎలా చెప్పు కునేది ?
భిన్నమైన తత్వాలతో అక్కడ తారసపడే భక్తుల మనో భావాలు ఏకీకృతం కావాలంటే నామ జపం ఒక్కటే పరిష్కారం అవుతుంది,
పదిమంది కలిసి చేసే హరి నామ సంకీర్తన లో అద్భుతమైన బలం, శక్తి మహత్తు,, ప్రభావం ఉంటాయి,
ఎన్ని పూజలు నిర్వహించినా , దానిలో భాగం పంచుకొలే నప్పుడు అనందం కలగదు
పూజారి చెప్పే మంత్రాలలో సారం , అర్థం కానప్పుడు అనుభవానికి రానప్పుడు , చేసే సేవలో అసంతృప్తి ఉంటుంది కదా
అందుకే సత్సంగం విలువ అమోఘం,
శ్రీ రామ్ జయరామ్ జయ జయ రామ్,, అంటూ సామూహికంగా చేసే భజన ఒక అరగంట సేపు అయినా   అందులో పొందే ఆనందం అనిర్వచనీయం అమోఘం, అనుభవైక వేద్యం
జగద్గురువు లు శంకరాచార్యులు భజ గోవిందం ద్వారా అందించిన అమృత వాణి అమరం అద్వితీయం ,
స త్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,, నిర్మోహత్వే జీవన్ముక్తి , అంటూ భక్తి రసామృత ప్రవాహం లో ఒక్కొక్కరు ఒక్కొక్క నీటి బిందువులా కలిసి పాడుతూ ఒక ప్రవాహం లా సాగుతూ ఉంటే , భజన వింటూ చూసే వారికి, భజన చేసేవారికి  భగవద్ సాక్షాత్కారం లభిస్తూ , అమితానందాన్ని పొందుతూ ఉంటారు.
ఇలా దైవం పై గల మనకున్న ప్రేమను భక్తిని ఎదుటివారికి ఇచ్చి పుచ్చు కొనే సాంగత్యం సహవాసం,తో  కనిపించని దైవాన్ని ఎదుటి వ్యక్తి లో దర్శిస్తూ ఉంటాం,
ఇదే పది మంది , తో అయితే పది రెట్లు, వంద మంది తో భజన చేస్తూ ఉంటారు వంద రెట్లు దైవం పై అనురక్తి, భజన బృందం పై ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది
ఇదే సత్సంగం రోజూ భగవద్గీత శ్లోకాలు వాటి సారాంశం చెప్పుకోవడం గానీ, గోవిందా , శంకరా పాండురంగ అంటూ తబలా, చిరతలు హార్మోనియం , డో లక్ లాంటి వాద్య పరికరాల ను ఉపయోగిస్తూ ఉత్సాహంగా ఉద్వేగంతో హుషారుగా , కీర్తనలు పాడుకోవడం గానీ  చేస్తూ ఉంటే  కలిగే తన్మయత్వం తాదాత్మ్యం అపూర్వం అనంతం,
పిలిచినా పలుకని దైవాన్ని , నీతో పాటు హరీ హరీ అంటూ భజన చేసే వారి లో  దర్శించు కొన వచ్చును
దేవుడు అంటే అర్థం అమితానందం అద్భుతమైన ప్రశాంతత, అది సత్సంగం లో కానవస్తూ ఉంటుంది,. పదిమందిలో పరమాత్ముడు ఉంటాడు అనేది సత్యం, ఆ ఆనందం ప్రశాంతత సత్సంగం, సజ్జన సాంగత్యం, లోనే ఉంటుంది,
దీనికి చక్కని ఉదాహరణకు టీటీడీ వారు రోజూ నిర్వహిస్తున్న నాద నీరాజనం, అఖండ హరి నామ సంకీర్తన ఉద్యమం లా ఏడుకొండల వాని సన్నిధానం లో భక్తుల భక్తి పారవశ్యం పరవళ్ళు తొక్కుతు ఆనంద నిలయం గా ప్రభవిస్తు   అలరారుతూ ఉంది,
నాకు భజన చెప్పడంలో , హరి కీర్తన చేయడం, భాగవత పద్యాలు పాడటం లో , భక్తి గీతాలు శ్రావ్యంగా చదవడం  లో పొందే అనందం కన్నా, ఆలయంలో భక్త సమూహం లో వారిచే భగవన్నామ సంకీర్తన అనిపించడం లో అనుభవించే పరమానందం అమోఘం, మరవలెని మధురా నందం కలుగుతు ఉంటుంది.
అలాంటి సత్సంగం తో వస్తువు పై మోహం తగ్గుతుంది, పరమాత్మ పై ప్రేమ పెరుగుతూ ఉంటుంది
దుర్వ్యాసనాలు దూరం అవుతూ ఉంటాయి, బందువులు భార్యా పిల్లలతో ఉండే అనుబంధం క్రమంగా దైవం వైపు మళ్లు తూ, వస్తు ప్రపంచం పై నిర్మొహత్వం కలుగుతుంది,
ఈ సజ్జన సాంగత్యం జీవన్ ముక్తికి అద్భుతమైన సోపానం అవుతుంది కూడా,
జీవించాలంటే ఏ ఒక్కర కూ ఒంటరిగా  వీలుకాదు, ఇతరుల ప్రమేయం, సాయం లేకుండా బ్రతక లేము,
కానీ దైవారాధన  మాత్రం ఎవరికీ వారు సాధించాల్సిందే ,,, స్వప్రయత్నం తో త్రోవ చేసుకుంటూ పోవాల్సిందే,, అడుగడుగునా
దైవాన్ని ప్రార్ధిస్తూ  శరణాగతి చేయాల్సిందే,
తప్పులు అపరాధాలూ ,నిస్సహాయత,, అజ్ఞానము , అన్నీ పరమాత్ముని కి తెలియజేస్తూ,, నిష్కల్మష హృదయంతో స్వామి ముందు సాగిలపడి అత్మ సమర్పణ చేసుకోవాల్సిందే ,,
అన్యధా శరణం నాస్తి,, త్వమేవ శరణం మమ,, అంటూ  జపమో తపమో, నామ కీర్తన మో, ఏదో ఒక సాధనా మార్గంలో పరందాము ని సన్నిధిలో నిరంతరం నిశ్చల నిర్మల చిత్త వృత్తితో  ప్రార్థించాల్సిందే ,,,
నలువురితో కలిసి నారాయణా అనడం లో ఎంత లాభం ఉంటోంది, దైవాన్ని చేరడానికి భజన ఎంత సులువైన సులభమైన సుతారమైన సున్నితమైన సుందరమైన సువిశాలమైన సుమనోహరమైన   సన్మార్గం!
ఆహా నయాపైసా ఖర్చు చేసే అవసరం లేదు, ఏ పుణ్య క్షేత్రాలు ప్రయాస పడుతూ దర్శించే అవసరం అంతకంటే లేదు, పరికరాలు ,ప్రయత్నాలూ అభ్యాసాలు,, దేశ కాల పరిస్తితి తో ప్రమేయం లేకుండా , ఎక్కడ పడితే అక్కడ,, సమయం సందర్భం లేకుండా రామా కృష్ణా శంకరా అంటూ పాడుకుంటూ అంతరంగంలో జీవాత్మను  పరమాత్మ తో అనుసంధా నం చేస్తూ  భక్తి రసామృత ధారల ను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తరించ వచ్చును ,
ఆనం దొ బ్రహ్మ అన్నట్లుగా. మనసును శ్రీహరి నామ సంకీర్తన చేయడం వల్ల కలిగే ఆనందానుభూతి  తో  సందించ గలిగితే అంతకంటే సుకృతం మరేమీ ఉండదు కదా
ఆ స్ఫూర్తిని అదృష్టాన్ని అనుగ్రహించమని  దేవదేవుని కోరుకుందాం ,
తద్వారా ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్థకం చేసుకుందాం.
హరే కృష్ణ హరే కృష్ణా ,,

Sunday, November 24, 2019

విశ్వాసం

Nov 23, Karimnagar
దైవం మీద అపేక్ష ,,దేవుణ్ణి, చూడాలన్న  కాంక్ష,, సేవ చేయాలనే ఆసక్తి , ఆసక్తి అందరికీ ఉంటుంది,..!! దైవారాధన కోసం డబ్బు, సమయం తీరిక ఓపిక చేసుకునే అవకాశం  నగరాల్లో బిజీ గా ఉన్న చాలా మందికి దొరకదు,!!,,
దైవభక్తి కొద్దో ,గొప్పో అందరికీ ఉండి తీరుతుంది,!! కానీ, జాబ్ చేస్తూ, కుటుంబం తో బిజీ గా గడుపుతూ, , దేవాలయం వెళ్లే టైమ్ కూడా దొరక్కుండా , ఉంటే, దేవుని సేవలో ఉత్సాహంతో పాల్గొంటూ  ఆ అనందాన్ని పోందాలనుకొడం  కష్టమే ,,!!
,, భక్తి ఉండాలంటే  దానికి తగిన ప్రయత్నం చేస్తూ ఉండాలి.
ఉదయం నుండి రాత్రి వరకూ తీరిక లేకుండా ఎన్నో కష్టతరమైన పనులు మనం  చేస్తుంటాం ,!
కానీ ఆలయానికి వెళ్ళడం కుదరదు , !టైమ్ ఉండదు,! జ్ఞాపకం రాదు,! ఏదో ఇబ్బంది వస్తూ నే వుంటుంది,!
కొందరికి ఆలయానికి రోజూ వెళ్లకపోతే తోచదు, !వారికి నిత్యకృత్యం లో అదీ ఒక ముఖ్య భాగం అవుతూ వుంటుంది!
ఇది ఇలా ఉండగా, ఆధ్యాత్మిక గ్రంధాలు చదువుతూ , సత్సంగం ఏర్పాటు చేసుకొంటూ చర్చించే వారు చాలా కొందరు మాత్రమే ఉంటారు,,
అదీ వృద్దులలో మాత్రమే !! రామాయణ ,భాగవత, భారత ,గీతా శాస్త్రాలు శ్రద్ధతో ఇంటా బయటా చదివే వారూ తక్కువ !!, ఏదైనా ఆరుబయట పార్క్ లో, ఏదైనా ఆలయంలో , లేదా ఒక స్నేహితుని ఇంటిలో నో,, భగవద్గీత గురించి చెబుతూ నో, వారిచే చెప్పిస్తు నో,, పురాణాలు ఎక్కడ జరుగుతూ ఉన్నా వెళ్ళి వింటూ నో,, తమ దైవ భక్తిని అందరితో పంచుకుంటూ నో, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు,
,,..ఏదైనా, దీనిపై అయిన గురి కలగాలంటే దైవం పై విశ్వాసం ఉండి తీరాలి,
, కళ్ళు లేనివారు మాత్రమే అంధులు కారు..! కళ్లుండి కూడా ఇంట్లో దేవుణ్ణి కానీ, ఆలయాల్లో దేవతా మూర్తిని గానీ చూడక పోతే, కళ్లు ఉన్నవారు కూడా అంధు లే కదా !!
నడుస్తూ ఉన్నప్పుడు హరినామ స్మరణ చేస్తూ ,,ఆ నడకను దేవాలయం చుట్టూ  చేసే ప్రదక్షణ అనుకోని వారు, కాళ్లుం డి కూడా కుంటి వారే,!!
ఎదుట అఖండ హరి నామ కీర్తన జరుగుతూ ఉన్నా కూడా, తమ నోటితో "నారాయణా "అన్న పదం కూడా అనకుండా ఉంటే, అట్లాంటి జనాలు, నోరు ఉండి కూడా  మూగవారే కదా !!
ఆలయానికి వెళ్ళడానికి కుదరకున్నా, ఇంట్లో దేవునికైన , లేదా గుడిలో కెళ్లైనా రెండు చేతులూ పైకెత్తి జోడించి ,  నమస్కారం పెట్టీ, కృతజ్ఞతా పూర్వక ప్రేమను భగవంతుని కి సమర్పించ లేకపోతే ,, ఇక ఈ చేతులతో పని ఏముంటుంది,,??
ఇంట్లో ప్రతిరోజూ వంట అయ్యాక వండిన పదార్థాల ఘుమ ఘుమ లు చక్కగా కమ్మని వాసన గలవంటలు ఆరగించే ముందు అంత గొప్ప రుచికరమైన ఆహారాన్ని వా అనుగ్రహించిన పరమాత్ముని కి నివే దించక పోతే, ఘ్రానించే ముక్కు  ఉండి కూడా ప్రయోజనం ఏమిటి
చక్కగా పురాణ ప్రవచనం జరుగుతూ ఉందని తెలిసి కూడా వెళ్ళి వినడానికి ఉపయోగించని ఈ రెండు చెవులూ ఉండి ప్రయోజనం ఏమిటీ,
ఈ విధంగా మనిషి తనలో ఉన్న పరమాత్ముని  గుర్తించక, ,పంచేంద్రియాలు పరమాత్మ కోసం ఉపయోగించకుండా, తన మనుగడకు ,ప్రాణ శక్తికి, బలానికి, తెలివికి, ఆయువుకు, అన్నింటికీ మూల కారణం అయిన భగవంతుని మరచి,పంచేంద్రియాలు ప్రాపంచిక సౌఖ్యాలకు వినియోగిస్తే జంతువుకు మనిషికి  జీవన విధానం లో ఏ బేధము ఉండదు కదా,!!
""తిండి ,నిద్ర ,మైధునం"" ఇవి కదా జంతువుల సాధారణ లక్షణాలు,,!! అద్భుతమైన జ్ఞాన బండారాన్ని మనిషికి కానుకగా అపురూప మైన వరంగా  అనుగ్రహించిన  ఆ పరమాత్మ ను మరచి, ఏమీ చేసినా అది కృతఘ్ణత అవుతుంది కదా!!
అమ్మ కూడా అడిగితేనే కానీ అన్నం పెట్టదు అంటారు,,!!
మరి అపెక్షించకుం డా, దైవానుగ్రహం ఎలా లభ్యం అవుతుంది ??
అందుకే ,, ""భగవాన్ ,! నేను నిన్ను తెలుసుకోలేని అఙ్ఞానిని !అమాయకుడ ను ,! దయ ఉంచి, నా బ్రతుకు లో నీ "కరుణ" అనే అమృత ధారను కురిపించి దన్యున్ని చెయ్యి! స్వామీ,,!
నిన్ను నిరంతరం తలచి కొలిచే స్ఫూర్తిని ,,శక్తిని, అవకాశాన్ని అనుగ్రహించు,!!
తండ్రీ జగదీశ్వర ! శరణు! శరణు !శరణు!

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...