Wednesday, February 20, 2019

రేపల్లెలో దీపావళి

యశోదా మాత రేపల్లెలో , దీపావళిరోజున  ,సాయంత్రం  ,యమునానదీమ తల్లికి దీపపు దొన్నెలతో మంగళహారతి నిద్దామని ,రేపల్లెలో ని గోపికల నందరిని సమాయత్తం చేసింది.., వారి సనాతన సంప్రదాయం ప్రకారం. అలా ఏటా చేస్తూనే ఉంది.,! తనకి సంతానంగా  "అందాల ముద్దుల కృష్ణుణ్ణి " అనుగ్రహించిన జగదాంబ కి ,తనపై ఇంత దయ చూపిన  "అమ్మలగన్న అమ్మ  "కు  ,కృతజ్ఞతతో ఎన్నో పూజలు నోములు వ్రతాలు దానాలు  చేస్తూ. మొక్కులుకూడా  చెల్లించుకుంది. ! ఆమె ఏ పుణ్యకార్యం చేస్తున్నా ,తోటి స్త్రీలను కూడా కలుపుకుని  ఆనందంగా ఒకేచోట   చేస్తుంది  !. ఆ గ్రామానికి నందగోపుడు  "నందరాజు! " ఆయితే ఆమె "నందరాణి.!"  కానీ ,తాను  "రాణిని !"అన్న అహంభావం లేకుండా, అందరితో  స్నేహ భావంతో ,ప్రేమగా ఉండడం వలన,, కృష్ణునిపై యశోదకు  ఎంత  "ప్రేమ " ఉందొ  ,అంతే ప్రేమ ,వాత్సల్యం ,అనురాగం , చూపిస్తూ చొరవగా గోపికాలంతా యశోదా ఇంటికి వస్తూ  ,ఎదో పని నెపంతో ,కృష్ణుని పై పెంచుకున్న అవ్యాజమైన  ప్రేమ వల్ల, కన్నయ్యను మురిపెంగా  చూస్తూ , అందమైన దుస్తులతో ,ఆభరణాలతో కృష్ణుణ్ణి  స్వయంగా  అలంకరిస్తూ, ఎత్తుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ, తాము వెంట తెచ్చుకున్న  వెన్న అతడికి  తినిపిస్తూ  ,,ఉయ్యాలలో పడుకోబెట్టి  "జో అచ్యుతానంద !జో ,జో ముకుందా !'" అంటూ అంతా కలిసి జోలపాటలు పాడుతూ ,కృష్ణప్రేమలో ,కృష్ణ సాన్నిధ్యంలో ,భగవద్ అనుభూతిని పొందుతూ,కృష్ణ ముఖారవింద లావణ్య వైభవంలో  తాదాత్మ్యం చెందుతూ, , కృషుణ్ణి తమ కుమారుడిగా భావిస్తూ, యశోధమ్మ ఇంట్లోనే వారు ఎక్కువ కాలం గడిపేవారు  ! రాత్రి ,నిదురపోయే కృష్ణుని ముద్దు మోము ను ,ఎంత చూసినా తనువితీరని ఉత్సుకతతో ,కృష్ణ,విరహంతో,కృష్ణుని విడిచి వెళ్లలేక , వెళ్లలేక  ,తమ ఇండ్లకి వెళ్లే వారు..  దేహాలు ఇక్కడ , వారి మనసేమో అక్కడ, బాల కృష్ణుని అందచందాలచెక్కిళ్ళ సొగసుల తళుకుల వద్ద లగ్నమయ్యేది..! అలా ఉండేది కృష్ణ ప్రేమ ,!కృష్ణునిపై ప్రేమ..!.అందుకే ఎక్కడికి వెళ్లినా అందరూ కలిసి వెళ్తారు.  !ఇప్పుడు యమునా దివ్వెల హారతి  ఇవ్వడం కోసం కూడా , యముననది తీరం పై ,షోడశోపచారా లతో ఆ తల్లికి నీరాజనం పట్టడానికి గోప స్త్రీలు అంతా కలిసి , కృష్ణుణ్ణి మధ్యలో ఉంచి ,చుట్టూ తాము గుమిగూడి ,శ్రావ్యంగా  పాటలు పాడుతూ  వచ్చారు.. కృష్ణయ్య కూడా  తనవెంట  తన స్నేహితులను కూడా వెంటపెట్టుకొని వచ్చాడు !  ఎదురుగా , యమునానది పొంగి పొర్లుతూ ,విపరీతమైన వేగంతో ,ఒరవడితో  ,ప్రవహిస్తోంది..!యమున  నల్లగా  ,కృష్ణయ్య వర్ణంలో నే ఉంటుంది కదా ,,! అందుకే యమునా తీర విహారి అయిన  కృష్ణుడంటే ఆమెకు  వల్లమాలిన ప్రేమ భక్తి !, , శ్రీకృష్ణ జననం రోజున మధురానగరి న్7నుండి వసుదేవుడు అర్ధరాత్రి క్రిష్ణయ్యను నెత్తి మీద గంపలో ఉంచుకొని ,గుట్టుగా ,ఎవరికి తెలియకుండా  రేపల్లెకు వెళ్తున్నాడు అప్పుడు  ,తాను  ,పరమాత్మ ను చూసిన పరవశత్వం తో , పరవళ్లు తొక్కి ప్రవహిస్తూ  కూడా  ,స్వామికి,దారి ఇచ్చి ,కృష్ణయ్య  చిన్ని చిట్టి సుకుమార  పాదార విందాలను  తాకుతూ  పరమాత్ముని దివ్యమైన పాదాలను కడిగి ,,జన్మ,ధన్యత పొందింది యమునమ్మ !  ,,,,ఇప్పుడు  మళ్లీ తనను కరుణించ వచ్చిన కన్నయ్యను చూసి , ఆనందంగా పులకించింది ఆ నదీమ తల్లి !  యశోద చిన్నికృష్ణునిపై ప్రేమతో చేతినుంచి.  ,,అతని పద్మాలవంటి నేత్రాల లోకి చూస్తూ.  !"చూడు,,!..కృష్ణా .!  కన్నయ్యా ! మేము యమునాదేవి మాతకు  దీపాలతో  హారతి ఇవ్వడానికి  ,  వెళ్తున్నాము..!ఆ ప్రవాహం ఎంత వేగంగా ఉందో చూశావా..! కన్నా !'అక్కడకు నీవుగానీ ,నీ స్నేహితులు  గానీ ఎవరూ రావద్దు సుమా ....! "అంటుంటే  కృష్ణుడు అన్నాడు ,"",,అమ్మా  ! ఇంత చిన్న దీపాలహారతి, అంత పెద్ద నదికి  ఎలా సరిపోతుంది..?   .అని! ,,,,,,యశోద అంది,,, నిజమే !..కన్నా. ! కానీ .యమునమ్మ మనసు గొప్పది.. !ఎంత చిన్న దీపంతో హారతి ఇచ్చినా ,ప్రేమతో స్వీకరిస్తుంది.....! తెలుసా. ! . మళ్ళీ కృష్ణయ్య ప్రశ్న ! "" అయినా అమ్మా.!. ఆమెకు ఎందుకు ఇలా దీపావళి చేయాలి. ?. చెప్పు ! యశోదాదేవి జవాబు.! ...""కన్నా.! యమునమ్మ చల్లని తల్లి. ! చల్లనిగాలిని, తీయని నీటిని సదా సర్వకాలము ఇస్తుంది..! వర్షాలు ,పంటలతో ,మనం ఆనందంగా జీవించడానికి ,ఈ తల్లి దయనే కారణం..!  అందుకే ప్రతి దీపావళి రోజున మన కృతజ్ఞతలు ఇలా దీపాలు వెలిగిస్తూ.పసుపు కుంకుమాపూజ లతో  పుష్పాలు ,నైవేద్యాలు  సమర్పిస్తూ తెలియజేస్తున్నాము !  నల్లనయ్య తర్వాత  ప్రశ్న ..!.అమ్మా..! ఇక్కడ ప్రవాహంలో నీళ్లు మాత్రమే చూస్తున్నాం  కదా !.మరి  యమునదేవి  రెండు చేతులూ  లేకుండా ఎలా హారతి స్వీకరిస్తుంది...?  తల్లి సమాధానం.. ",కన్నా.!  ఎన్ని  ఆలోచనలు రా  ,,ఈ  చిట్టి తండ్రి కి.  !  యమునదేవి ఒక అపర దేవత ,సర్వ శక్తి సమన్విత !     దయా సింధువు ! ఆమె.. హృదయం నీ వలె నవనీత మ్ ..!. ఉత్తరభారత ప్రాంతమంతా తన దివ్యమైన స్వడు జలాలతో పావనం చేస్తూ  కాలవేగంతో సమా నంగా ప్రవహిస్తూ  ఉన్న శక్తిస్వరూపిని.!. ఈ తల్లి దయఉంట ఆమెను సేవిస్తే ఇలా పూజిస్తే  ,అకాల ప్రమాదాలు ఉండవు....! శాంతి సౌఖ్యం  ఆనందం ప్రసాధిస్తోంది.. మనకు.. ఇక చేతులు అంటావా   ఆమె వైభవ దివ్య స్వరూపం మనం చూడలేము.. మహాద్భుత  దివ్యమూర్తిని మనం సామాన్య మానవ మాత్రులం చూడలేమురా నాన్నా ..అంది... నంద బాలుడు ,మరో ప్రశ్న  సంధించాడు.  " అమ్మా..! యముననది నీరు నల్లగా  ఉందేం ?   అని     ! ,,అమ్మ జవాబు... కన్నయ్యా .ఆమె కాలుని  అంటే యమధర్మరాజు తొగుట్టువు..! అతడు కూడా నల్లనివాడు! , అందుకే అన్నాచెల్లెలు ఇద్దరూ నలుపే...! మళ్ళీ గోపాలుని ప్రశ్న ! ""..అమ్మా ! నేను కూడా నలుపే కదా... .!   అని గోముగా మూతి ముడుచుకున్న  చిన్నికన్నయ్య అలుకను చూసి  తల్లి నవ్వింది, ప్రక్కన ఉన్న గోప  వనిత లు అందరూ విరగబడి నవ్వారు..! నల్లనయ్య స్నేహితులు కూడా నవ్వడం ,గోవిందుని కి చిరుకోపం వచ్చింది..  కొడుకు బుంగమూతి పెట్టడం చూసి  , యశోదమ్మ ,కృష్ణుణ్ణి తన  ఒడిలోకి తీసుకొని బుజ్జగిస్తూ ,అంది...! నాన్నా  ! నా పిచ్చి తండ్రి.! బంగారు కొండా ! ఎవరన్నారు రా నీవు నల్లవాడివాని ? నిన్ను అన్నవాళ్లే నల్లని  వారు.. వారి బుద్ధులు నల్లన.నిన్ను చూసి గెలిచేసిన వీరంతా మసిబూసిన   నల్ల మొహం కల వారే..! లేదురా కన్నా.!. నీవు నల్లనయ్యవి కాదురా !  ఎంచక్కా "చందమామ "వలె నీవు చక్కని  చల్లనయ్యవి. ! . చూడు నా కళ్ళలోకి ! ఎంత అందంగా ముద్దొస్తూ ,దీపంలా మెరిసిపోతున్నావు గదరా చూడు  చూడు.. నిన్ను చూసి ,నీ అందమైన ముద్దు మోము చూసి ,అయ్యో తమకు ఇంత అందం లేదే అని అసూయతో కళ్ళు మండి ,నిన్ను అలా అంటున్నారు కృష్ణా వజ్రాల మూటా. నా వరాల పంటా.  మీరంతా దూరంగా పొండి ! మా బిడ్డకి  మీ దిష్టి తగిలేను.. రోజూ నాకు మీ దిష్టి కళ్లనుండి బంగారు తండ్రిని దూరంగా ఉంచడం నా వల్ల కావడం లేదు..!" అని వారిని అక్కడినుండి తరిమేసినట్లుగా నటించి. " "వెండికొండా !   ఈ గోపికలు తమ కాటుక కళ్ళతో ఎప్పుడూ ,నీ చుట్టే తిరుగుతూ  ,నిన్ను ఎత్తుకుని, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి , ఎప్పుడూ , నిన్నే కళ్ళార్పకుండా చూస్తుంటారు  కదా ! .అందుకే, వారి కళ్ళకాటుక నలుపుతనం .నీ ఒంటికి పట్టిందిరా కన్నా..! అంతే. !  వారెప్పుడూ ఇంతే ! నీవేం  పట్టించుకోకురా కన్నా !  అంది లాలిస్తూ..!   గోవిందుడు  కురిపించే సందేహాల పరంపరకు ,అలుకల చిలుక పలికే పలుకుల్లో ,మాతృత్వ ఆనందాన్ని అనుభవిస్తూ,,.నవ్వుతూ, తుంటరికృష్ణుని కొంటె ప్రశ్నలకు తోచిన సమాధానాలు ఇస్తున్న  నందరాణి ని ,ఆమె ఒడిలో బుద్ధిగా  కూర్చుని  ఉన్న నందనందనుని సోయగాలను దూరంగా నిలుచుని గోపగోపీజనం  తనివితీరా చూస్తోంది సృష్టిలోని  ప్రకృతిఅందాలు ఆనందాలు కలబోసి పోతపోసినట్లుగా  ఎదుట అగుపిస్తున్న , ఆ భువనైక మోహనాకార   సుందర సౌందర్యరూపాన్ని , ఆనందకరమైన  ముగ్దమోహన  సుకుమార ,నీలమేఘశ్యాముని అందచందాలను ,,ముద్దుగోపాలుని  నల్లని జుట్టునీ, అందులో మెరిసే నెమలి పించాన్ని  ఫాలభాగాన దిద్దిన కస్తూరీ తిలక ధారణ తో, విరిసిన పద్మాల రేకులవలె విచ్చుకుని ఉన్న ఆ విశాల నేత్రాలను ,,సన్నని సంపెంగ లాంటి నాసికాగ్ర భాగాన తారవలె ప్రకాశించే నవ మౌక్తిక కాంతులను,,  ముద్దుగారే అరవిందాలను మరపించే ,చిరునవ్వులు చిందిస్తున్న కృష్ణయ్య  ఎర్రని లేతచిన్ని పెదవులను  ,, చంద్రకాంతుల ప్రకాశంతో మెరుస్తున్న నునులేత చెక్కిళ్ళ  సొగసులను.. మెడలో ని వైజయంతి మాలను ,కంఠసీమలో తళతళ మంటూ కాంతులు చిందే కౌస్తుభమణి ని ,చంద్రకాంత మణి దివ్య శోభలను తలదన్నే సుందర వదనానికి   రెండుప్రక్కలా చెవులకు వ్రేలాడుతూ ధగ ద్ద గాయమానంగా మెరుస్తున్న స్వర్ణమకర కుండాలాలను  , సూర్యోదయ వేళలో ఉష కాంతుల్లో ,చుట్టూ విద్యుల్లతా కాంతుల ప్రకాశంతో  వివిధ రంగుల్లో శోభించే నల్లనిమేఘంలా ,తల్లి ఒడిలో ఒదిగి  హత్తుకొనిఉన్నా ,కూడా, తమను దొంగ చూపులు చూస్తూ ,పెదాలపై చెరగని చిరునవ్వుతో అలరించే బాలకృష్ణ సౌందర్యాన్ని  వారు ఆనందంగా ,చూస్తున్నారు  ,ఆ మెరిసే నీలిమేఘశ్యామసుందరుని మంగళక ర విగ్రహం , దర్శిస్తూ ,పరవశిస్తూ ,మనసును కృష్ణద్యాన భావచిత్తంతో నింపి , మేనులు మరచి ,చేష్టలు డిగి ,"శిలాప్రతిమ "ల వలె ఉండిపోయారు.!. అవి వారి ఎదలోనుండి  పాలపొంగులా , పొంగి పొర్లుతున్న  అవ్యాజమైన శ్రీకృష్ణ ప్రేమానురాగాల వెల్లువల తరంగాల భావనా వీచికలు !అపరిమితానంద  డోలికలు.. !    ....అలాంటి సుందర సన్నివేశ దర్శనా భాగ్య సమయంలో ,,కృష్ణుడు వారి దృష్టిని మరలిస్తూ  , ఇంకా మారాం చేస్తూ తల్లి కొంగు పట్టుకొని ,".అమ్మా ! నేను కూడా  మీతో వచ్చి హారతి ఇస్తాను ! "" అనగానే యశోద భయపడుతూ , " అమ్మో ! .అటు చూడు !  ,సుడులు తిరుగుతూ, కళ్ళు తిరిగే  ఆ నీటి ప్రవాహం ఎంత. వేగంగా ప్రవహిస్తోందో ..? .పెద్దవాళ్ళం !  మాకే  ఇంతభయం వేస్తోంది..! కన్నా .!.చిన్నపిల్లాడివి. ! అది .నీకు తెలీిదురా కన్నా  !బుద్ధిగా ఇక్కడ కూర్చోరా  ,నాన్నా..!అంటుంటే  మళ్ళీ అంటున్నాడు.."". అమ్మా! అమ్మా !నాకో సందేహం..! నేను నల్లన!..ఈ అమావాస్య చీకటి నల్లన..! చుట్టూ నల్లన ! .మరి ఈ చీకట్లో నన్నెలా గుర్తు పడతావు...? అంటే అమ్మ అంటోంది మురిపెంగా ! ""... కన్నయ్యా. !నీవు నా ప్రాణం!. నా నోములఫలం!..ముక్కోటి దేవుళ్ళు ఇచ్చిన వరం.రా నువ్వు..! .ఇదిగో  ! ఆ నల్లనమ్మ ,, ఈ నల్లనయ్యను, .మా పూర్వజన్మ ల పంటగా అనుగ్రహిస్తూ ,నిన్ను   గుర్తించే శక్తి ని లాలించి ,ఆనందించే వైభవాన్ని  ఈ తల్లికి  ,ఈ రేపల్లెలోని గోప గోపి జనాలకు  అందరకీ ఆ జగన్మాత ఇచ్చిందిరా , కన్నా.మాకు ! కృష్ణా .! నీ నీలమేఘశ్యామసుందర అందాల ఆనందాల రూపం ,ఈ చీకట్లను దూరం చేసే ఇంద్రాణీలమణుల కాంతులను వేదజల్లుతూ నీ వద్ద నుండి వెలువడే దివ్యజ్యోతుల ప్రకాశం ముందు,, కన్నయ్యా. !మా చేతుల్లో ఉన్న దొన్నెల దీప జ్యోతుల కాంతులు వెల వెల బోతున్నాయి కదరా!   నాకే కాదు.,!,. ఈ యమునాతీరములో ఉన్న  పూలమొక్కలకు ,తరువులు   ,పొదలు ,వృక్షాలకే కాదు. ,, ఇక్కడ సంచరించే  సకల జీవ జంతు సముదాయాలకు,..కూడా ఆనందాన్ని అందిస్తున్న అందాల ముద్దుల చిన్ని కృష్ణ జ్యోతివిరా  నీవు !  .మాకే  కాదు.!,రేపల్లె గోపగోపికల ఆశా జ్యోతివిరా, కన్నయ్యా..నీవు..!  అందుకే.  ఈ దీపావళి ,మనకు నిజమైన పండగ  రోజు.! ఈ వేడుకలు, ఆ పరమాత్ముని కి మేము సమర్పించుకునే నీరాజనాలు!. ఎన్ని ఆపదలు రానీ , .ఈ దీపాల దివ్యకాంతులతో .,.ఆ పరమాత్ముని గుర్తించే  జ్ఞానాన్ని, బుద్దిని ,,తనపై చెదరని అపారమైన ప్రేమానురాగాలను కరుణించమని ,రేపల్లె వాసులను శాంతి సౌఖ్యాలతో. మా చిన్నికృష్ణుని చిరునవ్వుల వెన్నెల వెలుగుల్లో, ఆనందంగా బ్రతుకులు గడపాలని..,, అందుకు , ఆ  జగదాంబ ను కోరుతూ భక్తితో   అందిస్తున్న  హృదయపూర్వక ధన్యవాదాలు   !..ఈ దీపసముదాయ వైభవ కాంతులతో  ,ఎదుట కనిపించే జగన్మాత యమునదేవికి..  తెలియజేసుకుంటున్నాం .! అల్లరికృష్ణా !నీకు.ఇంకా అడగాలని ఉంటే.,. తర్వాత చూద్దాం  !సరేనా..! ఇక మేము వెళ్తున్నాము ! జాగ్రత్తరా ,, కన్నయ్యా...! ""అంటూ తల్లి యశోదదేవి కన్నయ్య రెండు చెక్కిళ్ళపై నుదుటిపై ముద్దుల తో ముద్దుగా ముద్దుపెట్టుకుంది. ఆహా ఏమి భాగ్యము ఆ యశోదాదేవి ది.. బ్రహ్మాండాల ను బొజ్జలో నుంచుకొని ,విశ్వాన్ని తన కేళీ విలాస, నటనా చాతుర్య కౌశలా ప్రదర్శనతో విశ్వరూపుడై ,అన్నీ తానై ,,తానే అన్నీ అయినా కూడా ,దేనికి అంటకుండా కేవలం సాక్షిభూతమై ,జగన్నాటక సూత్రధారియై ,,విరాజిల్లే విశ్వాత్ముడు నేడు ఇప్పుడు ఇక్కడ ,ఈ  సంధ్యా సమయంలో ,"తల్లి గాని తల్లి "కి  "తనయుడు కాని తనయుడు "  అయ్యి ఆమె చనుబాలు త్రాగే పసివాడి గా నంద గోకులంలో ఇలా,వర్ధిల్లుతున్నాడుఆ జగన్నాథుడు  , ! పాపం, కన్నయ్యకు తాను కన్నతల్లిని  కాదని తెలియక పెంచినప్రేమతో   కన్నయ్యపై అమితంగా ప్రేమానురాగాలు పెంచుకున్న ప్రేమ పిచ్చి తల్లి కి  ,అపారమైన అఖండమైన అవ్యాజమైన తరగని కీర్తిని , తనపై చెదరని భక్తిని ప్రేమను వాత్సల్యాన్ని   యశోదామాతకు ప్రసాదించాడు..శ్రీకృష్ణ పరమాత్మ !  ఆ విధంగా ,ఆమె పూర్వజన్మల పుణ్య తపః ఫలం  ఇదిగో ఈ విధంగా కృష్ణయ్య రూపంలో , ఆమెకు  అనుభవానికి  వచ్చింది.!. పెట్టి పుట్టింది.  .ఆ తల్లి పరందాముని అనురాగాన్ని ఆశించి ,తపించి   ,సాదించుకుంది,సాక్షాత్తు మహావిష్ణువే పుత్రునిగా అవతరించి   పుత్రప్రేమ ను పొంది మాతృత్వ మాధుర్యాన్ని అందులో దివ్యత్వాన్ని ,పొందుతూ తరిస్తున్నది   ,అందుకే తన ముద్దులకృష్ణుని మోము చూస్తూ ,మధ్యలో  మళ్ళీ మరలి మరలి  వెనుకకు తిరిగి చూస్తూ. ,క్రిష్ణయ్య సమ్మోహన రూపసందర్శనం నుండి చూపులు మరల్చుకోలేక ,వెళ్తుంటే.. వెన్నదొంగ, చిలిపిగా ,చాటుగా  నవ్వుకుంటున్నాడు.  తోటివారిని దగ్గరకు పిల్చుకుని  ,వారిని  తన ఆటపాటలతో  అలరిస్తుండగా కృష్ణుణ్ణి  చూస్తూ ,తాను చెప్పిన చోటునుండి కృష్ణుడు లేవడం లేదు కదా. !. అన్న ధైర్య తో  ముందుకు వెళ్ళింది   యశోదాదేవి ,, యమునా తటికి !  తోటి గోపికలతో కలిసి ,  యమునదేవికి షోడశోపచారాలతో సేవలు సమర్పిస్తూ  యమునదేవి  రూపాన్ని  ,దుర్గాభవాని గా హృదయంలో భావిస్తూ పూజించారు  ,చివరకు అందరూ కలిసి శ్రావ్యంగా , మంగళహారతి పాటలు సామూహికంగా చదువుతూ. , దీపాలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి , నివేదనగా జున్ను ,వెన్న లను ఉంచి , సేవించి , భక్తితో ,యమునా నదీ నీటిలో వదులుతూ ,గోప వనితలు అంతా కలిసి నమస్కారం చేశారు...! అయితే విచిత్రంగా ,దీపపు దొన్నెలు, నీటి ప్రవాహావేగానికి  తీరానికి దూరంగా పోకుండా.. అన్నీ ఒడ్డుకే తిరిగి ఒకే చోటుకే  వస్తున్నాయి..! ఈ "వింత ఏమిటని .'!"" అందరూ  వెళ్లారు అక్కడికి.. దీపాల వద్దకి ! అశ్చర్యంగా అక్కడ  , ఒడ్డున యమునజలాల లో కృష్ణుడు నిలబడి ఉన్నాడు..! ఆ దీపాలన్నీ అతని చుట్టూరా  తిరుగుతూ అతని వైపే వెలుగుతూ ,కాంతులను వేదజల్లుతూ ఉండటం కూడా గోపకాంతలు చూశారు..విస్మయంతో ! వెంటనే, యశోదాదేవి పరుగున వెళ్లి నీళ్లలోకి దిగి ,దీపాలను చూస్తూ ఆనందిస్తున్న కన్నయ్యను .చేతులలో కి  ఎత్తుకొని,  ఆలస్యం చేయకుండా ఒడ్డుకు వచ్చేసింది.! కన్నయ్య ఒక్కడే అలా లోతైన నీళ్లలోకి దిగడం చూసి యశోదమ్మకు   చాలా భయమేసింది..!ఇప్పుడు,... ఆమెకు కృష్ణుని పై , నిజంగానే  "కోపం" వచ్చింది .! "కన్నా!. నేను నీకేం చెప్పాను.?.నువ్వేం చేస్తున్నావు రా.?. నానా..! సుడులు తిరిగే  ఈ యమునా నదిలోకి  ఈ చీకటి పూట వెళ్లవద్దురా  అన్నానా. ?. ఎందుకు వెళ్లావు చెప్పు..?  అని గద్దించి అడిగింది..! కృష్ణయ్య భయం నటిస్తూ  , తత్తరపాటుతో.. అన్నాడు..,,"" అమ్మా..!  నీవు చెప్పినట్లు అక్కడే ఉన్నాను ! .. కానీ,  మీరు నీళ్లలో  విడిచిన ఈ దీపాలన్నీ  ,నేను ఉన్నచోటికె వస్తున్నాయి ..,,నేనేం చేయను , అమ్మా..!??  ,, పైగా.. మీరు దీపాలతో హారతులు ఇస్తుంటే ,నాకు కూడా ఈ యమునా నదీ మతల్లికి మంగళహారతి పట్టాలనిపించింది..,,!  అమ్మా..! అలా చూడు ! ఆ నల్లని యమునమ్మకు  ,ఈ నల్లనయ్య ను చూస్తుంటే ఎంత సంతోషమో... ? మీరిచ్చిన దీపాలన్నీ నావద్దకే తెచ్చి  తనకు హారతిపట్టే అదృష్టాన్ని నాకు కలిగించింది కదా ,, ! అమ్మా  ! "అని నవ్వుల పూవులు కురిపిస్తున్న కృష్ణుని అమాయకపు  ముద్దు మొహాన్ని చూసి..,,.  "అమ్మో.. !ఇంకా నయం..! నీవు  నీటి లోతుకు  పోలేదు.. !ఈ రోజు  నీకు ఒక పెద్ద జలగండం తప్పిందిరా, కన్నా ..!ఇంటికెళ్లాక దిష్టి తీయాలిరా నాన్నా .! ఈ చీకటి రాత్రి. ! ఆ లోతైన నల్లని నీళ్లలో ఎంత భయపడ్డావో కదా ..! ""అంటూ కన్నయ్యను గుండెకు హత్తుకొని   ప్రేమతో , ముద్దులు కురిపిస్తూ ,  వెంట వస్తున్న గోపాలకుల ,గోపికల ,సందడితో ,తమ రేపల్లె గ్రామం వైపు  వెళ్తున్న యశోదాదేవి భాగ్యాన్ని  ,చూస్తూ ఆమెను వేనోళ్ళ పొగిడింది యమునాదేవి..!  ఆనాడు,  "కృష్ణ జననం  !"రోజున , కోటిమన్మధకారుడు ,సచ్చిదానంద సుందర విగ్రహ స్వరూపుడు , జగన్మోహనకారుడు సాక్షాత్తూ, మహావిష్ణువు పరిపూర్ణ అవతారుడు,,,షోడషకళా నిధి ,సకల గుణసంపన్నుడు  ,,వేదపురుషుడు ,అయిన ఈ  బాలశ్రీకృష్ణుని చిన్ని చిన్ని  పాదాలను   స్పర్శిస్తూ, తననీటి ప్రవాహం లో ,ఆ  కృష్ణ పాదాలను  మృదువుగా తన స్వాదు జలాలతో అభిషేకించుకొని., ఆవి శిరస్సు పై ధరించే  సౌభాగ్యాన్ని. . తలచుకొంటూ యమునమ్మ   పులకరిస్తోంది.!. ఈ రోజున  ఈ విదంగా ,ఆ గోపికలు అందించిన దీపాలతో శ్రీకృష్ణ భాగవానునికి  దివ్యమైన మంగళహారతిని పట్టి,   భక్తితో అతని  చరణ కమలాలను తాకి నమస్కరించి సేవించుకునే  మదురక్షణాలను మరచిపోలేకుండా ఉంది...! అంతులేని ఆనందాన్ని అందించిన గోప స్త్రీలకు కృతజ్ఞతతో ,వారికి దీర్ఘ సుమంగళత్వాన్ని ,సౌభాగ్యాన్ని ప్రసాదించింది కూడా...! ఆ విధంగా తనను కరుణతో  అనుగ్రహించిన  నందకిశోరుని కరుణా కటాక్ష వీక్షణాలకు  పరవశిస్తూ., పారవశ్యం తో జలజలా ప్రవహిస్తూ , శతకోటి ప్రణామాలు మదిలో సమర్పిస్తూ.. ఆనందామృత తరంగినుల  మువ్వల సవ్వడులతో, భక్తి తరంగాల సమర్పణా భావం తో , కూడిన ప్రవాహ వేగంతో  అదే తన్మయత్వం తో ,ఇంకా  శ్రీకృష్ణ సందర్శన అతిశయంతో ,,బృందావన దివ్య గోలోక స్వర్గ ధామం సమీపంలో మీరాబాయి ,రాధాదేవి ల వలె కృష్ణప్రేమతత్వ ఆరాధనా సక్తితో ,భక్తి భావాలు వెదజల్లుతూ, ,ప్రవహిస్తూనే  ఉంది.!  ,శ్రీకృష్ణ ఆంతరంగిక భక్తురాలు ,,ఈ ,యమునాదేవి.!.! చిన్ని కృష్ణయ్య బాల్యక్రీడలు ,,ఈ యమునతీరం లోనే ఆనందంగా అందంగా ,అద్భుతంగా అపురూప వైభవంగా జరిగాయి!. రేపల్లె ,గ్రామం , బృందావన దివ్య సీమ , ,మధురానగర  వాసులతో బాటు  ,మన కృష్ణయ్య ఆటపాటల్లోని అనురాగం పండించి ,వారందరి తో  తీయని తరగని పెన్నిధి గా అనుబంధాన్ని పంచుకుంది. శ్రీ కృష్ణుని దివ్య లీలలను , బాల్యక్రీడలను   సా మూలాగ్రం ప్రత్యక్షంగా దర్శించింది  యమునదేవి . !గోపాలకులంతా ఇదే యమునాజలాల్లో  స్నానం చేస్తూ ,ఇక్కడే  ఆడుకుంటూ,  పాడుకుంటూ , తింటూ ,త్రాగుతూ..  ,తిరుగుతూ , ,కృష్ణ పరమాత్మ తిరుగాడిన  ,అతడి పదారవిందాలు సోకిన  ఇదే ఇసుక తిన్నెలపై , పడుకుంటూ , ఈ  యమునా తీరంలోని పచ్చిక బయళ్ల లో తమ  ఆలమందలను మేపుతూ.  ఆనందంగా  గడిపారు.. అపర,గోలోక  వైభవాన్ని  తలపించి మురిపించి ,మైమరపించే బృందావన భూముల ధూళి కణం  ఒక్కటి చాలు ,శ్రీకృష్ణ చిత్తద్యాన పరాయణులకు... ఈ ఆధ్యాత్మిక భావ సంపద ,కృష్ణ చైతన్య  ముసకల సృష్టిని సమ్మోహింప జేస్తూ ,తన దివ్యాలీలా వైభవం తో   ఆనందింప జేశాడు! ,,ప్రకృతి అందాల సోయగాలను  ని , ,చరాచర జగత్తును ,శ్రీకృష్ణుడు, తన వేణుగానమధురిమతో పులకింపజేసింది ఇదే యమునతీర ప్రాంతంలోనే  !  గోపికల తో రాసలీలా మహోత్సవ వైభవం ప్రదర్శించి,, తాను ఒక్కడైనా ,వ్రజవనితలు ఎందరో , అన్ని శ్రీకృష్ణ దివ్య రూపాలతో సాక్షాత్కరించి , ,వారిని కేళి విలాస అభినయ ఆనందానుభూతుల తరంగాల డోలికలో ఒలలాడించింది ఇదే యమునా పులింద  వనతీర ప్రాంతంలోనే ! పరదేవత, ప్రేమమూర్తి ,శ్రీకృష్ణుని ఆరాధ్యదేవత ,బృందావన పట్టపు రాణి. , కృష్ణుని కోసం ,గోలోకం నుండి దిగివచ్చి .కృష్ణప్రేమకు తన సర్వస్వాన్ని ధారపోస్తూ ,యోగినిలా జీవించి తరించింది ఇక్కడే.కదా !  అలా గోలోకం లో చిదానంద స్వరూపిణిగా భాసించిన రాధాదేవి ఇక్కడే ఇదే యమునా తటాన కృష్ణ విరహతాపంతో ,, కృషుణ్ణి తనవాడిగా జేసుకుంది ! నిష్కలంకమైన  తనప్రేమతో "భగవద్ సాక్షాత్కారం పొందవచ్చును ! " అని తన రాధామాధవ అద్వైత భావనా జీవన విధాన  వైభవంతో , తోటి గోపికల జీవితాలను ఉద్దరిస్తూ,కృష్ణ చైతన్యాన్ని చాటింది ఇక్కడే ,!  ..అలా  అవ్యాజమైన వారి భక్తి విశ్వాసాలకు కృష్ణుడు  కరుణించి, ,బ్రహ్మానందాన్ని అనుగ్రహించింది ఇక్కడే ,,,ఈ పవిత్ర పావన యమునా తీర ప్రాంతంలో నే.! .కాళీయనాగుని గర్వం అణచి ,,నాట్యకళా భి నివేశంతో ,అద్భుతంగా కాళీయనాగు ఫణిపై ,రేపల్లె వాసులే కాకుండా ,దివినున్న దేవాదిదేవతలు  సంతోషంతో కృష్ణయ్య  నాట్యకౌశల్యానికి  అనుగుణంగా నృత్యం చేస్తూ ,పుష్పవర్షం  కురిపిస్తూ ఉండగా  ,అపర నాట్యాచార్యుడుగా ,సంగీత శాస్త్ర సకల కళా కోవిదుడుగా ,ఆకాశంలో దేవ గంధర్వులు సంగీతాన్ని వినిపించగా , దానికి అనుగుణంగా నట సామ్రాట్,  శ్రీకృష్ణ పరమాత్ముడు ,ఇదే యముననదీ తరంగాల మృదంగాల సవ్వడులు ,గతి తప్పకుండా ధ్వనించగా ,  భయంకరమైన కాళీయుని పడగలపై ,వివిధ గతులలో ,తాళబద్దంగా  భరత శాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ అభినయిస్తూ  చిన్నికృష్ణుడు  ప్రదర్శించిన  అద్భుతమైన అభినవ ఆనంద సుందర నాట్య విలాస వైభవమును గాంచి ,ప్రకృతి పులకించింది ,దేవగణాలు హర్షాతిరేకం తో పూలవాన కురిపించారు.. నెమళ్లు  పురి విచ్చుకుని  సంతోషంగా గంతులు వేశాయి.  రేపల్లె వాసులు , గోబృందం ,విరులూ తరువులు, చెట్లూ చేమలు , చల్లని యమునా తరంగాల ఒరవడిని తాకుతూ వీచే చల్లని పిల్లవాయువుల వింజామర వీవనల మధ్య. ,,మృదువైన పెదాల నుండి రాధాదేవి ప్రేమామృత ధార  ,వంశీ లోలుని  సుమధుర సుస్వర సంగీత ఝరికి ప్రాణం పోయగా. వేణువును  తన ఆధారాలపై మధురంగా కదిలించాడు రాధా మనోహరుడు. అలా భువనమోహన సంగీత విభావరితో తన అద్వితీయమైన ,నాదరూప బ్రహ్మ తత్వాన్ని ,మురళీ గాన దివ్యానంద లహరితో ,ప్రకృతి ,పురుషులు రెండూ  అద్వైత ఆనందామృత  అమృతప్రేమమయ  దైవ స్వరూపాలని  ,బ్రహ్మ  పదార్థాలుగా కీర్తింప జేశాడు ..బాల్యంలోనే అంత అద్భుతమైన ఆనంద తాండవ నృత్యం చేసింది  ఇక్కడే!  ,ఇదే యమునాదేవి అమృత స్వాదు జలాల్లోనే.  !.ఏ గోపాలకృష్ణుని దివ్యచరితలను, అద్భుత లీలా వైభవాలను బ్రహ్మాదులకు కూడా  వర్ణించతరము కాదో  ,అట్టి శ్రీకృష్ణ మంగళకర ఆనంద మయ, భవ్య ,దివ్య లీలలను ప్రత్యక్షంగా దర్శించి ,అనందిస్తూ ,ఆ బ్రహ్మానందాన్ని నిత్యం గ్రోలుతూ,ఆ మదురసుధారసానుభూతితో పరవశిస్తూ ,పరవళ్లతో పరుగులు తీస్తూ  నిరంతర శ్రీకృష్ణ లీలామృత పాన చిత్తంతో,  పరమానందాన్ని, అందులో ధన్యతను  పొందుతూన్న పరమ పావన ధన్య చరిత , మన ఉత్తరభారత ,ఉత్తర ప్రదేశ్  , పుణ్య ధాత్రిలో,జీవనదిగా ప్రవహిస్తూ అక్కడి జీవకోటి ప్రాణాధారమై ,,అక్కడి భూములను సస్యశ్యామలం చేస్తూ  ,ఉంటున్న యమునాదేవి నదీమతల్లి కి ,, శతకోటి నమస్కారములు   ! గంగా గోదావరీ కృష్ణ ,యమునా మొదలగు నదులు,, ఎక్కడో హిమాలయాలలో పుడతాయి ,సముద్రంలో కలుస్తాయి.!. కానీ వాని ప్రయాణంలో కష్టాలు ,కడగండ్లు!. అంటే బండలు కొండలు అరణ్యాలు ,ఇసుకదారులు , కొండలపైనుండి  లోటు తెలియని అగాధాల గుండా   ,ప్రయాణం చేస్తూ ఉంటాయి. !విశ్రాంతి ఉండదు ,ప్రయాస తెలియదు..! భారం బరువులు తెలియవు.! కేవలం జీవకోటికి ,తన స్వాదు జలాలతో ప్రాణశక్తిని కలిగించడం.,బీడు భూములను  సుక్షేత్రాలుగా మారుస్తూ , ,తన తీయని నీటిధారలతో  పుష్కలంగా పంటలు  పండించి పోషకాహారం అందించడం.. వారి ఆనందంతో తాము ఆనందాన్ని  పొందడం ,తమ నిర్మల నిర్వికార సత్వ గుణ సంపద భావంతో  తమ జీవన స్రవంతి విధానం ద్వారా ,,త్యాగ గుణం లో ఉండే అద్భుతమైన దైవ సంపత్తిని మానవాళికి  అందించడం  ,మనం నేర్చుకోవాల్సిన పాఠాలు..!నిత్యమైన  జీవన సత్యాలు ,!  అందువలన ఈశ్వర శాసనంగా ,పరోపకారమే తన పరమార్థంగా తన సుదీర్ఘ,ప్రయాణంలో అలుపెరుగని   పరాశక్తి ,,  సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లికి కోటి కోటి దండాలు సమర్పిద్దాం !  శక్తిని అనుగ్రహించి ,జీవకోటిని తన దయతో కరుణిస్తూ ఉన్స అమేయ శక్తి సంపన్నుడు ,పరమ దయాలువు ,,అయిన దేవకీసుతుని  నయనమనోహర సురుచిర సుందర మందహాస వదనారవిందాన్ని  మన  హృదయంలో భావిస్తూ , సాష్టాంగప్రమాణాలు సమర్పించుకుందాం... ! హే రాధా మానసచో రా ! గోవిందా !హే,,,బృందావన విహారా ,!వనమాలీ !  గోపాలా ! ,,హే,యమునాతీర సంచారా ! గోపగోపిజన మానస చోరా ! ,,, హే నందయశోదా నంద సుందరాకారా  ,!  నందనందనా !  హే  గోపాలకృష్ణ  ,! నీకు మంగళములు..,  !  స్వామీ ! నిన్ను ఎంత వర్ణించినా, ఎంత భావించి ,సేవించినా ,తనివితీరని నీ తలపులకు మా హృదయాలు నెలవులు కావాలి !,,,అనునిత్యం నిన్ను స్మరించి తరించే జీవన విధానం మాకు  ఉండాలి ! మా ఈ ఆర్తిని ,గ్రహించి ,నీ లీలా వైభవ సందర్శన భాగ్యాన్ని అనుభవించి తరించే మధుర క్షణాలను  అనుగ్రహించు..! తండ్రి ! రాధా వల్లభా ,!,వేణుమాధవా ,!"" జయం !శుభం ! స్వస్తి !

సుగుణాభిరాముడు

సుగుణాభిరాముడు శ్రీరాముడు.. ! వనవాస దీక్ష ముగించి తిరిగి అయోధ్యా నగరానికి వచ్చాక తన కన్నతల్లి కౌసల్య కంటే ముందుగా పినతల్లి కైకమ్మకు మోకరిల్లి కృతజ్ఞతలు తెలియజేశాడు.." అమ్మా! నీవు నన్ను అడవికి పంపకుండా ఉంటే నేను చాలా నష్టపోయేవాడిని. తల్లీ ! . నన్ను  అలా వనవాస దీక్ష అన్న నెపంతో పంపించి నాకు మహోపకారం చేశావు. నీ రుణం ఎలా తీర్చుకొనగలను మాతా. !? నీ కరుణ అపారం.. అమ్మా ! " అంటూ ఆమె చెంత కూర్చుండి.. తాను అడవిలో పొందిన అనుభవాలు అనుభూతిని చెబుతాడు.. ఈ విదంగా చెప్పడంతో కైకమ్మ లో ఉన్న దుఃఖం ,అపరాధ భావన తగ్గాయి. నా విషయంగా వీరు అడవుల పాలైరి కదా ! అన్న పరితాపం తగ్గింది..కన్నతల్లి కంటే తనకు రాముడు ఇస్తున్న ప్రేమాభిమానాలు ,గౌరవమర్యాదలకు ఆమె హృదయం ద్రవించింది. ఆనందంతో  రామయ్యను  అక్కున చేర్చుకుంది.. ఇంతకష్ట పెట్టినా కూడా తనపై ఈగ వాలకుండా ,ఎవ్వరూ పల్లెత్తు మాట అనకుండా కట్టుబాటు చేసిన రాముని అమృత హృదయం చూసి ఇంతటి ఉదారుడు వీరుడు స్థితప్రజ్ఞతకలవానికి తల్లి అయినందుకు పొంగిపోయింది. రాముడు ప్రేమతో  ఇంకా విస్తారంగా  దీక్షలో జరిగిన సంఘటనలు చెబుతూ.. ""అమ్మా  !   భరతుని వంటి తమ్ముడు నాకు లభించడం నా అదృష్టం ! ఇలాంటి తమ్ముడు ఎవ్వరికీ ఉండడు.. ఉండబోడు కూడా !  భరతుని కి అన్నగా కీర్ట్ గాంచడం నాకు ఎంతో ఆనందంగా ఉంది సుమా ! భరతుడి మహత్తును, ప్రభు భక్తిని, సోదరప్రేమను ,,త్యాగనిరతి ని,, నాపట్ల తనకున్న అవ్యాజమైన ప్రేమను అనురాగాన్ని  నీ వల్లనే విఖ్యాతి గాంచాయి కదా. !అలాగే తమ్ముడు లక్ష్మణుని అచంచలమైన  స్వామి భక్తి. నాకు రక్షణ కవచం గా  ఉండి విజయోత్సాహం తో తిరిగి రావడం నీ ప్రోద్బలంతోనే కదా.. అమ్మా.  !ఇదిగో హనుమ ! అతడి భుజబల పరాక్రమం ,నాపై అతడి అపారమైన విశ్వాసం , అతడి అకుంఠిత పౌరుషం తో కష్టాలలో మునిగిపోయిన మా ప్రయాణం తిరిగి సుఖాంతం  చేశాయి ఇంతగొప్ప ఉపకారం చేసిన మహానుభావుడు హనుమ  కేవలం నీ సంకల్పం వల్లనే మనకు లభించాడు కదా..! అలాగే సుగ్రీవుడు ,విభీషణుడు. మమ్మల్ని  అన్ని విపత్తులనుండి సంరక్షించారు వారు ! ఇలాంటి ప్రాణమిత్రులు అమ్మా  ! నీ దయచేతనే నాకు దొరికారు కదా.  ! అంటూ  కష్టాల్లో సహకరించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతూ వారి శౌర్యాన్ని బుద్ధికుశలత ను వేనోళ్ళ ప్రశంసించాడు   .చివరన సీతా సాధ్వి లాంటి ప్రేమమూర్తిని,తన వెంట పంపించడం వల్లనే ఆమె పాతివ్రత్యం,, సౌశీల్యం, సహధర్మ చారిణి వ్రతం. ఇవన్నీ  కీర్తింప బడటం , అమ్మా !  కేవలం నీ అపారమైన అనుగ్రహం మా మీద ఉండడం వల్లనే కదా. ఇంత గొప్ప కీర్తిని ,యశస్సును కరుణించిన నీ వాత్సల్యం చిరస్మరణీయం !!" అమ్మా! అంటూ ఆనందాశ్రువు లు రాలుస్తూ. పినతల్లికి హృదయాంజలి ఘటించాడు రఘురాముడు.!. వారు.వనవాసము చేస్తున్న రోజుల్లో ఒకసారి లక్ష్మణుడు అంటాడు. అన్నగారితో.. !""" సాధారణంగా లోకంలో ,  కొడుకులకు తల్లి గుణాలు ,కుమార్తెలకు తండ్రి గుణాలు అబ్బుతుంటాయి.. కానీ భరతుని కి మాత్రం తల్లి స్వభావం రాలేదు.. అని !  " అన్నాడు  ఆ మాటలు రాముడిని అమితంగా బాదించాయి. విపరీతమైన కోపం వచ్చింది  లక్ష్మణా !నన్ను ఏమైనా అను ! కానీ ఆమెను అంటే నీవు నాకు దూరం గా ఉండాల్సి వస్తుంది. అలా దూషించడం నేను ఏమాత్రం  సహించను  ! నా తల్లికౌసల్య కంటే నాకు పినతల్లి కైకమ్మ మీదనే నాకు ఎనలేని ప్రేమ  ! అది నీకు తెలుసు కదా !నాకు ఆమె ఎదో "నష్టం ,కష్టం" కలిగించింది అని నీవు అనుకోవచ్చు ! కానీ నేను అలా అనుకోడం లేదు..నీకు ఇష్టం లేకపోతే అయోధ్యకు తిరిగి వెళ్ళు ! కానీ ఆమెను  అలా కించపరచి మాట్లాడితే మాత్రం ఇకముందు  నేను సహించను. !అని కోపిస్తే లక్ష్మణుడు అన్నగారి పాదాలు పట్టుకుని క్షమించమని కోరతాడు. కన్నీళ్ళతో ..!  అంతటి దయాగుణం ,శత్రువునైనా దగ్గరికి తీసే క్షమా గుణం శ్రీరామచంద్రుని స్వంతం! సహజం ,!మహోన్నతం.! కష్టాలెన్ని రానీ, ధర్మం తప్పని ఆదర్శపురుషుడు! ,సీతారాముడు..! ధర్మావతారుడు!,జగదాభిరాముడు...! శరణాగతవత్సలుడు,! సాకేతసార్వభౌముడు!.అందుకే రాముని కథలు యుగ యుగాలకు కూడా  రమణీయం ,!కమణీయం ,!మహోన్నతం.!.! ఆదర్శనీయం...!

రామాయణం లో ప్రేమ

రామాయణం లోని శూర్పణఖ  --శ్రీలంక కు, సింహళం ద్వీపానికి చెందిన  రాక్షసజాతి వనిత. ! వారికి కట్టు బొట్టూ ఉండవు ,వావి వరుసలు అసలే ఉండవు.నేడు Valentine s day అనే ప్రేమికుల రోజు న,అందరూ ప్రేమ కేవలం యువతీ యువకులకు మాత్రమే స్వంతం అయినట్టుగా,ఉత్సాహంతో ఉత్సవం చేస్తున్నారు.. మిగతవయస్సు వారు దానికి మినహాయింపుగా పరిగణిస్తూ ఉన్నారు. శూర్పణఖ లాంటి ఒక స్త్రీ ,రాముని లాంటి ఒక పురుషుని చూడటం. ఆమె ఇష్టపడటం అలా . I love you ,అనే సంస్కృతిని ప్రచారం చేస్తూ.తన ఇష్టానికి అడ్డువచ్చిన సీతమ్మను ,లక్ష్మణుడిని చంపేసి. తామిద్దరు సుఖంగా ఉండడం కోసం. ఏమైనా చేస్తూ ,దేనికైనా తెగిస్తూఉండే జాతి అది !. చివరకు తాను ప్రేమించిన ప్రియుడు తనకు దక్కలేదన్న అక్కసుతో, అటు సోదరులైన ఖరదూషణులను,రావణాది రాక్షస జాతి సర్వనాశనానికి కారకురాలైన  దుస్సాహసి ఆమె !  శూర్పణఖ ప్రేమ ఎంత ఘోరాన్ని తెచ్చి పెట్టిందో రామాయణం చదివి తెలుసుకోవాలి .. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతోంది.!.  తల్లీ,తండ్రి ప్రేమ కొరకు రాముడు,!.సోదర ప్రేమతో భరత లక్ష్మణ శత్రఘ్నసోదరులు!..రాముని మిత్రప్రేమకోసం సుగ్రీవ విభీషణులు.! భర్తపై ప్రేమతో సీతమ్మ !,,,రామస్వామి పై గల భక్తి అనే ప్రేమతో హనుమ.!. ఇలా ప్రేమకు పవిత్రతను త్యాగం తో అపాదించారు. . ! ఈ శూర్పణఖ ద్వారా సూచింపబడే విదేశీ సంస్కృతి ,ఆచరణీయం కాదనీ, అధర్మం గా ఉంటుంది అని రామాయణం సూచిస్తుంది !  కాని ,నేడు అదే పద్ధతిని నేడు  యువతీ యువకులు అవలంభిస్తూ  ప్రేమకు కొత్త నిర్వచనం చెబుతూ,. పవిత్రమైన తలిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ, వారిని అనాధ ఆశ్రమాల పాలు చేస్తున్నారు..  !కొడుకులు కూతుళ్లు సంపద ,డబ్బు ఆస్తులు ఉండికూడా కన్నవారు దౌర్భాగ్యస్థితిలో కన్నపిల్లలకు కట్టుకున్న ఇంటికి దూరం అయ్యి అందరు ఉండి అనాధల్లా బ్రతుకు ఈడుస్తు అయోమయంగా అశాంతితో బ్రతుకు లు ముగిస్తున్నారు.."నేను నా భార్యా పిల్లలు బావుంటే  చాలు ,! అనుకునే స్వార్థబుద్ది  దురదృష్టవశాత్తు ,క్రమంగా నగరాల్లో, విద్యావంతుల్లో ప్రబలిపోతోంది.  కన్నవారు తమ కుటుంబం వారు కాదు ,పరాయివారు! అనేది విదేశీ సంస్కృతి..!! భారతీయ సంస్కృతి కాదు ! మనం  పరధర్మాన్ని పాటిస్తున్నాం ,కనుక మానవత్వం మంట కలిసిపోతోంది..!. భగవద్గీత లో గీతాచార్యుడు ,శ్రీకృష్ణభగవానుడు  "స్వధర్మం " ఎంత కష్టం అనిపించినా  పాటించడం శ్రేయస్కరం !" "పరధర్మం "ఎంత సులభతరం గా తోచినా పనికిరాదు. !" ఆచరణీయం కాదు !" అని బోధించాడు ,అయితే అంత దుష్ట స్వభావం గల రాక్షసి శూర్పణఖ కు ఆమె సోదరులు ఖర దూషణులకు కూడా భువన మోహన రామచక్కదనం చూసి మోహితులై  మొదట వైరం విరమించు కున్నారు. తర్వాత శూర్పణఖ భంగపాటు తో రెచ్చగొట్టడం వలన వివశులై పోరాడి మహాబలి శ్రీరాముని చేతిలో అగ్నిలో మిడుతల వలె హతమయ్యారు .! రాముని  అద్భుత పరాక్రమాన్ని ,రూపలావణ్య సౌందర్యాన్ని  చూసి ఆమె ,,.".తరుణౌ రూప సంపన్నో ---.. మహాబలౌ !"...అంటూ శ్రీరాముని మన్మధకార విగ్రహాన్ని  అందంగా స్తుతించింది.! అంటే రాక్షసులచే త కూడా స్తుతించబడిన దివ్య చరిత ,శ్రీరామచంద్రునిది !.శ్రీరాముని  దూషించిన వారైనా , పూజించిన వారైనా . వారు  నిరంతరం రామనామ స్మరణ చేస్తూ ఉండటం వల్ల ముక్తిదామాన్ని పొందారు..అదే రాక్షస జాతికి చెందిన మారీచుడు కూడా  "అపర శ్రీ రామభక్తుడు "అయ్యాడు  భయంతో ..!! అటు శివ భగవానుడు తారకనామ జపంతో రామభక్తుడు అయ్యాడు భక్తితో.!! ఇద్దరూ రామభక్తులే ! ". ర " అనే శబ్దం తో మొదలయ్యే " రథం,,రా,, ""అన్న శబ్దాలు వింటేనే గజగజ వణికి పోతాడు మారీచుడు !.ఎక్కడో ఉత్తరభారత  ప్రాంతం మిథిల  నుండి రాముడు కొట్టిన ఒకే ఒక బాణపు దెబ్బకు వేల యోజనాల దూరంలో , మారీచుడు దక్షణంలో శ్రీలంకలో చావకుండా  పడిపోయాడు..అంతటి భుజబల సంపన్నుడు.,, దనుర్ధారి ,,రఘురాముని స్మరిస్తేనే సింహాన్ని చూసిన జింకపు పిల్లలా అచేతనుడై భయంతో కంపించి పోతాడు మారీచుడు !.. ఎటువైపు నుండి రాముడు వస్తాడో అని నిద్రలో కూడా ఉలిక్కిపడి రామధ్యాసతో  తో  కాలం గడుపుతున్నాడు..అతడు !అంతటి బలశాలి  రాముడు ,తన సోదరుడు సుబాహుని చంపి, తనను మాత్రం చంపకుండా శతయోజనదూరం లో సముద్రం ఆవల పడగొట్టిన రాముని శౌర్య పరాక్రమాన్ని మరచిపోలేక పోతున్నాడు రాక్షస మారీచుడు !..రాముని దెబ్బ తినకముందు రాక్షసుడు  !కానీ ,ఇప్పుడు మాత్రం మారీచుడు ఋషి అయ్యాడు .!రాక్షస ప్రవృత్తి మాని ,..మునులతో గూడి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా ఒక రాక్షసునికి  సజ్జనత్వం కేవలం శ్రీరాముని నామస్మరణ మాత్రాన  లభించింది.కదా !. అలా రామాయణం లోని పశు పక్ష్యాది ప్రాణులకు వానర రాక్షసులకు ,మానవులకు ,ఎందరో,ముని ఋషి పుంగవులకు, శబరి లాంటి భక్తులకు,, అందరినీ దర్శన,స్మరణ  మాత్రం చేత ముక్తిని పొందారు. అందుకే మన  అందాలరాముడు అందరివాడు,ఆచరణీయుడు , ఆదర్శనీయుడు. అనుపమ పరాక్రమవంతుడు,, ధర్మావతారుడు ,రఘుకుల సోముడు, జగదాభిరాముడు  ! కావున ,రామాయణం వినినా పాడినా ,భజించినా ,స్మరించి  ,సేవించి తరించినా , భవ్యము  !దివ్యము  !జన్మ ధన్యము కదా   !జై శ్రీరామ్! జైజై శ్రీరామ్ !"

దైవ భక్తి

అందరికీ దైవభక్తి ఉంటుంది మదిలో , మనలో  తెలియకుండా !. పరమ నాస్తికులు కూడా అంతరాళంలో దైవాన్ని విశ్వసిస్తారు..!  కానీ వారు సమాజంలో ఉండే విశ్వాసాలను, తాము దర్శించలేక, భగవద్ ప్రాప్తికి నోచుకోక, వైష్ణవులు కాలేక ,భాగవతులతో సత్సాంగత్యం చేయలేక, అందుబాటులో లేని, భావించలేని భావ దారిద్య్రం తో , జ్ఞాన అజ్ఞాన విచక్షణ కోల్పోయి,"" దేవుడు లేడు !" అనే పిడి వాదన చేస్తూ ఉంటారు. అయితే అందుకు కారణాలు కూడా లేకపోలేదు.   దైవంపై విశ్వాసం లేకపోవడానికి,సాధారణంగా  భక్తి కంటకాలు 5 ఉంటున్నాయి..1.) జాతి గురించిన అభిమానం.!"" నేను ఉన్నతజాతికి చెందినవాడను!,నేను ఎక్కువ! ,వారు తక్కువ.! అందువలన నేను చెప్పిందే, చేసిందే, నిజము..! అనుకుంటూ అదే స్థాయిలో ఉండేవారితో కలుస్తూ. అదే విదంగా ఆలోచిస్తూ ఒక్క మెట్టు కూడా కిందికి దిగి రాకుండా ఉంటూ. భక్తి తత్వసిద్ధాంతమునకు దూరమౌతున్నారు  కొందరు  2  ) కుల భావన !.భగవద్గీత లో గీతాచార్యుడు ప్రతిపాదించిన చాతుర్వర్ణాలు కాకుండా ఈ రోజు ఎన్నో కులాల వర్గీకరణ ప్రభుత్వమే స్వయంగా అన్ని కార్యక్రమాల్లో సూచిస్తూ ,రాజకీయాలలో  వానికి పెద్దపీట వేస్తూ ఉండడం  చూస్తున్నాం. ఇందులో కూడా ఎక్కువకులం తక్కువ కులం లాంటి  వ్యవస్థ వేళ్ళు పాతుకొని ఉంటోంది..  ఫలితంగా  కులాలవారీగా దేవుళ్ళు పుట్టుకొస్తూ ఉన్నారు..అలా దైవభక్తి చీలిపోతోంది.! నా దేవుడు ఇతడు.!. నీ దేవుడు అతడు..!అనే వాదనలు తో .  కుల వ్యవస్థ భక్తికి కంటకంగా మారుతోంది.. రామాయణం లో సీతారామలక్ష్మణులను గంగానదిని దాటించిన గుహుడు  కేవలం ఆటవికుడు మాత్రమే! అతడికి రామునిపై గల నిరూపమానమైన భక్తి తో  శ్రీరాముని కరుణకు నోచుకున్నాడు. అలాగే సూరదాస్ పుట్టుకతో అంధుడు. అయినా బాలకృష్ణుని కీర్తనలు పారవశ్యంతో గానం చేస్తూ ఉంటే చిన్నికృష్ణుడే రోజూ స్వయంగా వచ్చి అతని ముందు కూర్చుని వింటూ ఆనందించాడు.!. మరో రామభక్తుడు కబీర్ దాసు..! అతడు పిలిస్తే  రాముడు పలికేవాడట! అనన్యసామాన్యమైన అనితరసాధ్యమైన భక్తిప్రపత్తులకు వారి జాతి కుల వర్గాలు అడ్డు రాలేదు.! దైవంపై వారికున్న అచంచలమైన విశ్వాసం,, ప్రేమ ,వారు నమ్ముకున్న ఇష్ట దైవానికి  అలా దగ్గరగా చేర్చింది. .3 విద్యాభిమానం. కూడా !  చదువుకున్నవారు అంటే పండితులు. ,విద్యావంతులు,! చదువులేనివారు ,అనగా పామరులు.,అనగా తక్కువ విద్య నేర్చినవారు..! ఇలాంటి చీలికలు దైవాన్ని నమ్మడంలో  క్రమంగా  అడ్డంకులు గా మారుతున్నాయి !. భక్తి విషయంలో చదువు అనేది ఏ రకంగా ఇబ్బంది కాకూడదు.! కాదు కూడా.! విద్యతో  నాలుగు వేదాలు చదవడంరావచ్చునేమో,, కానీ అందులో ఉన్న వేదాంత రహస్యాలు నేర్వాలంటే నీలో ఉన్న "అవిద్య  "తొలగాలి !అంటే అంతటా దైవాన్ని దర్శించే జ్ఞానం కలగాలి కదా   4.)   రూపం. పై అభిమానం అద్దంముందు రోజూ తీర్చిదిద్దే అందమైన దేహం పై తీరని మోహం ! దేవుడిచ్చిన ఈ శరీరంపై దురభిమానం పెంచుకొని.. ఆకారం పై మక్కువతో, నేను! నాది !నావారు..! అనే బంధాలలో చిక్కుకొంటూ. ఈ రూపాన్ని కరుణించి న దైవం యొక్క అసలు రూపాన్ని. గుర్తించలేక. .సంసారకూపంలో కొట్టుమిట్టాడుతూ భక్తియోగం అంచులకు కూడా చేరకుండా జీవనయాత్రను ముగించడం జరుగుతోంది.కదా .5..) యవ్వనం పొంగు !. ఇది వేగంగా పారుతున్న ప్రవాహం లాంటిది. ఉరుకులు పరుగులతో ఉడుకు రక్తంతో ,రెండు తీరాలను ఒరుసుకొని పారుతూ కట్టలు తెంచుకొని విశృంఖలంగా స్వేచ్ఛగా ,స్వేచ్చా విహంగంలా ఎగిరిపోవాలని అనిపించే యువత స్వభావం!  .స్వామి వివేకానందుడు కావాలన్నా, భక్త ప్రహ్లాదుడు కావాలన్నా బాల్యంలోనే భక్తి అనే విత్తనం బీజం మొలకెత్తాలి హృదయంలో.!. అప్పుడే మనసు చెప్పినట్టు శరీరం వింటుంది. !గురువు ఆశ్రయాన్ని కోరుతోంది! తలిదండ్రుల, పెద్దల మాట శిరోదార్యంగా ఉంటుంది.! సత్సంగంతో సాత్విక గుణం తో రామాయణం, భారత భాగవాత పఠనం శ్రవణం చేస్తుంది! దేవాలయాలను దర్శిస్తుంది.! పరులలో దైవాన్ని చూస్తూ  సేవిస్తుంది! నేటి యువతకు ఇంటిలో తలిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు. చదువుతో బాటు సంస్కారం,సనాతన సంప్రదాయం ,నేర్పుతూ  చక్కని మార్గదర్శనం చేస్తే తప్ప యువతకు అభ్యుదయం వీలు కాదు .!""ముసలివాళ్లకు భక్తి దేవుడు ,దేవాలయాలు, పురాణాలు. కావాలి. అప్పుడు వారికి ఏ పని ఉండదు కనుక అదే పని.."" మేము కూడా అప్పుడు పూజలు చేస్తాము ఇప్పుడు మాత్రం "లైఫ్ ఎంజాయ్" చేస్తాం .!!"అని యువకులు యువతులు భావిస్తూ ఉంటారు ..",విత్తనం చిన్నతనంలోనే పడాలి! అది క్రమంగా పెరిగి ఫలవంతం కావాలంటే అప్పటికప్పుడు అయ్యేదికాదు కదా.-!ఇలా ఈ 5 అవరోధాలను ఎదుర్కోవడం సామాన్య విషయం కాదు.--- దైవభక్తి కి ఈ విదంగా కంటకాలు గా ఉన్న దుర్భేద్య వాతావరణాన్ని భేదించాలంటే సాధన, సత్సంగము, ఆత్మ పరిశోధన,  భగవద్గీత, పౌరాణిక గ్రంధాల పరిశీలన ,అనునిత్యం దైవారాదన, దైవంపై ప్రగాఢంగా విశ్వాసం నిలుపక తప్పదు. ""!నీలో , నాలో, అందరిలో ,అన్నింటిలో ,విశ్వమంతా నిండి ఉన్నాడు విశ్వంభరుడు !!". అని భావిస్తూ.. తండ్రీ !, దయామయా ! కరుణాసిందో,! దీన బంధో  .!!దయయుంచి నాకు నీపై చెదరని ,నిన్ను వదలని నమ్మకాన్ని అనుగ్రహించు..! నారాయణా.! నేను అజ్ఞానిని !పామరుణ్ణి.! మహా పాపిని !..నిన్ను దర్శించుటకు అసమర్థుడను..! అందుచేత నీవే నన్ను నీ సేవకు, నీ బంటునగుటకు యోగ్యతను అనుగ్రహించు!.. నిరంతరం నీ ధ్యాన గాన భావ సేవా తత్పరతో ధన్యుణ్ణి చెయ్యి..!అది నీ బాధ్యత ! దేవదేవా  !పరంధామా! పరాత్పరా  !పరమేశ్వరా! శరణు..!అఖిలాండకోటి బ్రహ్మాణ్డె నాయకా! శరణు.!. సర్వాంతర్యామి.!శరణు! స్వస్తి.! సర్వే జనాః సుఖినోభవంతు ! సమస్త సన్మంగళాని భవంతు ! హరే కృష్ణ ! హరే కృష్ణా !!"

జై జవాన్! జై భారత్ !

ఘోరంగా ఇంతమంది భారత వీరజవానులను హతమార్చిన పాకిస్తాన్ దుండగులకు మనమంటే భారత దేశమంటే  ఎంత ద్వేషం ఈర్ష్యా పగ కోపం , అహంకారం , కాశ్మీరును ఎలాగైనా అక్రమించుకోవాలన్న దురాపేక్ష ,ఎంత బలంగా  ఉందో దీనివలన తెలుస్తోంది ..ఇక ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు మారరు. ఒకనాడు కాశ్మీర్ పండితులను వేల సంఖ్యలో ఊచకోత కోసినపుడు   ప్రధానిగా ఉన్న నెహ్రూ.,, గాంధీ మహాత్ముడు .. చోద్యం చూస్తూ  మౌనంగా ఉండిపోయారు. ఇందిరమ్మ పుణ్యమా అని మనదేశంలో  అంతర్భాగంగా .ఉన్న మానస సరోవర నేపాల్ ప్రాంతాన్ని  చైనాప్రభుత్వం అక్రమించుకున్నారు.. ఇప్పుడు పాకిస్తాన్ కు కశ్మీర్ పై కన్ను పడింది. అందమైన దేశం. అందుబాటులో ఉన్న ప్రాంతం. కబ్జాకు అనుకూలం.. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్న కొందరు పాకిస్తాన్ కు తమ  సంపూర్ణ మద్దతును సహాయాన్ని సహకారాన్ని అందించేవారే . పాకిస్తాన్ జిందాబాద్  .! అంటూ నినాదాలు చేస్తూ. అక్కడవుండే మన దేశ జవానులపై రాళ్లు విసురుతూ.ఉన్న ఘోరమైన  దృశ్యాలను మనం చూస్తున్నాం .మన దేశాన్ని కాపాడటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి విధులను  ప్రతిఘటిస్తూ ఇబ్బంది పెట్టే ముష్కరులు పాకిస్తాన్ కు విధేయులు.. వీరే మన మొదటి శత్రువులు .నమ్మకద్రోహులు.. ప్రక్కలో బల్లెంలా  దేశ శాంతి  భద్రతల కు తీవ్రంగా ఆటంకం కలిగిస్తూన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక ముస్లింలు అంతా తమకు వేరే దేశం కావాలంటే అప్పుడున్న ప్రధాని మౌనంగా తల ఊపాడు..  మనది ప్రజాస్వామ్య దేశం అంటూ ముస్లింలు  అందరూ వెళ్లిపోకుండా  గాంధీ గారు ఆపారు.   అలా రాజకీయనాయకులు  తమ వంతుగా శాంతియుత హిందూదేశాన్ని   ,అశాంతి పాలు చేస్తూ అభద్రతా భావాన్ని పెంచుతున్నారు..ఇప్పుడు అంతః కలహాలు ఇక్కడున్న కొందరు  పాకిస్తాన్ తో చేతులు కలిపి ,స్నేహం పేరుతో ఘోరంగా మారణ కాండ తో  రెండు మతాల మధ్య  యుద్దం సాగిస్తున్నారు. ఇది రావణ కాష్టం లా రోజురోజుకు పగలు ప్రతికారాలు పెరిగిపోతున్నాయి  పాకిస్థాన్ లో ఉన్నవారికి మనదేశ సమాచారాన్ని .సైనికుల మెలకువలు అందించే ముష్కరులు మనతో కలిసి ఉంటూ మన దేశం ఉప్పు తింటూ  మనకే నమ్మకద్రోహం తలపెడుతున్నారు.."భారత్ మాతాకి జై  !"అని మేము అనము  !!"అనే వారు  మనకు సోదరులు ఎలా అవుతారు.. ? పుల్వాన్ దాడిలో చంపబడ్డ జవానులకు మనం విషాదంతో  కన్నీటి నివాళులు సమర్పిస్తూ ఉంటే.. మన దేశంలోని కొందరు  యువకులు  జల్సా  చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు  ..అంతః కలహాలు ఆపడం  చాలా కష్టమైన పని..ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా.. అందుచేత మనముందు ఉన్న కర్తవ్యం దెబ్బకు దెబ్బ తీయడమే.. చర్చలు ,శాంతియిత రాయబారాలు ప్రక్కన పెట్టి.. సరిహద్దు సైనికుల భద్రత విషయంలో ,,తిరిగి ప్రతీకారాన్ని ఎలా తీసుకోవాలో. చూడాలి . పాకిస్తాన్ దుండగులకు మనదేశ కీలక సమాచారాలను రహస్యంగా అందించే ఫోన్లు ,ఇంటర్నెట్ ల వ్యవస్థను అరికట్టాలి.. అక్కడివారిని ఇలాంటి దుశ్చర్యలను చేయడానికి ఆయుధాలు అందిస్తూ  ,కీలకపాత్రను పోషిస్తూ. ఉన్న దేశద్రోహులను దొరికినవారిని దొరికినట్టుగా ఉరితీయాలి. అలా పాకిస్తానీయులకు అందే అందించే సమాచార సహాయకులను అంతమొం దిస్తేనే తప్ప పాకిస్తాన్ దుండగులకు మన సత్తా తెలిసిరాదు.  కార్చిచ్చు లా వ్యాపిస్తూ బోర్డర్ పై  మనకోసం తమ దేశం కోసం  తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టి పోరాడుతూ సోదర జవానుల చావుకు కారణం అవుతున్న మతోన్మాదులకు ,బుద్ది చెప్పాలి.. అందుకు మొదట  రాజకీయ నాయకులకు  తమ పదవుల ప్రయోజనం తెలిసిరావాలి దేశం కోసం ,ప్రతి పౌరుడు .ఇంటికి ఒక జవానుగా మారాలి..  వీరమరణం పొందిన జవానులకు విధిగా తమ తమ వేతనాలు ఆదాయాలనుండి విరివిగా విరాళాలు ఉదారంగా అందించాలి ఇది ప్రతి ఒక్కరి సమస్యగా.జవానులు తమ ఇంటి సభ్యులుగా  భావించాలి  ,, ఇలా సంఘటిత భావన తో  మనలో కలిగే చైతన్యమే దేశజవానుల ఆత్మార్పణకు నిజమైన హృదయపూర్వక నివాళి కాగలదు.. చనిపోయినవారి భార్యలు  ఏడుస్తూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించే ఆసరా ,ఆధారం ,కోల్పోయి..వారి  పిల్లలు అనాధలై.తండ్రిని చూడకుండా తండ్రి ప్రేమకు నోచుకోకుండా దిక్కులేని వారయ్యారు.. వారి ఈ దుస్థితికి కారణం పాకిస్థాన్ దుండగులైతే.. వారిని ఇలాంటి నిస్సహాయ దుస్థితిలో  ఎదో ఒక రకంగా అదు కోలేకపోతే మనమూ దోషులమే అవుతాం కదా.అలా ఆదుకోలేని ,మద్దతు నివ్వని పరిస్థితిలో తిరిగి సరిహద్దుల్లో పోరాడటానికి సంసిద్ధం అయ్యే యువకులు కరువౌతారు కూడా.. అందుకే అక్కరకు రానివాడు  బ్రతికి ప్రయోజనం లేదు. తనదాకా వస్తే తెలుస్తుంది.. ప్రాణం తీపి ఏమిటో. !! మనం హాయిగా నిర్భయంగా ,సంతోషంగా ఉండటానికి  తమ ప్రాణాలను తృణప్రాయంగా  ఒడ్డుతూ బలియైపోయిన వీర సైనికులకు ధనం రూపేణా వారి కుటుంబాల కు  నేరుగా  పంపించుదాం.. చేతనైనంత సహాయం చేయడం మన విధి.! వారికి అండదండగా నిలబడటం మన తక్షణ కర్తవ్యం కదా !!జై జవాన్!  జై భారత్ !

కళ్యాణం

" కళ్యాణం  "అంటే అందరికి ఆనందాన్ని పంచేది.!. పెండ్లి చేసుకునే వధూవరులు, ఇరుపక్షాల వారు మాత్రమే కాకుండా, వివాహానికి విచ్చేసిన వారందరు సంతోషంగా వచ్చి , పెళ్లి జంటను దీవించి భోజనాలు చేసి సంతృప్తి పొందడం వల్ల , కలిగే ఆనందం ,, పెళ్ళివారికి "జయాన్ని శుభాన్ని" ఇస్తుంది.!.ఎలాగంటే పెండ్లికి పిలుస్తూ మనపై , ప్రేమతో  ఉన్న ఆత్మీయలను బంధువులను ,""పెద్దవారు.!.రండి .!మీ ఆశీర్వచనం, వలన ఈ  జంట చల్లగా ఉంటారు! " .అంటూ దేవతలను ఆహ్వానించిన విదంగా  ,పేరు పేరునా ఇంటింటికి వెళ్లి పిలుస్తాము .వారు కూడా మంచిమనసుతో ,ప్రేమతో  వస్తారు. "వీరే అతిథి దేవుళ్ళు.!. దైవస్వరూపులు!" కూడా ..!. ఒక పెండ్లి చేయడం వలన. వధువు వరుడు వైపు గల రెండు కుటుంబాల వంశాల వారే కాకుండా  ,వారితో బంధుత్వం గలవారంతా వివాహపరిచయ వేదికపై కలుస్తారు. అక్కడ ఒకరికొకరు స్నేహాలు బంధుత్వాలు కలుపుకుంటారు. అంటే. ఇటువైపు వారు 500 అనుకుంటే అటువైపు వారుమరో  500. !!ఇలా 1000 మందిని పరస్పరం ప్రేమతో. వాత్సల్యంతో అభినందించుకునే ""అద్భుతమైన అనుబంధాల కలయిక "" ఒక పెండ్లి వలన  ఒకే వేదికపై  ఏర్పాటు జరుగుతోంది. ! ఇదీ మన సనాతన సాంప్రదాయ వైభవం  ,మనం పొందే ఆనందాన్ని వేలాదిమందితో పంచుకుంటూ పెంచుకొనడం వల్ల ఈ వ్యవస్థ కల్యాణకరం !! అందుకే  మన సనాతన  హిందూధర్మంలో వివాహానికి పెద్ద పీటను వేయబడింది.  ఇంతమందికి  "ఆనంద నిలయంగా " ఈ కళ్యాణవేదిక అవుతోంది..! ఏటా మనం శ్రీరామనవమి రోజున  సీతారాముల కల్యాణం కమణీయంగా రమణీయంగా  అత్యంత వైభవం గా  , ప్రతీ చోటా జరుపుకుంటాం !మన ఇళ్లలో జరిగే పెండ్లి వలె. కొట్టబట్టలు నైవేద్యం, కట్నకానుకలు , అమ్మవారికి పుస్తెలు  ,,పసుపుకుంకుమ  మంగళహారతి పళ్లెం తో సహా  సకలసంభారాలు  సమకూర్చుకొని, ఉత్సాహంతో, బంధుజనాలతో  ,కళ్యాణం అయ్యేవరకు ,ప్రసాదం గ్రహించేవరకు , ఉపవాసం చేస్తూ కూడా , దేవాలయాలలో సామూహికంగా జరుపుకునే సీతారామ కల్యాణం చూస్తూ , మనం  పొందే ఆనందము చెప్పనలవి కాదు కదా.!రోజూ.మనం  ఆనందించే ప్రతీ సందర్భాన్ని  కళ్యాణం అనము కదా..! సీతారాముల  వివాహాన్ని మాత్రమే " కళ్యాణం" అంటాము ! .ఎందుకంటే మనకోసం లక్ష్మినారాయణులు ,సాధారణ మానవులుగా దివినుండి భువికి దిగివచ్చి .మానవులు ఆచరించే సంప్రదాయాలు పాటిస్తూ . మానవులుగా అవతరించి ,సకల బంధుజనాల సమక్షంలో కన్నులపండువుగా  సాంప్రదాయ మన హిందూ ధర్మ వేదం శాస్త్ర పద్దతిలో ఋషులు మునులు సమ్మతంతోనే  పెళ్లి చేసుకున్నారు , ఈ అపురూపమైన పెండ్లి చూడటానికి సకల దేవతలు కూడా మానవ రూపాలు ధరించి. కల్యాణం తిలకించి తన్మయులై ధన్యత పొందారు. అందుకే, దేవతావైభవాన్ని తలపించే సీతారాముల పెండ్లి  వలెనే మనం కూడా మన ఇళ్లలో మన కూతుళ్లకు   యధాశక్తితో ,జరిపించే పెళ్లిని కళ్యాణం అంటాము.!.వధూవరులు సాక్షాత్తు" లక్ష్మీ నారాయణ స్వరూపాయ.. !"అంటూ.. వేదమంత్రాల మధ్య.. వయసులో పెద్దవారైన అమ్మాయి తలిదండ్రులు తమకంటే చిన్నవాడైనా అల్లుడి కాళ్ళు కడిగి  ,తమ కూతురు ను "మహాలక్ష్మి" వలె ,అల్లుడిని "నారాయణు "డికి  ఇచ్చి కాళ్ళు కడిగి ,కన్యాదానం చేస్తున్నట్టుగా భావిస్తూ జీవితం ధన్యం అయినట్లుగా ,. ఆ పాదోదకాన్ని అదే పవిత్రభావంతో తమ తలపై చల్లుకుంటారు .!.. దీవించటానికి విచ్చేసిన బంధుజనాలను ,స్నేహితులను  తమ కూతురు అల్లుళ్ళను దీవించడానికి వచ్చిన దేవతామూర్తులుగా  ఆహ్వానిస్తూ ఆదరణగా గౌరవిస్తూ మర్యాదలు చేస్తారు..! ఇదే రీతిలో రుక్మిణీ కృష్ణులు, గౌరీ శంకరులు,శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు కూడా రంగరంగవైభవంగా ,కన్నుల పండుగ లా వేలమంది తో సామూహికంగా  చేస్తాము..!  భోజనాలు ,పులిహోర లాంటి ,దేవతా ప్రసాదాన్ని కూడా సామూహికంగా స్వీకరిస్తాము  !ఆ విధంగా సీతారాముల కళ్యాణం ఆదర్శంగా ఆచరణీయంగా తీసుకుంటాము..! ఎందుకంటే రాముడు మర్యాదపురుషోత్తముడు.! శివదనుస్సు విరిచినా. సీత వరమాల వేసి  శ్రీరామునిపతిగా  స్వీకరించినా కూడా తమ తలిదండ్రులుమాత్రమే తన వివాహం విషయంలో నిర్ణయం తీసుకుంటారని ..అంతిమ నిర్ణయం వారిదే అని. వారి సమ్మతి తో మాత్రమే వివాహం జరగాలని  చెప్పాడు.. అలా కన్నవారిపై రామునికి గల అపారమైన గౌరవ మర్యాదలు. భక్తిశ్రద్దలు రాముని పూజ్యునిగా ,దైవంలా , చేశాయి.. ఇక సీత సకల ధర్మ వేద శాస్త్రాలు తండ్రి జనక మహారాజు  కూతురు. అతడు  మహా ధార్మికుడు !భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తీభవించిన మహా జ్ఞానికి కూతురు "జానకి "అని తండ్రి పేరుననే గుర్తింపు పొందింది. సీత, మహాసాధ్వి  కనుకనే రావణాసురుని చెరలో.10 నెలలు  అష్టకష్టాలు పడుతున్నా కూడా,, చెదరని బెదరని అదిరిపోని  ఆత్మవిశ్వాసంతో, రామునిపై  అపారమైన నమ్మకంతో, రావణాసురుని అంతమొందించ గలిగింది.  తన తలిదండ్రుల పెంపకం , శిక్షణ, వారిపై ఆమెకు గల ప్రేమానురాగాల వల్లనే  సీత రాముని కి యోగ్యురాలైన భార్య కాగలిగింది..! అంటే రామాయణం లో సీతారాముల కల్యాణం  ఆనందదాయకం కావడానికి కారణం. తలిదండ్రులు ,గురువులు సోదరులు, బంధుజనాల పట్ల సీతారాముల  భక్తి విశ్వాసాలు  శ్లాఘనీయం..! అద్భుతం..! అందుకే ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రతీ పెండ్లి వైభవం  సకల జనులకు ఆమోదాన్ని ఆనందాన్ని కలిగిస్తూ  కళ్యాణకరం గా ఉంటుంది అందుకే .వివాహవేదిక దేవతావైభవాన్ని సూచిస్తుంది..  ! పాదరక్షలతో పోకుండా ,ఆలయానికి వెళ్తున్న పవిత్ర భావం తో ఆచరణతో పెండ్లి జరిపించాలి. వధూవరులు ప్రత్యక్ష దైవాలైన సీతారాముల కు ప్రతిరూపాలుగా తలపిస్తూ ఉంటారు.. ఈ కళ్యాణం కేవలం ఒక జంటకు మాత్రమే  జరిగే బంధము ,లేదా ఒప్పందం కాదు..!  కళ్యాణ వేదిక వద్ద జమగూడిన మనమంతా జీవులం అనుకుంటే . .పరమాత్ముడు పరంధాముడైన ఆ నయన మనోభిరాముడు. కళ్యాణ గుణ దాముడు.. జగదాభిరాముడు అయిన పరమాత్మతో ఈ జీవాత్మల సంయోగమే ఈ  కళ్యాణంగా అవుతున్నట్టుగా భావించి పరవశించి తరించాలి. అంటే వధువును మన కుమార్తెను " మహాలక్ష్మీ." స్వరూపిణి గా తలంచాలి. ఇక వరుని రూపంలో ఉన్న అతడిని "శ్రీమన్నారాయణుడి "గా భావించాలి.. ఇలాంటి భావనతో వెళ్తే ప్రతీ పెళ్ళి.. "కళ్యాణకరం.!. మనోహరం.!" అలాంటి భావ సంపద తో  చూచిన కళ్ళు ,,కన్నుల పండుగ ! అలా .చూడలేక పోతే పెళ్లికి వెళ్లి దండగ. అనుకోవాలి..! రామాయణం లాంటి కావ్యం.. మనం అనుసరించి ఆచరించి ఆనందించే ఇలాంటి సీతారాముల కళ్యాణం సకల జనావాలికి శ్రీరామరక్ష కావాలని  కోరుకుందాం.! శ్రీరాజా రామచంద్ర భగవాన్ కి జై .!.జై శ్రీరామ్ !జై జై శ్రీరామ్!. రామలక్ష్మణ జానకీ..! జై బోలో హనుమాన్ కి..!శ్రీరామ్ జయరాం జయ జయ రామ్. !!! స్వస్తి !!

Saturday, February 2, 2019

చైతన్యం

కృష్ణ భక్తుడు సూరదాస్ పుట్టుకతో అంధుడు..! జీవితాంతం అతడు  కృష్ణనామ గాన భజనలతో  చిన్ని కృష్ణుణ్ణి కీర్తించి  తరించాడు .అంత్యదశలో  అతని గురువు వచ్చి అడిగాడు , కృష్ణ కీర్తనలను పాడమని .!...సూరదాస్ అత్యంత ప్రేమతో ,గురువు సాన్నిధ్యంలో , తాను గానం చేసిన భజనలన్నీ  అందరికి వినిపించాడు. అందరూ ఆనందించారు గురువుతో సహా..! అందులో ఒకరు అడిగాడు.,స్వామీ !. ఇన్ని కీర్తనలను కృష్ణునిపై పాడినావు కదా..! కొన్ని కీర్తనలను నీకు శ్రీకృష్ణ చైతన్యం అనుగ్రహించిన నీ గురువు పైన చదవండి .. అని అన్నాడట.!. అప్పుడు సూరదాస్ నవ్వి.. ""అయ్యా ! నాకు గురువే దైవం!. నాకు గురువుగా నిలిచి కృష్ణ ప్రేమను కరుణించి .ప్రేమతో నా వద్ద నిలుచున్న గురువు శ్రీకృష్ణుని ప్రతిరూపమే !...నా దృష్టిలో నా గురువుకు  ,  కృష్ణునికి బేధం లేదు. అబేదం! ,ఇద్దరు లేరు ఒకరే.! గురువే దైవం..! కృష్ణం వందే జగద్గురుమ్ . !నేను పాడిన గీతాలు నా జీవితం , అన్నీ  నా గురువుకే అంకితం.!  అంటూ ఆనందంగా ప్రశాంతంగా గురువు పాదాలను స్పర్శిస్తూ  కళ్ళు మూశాడు.. !  అలా  కృష్ణ పరందామము ను చేరుకున్నాడు శ్రీ  కృష్ణ భక్తుడు సూరదాస్.!.. ఇది భాగవత ఏకాదశ  స్కంధం లో శ్రీకృష్ణ భగవానుడు   తనను చేరుకోవాలంటే ఉపదేశించిన మార్గాలలో సద్గురువు ను ఆశ్రయించి ముక్తిని పొందడం.  అనే ఒకటవ మార్గం !!!....ఇక రెండవది. అంతటా  దైవాన్ని దర్శించడం !..ఇది  కష్టతరమైన మార్గం...! అయినా పరందాముని పరిపూర్ణంగా నమ్మినవారికి  భక్తులకు అసాధ్యమంటూ ఏది లేదు కదా. !  పండరీ విఠల్ భగవానుని పరమ భక్తుడు నామదేవ్..! ఒకరోజు  అతని ఇంట్లోంచి  ఒక కుక్క ఒక రొట్టెను నోట కరచుకొని పారిపోతుంటే. అతడు  అది చూసి..,"" భగవాన్. !ఇంకా ఉన్నాయి ! ఒక్కటే సరిపోదు కదా నీకు ! ఇవన్నీ నీకోసమే చేశాను..పైగా  వాటికి నెయ్యి కూడా రాయలేదు..! స్వామీ  ఆగండి !   తొందరపడకండి ! ఇదిగో వస్తున్నాను నేను ! నెయ్యి పట్టుకొని  ! నేను నెయ్యి  వీటికి రాసాక  నీవు తిందువుగాని. ! " అంటూ ఆ కుక్క వెంబడి నేతి గిన్నెను ,మిగిలిన రొట్టెలను పట్టుకొని. పరుగున  వెళ్లాడట.! ఇది సర్వాంతర్యామి ని భావించి సేవించుకునే రెండవ మార్గం..! . ఇవి రెండూ వీలు కాకపోతే కలియుగంలో ఉండనే ఉన్నది ! హరినామ కీర్తన స్మరణ భజన  .!,,,సకల పాప దుఃఖ శమనం కోసం !!..అదే శ్రీకృష్ణ భగవానుడు ఈ విదంగా శ్లోకం ద్వారా మనకు ,అంటే భాగవత భక్తులకు ఇలా తెలియజేశాడు  .  శ్లో !!నామ సంకీర్తనం యస్య ,సర్వ పాప ప్రణాశనం.,,,ప్రణామో దుఃఖ శమనః,, తం నమామి హరిం పరమ్ !!  హరినామ స్మరణ  భావిస్తూ చేద్దాం. మానవజన్మ ను ధన్యం చేసుకుందాం. జై శ్రీకృష్ణ ! జైజైశ్రీకృష్ణ ! గోపాలకృష్ణ భగవానుని కి జై ! కృష్ణం వందే జగద్గురుమ్ !!"

భావన

శుభదినం దొరికితే చాలు శుభకార్యాలు జరుగుతాయి.!. ముఖ్యన్గా పెండ్లిళ్ళు చేయడానికి ముందుగా బుక్ చేయకుండా ఉంటే ఫంక్షన్ హాల్స్ దొరకడం లేదు కదా ! మనం , ఏ పెండ్లి కి వెళ్లినా ""వధూవరులు లక్ష్మీ నారాయణ "" స్వరూపులుగా భావించాల్సి ఉంటుంది ! కళ్యాణవేదిక ను పూజ్యంగా దేవతా మంటపం లా , పరమ పవిత్రంగా ను పెండ్లి కుమార్తెను మహాలక్ష్మి దేవి గాను,పెండ్లి కుమారుని శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించాలి. ఇక వచ్చినవారు అందరూ కన్యాదాతలుగా అనుకోవడం వల్ల తమ కూతురు ను నారాయణుని కి ఇచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్న భావన రావాలి దృష్టిని తిండిపై లేదా అతిథుల పై , కాకుండా చెప్పుకాళ్ళతో కళ్యాణవేదిక ను అపవిత్రం చేయకుండా పెండ్లివారికి చేతనైనంత గా సహకరించాలి ఆ పని ,దైవారాదనభావంతో మాత్రమే సిద్ధిస్తుంది .స్త్రీలంతా పట్టుచీరలు నగలు జడలో పూలు చేతులకి రంగురంగుల గాజులు. నుదుట తిలకం కళ్ళకు కాటుక లతో తమని తాము మహాలక్ష్మి లా సింగరించుకొని చక్కని అలంకారాలతో. దేవాలయంలో జరుపుకునే సీతారాముల కల్యాణం వైభవాన్ని తిలకించి పులకించి తరించే ఆలోచనతో తయారై పెండ్లికి వెళ్ళాలి. పురుషులు స్త్రీలు శుచిగా ఉంటేనే పెండ్లికి వెళ్ళాలి . లేకుంటే వెళ్లవద్దు ఇక .వధూవరులు ఎలా ఉన్నారు అన్నది మనకు అనవసరం ! .మన భావన దివ్యంగా భవ్యంగాఉండాలి. పరమాత్ముని స్మరిస్తూ , మనసును పెండ్లి భోజనాలపై కాకుండా దేవతా స్వరూపులైన లక్ష్మినారాయణుల కళ్యాణం చూస్తూ పులకించి పోవాలి. వాస్తవానికి ప్రకృతి అంతా లక్ష్మీనారాయణ నిలయం. ప్రతీ పువ్వు సుగంధం అందం లాలిత్యం సౌకుమార్యం ఇవన్నీ లక్ష్మీదేవి అయితే ఆకారం నారాయణుడు.మాట లక్ష్మీదేవి అయితే మాట నుండిే శబ్దం నారాయణుడు ఇందుగలదండు లేడని సందేహము వలదు.. ఎందెందు వెదికి చూచిన అందందే తోచు చుండు. అన్నట్టుగా సర్వమ్ బ్రహ్మ మయం ఏటా చేసుకునే మన. బతుకమ్మ పండుగ లో రంగురంగుల పువ్వుల బతుకమ్మ సాక్షాత్తు మహాలక్ష్మి దేవి అయితే జలరూపంలో ఉన్న నారాయణుని చెంతకు ఆమెను చేరుస్టు న్నామన్న సంతోషంతో బతుకమ్మ ను నీళ్లలో నిమజ్జనం చూస్తుంటాము. !ఎప్పుడూ. వారు ఒకరినొకరువిడిచి ఉండరు ఇద్దరినీ కలిపి పూజించాలి అలా భావిస్తూ నిరంతరం సేవించాలి ,.అలా చూడకుండా అహంకరించి , రామునికి సీతను దూరంగా చేసిన రావణుడు పతనమయ్యాడు అందుకే .కేవలం ధనాన్ని అంటే లక్ష్మీదేవి ని ఆశించి ,, దైవాన్ని అంటే నారాయణుని మరిచేవారి ఇల్లు లక్ష్మీదేవి వాహనంగా ఉన్న గుడ్లగూబల కు నిలయంగా శిథిలమై పోతుంది. ! అందుకే ఎప్పుడూ ఇద్దరు భార్యాభర్తల మధ్యనుండి పొగూడదు అంటారు.. అలా పోతే వారిని విడదీసినట్టు అవుతుంది అలా చేస్తే మహా పాపం అని శాస్త్రం చెబుతోంది. అందుకే పుష్పాలను లక్ష్మినారాయణుల ,సీతారాముల రుక్మిణీ కృష్ణుల ,గౌరీశంకరుల కళ్యాణాలకు అందంగా రంగురంగుల సుగంధ పుష్పాలను అలంకరిస్తూ ఆనందించే సనాతన హిందూ సంస్కృతి మనది. సూర్యుడు నారాయణుడు అనుకుంటే సూర్యకిరణాలు మహాలక్ష్మి స్వరూపాలు. అలాగే వెన్నెల చంద్రుడు. అగ్ని వేడిమి... మంచుకొండలు శీతలం.అలా ప్రతీ ప్రాణిలోను మనలోను వారు కొలువై ఉన్నారు. అందుకే సృష్టిలో శక్తి చైతన్యం! ,బ్రతుకు మనుగడ ! ,,జీవితం సంతోష మయం !! ఆనందం అనేది నారాయణుడు అయితే.అంటే సంతృప్తి.లక్ష్మీదేవి..అవుతుంది కదా ! స్త్రీలువారి జడలో ధరించే పువ్వులతో మహాలక్ష్మీ దేవి లా శోభిస్తారు. దైవపూజకు ఉపయోగించిన పువ్వుల నిర్మాల్యాన్ని కూడా పవిత్ర జలాల్లో నిమజ్జనం చూస్తుంటాము.. ! సృష్టిలో పవిత్రమైనవి ,పరమాత్ముని పూజించేందుకు యోగ్యతను కలిగి ఉన్నవి పుష్పాలు మాత్రమే..కదా !తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం చేసే దివ్యమైన సేవ ,తోమాల సేవలు మొదలైనవి చూస్తుంటాము ! .ప్రతీ ఆలయాలలో ను , కల్యాణ క్రతువు యజ్ఞ యాగాది దేవతా ఉత్సవాలలో , బ్రహ్మోత్సవాలల్లో కూడా , అద్భుతంగా పూలమాలల అలంకరణ లో దైవాన్ని దర్శిస్తూ అమితానందాన్ని పొందుతుంటాము.మనం !లక్ష్మీ స్వరూపంగా వెలిసిన పుష్పాల మాలలను కైంకర్యంగా సమర్పిస్తూ చేసే నిత్యకల్యాణ అర్చన సేవలు స్వామికి అమితానందాన్ని కలిగిస్తూఉంటాయి.! భక్తుల అభీష్టాలను అనుగ్రహించేలా కళ్యాణప్రదంగా కన్నులపందువుగా కమణీయంగా రమణీయంగా అపురూప వైభవంగా స్వామి తన దర్శనభాగ్యాన్ని భక్తజనులకు అందజేస్తూ జన్మ ధన్యం చేస్తుంటాడు. అందుకే పుష్పాలను పరమ పావన పవిత్ర భావంతో లక్ష్మీదేవి సహిత పరమాత్ముని .పూజకి సేవకు.. వినియోగిస్తూ. అదే భావనతో పువ్వులను కైంకర్యం చేస్తూ , ధరిస్తూ తరించుదాం ! శ్రీ లక్ష్మీనారాయణ భగవాన్ కీ జై.. సనాతన హైందవ దివ్య సంస్కృతికి జై..! రామాయణ భారత భాగవతాది పరమ పవిత్ర గ్రంధాలకి జై.! గంగా యమునా సరస్వతీ మొదలగు నదీమతల్లులకు జై! సత్సంగము నకు జై ! భారత మాతాకి జై. !

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...