Monday, June 29, 2020

శ్రీరామ నామ గాన మహిమ-5

June 23, 2020
      _"అయ్యా _!_తులసీదాసు గారూ_!_ ఈ రోజు_ఏమైంది ,?   మీ మొహం లో సంతోషం అగుపిస్తోంది ,_! అంటే
స్వామి దయ  లభించింది  కదూ !, అవునా__?""
   _""_నాయనా_! అవునయ్య _!అంతా నీవు చెప్పినట్టే  జరిగింది _!" చివరకు   స్వామికి నాపై జాలి కలిగింది _!
_ తానే  ఆంజనేయ స్వామి నీ  అని ఒప్పుకున్నాడు _!
తన నిజరూప దర్శనభాగ్యాన్ని కూడా నాకు అనుగ్రహించాడు ,
నీ వల్ల నాకు గురువు కటాక్షం ఆచార్యుని కృపతో బాటు స్వామి దర్శనం కూడా ప్రాప్తించింది ,!
అతడి కృప పొందడం కోసం _ నేను , ఏదో ఒక అమూల్యమైన , కానుక ను గురుదక్షిణ గా  సమర్పించు కొవాల్సి ,ఉంది అనిపిస్తోంది, ,_! కానీ  అది ఏదో  తోచడం లేదు నాయనా _!""
_ ఇంతకూ, స్వామికి  ,మీ కోరిక విన్నవించు కున్నారా ,, లేదా _?""
  __" , నాకు రామ దర్శనం చేయించమని వేడుకున్నాను _!"
""స్వామి ఏమన్నాడు ?""
   ఇక్కడ కాదు ,! ఇప్పుడు కాదు ,!,  రాము ని గూర్చి _ రామ నామ గానం తో  కొంత కాలం  నీవు కొంత కాలం  తపస్సు చేయాల్సి ఉంటుంది  _!
అలా  సాధన చేయగా చేయగా   నీకు స్వామి  తనకృప తో బాటు
తన దర్శనం కూడా అనుగ్రహిస్తాడు !'" _!
నీవు రచించిన శ్రీరామ మానస చరిత కావ్యం   జన కల్యాణం ,జీవన్ముక్తి ప్రాప్తి కొరకై ,ఉపయోగపడుతుంది ,,శ్రీరామ చంద్ర ప్రభువు అపారమైన దయకు నోచుకున్న నీ జన్మ చరితార్థం అవుతుంది అంటూ  ఎంతో దయతో ప్రేమతో ఆంజనేయ స్వామి నన్ను దీవించాడు  _!
నిజంగా నాకు బ్రహ్మానందం కలుగుతోంది  నాయనా,,_!""
__ ఆహా _!   స్వామీ_! మీరు చాలా  అదృష్టవంతులు_! ,మీకు జీవన్ముక్తి పొందే దారి  _సాక్షాత్తూ హనుమంతు ల వంటి శ్రీరామ బంటు, మరియు  ఆచార్యుని  ద్వారా  లభించింది ,_!_ మహాత్మా _! మీరు ధన్యులు _?"
     _""నాయనా _!నీ మేలు మరచిపోను _! అంధకారం లో అలమటిస్తూ_ దారి తెలియకుండా  ఉంటున్నా నాకు_ సద్గురువు దర్శనం చేయించి  జ్ఞానజ్యోతిని వెలిగించి  చక్కని , మార్గ దర్శనం చేశావు ,
,__ఇదంతా నీ మంచి మనసు వల్లనే జరిగింది_!" నీ ఋణం ఎలా తీర్చు కోను ,నాయనా _!""??
   _"స్వామీ _!నాకు మీ   దీవనా బలం  తో నేను ఉద్దరింపబడు తున్నాను ,ఇపుడు _! _!,మీ ఆరాధ్య దైవం దర్శనం కోసం,_ ,సద్గురువు ఆ హనుమ స్వామి  అనుగ్రహం  అవసరం_! నాకు మీ అనుగ్రహం అవసరం _!
మీకు  గురుదక్షిణ గా_మీకు గురుబ్రహ్మ గా నిలిచి కరుణించిన  అద్భుతమైన   శ్రీరామ దూత దర్శనం కలగజేయడం _ నిజంగా నా పుణ్య ఫలం_!  ఇలా మన ఇద్దరినీ కలిపింది,ఆ  అద్భుతమైన శ్రీరామానుగ్రహం _!"" ఆంజనేయ స్వామి మహాత్మ్యం_!""
  ,, "" నాయనా _!నాకు అందించిన  ఇంత గొప్ప మహత్కార్యానికి   బదులుగా __ నీకు ఏమివ్వగలను  నాయనా_?""
   _"స్వామీ _!" నా శ్రమ ,ఆశయం ,జీవిత లక్ష్యం నెరవేరాయి,, _!నాకు ఈ రాక్షస శరీరం నుండి  _ మీ  పుణ్య హస్తం తో  _విముక్తి లభిస్తుంది ,_! ప్రతిరోజూ , రామకథ  శ్రవణం అయ్యాక _ భక్తులందరికీ  _తీర్థ ప్రసాదాలు అందిస్తూ వుంటారే _!! "
""స్వామీ _!, ఆ  పరమ పావన  శ్రీ రామ చంద్రుని పాద తీర్థాన్ని  ,దయ ఉంచి, ఈ చెట్టు పైకి చల్లండి  చాలు _! నాకు పునర్జన్మను ప్రసాదించిన వారవుతారు_!" , అప్పుడు , ,
నేను మీకు కనపడతా ను ,_!""
  ,  అదెంత భాగ్యం_ నాయనా ?!_!ఇదిగో _  రామకథ తులసీ తీర్థం_! ఇప్పుడే ,  నీవు చెప్పినట్టుగా  చల్లుతూ ఉన్నాను  ,_!"" శ్రీరామ చంద్రుని కరుణా కటాక్ష సిద్ధిరస్తు_!"" జై శ్రీ రామ్_!"
_ ఆహా_!  స్వామీ _!ఏమి భాగ్యం నాది స్వామీ??,    మీ పవిత్రతులసీ తీర్థం తో _ బ్రహ్మ రాక్షసి ఆకారం నుండి విముక్తి లభించింది _! దివ్యమైన దేహాన్ని పొందాను ,_!
మీ పాదాలకు సాష్టాంగ ప్రణామాలు  సమర్పిస్తున్నాను ,_!
_"మహాత్మా _!నాకు సద్బుద్దితో బాటు   _ రామాను గ్రహం మరియు  ,సద్గతి కూడా ప్రాప్తించాయి ,_!  నాకు మరో జన్మ అంటూ లేకుండా శ్రీరామనామ గాన మహిమా ప్రభావం వలన  _  నాకు  జీవన్ముక్తి ప్రాప్తించింది ,_!
త్వరలో మీకు _రామ దర్శనం ప్రాప్తిస్తుంది , _!
  నాకు గురువు గా నిలిచినా మీకు  మీ ఆచార్యుని దర్శనం చేయించి   గురుదక్షణ సమర్పించే భాగ్యం నాకు లభించింది ,
తద్వారా నాకు ముక్తి లభిస్తోంది ,
శ్రీరాముని సేవలో మీరు కూడా _ కృతార్తులు కాగలరు _!
మీ రామ మానస చరిత కావ్యము  ,రామ, భక్తుల పాలిట కల్పతరువు లా _భక్తి జ్ఞాన వైరాగ్య భావనతో _సకల జనులకు దైవభక్తి  , చిత్తశుద్ది నీ ,  మీ కు శాశ్వత కీర్తిని   కలిగిస్తుంది _!""
స్వామీ ,_! చివరగా మీకు  శ్రీరామ భక్త తులసీ దాసుగారు _! ఈ దాసుని
ఒక విన్నపము వినండి_! స్వామీ_!
మీరు కూడా మీ గురువు ,ఆచార్యులు అయిన ఆంజనేయ స్వామికి  , వారి గుణ గణాలు స్తుతిస్తూ "హనుమాన్ చాలీసా !""రాసి ,  మీ గురు దేవుల కు అంకితం చేస్తూ _  మీరు గురుదక్షిణ సమర్పించు కోవడం మాత్రం. , మరవకుం డా చేయండి , _!
నన్ను దీవించండి _!
మహాత్మా,, అపర శ్రీరామ భక్త వరేన్యా! _!""స్వామీ _!
ఇక సెలవు _!
జై శ్రీ రామ్__జై సీతా మాతా _!
జై అభయాంజనే యా
  నమో నమః_!"
____&______
         ""_ నాయనా _!నీకు  జయం శుభం_!
, శ్రీ రామచంద్రుని కరుణా కటాక్ష సిద్ధిరస్తు _!_"
   _"హే ఆంజనేయ స్వామీ ,_!, నీ దయ అపారం _!,నీ అనుగ్రహానికి నోచుకున్న నేను _ఎంతో భాగ్య శాలిని _!
, నన్ను కటాక్షించడానికి ,_ రోజూ  రామకథ శ్రవణం నెపంతో , వస్తూ,__ అటు ఆ బ్రహ్మ రాక్ష సుని  శాప నివారణ ,,ఇటు నాకు  సద్గురువు లా  మీ దివ్యమైన దర్శన భాగ్యం   అనుగ్రహించి __ శ్రీరామ దర్శన భాగ్యాన్ని   కూడా  నాకు లభింప జేస్తూ ఉన్నావు ,_!"
_  స్వామీ _!, వాయుపుత్రా,_!
_నిజమైన ఆచార్యుడ వు అంటే _నీవే తండ్రీ_!
  _నాకు జ్ఞాన నేత్రం తెరిపించావు _!
  ఎంతటి గొప్ప భక్తుడై నా ముందు ,తన ఆచార్యుడు , _ సద్గురువు అనుగ్రహాన్ని పొందాల్సి ఉంటుందని  నాకు సూచించావు ,  ,_!
   ,శ్రీ _గురుభ్యోనమః _!
"" హే అంజనీ తనయా,_! వాయు పుత్రా_!నీ కృపా కటాక్షములు ఉంటేనే_ _నాకు మోక్ష దాయకమైన శ్రీ  రామదర్శన భాగ్యం కలుగుతుంది _!'"
   ,_ శ్రీ రామ మానస  చరిత  కావ్యాన్ని  రచన చేసే భాగ్యం __    శ్రీ సీతారాము ల దయవల్ల నాకు  కలిగింది !
కానీ, నాకు సద్గురువు , ఆచార్యుడు అయిన నిన్ను కీర్తించడం,_ మరిచాను _ స్వామీ !
అందుకే స్వామి దర్శనం లో  లభించడం  లో జాప్యం అవుతోంది లేదు _!
    , నేను క్షంతవ్యు డను స్వామీ _!"
నా అపరాధము ను మన్నించు _! నీ కృపకు  నోచుకున్న నేను నిజంగా అదృష్టవంతుడను  _!
హే గురుదేవా,,! వాయు పుత్రా, !అంజనీ తనయా,! హే రామ దూతా, _! వీర హనుమా _! అభయ ప్రదాతా _!"
నీ మహత్తును నీ వైభవాన్ని , చరిత్ర నూ , స్వామి భక్తినీ  _ నా రచనల ద్వారా ప్రకటించే అవకాశం నాకు  అనుగ్రహించు , స్వామీ ,,_ ఆంజనేయా ,_!""
"హనుమాన్ చాలీసా "అనే   అద్భుత  స్తోత్ర రాజము తో నీ దివ్య గాథను , లీలల ను కీర్తిస్తూ_    రాయ  సంకల్పించిన  నన్ను  దీవించు_!
హే  మహా వీర , విక్రమ బజరంగీ  , _!నీ పాద కమలాల కు  సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తున్నాను ,_!
  _" జయ హనుమాన జ్ఞాన గుణ సాగర_!
జయ కపీ శ , తిహు లోక ఉజాగర _!
, రామ దూత అతులిత బల ధామా _!
అంజనీ పుత్ర పవన సుత నామా _!
నమో నమః
   జై హనుమాన్ _!"
జై  బజరంగీ_!
జై శ్రీ రామ్ _!
జై జానకీ మాతా _!
   ఆచార్య దేవో భవ _!""
స్వస్తి_!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"
  
   జై జై శ్రీ రామ్ _!'
ఆంజనేయ స్వామి కీ జై !_
   స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"

శ్రీ రామ నామ గాన మహిమ-4

June 21, 2020
"మహానుభావా_! తులసీదాసు గారూ ,_!
_ ఈ రోజున  సాయంత్రం _ రామకథ   చెప్పడం అయ్యాక_  ప్రసాదం తీసుకొని అఖరున  _ ఒక  వృద్ద బ్రాహ్మణుడు వెళ్లి పోతూ   మీకు కనబడుతాడు  _మీరు ,వెళ్లి అతడి కాళ్ళ మీద పడండీ_ స్వామీ _! మీ సమస్య తీరిపోతుంది _!"
,_" నాయనా _! ఎవరు ఆయన ,_? నేను  ఎందుకు అతడి కాళ్ళు పట్టుకోవాలి ,_?" నాకు అర్థం కావడం లేదు,_!""
""అయ్యో  _!స్వామీ_!  ఎక్కడ రామకథ జరుగుతూ ఉంటుం దొ ,అక్కడ   ఆయన ఆ ఆంజనేయ స్వామి ,  తప్పకుండా వస్తాడని మీకు తెలుసు గదా ,_!"
_"ఏమిటి _?  నిజంగానే  నా   స్వామి వస్తున్నాడా  _? ప్రతీ రోజునా _? ""
_ మహాత్మా , మీ రు నిత్యం పారాయణ చేస్తున్న రామ కథ గానం  ఎంత ఆనందాన్ని  కలిగిస్తూ ఉందో , ఆ ఆనందం అనుభవించే వారికి మాకు తెలుసు, మీ రామ భక్తి, రాముని యందు మీకు గల ప్రేమాను రక్తి "_!
అపర శ్రీరామ భక్తులు _ మీరు రామ కథ గానం శ్రవణం చేయడం వల్ల ,_ బ్రహ్మ రాక్ష సుడనైన నాకు  ఘోరమైన శాపం నుండి విముక్తి కలుగుతోంది _!
  అలాంటిది , ఆ  రామకథ వింటూ పులకించే  అంజనేయ స్వామి రావడంలో వింత ఏముంది,_? చెప్పండి _!"
ఎక్కడ రామ కథ గానం వినబడుతుందొ  _అక్కడ ఆంజనేయ స్వామి తప్పకుండా  వచ్చి తీరుతాడు ,,_
వస్తున్నాడు_!
వచ్చాడు _!
వస్తాడు కూడా _!
    _ ఇంత  అద్భుత  విషయం తెలిశాక _మీరు  ఆనంద పారవశ్యం లో మైమరచి పోతారు _అని నాకు తెలుసు,__!
"అయ్యా _!, మీకు  శుభాకాంక్షలు_! మీస్వామి   శ్రీ రామ చంద్ర ప్రభువు దర్శనం లభించ బోతోంది _  సద్గురువు , శ్రీరాముని నమ్మిన బంటు _మీ ఆచార్యుని  అనుగ్రహం. _  పొంద బోతూ ఉన్నారు _!
_ఇక నే వెళ్తాను ,_ స్వామీ  రామకథ లో లీనమై  _ చేయాల్సిన పని
మరచి పోయేరు ,_ జాగ్రత్త
_!"" సెలవు ,_!  నమస్కారం _!""
_____-__
"అయ్యా _!తులసీదాసు గారూ ఏమైంది ,_? విచారంగా ఉన్నారు ఎందుకు _? ఏం జరిగింది , స్వామీ ?_
""_ఏం చేయను_ నాయనా _? ,దురదృష్టం నా వెంటే ఉంటోంది_!
_"ఏమైంది స్వామీ_? విషయం చెప్పండి _??""
_"నాయనా _!నీవు చెప్పినట్టే   వెళ్లి _ఆయన కాళ్ళు పట్టుకున్నాను _ నన్ను కరుణించ మని _!",ఆయన  నన్ను విద లించుకుంటు   దూరంగా జరిగి , కోపంతో ,,
"",నేను అంజనేయ స్వామి నీ ఏమిటీ _?
రామకథ చెబుతూ చెబుతూ అందులో లీనమై , నీకు కనబడే వారంతా ఆంజనేయ స్వామి వలె  భావిస్తూ ఉన్నావు కదా  ,నీవు _!"" ఆ శ్రీరాముని ఆత్మ బంధువు  ఆంజనేయ స్వామి ఎక్కడా_??  మీ  ప్రక్క కుగ్రామ నివాసిని_! నేనెక్కడ ?""
  ""మీరు  గొప్ప రామ భక్తులు  _!,   మీలాంటి మహాత్ములు  ఇలా చేయడం వలన _ నాకు ఘోర పాపం కలుగుతుంది,,  సుమా _!"" "పెద్దవాణ్ణి నేను _!
ఏదో రామకథ వింటూ పుణ్యం పొందాలని వస్తె ,_ ఇదేమిటి _?మీరు  నా పాదాలు పట్టుతూ ,_నాకు మహా పాపం  అంటగడుతు ఉన్నారు ,_??"
_"తప్పు _!  అయ్యా _! పూజ్యులు ,పుణ్యాత్ములు _ శ్రీ రామ కావ్య రచన కావించిన  అదృష్ట వంతులు ,__!
మీరు ఇలా చేయకూడదు _! భావ్యం కాదు మీకు _!
అంటూ  మెత్తగా చీవాట్లు పెట్టి  _ ఆయనే  నాకు ప్రతి నమస్కారం చేసి _ వెనక్కి చూడకుండా వెళ్లి పోయాడు   _!""
   ,  _"చూశారా. స్వామి_? మీ అంతటి మహా భక్తులే  ,బోల్తా పడ్డారు , మాయ  ప్రభావం అంత బలంగా ఉంటుంది,  ,  మనకున్న అజ్ఞానం ,అవిద్య వల్ల , పుణ్యాత్ములు ఎదురుగా ఉన్నా  , గుర్తించ లేక పోతాం _!""
గొప్పవాళ్ళు  _ మహానుభావులు ఎవరూ కూడా _ తాము" ఇంత వారిమి " అని  ఎక్కడా చెప్పుకోరు_!
విజ్ఞత తో విశ్వాసం తో , ,సాధనతో ,   సద్గురువు ను వెదకి పెట్టుకోవాల్సి ఉంటుంది    
,_ నా విషయం   అంతా ఆ  ఆంజనేయస్వామికి తెలుసు, _! స్వామి విషయం నాకు తెలుసు,_!  మిమ్మల్ని ఆశ్రయించే దారి , ఆ స్వామి దయ వల్ల నే నాకు  స్ఫురించింది _!
_మొదట్లో స్వామిని చూస్తుంటే  _ఒళ్ళంత మంటలు పుట్టి _ఆమడ దూరం పారిపోయేవాడిని _?? భూత పిశాచ రాక్షస గణాలు  ఆ స్వామి ముందు  నిలబడ లేవు కదా _! స్వామీ _!"
_" నిరంతరం రామ కథ వింటూ ఉండడం , రామ నామం జపిస్తూ ఉండడం వల్ల ,_ ఆంజనేయ స్వామికి నాపై  దయ కలిగింది,
_నా రాక్షస ఆకారం
,.  మీ ద్వారా నే    తోలగాల్సివుంది  _  అని సూచించాడు స్వామి _!
__ మహాత్మా_ తులసీదాస్ గారు  _! రేపు మళ్లీ   ప్రయత్నించండి ,, , ఈ సారి మాత్రం  ఆయన మాటలకు బెదరి పోవద్దు స్వామి,_! అతడి  నామ స్మరణ చేస్తూ,_ అతడి కృప జూపమని  ప్రార్థించండి ,_!""
      అభయం ఇచ్చే వరకూ , రామ దర్శనం దారి చూపెవరకు విడవకం డి__ ఆయన పాదాలు __!""
స్వామీ _
     సెలవు ,
నమస్కారం
     ( ఇంకా ఉంది)
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా _!

హే కృష్ణ మురారే , హే గిరిధారే

June 20, 2020
హే కృష్ణ మురారే ,    హే గిరిధారే
కరుణా సిందో ,   శ్రీ హరీ
       !!హే. కృష్ణ!!
  హే మాధవ , మధు సూద న  బం దో ,  దీన జనావన బందో

   రాధా రంజన , రాధా మోహన
  రాస లీల వినో దా
  నగధర నాద వినోద, శ్రీ కరా
  నారాయణా , నంద లాలా
       !!  హే కృష్ణ !!

    నంద నందనా  నవనీత చో రా
  వేణు గాన విశార దా
గోపీ లో లా , గో పరి పా లా
  గోకుల బాలా , గోపాలా

హరే రామ హరే కృష్ణ అని నోటా పలకరా

June 19, 2020
పల్లవి
_____&__
"హరే రామ  హరే కృష్ణ అని నోటా పలకరా _!"
"హరే శ్రీనివాస _యని
హరి స్మరణే  చేయుమురా  _!! _
     !,హరే రామ హరే కృష్ణ !

అను పల్లవి
________
, 1_యజ్ఞ యాగ క్రతువులు_
నీవు చేయ లేవురా_!
జపము తపము నిష్టతో_ _,ఆచరించ లేవురా _!
అడుగడుగున మాయ ,_
నీ  వెంటఉండి తిరుగురా _!ఆ మాయనధిగమించుటకు _భగవన్నామమే శరణమురా
    ! హరే రామ  హరే కృష్ణ!!

2_రామ కృష్ణ నామము _
    అప మృత్యుమార్గము_!
హరినామ స్మరణ ము _
     భవ భయ హరణ ము,_! _!"
"హరే రామ _హరే కృష్ణ__
  హరే శ్రీనివాస యనీ_""
మరువక హరి స్మరణమూ_
మరీ మరీ చేయుము రా !!

"హరే రామ హరే కృష్ణ_
అని నోటా పలక రా  _!
ఆ నామమే నీ జన్మము _
చరితార్థము.చేయునురా !!"

"హరే రామ హరే కృష్ణ
అని నోటా పలక రా  _!!""

    "స్వస్తి _!!
హరే కృష్ణ హరే కృష్ణ !!

కృష్ణ మూరితి!

June 18, 1020
"1__ఎంత గడుసు వాడ వు రా కృష్ణ మూరితి_!
నన్ను పట్టుటకు ఆ మురళి తో పట్టి పిలిచేవు ,కృష్ణ _;"

"2__ఎంత మాయ లోడివి రా_ కృష్ణ మూరితి_!
నీ ప్రేమలోపడగొట్టి ,మమ్ము
నీ చుట్టూ తింపేవు కృష్ణ_!"

"3__ఎన్ని మాటలు నేర్చావుర కృష్ణ మూరితి _!
ఆ మాటలకు మనసు కరిగి_
నీముంగిట  వాలేము కృష్ణా _!""

"4__ఎంత చల్లనిచూపులు నీవి _కృష్ణమూరితి_!
ఆ చూపులో మా బ్రతుకు లు ధన్యమౌను  కదర కృష్ణా_!""

5___మాటిమాటికి  ఊదకు వేణువు
కృష్ణ మూ రితీ_!
అది మా ప్రాణాలు  తోడి నీలో _
కలుపు వరకూ నలుపు కృష్ణా_!

"6__అది మురళి కాదురా   _ మ్రోగించ_
కృష్ణ మూరితి   _!
అది మా నిండు గుండెలు పిండు దండి వెదురు బెండు కదర కృష్ణా !!

స్వస్తి ,!
హరే కృష్ణ హరే కృష్ణా !_

శ్రీ రామ నామ గాన మహిమ_3

June 19, 2020
"అయ్యా_! మీరే మంటున్నారో మీకు తెలు స్తోం దా _!??
స్వామీ,, నేనెక్కడ , ??-_ఆ  శ్రీ రామచంద్ర ప్రభువు  , సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు , అత డెక్క డ ??
నా  జన్మకు , నా యోగ్యతకు  శ్రీరామచంద్రుని తీసుకొచ్చే  గొప్ప చరిత్ర ఉందా_? లేదు   స్వామీ లేదు _! ఈ అభ్యర్థన నా శక్తికి బుద్ధికి మించినది ,__!"
ఎక్కడ ఆ రామ చంద్ర ప్రభువు ,! ఎక్కడ ఈ బ్రహ్మ రాక్షస జన్మ ,_?
అయ్యా _!ఇంత పెద్ద కార్యము  నా చేత కాదు,:_!
అయ్యా ,_! ఆ ఒక్క "" రామ దర్శనం_"" తప్ప మరేదైనా అడగండి _! నా దీనత ను గమనించండి స్వామీ _!"" మిమ్మల్ని  కన్నీళ్ళతో వేడుకుంటూ ఉన్నాను ,,  కరుణ చూపండి   _!""
,   నాయనా _! నీవల్ల అవుతుందా  లేదా అన్నది నా మనసుకు  తట్టడం లేదు, కానీ,
నేను నిత్యం ఆ రామచంద్ర ప్రభువును  కోరుకునేది ,,  స్వామీ నీ దర్శన భాగ్యం అనుగ్రహించు మని   మొర పెట్టుకుంటు ఉంటాను
, ,రాముడు   లేకుండా జగతిలో  ఏదైనా ఉంటుందా_? చెప్పు   ,అంతా రామమయం కదా ,_!
నాయనా ,నాకు  ఎక్కడ చూసినా  అంతటా    ఆ సాకేత రాముడే కనిపిస్తూ ఉన్నాడు _!
,రామ దర్శనం తప్ప _నాకు మరేమీ అవసరం లేదు,,_!
నిన్నే కాదు, ఎవరు కోరు కొమ్మని అడిగినా , ఎప్పుడైనా,  నేను అడిగేది ఆ దయాంతరంగుడు ,   శరణా గత వత్సలుడు,, ఆపదో ద్దార కుడు,,,,   సీతా మనోభి రాముడు ఆ శ్రీరాముని దర్శన భాగ్యాన్ని మాత్రమే   కోరుతూ ఉంటాను,
ఈ రామకథ , ఈ రామాయణ రచన , ఈ పురాణ ప్రవచనం , ఈ జీవితం ,,, ఈ ఉచ్వాస నిశ్వాసలు. అంతా ఆ  కళ్యాణ కర , రమణీయ,కమనీయ ,మహనీయ ,అద్వితీయ , అపురూప అద్భుత ,, జగన్మోహన సౌందర్య  సుందర దివ్య మంగళ విగ్రహ స్వరూప దర్శనం కోసమే నాయనా _!
నా ఆర్తిని ,,నా  ఆర్ద్రత ను కూడా నీవు అర్థం చేసుకో నాయనా ,_!
ఏ రాముని అనుగ్రహంతో నీకు  ఈ  సద్భావన , సత్వ గుణ సంపద కలిగిందో, ఏ రాముని అనుగ్రహంతో ,   నాకు  రామ మానస చరిత కావ్య రచనా భాగ్యం కలిగిందో
ఏ రాముడు దయ వలన నాకు ఒక చక్కని రామ భక్తుని తో  మాట్లాడుతూ  పరమానందం పొందుతూ ఉన్నానో,
ఏ రాముని అనుగ్రహంతో నీవు రాక్షస ప్రవృత్తి నుండి నివృత్తి నీ పొందుతూ ఉన్నావో
ఏ రాముని దయ వలన ఈ సకల చరాచర జగత్తు  ఆనందమయంగా , సకల సంపదల నిలయం గా,  విరాజిల్లుతూ ఉందో, ఏ రాము ని అపారమైన  కరుణ తో  మానవ జన్మ ధరించిన నేను , రాక్షస శరీరం ధరించిన నీవూ,   రామకథ గానా మృత ఆస్వా దనతో  పునీతులం అవుతున్నా  మో ,
అట్టి శ్రీరాముని దర్శనం కోసం  ఆరాట పడటంలో  తప్పు లేదు కదా ,
  తారక రాముడు, తారణ కారకుడు,  నాకు ఆ రామ దర్శనం  ఇప్పించూ నాయనా,, , _!"
,,, "అయ్యా ,_! తెలుసు,మీర్ అంతరంగం లో రాముడు కొలువై ఉన్నాడు అనీ _!
రామ దర్శనానికి మీకు సంపూర్ణ యోగ్యత ఉందనీ తెలుసు __!
స్వామీ,_! మీ భక్తి ప్రపత్తుల ను , రాముని పై గల అచంచల విశ్వాసం చూస్తూ ఉంటే, తప్పకుండా   ఆ రామ దర్శనం చేయగలరని కూడా  నాకు నమ్మకం కలుగుతూ ఉంది_!
అయ్యా ,_! నాకు  మీ  రామ ప్రభువు ఒక పరీక్ష పెడుతున్నాడు _! తులసీదాసు గారూ _!మీరు ఇంత. మొండి పట్టు పట్టితే నాకు ఏమీ తోచడం లేదు,,!
నాకు , ఒక్క మార్గం తోస్తూ ఉంది, స్వామీ _!  నేను మీ రాముడిని తేలేను_,,_!_  మీకు  ఆ రామదర్శనం   చేయించలేను,,_!
, కానీ , స్వామీ,
ఆ రామదర్శనం   చేయించే ఒక  మహాత్ముని మాత్రం_ మీకు  చూపగలను _!
  , ""ఆహా, ఎంత మంచి మాట చెప్పారు ,_ నోటిలో అమృతం పోస్తూ ,  _ ఎండలో, ఎడారిలో ,దాహం తో కొట్టు మిట్టాడుతు ఉన్నవాడికి __చల్లని మంచి నీరు  అందించి నట్టుగా _నాకు ఎంత తీపి కబురు చెప్పావు కదా నాయనా ,_!    త్వరలో నీకు రాముని దయ వల్ల ,తప్పకుండా , విముక్తిని పొంది , సద్గతి ని పొందుతా వు ,_!
నా మాటను నిజం చేస్తాడు. చూడు,, నా రాముడు _! ధర్మ మూర్తి,_! నా ప్రభువు _!
_ నాయనా ,,చెప్పు _! నా రాముని చూపించే ఆచార్యుడు ఎవరో , ఎక్కడ ఉంటాడో ,త్వరగా చెప్పు ,,  నాకు వారిని చూపిం చి పుణ్యం  కట్టుకో ,, నాయనా _! చూశావా రామాను గ్రహం ,, 
నమ్మిన వారిని ఎలా కరునిస్తు ఉంటాడో _?!
    "_అయ్యా_! తులసీదాసు గారూ,,_!ఆయన ప్రతి రోజూ ఇక్కడకు, మీ రామకథ. శ్రవణం చేయడానికి వస్తున్నారు  స్వామీ _!"
  ""అవునా,_, నాయనా ,_! అంత గొప్ప మహానుభావు డు , రోజూ నా ఇంటికి వస్తున్నారా_??
, నేను చెప్పే కథ అతడు  వింటున్నా డా _? ఇది కలా,_? నిజమా  _? నమ్మలేక పోతున్నాను నాయనా _! 
  "_అవును_ స్వామీ _! ఆయన అందరికంటే ముందుగా  మీ  రామకథ ప్రసంగం వినడానికి  వస్తుంటారు _!
రామకథ ప్రసంగం పూర్తి అయ్యాక _ అందరూ వెళ్లి పోయ్యాక __ చిట్ట చివరకు వెళ్లి పోతుంటారు_!""
", అవునా? ఎంత విచిత్రం ?!" ఇది ఏదీ, నేను గమనించడం లేదు ,_! నాయనా _!
ఎవరు  ముందు వస్తుంటా రో,, ఎవరు వెనక  వెళ్తూ ఉంటారో , నాకు తెలియదు _ నాయనా _!
కానీ ఒక్క నిజం మాత్రం తెలుసు ,,ఎక్కడ రామకథ జరుగుతూ ఉన్నా _,అక్కడ  శ్రీ రామ భక్తా గ్రేసరుడు _ వాయు నందనుడు, _కేసరీ పుత్రుడు,_హనుమంతుడు మాత్రం_ తప్పనిసరిగా వచ్చి వింటూ ఉంటాడు_ అని నా  ప్రగాఢ మైన నమ్మకం  ,_! నాయనా _!
"స్వామీ_!  మీరు చెప్పింది అక్షరాలా సత్యం _! స్వామీ,,
మీరు రామకథ పఠన ఆనందంలో మునిగి తేలుతూ ఉం టూ ఇటువంటి చిన్న చిన్న విషయాలు  గ్రహించరు_! 
,__రేపు గమనించండి ,ఒక వృద్దుడు అందరికన్నా  ముందుగా వస్తూ ,,ఒక మూలన  కూర్చుం టూ ,  పురాణ శ్రవణం అయ్యాక   అందరూ వెళ్ళిపోయాక   చివరివాడుగా వెళ్తుంటాడు _ ఆయన !!""
     (  ఇంకా ఉంది )
    స్వస్తి !"
హరే కృష్ణ హరే కృష్ణా _!"

శ్రీ రామ నామ గాన మహిమ - 2

June 18, 2020
""శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ _శ్రీ రామ_ శ్రీ రామ_ శ్రీ రామ ____,,,,!"
""_ఎవరూ ఈ రామ నామ గానం చేస్తోంది ?_"
""శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ,___!"
" ఓ మహాత్మా,_! మీరు ఎవరో కానీ,తాము రామ భక్తులు అని నాకు తెలుస్తోంది _!
నాకూ కూడా  రాముడు ఇష్ట దైవం  _!,మీరు ఎవరో దయచేసి నాకు ఎదురుగా రండి,_!""
" అయ్యా  _! తులసీ దాసు గారూ,_!నేను  మీ ఇంటి ముందు న పెద్ద రావిచెట్టు ను ఆశ్రయించి ఉంటూ,_ ఉన్న ఒక బ్రహ్మ రాక్ష సుడను_!
నేను మీకు ఎదురుగా నిలబడా లేను,,! మీ వంటి పుణ్యాత్ముల  ముందు నిలబడే యోగ్యత _నాకు లేదు,!
ఆ యోగ్యత నాకు కలగాలంటే ,, రామ మానస చరిత రామాయణ గ్రంథ కావ్య  రచన చేసిన_ మీ లాంటి  గొప్ప శ్రీరామ భక్తుల , అనుగ్రహం కావాలి
,", స్వామీ__!
_ రోజూ మీరు వినిపిస్తున్న రామ కథ ని వింటూ _ఆ అమృత సారాన్ని గ్రహిం చాక _, నా లోని తమో గుణం రజో గుణం_, గత జన్మ పాపం , నారద ముని శాపం  తొలగించు కొనే భాగ్యం మీ వంటి పుణ్యాత్ములు వల్ల లభించింది _!-
, "ఆహా _! నేను చెబుతున్న , రామ కథ శ్రవణం లో ఇంత మహత్తు వుందా,_!??"
__నా ప్రసంగాల వల్ల ""ఒక బ్రహ్మ రాక్ష సుడు  కూడా తరించాడు ""!
అని  వింటుంటే , నాకు చాలా  ఆనందంగా ఉంది సుమా _!
అయ్యా _!  మీ లాంటి భక్తి ప్రపత్తు లు కలిగిన ఇంత చక్కని శ్రోత లభించడం__  అతడిలో పరివర్తన కలగడం ,_ఇదంతా , నా అదృష్టం ,! నా భాగ్యం ,!
ఆ రామచంద్రుని అపార కరుణా కటాక్షాలు కదా _!
హే కారుణ్య రామా,! కరుణా ధామ, !పరంధామా _! నమో నమః _!""
ఆహా,_! హే  సీతా రామా _!
ఎంత దయామయూడవు తండ్రీ, నీవు ,?_
    రామ ప్రభువు  కృపను పొంది ధన్యు డవు అయ్యావు  ,_!
"  నాయనా _!నేను కేవలం నిమిత్త మాత్రున్ని , _! నీవు  తరించడానికి  రామ భద్రుడు  నన్నొక మాద్యము గా వినియోగించాడు ,__అంతే !
  కానీ ,నాయనా _!ఇన్నాళ్లూ. నాకు  కనబడకుండా ఉన్న
ఇపుడు ఈ రోజు న  ఏమి ఆశించి , నా ముందుకు వచ్చారు ,_!
"అయ్యా _!తులసీదాసు గారూ,_!_మీరు రచించి_ గానం చేస్తూ _ మధురంగా ,,  చెవులకు విందుగా ,అద్భుతంగా ,వినిపించిన _ శ్రీరామ చరిత మానస రామాయణ కథ  శ్రవణం  వలన నేను _పరవశిస్తూ_ పరమానందం  పొందుతూ ఉన్నాను _! ఈ దివ్యమైన రామకథ  ను క్రమం తప్పకుండా భక్తి ప్రపత్తులతో రోజూ ఇదే చెట్టు పై నుండి  ,  వింటూ ఉండడం వలన ,_నా  సమస్త పాపాలు ,శాపాలు  హరించి పోయాయి _! ఆ  శ్రీ రాముని దయ వల్ల__ నాకు ఇపుడు కేవలం భక్తి మార్గం తప్ప _ఇతర విషయాల పై మనసు పోవడం లేదు_! "
""శ్రీ రామ_ శ్రీ రామ _శ్రీ రామ_!""  అంటూ  రామ నామ గానం చేస్తూ _  మనసులో ధ్యానిస్తూ  , ఎన్నో ఏళ్ల నుండి  ,ఒక దేవాలయం లాంటి _మీ ఇంటి ముందే ఇదే చెట్టు పై_ ఉంటూ , ,రామభక్తి నీ పెంచుకున్నాను , స్వామీ,
ఇందుకు  మీకు నా ప్రణామాలు   సమర్పిస్తున్నాను ,_! స్వామీ,స్వీకరించండి __!"",
అంతే కాదు ,,,_!
,ఇందుకు ప్రతిఫలంగా ,_   మీరు కోరుకున్నది __ ఏదైనా గురుదక్షిణ గా   ,మీకు   సమర్పించు కోవాలని  నా కోరికగా ఉంది _! స్వామీ_!"
నేను ఈ రాక్షస శరీరం నుండి  విముక్తి అయ్యేలా  అనుగ్రహించండి  _!,,  _ _ అందుకు , నాకు "జ్ఞానభిక్ష"  ప్రసాదించారు ,, ఆ విధంగా, నాకు ,_""సద్గురువు" స్థానం లో  ఉన్న మీరు_ __,దయచేసి  నా నుండి ఏదైనా   స్వీకరించి,, ఈ అభాగ్యు ని  జన్మ_ పావనం చేయండి __! ఈ రూపంలో మీకు కనపడ లేను, _!మీ పాదాలను తా కుతూ నా కృతజ్ఞత ను వెల్లడించ లేను,_! మహాత్మా,_! అందుచేత ,,__కేవలం మాటలతోనే నా ఆవేదన, ఆక్రందన  _మీకు తెలియజేయగలను_! నా నిస్సహాయత కు
నన్ను క్షమించండి  ,__!,
   , "" చాలా సంతోషం నాయనా _!   నా రాముడు సత్వ గుణ సంపన్నుడు, ,  సకల గుణాభి రాముడు,,! , _ నాయనా _!
  అపారమైన  పెన్నిధి లాంటి శ్రీరాముని సన్నిధి, నాతో ఉండగా , ఇక ఈ తుచ్ఛమైన ఈ భౌతిక పదార్థాల అవసరం నాకు  లేదు అని నీకు తెలుసు కదా_!"
, "నిజమే, !అయ్యా  _!, మీ గురించి, మీ నిరాడంబర నిష్కామ, నిరాపెక్ష _నిస్సంగ తత్వ ము  _మీ భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి  ,నాకు  బాగా తెలుసు__!
, "రామభక్తి "తప్ప _మీకు మరేదీ రుచించదు _! అని కూడా నాకు  తెలుసు ,_! అయినా నా ప్రార్థన మీరు మన్నించాలి ,_!"
సరే చూద్దాం _! 
ఆ రాముడు ఏది సూచిస్తాడో ,? ఏమి చేయిస్తా డో,, ?
హే సీతామనోహరా ,_! పావన రామా, !కౌసల్య రామా,,!దశరథ రామా,,! అంతా నీదే భారం ! తండ్రీ_!
, ఎన్నడు  నాకు నీ  దివ్య మంగళ విగ్రహదర్శన_ భాగ్యం ఇస్తావో,? ఎలా నన్ను కడతీరుస్తావో,__!?
"ఏ తీరుగ నను దయ జూచె దవో ఇనవంశోత్తమ_ రామా,_!"
,,______
"అయ్యా  ,!_ తులసీదాసు గారూ , _! ఒక వారం గడిచింది,,_!  మీరు నా మొర ఆలకించడం లేదు ,_! స్వామీ,,_!
నన్ను  పూర్తిగా మరచి పోయారు_!
మీరు నన్ను అనుగ్రహించ డం  లేదు ,_!"
"మీ రుణం చెల్లించుకునే వరకూ  __నేను ఈ  ఘోర రాక్షస శరీరం నుండి విముక్తి పొందలే ను స్వామీ,,_!""
    నాయనా ,_! అద్భుతమైన నీ రామభక్తి  ని   మరవగలనా ,?  మనమంతా ఇక నుండి "రాముని వారము," _! నాకు __, నీవూ నేనూ అని బేధం లేదు _! అయినా, కోరికే లేని నేను _నిన్ను 
ఏమి కోరను   నాయనా ?,, నాకూ  ఏమీ తోచడం లేదు ___! "
  "మహానుభావా ,!_ మీకు  ఏ కోరికలూ లేవని నాకు  చక్కగా తెలుసు _!"
"అయినా  నా విషయం లో మీకు ఈ బాధ తప్పదు , స్వామీ _!"
,పోనీ, మీ రామునికి సంబంధించినవి ఏమైనా ఉన్నాయేమో _ ఉంటే  ఆలోచించి చెప్పండి _?
  "ఆహా_!,,  చక్కటి ఉపాయం చెప్పావు నాయనా ,! నీవు , ఈ గురువుకు తగిన శిష్యుడి వనిపించు కున్నావు కదా _!
నాకు ఏది అవసరమో,  అది నీవే _నీ నోటనే పలికావు కదా _!   కాదు ,,_! నా  రాముడు నీతో  పలికించాడు ,_!
__" అయ్యో_! స్వామీ !,నేనేమీ అలా అనలేదే__!""?"
_ "నాయనా _! ఇందాకా ""రామునికి సంబంధించిన వి. కోరుకో  !,""అన్నా వు కదా__!
""అన్నాను _!""
""రామునికి సంబంధించిన వి కొరేకంటే __రాముడి నే కోరుకుంటే ,_?""
"అయ్యా _!  మీ మాటలు నాకు అర్థం కావడం లేదు_!""
"అదే _!   నాకు ఏది కావాలో కోరుకో అన్నావు కదా,,నాయనా ,__!
నాకు రామ దర్శనం   చేయించు, _!చాలు ,-_!నీకు  జన్మ జన్మలకు ఋణపడి ఉంటాను  నాయనా __!"
   ( ఇంకా ఉంది )
స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...