Dec 25, 2019 Karimnagar
""కృష్ణా !నన్ను ఎక్కడికి తీసుకెళ్తూ న్నావురా,, కన్నయ్యా ?""
""నీవు చేరాల్సిన చోటుకు ,,,సరేనా !""
""కానీ,,నేను చేరాల్సింది నీవు ఉండే చోటే కదా బంగారు తండ్రీ !
""అవును కదా ! నీవెక్కడ ఉంటావో , నేనూ అక్కడే ఉంటాను , గోపికా!""
""కృష్ణా !నిన్ను విడిచి పోవాలని లేదు, పట్టిన నా చేయి ,గట్టిగా పట్టు ,,!విడవకుండా పట్టు రా,, కృష్ణా !!""
నన్ను ఎవరు మనసులో . సుస్థిరంగా పెట్టుకుంటారో ,వారి బాధ్య త నేనే వహిస్తూ ఉంటాను గోపికా!""
కృష్ణా నీ మార్గదర్శనం నాకు బ్రహ్మానందాన్ని కలిగిస్తోంది సుమా !
కృష్ణా !నిన్ను చూశాక ,మరి దీనిని చూసే అవసరం ఉండదు కదా ,ఎంత కృపా సాగరుడివి గోవిందా !""
నీ నామం మధురం, నీ పిలుపు ,తలపు ,వలపు , నీ పై భావం , ధ్యానం, గానం, అర్చనం,సేవనం ,స్మరణం ,,మధురాతి మధురం కదా
కృష్ణా!అచ్యుత అనంత ముకుందా , మురారీ, నల్లనయ్య, నా పాలిట దైవమా, నా ప్రాణమా శరణు ప్రభూ శరణు , స్వామీ ,, నీలమేఘ శ్యామ సుందరా , రాధా మనోహర,,శరణు !!"
Thursday, December 26, 2019
కృష్ణా నీ మార్గదర్శనం
కృష్ణ లీలలు 2
Dec 24, 2019 Karimnagar
కృష్ణ లీలలు 2
________&____
_ఒకరోజున ,,5 ఏళ్ల వయసు లో ఉన్నచిన్ని కృష్ణయ్య ,యమున ఒడ్డుకు తన తోటి గోపాలుర తో ఆడుకుంటూ ఉన్నాడు,,
ఒక గోపిక, అటుగా చూస్తూ ,వచ్చింది కడవ తో నీళ్ళు తీసుకొని వెళ్ళడానికి!!,, నిజానికి ఆమె వస్తోంది కృష్ణుణ్ణి చూడటానికి ,! అలా కృష్ణయ్యను చూస్తూ నీటి ఒడ్డున కొంత సేపు గడిపి , నిట్టూరుస్తూ వెళ్ళి పోతుంది,!, కానీ, ఒక్కసారి కూడా ,ఆమెకు కృష్ణుని తో మాట్లాడటం కుదరడం లేదు, అయినా,ఆమె నిరాశ పడలేదు !!, అలా రోజూ బాల కృష్ణ సుందర రూపం చూస్తే చాలు అన్న ఆశ ,!! పైగా,ఒక్కసారైనా ,
కృష్ణుడు కన్నెత్తి కూడా చూడలేదు , ఆమెను !
, ఈ రోజున ,ఆమె, నీటితో బరువుగా ఉన్న కడవను ఎత్తడానికి ప్రయత్నిస్తూ అవస్త పడుతోంది ,
,, అంత దూరాన ఉండి కూడా, ఆమెను గమనిస్తున్న బాల కృష్ణుడు చటుక్కున వచ్చి ,, నవ్వుతూ
""బరువుగా ఉందా కడవ?"
అన్నాడు
ఆమె సంతోషంతో పొంగి పోయింది , తన కల ఫలించింది ,అనుకుంది,! కృష్ణా! నా బంగారు తండ్రీ,! ఇప్పుడు కరుణిం చావా?? ఎన్నాళ్లు గా ,నీవు నా కోసం పరుగున వస్తావని ,ఎదురు చూస్తూ వస్తూ ఉన్నానురా కన్నయ్యా ,!
""కొంత సహాయం చేయరాదా కృష్ణా??""
అంది
""అమ్మో !ఇంత చిన్న పిల్లాడిని!! అంత పెద్ద కడవ ఎత్తనా!! వామ్మో!!"నా వల్ల కాదు !""
ఆమెకు కృష్ణుని ముద్దు మాటలు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయి,దీనికోసమే కదా ఇన్ని రోజులు,అక్కడ, ఆమె పడిగాపులు పడింది
""మరి ఎందుకంత వేగంగా పరిగెత్తి వచ్చావు, కృష్ణా??" ఆసరా కు కాక??"" అంది ప్రేమగా,,
,""పాపం !ఒక్క దానివి కదా ,! కాస్తా నిన్ను మాటల్లో పెడితే , అది నీకు బరువు అనిపించదు కదా !""
""ఓహో !మాటల తో బరువు తగ్గి స్తావన్న మాట , నీవు!""
""అంతే కదా! అదిగో చూడు! , నీవు ఒక్కదాని వే ఎత్తే శావు గదా!"" చూశావా ,నేను రాగానే ఎంత బలం వచ్చిందో!""
",,"నిజమే సుమా ,,కృష్ణా ,! నీతో మాట్లాడుతూ ఉంటే అసలు బరువే తెలియ దురా కన్నా ! ఏం మాయ చేస్తుంటా వో గానీ!""
""నేను చెప్ప లా! నేను రావడం , నీ కు హాయిగా ఉంటుందని!""
""నిజంగా, నీ మాటల్లో ఏదో గారడీ ఉంది రా కృష్ణా!""
""అది సరే,, కానీ,,రోజూ వస్తావు కదా నీళ్లకు,! మరి ఈ రోజు ఎందుకు బరువని పించిం ది. ?!""
""నిజం చెప్పనా ,కృష్ణా !""
""నా ముందు నీవు అబద్దం చెప్పలేవు కదా!""
""ఎంత గడుగ్గాయివిరా కృష్ణా !,, అయినా నిజం చెప్పావు, రా కన్నా! నీతో మాట్లాడాలని ఎన్నో సార్లు ఆనుకుంటు ఉంటే , ఈ రోజు దొరకవు కదా,,! నిన్ను చూస్తూ ఉంటేనే అనందం! ఇక నీతో మాట్లాడితే నా పరమానందం సుమా !!
ఇంటికి వెళ్ళినా నీవే మనసంతా నిండి ఉంటావు !
బంగారు కొండా!! నీవు రావాల నే , ఈ నీటి కడవ బరువు గా ఉన్నట్టు నటిస్తూ ఉంటే, నా మనసులో మాట గ్రహించావు,వచ్చావు , కదా కన్నా!!""
ఎందుకు నా కోసం అంత బెంగ గోపికా,?
ఎందుకో ,మాటల్లో చెప్పలేను కృష్ణా!!ఒక్క ,నేనే కాదు ,నీవంటే పిచ్చి ప్రేమ, ఈ రేపల్లె వారికందరికీ !! తెలుసా నందకుమారా ??
,,,నీ వద్ద ఏముందో,ఏమీ లేదో,తెలియదు గానీ, కృష్ణా ,,మా అందరి హృదయాల్లో నీవు ఉన్నావురా బుజ్జి తండ్రి,! యశోద తనయా!! ఏం చెయ్యను చెప్పు? ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి ఉండలేక పోతున్నా నేనైతే,, నాన్నా !"
,, ""అవును కదా ,!దానికి నేనేం చేయను చెప్పు??""!,,, నీవు ,పిలువకున్నా వచ్చాను కదా ! ఇందుకు నీవు నాకేం ఇస్తావు ?""
,,,ఇంకా నాకంటూ, ఏముంది కృష్ణా, నా వద్ద, ? అంతా నీవే, అంతా నీదే కదా! అయినా,
""కృష్ణా !నీకూ ,నీ బృందానికి సరిపడా వెన్న, జున్ను ,,పెరుగు అన్నీ ఇస్తాను !!?? కానీ, బదులుగా నీవు నాకు చిన్న ముద్దు ఇవ్వాలిరా కన్నా! సరేనా ??""
""అంతే కదా ! తీసుకో ,""
"" ఒకటి కాదు ,,రెండు !""
""ఓస్ ,,అంతే కదా !""
""అదుగో, మాటల్లో వచ్చేసింది ఇల్లు ,!! కృష్ణా !""
""సహాయం చేయనా , కడవ దించనా నేను ?
""పెద్ద ఆరిందాలా, అక్కడ , కడవ ఎత్తమంటే అంత గొప్పకూ పోయావు!! మరి, ఇక్కడ, బరువు దింపడానికి నీవే తయారయ్యావు , ఏమిటి కథ ,,కృష్ణా??
""నేను బరువులు దించేవాడినే కానీ ,,ఎత్తే వాడిని కాదు సుమా!""
,, ఎందుకలా లేని పోని బరువులు,ఆశలు మనస్సులో పెట్టుకొని, అనవసరంగా బాధపడుతూ ఉంటారు! మీరంతా !!! అవన్నీ పెట్టుకోమని నేను చెప్పానా మీకు ,, ఎత్తడానికి !!
, అంతగా మోయలేక పోతే, నన్ను కోరితే, అప్పుడు వస్తాను ,, సహాయం చేయడానికి !!, అంతే""తెలుసా!!"
""అవునురా , కృష్ణా!! నిన్ను చూస్తే ,ఐదేళ్ల పిల్లాడి లా కనబడ తావు ,కానీ !! ఇంత పెద్ద వాళ్ళం !,,మాకే అంతుబట్టని పెద్ద పెద్ద విషయాలు , ఇవన్నీ నీకు ఎలా తెలుస్తూ ఉంటాయి రా కృష్ణయ్యా ? ఆశ్చర్యంగా అంది,
""ఇదిగో గోపికా,,!నీ ఇంటికి నిన్ను చేర్చాను,! తల మీది బరువు కూడా దింపాను , ! నీవు కొరుకున్నట్టుగా పిలవకుండా నే వచ్చాను కదా !!,ఇక వెళ్ళి మా స్నేహితులతో ఆడుకోనా!"?"
అంటూ అమాయకంగా అడుగుతూ ఉన్న చిన్ని కృష్ణుని ముగ్ద మోహన సుందర రూపాన్ని చూస్తూ,పరవశిస్తూ ,, ఆ
గోపిక పరమానందం తో,, ఆ అందాల కృష్ణయ్యను తన రెండు చేతులతో ఎత్తుకొని, హృదయానికి గట్టిగా హత్తు కుం ది,, ఎంతో ఆనందంగా !
ఆమె గుండె ల్లో అనందం పాల పొంగులా పొంగి పోయింది,, ఆ చిన్నారి కృష్ణయ్య ,,అల్లరి కన్నయ్య నును లేత పాల బుగ్గల పై గట్టిగా ముద్దు లు పెట్టుకుం టూ ఉంటే ,,ఆమె హృదయం పులకించి పోయింది ,, అమితానందం పొందింది ఆ గోపిక ! ఆనందా మృత
'మధురానుభూతి తో ,,బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ,కళ్ళు మూసుకొని, తన్మయ స్థితి లో లీనమై న ఆ గోపిక కి ఎప్పుడు ఆ బాల కృష్ణుడు తన చేతుల్లోంచి జారి పోయి వెళ్ళి పోయాడో తెలియదు !
క్రిష్ణ రూపంలో అంత గమ్మత్తు, అంత సమ్మోహన శక్తి ఉంటుంది, కృష్ణ భక్తులను ఉన్మాదుల ను చేస్తుంది,
అలాంటి దివ్యమైన కృష్ణ తత్వం తో నిండి ఉన్న ప్రతీ భక్తుని మనసూ ఒక బృందావన దివ్య సీమయే కదా !!
శ్రీకృష్ణుని జగన్మోహన మంగళ కర సుందర దివ్య రూప లావణ్య వైభవం !భావిస్తే చాలు హృదయం పులకరించి పోతుంది !!,,సృష్టి లోని సమస్త కమనీయ రమణీయ సురుచిర సౌందర్యరాశి అంతా ఒక్కచోటే విగ్రహం గా,, పోత పోసిన విధంగా విరాజిల్లే తేజోమూర్తి, షోడశ కళా పరిపూర్ణ అవతారము ,సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ
పరమాత్మ ,ఎవరిని ఎప్పుడు ఎలా కరుణిస్తా డో , కదా !!
ఆ దేవదేవుని కరుణను కోరుకుందాం!!
ఆ గోపాల,కృష్ణయ్య తన అపార కరుణా కటాక్ష వీక్షణాలను మనపై వర్షించమని వేడు కుందాము
హరే కృష్ణ హరే కృష్ణా!!
కృష్ణ లీలలు 1
Dec 23, 2019 Karimnagar
కృష్ణ లీలలు 1
______________
ఒకరోజు రేపల్లె లోని గోపికలు అందరూ కలిసి, కృష్ణుణ్ణి పట్టుకోవాలని నిర్ణయం తీసుకొని, ఆ రోజు రాత్రి నిద్ర పోకుండా కాపలా కాశారు,
తలుపులు దగ్గర వేసి, గొళ్ళెం పెట్టడం మరచి నట్టుగా , నటిస్తూ, మంచాల్లో, దొంగ నిద్ర నటిస్తూ పడుకున్నారు! అనుకున్నట్టు, అర్ధరాత్రి ,
కృష్ణుడు రానే వచ్చాడు తన బృందంతో,, !, లోనికి దూర నే దూరాడు,! పైనున్న ఉట్టి పగల గొట్టడానికి తెచ్చుకున్న చేతి కర్రను పైకెత్త గానే, గోప గోపిక లు చటుక్కున లేచి కృష్ణుణ్ణి పట్టుకున్నారు! పాపం కృష్ణుడు చిక్కాడు వారికి !! మిగతావారు పారి పోయారు!
వారికి కూడా, దొంగల నాయకుడు అయితే దొరికాడు అన్న అనందం తో, మిగతావారి ని పట్టించు కోలేదు కూడా!!
,వారు ,చక్కగా ఒక పెద్ద పెట్టెలో కృష్ణుణ్ణి దాచి, తాళం వేసి, తెల్లారే వరకు వేచి చూశారు!
ఇంకేం, తెల్లారి పోయింది!
వారు ఎంతో పరమ సంతోషంతో పెట్టెను అమాంతం ఎత్తుకెళ్లి, యశోదమ్మ ఇంటి ముంగిట్లో పెట్టారు,!
ఆశ్చర్యం ఏమంటే , అలా చాలా మంది గోపికలు అక్కడ కనిపించారు,! అందరూ వుత్సాహంగ ఏదో ఘన కార్యం సాధించి నట్టుగా సంబర పడుతూ ""నేను కృష్ణుణ్ణి పట్టి తెచ్చాను ""అంటూ, చూపడానికి పోటీలు పడుతూ ఉన్నారు!
ఒకరు మూటలు, మరొకరు సంచులు, గోతాము లు, ఇలా ఎన్నో తెచ్చారు!
""యశోదమ్మ ,,రావమ్మా! బయటకు రా,! నీ అల్లరి కృష్ణుణ్ణి పట్టి కట్టేసి తెచ్చాం! చూద్దువ్ గానీ, రా!"" అంటూ పిలిచారు యశోదమ్మ ను!
ఆమె వచ్చింది !,చూపారు తెచ్చినవన్ని!!
" ఇదిగో , నీ అమాయక కొడుకు,, చూడు!!"""గారాల కృష్ణుడు!!"" అంటూ.
, కృష్ణుడు ఒక్కడు ఉంటే, మీరు ఇంతమంది కృష్ణుల ను ఎలా పట్టుకున్నారు ,??"", ఆమెకు ఆశ్చర్యం వేసింది!
""చూపండి మీరు ఏం తెచ్చారో?""
వాళ్లంతా తెచ్చిన వన్ని ఆమె ముందు పెట్టీ చూపారు!
చిత్రం! దేనిలోనూ కృష్ణుడు లేడు,,! అందులో వారి పిల్లలే ఉన్నారు ఏడుస్తు ,!
"అమ్మా! అమ్మా! నన్నెందుకు కట్టేశావే?? ఎంత బాధ గా ఉందో!!
పైగా అరవకుండా మూతికి బట్టా కూడా కట్టావ్ కదా, అమ్మా.!! నేనంటే నీకు ఎందుకింత కోపం అమ్మా ?!""
అంటున్నారు వాళ్లు!
గోపిక లంత నిశ్చేష్టులై పోయారు!
""లేదు !, యశోదా! స్వయంగా నీ కొడుకుని నిజంగా మా ఇంట్లో నిన్న రాత్రి గట్టిగా కట్టేసేను !"మరి మా పిల్లాడు ఎలా వచ్చాడో !""
అంటూ బిత్తర పోతూ అంటూ ఉన్నారు!!
యశోదమ్మ అంది, ""చూడండమ్మా! మీరు నా చిన్ని కృష్ణుణ్ణి ముద్దు ముచ్చట చూస్తూ ఓర్వలేక చెప్పే చాడీ లు ఇక వినదలచుకొలేదు !
సరేనా !ఇదిగో !ఇప్పుడే మా కన్నయ్య ను పిలుస్తాను ,చూడండి,!" అంటూ" కృష్ణా, కృష్ణా !"అని యశోదమ్మ పిలవగానే , ఇంట్లోనుండి కన్నయ్య రానే వచ్చాడు! ""అమ్మా ,,పిలిచావా ,? మన ఇంటికి వీళ్లంతా ఎందుకు ఇక్కడికి వచ్చారు, అమ్మా??""
అంటూ
గోపిక లంత బిత్తర పోయారు!
""ఏమిటి ఈ మా య ,? ఇదేదో ఇంద్రజాలం లా ఉంది!"
"అమ్మా ,,యశోదా! నీ కృష్ణుడు మా ఇళ్లకు వచ్చిన మాట నిజం, !మమ్మల్ని నమ్ము ""అంటూ ఉంటే
యశోద కు కోపం మండి పోయింది. !
""ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, !ఏమిటి?? అందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చి,నా చిన్ని కృష్ణయ్య పై ఇంత అపవాదు వేస్తారా?? ఇది మీకు న్యాయంగా ఉందా, నన్ను ఇలా బాధ పెట్టడం, నా కృష్ణుని నానా మాటలు అని వెళ్ళి పోవడం?!
""ఉండండి! మా నంద రాజు తో చెపుతాను! మీ పని చెబుతాడు ఆయన!""
అంటూ కోపంగా అంటూ ఉంటే, గోపికలు భయంతో బతిమాలుతూ,
""వద్దమ్మ ,వద్దు !ఎవరికీ ఈ విషయం చెప్పొద్దు ! ఈ కృష్ణయ్య , నీ కే కాదు, మాకు కూడా కొడుకు లాంటి వాడే, !!ఇలాంటి కొడుకు మాకు కూడా ఉంటే బావుండు ను కదా !అని మేము ఎప్పుడూ అనుకుంటూ ఉంటాము!!
మా కొడుకు కంటే ఎక్కువగా నీ కృష్ణుణ్ణి ప్రేమిస్తూ ఉంటాం ,యశోదా!
కృష్ణయ్య ను చూడం దే ఉండలేక పోతున్నాం మా మాట నమ్ము!
ఏదో ఒక మిషతో వచ్చి నీ కొడుకు సుందర వదనారవిందాన్ని చూసి పోతు ఉంటాం ,యశోదా!
అంటూ రెండు చెంపలు వేసుకుంటూ వెళ్ళి పోతు ఒక్కసారి ఆ కృష్ణుని వేపు చూస్తూ అలాగే ఉండి పోయారు,వారంతా!
,, తల్లీ చాటుకు దొంగలా నక్కి నక్కి తమనే చూస్తూ వెక్కిరించే ఆ బాల ముకుందుని తనివారా కళ్ళార్పకుండా చూస్తూ, వెళ్ళలేక వెళ్ళలేక తమ ఇళ్లలోకి వెళ్ళి పోయారు ఆ కృష్ణ భక్త గోపికలు!!
కృష్ణుని కట్టేయాలంటే ఎంత పుణ్యం ఉండాలి! యశోదమ్మ కు మాత్రమే, ఆ బ్రహ్మాండ నాయకుని భక్తి అనే తాడుతో కట్టి వేసింది!
ఏ భక్తునికి అంత భాగ్యం దక్కింది?? అది అందరికీ సాధ్యమా?? సాక్షాత్తూ పరమాత్ముని కి పాలిచ్చి పెంచి, ప్రేమను పంచి, తనను దండించే అధికారాన్ని కూడా అనుగ్రహించిన ఆ గోవిందుని కరుణ కు హద్దు ఉందా!!
వారికి తనయందు గల అనురాగం తో సమానంగా తన ప్రేమతో వారిని మైమరపించాడు !!
""కృష్ణ తత్వం ""అర్థం చేసుకోవడం కష్టం!
కృష్ణుని చూపులో ,రూపు లో ,నవ్వులో, నడకలో, నర్తన లో, చేష్ట ల్లో , మాటల్లో ఒక అందం, ఒక అద్భుతం, ఒక పరమార్థం, దాగి వుంటుంది,!! అది ఎంతవరకైనా అర్థం కావడం కష్టం, !
గోపికల మనసును చూరగొన్న వాడికి , వారి ఇళ్లలో వెన్న గ్రహించడం ఒక లెక్కా!
తాను తీసుకున్నది స్వల్పం! కానీ,. తిరిగి ఇచ్చే ప్రతిఫలం ,"ఐశ్వర్యం "అనంతం ,అమూల్యం, అపురూపం,బ్రహ్మానందం!""
ఏది ఎప్పుడు ఎలా పరమాత్మకు ఇవ్వాలో జీవుడికి తెలియదు,! ఉన్న జ్ఞానం సరి పోదు!,, పోనీ కదా ,స్వయంగా
పరమాత్ముడే వచ్చిగ్రహిస్తే, ""అయ్యో !అది నాది, కదా !!"అనుకుంటాము!
కానీ, గోపిక లు అలా కాదు! ఇంకా ఇంకా ఇవ్వాలన్న తపనతో అల్లాడు తూ ఉంటారు. వారి హృదయం అంతా గోపాలుని భావంతో నిండి పోయి ఉంది,! అక్కడ చిక్కాక ఇక బయట పడటం కష్టం !
నిష్కల్మషమైన , నిష్పలాపెక్ష , తో అందించే గోపికల ప్రేమ అమూల్యం !!పూర్వ జన్మ లో మునులు, ఋషులు,సురులు ,
వారి పూర్వజన్మ తపఃఫలం వలన ,,అద్భుతమైన కృష్ణానుభవం కృష్ణ సాక్షాత్కారం , కృష్ణ పరిష్వంగం, సాధించారు!! భక్తుల యోగ్యత ను బట్టే, వారికి అందించే పురస్కారం ఉంటుంది కదా !, ఒక నాటి వారి భక్తి ప్రపత్తులు ఈ నాడు వారికి తరగని పెన్నిధి, లా వాసుదేవుని సన్నిధి ప్రాప్తించింది,,!
*"పరమానందం " అంటే కృష్ణుని గురించిన చింతన, అనుభవ సారమే కదా! అది సాధించిన గోపికల గోపాలుర కీర్తి అమరము, అనుపమాన ము!!
సుందరకాండ, ఎందుకు సుందరం
Dec 20, 2019 Karimnagar
సుందరకాండ, ఎందుకు సుందరం అయ్యింది??
_____________
*""మనోహి హేతువు సర్వేషాం!"అనగా మనం చేస్తున్న అన్ని పనులకు ముఖ్య కారణం"" మనసే"" కదా! అనగా,, మనం చేసుకున్న
పాప పుణ్యాల కు కారణం ఈ మనస్సే కదా!
మనసుతో సంబంధం ఏర్పడితే నే, ఇంద్రియాల లో జ్ఞానం ప్రకోపించ బడుతుంది !
అందుకే "మనకు "మనసే శతృవు"" మనసే మిత్రువు""కూడా!;
ఇది" గీతా వాక్యం!"ఉదాహరణకు,,
ఇద్దరు స్నేహితులు నగ రానికి వచ్చికలుసుకున్నారు అనుకుందాం !;
, ఒకరు సినిమాకు, మరొకరు పురాణ శ్రవణా నికి విడిగా వెళ్ళారు,,!
సినిమాకు వెళ్లినవాడు, అయ్యో నేను పురాణ శ్రవణం చేస్తే బావుండేది, రామా కృష్ణా అని అంటే, వింటే, ఇంత పుణ్యమై నా దక్కేది కదా, డబ్బు ఖర్చు! టైమ్ వేస్ట్ అనుకున్నాడు
ఇక పురాణం వింటున్న వాడు , మనసు ను సినిమా వైపు ఉంచాడు , ఏముందీ ఈ పురాణం లో హాయిగా సినిమా చూస్తే ఎంజాయ్ చేసే వాణ్ణి గదా అనుకున్నాడు
ఇక్కడ పురాణం వింటే వచ్చే పుణ్యం ఎవరికీ వస్తుందో మనం సులభంగా చెప్పవచ్చు ను
అందుకే,అన్నింటికంటే,""మనసే కీలకం ""
హనుమ అనుకున్నాడు కూడా, ఇలా స్త్రీలను చూడటం లో తన బ్రహ్మచర్యానికి భంగం కలిగిందా, తాను పొరబాటు చేశానా అని ఆత్మవిమర్శ చేశాడు
లేదు, నా మనసు ఎక్కడా చలించలేదు ,ప్రయత్నం కేవలం పరదేవతా దర్శనం కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాడు, అది కూడా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా నే
ఇంతలో రావణుని చూశాడు అతడి ప్రక్కనే దేవతా స్త్రీల సౌందర్యాన్ని కూడా తల దన్నే అందమైన స్త్రీ నీ మండోదరి ని చూసి ఆనందం తో ఎగిరి కుప్పి గంతులు వేశాడు
తర్వాత మళ్లీ ఆలోచనలో పడ్డాడు , సీతా మాత అలా స్వర్ణ ఆభరణాలతో అలా రావణుని ప్రక్కనే హంసతూలికా తల్పం పై పడుకొని ఉంటుందా,,
ఉండదు! ఆమె సీతా మాత కాదు నేను ఎంత పొరబాటు పడ్డాను , అమ్మా క్షమించు అంటూ పరితాపం చెందాడు
అయితే ఇక్కడకూడా హనుమ చేసిన పొరబాటు లేశం కూడా లేదు
ఒక తల్లి కొడుకు రాక కోసం ఎదురు చూస్తోంది , సాయంత్రం 5 గంటలకు వస్తాడు అన్న కొడుకు 6, అయ్యింది. 7 దాటింది,8కూడా అయ్యింది
ఇప్పుడు తల్లి ప్రేమ కీడును శంకిస్తు ఉంటుంది , కొడుక్కు ఏమైనా జరగరానిది జరగలేదు కదా, అని వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ ఉంటుంది ,
ఎందుకంటే తల్లికి కొడుకు పైగల అపారమైన ప్రేమ , కడుపు తీపి
అలాగే మనకు ఇష్ఠమై న వస్తువు దూరం అయితే,దొరక్కుండా పోతే,మనసు పరి పరి విధాల కొట్టుకుంటుంది కదా
మన హనుమ విషయంలో కూడా ఇలానే జరిగింది ఇక్కడ
, పండితుడు కూడా మాయ కు వశుడే, భ్రమల కు లోనౌ తుంటాడు అలా
అందుకే హనుమ వలె ఎప్పటి కప్పుడు అత్మ శోధన చేసుకుంటూ చేసేది తప్పా ఒప్పా అనుకుంటూ సదనట్ సాగిస్తూ ఉండాలి
సముద్రాన్ని దాటే ముందు హనుమ కేవలం రాముడిని మాత్రమే ప్రార్థించాడు, సీతమ్మ ను కాదు
ఆ విషయాన్ని హనుమ ఇప్పుడు గుర్తించాడు. అంగుళం మేర విడవకుండా వేదకినా అమ్మ కనిపించక పోతే,ఇక భయపడ్డాడు , బాధ పడ్డాడు , విపరీతంగా దుఃఖించాడు కూడా, ఒక దశలో మరణమే శరణం అనుకున్నాడు,
కానీ మరణం ఎన్నడూ ఏ సమస్యకు పరిష్కారం కాదు,
హనుమ కుషాగ్రబుద్ది కలవాడు, వేద వేదాంగాలు చదివిన వాడు ,అందుకే
మళ్లీ అత్మ విమర్శలో పడ్డాడు ,
మానవ ప్రయత్నం ఎంతగా చేయాలో మనం కూడా అంతగా చేస్తూ వుంటాం
ఫలిస్తే సరే పొంగి పోతాం,ఫలించక పోతే కృంగి పోతాం అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు
భగవంతుడా ,నీదే భారం అంటూ దండాలు పెడుతూ ఉంటాం
అదే ఇక్కడ హనుమ విషయంలో జరిగింది ,
ఎంత చెయ్యాలో అంత చేశాడు, ఏడుస్తూ కూర్చోడం బుద్దిమంతు డి లక్షణం కాదు,
తప్పు ఎక్కడ జరిగింది
అమ్మ లంక లో ఉంది ఇది నిజం కాని కనిపించడం లేదు తనకు ఎందుచేత
సీతా మాతను చూడనిదే తిరిగి వెళ్ళే సమస్య లేదు, అని నిర్ణయం తీసుకున్నాడు
ఒక ద్వారం తోరణం పై నిదానంగా ఆలోచిస్తూ ఉండగా తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది
తల్లీ, జగన్మాత జగజ్జననీ నేను నిన్ను చూడ గలను అనుకున్న నా అహంకారాన్ని అణచి వేశావు
నీ కృప లేనిదే , నీ ఆజ్ఞ లేనిదే నిన్ను దర్శించ లేను అని ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది
తల్లీ జానకీ మాతా, నన్ను క్షమించు , నా తప్పు మన్నించు, దయచేసి నీ దర్శనం ఇప్పించూ నిన్ను చూడాలన్న తపనతో పరితపించే ఈ దాసుని కనికరించి నీవు ఉన్న చోటును సూచించు మాతా అంటూ అమ్మతో బాటుగా సకల దేవతలను మార్గదర్శనం చేయమని ప్రార్థించాడు భక్త హనుమ.!
వైరాగ్యం తో నిండిన పరితప్త హృదయం తో ఉపాసనా దృష్టితో తన ఇష్ట దైవాన్ని , సీతా మాతను , బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలను ఆర్తితో వేడుకుంటూ ప్రార్థించాడు.
వెంటనే చంద్రకాంతి లో అల్లంత దూరాన ప్రకాశిస్తూ ఉన్న అశోక వనం అగుపించింది
తక్షణమే వెళ్లి చూడగా అక్కడ శింశుపా వృక్షము క్రింద కూర్చుని దీనంగా ఖేద వదనం తో ఉన్న అత్యద్భుత సౌందర్య రాశి లా వెలిగిపోయే ఒక స్త్రీ మూర్తిని చూసి సంతోషం తో పొంగి పోయాడు అతడు,
హనుమ, చేసిన ఇలాంటి శరణాగతి అలనాటి గజేంద్రుడు కూడా చేశాడు. తన కాలు పట్టి నీళ్ళలోకి లాగుతూ ఉన్న మొసలి తో వేయి సంవత్సరాలు ఘోరంగా పోరాడాడు ఫలితం కనిపించలేదు, ఇక పరమాత్ముని కి మొరపెట్టుకున్నాడు ,
కలడు కలండ నెడు వాడు కలడో లేడో, అంటూ కొంత సందేహం తో వేడుకుంటే మహా విష్ణువు రాలేదు
ఎప్పుడైతే, నీవే తప్ప ఐతః పరం బెరుగ , మన్నింపన్ దగున్ దీనునిన్ , అని సంపూర్ణ శరణాగతి చేయగానే క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా వచ్చి, మకరిని చంపి, కరిని కాపాడాడు.
ద్రౌపదీ వస్త్రాపహరణం సమయం లో ఆమె కూడా రెండు చేతులూ పై కెత్తి అంజలి ఘటించి హే కృష్ణా అంటూ రోదిస్తూ వెడుకొగానే కరుణించి ఆమె మొర విని రక్షించాడు ,
రుక్మిణీ దేవి కూడా తనను తాను పూర్తిగా అర్పించుకుంది, నీ కోసమే నిరీక్షణ, నీ కోసం జన్మించాను నీవు లేని జీవితం గడప లేను, నిన్ను తప్ప మరొకరిని వివాహం చేసు కో ను, నీవు నిరాక రించిన నా ఈ జీవితం తో నాకు పని లేదు, అంటూ జీవాత్మ, పరమాత్ముని తో చేరుకోడానికి శరణాగతి చేసిన విధంగా రుక్మిణి శ్రీకృష్ణుని కి లేఖ ద్వారా తెలియజేసింది
హనుమ కూడా చేయవల్సిన పురుష ప్రయత్నం చేశాడు సీతామాత ను కనుగోవడానికి ,, తన ప్రయత్నం వృథా కాగానే అమ్మను శరణు వేడుకొన్నాడు,
తల్లీ , నా ఇంద్రియాలు మనసూ బుద్ది ఇవన్నీ పనిచేయడం లేదు, నేను నిన్ను చూడడం కాదు, అమ్మా నీవే నన్ను దయతో చూడాలి , నా శక్తి సామర్థ్యాలు నిన్ను దర్శనానికి సరిపో వు, మాతా ! అంటూ దీనంగా శరణాగతి చేసుకున్నాడు
అప్పుడు మహాలక్ష్మి,ి సీతా మాతకు అనుగ్రహం కలిగి తన జాడ తెలిపింది, అంతవరకూ కనపడని అశోకవ నం అతడికి అగుపడెలా చేసింది,,
ఉపాసకులు ఆ విధంగా సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శిస్తే నే తప్ప దైవానుగ్రహం ప్రాప్తించ దు ,
శక్తిని చైతన్యాన్ని వేరు గా చూడలేము కదా ,
అగ్ని నుండి వేడిమిని ,చంద్రుని నుండి వెన్నెలను ,సూర్యుని నుండి కాంతిని ఎలా వేరు గా చూడలేమో , అలాగే,సీతారాములను, లక్ష్మీ నారాయణుల ను, గౌరీ శంకరుల ను, రాధా కృష్ణుల ను ,అరుంధతి వశిష్ఠుని లను వేరుగా భావించలేము
అందుకే సీతారాములను కలిపి పూజించాలి, ఒక్కచోట చేర్చి కల్యాణం జరిపించాలి, ఎట్టి పరిస్థితిలో కూడా వేరుగా భావించడం, వేరుగా సేవించడం చేయవద్దు
ఒక్క రాముణ్ణి మాత్రమే కోరిన శూర్పణఖ ,ఒక్క సీతమ్మ ను కోరిన రావణుడు బాగుపడలేదు
భద్రాద్రిలో రాముడు తన తొడపై సీతమ్మను కూర్చో బెట్టు కొని ఉండటం మనం చూస్తున్నాం కదా. ,
దేవుడు ఉన్నాడా!?
Dec 18, 2019 Karimnagar
"అమ్మా! దేవుడు ఉన్నాడా!?""
""ఉన్నాడు నాయనా!""
""ఉంటే నాకు కనబడు తా డా, అమ్మా?""
తప్పకుండా కన బడ తాడు కుమారా!"నీకే కాదు, ఆర్తితో ఎవరూ పిలిచినా వస్తాడు ప్రేమతో ,!""
""అమ్మా !, ఈ ప్రపంచం లో అందరికన్నా ఎవరు గొప్ప ?"
"కుమారా! ధ్రువా! తల్లి తర్వాత సకల భువనాలు పరిపాలించే ఆ భగవంతుడే గొప్ప ,!
"అమ్మా! అతడు తండ్రి వలె, ప్రేమతో నన్ను తన తొడ పై కూర్చుండ బెట్టు కుంటాడా చెప్పు ??
"నాయనా! మనిషికి ఉన్నట్టుగా , అతడికి చిన్నా పెద్దా ,నలుపూ తెలుపూ, ఉచ్చ నీచాల వంటి బేధాలు ఉండవు కుమారా!
తల్లికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు రా నాన్నా !
నీకు ,నాకూ, నీ తండ్రికి, నీ తండ్రి తండ్రికి, లోకం లోని సమస్త ప్రాణులకు కూడా ఆ దేవదేవు డే తండ్రి రా కన్నా !""
"అమ్మా!, ఆ పిన్ని ,నన్ను "నీవు దిక్కు లేనివా డివి"" అంది,, కదా ! నిజంగా, నాకు అతడు నాకు దిక్కు అవుతాడా?"
""దృవా!, ప్రియ మైన తనయుడా, బంగారు తండ్రీ,! పుత్రా, !నీకే కాదు నాకు, అందరికీ కూడా ఆ శ్రీహరియే దిక్కు !తనపై నమ్మకం ఉంచితే చాలు,, నాయనా, కన్నతండ్రి లా ప్రేమతో తన అక్కున చేర్చుకుంటారు !!,ఈ ప్రపంచం లో తన కోసం ఎవరు కష్టపడుతు న్నా, చూడలేక ,పరుగున ప్రేమతో వచ్చి ఆదరిస్తూ ఉంటాడు!, అతడు చాలా దయామయుడు,!ఆపద్భాందవుడు !అనాథ రక్షకుడు !
దిక్కు లేనివారికి ఆ దేవుడే దిక్కు , గా ఉంటాడు నాయనా ,!
నీకు ఎవరూ లేరని బెంగ పడకు_,! ఆ పరమాత్ముడు ఉన్నాడని నమ్ము! అమ్మ ఒడిలో హాయిగా, నిర్భయంగా బజ్జో రా కన్నా__!, నా ముద్దు కుమారా! అమ్మ అంటే ఎంత దయరా, నీకు!*నీ చిన్ని చిన్ని చేతులతో నా కంటి నీరు తుడుస్తూ ఉంటె, నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా! నీవు బాధ పడుతూ కూడా, నీ బాధను ఈ అమ్మకు తెలియ నీకుండ, నన్ను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నావు, ధ్రువ కుమారా,! నిన్ను కన్న నా జన్మ ధన్యం! నిజంగా నేను అదృష్టవంతుడు రాలి ని, ఓ పరమాత్మా, ఏ దిక్కు లేదని బాధ పడుతున్న నా కొడుకు నకు నీవు దిక్కై ఉండు స్వామీ, నారాయణా, పరత్పరా! ఆర్తులను కాపాడు! భక్త జన సంరక్షణ భారం వహించు! దీనులను కనికరిం చు! శరణు లక్ష్మీ రమణా శరణు కమల లోచనా, శరణు జగదీశ్వర శరణు!'" __________&_______
""దిక్కు లేని వారికి దేవుడే దిక్కు! దిక్కు లేని వారికి దేవుడే దిక్కు !!""
""ఎవరూ నీవు ? అలా ఎందుకు అరుస్తూ ఈ ఘోర అరణ్యం లో తిరుగుతూ ఉన్నావు బాలకా??"
"స్వామీ !మీరు ఎవరు ?""
"నన్ను నారదుడు అంటారు ,బాలకా ! చూస్తే నీకు ఐదు ఏళ్ళు కూడా లేవు,! తలిదండ్రుల వద్ద గారాబంగా పెరగాల్సిన చిన్న తనం నీది!!ఎవరు నీవు చెప్పు??"
""స్వామీ !మీకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను !
నా తండ్రిగారు ఉత్తాన పాద మహారాజు గారు!!"
""ఓహో ! అయితే ,నీవు రాకుమారుడు దృవుని వి అన్నమాట!! నీ
తల్లి సునీ తి అవునా??""
""అవును, స్వామీ,! ఇవన్నీ మీకు ఎలా తెలుసు !
, అన్నీ చెబుతాను,,కానీ నీవు ఈ అరణ్యంలో ఎక్కడికి వెళ్తున్నా వు నాయనా?!"
""నేను దేవు ని చూడా లని వెదుకుతూ వెళ్తున్నాను,,!"'
""ఎక్కడ ఉంటాడో తెలుసా నీకు?""
"ఏమో ?ఎక్కడున్నాడో? ఎలా ఉంటాడో,?, ఇవేమీ, నాకు తెలియదు స్వామీ!""
""మరి ఎలా పట్టుకుంటావు, ధ్రువ కుమారా, ఆ దేవుడిని??""
""నా లాంటి "దిక్కు లేని వారికి దిక్కు "గా ఉంటాడని నాకు మా అమ్మ చెప్పింది, స్వామీ!""
"ఏ దిక్కున దేవుడు ఉన్నాడని వె దకుతావు బాబూ, ద్రువా??
""చూస్తూ వెదకు తూ, వెళతాను, స్వామీ! నాకు మాత్రం ఏం తెలుసు!""
"అమ్మ చెప్ప లేదా నాయనా?""
""అమ్మకు తెలిస్తే చెప్పేది కదా స్వామీ?"" దయచేసి ఈ బాలుడి పై గురువు లా కనికరించి, దేవుడిని చూసే మార్గం చెప్పండి, స్వామీ!""
"ఎంత వినయం నేర్పింది,, మీ అమ్మ ,,నీకు దృవా! దైవం పై నమ్మకం, భక్తి ఇలా బాల్యం నుండి నేర్పిన మొదటి గురువు ,మీ అమ్మ యే!! ఇలా బాల్యం లోనే నీకు చక్కని దారి చూపించిన మీ తల్లి దన్యురాలు"! నాయనా నీవు అదృష్టవంతు డివి !!,,,,పోనీ,,నీవు వెళ్లే దారిలో ఆ దేవుడు కనిపిస్తే గుర్తు పట్ట గలవా?""
"ఏమో ,స్వామీ !అమ్మ చెప్పలేదు ,, దేవుడు ఎలా ఉంటాడో !
""ఆ దేవుడు
ఎక్కడా కనిపించక పోతే ఏం చేస్తావు ,ధ్రువ కుమారా??"తిరిగి ఇంటికి వెళతా వా?""
లేదు, వెళ్ళ ను గాక వెళ్ల ను,, అతడు కనబడే వరకూ, !""అమ్మ చెప్పింది, దేవుడు ఉన్నాడు, !ఆర్తితో పిలిస్తే వస్తాడు,! తనకోసం బాధ పడుతూ ఉండేవారిని చూస్తూ ఊరుకోడు, !వచ్చి ఆదరిస్తా డు అనీ! అందుకే,
ఏ దిక్కూ లేకుంటే ఆ దేవుడే దిక్కు అని కదా వచ్చాను ,స్వామీ!!"" దయచేసి,
నాకు ఆ దేవుడి ని చూసే మార్గం చెప్పండి స్వామీ దిక్కు లేనివాడి కి దిక్కు చూపండి! స్వామీ,, అంతవరకు, మీ పాదములు విడవను!""
లే నాయనా ! అమ్మ నీకు నిజమే చెప్పింది ! అయినా, నీలో, ఈ బాల్య దశలో,ఎంత అమాయకం,? ఎంత పట్టుదల ?, అమ్మ మాట పై ఎంత విశ్వాసం ?, ధ్రు వా!, దేవుడు కనిపించే మార్గం చెబుతాను విను!""
""చెప్పండి ,స్వామీ !మీరు దేవుడిలా కనిపించారు! దేవుడే నాకోసం మిమ్మల్ని పంపించాడు,!""
""నాయనా, !నేను చెప్పినట్టు చేస్తావా??""
""మీరు ఏం చేయమన్నా చేస్తాను , స్వామీ ఆ కనపడని దేవుడిని చూడటం కోసం!""
""ఓమ్ నమో భగవతే వాసుదేవాయ !"" అంటూ మూడు సార్లు అను!""
""అంటే ఏమిటి ,స్వామీ??""
అది దేవుడి కి ఉండే ఒక పేరు ,! ఆయన రావాలంటే, అతడిని
పేరు పేట్టి పిలవాలిగా!!"'
""అయితే సరే స్వామీ!,ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ!""
""చాలా చక్కగా అన్నావు, నాయనా, సంతోషం!, అలా కనీసం ఆరు నెలలు ఆ నామ జపం చేయాల్సి ఉంటుంది, నీవు, అక్కడ, ఆ నదీ తీరంలో, ఏకాంతం గా, భయపడకుండా!"చేయగలవా??""
చేస్తాను స్వామి! చేస్తాను! మీ మాట పై నాకు విశ్వాసం పెరుగుతోంది! గురువాజ్ఞ గా పాటిస్తాను!""
, నాయనా ,ద్రువా!!మొదటి రెండు నెలలు పండ్లు ఆకులు నీరు గాలి తీసుకోవాలి, ఆహారంగా!!"
""సరే స్వామీ!!"
""మూడవ ,నాల్గవ నెలలో ఆకులు మాత్రమే ఆహారంగా తింటూ నామ జపం చెయ్యాలి!!""
""మీ మాట శిరసా వహిస్తాను స్వామీ!""
""ఐదవ నెలలో నీరు, గాలి మాత్రమే గ్రహిస్తూ ఉండాలి!""
""అలాగే, స్వామి!""
అరవనెలలో కేవలం,ఒక్క గాలి ని మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ, దేవుడిని ధ్యానిస్తూ, నామ జపం చేస్తూ ఉండాలి!
ధృ వా! నాయనా! నీ చిన్నారి పాదాలతో, ఒక కాలిపై మరొకటి అనిస్తు, నీవు ఒంటి కాలి పై నిలబడ గలవా ,??
""స్వామీ! ఆ భగవంతుడి ని చూడటానికి ఎంతటి కష్టమైన పని అయినా చేయగలను !, ఇదిగో చూడండి ,! ఇలాగేనా??""
"!ఆహా , నాయనా ! నీవు కుషాగ్ర బుద్ది గలవాడవు, వివేకం వినయం, పట్టుదల దైవభక్తి కలవాడవు, ఇది నీ యోగ్యతను సూచిస్తోంది! ,నీకు భగవంతుని గురించిన మార్గ దర్శనం చేసే అవకాశం అదృష్టం,ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు!! భగవంతుడి పై , నీకున్న అచంచల విశ్వాస మే నీకు తప్పకుండా దైవ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది!;, ఇది గురు వాక్యం,! సత్యం అవుతుంది ,! నీ కోరిక ఫలిస్తుంది,! నీ జన్మ తరిస్తుంది, నాయనా ,! నేను గురువు స్థానం లో నీకు నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపదేశి స్తున్నాను,! నా మాట పై విశ్వాసం ఉంచి నేను చెప్పినట్టు చెయ్యి! ధ్రు వా!""
""నేను ధన్యు డిని, స్వామీ !దిక్కు తోచకుండ, పిచ్చివా డిగా ఈ కారడవి లో తిరుగుతున్న నాకు, మీరు దిక్కై సాక్షాత్కరించి కరునించారు ! నన్ను దీవించండి స్వామీ ,,!మీ పాదాల నంటి ప్రణామం చేస్తున్నాను!!""
""వత్సా! ధ్రు వా! తథాస్తు!
ఇష్ట కామ్యార్త సిద్ధిరస్తు!
భగవంతుని కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు!
దైవ సాక్షాత్కార ప్రాప్తిరస్తు!
జయొస్తు !, శుభమస్తు,!! ఈ క్షణం నుండే నీవు దీక్ష వహించు! నాయనా! శుభమస్తు ! ఇక వెళ్ళి విజయం తో తిరిగి రా,!""
"""ఓమ్ నమో భగవతే వాసుదేవాయ , ఓమ్ నమో భగవతే వాసుదేవాయ!"",,,,,!"
""ఆహా !ధ్రువ కుమారా! ఇంత చిన్న వయసులో నీకు దేవుని పై ఎంత గురి, ఎంత విశ్వాసము ఎంత పట్టుదల కు దిరిందయ్యా!
చిరంజీవ ,యశస్వి భవ!
నారాయణ !నారాయణ! నారాయణా,, నీ చరిత, నీ రూపం, నీ నామ స్మరణ మహిమ లు,,నీ లీలలు అద్భుతం ! స్వామీ, లోకేశ్వరా,ఎవరి పై ఎప్పుడూ ఎలా అనుగ్రహిస్తు ఉంటావో, అది నీకే తెలియాలి! , నిన్ను నీ లీలల ను, తెలియ తరమా, మాధవా కేశవా ముకుందా, అనంత, అచ్యుత, నమో నమః
తండ్రీ!ఈ పసి వాడు నీ శరణు కోరి వచ్చాడు,! కనికరించి నీ దివ్య మంగళ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించు స్వామి , శరణు శరణు శరణు
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...