Friday, February 1, 2013

Sandhya vandanam

this process needs --only 15 minutes time - I  MADE THIS BRIEF!
             advantages  are many
1- this is only  dyaanam - you may concentrate on any object -- but
one and only one --target NO OTHER THOUGHTS SHOULD  ENTER INTO THE
MIND
BEGINING IS TROUBLESOME - BUT ONCE WE EXPERIENCE IT -WE BECOME A
POWERFUL SUPERMAN - ANY WORK OR WORD WILL BE FRUITFUL AND SUCCESSFUL-
AND BECOME - A  YOGI -A  SADHAK- A RAMDEV BABA - A VIVEKANANDA -A
PARAMAHAMSA  AND A MAHATMA AND WHO HAD COMMITMENTS AND STRONG BELIEF
-AND AIM IN LIFE -THEY WORSHIPPED -AND SERVED -LIVED - FOR OTHERS -AND
BECAME ETERNAL WITH FAME AND NAME
2- needs -- a patra with water - another on floor -- a udharini --or
spoon - and  a mat to sit on the floor
                  a dhoti   and a towel on shoulders-- needless to say
 -- a JANDYAM- without knots pure and clean --it is UPAVEETAM_  a
thing lying close to our HEART-- A GARLAND-- AND WE HAVE TO GET BY
HEART THESE MANTRAS -I SHALL CONVEY WORD TO WORD MEANING  AT YOUR
DESIRE !
4-- this is a process of thanks giving A  GRATITUUDE  --to the GOD
-who has given-- everything ! what --NOT?
             mind - soul - body -  nature- relations- affections - all
luxuries and  comforts - parents --wife  -children   AND SO ON !
       mainly we are  born as MEN _  that is enough ! AND WE ARE
BRAHMAN  -IT IS MORE THAN ENOUGH  I  !  THIS IS OUR  BIRTH  RIGHT
GIVEN BY THE GOD   ! A BOON TO US !
         KARMASAKSHI   - the sun is  the living - moving - lifegiving
god - without HIM no universe no creature - and no  nature - we pour
water addressing HIM - in his front- two times
         he is GAYATRI  all the gods and goddess exist in his form
         one GOD  IS  WITHIN US   -- and another  GOD IS  SUN  we have
to unite these two !   where real  happiness  permanent sachidanandam
- gives us  light  and delight
5 -- if we know the meaning of these mantras - we   never forget to do
this holy yajnam -sandyavandanam
         which  means -- every day-- rising and setting sun is warning
us -- that  count down is started - and utilise the life not like an
animal -- but like a WISE MEN -  who prays for the welfare of  others
!
         MAIN PURPOSE OF  SANDYAVANDANAM     is a prayer to god to
bless all  mankind - all  creatures - entire universe - as a whole to
be good -peaceful merciful  and stomuchful  too
            SARVE JANAH SUKHINO  BHAVANTHU
             LOKAA  SAMASTHAA  SUKHINO  BHAVANTHU
 SARVE  BHADRAANI  PASHYANTHU

6- KNOWING  A  LITTLE BIT ABOUT  SANSKRIT WILL  DEFINITELY GIVE US
ENOUGH GRIP -- NOT ONLY THIS   SURYA VANDANAM

             last  -- but not  least - unless we -  so called
brahmin do this  great venture - we cannot get any returnby visiting
temples -doing yatras-- vratham- japam - yajnam -yagam and so on
      this is the KEY to become brahman not  by birth but by karma
anushtanam  - that is this sandya ( sandya ) vandanam
                                 MAY  GOD BLESS  ALL LIVING BEINGS

ఉద్ధరిని లోని  నీటితొ  తలపై  ప్రోక్షించు  కుంటూ -----
----------------------------------------------------------------------------------------------------------------------------
        శ్లో "  అపవిత్ర  పవిత్రోవా - సర్వావస్తాన్  గతోపివా - యస్మత్ పుండరీకాక్షం - సబాహ్యాభ్యంతర  శ్శుచి ::! పుండరీకాక్ష ! పుండరీకాక్ష --!పుండరీకాక్ష !"       -----  అనాలి 
 ---1 --ఆచమనం--- !    -- కేశవాయ  స్వాహా !-నారాయణాయ స్వాహా -! మాధవాయ  స్వాహా--! -------మూడు సార్లు  ఆచమనం  చేయాలి !-----    తర్వాత  గోవిందాయనమః -విష్ణవే నమః -- మధుసుదనాయనమః-- త్రివిక్రమాయనమః వామనాయనమః- శ్రీధరాయనమః-- హృశీకేశాయనమః-- పద్మనాభాయనమః-- దామోదరాయనమః-- సంకర్శనాయ నమః వాసుదేవాయనమః--  అనిరుద్దాయనమః-- పురుశోత్తమాయనమః- అదోక్షజాయనమః-- నరసింహాయనమః-- అచ్యుతాయనమః-- జనార్ధనాయనః మహా -  ఉపెంద్రాయనమః-- హరయేనమః--  శ్రీకృష్ణ  పరబ్రహ్మనే నమః !           ---   ------భూతో చ్చాటనము----
---------------------------------
           శ్లో!    "    ఉత్తిష్టంతు భూత పిశాచా :--ఏతే  భూమి భారకాః  !--ఏతేషా  మవిరోధేన  బ్రహ్మ కర్మ సమారభే !"
2 --  ప్రాణాయామము !--
--------------------------------------
-- పూరకము --కుడి ముక్కున  శ్వాస పూరించడం                !
                                 కుంభకం -----వాయువును బంధించి గాయత్రి జపించడం 
                                 రేచకం --ఎడమ ముక్కు ద్వారా శ్వాస విడవడం 
3 --సంకల్పం ---!
--------------------------
---శ్రీ గోవింద ! గోవింద ! మహా విష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య 
 ఆద్య బ్రాహ్మణే-- ద్వితీయ పరార్థే -- శ్వేత వరాహ కల్పే --వైవస్వత  మన్వంతరే - కలియుగే --ప్రథమ పాదే --  NORTH AMERICA _ క్రౌంచ ద్వీపే మేరోర్  ఉత్తర పార్శ్వే ---మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య --శ్రీ  పరమేశ్వర ప్రీత్యర్ధం  - శుభే  శోభనే ముహూర్తే -మహా విష్ణో  రాజ్ఞయా   ప్రవర్తమానస్యాద్య  బ్రాహ్మణ  -  ద్వితీయ  పరార్థే  శ్వేత వరాహ కల్పే  - వైవస్వత  మన్వంతరే - కలియుగే  ప్రథమ పాదే- వసతి గృహే -  సమస్త దేవతా  బ్రాహ్మణ  హరిహర  సన్నిధౌ  - అస్మిన్ వార్త మాన   వ్యావహారిక  చాంద్ర మానేన  ------
         నందన  నామ సంవత్సరే - ఉత్తరాయనే-- వసంత  ఋతౌ--  వైశాఖ మాసే -- శుక్ల పక్షే - సప్తమి  తిథౌ  --(శెని)   మంద వాసరే--  శుభా నక్షత్రే  శుభయోగే  శుభకరనే --- ఏవంగుణ  విశేషణ  విశిష్టాయాం - 
 శ్రీమాన్( హరితస  గోత్రః  రోహిన్ కుమార్  - నామధేయస్య  ధర్మ పత్నీ సమేతస్య --) మమోపాత్త  దురిత క్షయ  ద్వారా  శ్రీ పరమేశ్వర  ప్రీత్యర్థం   ప్రాతః స్సంద్యాం  ముపాసిష్యే  ! 
అంటూ ఉద్ధరినితో  నీటిని  పాత్రలో  వదలాలి ---
  -
 4 --మార్జనం !
-----------------------
-- దిగువ మంత్రము చెప్పుతూ -- కుడి చేయి బొటన వేలి తో - నెత్తిపై - నీరు చల్లు కోన వలెను --   -ఎడమ చేతిలో  నున్న ఉద్ధరిని  నుండి  నీటిని తీసుకుంటూ  --!
        శ్లో !" ఓం ఆపోహిస్టా మయో భువః --తాన ఊర్జే తదా చన--మహేరనాయ- చక్షసే    !
            యోవ శ్శివతమో  రసః --తస్య భాజన తే హనః --ఉశతీరివ మాతరః --  
           తస్మా ఆరంగ మామవో ---  యస్య క్ష యాయ జిన్వద--ఆపోజన  యధాచన ! !"
 5 -- --కుడి అరచేతిలో - ఉద్ధరిని తో నీరు  తీసుకుని దిగువ మంత్ర ము   చెప్పిన  తర్వాత పుచ్చు కోవాలి  --(---ఉదయం  సమయంలో )
           "  శ్లో !సూర్యశ్చ మా   మన్యుశ్చ - మన్యు  పతయశ్చ -మన్యు కృతే భ్యః --
                  పాపెభ్యో రక్షన్తాం   -యద్రాత్ర్యాం  పాపమకార్షాం  -- మనసా వాచా హస్తాభ్యాం        ------                     పద్భ్యాం ఉదరేన  శిష్నా - --రాత్రి స్తదవ  లుమ్పతు--
 యత్కించ  దురితం  మయి --ఇదమహం  మా మమృత యోనౌ   --  సూర్యే  జ్యోతిషి  జుహోమి  స్వాహా !"
             (  సాయంత్రం  సమయంలో --)
            శ్లో ! "అగ్నిశ్చ మామన్యుశ్చ   -- మన్యు పత యశ్చ - మన్యు కృతే భ్యః -యదాహ్నాత్ పాపమకార్షం -
                      మనసా వాచా హస్తాభ్యాం  పద్భ్యాం  ఉదరేన  శిష్నా -- అహస్తదవ   లుమ్పతు 
                       యత్కించ  దురితం   మయి - ఇద మహం   మా మమృత  యోనౌ -- సత్యే జ్యోతిషి  జుహోమి  స్వాహా!"
          ఈ మంత్రము చెప్పి నీటిని పుచ్చుకున్న  తర్వాత - ఉదయం  సాయంత్రం   దిగువ మంత్రాన్ని  కూడా  అనాలి --
              శ్లో !దధి క్రావన్నో అకారిషం-- జిష్ణో రశ్వస్య  వాజినః --సురభినో  ముఖా   కరత్ప్రన-  ఆయూగం షీ తారిషత్ --
                       ఓం అపో హిస్టా -------   -     -
                అంటూ 4 లో  ఉన్న మంత్రాన్ని తలపై నీటిని  కుడి చేతి బొటన వేలితో  చల్లుతూ -- చెప్పు కోవాలి --

 6 ---  ప్రాతః  కాల  మంత్రము
           ----------------------------------
          -- " ఉద్యంత  మంతం ---------------  అంత  మాదిత్యం   మభిద్యాయన్  --కుర్వాన్ బ్రాహ్మణో  విద్వాన్ --       ----------                       సకలం భద్ర  మశ్నుతే -----!
                అసావాదిత్యో    బ్రహ్మేతి  బ్రహ్మై వసన్ --- బ్రహ్మో ప్నేతి  య ఏవం  వేద  ---  అసావాదిత్యో    బ్రహ్మ !"
   7 ---అర్ఘ్యం
---------------------
  --!  ఉద్ధరినితో  నీటిని  పాత్రలో  వదలాలి  
 ---"-పూర్వొక్త  ఏవంగుణ   విశేషణ   విశిష్టా యాం --పరమేశ్వర  ప్రీత్యర్తం  -భగవదాజ్ఞాయా  ప్రాతః  సంద్యా వందన -  అర్ఘ్య ప్రదానం      కరిష్యే   !
 దిగువ  గాయత్రి  మంత్రం  మూడు సార్లు --  చెబుతూ  ఎడమ చేత చెంబు  ఉంచి కుడి అర చేతికి  ఆనించి   -- నీటిని   మూడు సార్లు  -- వదలాలి  దిగువన ఉన్న  పాత్రలో   !-

          
  8 ---ప్రాణాయామం
----------------------------
 ---------ఓం   ఇత్యేకాక్షరం  బ్రహ్మ -  అగ్నిర్దేవతా  బ్రహ్మ ఇత్యార్షం-- గాయత్రీం  చన్ధం-పరమాత్మ    స్వరూపం - ప్రాణాయామే  విని యోగః !
                 ప్రాణా యామం  చేయాలి   -- ఓంకార  మంత్రం చెబుతూ -- కేనీసం  ఆరు సార్లు !
9 --    గాయత్రీ మంత్ర  జపం --!
-----------------------------------
 ఆయాతు వరదా   దేవ్యక్షరం బ్రహ్మ సమ్మితం-- గాయత్రీం  ఛందసాం -  మాతేదం  బ్రహ్మ జుషస్వమే--ఒజోసి సహోసి 
 బలమసిభాజోసి  దేవానాం ధామనామాసి  విశ్వమసి  విషవాయు  - సర్వమసి   సర్వాయు రభిభురోం -- 
  గాయత్రీ  మావాహయామి -- సావిత్రీ మావాహయామి--  సరస్వతీ  మావాహయామి -- చందర్శీ మావాహయామి 
 శ్రియ  మావాహయామి  --గాయత్ర్యా  గాయత్రీ  ఛందో  విశ్వామిత్ర  రుషి స్సవితా  దేవతా  -- గాయత్రీ  మహా మంత్ర  జపం  కరిష్యే -- !

గాయత్రీ  జపము --
----------------------
           -"  ఓం భూర్భువ స్సువః   తత్స వితుర్వరేణ్యం  భర్గో దేవస్య  ధీమహి  ధియో యోనః  ప్రచోదయాత్ - "
( అని యధా శక్తి  జపించ వలెను )   
   గాయత్రీ  మాత  ధ్యానం  ! 
--------------------------------
    
 10 -- దిగ్దేవతా  నమస్కారము 
-------------------------------------
"ప్రాచ్యై   నమః !- దక్షినాయై  నమహా! -- ప్రతీచ్యై  నమహా !-- ఉదీచ్యై  నమహా! - ఉర్ధ్వాయై  నమః!  అధరాయై  నమః  !సంద్యాయై  నమహా  -!- సావిత్రై  నమః -! సరస్వతై   నమః ! సర్వేభ్యో  దేవేభ్యో  నమః!  - రుషిభ్యో  నమః!  మునిభ్యో  నమహా!  గురుభ్యో  నమహా !   పితృభ్యో నమహా -!-  మాత్రుభ్యో  నమః! -- కామో  కార్షీ మాన్యు రకార్షీ నమో నమహా -- !పృథివ్యాపస్తేజో   వాయు రాకాశాత్ ! "
                          సూర్య  నమస్కారం !
                        ------------------------------
 "ధ్యేయస్సదా  సవిత్రు  మండల    మధ్య వర్తీ! -- నారాయణ  సరసిజాసన   సన్నివిస్ట  !  
కేయూర మకర కుండలవాన్   కిరీటి!---హరి !  హిరణ్మయ వపుహు !  ధృత శంఖ  చక్ర గదా పాణే !
ద్వారక నిలయాచ్యుత! -  గోవింద !  పుండరీకాక్ష   ! రక్షమాం   ! శరణా గతం ! "
   11 ----- ముగింపు
------------------------------------
 -- రెండు చేతుల వేళ్ళతో వ్యతిరేకంగా చెవులకు తాకిన్చుకుంటూ  "ప్రవర "  చెప్పాలి !
  "   చతుస్సాగర  పర్యంతం  గోబ్రాహ్మనేభ్య  శ్శుభం భవతు !- !హరితస-  యవనాశ్వ-  అంబరీష - త్రయీ మహర్షి ప్రవరాన్విత - హరితస  గోత్ర - ఆపస్తంబ  సూత్ర-- యజుశ్శాఖా  ధ్యాయీ -  రోహిన్ కుమార్  అహంభో  - అభివాదయే!"
        ఆచమనం !           ---
 కాయేన వాచా  -- మనసేంద్రి యైర్వా -  బుద్ధ్యాత్మనేవా  -- ప్రకృతే  స్వభావాత్ 
కరోమి యద్యత్  సకలం   పరస్మై --  నారాయణా యేతి   సమర్పయామి   !!
              అంటూ నీటిని వదలాలి 
ఈ నీటిని  ఎవరూ తొక్కని  చోటున - అనగా చెట్టు మొదలు లో - గోడ పై గాని పోయాలి 
                                     ---   the end    ----

Jandhyam


   జందెము  వేసుకునే విధానం  రాస్తున్నాను --!   
    ఆచమనం  చేయాలి -- ప్రాణాయామం - సంకల్పం యదా విధిగా  చెప్పాలి  --
       మమ శ్రౌత  స్మార్త  విహిత  నిత్య కర్మానుష్టాన  యోగ్యతా సిధ్యర్థం బ్రహ్మ తెజోభి వ్రుధ్యర్థం --యజ్ఞోప వీత ధారణం   కరిష్యే   !
 అని నీళ్ళు  విడవాలి -- జంధ్యాన్ని రెండు మోకాళ్ళకు చుట్టి - మూడు చోట్ల కుంకుమ తో  అలంకరణ  చేయాలి -- !
                     మళ్ళీ ఆచమనం  చేసి -- ఒక జంధ్యాన్ని  రెండు చేతులా పట్టుకుని  ఈ మంత్రం అంటూ  ధరించాలి < కుడి భుజం పై నుండి  >
 యజ్ఞోపవీతం  పరమం  పవిత్రం - ప్రజాపతే  -సహజం  పురస్తాత్ -
ఆయుష్య  మగ్ర్యం  -ప్రతిముంచ శుభ్రం --యజ్ఞోపవీతం  బలమస్తు తేజః  !!
                                        తిరిగి  ఆచమనం -- మళ్ళీ మరొక జందెం --అదే  మంత్రాన్ని  అంటూ ధరించాలి 
                                   మూడవ  పోగు జందెం - కూడా అలాగే ధరించాలి  ! 
ఆ తర్వాత    పాత  కొత్త జంద్యాలను  కలిపి   దశ  గాయత్రి జపం  -చేయాలి ---
                                పాత జంధ్యాన్ని కుడి  భుజం పైగా  తీసి వేస్తూ   --ఈ మంత్రాన్ని  అనాలి --
   ఉపవీత  చిన్న తంతుం ---జీర్ణం కశ్మల  దూషి తం----!
  విసృజామి  యశో  బ్రహ్మ -వర్చో దీర్ఘాయు రస్తుమే---!
                                           తీసిన  జంధ్యాన్ని --ఎవరూ తొక్కని చోట వదిలేయాలి 
    నూతన యజ్ఞోపవీతం తో   -- యదా  శక్తి -- గాయత్రి జపం చేయాలి --
                                             జయం - శుభం 

Sri Ram

 నాగరాణి -శ్రీకాంత్ ల  పుత్ర రత్నానికి  - నామకరణం -శ్రీరాం అని జరిగింది --ఆ  సందర్భంలో  నేను- రామనామానికి  స్పందించి - చలించి రాసినపాట - అందరికి చదివి వినిపించాను -- 9/3/2012
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 ఏడుకొండలవాడ - వెంకటా రమణా !-    భద్రాచల వాసా-- శ్రీ సీతా రామ చంద్రా - !
శ్రీశైల వాసా -మల్లికార్జునా శివా ---!  !శ్రీకాళ హస్తీశ్వర--  జ్నాన ప్రసూ నాంబికా -హరా !
ముక్కోటి దేవతల ఆశీస్సుల ఫల మండి-- !బుద్ధవరపు శ్రీరాముని  మనసారా  దీవించండి !
పెద్ద మనసు కలిగిన  హితులారా !  బంధువులారా  !  --చిన్నారి  శ్రీరామునికి -- ఆశీస్సులు  అందించండి !  --   
          పితృదేవతలు - కీర్తి --శేషులు  తాతమ్మ --      శ్రీమతి  సరోజనమ్మ _ శ్రీరాముని   దీవించమ్మ !
          పితృ దేవులు - కీర్తి - శేషులు  తాతయ్య లైన -- సీనన్న - బాపన్న     -- తాతమ్మ - తారమ్మ - !
          పొత్తిళ్ళ  పాపడిని - శ్రీ రామ యనుచు  దీవించండి   !
శ్రీరామ   రామ అంటే - పాపాలు  తొలుగు నండి  !      శ్రీరామ నామము  - భవ తారక మంత్ర మండి  !
 స్మరించిన తరించును -- జన్మ ధన్య మగునండి -  !--గౌరికి  శివుడుపదేశించిన  శ్రీరామ నామమండి !
 మధురాతి  మధురము -  శ్రీరామ నామము ! -       సులభము - సరళము - దివ్యాతి  దివ్యము   !
           పుట్టిన పాపాలకు పేరు -- నామకరణ మహోత్సవము  ! -  -అనాదిగా ఆచారము  దేవుళ్ళ పేరు పెట్టుట  !
!           ఆడ పిల్లయితే  -వాణి - లక్ష్మి -గౌరీ యనీ -   --  !               -మగ పిల్లాడైతే  రాముడనీ --శివుడనీ-- --
           నోరార పిలచినా హరియించును   పాతకమని ! -                -కలియుగాన హరినామ స్మరణమే   మిన్న యనీ   --!-
           వింటిమి -- కంటిమి   !--నేడు చూచితిమి -- కనులారా   !
  శ్లో !!  " శ్రీరామ  రామ  రామేతి --రమే రామే  మనోరమే --!  సహస్ర నామ  తత్తుల్యం  -- రామనామ  వరాననే  ! "

Mithunam


మిధునం సినిమా ఒక రమణీయ దృశ్య కావ్యం -తనికెళ్ళ భరణి గారికి పెద్ద వయసైన వారి తరఫున అభినందనలు - తెలుపుకుంటూ -మమ్మల్ని ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుందో చెప్పకుండా ఉండలేక పోతున్నాను -
చక్కని గ్రామీణ వాతావరణాన్ని తలపించే సహజమైన తోటలో- ఒక ఇల్లు చెట్లు పూ లు -కూరగాయలు -తమలపాకుల లతలు పనస -సొర మామిడి లాంటి పండ్లరసాల చెట్లు-సావిత్రిఐన గోవు -అంజి లాంటి లేగదూడ-బావి --వీ ని మద్య -చెప్పులు కుట్టేవానిగా -సన్యాసిలా -ఈతగానిలా -సంగీత ప్రి యునిగా -పూ జారిలా -రసికత ఎరిగిన సరసిలా -చదరంగంలో -తాటా కుపీకల్లో పాటలు పలికించిన భావుకునిలా - నవరసాలు తమ బ్రతుకుల్లో పండించుకున్న- జంటగా-ఇలా ఆ రెండు గంటలు మమ్మల్ని నానా రసమయ సన్ని వేషాల్లో ఓలలాడించి - -మురిపించి -మంత్రింప చేసిన ఘనత భరణి గారికి దక్కుతుంది -
రేడియో లో పాత పాటలు -కాఫీ దండకం తాతగారిపై మనవడి కార్టూన్లు- పెళ్ళాం చీరల్లో భావుకత -కుంకుడు రసంతో తలంటు -నోరూరించే వంటకాలు -ఇడ్లి దోస పచ్చళ్ళు --ప్రేక్షకులకు కడు దగ్గరగా -కమనీయంగా -హృద్యంగా చూపించారు --ప్రేక్షకులకు తమ నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవాల సారం కలబోసి నింపారు తమ ఈ చిత్రంలో-
సరసమైన డైలాగులు -నవ్వులు -పరిహాసాలు హాస్యాలు -ప్రతీ క్షణం పంచుకుంటూ -ఆనందం తమ దాంపత్యం లో- నింపుకుంటూ -అంతిమ ఘడియల్లో కూ డా - శరీరాలు వేరైనా తమ ఆత్మలు ఒక్కటే-అని నిరూపించారు -తమ అనురాగ మయ జీవితానికి ఇతరుల అనుబంధాలు ఆప్యాయతలు అడ్డు రాకుండా -తమకంటూ ఒక మరోలోకం-సృష్టించి- భరణి గారు ఇచ్చిన -మధురమైన జీవితం గడిపారు ఆ పుణ్య దంపతులు -
తాము కూడా తమ నిజజీవితంలో అలా ఉండగలమా ? అని తప్పకుండా అత్మవలోకనం చేసుకుంటారు ప్రేక్షకులు . మేము కూడా ఇలాగే ఒకరికొకరై -తోడునీడై ఉంటె బావుండును -అన్న ఊహ మనస్సులో మె దు లుతుంటుంది. కొంతమంది అలా ఆనందంగా ఉండాలని ప్రయత్ని స్తారు కూడా.
అది తమ జేవితమే అన్నంత గొప్పగా అన్వయం చేసుకునే విధంగా పాత్రల చిత్రీకరణ జరిగింది -అలాంటి సన్నివేశాలు సంభాషణలు చొప్పించారు కూడా తనికెళ్ళ గారు.
కరుణశ్రీ జంధ్యాల పాపయ శాస్త్రి గారి పుష్ప విలాపం -"నేనొక పూల మొక్క కడ నిలిచి " అనే ఘంటసాల గారిగాత్రమాదుర్యంతో జాలు వారిన పద్యాన్ని ఎంతో హృద్యంగా ఎర్రగుల్లాబీ తో అ ద్భుతంగా చిత్రీకరించారు. బాలు గారు -లక్ష్మిగారు అద్భుతంగా నటించారు -కాదు -ఆ పాత్రల్లో చక్కగా జీవించారు -పాత సిన్మాలు చూస్తున్న భావన కలిగింది సుమా మాకందరికీ --కథ -మాటలు దర్శకత్వం -నటన పాటలు సన్నివేశాలు -చిత్రీకరణ అన్నీ బావున్నాయి- రమ్యంగా -మనోరంజకంగా -ఆహ్లాదంగా ఉన్నాయి.
ఇద్దరితోనే రెండు గంటల కథ నడిపించడం సాహసం. ముసలిపాత్రల్లోకూడా ప్రారంభం -అంతం తో బాటు -- ఒయ్యారాలు సరాగాలు జీవన రాగాలు -షడ్రుచులు ఖేదం -విషాదం మోదం రోషం కోపం ప్రేమ -అభిమానం -పంతం పట్టింపు -ఇలాఎన్నో నోరూరించే ఘుమ ఘుమలు పండించడం ధైర్యం. నేటి ఆధునికతకు దూరంగా ఈ జంటను ఉంచి పాత రోజుల్లో ఉండే సాంప్రదాయాలకి విలువ ఇస్తూ -కొడుకులు కూతుళ్ళు వారి ఆప్యాయతలకు అతీతంగా తమ స్వతంత్ర జీవనానికి అడ్డులేకుండా ఒక హద్దుల్లో ఉంచి - ఇలా చరమ దశలో -వృద్ధాప్యంలో -నిశ్చింతగా ఉండ వచ్చు అని చూపారు
attachment లో detachment తామరాకుపై నీటి బుడగలా -అలా ఉండగలమా /అన్న ప్రశ్న కు జవాబు ఈ సినిమా.
భర్త కు కాలిలో ముళ్ళు కుచ్చుకుంటే భార్య విల విల లాడటం -భార్య జ్వర పడితే భర్త వేదన -మౌన రోదన - ఒకరికొకరు ప్రాణంగా సేవ చేసుకోడం -ప్రేమించుకోడం -ఇలాచేయడం వల్ల వారిపట్ల గల అనురాగం మరింతగా పెరిగి పోవడం చివరి శ్వాస వరకు -ఒకరిని విడచి -మరొకరు ఉండ లేక పోవడం -ఇదే నిజమైన భారతీయ జీవనం -దాం పత్యంలోగల ఆధ్యాత్మిక వేదాంత అనుభవ సారం -మన హిందూ జాతి గర్వించదగ్గ సంస్కారం - ఆలుమగల మధ్య ఒక పసుపు తాడు కల్పించిన ఇంట గొప్ప అనుబంధం -ప్రపంచంలోని ఎ ఇతర దేశాల్లో కూ డా కనిపించదు -మరి మన శాస్త్రాల్లో - ధర్మంలో వేదాల్లో అంతట బలమైన బలం -మర్మం దాగి ఉంది -చిన్న చిన్న అపోహలతో =అపార్దా లతో విడి పోవాలనుకునే పడుచు జంటలకు ఈ సినిమా ఒక కనువిప్పు కలిగిస్తుంది -పొరబాట్లను సరిదిద్దుకోవాలనే తపన - దాంపత్యంలో మధురానుభూతులను ఆస్వాదించు కోవాలనే అవగాహన కలిగిస్తుంది.
ఎంతటి వారైనా రాగ ద్వేషాలకు అతీతులు కారు --అయినా ఒకరి పై ఒకరి కి గల అపారమైన నమ్మకం -ప్రేమ అవగాహన జయిస్తాయి.-ఇచ్చిపుచ్చుకోవడంలో నిజమైన సంతోషం -స్వచ్చమైన ప్రేమ ఉంటాయని చెబుతుంది ఈ కథ. దాంపత్యం కల కాలం వర్ధిల్లడానికి కా వలసిన జీవన సూత్రాలు -ఇందులో మనకి లభిస్తాయి కూడా.
భర్త తన చేతులతో భార్యకు సేవలు చేయడం -ఆమెకి కాలికి స్వయంగా -పట్టాగోలుసులు అమర్చడం - ఒళ్ళు సుస్తీ అయితే కాళ్ళు పట్టడం-సపరిచర్యలు చేయడం -కళ్ళ నీళ్ళు పెట్టు కొడం --ఆమెకి చెప్పులు కుట్టడం -చేతికి గాయమైతే కట్టువేయిన్చుకుని -చిన్న పిల్లాడిలా ఆమె ఒడిలో ఒదిగి పోవడం -తాటాకు పీకలతో చిన్న పిల్లల్లా -పాడుకోడం- భర్త సన్యాసం -భార్యకు పరిహాసం -అతనిపై ఆమెకున్న సత్తా -అధికారం ప్రేమ -అనురాగం అతన్ని కట్టి పడేస్తుంది -అంజి లేగ దూడ చని పొతే కన్న తల్లి దండ్రుల్లా దుఖించడం--గోవును తమ కుటుంబం లో ఒక సభ్యునిగా చూస్తూ - దానికి తమ బాధలు - గాధలు చెప్పుకోడం -అద్భుతంగా ఉంది -
వాలు కుర్చీ ఈ కథకి మూలం -వృద్ధ దంపతుల విశ్రాంతి మందిరం లా -అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంటుంది -కలుషితం చేయడానికి వచ్చే కారకాలను ఎప్పుడు తమ ఏకాంతానికి భంగం కలుగకుండా కనిపట్టుకుని ఉండటం- మాకు చాలా నచ్చింది -అవసరాల్లో ఉన్న ఆత్మీయులను ఆదు కోడం ద్వారా - అజ్ఞాతంగా భర్త కున్న ఉదారతకు భార్య కనబరచే కృతజ్ఞత -అతనికి చేతులెత్తి మొక్కడం -అపురూపం -అపూర్వం.
బాలుగారు లక్ష్మిని చేతుల్లో కెత్తి -మామిడి కాయలు అందించడం లాంటి సన్నివేశాలు కోకొల్లలు -భర్తను అటకపై కెక్కించిన భార్యకొంటె తనం భర్త దొంగ తనంగా భార్యకు తెలీకుండా పో[పు డ బ్బాల్లోంచి బెల్లం తీసుకోడానికి వెళ్లి బయట పడటం -అర్ధరాత్రివేళ కూడా ఆత నికిష్టమైన పండుముక్కను దాచి ఇచ్చిన అర్ధాంగిగా లక్ష్మి -నిజమైన గృహ లక్ష్మిగా -మహా లక్ష్మిలా కనబడు తుంది - ఇలా ఎన్నో మధుర ఘట్టాలు మనసునీ వయసునీ కదిలిస్తాయి -కవ్విస్తాయి -కన్నీరు తెప్పిస్తాయి కూడా.
అందులో మచ్చుకు కొన్ని మరపురాని మాటలు.
-----------------------------------------------------------------------
1-ఎంత చల్లని మాట చెప్పావే.
2- మొగుడి చావు కోరుకునే ఆడది ఈ ప్రపంచంలో నేనొక్క దాన్నే.
3- ద్రాక్షార సంబంధం లేదుట.
4--నాకు దొరికినంత గొప్పగా తోడునీడ --సాక్షాత్తు ఆ భగవంతునికి కూ డా దొరికి ఉండదు.
5--జన్మ -జన్మకీ నాకు మీరే కావాలి.
6-మన పెళ్లి మనం చూసుకున్నంత ఆనందంగా ఉంటుంది - నీ పెళ్లి చీర అది కట్టుకుంటే నేనెలా ఒప్పుకుంటాను ? అది మనవరాలైతేంటి ? మహారాణి ఐతేంటి ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ వినాలని పించే మధురమైన పాటలు కూడా .
------------- - -----------------------------------------------------------------------------------------------------
1-- ఎవరు గెలిచారిప్పుడు --? ఎవరు ఓ డారిప్పుడు ? -రెండు గుండెల చప్పుడు --నాదం ఒక్కటే ఎప్పుడు 1
2-ఆవకాయ పచ్చడి అందరిదీ --గోంగూర పచ్చడీ మనదేలే 1
సినిమా చూస్తున్నంత సేపు కమ్మని భోజనం చేస్తున్నంత ఆనందంగా -తృప్తిగా -ఉంటుంది - ఎన్నాళ్ళకు ఇలాంటి పాత సినిమాల్లోని -అనుభూతులు ఆత్మీయతలు ఆప్యాయతలు ఈ మిధునం సినిమాలో చూస్తున్నాంఅనిపిస్తుంది .
కుటుంబంలో ప్రతి ఒక్కరుకలిసి వచ్చి చూడ దగ్గ సినిమాఇది. భార్యా భర్తలను ఇంకా దగ్గరికి చేసి వారికి మా ర్గ దర్శకం--మధుర స్వప్నం -మానవతా దర్పణం -మమతానురాగాల దర్శనం - బాల గాంధర్వ రాగాలు పలికించే గాయకుడుగానే కాదు నటుడిగా కూడా -జీవన మధురిమలు పలికించి పండించడంలో సిద్ధ హస్తుడు -అనిపించాడు -వారిలో అంతర్లీనంగా అంతర్వాహినిగా సంచరించే ఆ కళామ తల్లికి జోహారులు హృ దయ పూర్వక నమస్కారాలు తెలియ జేస్తున్నాము.
జీవితంలో చరమాంకం -క్లైమాక్స్ ముగింపు -వాస్తవానికి దగ్గరగా ఉంది -భర్తను కోల్పోయిన భార్య దీనంగా -ఉంటుంది నిజమే , కాని భా ర్యను కోల్పోయిన భర్త జీవితం అంతకంటే దీనాతి దీనంగాఉంటోంది. ప్రస్తుతకాలంలో, స్త్రీ శక్తి స్వరూపి ఆమెతో పోలిస్తే ఒక్క దేహ దారుడ్య త లో తప్ప మగవాడు ఆమె సహాయ సహా కారాలు లేకుండా ఏ పని చేయడాని కైనా మనో నిబ్బరంసహజంగా అమెకున్నంతగా అతనికి ఉండదు దీపం లేని ఇంటిలా అతని జీవితం చీకటి మయం అవుతుంది.
అందుచేత ఆమె చేత కోరబడిన కోరిక వింతగా క నిపించినా వారి అన్యోన్య దాంపత్యానికి - అదే best solution. ఈ కథకే కాదు ఇలాంటి ఎ కథానిక కైనా ఆ పరిష్కారం అందాన్నిస్తుంది పొతే - నిజ జీవితంలో ఇది సాధ్య పడదు -విధి చేతుల్లో మనం కీళ్ళు బొమ్మలం -మన చేతిలో ఏది లేదు -మన జీవితాలను సాఫీగా సాగడానికి పరమాత్ముని కరుణించమని త్రికరణ శుద్ధితో కోరడం తప్ప.
ఈ సినిమా లో ఆ ఇద్దరిలో ఆ అనురాగ అన్యోన్య దాంపత్యంలో -దైవత్వం కరుణ -అనురాగం నిండుగా - మెండుగా ఉన్నాయి -- భరణి లా దైవాన్ని నమ్ముకున్న వారు పదిమందికి అవసరమౌతారు -ఆత్మ బంధువులౌతారు.
ఆ జంట వలె - ప్రతి జంట -ఆదిదంపతుల జంటలా అర్ధ నారీశ్వరులై -అర్ధాంగిని తన అర్ధశరీరంలో అంతర్లీనంగా అరాదిస్తూ -గౌరవిస్తూ తనలో తాను ఆమెతో రమిస్తూ నిత్యం ప్రశాంత చిత్తంతో -పరమానందంతో -జీవిస్తూ -పరమేశ్వర ప్రసాదితమైన జీవితాన్ని ఆనంద మయం చేసుకోవాలని నేటి దంపతులను కోరు కుంటున్నాము - ఆ స్పూర్తిని నేటి మానవాళిలో కలిగించమని ఆ భగవంతుడిని వేడుకొంటున్నాము.
సర్వే జనాః స్సుఖినో భవంతు

Gundi Kishtaiah

గుండి కిష్టయ్య గారు గుండి బలమున్న వాడు -గుండె కాయ లాంటి
వాడు  మన గుండె లోన గుడి అయినాడు
           గుండి గ్రామ వాసుల్లో గుండినే  తన ఇంటి పేరుగ  గలవాడు -1పేద
బాపడైనా  మంచి పేరున్న మొన గాడు -!
                        రామునికి  సీత లాగ -శివునికి లాగ  -కిష్టన్నకు
సతియై  సరోజనమ్మ కీర్త గాంచె -!
                        ఆలుమగలు  ఇద్ధరైనను - పని ఒకటే --మనసొకటే    -
                        పొ ర పొచ్చా లేన్నోచ్చినా -ఒడిదుడు కు
లేన్నున్నా -కలిసి కట్టుగున్నారు -1 తృప్తిగా  జీవించారు
                     అన్యోన్య  దాంపత్యం -అనురాగ మయ జీవనం--వారిది 1
                        అతిథి  అభ్యాగతుల మిక్కిలి  ప్రేమతో ఆదరించి
-ఆప్యాయతతో  పలుకరించి -వారికి కడుపు నిండా  -
                        అన్నం పె ట్టిన పుణ్య దంపతులు వీరు -!
            ఈ ఇంటిలో  ఎందఱో ఈ మాట సరోజనమ్మ చేత కడుపునిండా తిన్న వారు -
            కిష్టన్న నోట బాగోగులు కన్నవారు ఆ మధుర క్షణాలు  -మరచి పో
లేము -!-మరవ లేము !
                          వచ్చి పోవు వారే కాదు -వారి తోబుట్టువులు
-కొడుకులు కోడండ్రు -కూతుళ్ళు అల్లుండ్రు -బావలు బావ మరదులు   -
                           అందరి యోగక్షేమాలు అడిగి  తెలుసుకొనేడి
వాడు-మా ఇంటికి రండని  స్వాగతము పలుకు వాడు
                       అన్న దాత -సుఖీ భవ ! అనేది సూక్తి  నిజము గాన -ఈ
ఇల్లు సకల సంపదలతో చక్కగా వర్ధిల్లు తోంది -!
                          అలసట కానరాకుండా అన్నదానము  నిరతము
-నేరవేర్చిరీ పుణ్య దంపతులు !
             కోపతాపాలేన్నున్నా  -తన చిన్న నవ్వుతో పారద్రోలెను
             బంధు జనులనందరిని  తన చతురోక్తులతో మురిపించెను -
               కష్ట జీవి -నిష్ఠ  జీవి ! పిల్లల చక్కని భవితకై  కాదు
శ్రమించిన శ్రామికుడు -! కార్మికుడు !
               ఉత్తమ సద్బ్రాహ్మ ణుడు  సదా చారి ! నిరాడంబరి !
                                 సంత్రుప్తియే  తన ఊ పిరిగా- సంతోషమే
తన పరమావధిగా  -
                                 తన శాంతమే  తనకు రక్షగా -అందరి హితోభిలాషి గా -
                                 సర్వే  జనాః  స్సుఖినో భవంతు !
అన్నట్లుగా బక్క చిక్కిన ఆ దేహంలో -
                                 మెండైన -నిండిన తన ఆత్మా బలమ్మొ క్కటే
ధ్యెయముగా -
                                అ నలుగురికీ ఇంత తిండి పెట్టి -మిగిలిన
దానితో  తాము తృప్తి పడి -
                                 చివరి శ్వాస వరకు ఎవరి పై ఆధార పడకుండా
-ప్రశాంతంగా  -పరమానందంగా -
                                  తన జీవితాన్ని  పావనం చేసుకుని - ఆ
పరమాత్మునిలో  ఐక్యమైన
               ఆ శ్రీమతి సరోజనా పతికి -కీర్తి శేషులు  గుండి కృష్ణయ్య
గారి ఆత్మ స్వరూపానికి -
                 మా హృదయ పూర్వక ప్రణామాలు -అంజలి ఘటిస్తూ  -సమర్పిస్తున్నాము !
                               వారి కుటుంబం -దేవదేవుని కరుణ వల్ల
శాంతి సౌఖ్యాలతో చల్లగా వర్ధిల్లు గాక !
                               వారి  ఆత్మా శాంతిని పొందుగాక !
                                                       ఓం -శాంతి
-శాంతి -శాంతి :!
                                 -

Devi Maatha


   దేవి భాగవత  మహా  ప్రవచనము - వినుటకు   వచ్చిన 
   స్త్రీ  శిరోమణులు! -- అమ్మవారి రూపాలు  మీరు ! అఖిలాండేశ్వరి  ప్రతి రూపాలు  !
           భరత దేశ  సౌభాగ్య  సంస్కృతుల - వైభవాల  నిలయాలు  మీరు ! -   
       -పరాశక్తి వలె  ప్రకాశించి -  చైతన్యం జగతికి  తెచ్చారు  --1
                          అంగనలందరు అమ్మవారిని - సేవించుకొను  పండుగ రోజి  ది !
-- దేవి భగవతిని పూజించాలని   తహ లాడే  తరుణమిది  -!
                          మహా లక్ష్మి  -సరస్వతి ఉమ వలె -అపర దేవతా వనితల వోలె
 --అలంకరించుకొని వనితలందరూ -పరుగు పరుగున   అరుదెంచారు -!
            ఆహా 1 ఎంతటి  భాగ్యము మనదీ ! శ్రీ మాతను గని  -- ధన్యులౌదు మని --
-   లక్ష్మీవారము  మంగళప్ర దము -మంగళ గౌరీ రాజ రాజేశ్వరి! 
             లలిత1 శ్రీ మాత! -భగవతి!  భవాని! -ఎన్ని పేరులో ఎన్నిరూ పములో  -     
 -సాయంకాలపు  శుభ గడియ  ఇది! --దేవ దేవి1  వేంచేయు నో  ఏమో -1
                           మెల్ల మెల్లగా పిల్ల తెమ్మెరలు -హాయిని గొలుపుచు  వీచు చున్నవి -  
     -శుభ సూచకముగా -కళ్యాణ  రాగాన సంగత ధ్వని  విన బడు చున్నది -
                            అదిగో ! మణి  ద్వీప కాంతి పుంజములు -పురాణస్థలి  ప్రసరించుచున్నవి
 -- కాలి అందియ లు ఘల్లు ఘల్లు మను -మువ్వల  -సవ్వడి  అదిగో -అదిగో !
            దేవి  సమా రోహణ ము -జయము చేయుటకు   - తానే స్వయముగ వచ్చునో   -ఏమో  
     - ఏమో 1  ఏమో !   అందుర?ఆర్తిగ పిలిచినా రాకుండు టయా   ?
            అదిగో ! అదిగో  అదిగో - చూ డుడు  !  కళ్ళను  పెద్దవి చేసి చూడుడు   1    --   
  సాక్షాత్తుగా  ఆ పరాశక్తియే - అఖిలాండ కోటి బ్రహ్మాండ  జననియే -
             మనల  కరుణించ కదలి  వచ్చినది -స్వాగత మివ్వగ  కదలాలండి -  
  -కలలు  ఫలియించె  ! జన్మ తరియించే-కనులు చెమరించె -ప్రక్రుతి పులకించే -!
                             రండి ! రండి ! ఓ -తల్లుల్లారా  ! అక్కల్లారా ! చెల్లెల్లారా ! -     - 
   -కన్నె పడుచులు -వృద్ధ వనితలు -పెద్ద ముత్తైదు  పడతుల్లారా  !
                             అమ్మలగన్నా  అమ్మను-   పూజించ స్వాగత మివ్వగ   రారండి  !--
-  రత్న ఖచిత సింహాసనమ్మునే ఆసనమ్ముగా  వేయండి !
                              నాట్యము చేయుచు -పాటలు పాడుచు -ఆనందముతో  మ్రొక్కండి -!  
  అందమైన అందాల అమ్మను -ఆహ్వానించగ రారండి   !
              ఓ  శారదా ! బంగారు కలశము తెచ్చి పాదములు అభిషేకించమ్మా   !   
 ఓ భవానీ ! అర్ఘ్య పాద్యముల అమ్మకు అందించి -సేవించ మ్మా !
               కాత్యాయని 1 పారాణి తెచ్చి  బంగారు పాదము ల నలరించమ్మా   1- 
  -పద్మావతీ 1 పసుపు కుంకుమలతో  మాతను సేవించి తరించ వమ్మా 1
                             సావిత్రీ ! నీవు మెత్తని  కండువ  -దిండుల నమ్మకు  ఒనగూ ర్చవమ్మా 1   
--లక్ష్మె సరస్వతులారా ! మీరు- వింజామరతో  వీచండమ్మా  !
                             పెద్ద ముత్తైదువులంతా  కలిసి -జయ గీతాలు  పాడండ మ్మా  1   
       దేవి భాగవత కథా మహిమయో  1 మహేశ్వర శర్మ ప్రతిభ యో  ఏమో ! 
               ఆహా ఎంతటి భాగ్యము  మనదీ  --శ్రీ మాతను  గని  ధన్యుల మైతిమి  1 
   రాజీవ లోచని  1 రాజ రాజేశ్వరి - చల్లని చూపుల  కరుణించు  చున్నది 1
               కరమున బంగరు గాజులు -నడుమున వడ్డాణము  నలరించు  శ్యామలా 
 !కొప్పున మల్లెల -గళమున మందార పుష్ప హారము ల  నలరించు వాణీ !
                            సర్వాభరణముల నొసగి పన్నీరు--  చిలకరించమ్మా   ఓ  సీతమ్మా  !  
గంధము పూసీ  -చందన మందించి -తల్లిని  సేవించ మ మ్మ -భారతీ  !
                            కస్తూరి -జాజీ అగరు పరిమళ ము ల --- జ్యోతీ ! భక్తితో  అందించ వమ్మా  !
               మల్లెలు మొల్లలు సన్న జాజులు   --
 మందారాలు  కనకాంబర మ్ముల -విరి దండలతో మణి హారమ్ముతో -పరమేశ్వరి  నలరించగ  రారే 1
               కమ్మని వంటలు భక్చ్య భోజ్యముల  పాయస పరమాన్నములను   తెండి !
-పాలు పెరుగు -క్షీరాన్నము -పులిహోర  - పలు శాకమ్ముల  మరువక తెండి  1
                             కమ్మని నేతితో -చేసిన చక్కర పొంగలి --- శ్రద్ధగ  నైవేద్య మందించండి
 -మామిడి దానిమ్మ అరటి ద్రాక్షలు -- జామనారింజ-- ఆపిల్-పండ్లు 
                              విరివిగా దేవికి నివేదించుమా  ! 
పలు రుచుల పలు రకాల వంటల - పరమేశ్వరికి అర్పించండి!  తనువున మనసున భజియించండి  1
               పూర్వ జన్మలో చేసిన పుణ్యమో -కన్నవారి  ఆశీస్సు బలమ్మొ  !
గురువు గారు బోధించిన విధమో -ఫలియించెను నేడు -- మన నోము ఫలమ్ము ! 
                మహాలక్ష్మి -ఉమా- సరస్వతి -భవాని - శాంకరి  -
ఏ  రుపంమున కొలిచేవారికి  ఆ రూపమ్ము న అగుపించును   తల్లి 1
                             భగవతి సుందర దర్శన  భాగ్యము -అందరికీ  చెందాలమ్మా --1
పక్కవారినీ పిలవండీ  --తెలిసిన  వారికి చెప్పండీ   !
                            కన్నులు  విచ్చీ --మనసును పెట్టీ --హృదయము పొంగగ-స్తుతి యించండి 
--ముక్త కంఠమున   - మనోహరమ్ముగ --మధుర గీతముల పాడండి 
                కర్పూర మంగళ హారతులేత్తి -వరుసగ  నిలబడి  ఏక కన్థమున -
 జయ జయ శాంకరి -కౌమారి  యనుచు ఆనందమ్ముగ  వేడుకోనండి  1
                కోరిన తడవుగ  కొంగు  బంగారమై -కరుణించు   తల్లి  --వందన మమ్మా !
పసుపు  కుంకుమతో -పాడి పంటలతో పిల్లా పాపలతో చల్లగ ఉంచి -
                మరువక నిన్ను   సేవించు భాగ్యము అందించావమ్మా --కని కరించమ్మా !
దీవించవమ్మా   ! మరల   కనిపించ వమ్మా  1
                                  నిను దర్శించిన మా  భాగ్యమె  భాగ్యము --నిను  సేవించిన  మా బ్రతుకే  ధన్యము
                                 సాముహికముగా మేమొ నరించిన -పూజలో తప్పులు   క్షమించవమ్మా -!
                                   శరణు ! శరణు  జగదీశ్వరీ   !  పాహి 1 పాహి  !  పరమేశ్వరీ   !
                                   జయహో -రాజ రాజేశ్వరీ --జయహో ! జయహో  ! పరమ పావనీ   !                      -     
              '' శ్లో ''---కాత్యాయని  మహామాయే  --భవాని  భువనేశ్వరీ !-
                         సంసార  సాగరే  మాగ్నామ్ -మాముద్ధర  కృపామ యే  !!
                                              జగదంబా -విశ్వపాలిని  మాతాకీ  జై !--
గౌరీ శంకర  భగవాన్  కీ జై  !నమః  పార్వతీ పతయే  హర హర మహా దేవ హర  !!
                                                                                                  హరయే  నమః  !1     

Krishna Shastri - Ragampet



కృష్ణ శాస్త్రిని  గన్నట్టి అన్నపూర్ణ -  మాకు నిజముగా  దేవత  మూర్తి  గాదె !
నిరత హరినామ  కీర్తన  జేసి  తాను- మమ్ము  ధన్యుల జేసిన భక్తీ పరుడు ,
తాను  తరియించి -తరింప జేసే --!----------1
      దైవ భక్తికి  మించిన  ధనము  గలదే - జలజ నాభుని గనిన  జన్మంబు  గలదే !
పాప భూయిస్టమగు   -మా  హృదయ  కుహర మందు   --- పుణ్య కథలను -భజనలను   వినిపించి  తాను,
నొసట  కుంకుమలా  తాను  -వెలిగే నయ్య !----------2
ఎలానయ్యా ! నీవు  సుతి గొని -కృష్ణుని  గానా మ్రుతమ్మును  గ్రోలినావు ?
ఏలనయ్య ! నీవు  భాగవత సప్తాహ యజ్ఞాలు  నూరులు  చేసినావు --?
ఏలనయ్య -నీవు  చల్లని  చూపుల నవ్వుచు  మమ్ముల దోచినావు ?
ఏలనయ్య !నిన్ను గొనియాడ లేకుండా -కృష్ణ ప్రేమలో ముంచి వెళ్ళినావు ?-----------3
ఏమనందును ! మహాత్మా ! ఎటుల  కందు !
కనుల పండువు గా-ఆది దంపతు లట్లుగా-
మీరు  మీ  సతితో  కలిసి మెలగు చుండ -
గాంచి మ్రొక్కిన పాపాలు  తొలగు గాదె !-----------------------4
విధికి దయ తప్పే --సతి అనసూయ  పైన -
వారి అనురాగము  గొన్న వారి పైన -
హరి కథా మృతమ్ము ను   విన్న వారి పైన -
వారి పేరున  బరగు ఈ   ఊరి పైన --------------------------------5
దేవ దేవుని  స్తుతియింప  మీరు లేరు
చిన్ని కృష్ణుని  భజియింప -- కిస్టన్న లేడు--
బ్రాహ్మణ దేవతా ! మీరు పోయినారు --!
బ్రాహ్మ లందరిలో --తల లాంటివారు --!
బ్రహ్మ తేజస్సు - ముగమున   వెలుగు వారు !--------------------6
బక్కచిక్కిన ఆ వృద్ధ  దేహ మందు
నాల్గు దిక్కులా  నినదించు గాన మందు
రామ  రామా  శ్రీ రామ  రామ యనుచు
మేలు కొలుపులు   - తన్మ యత్వంబు  తోడ -!
పాడుకున్నట్టి  ఆ  కృష్ణ  శాస్త్రి  ఏడి?----------------------------7
అందరిని  ఒక్కరీతిని  ఆదరించిన  మహాత్మా
ఎందరికో -మీ చలువన  జన్మ ధన్య  మయ్యే !
స్వామి ! హరి నామమే  మాకు  దూరమాయె-!
దేవ దేవుని  భజియించు  తీరు మారే !---------------------------8
---హాయిగ  రామ కృష్ణ  యనుచు -కన్నులు ముయుచు  నాలకించు -
మీ కమ్మని గానమింక  కరువాయెను ---మా  కిక  కృష్ణ  శాస్రి  !
మీ  మోమున   మంద హాసమును --మెల్లని చూపుల నమ్రుతమ్ము నన్ !
సాదరమైన  వాక్కులన్  కరగ --నారయుచుంతిమి  భూసు రోత్తమ!-----------9
చిక్కని  కరుణా మృ తమ్మును----చక్కని  భాగతా మృ తమ్ము నన్ -
మెక్కిన  పుణ్య జీవులము --మీ దయ వల్లనే ఇంట యయితీ --
మేము -మ్రొక్కగా  కాన రారెవరు  --!?మీవలె  భక్తులు  ఏమి సేతు ?
అక్కటా ! మాకు  దిక్కెవరు ?యా  హరి  నామమే  మృ గ్యమే  ఇకన్ !----------------------10
----------రాగము పేట  గాదిది --!రంజిలు  కృష్ణయ గారి పేట
ఎ  యాగములోన గాని -పర ఊరిలో- పరిచయ మే   కలుంగు --!
                                                  కృష్ణయ గారి పేర-!
పరమ భాగవతోత్తమ --!పావన మయ్యే కదా -ఈ  గ్రామము --!
మా ఊరును  పేరు గాంచే  గదా !మీ పద స్పర్శన -నామ కీర్తనన్ -!---------------11
ఎంత దయ జుపినావయ్య   తాత  ! నీవు !
పిల్లలందున చిన్ని  క్రిషుని రూపమ్ము  జూసి
పరవసించుచు  నైవేద్య  మిచ్చి నావు -
రాజ రాజేశ్వరుని తోడు  నిలిపినావు  -!------------------------12
           నీ భజనల్  పురాణముల  నిర్మల  చిత్తముతో  భజించు -
ఆ  కృష్ణుని  లీలలన్ --తనదు మానస మందున  తేలియాడ --
తాదాత్మ్యము  పొందుచున్ - హరి  హరీ  యనుచును -ఈ
బాహ్య ప్రపంచము  మరచి పోదువో --సతతమ్మును నీకు  మ్రొక్కెదన్  --!-------------13
మాటలు  చాలవింక -కవితల్  నుతి చేయగా  జాలవింక  --!
ఈ  ఆలయమందునన్  భగవ నామము - శాస్త్రములన్  పురాణముల్-
వింటిమి -కంటిమి  --చాలునయ్య  !-మా  భాగ్యము  పండే నయ్య  !
నిను  గాంచిన  కన్నుల  -బ్రాహ్మణోత్తమా --!-------------------------14
            భాగవతా మృ తమ్మును  బాగుగా పంచిన   భాగ్య శాలి - మా  నోట
              భజింతు ము  ఈ  హరి నామమే -   మమ్ము  నమ్ముమో  -!
              అంజలి  ఘటించి   కోరేదము -ఆర్య !  కృష్ణమా చార్య !
నీ  దేవనలే  ప్రసాదముగా - ఈయగదయ్య- ! బిరాన  మా కికన్ !------------15 
                                 కీర్తి శేషులు బ్రహ్మ శ్రీ  గోవింద వరం  కృష శాస్త్రి  రాగం పేట గారి సం స్మరణలో ! 
                                             -- రేవెల్లి పద్మావతి  మనోహరరావు ! రాగంపేట
                                                                    ౧౨ -౦౮ -౧౯ ౯౦

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...