Thursday, May 28, 2020

మధుర భావన

May 31, 2016 10am
------------------------------------------------
 ఆరోజు-"హనుమత్ జయంతి"! --మంగళవారం 31-05-2016-   ఉదయం -10గంటలు --
శ్రీవిష్ణు సహస్రనామాలు నేను చదువుతూ ఉండగా -పద్మావతి  తులసీదళాలు
శ్రీకృష్ణునిపాదములవద్ద సమర్పిస్తూఉంది -- అప్పుడు నాఅంతరంగములో -ఒక
అద్భుతమైన దృశ్యo  కదలాడింది - మా తండ్రికి  ఎడమ వైపున మా తల్లి- ఇద్దరు
ఒకరి ప్రక్కన మరొకరు కూర్చొని ఉండడం - నేను చెప్పుతున్న ఒక్కొక్క
నామానికి - వారిద్దరుకలిసి -తమచేతులతో  -తమకు ఎదురుగాఉన్న నల్లనిఎత్తైన
శివలింగంపైన - తులసీదళాలను  వేస్తుండడం  -నాకు ప్రత్యక్షంగా కనిపించింది
- కళ్ళు తెరిస్తే ఎదురుగా భార్య  పూజ కృష్ణ విగ్రహానికి  -- కళ్ళు మూస్తే
కన్నతల్లి తండ్రి  పూజ శివ లింగానికి - నా నోట పలికే ప్రతి ఒక విష్ణు
నామానికి - అనుగుణంగా  చేస్తుండడం  దివ్యమైన -అద్భుతమైన -పరమానందకరమైన
అనుభవంగా తోచింది - కళ్ళవెంట ఆనందభాష్పాలు రాలాయి -శరీరం జలదరించింది
-నామాలు తడ బడ్డాయి -కంఠం  గద్గద మయ్యింది - "ఇంత గొప్ప భాగ్యమా -- ఈ
దీనుని పైన  వర్షించడం ! జగదీశ్వరా 1 నీకు ఇవే నా భక్తి పూర్వక ప్రణామాలు
-- అందుకో  -- అంతర్యామి 1 అనంతా ! ఆదిశేషా ! -'
   కలలో కూడా ఊహించని అమృత భావాలు -అనిర్వచనీయమైన అద్భుతక్షణాలు
అనుకోకుండా ఇలా అనుభవానికి రావడం - కేవలం పరమాత్మ అనుగ్రహం  తప్ప  -నేను
భావించింది కాదు -నాకు నా తండ్రి రూపం నిజంగా తెలీదు -  నాకు మూడేళ్ళ
వయసులో తండ్రి పోవడం - ఆయన ఫోటోకూడా లేకపోవడం - నావలె ఉంటాడని అందరు
అనుకోవడం తప్ప - మా తండ్రి రూపం అంతగా గుర్తు లేదు --
 అదేరూపం ఇప్పుడు కళ్ళముందు కదలాడడం - అతని ప్రక్కనఅమ్మ కూర్చుని ఉండటం -
ఇద్దరు కలిసి తమఆరాధ్య దైవమైన పరమ శివుని  పూజిస్తూ - నాకు తోచడం - ఇదంతా
 నాపైగల పరంధాముని కరుణాకటాక్ష వీక్షణలకు నిదర్శనగా -భావిస్తే -ఒళ్ళు
పరవశత్వంతో  పులకరిస్తోంది--
                                     కలలోనైనా  ఊహించని నా కన్న
తలిదండ్రుల జంటరూపాలను -15 నిముషాలపాటు -కనులముందు చూపించి --'భక్తితో
దైవపూజతో  తమవలె ధన్యులు" కమ్మని  -ఉపదేశించిన  ఆపరంధాముని
దివ్యపాదపద్మాలకు   సాష్టాంగప్రణామాలు సమర్పించడంతప్ప - - "ఆతని దయకు
వెలకట్టగలమా --!పొగడగ తరమా అతని లీలలు --!"
                   "  అంతయు నీవే హరి పుండరీకాక్ష !చెంత నాకు నీవే
--శ్రీ రఘు రామా !"
               ఓం నమశ్శివాయ  ! ఓం నమో నారాయణాయ !--
         నీ గురించిన ఇలాంటి  మధురభావాలతో  -  నిరంతరచింతనలతో  ఈ
జీవితాన్ని కొనసాగించేలా   అనుగ్రహించు తండ్రీ ! పాహిమాం 1 పరమేశ్వరా !
రక్షమాం !శ్రీ రామచంద్రా ! -- -

Tuesday, May 26, 2020

ఘల్లు ఘల్లు మని రారా !

May 21, 2020
""ఘల్లు ఘల్లు మని
,గజ్జెలు మృోయగ,
గంతులు వేయుచు రారా !"
వెన్న దొంగ ,
నీ వన్నె చిన్నెలతో
కన్నుల పండుగ  చేయరా !!
నందగోపాల ,దయచేయరా! నయగారాలు కురిపించరా!
నవ్య నాట్యాలు చూపించరా !!
చిన్ని బొజ్జతో ,
_శిఖి పించము తో,,
చిందులు వేయుచు రారా !
ముద్దు లోలుకు చిన్నారి మోము తో ,_
నీ మురళీ గానము చేయరా ,,!
కృష్ణా !!'
యశోదా కృష్ణా!
అల్లరి కృష్ణా!
చిన్ని కృష్ణా !
రాధా కృష్ణా !
మురళీ కృష్ణా!"
గోపీ కృష్ణా !""

వద్దురా కన్నయ్యా !

May 22, 2020

వద్దురా కన్నయ్యా !
ఈ పొద్దు ఇలు వదలి పోవద్దు రా!
అయ్యా!
పశువు లింటికి చేర ,, పరుగు లెత్తె వేళ,!
పసి పాపల ను  బూచి ,
పట్టు కెళ్ళే వేళా,!
వద్దురా,, కన్నయ్యా !"
పట్టు పీతాంబర ము
మట్టి పడి మాసేను !
పాలు గారే మోము,
గాలికే వాడేను ,,!
వద్దురా కృష్ణయ్యా !
__
నిను విడచి నేను  ఒక
క్షణమైనా ఉండలేను ,
నా ఆశ యూ నీవే, నా శ్వాస లో నీవే
నా ప్రాణమూ.__ జీవ
-నాధారమూ  నీవే !!
వద్దురా కృష్ణయ్యా !
__నను విడిచి పోకుండ
నిను ఆపలేనయ్యా ,
నీ వెంట నే పరుగు,
నే పెట్ట లేనయ్య !
కృప జేసీ నా మొర
విని బ్రోవ  రావయ్యా!!"
బ్రోవ రా కృష్ణయ్యా!
నను కావరా కన్నయ్యా !
నన్నేల రా , నల్లనయ్యా !!""

రాధే రాధే రాధే!_1

May 25, 2020
మానవ జన్మ, ఉత్తమమైనది ఉత్కృష్టమైనది , ఎందుకంటే, అతడి శరీరం  అనుభూతులకు ఆలవాలం ,ఆనందాలకు నిలయం ,
మరే ప్రాణికి లభ్యం కాని కేవలం మానవ జాతికే  అనుగ్రహించం  బడిన అందమైన  అపురూపమైన  అద్భుతమైన  అద్వితీయమైన భగవంతుని అనుగ్రహం!
అనుభూతి అంటే  స్పందించడం
దేహంలో ఉన్న కోటాను కోట్ల నాడులు ఒకేసారిగ ,పరిసరాల ప్రభావానికి  ఉవ్వెత్తున   ప్రతిస్పందించే దివ్యమైన సౌకర్యము ,అతడికి మధురాతి మధురం  ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి
ఈ అద్భుతం ఏ ఇతర దేవలోకంలో లేదు
కేవలం ఈ పరమ పావన మైన ఈ ధరణీ పై మనిషిగా  జన్మించిన వారికే ఉంది
అందుకే మానవజన్మ అతి దుర్లభం
చేయి జారితే మరల దొరకదు అంటూ శృత్తి స్మృతి పురాణాలు వక్కానిస్తు ఉన్నాయి
అందుకే ,నేను రాధా దేవిగా. యమునా తీరంలో బర్సానా గ్రామంలో వృషభానుని కుమార్తె రాధాదేవి పేరుతో , జన్మించాను
తదుపరి రేపల్లెలో కృష్ణుడు అవతరించాడు
గొలోకంలో నిరంతరం శ్రికృష్ణాసన్నిధానం లో పొందిన ఆనందానికి మించిన పరమానందం ఈ భూలోకంలో అనుభవించాను
ఎందుకంటే మానవ శరీరంలో  ఎన్నో అద్భుతాలు జరుగుతాయి,
పరమాత్ముని అంశాలతో ప్రభావం చూపుతున్న ఈ పంచభూతా ల ప్రమేయంతో తో ఈ దేహం ఏర్పడింది  ,
ఇక ఆ పంచ భూతాలు ఈ  అందమైన ప్రకృతి సంపదల  రూపంలో ,శ్రీకృష్ణ పరంధాము ని సచ్చిదానంద స్వరూప  దరహాస వైభవ లావన్యాలను  తమలో ప్రకాశింప జేస్తూ ,స్వామి సౌందర్యాన్ని ప్రతిఫలింప జేస్తూ. ఈ మానవునికి బ్రహ్మానందం అనుభూతి నీ నిరంతరం ప్రసాదిస్తూ నే ఉన్నాయి
నాకు శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో లభించిన  అనందం , అతడి పరోక్షంలో ,కూడా లభిస్తూ వచ్చింది
పుష్పాలతో లతలు ,ఆకులు ,తీగలు వనాలు చెట్లు పుట్టలు కొండలు లోయలు పచ్చికబయళ్ళు జలపాతాలు , సూర్యాస్తమయ,సూర్యోదయ సమయంలో మనసును  రంజింప జేసే ఆకాశం లోని వర్ణ చిత్ర పటాల సోయగాలు ,వర్షధారలతో ఈ శరీరం   తడుస్తుంటే  , ఆహా,ఏమానందం ఏమా దివ్యానుభూతీ ,!
చూడాలి అన్న తపన ,ఆర్తి ,ఆర్ద్రత ఎదలో ఉండాలి గానీ , ఎక్కడ లేడు ఆ జగన్మోహనుడు ?!
కృష్ణా నుగ్రహం ఉంటే తప్ప , ఆ అనుభూతిని కరునించమని కృష్ణయ్యను కోరుకుంటే తప్ప ,, ఆ తరుణం అందేవరకు ఈ రధామనోహరుని  విడవకుండా పట్టుకుంటే తప్ప ,  యశోదా కిషోరుని దివ్య దర్శనం అంత సులభంగా సాధ్యం కాదుకదా !! 
ఇలా ఎక్కడ చూసినా , అలా చూడబడిన. ప్రతీ వస్తువు  శ్రీకృష్ణ సౌందర్య ప్రకాశ     సాధనా నిలయమై అలరారుతూ , నంద నందనుని ఆరాధనా భావం మదిలో , కలుగ జెస్తూ ఉంటుంది కదా !
నాకు  నీలమేఘ శ్యాముని దయ,మూడు  విధాలుగా అనుగ్రహించ బడింది
1_   పరమశివ భక్తుడు ,మహా ముని శ్రేష్ఠుడు గర్గాచార్యుని  ఆశీస్సుల తో   నాకు శ్రీకృష్ణుని తో  పెండ్లి జరిగింది
ఇది అత్యంత గోప్యంగా ఉంచబడిన గొప్ప  దేవ రహస్యం
ఈ శుభఘడియల కోసమే నేను ,భూమిపైకి వచ్చింది !
2_ ,శ్రీకృష్ణుని అందమైన బాల్య లీలలు ప్రత్యక్షంగా చూడాలని అనుకున్న నా కోరికను , దేవకీ నందనుడు మన్నించాడు ,
ఆహా !
ఎన్ని సార్లు చూసినా,స్మరించిన ,తనివితీరదు కదా ,చిన్ని కృష్ణుని అపురూప సౌందర్య రూప లావణ్య వైభవాలు
దేహ ధ్యాస ఉండదు ,
మనస్సు కృష్ణా దివ్య శరీర సౌందర్య పిపాస తో మత్తెక్కి పోతుంటుంది
దివి నుండి దేవతలు అదృశ్య రూపంలో దర్శిస్తూ పరమానందం భరితులై వెళ్తూ ఉంటారు ,
నాకు ఉన్నది మానవ శరీరం అయినా నాలో పరదేవతా స్మృతులు ఉన్నాయి
కానీ , ఎక్కడా వాటి ప్రదర్శన చేయలేదు ,
ఒక్క  మహా రాసలీల  కేళీ మహోత్సవ సమయం లో తప్ప !
3_  శ్రీకృష్ణ  భక్తి యొక్క  నిజమైన స్వరూపాన్ని ,రేపల్లె గోపస్త్రీల ఆర్తి లో  దర్శించ గలిగాను
,భక్తి యొక్క శక్తి ఎంత గొప్పదో ,స్వయంగా అనుభవిస్తూ తెలుసుకో న గలిగాను
(ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !

ఎవరు గ్రుడ్డి వారు ?_2

May 25, 2020
ఏదైనా తనదాకా వస్తేనే తెలుస్తుంది ,!
, ""తాతా , !అలా  నీవు కన్నీరు పెట్టకు !;నేను చూడలేను ,!!""
,, చెప్పు చెప్పు. తర్వాత  ఏం జరిగింది తాతా ?""
ఏం చేశావు ??""
__"" అంధకార బందురం అయిన ఈ జాలి బ్రతుకును చూస్తుంటే ,నాపై నాకే రోత పుట్టింది !
ఈ బిచ్చ పు బ్రతుకు కంటే చావే మేలు అనిపించింది అపుడు !!
__ప్రతిరోజూ ఇంటి ముందు కి  వస్తుండే బిచ్చగాల్లు   పాడుకునే పాటలు వింటూ బయటనే గడిపే వాడిని !;  అనుకోకుండా ,
ఒకరోజున ""హరి భజన బృందం"" అటుగా వెళ్తూ  ఉందని   విని  ఎవరికీ చెప్పకుండా ,,పరుగున వెళ్ళి ,, సంతోషంతో వారిని కలిశాను !!
ఆ రోజు రాత్రి  వారు ఒకచోట ఆగి హరి భజన చేస్తూ ఉండగా వింటూ,, నా బాధలు మరిచాను !;
ఒకాయన దయతో  నాకు భోజనం పెట్టాడు , !! అంతే !;
తెల్లారింది !
ఎక్కడివారు అక్కడ వెళ్లి పోయారు ;
నేను ఆ వీధిలో  ఒంటరిగా మిగిలాను !
వేరే దిక్కు లేక ""హరీ హరీ"" అంటూ పాడుతూ  అడుక్కోడం , , దొరక్క పోతే పస్తులు ఉండడం  చూసి ఒక పుణ్యాత్ముడు  అక్కడ ఒక  కృష్ణాదేవాలయ సమీపంలో నాకు ఒక గుడిసె కట్టించి ఇచ్చాడు !!
అదే నాకు స్వర్గంలా అనిపించింది ,!!
నిరంతరం భజన చేస్తూ ఉంటూ ఏళ్లు గడిచాయి,!!
అలా  కృష్ణభక్తితో ,నేను పాడుకుంటూ ఉన్న కీర్తనలు ఎందరో భక్తి తో ఆనందంగా పాడుకుంటూ  ఉంటే  విని ,,ఇంకా ఉత్సాహంగా ,నంద బాలుని పాటలు  అత్యంత మనోహరంగా ,ఆశువుగా పాడుతూ  రోజులు గడిచాయి !
ఒక రోజున నేను
ఒక  మంచి వార్త  విన్నాను !
ఇదే త్రోవగుం డా ,శ్రీకృష్ణ భక్తునిగా ప్రసిద్ది పొందిన శ్రీ మాన్ వల్లభాచార్యుల  రాక ఉందని తెలిసి   ఆనందం తో  మనసు పొంగి పోయింది !
, వారి కోసం ఎదురు చూశాను ;!
ఒకరోజున  వారు రానే వచ్చారు ,
నా కుటీరం ముందుకు !!__  నేను  వారి కాళ్ళమీద పడి విలపిస్తూ ఏ  ఆధారం లేని నా  బ్రతుకు దారి కి మార్గం చూపించమని దీనంగా  వేడుకున్నాను !!
వారు  నా వద్దనే రెండు రోజులు ఉండి ,, సద్గురువు గా ,నాకు కృష్ణా మంత్ర మును  ఉపదేశించారు !!!"
ఆ విధంగా కృష్ణా పరమాత్మ నన్ను కరుణించాడు !!""
  హరి కథలు లీలలు ,  పరమాత్మ వైభవము వివరంగా నాకు  బోధించి   వెళ్లారు !!
గురు కృప ,గురు మార్గ దర్శనం ,లభించిన క్షణం నుండి ,వారి ఆదేశం ప్రకారం ఈ వ్రజభూమి లోనే  ఉంటూ ,దీనిని విడవకుండా ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని కృష్ణా,, నీ  స్మరణతో  , నీ గీతాలతో నీ ,కథలతో నా  జీవితాన్ని సార్ధకం చేసుకుంటూ ఉన్నాను ,
కృష్ణా !""
""ఇపుడు అనిపిస్తోంది,,ఇలా నాకు కళ్ళు లేకపోవడం కూడా నా అదృష్టమే ,
.సద్గురువు కృప లభించింది!!
కృష్ణయ్య సాంగత్యం సహచర్యం ,సాయుజ్యం , సామీప్యత , ప్రాప్తిం చాయి!!
నా అంతరంగం లో ఉంటున్న కన్నయ్య నా ఎదుటనే కూర్చుం డి ,, నా పాటలు వింటూ పరవశిస్తూ నన్ను దన్యున్ని చేస్తూ ఉన్నాడు !!
కృష్ణా నీవే తల్లివి తండ్రివి !!
నీవే నా తోడు నీడ నీవే సఖుడవు !!
నీవే గురుడవు దైవము !
నీవే నా పతియూ గతియు ,,
నిజముగా కృష్ణా !"
నేనిపుడు  ఆనందంగా ఉన్నాను  !
నాకూ ఏ కోరికా లేదు , !
  ,, కృష్ణా , చివరి కోరిక ఒక్కటే ఒక కోరిక !;""
నేను మరణించాక నా పార్థివ శరీరానికి ,, కృష్ణా!  నీవే  స్వయంగా నాకు  ""అంతిమ సంస్కారాలు"" చేయాలి , !
__""తాతా ,అప్పుడే అప్పగింతల కార్యక్రమంలో  చేరావు కదూ నీవు ?!"'
ఒక విచిత్రం విన్నాను అందరూ అనుకొంటూ ఉండగా !!
ఢిల్లీ పాదుషా అక్బరు ,మధురంగా పాడుతూ ఉన్న నీ గీతాలు వినడానికి  స్వయంగా నీ వద్దకు వచ్చాడు కదా  !!
ఏం జరిగింది చెప్పాలి తాతా ??"*
,__ కన్నా !  చిన్ని కృష్ణా !
నీవంటే , నీ బాల రూపం అంటే ,రేపల్లెలో ,, ఈ బృందావనం లో ,, రాధమ్మ తో కలిసి చేసిన మహా రాస క్రీడా వైభవాలూ అంటే మహా మహా ఇష్టం !!""
ఈ ""సూరదాసు భజనలు"" వినడానికి ,,పాడుకొడానికి , చాలా అద్భుతంగా ఉన్నాయి ,!అందుకే ,
పాదుషా గారు  నన్ను ఢిల్లీకి రమ్మన్నారు ,!
నాకు సన్మానం చేస్తారట !!
___"" అవునా ??
ఎంత గొప్ప విషయం ?? ఆహా !! ఇంతకూ నీవు ఏమన్నావు తాతా ??""
"""  కృష్ణా ,,నీకు తెలియని విషయం ఉంటుందా  చెప్పు ??
నేను కనలేని విషయం ఉంటుందేమో ,, కానీ, నీవు సర్వజ్ఞుడ వు ,,! స్వామీ !! మా గురువు గారి ఆదేశం ప్రకారం,,నేను  ఈ బృందావనం విడిచి ఎక్కడికి రాలేను ,,నన్ను క్షమించండి !;""అని  చెప్పాను ,
__అంత సూటిగా ఎలా చెప్పావు తాతా ??
కోపం రాలేదా పాదుషా కి """?
__ఏం చేయను కృష్ణా ?? వారికి కోపం బ్రహ్మాండంగా వచ్చింది!!
,కానీ  నేను హరి గానం ఆలపిస్తూ వుంటే, ఆ  మాధుర్యం తో   ఆయన అమితమైన ఆనందాన్ని పొంది ,,_"" ఎం కావా లో  కోరుకో పాదుషా గారు !!""!
మధు రగాయకుడు తాన్సేను గారు ,,భక్తిపూర్వ కంగా సంగీతాన్ని ఆలపిస్తూ వుంటే ,,నాకు  వినాలని ఉంది !""అన్నాను  వెంటనే
తాన్సెను గారు . నా కోరికను మన్నించి  ,,నేను నీ గురించి పాడిన కృష్ణ సౌందర్య వైభవ  గీతాన్ని అద్భుతంగా ఆలపించారు ,,!!_"
కృష్ణా!!ఇలాంటి ఎందరో  పాదుషా లకు ""పాదుషా"" మా నంద గోపాలుడు !!""
,ఆయన కృప ఉండగా ,,తుచమైన  ఏ కానుకలు సత్కారాలు , రాజ భోగాలు అవసరం లేదు"" అన్నాను !
""కృష్ణా!  ___ నీ కృప అపారం !!
ఒక  గాలికి కొట్టుకు పోతున్న ఒక అంధుని బ్రతుక్కు ,అతడి గాలి పాటలకు ఇంత గొప్ప   ప్రాధాన్యత  ప్రాచుర్యాన్ని కల్పించిన శ్రీకృష్ణా ,నీకు శతకోటి ప్రణామాలు !!""
ప్రభూ;!
, నిరంతరం నీవు  సర్వ కాలంలో,సర్వ అవస్తాలలో దాపుగా ,ప్రాపుగా . నాకు బాసటగా ఉంటూ ,నన్ను విడవకుండా ఎప్పుడు ఏది ,ఏది అవసరం ఉందో అది సమకూరు స్తు. ఈ  జన్మకు ఒక అర్థాన్ని పరమార్థాన్ని అనుగ్రహించా వు,,!!"
నీ ఋణం ఎలా తీర్చుకొ ను ??""
నీకీవే ,, నా అంతిమ
సాష్టాంగ ప్రణామాలు !!
స్వీకరించు ,!!
ఇక !సెలవు !""
జై శ్రీకృష్ణా!""
స్వస్తి !!"
హరే కృష్ణ హరే కృష్ణా ?!""

ఎవరు గుడ్డి వారు ? 1

May 24, 2020

తాతా ! సూర దాసు అని నీకు  పెట్టిన పేరు సార్ధకం అయ్యింది ,,
నీవు పాడే ప్రతీ పాట  ,,నీ  కంఠస్వర మాధుర్యం తో నన్ను తన్మయున్ని చేస్తోంది సుమా !
భక్తి పారవశ్యంతో కృష్ణా కృష్ణా అంటూ ఆలపించే కీర్తనలు ఈ వ్రజభూమి నీ దాటి , ఉత్తర భారత దేశమంతటా నీ పేరు వినబడుతు ఉంది సుమా !
నీకు తెలియడం లేదు గానీ , తాతా వేల మంది భక్తులు గాయకులు నీ ఎదుట కూర్చుండి వింటూ పరమానందం భరితులై వెళ్తున్నారు !!.
, అయితే,,నాకు ఒక ఆలోచన వస్తోంది , నీ ఎదుట ఉంటూ నీ హరి భక్తిని  మధుర గానాన్ని వింటూ ఉంటే,,నీకు చూపు ప్రసాదించాలని ఉంది తాతా !;
నీకు పుట్టుక తో కంటి చూపు లేదు కదా !ఇపుడు నీకు   ఈ రంగుల ప్రపంచాన్ని చూడగలిగే కంటి చూపును నీకు  నీవు ఆరాధ్య దైవంగా భావిస్తున్న ఈ  గోవిందుడు  ,,నీకు తన తన భక్తుని ప్రజ్ఞ చూస్తూ సంతోషిస్తూ ఉన్నాడు సుమా !!
నీ హరిభజన కీర్తనలను విని సంతోషంతో ,,నీకు  కంటి చూపును  అనుగ్రహిస్తాడు  , సరేనా తాతయ్యా ??
నీకు సమ్మతమేనా ?"'
___""_కృష్ణా !! రాధి కా మనోహర  !  ఇది నీవు నాపై చూపుతున్న అపారమైన   దయ అనుకొనా ?
లేక నా విశ్వాసం పై  ,,నాకు  నీవు పెట్టే పరీక్ష అనుకొ నా ?""
___""లేదు తాతా ,!;
నీవు నముకున్న కృష్ణునికి నీకు కనీసం  కంటి చూపు కూడా ఇవ్వకపోవడం  ఈ నీ  కృష్ణయ్యకు బాధగా ఉండదా చెప్పు ??""
____"కన్నయ్యా  !నను గన్న తండ్రీ ! నా పాలి దైవమా ! నా త పః ఫలమా !
నేను గ్రుడ్డి వాడిని అని నేను అనుకోవడం లేదు , కదా !!
ఎందుకంటే  నేను కృష్ణయ్య కళ్ళతో అంతా లోనా బయటా,, చూస్తున్నాను !   నాలో అంతర్లీనంగా ఉంటూ, హృదయంలో భువన మోహనముగా వేణుగానం చేస్తూ ,ఉన్న  ఈ కృష్ణయ్య ను చూస్తూ నిరంతరం  బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నాను,  !!
ఇక  ఆ  సంసార భూయిష్టమైన ఆ మాయా  ప్రపంచం తో , ఆ భవ బంధాల తో నాకు సంబంధం లేదు !
వాని అవసరం లేదు కూడా !
నేను పాడుకుంటూ ఉన్న పాటలు నా ముందు కూర్చుం డి ,  ఈ కృష్ణుడు వింటు ఉన్నాడు ,  నాకు ఈ తృప్తి ,, ఈ ఆనందం , ఈ జన్మకు ఇది  చాలు
కృష్ణా !""
నిను చూడలేని కనులు ఉన్నా లేకున్నా ఒకటే కదా కృష్ణా !!!
, నీ భజనలు నేను గానం చేస్తూ ఉండగా వినకుండా వెళ్లిపోయే వారు __నిజమైన చెవిటి వారు సుమా !
నీ లీలలు నీ గుణ గాన రూప లావణ్య వైభావాలు  స్మరించని  వారి బ్రతుకు లు, సుగంధ పరిమళాలు లేకుండా భగవంతుని పాద కమలాల ముందు సమర్పణలు నోచుకోని పుష్పాల వంటివి సుమా !!
కంటి చూపు కోల్పోయి ,బాహ్య ప్రపంచాన్ని  చూడ నోచుకోని అంధులు గ్రుడ్డి వారా  అంటే ఎంత మాత్రమూ కారు !"
""సర్వేంద్రియానాం నయనం ప్రధానం !""అన్నారు విజ్ఞులు ! నిజమే !
కళ్ళు ఉండి సర్వత్రా పరమాత్మను కాంచలేని వారు నిజంగా గ్రుడ్డి వారే !!""
తలి దండ్రులను ప్రత్యక్ష దైవాలు గా గుర్తించలేని బిడ్డలు గ్రుడ్డి వారు ,!
భార్యను దేవత గా కాకుండా బానిసగా చూస్తూ హింసించే  ,మానసిక క్షోభకు గురి చేస్తున్న పశు ప్రవృత్తి గల భర్తలు గ్రుడ్డి వాళ్ళు ,
స్త్రీలలో మమతా , ప్రేమానురాగాల ను దర్శించలేని  మగాళ్లు  నిజమైన గ్రుడ్డి వారు !
ఈ విధంగా యదార్థ మును గ్రహించకుండా పదార్థ మే నిత్యం అనే భ్రమ లో కొట్టు మిట్టాడుతూ ఉండే బుద్ది హీనులు అంతా  ,,తమ బ్రతుకును అంధకార బంధు రంగా మార్చుకుంటూ ఉన్న గ్రుడ్డి వారే  కదా !""
పక్షులు జంతువు చెట్టూ చేమా నదీ నదాలలో నింగిలో ,పంచభూతాలలో తినే ఆహారంలో త్రాగే నీటిలో ,పీల్చే గాలిలొ, సమస్త ప్రకృతిలో ,సూర్య చంద్రుల కాంతి లో పరమాత్ముని వైభవాన్ని కాంచలేని మూఢ జనాలు , అహంకా రులు  ,అజ్ఞానులు నిజంగా గ్రుడ్డి వారే కదా కృష్ణా !
ఆత్మ విచారణ చేస్తూ జీవాత్మను పరమాత్మ తో అనుసంధానం  చేయకుండా అమూల్యమైన మానవ  ,జీవితాన్ని వ్యర్థ కార్య కలాపాలతో   భ్రష్టు పట్టించే వారు కళ్ళు ఉండి కూడా  కబో ది అవుతున్నారు కృష్ణా !! అణువణువునా నిండిన భగవంతుని తత్వాన్ని తమ వివేకంతో  దర్షించలేని వారంతా  గ్రుడ్డి వారే అని నా అభిప్రాయం కృష్ణా !!"
అయినా నిన్ను చూడాలనే ఆశతో ఆర్తితో అర్ద్రత తో , ఆరాటం తో ఆవేదనతో ,,ఆరాధనా భావంతో   నీ కోసం తపించే , ,నిన్ను చూడాలని తలపించే  భావ మాధుర్యం  ప్రాప్తించడం సామాన్యమైన విషయం కాదు కదా కృష్ణయ్యా !!
దేనికైనా పెట్టీ పుట్టాలి ,
యద్భావం తద్భవతి !"
అగ్నిలో కాలిస్తే నే   మలినాలు  తొలగి స్వచ్చమైన బంగారం బయట పడుతుంది కదా !
కృష్ణా! నీవే తప్ప అన్య భావన చేయని వారే నీ కరుణ కు  అర్హత కు నోచుకుని  అంతః చక్షువు లతో  నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ పులకితు లౌతు ఉంటారు కదా , కృష్ణా !;
పరమాత్మ సాక్షాత్కారం  పొందాలంటే కృష్ణ చైతన్య అనుభవాన్ని సంపాదించాలి !
ఆ సర్వేశ్వరుని లీలలను సర్వాంతర్యామి తత్వాన్ని తెలుసుకోలేని ఆ కౌరవులు రెండు కళ్ళు ఉండి కూడా , కూడా  అహంకరించి కళ్ళు ఉండి కూడా ఎదుట కదలాడుతూ ఉంటున్న కృష్ణ స్వామిని చూడలేని  గ్రుడ్డివా రు అయ్యారు కదా  ,!!
వారు
శ్రీకృష్ణుని నిందించి ,సర్వ నాశనాన్ని కొని తెచ్చుకున్నారు !!
బమ్మెర పోతనామా త్యులు  అంధ్రీ కరణ చేస్తూ ,, మహ భాగవతం లో  "" గ్రుడ్డి వారు ఎవరో""?  చక్కగా విశద పరచారు ,
""కమలేశు జూడని కన్నులు కన్నులే ,,
తరు కుడ్య జాల రంధ్రములు గాక !!""
అని చెప్పినట్టుగా ,ఎవరైతే నిత్యం  తాము
దర్శించే దేవాలయంలో  ఎదుట  గోపాలకృష్ణుని ముగ్ద మనోహర సుందర సురుచిర  శతకోటి మన్మథ రూప లావణ్యం తో ప్రకాశించే విగ్రహంలో __ నగుమోము తో ఆగుపించే గోవిందుని చూడలే క పోతే అలాంటి వారి కన్నుల కి, మఱ్ఱి చెట్టు కాండాని కి  ఉండబడే  పెద్ద పెద్ద తొర్ర ల కి  మధ్య పెద్ద తేడా   ఉండదు కదా ?"
అంటారు !!
___""తాతయ్యా !" నీకు తల్లీ దండ్రి సోదరులు ఇల్లూ వాకిలి. ఇన్ని  ఉండి కూడా ఇలా అనాథ వలె ఇక్కడ ఈ వ్రజ భూమిలో తల దాచుకోవడం నీకు బాధగా అనిపించడం లేదా ?
__"" నిజమే ,,కృష్ణా ,!;
చిన్నతనం లో నేను రోజూ  ,చాలా ఏడ్చాను ,!!
నాకు ముగ్గురు అన్నయ్యలు ,నేను చిన్న ,,!!కానీ పుట్టుకతో గుడ్డి వాణ్ణి , నేను ,ఎన్ని జన్మల పాప ఫలమో కదా ఇది ??
ఏ సంస్కారానికి నోచు కోలేదు ,,
అందుకే ఎందుకు పనికి రాని నన్ను  అసలు పట్టించుకోవడం  మానేశారు  !
స్నేహితులు బంధువు లు నా అన్నవారే కరువయ్యారు కన్న య్యా ?""" కన్నవారి ప్రేమ కూడా కరువైంది
అందరకు బరువై పోయాను
కృష్ణా !
నా లాంటి  అభాగ్యులు ,అంధులు ఎందరున్నారో ,ఎంత బాధను అనుభవిస్తూ ఉన్నారో కదా !?? ఈ విషయం తలచుకుంటే భయం వేస్తూ ఉంటుంది !
కృష్ణా ! ఎందుకయ్యా  ఇంత తేడా ?
అందరం మనుషులమే కదా !
ఒకరు ఏడుస్తూ ఉంటే , అది చూస్తూ మరొకరు  నవ్వుకోవడం , కృష్ణా !
ఏమిటయ్యా నీ లీల !
ఏమిటీ ఈ గోల ?
   (ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

కృష్ణ భక్తుడు, నార్శి మెహతా _4

May 22, 2020
శుక మహర్షి  మహా భాగవతం లోని  భక్త మహాశయులు గూర్చి అద్భుతంగా  వివరించారు
కానీ రాధా రాణి జోలికి వెళ్లలేదు , ఎందుకంటే , ఆ మహానుభావుని కి , "రాధా" అన్న పేరు వింటే,లేదా స్మరిస్తే చాలు, అతడి మేను  పులకరిస్తుంది,, ఆనందభాష్పాలు  ఆశృధారలుగా బొట బోటా స్రవిస్తూ వుంటాయి , తన్మయత్వం తో మనసు పరవశిస్తూ , ఈ లోకాన్ని దేహాన్ని పరిసరాలను  మరచి పోతాడు
రాసలీల అంతరార్ధం తెలిసిన ఆ యోగి పుంగవు డు ,తిరిగి యధా స్థితికి వచ్చి కోలుకోవడానికి  అతడి ఆంతర్యం ఒప్పుకోదు
అలాంటి అలౌకిక అద్వితీయ  అపురూపమైన,శాశ్వతమైన ,చిదానంద పరబ్రహ్మ స్వరూపం అయిన ఆ  బ్రహ్మానందం స్థితిని , మధురా నుభూతి పొందే వారు , మృగతృష్ణ వంటి ,కోరికల మూటలను తలపింపజేసే  ఈ భౌతిక సుఖాల ను,  కాంక్షిస్తారా ?"
సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్ప వనాలను విడిచి ,తుమ్మెద  అరణ్యాలలో తిరుగుతుందా ?
హిమగిరి శిఖరాల లో  ,,మానస సరోవర తీరప్రాంతంలో ఆనందంగా  ఉండే రాజహంస కు, , కుంటలు చెరువుల్లో ఈదుతూ ఉండాలని ఉంటుందా ?
వసంత ఋతువులో మామిడి లేత చివుల్లు తింటూ , కుహూ కుహూ అంటూ  విశ్వాత్మ కు తన మధుర సంగీతాన్ని  వినిపిస్తూ ఆనందిస్తూ ఉండే కోయిల ,  చెట్టు తొర్రలో ఉండాలని అనుకుంటుందా ?
శరద్ ఋతువు  లో చల్లని నిండు పున్నమి వెన్నెల కాంతుల లో  తడుస్తూ ,,నింగిలో  హాయిగా స్వేచ్చగా  విహరిస్తూ  ఎగురుతూ పరమాత్మ వైభవాన్ని అనుభవిస్తూ పరమానందం పొందుతూ ఉండే చకోర పక్షి ,ఘోరమైన కీకారణ్య ములలో తిరగాలని ,,ఎప్పుడైనా  భావిస్తూ ఉంటుందా  !
దివ్యమైన భవ్యమైన రాధాకృష్ణుల చరణార విందా లను నిరంతరం చింతిస్తూ , ఆ భావనామృతాన్ని  మనసారా గ్రొలుతూ, తని వారా త్రాగుతూ  ,శ్రీకృష్ణ చైతన్యం తో, మత్తెక్కి పోయె  ఈ చిత్తము  ఈ అద్భుతమైన ,,భావ సంపద ,, వేరే ఇతర విషయ వాంఛల యందు  తగిలి బాధల్లో కూరుకు పోవడానికి ఎంత మాత్రమూ ఇష్ట పడదు కదా !"
,అందుకే శుక యోగేందృ డు ,దశమ స్కందము ను  , పరీక్షిత్తు మహారాజు కు వివరించే ప్రయత్నం లో  ,తన ఆరాధ్య దేవతా,పరలోక  సామ్రాజ్ఞి ,గోలోక సామ్రాజ్య పట్ట మహిషి ,,శ్రీకృష్ణ హృదయాంతరంగిని,, అద్వైతా మృత వర్షిణి  గా భాసిల్లే  రాధా రాణి ప్రసక్తి రాకుండా ,,ముందే జాగ్రత్త పడ్డాడు  ఆ శుకబ్రహ్మ ,
ఆ నామం లో ఆ రూపంలో ఆ భాగంలో ఉండే రుచి ,,,ఆరాటంతో ,, ఆర్ద్రత తో ,, ఆర్తి తో  వారిని ఆరాధిస్తూ  భక్తి ప్రపత్తులతో ఆస్వాదిస్తూ ఉంటేనే  రాధాకృష్ణ  స్వరూప నామ గాన భావ మాధుర్య ము లో దాగి ఉన్న అభిరుచి తెలుస్తూ ఉంటుంది
ఈ అనందం ,అనుభవైక వేద్యం ,
భక్తునికి భగవంతునికి మద్య ఏర్పడే  అనుసంధానం , ,, ఈ తాదాత్మ్యం !!
అంతటి మహోన్నత మైన రాసలీల అంతరార్ధం ,, బ్రహ్మాదుల కైనా  ఊహించవశమా !
వర్ణించ తరమా ??
__ అదొక ఆనంద లోకం!
సత్ చిత్ ఆనంద స్వరూపాలు గా ప్రకాశిస్తూ  రాధాకృష్ణుల ప్రణయ సుధా గీతికా లాపన ధ్వని స్తూ ఉంటే , బాగా వింటున్నవారికి వారు పడే అలసట బడలిక లు తొలగిపోయి ,  మనసు తేలిక గా ,ఉల్లాసంగా  ద్విగుణీకృతం గా అడుగులో అడుగు వేస్తూ , ఎటు చూస్తున్నా ఆ ప్రేమానురాగాల దివ్య దంపతుల దర్శనం చేస్తూ పులకితా అంతరంగ మనస్కులు అవుతూ ఉన్నారు
  స్త్రీలకు  మాత్రమే మహా రాస లీలా వైభవ ప్రాంగణం లో కనీస ప్రవేశ అర్హతగా రాధా రాణి నిర్ణయించింది ,,
   ""రాధా రమణ! ,రాధే గోవిందా! ,రాధే రాధే! ,,కృష్ణా కృష్ణా! ,గోవిందా !,గోపాలా !,శ్రీకృష్ణ గోవింద హరే మురారీ ,!,హే నాథ! నారాయణ !వాసుదేవ ,!
హరే కృష్ణ హరే కృష్ణా,
కృష్ణ కృష్ణా హరే హరే !
హరే రామ హరే రామ,,
రామ రామ హరే హరే! __
అంటూ ముక్త కంఠం తో కలిసి  కొందరు మధురా స్వరం తో పాడుతూ , ఉన్నారు
కొందరు గోపికా స్త్రీలు  వేణు నాదం తో , వీణా గానంతో ,మద్దెల తబలా కంజీరా వంటి సంగీతరస భరిత మైన పలు రకాల వాయిద్యాలతో  అలరిస్తూ , ఆ అమృతాఝరులను వర్షించే  సప్త రాగ రస ధారల ను తమ భావా వేషాలకు అనుగుణంగా  జోడిస్తూ అద్భుతంగా , శ్రవణా నంద క రం గా   మోయిస్తు ఉన్నారు ,
మరి కొంత మంది గోపికలు తమ లో  కృష్ణుని పై గల అవ్యాజమైన  ప్రేమానురాగాలను ప్రదర్శించే తపనతో ,తమ శృంగార రస అభినయ సౌందర్య లహరి ని , ఆ మృదు మధుర సంగీత స్వరాల కు తగినట్టుగా ,,రమణీయంగా ,కమనీయంగా  నృత్యం చేస్తూ ,కూడా ,,  కృష్ణునిపై  గల  తమ నిశ్చలమైన దృష్టిని పోనీకుండ ,అతడి  సౌందర్యాన్ని మనసారా తానివారా కనులారా గ్రోలుతూ , ఏ మాత్రం  ఏమారకుండ , రెప్ప పాటు కాలం కూడా వృధపోకుండా చూస్తూ , అలా తమలో కలిగే ఆనంద పారవశ్యంలో ,,మైమరచి పోతూ ఉన్నా రు ఆ కృష్ణ సౌందర్య     లాలస  పిపాస కాంక్షా దీక్ష గల ఆ గోపికా వనితామణులు !!"
, ( ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...