Thursday, May 19, 2016

పరిశుభ్రత

పరిశుభ్రత మానవతకు కొలమానం -
దానితో దైవానికి దగ్గర అవుతాం -
దేవాలయంలో శుభ్రతను పాటిస్తాం -
అదే శ్రద్ధ ను అంతటా చూపిస్తే -
అంతటా దైవాన్ని చూడవచ్చు -
నాగరకతకు మారు పేరు- పరిశుభ్రత -
అమెరికా సింగపూర్ దేశాలకు -మనకు
శుభ్రత లో వ్యత్యాసం ఉన్నంత వరకు
మనం వెనుకబడిన వారిమే అవుతాం -
నిజమైన సంస్కారం -శుభ్రత ఉంటేనే ! -
మనసు స్వచ్చంగా ఉంటె- దైవ దర్శనం -
ఇల్లు స్వచ్చంగా ఉంటె- ఆరోగ్యం ఆనందం -
పరిసరాలు స్వచ్చంగా ఉంచడంలో
అసలైన మానవత -సిసలైన స్వర్గం ఉంది -
నీవు శుభ్రంగా ఉండటమే కాదు -
నీ వాళ్ళు -నీ ఇల్లు -నీ వాకిలి --నీ వీధి -
నీ చుట్టుప్రక్కలవారు నీవలె భద్రంగా ఉండేలా -
శ్రమించు! నీ వారని -భావించు !- సేవించు-!
ఇదే మానవ సేవ ! ఇదే మాధవ సేవ కూడా !
చెప్పడమే కాదు -చేయడం లో నే -తృప్తి !
అదీ ఇతరులకు సేవ చేయడంలోనే-!
పరమాత్మ-పరమార్థమూ రెండు పొందవచ్చు
అందరి మన్ననలను అందవచ్చు -
మంచి పనికి ఇదే మంచి ముహూర్తం !
అది నీతోనే మొదలవడం నీ అదృష్టం 

దేవీ భాగవతకథా శ్రవణం

NOV 14, 2014
కరీంనగర్ లో -ఈ రోజు - రెండవ రోజున ఉదయం భారత కథ లో భీష్మ ప్రతిజ్ఞా -ద్రౌపది శీలరక్షణ - జూదం -భారత యుద్ధం -పరీక్షిత్తు జననం- శృంగి శాపం -భాగవతకథా శ్రవణం - జనమేజేయుని సర్పయాగం -ఆస్తీక ముని -ఆగమనం తో ఆపడం --వ్యాసభగవానుని ప్రోక్తం అయిన శ్రీమద్దేవీ భాగవతాన్ని బ్రహ్మశ్రీ -పురాణం మహేశ్వర శేర్మ గారు అద్భుతంగా వివరించి -శ్రావ్యంగా వినిపించారు 
సాయంత్రం -కథలో -ఒక లక్ష ఇరవై వేల శ్లోకాలు గల భారతాన్ని రచించినా కూడా - వైశంపాయనునికి తృప్తి కలుగక -దేవీ భాగవతాన్ని రచింఛి తానే స్వయంగా -వినిపించాడు -మొదటి వక్త ఆయనే 1 - శ్రోత ఈ జనమేజయుడు !- దేవీ యాగాన్ని మొదట చేసిన వాడు నారాయణుడు - అమ్మ అందుకు అతనికి విశేషమైన వరాల జల్లు కురిపించినది - త్రిమూర్తులు కలిసి జగదంబ వద్దకు స్త్రీ రూపాల్లో వెళ్ళడం- అమ్మ కరుణించడం వారు -బహు విధాలా అమ్మను స్తుతించడం -అలా సమస్త పాపాలు పోగొట్టు కున్నఎందరో మహాను భావుల గురించి చెప్పారు
విత్తనంలోఉన్న శక్తి వాళ్ళ మొలకెత్తడం చెట్టుగా అవడం -ఎలానో -- మనలో ఉన్న శక్తి వల్ల చేతనులమై జీవించ గలుగుతున్నాము -- "శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః -న ప్రభవితుం --!" శక్తి స్వరూపమైన అమ్మ సహాయం లేకుండా శివుడు కూడా ఏమీ చేయలేడు కదా ! -- అని జగద్గురు శంకరాచార్యులు సౌందర్యలహరిలో విశదీకరించినట్లు అందరిలో అమ్మ వారి శక్తి ఉంది -అమ్మ త్రిగుణాత్మక రూపమే --కాని అమ్మ దానికి అతీతురాలు -మానవులలో మాత్రం ఇవి సమ పాళ్ళలో ఉండవు -కనుక సుఖ దుఖాలు అనుభవిస్తుంటారు
వ్యాసుడు చెప్పాడు - అమ్మవారి భజన చేయడం వలననే అమ్మ దయకు పాత్రులం కావచ్చును అని !-
జగదంబ యాగం చేయడం ఒక నారాయణునికి మాత్రమే సాధ్యం అయింది - ద్రవ్య -కర్మ -మంత్ర శుద్దులు మూడు ఉంటేనే యజ్ఞం యాగం ఫలిస్తుంది అని వేదాలు చెప్పాయి -
ద్రవ్య శుద్ది లేనందు వలననే పాండవులు రాజసూయ యాగం చేసిన ఫలం దక్కక - నెల రోజుల లోనే - వనవాసం "చేయ వలసి వచ్చింది -అట !
సత్యం పలుకడమే తన వ్రతంగా చేసుకున్న సత్య వ్రతుడు "-ఐం " అన్నఅమ్మవారి మహా మహిమాన్విత మైన దివ్య మంత్ర బీజాన్ని ఉచ్చరించి అమ్మదయకు పాత్రుడైనాడు -
లలితనామాలు చదివే వారు చక్కగా చక్కని ఉచ్చారణ తో పలుకుతూ - అర్థం తెలిసి కొని- చదవడం వాళ్ళ సంపూర్ణ ఫలితాన్ని పొంద గలరు.


NOV 15 2014


ఈ రోజు మూడవ రోజు- బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు దేవీ భాగవత సప్తాహకార్య క్రమంలో చెప్పిన అంశాలు భక్త ప్రహ్లాదుడు త్రిగునాత్మక ప్రభావం తో అహంకార యుతుడై - నర నారాయనులతో యుద్ధం చేయడం - ఉర్వశి పుట్టుక - కోపం స్వభావం -కోపం వల్ల అనర్థాలు అనేకం - నూరు అశ్వ మేధా యాగాలు చేసిన ఫలితాన్ని కోల్పోతారు -కోపం తో అనారోగ్యం -అహంకార మమకారాల సంయుతం - ఎదుటి వానికి తన పుణ్యం సగం ధార పోసిన వాడు అవుతున్నాడు ఆహారం అంటే ఏమిటి ?కేవలం పొట్ట నింపడానికే ఆహారం అనుకుంటాము కాని - -ఆహార స్వభావం మారుతూ ఉంటుంది - కళ్ళకు ఆహారం రూపం -నాలికకి రుచి -ముక్కుకు వాసన -చెవులకు వినడం -ఇలా పంచేంద్రియాలు శబ్ద స్పర్శ రస రూప గందాలకు లోబడటం వల్ల అహంకార పూరితుడై -ఇంద్రియాల కు లోబడి మనిషి జన్మ పరమార్థాన్ని గుర్తించ లేక పోతున్నాడు -
నారాయణుడు శరణాగత వత్సలుడై -చేసిన పనుల వల్ల కలిగిన పాపాలకు -అనేక శాపాలకు గురి అయ్యి క్షుద్ర యోనులందు అవతరించడం జరిగింది - ఎవరు జేసిన కర్మ వారు అనుభవింపక తప్పదు అన్నట్లుగా దేవతల కోసం రాక్షస సంహారం కోసం నానా బాధలు పడ్డాడు -
మనుజులేకాడు దేవతలు సైతం ఇంద్రియాలకు వశుడై తనను తాను తెలుసు కోలేక పోతున్నాడు - కొంత మంది యాత్రల వల్ల మనసు శుద్ది అవుతుందని అనుకుంటారు కాని -
యాత్రలు చేసే వారు మొదట మనశ్శుద్ది చేసుకోవాలి - లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా లాభం ఉండదు - కళ్ళు కుండను గంగ నీటిలో ఉంచినా కూడా మాలిన్యాలు పోనట్టుగా యాత్రా ప్రభావం ఉండదు -కదా1
కాశీ క్షేత్రం అంటోంది- రారా నావద్దకు -నీ పాపాల రాశిని భస్మం చేస్తాను అని !
నైమిశారణ్యం పిలుస్తోంది --నీ మనస్సును నెఉ ఇక్కడ ప్రశాంతంగా ఉంచుతాను అని !
గంగా నది చూస్తుంది -గత జన్మ పాపాలను తన పవిత్ర జలాలతో కడిగి వేయాలని -!
కాని కూపస్తమండూకంలా ఇల్లే స్వర్గమని --పంజరం లోని చిలుకలా -అదే లోకమని భావిస్తాడు !
భారత దేశం లో ఎనో క్షేత్రాలు మానవులకు సాధక ధామాలుగా మోక్ష ప్రదాతలు గా ఉంటున్నాయి - కాని అహంకార మమకారాలకు ఇంద్రియ నిగ్రహం లేక దాసుడై -వశుడై -సంసార బంధాల్లో చిక్కి విల విల లాడుతున్న్నాడు -బుద్ది హీనుడై పరమాత్మ ను గుర్తించ లేక పోతున్నాడు - అందుకే ఎవరికైనా -ఎప్పుడైనా -"అన్యధా శరణం నాస్తి -త్వమేవ శరణం మమ"
జగదంబ ను ఆశ్రయించడం వల్ల మాత్రమే సాత్విక స్వభావం అలవడి -మోక్షాన్ని పొందడానికి అర్హత కలుగుతుంది -

NOV 16, 2014
నేడు నాలుగవ రోజు- బ్రహ్మశ్రీ పురాణం మేహేశ్వర శర్మ గారు -దేవీ భాగవత ప్రవచనాలలో - రాక్షస రాజైన భక్త ప్రహ్లాదుడు -జగదంబ ను స్తుతించడం -దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధం లో అమ్మ దేవతల పక్షాన రావడం -చూసీ -"-అమ్మా! మేము కూడా నీ బిడ్డలమే - మా రాక్షసులకు చాలా అన్యాయం జరిగింది -అమృతం ఇవ్వకపోవడం - కపటం తో బలిని అణచి వేయడం - హిరణ్యాక్ష -సోదరులను వంచించి చంపడం - ఇదేమిన్యాయం-? తల్లీ!" అంటూ స్తుతించడం -అమ్మ కరుణించి దయ తలచడం చెప్పారు
రాక్షస గురువైన శుక్రాచార్యుని తల్లిని హరి తన చక్రాయుధం తో నరకడం -కశ్యపుడు హరిని -తన భార్యను తనకు దూరం చేసిన హరి కూడా తన లాగే భార్యను కోల్పోయి కష్టాలు పడుగాక -! క్షుద్ర ప్రాణుల యోనులలో జన్మించేదవు గాక ! అని శపించడం -చేసిన పాపానికి హరి సీతను పోగొట్టుకొని బాధ పడటం - పంది -తాబేలు- సింహం ప్రాణుల లాంటి అవతారాలు ఎత్తడం చేశాడు
సాయంత్రం కృష్ణావతారం గురించి చెబుతూ -- కృష్ణుడు నానా కష్టాలు పడ్డాడు పుట్టిన నాటినుండి అవతార సమాప్తి వరకూ ! అతన్ని అడుగడుగునా శంకరుడు రక్షించాడు -రుక్మిణి కోరిక మేరకు 6 నెలలు ఘోరమైన తపస్సు చేసి ఈశుని మెప్పించి వరములు పొందాడు - ఈశుడు ఉమాసహితుడై కనికరించాడు -సంతానం ఇప్పించి "-గృహస్థ ప్రవర" అన్న బిరుదును అనుగ్రహించాడు
కృష్ణుని కష్టాలకు కారణం అతడు మానవ జన్మ ఎత్తడమే - ఎల్ల శరీర దారులకు -భార్యా పిల్లలు సంసారం -అనే అగచాట్లు తప్పవు- రాముడు కృష్ణుడు మానవ జన్మ ఎత్తినందుకు -అందరిలాగే సామాన్యుని వలె- తిండీ - నిద్రా- సుఖ దుఖాలకు గురి అయ్యాడు -- కృష్ణుడు తన ఇష్ట దైవ మైన శంకరుని గూర్చి తపస్సు చేసి శక్తి మంతుడై రాక్షసుల సంహరించి -శిష్ట రక్షణ చేశాడు -
మనలో ఉన్న ఆరువురు శత్రువుల తో బాటు అహంకార మమకారాల ప్రభావం వల్ల - మనం కూడా దైవానుగ్రహానికి నోచుకోకుండా పతన మౌతున్నాం - అమ్మను శరణు వేడాలి -సర్వం అమ్మ ప్రసాదంగా భావించాలి -
లలితా సహస్ర నామాలు చదివే సమయంలో -- అమ్మ గురించిన ధ్యాన శ్లోకం - --
" అరుణా కరుణా తరంగి తాక్షం !ధృత పాశాంకుశ ------ " చివరలో" అహమిత్య విభావయే భవానీం -"
అనగా నీవే అమ్మ వై పోతున్నావు - జగదంబ ఎంత సమర్తురాలో అంతగా నీవు లలిత సహస్ర నామాలను చదవడం వలన అద్భుతమైన అమ్మవారి స్వరూపాన్ని దరించ గలుగు తున్నావు -ఈతి బాధలకు అతీతంగా ఉంటున్నావు - జగదంబ పాదాలకు భక్తి తో మోకరిల్లిన దేవతలకు - దానవులకు -మానవులకు అమ్మ దయ ఉంటుంది -నీలోని వికారాలు నిన్ను బాధించవు - ఆపిల్ పండును నీవు ఆస్వాదించడం వలన నీవు ఆ పండు గా మారి పోతావు - అలాగే భువనేశ్వరీ మాత ను మనసా వాచా కర్మణా ఆరాధించడం వలన నీవు జన్మ రాహిత్య మైన మోక్షాన్ని పొంద గలుగుతున్నావు 

LIFE is a Journey

జీవితం చలివేంద్రం లాంటిది -కొంత మంది కలుస్తుంటారు తర్వాత విడిపోతారు -ఎవరు ఎవరితో కలుస్తారో -ఎంతకాలం కలిసి ఉంటారో -ఆ కలయిక మాటలు ఒక నాటకంలోని పాత్రలు అంతే -తర్వాత ఎవరికీ ఎవరో -rtc బస్సు లో టికెట్ లా ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో ఎంత దూరం పోవాలో -అంతా ముందుగా నిర్ణయం మన ప్రయాణం -ప్రవహించే నీటిలో కనబడే చెట్ల ప్రతి బింబం లా మనసు కుదురుగా లేకుంటే నిలకడ లేని జీవితం -ధ్యేయం లేని బ్రతుకు -అవుతోంది - నిశ్చలం గా ఉన్న చెట్టును చూస్తే గాని మనసు నిలకడ ఉండదు -
దేహాలు వేరుగా ఉన్నా ఆత్మ ఒక్కటే -అలాగే దేవాలయాలు ఎన్నో ఉన్నా ఒక్కటే

NOV 14, 2014

ప్రయాగ క్షేత్రం




ప్రయాగ క్షేత్రం - గంగా యమునా అంతర్వాహిని సరస్వతీ ఈ మూడు పవిత్ర నదీ ప్రవాహాల త్రివేణీ సంగమస్థానం లో వేణీ దానం చేస్తారు - ఈ మూడు నదుల సంగమ స్థానం లో దంపతులు ఇరువురు పవిత్ర స్నానాలు చేసిన తర్వాత - భర్త స్వయంగా తన భార్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని- చక్కగా ఆమెకు తానే స్వయంగా - జడను మూడు పాయలుగా (అవే ఈ మూడు పవిత్ర నదుల సంగమ ప్రవాహాలు ) విడదీసి నిదానంగా జడను వేసి- పూలు పెట్టి -బొట్టు పెట్టి -చేతికి గాజులు -కాళ్ళకు పారాణి అలది - పట్టాగోలుసులు అమర్చి - వెలికి బంగారుఉంగరం ఉంచి -ఆమెను మహాలక్ష్మిలా అలంకరిస్తాడు - తర్వాత బ్రాహ్మణుల మంత్రోచ్చారం ద్వారా -ఆమె జడ చివర కొంత భాగాన్ని కత్తిరించి -ఆ కేశాలను అదే త్రివేణీ సంగమం లో విడుస్తారు -ఈ విధానాన్నే వేణీ దానం అంటారు - ఒక్కసారి మాత్రమే ఈ విధంగా దంపతులు చేయవలసి ఉంటుంది - ఆ నదీమ తల్లుల ఆశీస్సులు పొందడం వలన వారికి సకల సౌభాగ్యాలు కలిగి -పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగి - సత్సంతానము -దైవానుగ్రహము -ప్రాప్తిస్తాయి -ప్రయాగ క్షేత్రంలో వేలాది జంటలు రావడం - పవిత్ర స్నానాలు చేయడం -దర్శించుకోవడం వేద కాలం నుండి వస్తున్న సాంప్రదాయం -

జీవుడంటే ఏవరు ?

జీవుడంటే ఏవరు ?"
ఈ ప్రశ్నచాలాజటిలమైనది రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములు కూడా తమ జీవితాలను ఫణంగా పెట్టి పరమాత్ముని చేరడానికి ఎంతో ప్రయాస పడ్డారు -భగవద్గీత సారాంశమే దీనికి జవాబు -జీవుడు సనాతనుడు దీనికి చావులేదు -జీవుడు -నిత్యం బ్రహ్మ సత్యం -జగత్తు మిథ్య -ఇవి జగద్గురువు శంకరా చార్యులు ప్రతిపాదించిన నిత్య సత్యాలు మన జీవన సూత్రాలు -పరమార్థాన్ని సూచించే ఆధ్యాత్మిక సోపానాలు జీవుడంటే దేవుడు- దైవాంశ సంభూతుడు -దేవునుకి ఎన్ని సులక్షణాలు ఉంటాయో అన్నీ ఈ జీవునిలో ఉన్నాయి -అవి మన బ్రతుకు ఉజ్జ్వలంగా మహాఉన్నతంగా దేదీప్య మానంగా మన బ్రతుకును దిద్దడ గలవు -మనం ఈ ఉనికి గుర్తించాలంటే ఆత్మ విచారం అవసరం -
ప్రతీ ప్రాణిలో జీవుడు ఉన్నాడు - దాని వల్ల ప్రాణంఏర్పడి జీవన చర్యలు ఉంటాయి -జననం నుండి మరణం వరకు ఉన్న జీవుడు గత జన్మ సంస్కారంతో చలామణి అవుతాడు ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క రూపంతో భిన్న స్వభావాలతో భిన్న సంస్కారాలతో ప్రవర్తిస్తుంటాడు -దేవుడు పది అవతారాలు మాత్రమే ఎత్తాడేమో కాని ఈ ప్రాణులు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాయో -ఎత్తుతాయో ఎవరికీ తెలియదు ఆ జీవుడు గత జన్మలలో ఆచరించిన సుకర్మ -దుష్కర్మ ఫలితంగా పాపపుణ్యాల అనుభవిస్తూ ఉంటాడు --
ప్రతి మనిషి ఒక నడుస్తున్న దేవాలయం అంటారు -నిజమే జీవి చేసుకున్న పుణ్యం వల్ల సద్బుధ్ధితో చక్కని కర్మలు చేస్తూ భగవత్ చింతనతో తన హృదయం దేవాలయంగా చేసుకుంటాడు ఆ జీవుడు అనగా ఉద్ధరింప బడతాడు మాత్రం ఉంటుంది -పురాణాలు ఎన్ని విన్నా -క్షేత్రాలు తీర్థాలు ఎన్ని దర్శించినా -ఆత్మ శుధ్ధిలేని పుణ్య కర్మలు ఎన్ని ఆచరించినా - జన్మ తో బ్రాహ్మణుడైనా కూడా తన నడవడిద్వారానే తనలోని జీవుడిని ఉద్ధరించు కుంటాడు
దేవాలయంలో లోన బయట పరిశుభ్రతను పాటించి మానసికంగా శారీరకంగా దైవ చింతన చేస్తూపొరపాటు చేయకుండా దేవుని పై చిత్తం ఉంచి జాగ్రత్తగా ఉంటాము -మనలోని జీవికి దైవ లక్షణాలు ఉన్నయి అనడానికి ఇదే కారణం - ఎందఱో మహానుభావులు ఎంతోక్రుషి చేసి తమ లోని జీవున్ని ఉద్ధరించు కున్నారు -
అన్ని ప్రాణుల కంటే మనిషిలో ఉన్న ప్రాణికి అనగా జీవుని కి భగవంతుడు తనకు తాను ఉద్ధరించుకునే శక్తినీ బుద్దినీ -వివేకాన్నీ -ఆలోచనా జ్ఞానాన్నీ ప్రసాదించాడు -అందుకే అన్ని జన్మల్లో కెల్లా -మానవజన్మ దుర్లభమనీ అన్ని ప్రాణులలో కెల్లా మానవుడే ఉత్తమమనీ -వేదాలు శాస్త్రాలు అతన్ని మంచి మార్గంలో నడిపించెందుకే మహాత్ములు చెప్పారు -
" నేను ఎవరు ?" అన్న నిరంతర ఆత్మవిచారంతోనే మనిషి ఉద్ధరింప బడతాడు- ఈ దేహం తాను తెచ్చుకున్నది కాదు - జీవుడు ధర్మమార్గంలో నడవడానికి ఉపయోగించుకునే పరికరం మాత్రమే -జీవునికి ఈ శరీరం ఒక వస్త్రం లాంటిది దీనిపై వ్యామోహం తగదు- లొపలఉన్న జీవుని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి -- "నిత్యం సన్నిహితో మృత్యు 1కర్తవ్యం ధర్మ చింతనం !"- ఎప్పుడు ఈ జీవుడు ఎగిరిపోతాడో తెలీదు దీపం -ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి ఈ జీవుడు ఉద్ధరింప బడటానికి దేవుడిచ్చిన చెక్కని అవకాశం ఈ మానవ జన్మ! దీనిని --ఉపయోగించుకోవడం మానవ లక్షణం - మరో జన్మఅంటూ ఉండకుండా భగవంతుని చరణారవిందములను గూర్చి పూజించడం- స్మరించడం -భజించడం- సేవించడం చేయాలి -జన్మ ధన్యం చేసుకోవాలి!

NOV 22, 2014

దేవునిసేవ

దేవునిసేవకు గాని -నిరుపేదలకుగాని ఇవ్వడం తెలియని వాళ్లకు దేవుణ్ణి కోరికలు అడిగేహక్కు లేదు -ఇచ్చిన వానికే అడిగేహక్కు ఉంటుంది -బలిచక్రవర్తి "దానం -చేయడంలో ఎదుటి వాడు ఎవరైనా- ఏదైనా సందేహించడు -చివరికి తన గురువు చెప్పినా తన ధర్మాన్ని నిర్ణయాన్ని మార్చుకోడు - ఇస్తాడు-అలా -మనం కూడా దానం -త్యాగం చేయడం అలవాటు చేసు కోవాలి - దానం చేసే బలిని ఆపాలని చుసిన అతని గురువు శుక్రా చార్యున్నిశ్రీహరి శిక్షించిన విధంగా -భగవంతుడు అలాంటివారిని క్షమించడు 
నిత్యం దైవ భజన చేస్తూ ఉండే ఒక దంపతులకు ఒక పదేళ్ళ కొడుకు ఉండే వాడు - ఒక రోజున ఇంట్లోతలి దండ్రులు భజనచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ కొడుకు చనిపోతాడు -తల్లి ఏడుస్తూఉంటె తండ్రి ఊరడిస్తాడు- కాని కన్తతల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది -అప్పుడు అటుగావెళ్తున్నకృష్ణ భక్తుడు " చైతన్య మహా ప్రభువు "ఆ తల్లి రోదనవిని పిల్లవాణ్ని బ్రతికిస్తాడు - ఆ బాలుడు కళ్ళు తెరచి అ మహాభక్తుణ్ణి చూసి "స్వామీ! నన్ను ఎందుకు బ్రతికించారు ?- దైవనామస్మరణ జరుగుతున్న సమయంలో నాకు మృత్యువు కరుణించింది!" -అనగా" మీ తల్లిదండ్రులు నీకై ఏడుస్తున్నారు"! అంటాడు - దానికి జవాబుగా ఆ బాలుడు నవ్వి" ఈ జన్మకు వీరు నాకు తలి దండ్రులు- నేను గతజన్మలో ఎందరికి తండ్రినో? --ఎందరికి కొడుకునో ? ఎవరికీ తెలుసు ?-ఈ జన్మబందాలనుండి నన్ను విముక్తున్నిచేసే దైవనామస్మరణ ఇక్కడ జరగడం నా అదృష్టం -ఇలాంటిఇంటిలో-ఇలాంటివారి కడుపులో జన్మించడం నేను చేసుకున్న పుణ్యం ! ఇంత చక్కని క్షణాల్లో చనిపోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది - మహాత్మా ! నన్ను కరుణించి -నాకు ముక్తిని ప్రసాదించండి" అనగావిన్న వారందరూ దైవ నామ స్మరణ -భజన ఎంత గొప్పదో తేలుకొని -నిరంతరం హరిభజన చేస్తూ -ఇతరులలో దైవాన్ని దర్శించుకుని పునీతులౌతారు
యాగాలు- క్రతువులు -జపాలు -హోమాలు దీక్షతో చేయలేము - మనసును ఆధీనంలో పెట్టుకోలేము - కేవలం మానవ సేవ - హరి భజన చేస్తూ మనజన్మ ధన్యం చేసుకోనవచ్చును-
"సత్యం- ధర్మం!" -ఇవి రెండు పాటించే వానికి జయం కలుగుతుంది - సత్యహరిశ్చంద్రుడు ఆ ధర్మాన్ని అక్షరాలా పాటించాడు -" హరిశ్చంద్ర సమోరాజా --నభూతో నభవిష్యతి " అనిపించాడు -తాను- తనభార్య- తనకొడుకు -ధర్మనిరతులై పేరు తెచ్చుకున్నారు- భార్య గయ్యాళి అయినా భర్త ఆమెను చక్కబెట్టు కోవాలి -అలాగే భర్త చెడునడక నడచినా భార్య ఓర్పుతో అతన్ని సరిచేసుకోవాలి -ప్రతిరోజు ఏదైనా ఒక మంచిపని చేయడం- ప్రతి మనిషి తన ధర్మంగా -వ్రతంగా పెట్టు కోవాలి -ఈ సత్యం అందరికీ తెలుసు -కాని ఆచరించడం తనధర్మంగా చేసుకోవాలి -దారిలోవచ్చే ఇబ్బందులు అధిగమించడం ద్వారా అతడు ఇహపరాలు సాధిస్తాడు


NOV 29, 2014

తిరుమల వెంకటేశ్వర స్వామీ

తిరుమల వెంకటేశ్వర స్వామీ వారి దర్శనార్థం -సంకల్పం చేయడం - స్వామి కరుణించి ఆ భాగ్యాన్ని అనుగ్రహించడం అనుకోకుండా - అంతా శ్రీ వారి లీలగా జరిగింది -- అలిపిరి వైపు నుండి మెట్ల దారి గుండా వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సారి రెండవ వైపున గల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామిని దర్శించు కోవాలని అనుకున్నాము - శ్రీనివాస మంగాపురం నుండి గల శ్రీవారి మెట్ల ద్వారా నడక ఉపక్రమించాము -- అలిపిరి వైపున ఒక్క చోటుననే మెట్లు నిటారుగా ఎత్తుగా ఉన్న మోకాళ్ళ పర్వతం ఉంది-- అక్కడ మెట్లు ఎక్కడానికి విధిగా మోకాళ్ళు పట్టుకుని ఎక్క వలసిందే !- అంత ఖచ్చితంగా ఉండటం వల్ల - గుట్ట ఎక్కుతున్న ప్రయాస కలుగుతుంది - నిజానికి మాకు విపరీత మైన మోకాళ్ళ నొప్పులు - 70 ఏళ్ల వయస్సు- 2500 మెట్లు- సుమారు 3కిలోమీటర్ల దూరం- ఎక్కగలమా ? అన్న సందేహం వచ్చినా - స్వామి మీద భారం వేసి -ప్రయాణం సాగించాము -- అదేమీ చిత్రమో 1- ఒక్క చోట గాక అంతటా అన్నీ మెట్లు - మోకాళ్ళ పర్వతం వలెనే- మరీ నిటారుగా ఉన్నాయి -అయినా మాకు ఆయాసం -అలసట- బాధ- ఏమాత్రం కలగ లేదు- ఇది స్వామి వారి లీల కాక మరేమీ కాదు కదా!
వైకుంట కాంప్లెక్స్ -లోని ధర్మ దర్శనంకొరకు రెండుసార్లు నడక ద్వారా వెళ్ళడం - పుష్కరిణి స్నానం - వెంగమాంబ అన్నప్రసాదం - లగేజి నిమిత్తం తల నీలాలు ఇవ్వడం కొరకు -లడ్డు కౌంటర్ కు వెళ్ళడం - ఇలా శ్రీవారి సన్నిధి లో ఎన్ని సార్లు కాలి నడకన తిరిగినా-- ఏమాత్రం కష్టం కాలేదు - కాళ్ళ నొప్పులు రాలేదు - కాటేజ్ తీసుకో కున్నా - విశ్ర్ఫాంతి లేకున్నా - బాధ అనిపించ లేదు -
ఒకే రోజున రెండుసార్లు శ్రీవారి దర్శనం దివ్యంగా లభించింది -- అడుగడుగునా స్వామిని " గోవిందా 1 గోవిందా ! "అంటూ తలచు కోవడమే మేము చేసుకున్న పుణ్యం ! శ్రీ వారి లీలలు గాక ఇంత సులభంగా ఆనందంగా పరమ అద్భుతంగా -సులభంగా దివ్యంగా స్వామీ దర్శనం లభించడం మామూలు మాటలా ! 
సోమవారం రోజున శ్రీ వారి దర్శనం దివ్యంగా జరిగింది -అద్భుతంగా అగుపించాడు స్వామీ -! ఈ రోజున తన ఆనంత ప్రభలతో -వెలుగొందిన తేజో మూర్తిని మాకు దర్శింప జేశాడు - చేసుకున్న పుణ్యమో - పెద్దల దీవనయో - ఈ జన్మ కింత దయ చూపాడు చాలు !--
వెండి వాకిలి నుండి భక్త బృందం తో బంగారు వాకిలి వేపు స్వామీ దర్శనార్థం పరుగులు పెడుతున్న సమయంలో - ఆనంద నిలయం గర్భ గుడికి కుడి వైపున గల స్వర్ణ మహా లక్ష్మి దేవి విగ్రం వైపు నుండి సూర్య భగవానుని సాయంకాలపు లేత బంగారు కిరణాలు ఆలయంలోకి ప్రసరించాయి - ఆనంద నిలయ స్వర్ణ గోపురం ఆలయం- దివ్య కాంతుల్లో ధగ ధగ మెరిసి పోయింది -- 
భక్త బృందం క్రమంగా బంగారు వాకిలికి ఎడమ వైపున నుండి శ్రీవారి సన్నిధిని చేరే సమయంలో తిరిగి సూర్య నారాయణుని సంధ్యా సమయ లేలేత కిరణాల ప్రసరనతో ఆలయంలోని స్వర్ణ మాయ శోభలు అద్భుతంగా కను విందు చేశాయి --" లోన ఉన్నదీ - బయట ఉన్నదీ నేనే ! "అని చెప్పుతున్నట్లుగా తోచింది - 
లోనికి భక్తబృందం తో బాటు ఆనంద నిలయం లోనికి ప్రవేశించి -శ్రీవారి కి అభిముఖంగా నిలబడటం -అనంత శోభలతో విరాజిల్లే స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని పాధములనుండి మకర తోరణం వరకు ఈ కళ్ళకు - చూసే పరమానందం కలిగింది పరమాత్మ అంటే ఇతడేకదా !అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు - జగన్మోహనా కారుడు - లీలామానుష విగ్రహుడు - దేవాది దేవుడు - ఆపద మొక్కుల వాడు ఆపద్బాంధవుడు - -ఏడూ కొండల వెంకట రమణుడు - శ్రీనివాసుడు - శ్రీవేంకటేశుడు - నిరంతరం భక్త జనావళిని రప్పించి వారి ఆపద మొక్కులను గ్రహించి - కోరిన కోర్కెలు దీర్చే గోవిందుడు - మాధవుడు - అచ్యుతుడు --నిర్గుణ నిరాకార సచ్చిదా నంద స్వరూపి కి దర్శిస్తూ మమ్ములను మేమే మరచి పోయాము -ఆ రెండు నిముషాలు ఎదురుగా శ్రీ వారిని చూస్తూ అలౌకిక ఆనంద అనుభూతి లోమునిగి పోయాము -
-ఎన్నడు లేనంత సౌందర్యం - శోభలతో - గజ మాలలతో స్వర్ణ భూషిత మణి మయ ఆభరణాలతోఅందంగా అల్లంత దూరం నుండే దివ్యంగా భవ్యంగా - శత కోటి చంద్ర ప్రకాశంతో తిరు నామాలతో -భుజ కీర్తులతో వజ్ర మకుట కిరీటం తో సూర్య కాంతి ప్రభలతో వెలుగులు విర జిమ్ముతూ విరాజిల్లే శ్రీ వెంకటేశ్వరా స్వామి కన్నుల పండువుగా దర్శనమిచ్చాడు -- ఇదే సమయంలో గర్భగుడిలో స్వామి మూర్తి కి ముందున అర్చకుల వారు మంగళ హారతిని వెలిగించి స్వామికి ఇస్తూ స్వామిని పాదాలనుండి శిరస్సు పై గల కిరీటం వరకు దీప కాంతులలో స్వామీ దివ్య మంగళ విగ్రహాన్ని తిలకించమని చూసి తరించ మని అన్నట్లుగా హారతిని రెండు నిముషాల పాటు స్వామికి నీరాజనం పట్టాడు -- ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఈ మాంస నేత్రాలు చాలవు - చూసి స్వామీ వైభవం ఇలా ఉందని చెప్పడానికి మాటలు చాలవు - స్వామీ దివ్య వైభవ సొగసులను - కళ్ళు చెదిరే సౌందర్య కాంతులను వర్ణించడానికి శక్తి చాలదు -శబ్దాలు పనికి రావు -కలం సరి పోదు -
ఆ సమయంలో స్వామిని దర్శించిన భక్తుల అద్వితీయమైన అనుభూతి ఆనందం చెప్పనలవి కాదు "-గోవిందా! -వేంకటేశా !-శ్రీనివాసా!" అంటూ సంతోషంతో రెండు చేతు లెత్తి స్వామికి బిగ్గరగా జేజేలు - పలకడం తప్ప -ఆ విధంగా తమ సంతోషాన్ని ప్రకటించడం తప్ప -మరేమీ చేయలేని అజ్ఞానులం !ఆ రెండు నిముషాలు స్వామికి ఎదురుగా స్వామీ సన్నిధిలో స్వామిని ఆపాద మస్తకం దర్శించే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన దేవాదిదేవునికి ఏమిచ్జ్చి ఋణం తీర్చు కోన గలం -! జీవితంలో మరచి పోలేని మరపురాని అనుభూతులు -మధుర స్మృతులు ఇవి 1మానవ జన్మ ను ధన్యం చేసే దివ్య సందర్శనం -ఈ క్షణాలు -!

SEPT 16, 2015

Mother Theresa

మదర్ థెరిసా- ---మాతృ ప్రేమ 
--------------------------- 
1- మాత లందరికి మాత -మన భరత మాత 
-మదరు థెరిసగ- వెలసిన విశ్వ మాత-!
దీను లెంద రికో దిక్కైన -విమలచరిత -
వందనం బిదిగో శతకోటి- మదరు థెరిస !
2-నరకమనిపించు- నగరాల వీధులందు-
ఘోరమైనట్టి ఆకలికి - చచ్చి పోవు-
చలికి గజ గజ వణకుచు -గడ్డ కట్టి -
నిలువ నీడైన లేకుండు- నిర్భాగ్యు లందు -
తల్లి ప్రేమానురాగాల కురియ జేసి -
కుష్టు రోగాలచే -కుళ్ళి కంపు కొట్టు -
దళిత పీడిత తాడిత -ఆనాథ లకును -
నిలువ నీడయు -కడుపుకు తిండి పెట్టి
ఎందరెందరినో -నీ ఒడిలోన చేర్చి -
కరుణ పూరిత నయనాల -నాదరించి
మాతృ ప్రేమను పంచితివి -మదరు థెరిసా !
3- దిక్కు లేనట్టి వారికి -దిక్కు నీవు-
ఆకలైనట్టి వారలకు -అన్నపూర్ణ !
పేద వారలపెన్నిది -పెద్ద తల్లి 1
బడుగు జీవుల పాలిటి -కల్పవల్లి !
4- పేద సాదల సేవయే -దైవ పూజ !
అనుచు చూపించి -ఆచరించావు నీవు 1
ప్రేమ ఆప్యాయతలనే -పంచినావు -
నిర్మల హృ దయ్ -నెలకొల్పి నిలిపి నావు 1
5- దేవుడెక్కడో లేదమ్మా నీ వద్ద తప్ప-!
దేవదూతయై దేవతై -వచ్చినావు -
మూగ ప్రాణాలనెన్నో- దయ జూసినావు-
ఆలయం బయ్యె -నీ పవిత్ర ఆత్మ ఇంక !
6- ఎక్కదోపుట్టి ఇక్కడే-- పెరిగి నావు -
పెద్ద మనసుతో -ఎంతయో ఎదిగి నావు -
జాతికులమతా లకు -అతీతముగను -
మానవతా వాదమును - నెలకొల్పినావు
7- దిక్కు లేనట్టి పేదలు -నిన్ను తలచి -
ప్రేమ కురిపించు వారలు- ఇకలేరటంచు -
దీనులు -దరిద్ర నారాయణు -లేడ్వసాగినారు-
ఆదరింప గ రావమ్మ -1 మదరు థెరిసా !
మరలి రావమ్మ 1మమతానురాగ కలిత 1
కరుణ పూరిత నిర్మల హృదయ చరిత 1
8- ఎందరెందరో నీ బాట-- నడచి నారు -
పేద సాదల బ్రతుకుల - నుద్ధరింప-
దీన జన బాంధవుల -మిగుల నాదరింప
ఎందరో రావాలి -కావాలి !మదరు థెరిసా !


oct 1, 2015

కరీంనగరము - Karimnagar

1- కరీం నగరము -మన కరీం నగరము -
-జనం -జ్ఞానముతో -జాగృతినీ పొందుచున్న -11క!!
2- నాగరికత నడకలను -నవీన ప్రణాళికలను 
అమలు పరచి -సత్వరముగ 'అభివృద్ధిని పొందుచున్న !!క !
3- మన జిల్లాకరీం నగరం - మన పాలిట భాగ్య నగరం 
సిరి సంపదలకు తావు -విరిసిన మందార పూవు 11క 11
4 - శక్తి వనరు లెన్నొ గలవు - ప్రజా శక్తికి ఇది నెలవు -
అంచెలంచెలుగ ఎదిగే -శ్రామికులకది చిరు నగవు !!క !1
5- -గోదావరి ఖని అదిగో - గోదావరి పొంగు లవిగో 1
నల్లని బంగారం తో - మన జాతిని సింగారించిన !1క !1
6- - తీయనైన జీవ నదుల -నలరించిన ఈ నేల -
మధురమైన -చెరకు పంట - పండించిన ఈ నేల !1క !1
7- లక్షలమందికి ఆశ్రయ - మిచ్చు చున్న జిల్లా ఇది -
లక్షణముగ -ఆక్షయముగ - లక్ష్యమును సాధించునది !1క !1
8- - తాడిత పీడిత దళిత - జాతుల కందించు చేయి -
తిండీ -గుడ్డా -ఆశ్రయము -చేకొని పొందు హాయి !1క !1
9- నిన్నటి రోజున ఇది ఒక ----విరిసీ విరియని మొగ్గ --
నేడు చూడు 1 జన ప్రభంజ-- నాల ఎదిగిన లగ్గ !1క !1
10- సాహిత్య -కళా రంగ -సాంస్కృతిక రంగములలో -
పారిశ్రామిక పథములు -పరుగున పయనించు చున్న !1క !1
11 --విప్లవాల వెలుగుల్లో - నిరక్షరాస్యతా చీకటి --
సమసి పోవ -సంఘటించి -అక్షర ఉజ్వల గా మారిన !1క !1
12- మహిళా మణులందరు --పలు రంగాల్లో ప్రవేశించి -
ప్రావీణ్యత కై కట్టుగ -ఉద్యమింప -సమకట్టిన !!క !1
13-- పేద వాని చెమట పిండి -మరింత పేద వాని చేయు -
సారా రక్కసి కోరల --చీల్చి చెండాడుచున్న 11క !1
14- సమస్యలకు మా -రణము - వ్యవస్థల కు తోరణము -
సమానత తో నిండిన -ప్రజాస్వామ్య పరిణామము !1క !1
- 15- వేదికలతో పని లేక -వేడుకల అవసరము లేక -
వాదించే వారెక్కువగా - కలిగినప్రాంతమిది !!క !1
16- తప్పుల తడకలు కొందరి - బుద్ధుల నడిపించు చుండ -
చిత్త శుద్ది లేని స్వార్థ -బుద్ధులను రూపు మాపు !1క !1
-" శ్రమ శక్తి ప్రధానముగా -గ్రామాలే కేంద్రముగా -
యువ విద్యావంతులు -నేతలు- సాధనాలు కావాలి !-
తెలంగాణ మకుటముగ - కరీం నగరు నిలవాలి !!క !1 " -


oct 12, 2015

దేవుళ్ళ చిత్ర పటాలు

మన దేవుళ్ళ చిత్ర పటాలను - బొమ్మలను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పడ వేయడం - చెత్తా చెదారం వద్ద- టాయిలెట్ గదుల యందు మన దేవతలపోస్తేర్ లను తగిలించడం -నిత్యం గమనిస్తున్నాం -ఇలామన ఆరాధ్య దైవాలను - మన సంస్కృతిని -ఇలా అసభ్యకరంగా కించ పరచడం - ఇతరుల ముందు తలదించు కునేలా చేయడం -మనకు తగని పని - మన దేవతలను అగౌరవం చేయకండి -దేవతల పోస్టర్లను పుస్తకాలను కరపత్రాలను బజార్లో- తోక్కిల్లలో పారవేయకండి - ఇతర మతాల వారు ఎంత జాగ్రత్తగా -పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటారో గమనించండి ! -- ఇది మనహైన్ధవ జాతికి అవమానం - సిగ్గుపడే విషయం - పాతవి చిరిగి పోయినవి- దేవతా చిత్రాలు ఉంటె నీళ్ళలో నిమజ్జనంచేయండి -- 
మనం సంస్కారంగా సభ్యతగా ఉందాం 

NOV 5, 2015

భగవంతుని శరణుకి ఆరు నియమాలు

మనం భగవంతునికి శరణు వేడుకోడానికి ఆరు నియమాలు ఉన్నాయి -
1- భగవంతుని శాసనం -మేరకు మన పనులు -కర్మలు పరిమితం కావాలి !--మనం ఆయన సేవకులం మాత్రమే --ఆయన మనకు ప్రభువు !-సేవకుని విధి యజమాని ఆజ్ఞలను పాటించడమే !- కష్టం అయినా -సుఖం అయినా - భగవంతుని లీలగా -అనుగ్రహంగా -ప్రసాదంగా స్వీకరించడం చేయాలి - ఒక ఎండిన ఆకు గాలి వీచడం వలన క్రింద పడినా -తనను తిరిగి చెట్టు కొమ్మ పైకి చేర్చ మని అడగదు - అలాగే భగవంతుని విధివిధానంలో ఎలా జరిగినా సంతోషం -సంతృప్తి పొందాలి ! శరణు కోరడం అంటే ఇదే ! 
2--భగవంతుడు ఇచ్చిన దానితో మనం త్రుప్తి పడాలి -అది మన పూర్వ జన్మల కర్మల ఫలితంగా భావించాలి --ఎంత ఇవ్వాలో-ఎప్పుడు -ఎలా ఇవ్వాలో అతడికి తెలుసు -మనకున్న సంపద -ఐశ్వర్యం -కేర్తి వినోదం -సుఖాలు భగవద్ అనుగ్రహాలు -అది గుర్తించ కుండా ఏ కొంచెం కష్టం కలిగినా "-నాకే ఈ కష్టం భగవంతుడు ఎందుకు కలిగించాలి ?"అని నిందిస్తూ ఉంటారు -జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు సంభవించినా భగవంతున్ని తప్పు పట్టడం -మనం చేసే మరొక తప్పు 1 అతని ప్రేమ అందరికి సమానమే !అందరు అతని పిల్లలే -అందులో హెచ్చు తగ్గులు ఏ కన్నతండ్రి అయినా చూపిస్తాడా ! అలా భావించి పరమాత్ముని మనసారా శరణు వేడాలి 1
3- మనలను అన్ని విపత్తులలో రక్షిస్తాడని -భగవంతుని పై నమ్మకం లేకపోవడం -మన యుక్తులే మనకు రక్షణ అనుకోవడం మన అజ్ఞానం !-పరిజ్ఞానం లేకపోవడం దురదృష్టం ! అతడు మనకు శాశ్వతంగా జన్మ జన్మలకు తండ్రి! -ఈ సృష్టిలో సకల జీవరాసులను సదా సంరక్షిస్తుంటాడు -కోట్ల కొలది చీమలకు ఆహారం అవసరం -- అందులో వేల చీమలు ఆహారం లేకుండా చనిపోతూ ఉండటం మనం గమనించామా !అలాగే ఏనుగులకు పెద్ద మొత్తంలో ఆహారం తింటాయి ప్రతి రోజు -వాటికి కూడా భగవంతుడు తగిన విధంగా సమకూరుస్తాడు -ఒక తండ్రి తమ సంతానాన్ని ఎంతో ప్రయాసపడి వారికి కూడు -గుడ్డా -గూడు - సమకూర్చి పోషిస్తాడు-కదా !జగత్తును శాసించే వాడు -పాలించేవాడు తన బిడ్డలను పోషించకుండా ఉంటాడా !అతని రక్షణలో మనం సురక్షితంగా ఉండగలమని విశ్వాసం కలిగి ఉండటం కూడా శరణాగతి అవుతుంది 
4- కన్నతండ్రి పట్ల కుమారునికి వినయ విధేయతలు ఉండాలి -అలా కాకుండా -"అతని తండ్రి అతన్ని పోషించాడు -అలాగే నన్ను మా తండ్రి పోషించాలి -"అని కృతజ్ఞతా భావం లేకుండా ఉండటం -తప్పు కదా ! అలాగే -జగద్రక్షకుడు - పోషణ కర్త -పరమాత్మునికి మనం కృతజ్ఞత చూపక పోవడం కూడా అజ్ఞానం -అవివేకం -అపరాధం అవుతుంది 1 కర్త -కర్మ క్రియ అన్నీ నీవే స్వామీ 1అన్న భావంతో శరణు కోరాలి 1 
5-మన సంపద బంధువులు వనరులు -అన్నీ మనకు భగవంతుడు అనుగ్రహించినవే -మనం జన్మించడానికి ముందు ఉన్నాయి -చనిపోయిన తర్వాత కూడా ఉంటాయి -అందువల్ల అన్నింటికీ నిజమైన యజమాని భగవంతుడు మాత్రమే- అందులో కొన్ని మనవి అనుకుంటే తప్పు !-ఇతరుల ఇంటిలో జొరబడి అతని అనుమతి లేకుండా -అతని దుస్తులు -ఆహారం- పడక వాడుకోవడం లాంటిద్ ఇవన్నీ మనవి అనుకోవడం 1అందుచేత జగత్తులో ఉన్నప్రతీదీ భగవంతుని వస్తువే అనుకోవడం -అలా భావించడం కూడా శరణా గతి 1
6-మనం చసిన మంచి పనులకు మనం కర్తలమని గర్వించడం -కూడా తప్పే !"-భగవంతుని దయవలన ఆ పని చక్కగా జరిగింది -లేకపోతే నేను చేయగలిగే వాడిని కాదు !"-అని అనడంలో నిజమైన గొప్పదనం ఉంటుంది - అతడి మనం ఒక పరికరాలం మాత్రమే !- శివుని ఆజ్ఞలేనిదీ చీమ అయినా కుట్టదు -అలాగే మనం చేసే కర్మలు అతని ప్రేరణ వలన జరుగుతాయి అంతే కాని --"నేను చేశాను !- నా వల్లే ఇది జరిగింది! - నేను గొప్పవాడిని !"- - ఇలాంటి భావాలు అహంకారాన్ని -అహం పెంచుతాయి -ఫలితంగా భగవంతుని దయకు -కరుణకు -దూరం అవుతాం -
" అన్యధా శరణం నాస్తి ! త్వమేవ శరణం మమ ! తస్మాత్ కారుణ్య భావేన రక్ష -రక్ష- పరమేశ్వర ! " అంటూ మన విధిని మనం సక్రమంగా నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించకుండా పరమేశ్వరార్పణం గా చేస్తూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ సాగి పోవడమే జన్మకు సార్థకత -ఇదే నిజమైన సిసలైన శరణాగతి !

NOV 23, 2015

చెన్నై కన్నీరు

కన్నీరు మున్నీరైన - చెన్నైమహానగరం --!- ఆపదనుండి కాపాడమని 
-ఆపన్న హస్తాలు అందించ మని -దీననగా విలపిస్తున్న చెన్నైజనం --!
హరి నామం జపించే పెదవుల కన్నా -ఆర్తులకు సాయం చేసే చేతులే మిన్న 1
మానవ సేవయే మాధవ సేవ 1 మానవత ఉన్న ప్రతి మనిషి దేవుడే 1
సాటివారి పట్ల సానుభూతి చూపి సాయం అందించిన హృదయం ఒక -దేవాలయమే కదా 1
అవి వరదలు కావు 1 కన్నీటి వరదలు 1-చెన్నై ప్రజల ఇళ్ళు -కష్టాల లోగిళ్ళు 1
ప్రక్కలో బల్లెం -లా బంగాళా ఖాతం - మహా సముద్రం 1 భయంకర జల గండం1
సునామీలు -అల్ప పీడన విపత్తులు -అకాల వర్షాలు -అరిష్టాలు అనర్థాలు !
ఈ మహానగరానికి ఎప్పుడూ పొంచి ఉన్న ప్రమాదాలే 1 అంతులేని నష్టాలే 1
చెరువులు - డ్రైనేజీ లు - త్రాగు నీరు అన్నీ ఒకటై కాలువలై -
కట్టలు తెంచుకుని పొంగి పొర్లు తున్నాయి1 ఇళ్ళన్నీ జలమయ మయ్యాయి 1
సామాన్యుడి బ్రతుకును -చిన్నా భిన్నం చేశాయి 1
మనుషులు -ముగ జీవాలు రిక్షాలు -కార్లు -సైకిళ్ళు --
ఇళ్లలో దాచుకున్న - పెట్టె బేడా అన్నీ నీటి పాలయ్యాయి 1
తినడానికి తిండీ -నిలడానికి నేలా -పాడుకోడానికి స్థలము -కరువైనాయి 1
సామాన్యుడికీ -శ్రేమంతునికీ -ఒకే ప్లాట్ ఫారం 1 ప్రక్క బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ !
ఈ మాత్రం తల దాచుకోడానికి -భద్రత కరువైన వారు ఎందరు "బలి అయ్యారో కదా 1
"-ఏమౌతుందో 1" అన్న భయం -ఆందోళనలతో -క్షణం -క్షణం' వణకిపోయారు -1
దైవ బలం కరువైతే -మనిషి కైనా -జంతువుకైనా-మనుగడ కష్టం -కదా 1
ప్రభుత్వాలెన్ని మారినా -ప్రజల అగచాట్లు -తల రాతలు మారవు కదా 1
విజ్ఞానం ఎంత పెరిగినా- విధి నిర్ణయానికి ఎదురు ఏముంటుంది ?
ప్రకృతి భీభత్సం ముందు -మానవ సంకల్పం తల వంచాల్సిందే కదా 1
ఎన్నాళ్ళు పట్టాలి 1 ఈ దుర్గతి - దుస్థితి నుండి కోలు కోడానికి --?
గతం లో ఇలాంటి ఉపద్రవాలు - జల ప్రళయాలు -ఎన్నో వచ్చాయి -
ఇలాగే జనాలు మృత్యు వాత పడ్డారు -నానా అగచాట్లు అనుభవించారు 1
అకాల వర్షాలకి -బంగాళా ఖాతం తుఫానులకీ -మన ఈ చెన్నైమహానగరం -
అల్లల్లాడి పోయింది !-ప్రజా జీవనం పూర్తిగా స్తంభించి పోయింది 1
గతం లో తాకిన దెబ్బను -మరచి పోయేలోగానే- మరో పెద్ద దెబ్బ 1
"ఓ దైవమా 1 మమ్ము సదా పోషించి రక్షించే నేవే" దయ్యమై" కబళిస్తే-
ఇంకా దిక్కెవ్వరు ? నీవు వినా దీనులను -ఆర్తులను కాపాడే స్వామి ఎవరు ?
ఆర్త జనావళి దీనాలాపాలు విన రావడం లేదా ? భగవాన్ !
ఇక నైనా కనికరించు ! ప్రమాదం లో ఉన్న ప్రాణి కోటికి ప్రమోదాన్ని కలిగించు -!
ఇలాంటి విపత్తులు రాకుండా కాపాడు మము గన్నతండ్రీ !"


Dec 8, 2015

siya ke ram

siya ke ram -- tv episode - star plus లో ప్రతి రోజు 8 am --8 pm వస్తోంది - రామాయణం లోని మనకు తెలీని చాలా విషయాలు కళ్ళకు కట్టినట్లు రసవత్తరంగా చూపిస్తున్నారు ముఖ్యంగా సీత పాత్రను ఎంతో గొప్ప సంస్కార వంతంగా -రాముని ఉత్తమ గుణాలకు తగినట్లుగా వీరోచితంగా - ఉన్నతంగా ఉన్నాయి -రాజు మరియు ఋషి అయిన జనకుని రాజ్య పాలన పరశురాముడు కూడా మెచ్చుకుంటాడు -"ఇలాంటి రాజు siya ke లూ ఆర్యావర్తంలో ఉంటె జనం క్షేమంగా -రాజ్యం సుభిక్షంగా ఉంటుంది "అని మెచ్చుకుంటాడు - సర్వ సంగ పరిత్యాగి జనకుని పాలన ప్రజా రంజకంగా ఉంటుంది -నిరంతరం ధర్మ నిరత తో నిరాడంబరంగా స్త్రీల పట్ల కారుణ్య భావం తో ఉంటాడు -నిత్యం అలంకార ఆడంబరాలు బహు భార్యా విధేయుడు - రాగద్వేషాల మధ్య ఎప్పుడు అయోమయంలో పడిపోయే దశరథునికి - రుషి లాంటి జనక మహారాజుకు భేదం చక్కగా కనబడుతుంది
పాత్ర దారులు వారి హావ భావాలు - చక్కని సంభాషణలు - దృశ్యాలు - సెట్టింగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి - మనకు తెలిసిన రామాయణం వలే కాకుండా కొన్ని అద్భుత సన్నివేషాలు -సంఘటనలు మనకు తెలుస్తున్నాయి -పంచదార చిలుకను ఎటు రుచి చూసినా తియ్యగా ఉన్నట్లు ఒక కొత్త తరహా లో వైవిధ్యంగా సీతా రాముల గాథను రోజూ దర్శించడం ఎంతో ఆనందంగా ఉంటోంది - -



గతం చాలా గొప్పది-- సమయం ఇంకా చాలా గొప్పది

"ఇప్పుడు అనుకొంటే ఏం లాభం !"
నిజానికి గతం చాలా గొప్పది-- సమయం ఇంకా చాలా గొప్పది - దానిపైనే మన భవిష్యత్తు ఆధార పడి ఉంటుంది -ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది -- అది తానే స్వయంగా రాసుకుంటాడు -కాలం క్రమంగా తెలీకుండా గడిచి పోతోంది -ఒక్కొక్క మధుర క్షణం -విలువైన కాలం -తిరిగి మనకు ఎత్తి పరిస్థితిలోను దొరకని అమృత ఘడియలు -మన ఆయువు -మెల్లిగా మన చేయి జారిపోతోంది -
అందుచేత కాలం విలువ గుర్తించి -మనం జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించు కోవాలి -గడచిన మన గతం -మన పూర్వీకుల గతం దృష్టిలో ఉంచుకొని -మనిషిలా బ్రతకాలి -దేవుడిచ్చిన మానవ జేవితాన్ని మేధస్సును - మన సక్రమ జీవన విధానానికి -చుట్టూ ఉన్నవారి శ్రేయస్సుకు - ధార్మిక ఆధ్యాత్మిక విషయాలకు కేటాయిస్తూ -ఇహం తో బాటు పరాన్ని కూడా గుర్తిస్తూ బ్రతకడం నేర్చుకోవాలి -
మనిషి కూడా జంతువే -ఒక్క మేధస్సు విషయంలో తప్ప! దానితో తనలో ఉన్న అహంకారం - అనవసర కోపం -అలసత్వం ---ద్వేషం -భగవంతుడు ప్రసాదించిన అందమైన ప్రకృతి -అనుబంధాలు -అనురాగాలు ప్రేమా -సానుభూతి అనబడే మానవ సంబంధ మైన నైతిక విలువలు గుర్తించకుండా -యాంత్రికంగా -బాహ్య ఆడంబరాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ఆత్మ శోధన లేకుండా నడుచుకోవడం - మన చరిత్రను వక్రమార్గంలో రాసుకుంటూ ఉన్నామని గుర్తు చేసు కోవాలి --
పెద్దతనం వచ్చాక " అయ్యో ! అలా చేయ లేక పోయామే ! అనవసరంగా కాలాన్ని వ్యర్థం చేసుకున్నామే ! ఎంత పని జరిగింది ! ఇప్పుడు ఎం చేద్దాం ! ఎందుకు ఇలా చేశాం ! ఎం చేస్తే అది బాగు పడుతుంది --" ! ఇలాంటి మనోవ్యధతో భవిష్యత్తులో బాధ పడకుండా చక్కగా వర్తమానాన్ని సమర్థవంతంగా మనతో బాటు మన అందరి శ్రేయస్సుకు ఉపయోగ పడేలా కృషి చేద్దాం !
అట్టి స్పూర్తి నీ -పరిజ్ఞానాన్నీ -సమయాన్నీ -సంకల్పాన్నీ -బలాన్నీ ప్రసాదించ మనీ భగవంతున్నికోరుకుందాం !
" సర్వే జనాః స్సుఖినో భవంతు ! సమస్త సన్మంగళాని -భవంతు ! సర్వే భద్రాణి పశ్యంతు !"
ఓం శాంతి 1 శాంతి ! శాంతి :;!


Dec 9, 2015

నీది కానిదేది లేదు నాలో --నిజానికి నేనున్నది నీలో

నీది కానిదేది లేదు నాలో --నిజానికి నేనున్నది నీలో --"
అన్న భావ కవిత మాదిరి -నిజానికి మనం అంతా ఆ పరమాత్ముని కను సన్నల పైన ఆధారపడి ఉన్నాం -- మన" జీవితం "అనే మోటార్ రిమోట్ తన చేతుల్లో ఉంచుకొని మనల్నిఒక ఆట ఆడిస్తూ ఉన్నాడు - మన ఈ శరీరం -పైన ఆకారం -అన్నీ అతని ప్రసాధమే - చుట్టూ ప్రకృతి -పరిసరాలు - బంధువులు స్నేహితులు సంపదలు ఇండ్లూ -రాష్ట్రము -దేశము -అన్నీ అతడు కల్పించినవే - ఏ ఒక్కటీ మనము తయారు చేయలేదు - తేలేదు - మన శరీరం లోని అవయవాలు ఏవీ మనం చెప్పినట్టు వినవు - ఎప్పుడు - ఎక్కడ ఎలా -ఎవరికీ -పుట్టాలో -మనకు తెలియదు ---చివరకు శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు --
ఒక్క "మనసును -జ్ఞానాన్ని" మాత్రం మనకు ఇచ్చాడు -వాడుకోడానికి ! మనసు - జంతువులకు కూడా ఉంటుంది -- కాని మేదస్సుతో మనిషి -- జంతువుదశ నుండి ఉత్తమ మానవజన్మను పొందాడు -సక్రమంగా వాడుకుంటే "-మనిషి! --లేదా పశువు '"అవుతాడు ఒక్క ఆకారం లో తప్ప -!--కాని మనసును నియంత్రించడం మాటలా ! "శ్వాస ను ఆపడం "ఎంత కష్టమో "మనసును నిలపడం" అంతే కష్టం !మనసు మనల్ని దేవునికి దూరం చేస్తోంది దగ్గరకు కూడా చేస్తుంది -అది మన భావనపై అనగా మనసు పై ఆధారపడి ఉంటుంది -అన్నింటికీ తానే "కర్త "నుఅనుకుంటాడు -తనను సృష్టించిన దైవాన్ని మరచి --తన అంతరంగంలో ప్రాణంరూపంలోనూ -బాహ్య ప్రపంచంలోను అంతటా నిండి ఉన్న దైవం ఉనికిని విస్మరించి చరించడం మూర్ఖత్వం కనీసం -నిత్యందర్శనం ఇచ్చే ఆ కర్మసాక్షి సూర్యభగవానునికికూడా తెలియజేయకుండా ప్రవర్తించడం కృతఘ్నత -కదా ! 
ఈ శేరీరం - మనకు దేవుడిచ్చిన అద్దె ఇల్లు- ఒక ఉపాధి మాత్రమే -దీనిమీద సర్వహక్కులు అతనివే -1 బ్రతికినన్ని రోజులు ఈశరీరంతో బాటుగా ఆనందంగా -ఉండటానికి - చక్కగా ఉపయోగించుకోడానికి సమయాన్ని- జీవితాన్ని- అందమైన ప్రకృతినీ -చక్కని గాలినీ ప్రాణవాయువునీ -కమ్మని స్వాదుజలాన్నిఇచ్చే జీవనదులని -తీయని పండ్లను ఇచ్చే చెట్లనీ - శరీర పోషణకి కావాల్సిన ఆహారాన్ని అందించే చెట్లనీ వృక్షాలనీ అందించాడు - -మనలాగే- ఇవన్నీ అనుభవించడానికి ఎన్నో ఇతర జంతువులనీ -పక్షులనీ -జలచరాలనీ పచ్చని పరిసరాలని - సంపదలని - బంధువులను -స్నేహితులను -చక్కని సమాజాన్ని ఇలా సకల ప్రాణి కోతికి సరిపడే ఎన్నో వనరులను - సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని అనుగ్రహించాడు ఆ పరమేశ్వరుడు 
" పాత్రపోషణ "అయ్యాక -నాటకం నుండి విధిగా నిష్క్రమించినట్లుగా అన్ని ప్రాణులవలె మనంకూడా జననంతోబాటు మరణాన్ని అంతే గొప్పగా సంతోషంగా స్వీకరించాలి -మనపైన పూర్తి అధికారం ఉన్న దైవం ఎప్పుడైనా తీసుకొని పోవచ్చును -" జన్మనిచ్చినవానికి -ఆ -జన్మను తీసుకొనిపోయే అధికారం "ఉంటుంది కదా 1 అది "-ఎప్పుడు "అనేది -ఎవేరికి తెలీదు -- "ఎక్కడికి" అనేది అంతకంటే తెలీదు - 
అందుచేత "శరీర పోషణ"' తో బాటు-" నేను ఎవరిని ?- ఎక్కడి నుండి వచ్చాను ? " అన్న ఆత్మశోధనకూడా మనజీవన ప్రయాణంతోబాటు సాగాలి అప్పుడు మాత్రమే మానవజన్మకు సార్థకత - ఆత్మశాంతిని పొందగలుగుతాం -
సృష్టిలో రెండు పరమ సత్యాలు -కనబడుతాయి -"-ఇతరులు తప్ప- తాను మాత్రం తప్పు చేయను " -అనుకోవడం --ఎందరో తన కళ్ళముందు మరణించడం చూస్తున్నా "-తాను మాత్రం దీనికి అతీతుడ"ననుకోవడం !- ఇది అజ్ఞానం -భ్రమ -పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం -కృతజ్ఞతా భావం లేక పోవడం-"తానే జ్ఞాని "అనే అహంకారం !- తుచ్చమైన సంపదలు -శరేరం పై మమకారం! మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి 
దేవాలయదర్శనం- సద్గురువుల సేవ - రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం - నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం

12 Dec 2015

ఏడుకొండలవాడా !- వెంకటరమణా

 ఏడుకొండలవాడా !- వెంకటరమణా -1 గోవిందా ! గోవిందా -!
ఆపదమొక్కులవాడా -అనాధ రక్షకా 1 గోవిందా ! గోవిందా !" 
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవడం సులభమైన విషయం కావచ్చును - కాని ఆయన లీలలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు - స్వామిదర్శనానికి మనకు -అనగా సామాన్య జనాలకు -లభించే సమయం కొన్నిక్షణాలు మాత్రమే కావచ్చును - కాని స్వామిని చూసిన తర్వాత కలిగే సంతోషం అనంతం - త్రుప్తి అద్భుతం - అపరిమితం - ఇది" క్షేత్రం మహిమయో - !లేక స్వామి మహిమయో !"- చెప్పలేము - తిరుమలయాత్ర సంకల్పించుకొని బయలుదేరిన ప్రతీయాత్రీకునికి తిరిగి తన ఇల్లు చేరేవరకు అలసటగాని -దేహఅవస్థలు గాని ఉండవు - 
ఇక తిరుమలకొండపైన ఉన్నసమయంలో -అక్కడి చలి -వాన -ఎండ - లేదా స్వామిదర్శనానికి నడకద్వారా వెళ్ళడంవలన కలిగే శ్రమగానీ - మనలను ఏమాత్రం బాధపెట్టవు- జ్వరం - నొప్పి - రోగ బాధలు -అవస్థలు - కాలినడకద్వారా కొండఎక్కిరావడంవలన కాళ్ళకి నొప్పులుగానీ - -ఇలాంటివి" స్వామి"మహత్తువల్ల మనకు కలుగవు - స్వామిని చూడాలనే ఆరాటంలో అవన్నీ కొండమీద ఉన్నంతసేపూ మరచి పోతాం -- అదే ఏడుకొండలవాని గొప్పతనం !- ' ఆకాశ గంగ -పాపవినాశిని ' లాంటి పవిత్ర దివ్యజలాలు సేవించడం వల్లనో -- కొండ పైనగల స్వచ్చమైన -పవిత్ర మైన -ఆధ్యాత్మిక వాతావరణంవల్లనో -- ఎత్తైన దివ్యమైన ఏడుకొండల అద్భుత మహాత్మ్యం వలననో - మనకోసం "-కలియుగ దైవం'లా- తానే స్వయంగా "సాలగ్రామ"రూపంలో వెలసిన ఆ "సాక్షాత్ మహావిష్ణువుయొక్క మూలవిరాట్టు "యొక్క గొప్పదనమో- -స్వామి ఆవిర్భవించిన "స్థలమహత్తు" వల్లనో - దేవాలయ" వాస్తు" విశిష్ట గుణమో -- ఆలయ నిర్మాణం గావించిన రాజుల" సంకల్ప" బలమో - ఆగమశాస్త్రప్రకారం శాస్త్రయుక్తంగా స్వామికి పూజలు ఉత్సవాలు - నిత్య కళ్యాణాలు- బ్రహ్మోత్సవాలు -అభిషేకాలు -అలంకారాలు -నైవిధ్యాలు -ఇలా ఎన్నెన్నో విధి విదానముగా చక్కగా పనిత్యము నిర్వహించే అర్చకుల దక్షత -దేక్ష అంకిత--" భక్తిపూర్వకమైన" కార్య క్రమాల ప్రభావం వల్లనో - "తరిగొండవెంగమాంబ సత్రం" లో నిత్యం వేలమంది భక్తులకుజరిగే "అన్నదానం " వల్లనో - లక్షలమంది భక్తుల కోరికలు లక్షణంగా నెరవేర్చినందుకు తమ కృతజ్ఞతగా స్వామికి తమమొక్కులు చెల్లించడానికి మళ్ళీమళ్ళీ వచ్చే భక్తులనమ్మకమో -మనకు తెలియదుకానీ - స్వామి దర్శనానికి వచ్చిన ఏఒక్క భక్తునికీ ఏ ఇబ్బందీ కలుగదు -ఇక్కట్టులు రావు - అవస్థ ఉండదు - ఎవరుకూడా అనారోగ్యం పాలుకారు -- 
పైగా రెట్టింపు ఉత్సాహంగా సంతోషంగా సంతృప్తినిపొంది తిరిగి వెళ్తారు -రెండు గంటల్లో దర్శించు కున్నవారికికలిగే ఆనందంలాగే -రెండురోజులు స్వామిదర్శనానికి కేటాయించిన గదుల్లో ఓపికగా వేచిఉన్నవారుకూడా అంతే "ఆత్మానందం" పొందుతారు -- అదీ "ఏడుకొండల వేంకటేశ్వరస్వామి గొప్పదనం" !-- పిల్లలు -వృద్ధులు అంగవైకల్యం ఉన్నవారు -దేశంలోని అన్ని రాష్ట్రాల వారు -విదేశస్థులతో ఎప్పుడు రద్దీగా "-నిత్యకల్యాణం -పచ్చతోరణం "లా -రాత్రీ పగలు అనకుండా ఇరవై నాలుగు గంటలు -మూడు వందల అరవై రోజులు - భక్తులు వేలసంఖ్యలో తిరుమల కొండపై కనిపిస్తారు - ప్రతీరోజు స్వామిసన్నిధిలో భక్తులు తలనీలాలు సమర్పించుకోవడం చూస్తాము - పుష్కరిణి స్నానం - దర్శనం -ప్రసాదం -ఉచిత అన్న సత్రం లో లభించినకమ్మని రుచికరమైన మృష్టాన్నం -లభించిన త్రుప్తివలన -తమకు ఈ యాత్రలో కలిగిన శ్రమను -ఖర్చును -ఆయాస ప్రయాసలను అవస్థలను ఇట్టే మరచి పోతారు -జ్ఞాపకం ఉండేది "స్వామిదర్శనం"మాత్రమే అదే -మహాభాగ్యంగా మరీమరీ తలచుకుంటూ '-పునర్ధర్శనాన్ని " కోరుకుంటారు 
అందుకే "గోవిందుని గొప్పదనం "-కొనియాదతరమా !- చూసి ఆనందించి "అంతరంగంలో ఆత్మానందం "పొందడం తప్ప వర్ణించ తరమా !అనువైకవేధ్యమైన వెంకట రమణుని -కృపాకటాక్షాలు -ఎన్ని అపరాధాలు చేసినా క్షమించబడి -మనకు అనుగ్రహింపబడాలనీ --" గోవిందుని దివ్య మంగళ విగ్రహాన్ని" తిరిగి మళ్ళీ మళ్ళీ దర్శించే భాగ్యం కలగాలనీ - ఆ భాగ్యాన్ని ప్రసాదించమన-" అలిమేలుమంగాసమేత వేంకటరమణుని " వేడుకొందాం -! స్వామి" దివ్యమంగళ పాదారవింధదర్శనము"నకై -"పరంధాముని కటాక్షవీక్షణ క్షణా"లకై కోరుకుందాం !- "--తిరుమలేశుని పునర్దర్శన ప్రాప్తిరస్తు !- "
14 Dec 2015

తిరుమల యాత్ర -వైభవం శ్రీవారి దర్శనం --దివ్యానుభూతులు -

భగవంతుడు అంతటా ఉంటాడు - కాని ఎందుకో" తిరుమల శ్రీనివాసుని
సన్నిధానం" లో   భక్తులు పొందే ఆనందం -త్రుప్తి ఎనలేనివి  !- మెట్ల
దారిలో ఏడుకొండలవానిని స్మరిస్తూ -"గోవిందా -! గోవిందా 1" అంటూ వందల
మందితో నడుస్తుంటే -" దొరకునా ఇటువంటి సేవా !"అనిపిస్తుంది - ఇక తలనీలాలు
స్వామీవారికి సమర్పిస్తుంటే - మనలోని అహంకార -మమకారాలు త్యజించి
-"స్వామి!  నీకు సేవలు -పూజలు చేయలేను -నిన్ను శరణు  వేడుకుంటున్నాను
"-అన్న భావం కలుగు తుంది - ఇక స్వామిదర్శనంవల్ల కలిగేఅనుభూతి- తన్మయత్వం
అంతా ఇంత కాదు - అన్నమయ్య గీతంలో చెప్పినట్లుగా -"నీ వంటి దైవాలు లేరు-
నిఖిల లోకము లందు !"--లక్షలమంది భక్తులకు ఆశ్రయం -అభయం- ఆనందం -తో బాటు
-మళ్ళీ దర్శించుకోవాలన్న అనుభూతినీ అనుగ్రహించిన ఆ దేవదేవుని దయకి-
ప్రణామాలు సమర్పించడం తప్ప -ప్రతిగా మనం ఏమి చేయగలం -!ఇదంతా నీదే - నేను
మేము నీ వారమే - నీది నీకే సమర్పిస్తున్నాం స్వామీ !-
                       1-నాకు గల పెద్ద వయస్సు - మోకాళ్ళ నొప్పులు -కాలి
మడమపట్టు- కాలుకింద పెట్టలేనంత  బాధఉన్నా - డెబ్బై లోపడుతున్న వయసులో
కూడా నన్ను తనవధ్హ్ధకు రప్పించుకుని- అన్నిమెట్లు కూడా అవలీలగా ఎక్కించి
-దివ్యమైన తనదర్శనం ఇప్పించాడు-" స్వామి వైభవం "అంటే ఇదియే కదా ! 2-
బంగారు వాకిలి -వెండివాకిలి - ద్వారములవద్ద ఎనలేని ఉత్సాహంతో -
భక్తిప్రపత్తులతో -స్వామిని చూడాలన్న తపనతో -దూరమనక - భారమనక- ఎన్నో
ప్రయాసలకు ఓర్చి - స్వామిసన్నిధిని ఆనందంతోచేరిన- భక్తజనంతో  "గోవింద
నామాన్ని " ముక్త కంఠంతో  నాద్వారా" స్వామీ' అనిపించడంబ్రహ్మానందం గా
తోచింది  -3- దివ్యమైన -అద్భుతమైన -ఆనందకరమైన -అపురూపమైన  తన సుందర
రూపాన్ని -సర్వఅలంకార -అలంకృత- మందహాస మంగళమోహన విగ్రహాన్ని  దర్శింప
జేసి - ఇందరి జన్మలను జన్మను తరింప జేశాడు -శ్రీ వేంకటేశుడు -4-  తనతల్లి
వకుళామాతకి- కొడుకుగా శ్రీనివాసుడు తన కుడి ప్రక్కన నిలుపుకొని - ఇచ్చిన
మర్యాద -భక్తి గౌరవాన్ని చూస్తే - మన తలి దండ్రులనుకూడా మనం అలా ప్రేమతో
చూదాలి అని స్వామీసూచన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకు--1 అప్పుడుకదా
నిజంగా మనం -'స్వామి కరుణ"కు పాత్రులం అవుతాం -అన్న మధుర భావన  ఎవరికైనా
కలుగకమానదు - అక్కడేగల  వైకుంఠదారం వద్ద స్వామిని దర్శించుకుని వచ్చి
కూర్చుని ఆదివ్యమంగళ విగ్రహాన్ని మదిలో స్మరించుకుంటున్న భక్తులచే - తన
గోవింద నామాన్ని-అన్నమయ్య గీతాన్ని "-పొడగంటిమయ్యా !నిన్ను పురుషోత్తమా
1" అన్న అమృతతుల్యమైన అమర గానాన్ని  నానోటపలికిస్తూ- దానిని అందరితో
అనిపిస్తూ  స్వా మి సన్నిధిలో అరగంటసేపు -గడపడం నిజంగా నా
పాలిటపెన్నిధికదా" -ఇలాంటి స్వర్ణఅవకాశం అక్కడ అంతసేపు నాకు లభింపజేయడం
నా భాగ్యం గా భావిస్తున్నాను - ' స్వామిదయ -అపారమైన కరుణ "ఈ - జన్మను
ధన్యంచేసిన మధుర  దివ్య స్మృతులుగా గుర్తు ఉండిపోతాయి  - 5- గతఆదివారం
రోజున  -స్వామి బంగారు వాకిలి ముందు  నెల్లూరు బృందం వారు -యువకులు
-యువతులు ఏభై మంది - సాయంకాలం - స్వామి వారి నాలుగుమాడలగుండా  ప్రతిరొజూ"
నిత్య కల్యాణం -పచ్చ తోరణం 'లా జరిగిన ఊరేగింపు తర్వాత - అక్కడ కోలాటం
ప్రదర్శించారు - అందులో  అప్పుడు - నా నోటస్వామివారు పలికించిన" రామ-
కృష్ణ-  గోవింద" భజనకు ఒక అరగంటసేపు వారంతా కలిసి -తమ కోలాటనృత్యంద్వారా
అద్భుతంగా ప్రదర్శించడం  సామూహికంగా  అభినయం చేయడం --అందరికీ త్రుప్తినీ
సంతోషాన్ని కలిగించింది - -
            ఇలా  "ఎన్నిదివ్యానుభూతులో - ఎంత కృపయో !"- వేలాదిమందికి తన
దివ్యమైన వరదహస్తంతో -తన భక్తులకోరికలను తీర్చేవాడు- వారిఆపదలను తొలగించే
వాడు -  తన అభయహస్తంతో దివ్యదర్శనంతో  -భక్తులలో అమిత విశ్వాసాన్ని
-భక్తి శ్రద్ధలనుపెంచేవాడు -అందరికీ ఇలవేలుపు - పిలిస్తే పలికే
ఆపద్భాందవుడు -మన ఈ " ఏడుకొండల వేంకటరమణుని లీలలు -పొగడ తరమా -  1
వర్ణింపవశమా !శరణు కోరుతూ సవినయంగా  స్వామికీ నమస్కరించడం తప్ప 1" : ఓం
నమో వేంకటేశాయ " అనే మంత్రాన్ని -అంటూ అనునిత్యం స్వామిని మనసులో
తలచుకొంటూ -ఆ రూపాన్ని నిలుపుకోవాలి -- ఇదేకదా మన మానవజన్మ సార్ధకత-
సాఫల్యత  !     -  -

April 4,  2016

గూడూరు కమలాకర్ రావు - Gudur Kamalakar Rao

స్వర్గీయ గూడూరు కమలాకర్ రావు మామగారు -మే నెల - ఒకటవ తేది 2016- న స్వర్గస్తులయారు-వారు   మా కు చిన మేనమామ -పైగా తొమ్మిది పదవ తరగతిలో నాకు గణితంచక్కగా   బోధించిన లేక్కలమాస్టర్- అందుకే నాకు లెక్కలపైన పట్టు వచ్చింది -  నాలోని TALENT ను  గుర్తించి -నన్ను OPTIONAL  HISTORY  నుండి -OPTIONAL MATHEMATICS పట్టు బట్టి  మార్పించి నన్ను ఉత్సాహ పరచింది ఈ  చిన మామగారే-1 అందుకే INTER లోనూ -డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ లో నూ   వరుసగా MATHEMATICS  సబ్జెక్టు నన్ను   -నా బాల్యమిక్కడే గడిచింది కనుక వీరి  సాదు స్వభావం -సత్వగుణం -సమయ పాలన -మిత భాషిత్వం -ఆయన సహజ లక్షణాలు --- ఎప్పుడూ అతడు - ఏదో  ఆలోచన చేస్తున్నట్లుగా  కనిపించేది - మనమ్మాట్లాడిస్తేనే తప్ప- తాను స్వయంగా కల్పించుకొని మాట్లాడే వాడు కాదు
-పంచాయతీలకు - తగాదాలకు  రాజకీయాలకు ఆడంబరాలకు - అప్రస్తుత ప్రసంగాలకు అతడు దూరం ఉండేవాడు - జీవితాంతం అలామౌనంగా -మౌనమునిలా  - పరమ శాంతంగా -నిర్లిప్తంగా-అనుబంధాలకు అతీతంగా -అలా "సాక్షిలా ' చూస్తూ ఆయనలా - ఉండటం అందరికి సాధ్యమయ్యే విషయంకాదు - HE WAS NEVER SERIOUS -IN ANY MATTER - BUT HE WAS  VERY VERY PARTICULAR  MAINTAINING  HIS  DAILY ROUTINE AS
PER HIS FIXED  TIMETABLE - నాకు తెలిసి అంత ఖచ్చితంగా  సమయం ప్రకారం లేవడం -స్నానం -సంధ్యావందనం -టీ టిఫిన్-లంచ్  విశ్రాంతి తీసుకోవడం -వాకింగ్ -రాత్రి భోజనం - తర్వాత నిద్రా -ఇవన్నీ  పండుగ అయినా =వేరే ఉరిలో ఉన్నా -ఎంత మంది ఉన్నా చక్కగా పాటించేవాడు -

-- ప్రస్తుత సమాజంలో- నోరుంటేనే ఊరు - అన్నట్లుమనం చూస్తున్నాం - కాని ఈయనకు నాలుగు మాటలు ధారాళంగా  మాట్లాడిన సంఘటనలు లేవు - గట్టిగా బిగ్గరగా మన బ్రాహ్మణవాడ అంతా వినబడేలా -అన్నట్లు మనమేవ్వరంవిన లేదు -మా తరగతి లోయన చెప్పే లెక్కలు మొదటి రెండు బెంచిలవరకే విన బడేవి -అంత మెల్లిగా
-నెమ్మదిగా -కొసరి కొసరి మాట్లాడటం ఆయనకేచేల్లింది - అలాఅని  ఆతడు అమాయకుడుకాదు -మంచి తెలివి గలవాడు -BSC -MATHS - ఫస్ట్ డివిజన్ - -ఆ రోజుల్లో అంటే -సాధారణ విషయం కాదు -గవర్నమెంట్ టీచర్ -ఉద్యోగం -తన స్వంత ఊరిలో- ఇక్కడ -వచ్చింది - ఆయనకు MATHEMATICS లో ఉన్న ప్రావీణ్యత కు స్టాఫ్ అంతా ఆశ్చర్య పడేవాళ్ళు -ఎవరికీ సాధ్యంకాని PROBLEMS  ని ఎంతో సులభంగా  సాల్వ్ చేసే వాడు -అయన ఎంత అందంగా ఉండే వాడో - నడక - నవ్వు - చివరకు  ఆయన HANDWRITING కూడా అందంగా అద్భుతంగా ఉండేది -  అయినా
-రెండుసంవత్సరాలు చేసిమానేశాడు పట్వారిగా చలామణి అయ్యాడు -ఎన్నడు తహసిల్దారు  ముందుగాని - కచేరీ లోగాని  మాట్లాడి ఎరగడు అని చెప్తుంటారు --- ఆరోజుల్లోఆయన కు - కోరిన ఉద్యోగం -హోదా వచ్చేది -- కాని అంతగా
సంపాదించాలని- ఉద్యోగం హోదా -పదవీ - లపై ఆసక్తి -లేవు -తన అన్నగారు కుడా ఇదే కోవకి చెందిన  వాడు-ఆయన కుడా డిగ్రీ చేశాడు =ప్రభుత్వ  ఉద్యోగం చేశాడు - వదిలేశాడు కుడా --
  నిజానికి  తన ఇద్దరు తమ్ముళ్ళ చదువుకోసం - అన్నగారు వెంకట రామా రావు గారు - ప్రోత్సహించారు - గొప్ప పదవుల్లో-తహసిల్దారు - కలెక్టర్ - లాంటి స్థాయిలో  తనైద్ద్రు తమ్ముళ్ళను చూడాలని ఆయన ఆకాంక్ష -- డబ్బులు
హోదా -పదవి- అధికారం- దర్పం- అట్టహాసం అజమాయిషీ - డాబు దర్పం - అజమాయిషీ - ఇవన్నీ వెంకన్నకి ఇష్టం- కాని సామ్బంనకి -కమలన్నకీ నిరాడంబరత ఇష్టం - కష్టపడి మంతనిలో- మెట్రిక్ వరకు- హన్మకొండలో డిగ్రీ చదువు చక్కని నేర్పు నైపుణ్యంతో పూర్తి చేసి - ళాXఏట్టీఫేటా గ్రామంమోత్తంలోంత గా చదివిన వారు లేరు అనిపించారు - తెలివి -జ్ఞానం -పట్టుదల - తమచదువులవరకే  -వ్యవహార జ్ఞానం లోఅన్నగారిని త్రుప్తిపరచ లేక పోయారు -

కమలాకేర్ రావు మామగారు కన్నా తండ్రిని కనులారా చూసుకునే అదృష్టానికి నోచుకోలేదు -తాను తల్లి సూర్యాబాయి  కడుపులో  ఉండగానే తండ్రి  నరహరి రావుగారు పరమ పదించారు --అప్పటినుండి  చిన్న తమ్ముడు - ఇద్దరు అన్నలకు-ముగ్గురు అక్కలకు గారాల పట్టి - అయ్యాడు - ఎన్నడు ఎవ్వరు కమలయ్యను  నొప్పించలేదు - కోప్పడ లేదు కూడా -- చక్కని సంతానం -అందమైన ఆరోగ్యకరమైన తెలివైన పిల్లలు-ఐదుగురు కొడుకులు  కోడళ్ళు -ఇద్దరు కూతుళ్ళు బుద్దిమంతులైన అల్లుళ్ళు - ఎనమండుగురు మనవలు -ఎనమండుగురు మనవరాళ్ళు -- కళ్ళముందు ఆనందంగా అభివృద్ధిలో  పైకి రావడం -ఈ తాతగారు  వాళ్ళని తృప్తిగా చూసుకోవడం -సంతోషించడం - నిజంగా అతడిభాగ్య మే - తల్లి సులోచన కంటే - తండ్రిగా  మా కమలాకర్ రావుగారు ఎక్కువ అదృష్ట వంతులు - భాగ్యవంతులు - ఆఖరు క్షణం వరకు  జీవితం లోని  మధురాను భూతు లు అన్నీ అనుభవించారు--  బాల్యంలో కష్ట పడ్డారు -  కుటుంబం అంతా  అనుకోని విపత్తులతో - పినతండ్రులు పిన తల్లులు పోవడం - కన్నతండ్రి  తమ చిన్న వయసు లోనే గతించడం - పెద్దవాడైన వెంకన్నపై  కుటుంబ భారం-పడటం -- ఆయన సమర్థ వంతంగా వయసులోచిన్న అయినా -తండ్రి లేకున్నా - కన్నా తండ్రి వాలే - తమ్ముల్లచదువులు  ఆలనా పాలనాచూస్తూ  తన పెళ్ళితో బాటు  -ఇద్దరు చెల్లెళ్ళకు -తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం - వ్యవహారం - వతన్లు - భూములు - ఆస్తీ  ఆరోగ్యం-  ఎన్నో ఊర్లలో  వ్యవసాయం  - గుమాస్తాలు - పట్వారీలు పటేల్లు - పాలేళ్ళు -  -ఎంతో కష్ట పది-- భార్యను పోగొట్టుకొని - జబ్బుల
తో ఇబ్బంది పడుతూ కూడా - కుటుంబాన్ని పైకితేచ్చాడు - నలుగురిలో  శహబాష్ అనిపించు కున్నాడు
-- ఆరకంగా మాచిన మామగారు  అందరికి ఆప్యాయంగా- గారాబంగా  పెరిగారు -అలాగే  తానుకూడా తన పిల్లలను గారాబంగా పెంచిపెద్ధజేసి విద్యా బుద్ధులు చెప్పించి - పెళ్ళిళ్ళు చేసి -తన బాధ్యతను సక్రమంగా నిర్వహించారు -- తన కున్న ఒకే ఒక కష్టం - తాను అమితంగా ప్రేమించే భార్యను కోల్పో వడం -- - భార్యను కోల్పోవడం మగవానికి ఒక శాపం -- బార్య లేకుండా బ్రతకడం  చాలా కష్టం - దుర్భరం - ఆ మనిషి మానసిక పరిస్తితిని  ఉహించలెం --దారంతగిన గాలి పటంలా - ఎన్నో వ్యసనాలకు లోనై - అతని జావితం గమ్యం తెలీకుండా సాగుతుంది - పెద్దతనం లో -ఇంకా ఇబ్బంది - చెప్పుకోలేని దేహావస్తలతో -  తన పనులు తాను స్వయంగా చేసుకోలేని -చేతగాని తనంతో - బ్రతుకు పరాదీనంగా అయిపోతుంది -- ఎందరు అయిన వారున్నా -ఎంత సంపద -బలగం ఉన్నా - ఆర్చలేని తీర్చలేని వెలితి  - అర్ధాంగి లేకపోవడం --ఎవరు తీర్చ లేని లోపం -- ఒక దశలో జీవితం నరక ప్రాయం లా మారుతుంది -దీనికి
ప్రత్యక్ష ఉదాహరణ మా పెద్ద మామగారు -  భార్య లేని  దుస్థితిలో  తన వ్రుద్ధ్యాప్యం లో -ఎన్నో అవస్తల పాలయ్యాడు --భర్త లేకుండా తన పిల్లలతో ఎన్ని కష్టాలైనా పడుతూ -విధిని ఎదురిస్తూ -ఎక్కడా రాజీ పడకుండా బ్రతుకును
కొనసాగించే సత్తా -తె గింపు దేవుడు స్త్రీజాతికి ఇచ్చాడు అందుకు మా అమ్మనే చక్కని ఉదాహరణ - మా బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన -నిస్సహాయ స్థితిలో మా కన్నా తల్లి- తల్లి తండ్రి అన్నీ తానే అయ్యి - తన ప్రాణానికి
ప్రాణంగా మమ్మల్ని అల్లారు  ముద్దుగా పెంచి పెద్దచేసింది -- అలాగే మా చిన్నాయిలు చుక్కమ్మ -ఆనందమ్మ చిన్నాయిలు కూడా - తమ  తండ్రి కరవైన తమ సంతానాన్ని కంటిపాపలా సంరక్షించారు -  ఈ విషయంలో మాత్రం - మాతృప్రేమ ముందు పిత్రుప్రేమ తక్కువే అనిపిస్తుంది -   ఎందుకంటే కన్న కూతుళ్ళ కు కన్నా తల్లి చూపే అనురాగం -ఆదరణ -ఆప్యాయత -ప్రేమ ఏ  తండ్రి కూడా ఇవ్వలేడు - కనుక-1  అమ్మ  పంచిన ప్రేమ సాక్షాత్తు  ఆ భగవంతుడు కూడా ఇవ్వలేడు-- ఆ ముద్దు ముచ్చట్లు తల్లి వద్ద ఉండే చనువు  బిడ్డలు తమ కష్టసుఖాలు చెప్పుకోడం - అమ్మఒడిలో ఉన్న త్రుప్తి ఓదార్పు  ప్రశాంతత -ప్రపంచంలో ఎక్కడా లభించదు కదా 1


కాని - మాచిన మామగారు మాత్రం  దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు --మనసును చిక్క పట్టుకొని ధైర్యంగా   -  ఎక్కడా ఎవరితోనూ చెప్పుకోకుండా - వెలితి పడకుండా -ఆఖరు శ్వాస  వరకు నిబ్బరంగా జీవించారు    - వైరాగ్యం - జ్ఞానం కలబోసిన మూర్తి అతడు - దేనిమీదా ఆసక్తి లేదు - ఇది కావాలని ఎవరిని  ఎప్పుడు అడగ లేదు - తెల్లని ధోతి కమీజు - అందమైన -ఆరడుగులఆజానుబాహువు - -- హిందీ సినిమా హీరో లా - అచ్చుబోసిన అందమైన  నవ్వుతున్న అచ్చమైనజయపూర్ నుండి తెచ్చిన తెల్లని పాలరాతి బొమ్మలా చేసి  -దేవుడు  మనకడకు పంపించాడు -- నాకు తెలిసి నంత వరకు -ఆయన ఎవరినీ -ఎప్పుడు - బాధపెట్టలేదు -ఇబ్బంది కలిగించ లేదు- భార్య ఉండగా ఎలా ఉండే వాడో -  ఆమె పోయిన ఈ పదిహేడేళ్ళ  ఒంటరి జీవితం లో కూడా   అలాగే ఉన్నాడు - అలా ఉండటం అందరికి సాధ్యం కాదు -అలా ఉన్నవాళ్ళు  చాలా అరుదు  - నిరాడంబరి - నిగర్వి -  అలాంటి గుణాన్ని - భగవద్గీతలో -భక్తియోగం లో  స్థిత
ప్రజ్ఞత అంటారు -- పదవి సంపద భార్య బలగం  ఉన్నప్పుడు -లేనప్పుడు  ఒకేలా ఉండటం --ఇష్ట మైన వస్తువుకు పొంగిపోనివాడు -దేనియందును ద్వేష భావం లేనివాడును -దేనికిని శోకింప నివాడును దేనిని ఆశింప ని వాడును -అందరి యెడ సమభావముతో ఉండు వాడును - మానావా మానములు - శీతోష్ణములు - సుఖ దుఖములు మొదలగు ద్వంధ్వములను  సమానముగా స్వీకరించువాడును నిందా స్తుతులకు చలింపని వాడును - మనన శీలుడును - శరీర నిర్వహణకై  లభించిన దానితో త్రుప్తి పడువాడును -  నివాసా స్థలమందు మమతాసక్తులు  లేని వాడును - స్థిత
ప్రజ్ఞుడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియులు - అని భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి  ఉపదేశించిన  సారాంశము -

 చక్కని దస్తూరి -ముహంలో చక్కని వర్చస్సు - మితభాషి - నిరాడంబరి - తెల్లదనం అనే దుస్తుల్లో దుస్తుల్లో చల్లదనం - వైరాగ్యం పరిజ్ఞానం - ప్రేమ ఆప్యాయతలనే ధనాన్ని  దాచుకుని - అందరికి పంచిపెట్టి - అజాత శత్రువులా - మెలగి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న మా మేన మామ కీర్తిశేషులు గూడూరు కమలాకర రావు మామగారు  నిజంగా ధన్య జీవులు - ఇహము పరము తెలిసిన - వివేక సంపన్నులు - అనుదినం సమయం తప్పక ఉదయం - సాయంకాలం
సంధ్యావందన కార్య క్రమాన్ని  -నిత్య పూజా విధానాన్ని కొనసాగిస్తూ -తన చిన్నఅన్నగారివలే  భక్తి శ్రద్ధలతో - నీతి నిజాయితీ నియమాలతో -పెద్ధలఎడ గోరవంతో పిన్నలఎడ ప్రేమతో -   జీవితాంతం అనుష్టించిన  మామామగారు దైవ
కృపకు -ధైవానుగ్రహానికి పాత్రులు అయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చును -- ఆయన ను కోల్పోవడం తీరని లోటు -కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుడ్రు ఆయనని ప్రేమగా చూశారు -ఆదరించారు -సేవచేశారు -  అయితే  అందరి
కంటే ఎక్కువగా  మా మామగారికిసేవ చేసుకునే  మహా భాగ్యానికి  నోచుకున్నది ఆయన చిన్న కొడుకు కోడలు - శ్రీదర్ కవితలు - తన స్వంత ఇంటిలోనే ఉండటానికి ఆయన - ఎక్కువగా ఇష్ట పడటం-ఇక్కడే శ్రీదర్ దంపతులు నివాసం ఉండటం - వాటి సేవాభాగ్యానికి కారణం అయ్యింది --

వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారి సేవ చేసుకోవడం - వారి పిల్లల అదృష్టం - అనాధాశ్రమంలో  తమ తల్లి దండ్రులను  అనాధలుగా చేర్చే నేటి  అనాగరిక సమాజంలో -ఇలా సహనంతో - విసుక్కోకుండా ఆయన కన్నకొడుకులే కాకుండా -
కోడళ్ళుకూడా  -భార్యలేకుండా ఒంటరితనం తో బాధ పడుతున్న -తమ   మామగారిని ఆప్యాయతతో తమకన్నతండ్రికివలె  ఆదరించి -ఆయన చివరి శ్వాస వరకు -మేమున్నాం 1 మీకు అని  ఆయనకీ  సంతోషాన్ని - ప్రశాంతతను -సంతృప్తినీ  అందించిన ఈ సాంప్రదాయం   -ఈ సంస్కృతీ  అందరికీ ఆదర్శనీయం  -ఆచరనీయం --1


మా మేన మామలు ముగ్గురు మా బ్రతుకులకు  వెలుగు చూపిన దివ్వెలు - వారికి మా మేనల్లుళ్ళం  -వారి మేన కోడళ్ళు - మా కుటుంబాలు  రుణపడి ఉంటాయి --పిల్లలము  పేద వారము -చదువు సంధ్యా -లేనివారము అయిన  మా అందరినీ ఆదరించి - ఆశ్రయమిచ్చీ -అన్నం పెట్టీ - తిండీ గుడ్డా  అందించీ - మాజీవితానికి సరిపడే విద్యా బుద్ధులు  చెప్పించడమే  గాకుండా - ఆప్యాయతతో తమ కన్నవారితో సమానంగా మమ్మల్ని కూడా  గారవించి -  మేనళ్ళు లమైన మాకు తమ కూతుళ్ళ నిచ్చి-అదేవిధంగా తమ మేన కోడళ్ళ కు కూడా  తామే స్వయంగా పూనుకొని పెళ్ళిచేశారు  --మమ్మల్ని ఒక ఇంటివాళ్ళను  చేశారు -అలాంటి ప్రేమమూ ర్తులూ - కీర్తి శేషులూ  ఐన మా ముగ్గురు   మేనమామ  ల  వాత్సల్యానికి --   వారి అపారమైన దయకు  మేమంతా కలిసి - మా హృదయ పూర్వక మైన శ్రద్దాంజలులు
సమర్పిస్తూ ఉన్నాము -- --


వారి ఆత్మలు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా  ఉండాలని కోరుకుంటున్నాము -- వారి  -కుటుంబాలు పిల్లా పాపలతో - ఆయురారోగ్య ఐశ్వర్యాలతో - చక్కని ప్రేమానురాగాలతో -అందరికీ ఆదర్శంగా - తమ తండ్రులకు -తాత ముత్తాతల కీర్తి
ప్రతిష్టలను  వంశ గౌరవాన్ని నిలబెట్టేందుకు-వేద మూర్తులైన  బ్రాహ్మణోత్త ముల ఆశీర్వచనములే  కాకుండా  -పెద్దవారు బంధువులు స్నేహితులు - హితోభిలాషుల ప్రేమపూర్వక మైన దీవన ల తో బాటు - ఆ ఆదిదంపతులు  కూడా
-వీరికి    తగిన శక్తినీ స్పూర్తి నీ అనుగ్రాహించాలని  ప్రార్థిస్తూ సెలవు -!

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...