Saturday, September 15, 2018

దుఃఖం

నేను పదవ తరగతి చదివిన రోజుల్లో.ఒక పద్యం... అందులో భర్త యుద్ధం లో చనిపోగా భార్య ను ఊర డించడానికి  ప్రక్కింటివారు. బంధువులు అంతా ఆమె ఇంటికి వస్తారు...అందరూ ఏడుస్తుంటారు.. ఆమె దీన స్థితికి.. కాని భార్య మాత్రం ఏడవకుండా మాట్లాడకుండా రాయిలా ఉండిపోతుంది... కళ్ళు నిలబడిపోతాయి.. కన్నీళ్లు పెట్టుకోవడం లేదు... లోనున్న దుఃఖం బయట పడనీయడం లేదు... పిచ్చి దానిలా ఎటో చూస్తుంటుంది.. ఎవరు ఎమన్నా దానికి జవాబు లేదు.. స్పందనా లేదు..ఇలాంటి దుర్భర పరిస్థితి చూడలేక . ఆమె తనివిదీరా ఎడవాలంటే ఏం చెయ్యలో ఎవరికీ పాలు పోవడం లేదు... అలా గంటలు గడుస్తున్నాయి.   అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి చూసింది.. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి.... బిగ్గరగా ఏడవకుండా అలాగే ఉంటే. ఆమె ఖచ్చితంగా చనిపోతుందని గ్రహించి... దూరంగా ఉయ్యాల లో పడుకున్న  పసిబిడ్డను   ఆమె ఒడిలో ఉంచగానే.. ఆ బిడ్డ కెవ్వుమని ఏడ్వడం ...అందాకా ఈ లోకంలో లేకుండా ఏమీ పట్టనట్టుగా ఉన్న ఆ మాతృ హృదయం . లోనుండి ఒక్కసారిగా  దుఃఖం కట్టలు తెంచుకొని కన్నీళ్ళ రూపంలో ప్రవహించాయి.... బిడ్డను గుండెలకు హత్తుకుంటూ బిగ్గరగా  ఎలుగెత్తి భర్తజ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విలపించడం  ప్రారంభించింది........

Friday, September 14, 2018

బ్రతకాలని ఉందిరా కృష్ణా!

బ్రతకాలని ఉంది.రా కృష్ణా.! 
బ్రతుకంతా నీతలపుతో గడపాలని ఉందరాి, కృష్ణా. ! బ్ర !!,
కనిపించే ప్రకృతి కాంత అణువణువు న పొదిగిన 
నీ చిత్ర విచిత్ర సృష్టి ప్రతిభ చూడాలని ఉందిరా కృష్ణా .!అందుకే !..! బ్ర!! 

అందమైన సెలయేళ్ళు..అందు. అరవిరిసిన మొగ్గలు..! 
పచ్చని ఆకుల మధ్యన ఎన్నో రంగుల పూవులు ! 
పచ్చని తివాచీ పరచిన కొండలు,కోనలు !, 
కిలకిలా రావములతో నింగిని ఆడే పక్షులు,, ! 
నీ కనుచూపుల తో తిరుగాడే ప్రాణులు .
నీలికొండల తో ఆడే వెండిమబ్బుసోయగాలు..! 
ఎటు చూసినా గానీ, అన్నిటా నీవే కదా కృష్ణా..!బ్ర !! 

కురిసే వర్షపు నీటిలో చల్లదనం నీవే కదా.. 
వీచే ప్రాణవాయువులో చైతన్యం నీవే కదా.! 
ఉదయించే అదిత్యుడు అందించే వెచ్చదనం,! 
రాత్రుల్లో చందమామ వెన్నెల హాయివి నీవే ,,!,
ఎందెందు తిరిగి చూడ, అన్నింటా నీ రూపమే !
.అపురూపము, అద్భుతము, నీ విశ్వరూప మే. కృష్ణా. !బ్ర !! 

రమణీయం,కమణీయం నీ సృష్టి రచనలు.! 
ఇంద్రధనస్సు రంగుల్లో దిద్దిన నీ చిత్రాలు,.! 
అందాలు ఆనందాలు కలబోసిన అమృతాలు,,! 
ఎంత చూసినా, కనినా, తనివి తీరకుందిరా,!, 
నీ ప్రకృతి కాంత ఒడిలో నే పులకించి, పరవశించి,
 నా గుండెల్లో నీ వేణుసుధలు నింపాలని ఉందిరా.. కృష్ణా! 
బరువైన బ్రతుకులో నీ నవ్వుల వెన్నెలలు నింపి ! బ్ర !!


స్త్రీ దేవత

స్త్రీ లను దేవతా స్వరూపాలు గా వేదమాత కీర్తించింది.. ఏ పురాణాలు అయినా పురుషులకే చెప్పబడ్డాయి.. ఏ దేశంలో స్త్రీలు పూజింపబడ తారో.. అక్కడ దేవతలు కొలువై ఉంటారని వేద ప్రమాణం.. అలయాన వెలసిన ఆ దేవుని రీతి.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. అనడం వల్ల మన భారతదేశంలో స్త్రీకి ఎంత విశిష్ట స్థానం ఉందో గ్రహించవచ్చు ను... మాతృదేవోభవ అన్న ఒక్క మాట చాలు .! . మనిషి సంఘం రాష్ట్రం తద్వారా దేశం బాగుపడటానికి..!". త్యాగం ఆమె ను దైవసమానురాలిని చేసింది.. అమ్మ అనే భవ్యమైన దివ్య స్థానం.. ముక్కోటి దేవతల వైభవంకన్నా మిన్న.... సృష్టి స్థితి కారకురాలు... అయినా తానే స్వయంగా ఆ పవిత్రతను కాపాడే క్రమంలో " లయం " అవుతోంది... ఆమె జీవితమంతా త్యాగమయమే.. ఎన్ని కష్టాలు వచ్చినా.లెక్కచేయకుండా. ఆమెను బ్రతికించేది ఒక్కటే. అదే ." ప్రేమ.." .కూతురిగా . సోదరిగా తల్లిగా. అమ్మమ్మగా..నాయనమ్మ గా.. బామ్మగా..స్నేహితురాలిగా.. నిత్యం వర్షించేది ప్రేమ.. అనురాగం. వాత్సల్యం ..అనుబంధం..... శాస్త్రాలకు వేదాలకు. .ఇతిహాసాలకు అతీతమైన స్త్రీ ఔదార్యం..సహనం శీల గుణం సౌందర్యం ..అమోఘం అద్భుతం ..మాటలకు అందని అనిర్వచీయమైన తత్వం....

అదే దుర్గాభవాని మాత అవతార పరమార్థం... దర్శన మాత్రం తో పులకించి చేతులెత్తి మొక్కడం.. మానవతా విలువలకు దివ్యత్వాన్ని ప్రసాది స్తుంది....జగన్మాత ... విశ్వపాలిని ... సర్వమంగళ... దరిత్రిని పావనం చేయడానికి . నీ ఈ స్త్రీ రూపాల వెలుగులను అనుగ్రహించి మమ్ములను ధన్యులు చేశావు... తల్లీ నీ కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతిగా ఏమివ్వగలం..జనని..ఇవే.. మా హృదయపూర్వక ధన్యవాదాలు. కృతజ్ఞతలు.. సద్బుద్ధి.. దైవభక్తి..అచంచల విశ్వాసం..ప్రేమానురాగాలు..మాలో నిత్యం ఉండేలా అనుగ్రహించు... అమ్మా.. లోకమాత..దుర్గాభవాని....నీకు మా శతకోటి ప్రణామాలు .. సమర్పించు కుంటున్నాం...శరణు.. మాతా..శరణు...


శ్రీ క్రిష్ణ తత్వం

శ్రీ క్రిష్ణ తత్వం అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాలేదు .." కృష్ణా .!". అన్న పిలుపుతో ఒళ్ళు పుల కరిస్తుంది. ఏదో తెలియని ఆకర్షణ ..మనసును ఇట్టే లాగేస్తుంది .. కృష్ణ లీలలు విన్నా ... సినిమా ల్లో ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.. ఆ తన్మయత్వం తాదాత్మ్యం. అనుభవైకవేద్యం.. లీ లాశుకులు.. క్రిష్ణ చైతన్య ప్రభువు..భక్త పోతన. అన్నమయ్య.. లాంటి భక్తులు ఎంతో తపస్సు చేసి జీవితాంతం సేవించి భావించి తమ రచనల్లో స్వామిని వర్ణించారు....". "భావయామి గోపాల బాలం..!.". అన్న సంకీర్తనలో..కీర్తించింది వేంకటేశుని..! కాని ఉద్దేశించింది చిన్ని కృష్ణయ్యను..!. బాల కృష్ణుడు నడుస్తుంటే మణులు మాణిక్యాలు గల బంగారు మొలతాడుకు ఉన్న గజ్జెల నినాదానికి. విభ్రమం.. వైభవం. కలిగాయట..!.. చేతిలో వెన్నముద్ద తో. దరహాస వదనం తో కన్నయ్య నండగోపుని ఇంటిలో తిరుగుతూ ఉంటే బ్రహ్మాది దేవతలకు ఆ కృష్ణయ్య అందచందాలను చూడటానికి కళ్ళు. చాలలేదట....! . నిజానికి వారికి కృష్ణ దర్శనం. కలగడం. తమ కీర్తనల ద్వారా కీర్తించడం .. వారి పూర్వ జన్మ సుకృత ఫలం...! వారి భక్తి పారవశ్యం తన్మయత్వం తాదాత్మ్యం వల్ల మనకు కృష్ణ రస రమ్య నటనల వైభవం తెలిసి వచ్చింది..... తిథి. వారం నక్షత్రం.. చూసి పెట్టుకున్న పేరు కాదు. అది ..!. "కృష్ణ" అన్న పదం ఒక పేరు కాదు..! ఒక భావం..! ఒక తాదాత్మ్యం.! ఒక విశ్వ గానం..! సకల సృష్టికి మూలం..!..అనంత రూపాలు నామాలు గలిగిన దేవదేవునికి . ఒక పేరుతో పరిమితం చేయగలమా.....!" " హరే కృష్ణా !".. అంటూ నిత్యం స్మరిస్తూ తరించడం మానవజీవనానికి గమ్యం. కావాలి...

శివోహం

శివోహం.. శివోహం.. శివోహం ...!" ప్రాణం ఉన్నంతవరకూ అందరూ బంధువులే.. స్మశానం వరకు వచ్చి. వెళ్తారు . చివరగా నిప్పుపెట్టాక కొడుకు వెళ్తాడు..కపాలచేదనం తో జీవుడు .బయటికొస్తాడు.. తనకు నివాసంగా ఉన్న శరీరం అనే ఇల్లు చితి మంటలలో కాలిపోతుండటం చూసి వ్యథ పడుతుండటం చూసి.. నేను ప్రేమతో అక్కున చేర్చుకుని ఓదారుస్తాను..... బ్రతుకు పై మమకారం పెంచుకొని. కోరికలు తీరక.. ఆశలు చావక.. భార్యా పుత్రులు ఇళ్ళు ఆస్తులపై మోహం వదలక చచ్చాక కూడా ..సద్గతులు పుట్టక ఇదే స్మశానంలో భూత ప్రేత పిశాచాలయి .ఉన్మాదం తో. పిచ్చిగా బ్రతికిఉన్న వారిని పీక్కుతినే కక్ష ద్వేషంతో ఉన్న గణాలను నా ప్రళయ తాండవ నృత్యంతో. నియంత్రిస్తూ ..వాటిని పాలిస్తూ ఉంటాను.....2...ఇలా సకల ప్రాణికోటి సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించడానికి....ఉన్న నాకు బట్టకట్టుకోడానికి తీరిక ఉండదు.. అందుకే దిగంబరిని. సుగంద ద్రవ్యాలు పూసుకునే ఓపిక ఉండదు.. అందుకే భస్మాంబరధారిని. ..తిండితో పని లేదు... బిక్షాన్ దేహి..!అని లోకమాత మాతృమూర్తి వద్ద.. కపాలం తో భిక్షాటన చేస్తాను. అనగా ఓ మానవా. .మీరు మీ కపాలాలలో జ్ఞానంకోసం రాజరాజేశ్వరిని భిక్ష యాచించండి. మీ ధర్మపత్ని సహాయ సహకారంతో..". అన్న సూచనగా నేను ఆది భిక్షువును అయ్యాను.. !" అలా నేను "యోగి " ని అయ్యాను మీ కోసం..------------------------------------. అలాగే నేను అనగా శివుణ్ణి నీలో ఉన్న అంతర్యామి ని "భోగి " ని కూడా....! "జగమంత కుటుంబం నాది..! " ఇందరు కొడుకులు కూతుళ్లు.. చక్కగా నా లో సగభాగం అయిన ధర్మపత్ని రాజరాజేశ్వరి.. భార్యగా ఉండగా.. ధర్మ అర్థ కామ మోక్ష సాధనాల కై శ్రమించే మీరు ఉండగా. నేను సుఖంగా ప్రశాంతంగా . భోగిని కాకుండా. ఉంటానా . ? " నేను అనంతమైన వాణ్ని అయినా. మీకోసం ఇంత చిన్న లింగకారంలో మీకు అందుబాటులో ఉంటున్నాను .నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో పైన ఈశాన స్వరూపం తో వ్యక్తం అవుతూ.. నాకు మీరు ఎటువైపునుండి పూజలు చేసినా సంతోష పడుతుంటాను.. నేనేం మిమ్మల్ని సుగంధ ద్రవ్యాలు పట్టు పీతాంబరాలు .లక్షల డబ్బులు .వెండి బంగారాలు అడిగానా. .. .? ఇన్ని నీళ్లు పాలు పోస్తే చాలు ఇంత.భస్మం..పూసి నాలుగు ఆకులూ వేస్తే చాలు. ...!" అయితే ఎదో మొక్కుబడిగా కాకుండా మీ హృదయపూర్వక సమర్పణ.. తో ఆంటే ..శివ శివా అంటూ మీరు పోసే జలాధార లో మీ మనసు అనే పుష్పం వేసి.. సమర్పణా భావం తో చేయండి. అది నాకు ప్రియం.. మీ తలిదండ్రుల వద్దకు వెళ్తున్నప్పుడు .మీకు ఎంత ఆనందం ఉంటుందో. అలా నా వద్దకు రావాలి... అదే యజ్ఞం అదే నిజమైన భక్తి ప్రేమ శరణాగతి... జీవునికి దేవునికి అనుసంధానం ఈ మీ కైంకర్య శ్రద్దా భక్తి భావన. .ఇందులో ఆడంబరం లేదు. ఖర్చు లేదు.. బంధు జన పరివారంతో. పనిలేదు.. చదువు నమక చమకాలతో .నియమ నిష్టలతో పనిలేదు.. నిర్మల చిత్తం..పై గురి !. ఇష్టదైవం పై నమ్మకం ! " ౼౼౼౼౼౼౼౼౼౼౼౼ఓ మానవా !" నీకు నా తత్వం అదే శివం ఆంటే శివ చైతన్యం ఆంటే. శివ పూజ ఆంటే నీకూ నాకూ ఉన్న అనుబంధం ఏమిటో ..అర్థమైంది అనుకుంటాను..ఇక నీ ఇష్టం ! --- దూరంగాహిమాలయ పర్వతాలలో ఉంచుతావో.. లేదా శివోహం శివోహం అనుకుంటూ..నీ హృదయ కమలంలో నిలుపుకుంటావో....!" ... వేములవాడ .శ్రీ రాజ రాజేశ్వర స్వామికి జై... శ్రీ రాజ రాజేశ్వరి మాతాకి జై..!"

అయ్యప్పస్వామి భంగిమ

అయ్యప్పస్వామి తత్వం.. అర్థం కావాలంటే స్వామి స్వయంభువు గా వెలసిన చిన్ముద్ర మూర్తి స్వరూపాన్ని తెలుసుకుందాం .పీఠం పై కూర్చుని. కాళ్ళు క్రింద పెట్టకుండా మోకాళ్ళు మలచి.. రెండు పాదాలను జోడించి మనవైపు తిరిగి ఉంటాయి.. ఇక రెండు చేతుల్లో.. ఎడం చేయి. ఎడమ మోకాలు చిప్పపై సుతారంగా చాపి. చేతి వ్రేళ్ళను మాత్రం చిద్విలాసంగా స్వేచ్చగా క్రిందకు చూపుతున్నట్టుగా వదిలేస్తాడు స్వామి.. రెండవచేయిని మాత్రం కుడి మోకాలుపై పైకి ఉంచి చేతివ్రేళ్ళతో చిన్ముద్ర ధారియై. కనిపిస్తాడు. అంతేకాదు. తన. రెండుమోకాళ్లను పట్టబంధం తో బంధించి కాళ్ళను కదలనీకుండా .స్వామి నిశ్చలంగా నిరంజన స్థితిలో అగుపిస్తాడు. మణికంఠ స్వామి మెడలో మణులు రత్నాలు వజ్ర వైడూర్యాలు పొదిగిన స్వర్ణ హారంతో బాటు..మెడలోనుండి తులసీ పూసలహారం మోకాళ్లను బంధించిన పట్టబంధం మీదుగా. వస్తూ రెండుపాదాల మధ్యగా వ్రేలాడుతూ ఉంటుంది.. ఇక స్వామి చెవులకు మకర కుండలాలు భుజకీర్తులు.. నాగాభరణములు. చేతులకు.ముంజేతికి..రెందుకాళ్లకు స్వర్ణకంకణాలు. ధరించి..14సంవత్సరాల అందమైన బంగారు బాలుని రూపంలో. ధగ ధగా మెరిసిపోతూ.. కోటిసూర్యుల కాంతి పుంజముల ప్రకాశంతో. దేదీప్యమానంగా వెలిగిపోతూ అత్యంత వైభవంగా.. తనభక్తుల పాలిటి కొంగుబంగారంగా ధ్యానభంగిమలో.. ఉంటాడు..అద్భుతంగా. అపురూపంగా మోముపై చెదరని చిరునవ్వుతో. చిద్విలాసంగా.చూస్తూ సచ్చిదానంద ఘన స్వరూపంతో కలియుగ వరదుడై కరిమల వాసుడుగా మనకోసం కదలివచ్చి ప్రత్యక్ష మౌతున్నాడు.. ఈ విషయం స్వామిభక్తులందరికీ అవగతమే...అయితే ఆలా ఎందుకు ఆ భంగిమలో కూర్చుని మనకు దర్శనాన్ని ఇస్తున్నాడు.? అన్న దానికి నా స్వప్నంలో అయ్యప్పస్వామి మూర్తి ద్వారా నాకు అర్థం అయిన తీరు. ఇలా ఉంది.......!" స్వామి రెండుకాళ్లు అహంకార మమకారాలను .పట్టబంధం మనసును సూచిస్తూన్నాయి..మనసు అనే పగ్గంతో రెందుకాళ్లనూ ఇష్టం వచ్చిన మార్గంలో పరుగులు పెట్టనీకుండా. కట్టిపడేయడం.. ఆ మనసును. పట్టబంధం మీదుగా అంటుకొని వ్రేలాడుతున్న తులసిపూసలు అనే హరినామంతో జోడించడం వల్ల. చెంతనే ఉన్న స్వామి రెందుపాదాల దర్శనానికి యోగ్యత లభిస్తోంది..



ఆర్తి

భక్తుడు కోరుకుంటే చాలదు.. అర్హత యోగ్యతను చూసి వేణుగోపాలుడు కరుణించేవరకు ఎంతటి మహా భక్తులు అయినా నిరీక్షించ వలసిందే కదా !" ఆవేదన ఒక్కటే చాలదు.. ఆర్తిని కూడా జోడించాలి. కృష్ణుడు ఆంటే నాకు ఏమిటీ అందరికీ ఇష్టమే.. కానీ రాధానుగ్రహం లేనిదే కన్నయ్య కన్నెత్తి అయినా చూడడు. సుమా... అందుకే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ.. అంటూ దీనంగా అమ్మను ఆశ్రయించాడు. శ్రీ రామదాసు..


ఎండాకాలం

జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం వస్తోంది. మండే ఎండలు తెస్తోంది. .వడగాలు లట.వడదెబ్బలట...తెల్లబట్టలతో .మంచి నీటితో. ఎండకాకముందు.. చెమట పెట్టకముందు. పనులేమైనా.. సరకులు తెచ్చినా.. జాగ్రత జాగ్రత జాగ్రత్తగా ..పిల్లా పెద్దా. అడా మగా. నీడలో చల్లగా ఆడాలోయ్.పగటి నిద్దుర మరవాలోయ్. పిల్లలతో ముదముగా ఎగరాలోయ్... పకోడీ బిళ్ళలు .చకినాల కరకరలు ..పళ్ళ రసాలు. శీతలపానీయాలు. ఏమి తినినా. ఏది తాగినా. కదలకుండా.ఇంటిలోనే... కబుర్లాడుతూ సరదా చేస్తూ.. ఆనందంగా జూన్ వరకూ . చల్లని వేపచెట్ల చల్లని గాలుల. గణ గణ తిరిగే.కూలర్ గాలుల. పంఖా అందించు వేడి గాలుల. ఆస్వాదిస్తూ .ఆనందించే... ఎండకాలం వడగాలుల మయం.... ఏం మనిషివ య్యా నీవు. ఏదీ ఓర్చుకోలేవు... వానాకాలం లో అబ్బో. చలికాలంలో అమ్మో. .ఇక వేసవిలో వామ్మో వాక్కో... మా అమ్మ చెప్పింది .కాలమొక్క రీతి గడప వలయు.. అని..... సమత్వభావన అందుకుందాం... చల్లని నీరు. కమ్మని మజ్జిగ.. అందరికీ అందించే యజ్ఞంలో.. భాగం పంచుకుందాం.. మానవత్వం చాటుదాం.. అందరిలో దైవాన్ని దర్శిద్దాం. ప్రార్తించే పెదవులకన్నా.. సహాయం చేసే చేతులే మిన్న.!" హర హర మహాదేవ.. శంభో హర !" పరమేశ్వరా ఎండాకాలం నీ అపర రుద్రావతారం.. మూడవ కన్ను లోంచి వచ్చే అగ్ని కురిపించే మండే ఎండల ధాటికి ..మేము తాళలేము. తట్టుకోలేము.. కనికరించి శాంతించు.. సకల ప్రాణికోటికి హాయిని కూర్చేలా..చల్లని ఎండలు అనుగ్రహించు. తండ్రీ. జగదీశ్వరా.. దయానిధి.!" నీ జటాఝటంలో గల గంగభవాని. శీతల మలయానిల చల్లని వాతావరణం ప్రసాదించు.!" శరణం.. రజతగిరినివాసా.. నమో నమః !"

నెమలి పింఛము వాడు

ఎంతా చక్కాని వాడు.. మా కృష్ణయ్య. ఎంతా అందగాడు .. మా కృష్ణయ్య...! నల్లా నల్లనివాడు.. మా కృష్ణయ్య.!.. కమలాల కన్నుల వాడు.. మా కృష్ణయ్య.....! నెమలి పింఛము వాడు మా కృష్ణయ్య.. !! ఎంతా !! చెవులాకు కుండలాలు. మా కృష్ణయ్య...! నుదుటా సింధూరమువాడు మా కృష్ణయ్య.! కాళ్ళా కు గజ్జెలు కట్టి. మా కృష్ణయ్య. .! మొలను మొలత్రాడుకట్టి. మా కృష్ణయ్య..!!ఎంతా !! మెడలోన కౌస్తుభ హారం. మా కృష్ణయ్య..! చేతూల కంకణలు మా కృష్ణయ్య..! పెదవూల పిల్లనగ్రోవి. మా కృష్ణయ్య....! !ఎంతా !!

అమ్మా !

భార్య భర్తకు చాలా సంతోషంగా రుచికరమైన పదార్తాలు వండి వడ్డించింది.. ఆ రోజు తమ పెళ్లిరోజు కాబట్టి ఇంకా ఉత్సాహంగా ఉంది..కానీ తింటున్నంతసేపు అమ్మ ను గుర్తు చేసుకుంటూ .మా అమ్మ ఉంటే ఇంతకంటే బాగా చేసేది. అంటూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తిని వెళ్ళిపోయాడు. ఆవిడకు మండి పోయింది.. ఎప్పుడూ అమ్మ అమ్మా.. !ఇంత ప్రేమతో వండాను. బావున్నాయి అని ఒక ముక్క అనవచ్చు కదా..అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది అంతలో కొడుకు అమ్మా అన్నం పెట్టు అంటూ వచ్చాడు.. వాడు తింటున్నంత సేపు లొట్టలు వేస్తూ.. వాహ్ ఎంత రుచిగా చేశావే అమ్మా. అంటూ తిని వెళ్ళిపోయాడు అప్పుడు అర్థమయ్యింది... అమ్మ చేతి వంటలో కమ్మదనం ఏమిటో.. తినే పదార్ధంలో కాదు.. ప్రేమగా ఆప్యాయత తో కొడుకా ! కడుపు నిండా తిను .అంటూ తానే స్వయంగా కొసరి కొసరి తినిపించే అమ్మ చేతిలోని అన్నం ముద్దలో.. ఆ పిలుపులో ఆ చల్లని చూపులో. ఉన్న కమ్మదనం. భువిలో దివిలో ఆ దైవంలో నైనా దొరకదు కాక దొరకదు.. జీవితంలో ఆనందపు అనుభూతులు చాలా ఉంటాయి.. కానీ ఎక్కడున్నా .ఎలాఉన్నా గుండెను తట్టి. కొడుకా !" పొద్దు పోయింది కదా .ఆకలి వేయడం లేదా.. నానా లే కొంచెం ఎంగిలి పడుదువు గాని.. తర్వాత చూడవచ్చు ఆ పనులు.. అంటూ సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణ యే అమ్మ రూపంలో వచ్చి. ప్రేమ కరుణ వాత్సల్యం దయ అనురాగం ఆప్యాయత.లను అనుగ్రహిస్తోందా.. అనిపిస్తుంది.. ఇది నిజమైన ప్రేమ. అందులోని ఆనందం అనుభూతి అనిర్వచనీయం.. అపురూపం ..ఈ దివ్య వైభవం కోసమే కదా కృష్ణయ్య ముద్దుగారే యశోదా ముంగిట ముత్యం అయ్యాడు... అమ్మ ఒడిలో స్వర్గం. అమ్మ తలంపులో తృప్తి విశ్రాంతి ఆనందం.. అమ్మ నీడలో ఎంతో రక్షణ. స్వతంత్రం. నిర్భయం..అమ్మంటేనే అసలు సిసలైన ప్రేమ.. అమ్మ వద్ద ఉన్నవాడు నిజంగానే ధనవంతుడు.. అమ్మ జ్ఞాపకాలను పదిలంగా గుండెలో దాచుకున్నవారు నిజమైన భాగ్యవంతులు. అమ్మా ! నీకు శతకోటి వందనములు..ఎన్ని జన్మ లెత్తినా తీర్చుకోలేని నీ రుణం .సృష్టికర్తకు కూడా చెల్లించ దుర్లభం.. అందుకే తల్లీ అమ్మా జననీ మాతా. నీకు సాగిలపడి సాష్టాంగప్రణామాలు సమార్పిస్తున్నాము..

భజన

భజనలు చేయడం హరికీర్తనలు పాడటం హరినామాన్ని స్మరించడం మన విధి కర్తవ్యం .ప్రతిరోజూ ఆలా కనీసం ఒక అరగంట అయినా చేయడం వలన మన శరీరంలో ని వేలాది నాడులు స్పందిస్తాయి.. మన రెండు చేతులనూ కలిపి భక్తి తో కీర్తనకు అనుగుణంగా తాళం వేస్తూఉంటే .లోన ఉన్న గుండె కాలేయము ఊపిరితిత్తులు మూత్రపిండాలు. గ్రంధులు అవయవాలు అన్నీ స్పందిస్తాయి.. భజన కీర్తన తోబాటు అరచేతుల చప్పట్లతో లేదా చిరతలు లేదా గజ్జెలమోతతో .కీర్తనలోని భావవ్యక్తీకరణ తో బాటు పరవశించి పోతూఉంటే పొందేదే నిజమైన బ్రహ్మానందం.. దేహాన్ని మరచి మనస్సును దైవంతో లయం చేస్తే.. జీవుడు దేవుడౌతాడు కదా..! సత్సంగంలో సామూహికంగా . ఒంటరిగా .దైవ మందిరాల్లో .తీర్థ యాత్రలలో గానీ భక్తి గీతాలు. పాడుతూ పాల్గొంటే పొందే ఆనందం అమోఘం.అనిర్వచనీయం . రెండు చేతులనుండి మొదలై శరీరంలోని అన్ని అవయవాలకు కలుపుతూ ఉన్న నాడులు అన్నీ స్పందిస్తాయి.ఆలా లోనున్న సమస్త నాడుల ఉత్తేజంతో . కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలతో కదలడం వల్ల..నరాల్లోని అడ్డంకులు తొలగిపోయి చక్కగా రక్తప్రసారం జరుగుతుంది. గుండె సక్రమంగా పనిచేస్తుంది.. గ్రంధుల విడుదల తో జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది ..ఇవి ఎముకల పెరుగుదలను.నాడీ మండల వ్యవస్థను.మెరుగుచేస్తాయి. మెదడులోనున్న సూక్ష్మ నాడులు కండరాలు సక్రమచలనంతో ఆరోగ్యంగా ఉంటాయి.. ఇలా మనలోని మానసిక శారీరక రుగ్మతలు ""భజన చేయడం "" అన్న ఒకే ఒక్క ప్రక్రియతో తొలగిపోయి.. రక్తపోటు. చక్కెరవ్యాధులు. గుండె జబ్బులు. నరాల బలహీనతలు లాంటి ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నివారింప బడతాయి.. అంతటి శక్తి హరినామస్మరణ లో ఉంది.. ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా నయం కానీ రోగాలు భగవన్నామం తో బాగుపడతాయి...భజన చేసినా వినినా స్మరించినా. పాపాలు హరింపబడటమే కాక..మనసు ఉత్సాహంతో హృదయం ఆనందంతో.. ఆరోగ్యంగా ఉంటుంది...మనం చేబట్టిన పనులు జయప్రదంగా జరుగుతాయి. దైవభావన మనసులో నిలిపితే బాహ్యంగా పనులు దివ్యంగా తృప్తిగా జరుగుతాయి..ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే భజన వల్ల మరో ముఖ్యమైన ఫలితం ఉంది .దేహం నీటితో శుభ్రపడితే మనం భక్తితో చేసే భజనతో చిత్తశుద్ధి.. కలుగుతుంది అనగా దుఃఖాలు బాధలు ఆపదలు అడ్డంకులు మనల్ని అంతగా బాధించవు.. ఎందుకంటే "అలాంటి భక్తుల యోగక్షేమాలు తాను చూస్తుంటానని " గీతాచార్యుడు శ్రీకృష్ణుడుప్రతిజ్ఞ చేశాడు . .అయితే "నాకు సమయం దొరకడం లేదు భజన చేయడానికి !" అని అంటావేమో...! మన. నిత్యకృత్యాల్లో కూడా దైవాన్ని స్మరిస్తూ.. ఇంట్లో విధిగా పూజ గదిలోని దేవున్ని పూజిస్తూ.. నిద్ర లేచినపుడు.. స్నానం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు..నీరు త్రాగుతున్నపుడు.. నిదుర పోవడానికి ముందు.. బయట పనిలో తీరిక దొరికినప్పుడు. ఆలయం వెళ్ళినపుడు .దైవచింతన చేసే పెద్దవారు కనిపించినపుడు. యాత్రల్లో..ఉగాది దసరా సంక్రాంతి లాంటి పండుగ రోజుల్లో... ఇలా మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేతులు జోడించి నమస్కరించడం. వచ్చిన స్తోత్రాలు నామాలు పద్యాలు పాటలు చదవడం చేస్తే ఆది ప్రవృత్తి అవుతుంది... నిజానికి ఈ ప్రక్రియ మనకోసం చేస్తున్నాం.. అంతేకాదు మనపిల్లలకు అందించే తరగని వారసత్వసంపద ఈ హరిభక్తి.. అందుకు తలిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే అలవాటు చేయాలి .ఈ సంస్కృతి సంస్కరమే వారికీ మనకు మన దేశానికీ శ్రీరామరక్ష అవుతుంది.. మనకు ఉచితంగా కోరకుండానే ఈ మానవజన్మ.ఈ. ఆస్తులు అంతస్తులు సంపదలు బంధువులు. భార్యా భర్తకొడుకులు కూతుళ్లు.మనవలు మనవరాళ్లు. భగవత్ ప్రసాదంగా అనుగ్రహించబడినాయి.. ఇవి మాత్రమే గాక ఫలాలు పుష్పాలు నదీినదాలు.కొండలు కోనలు అందమైన ప్రకృతి.. కర్మసాక్షి సూర్యభగవానుడు.. చల్లని దైవం చందమామ. నక్షత్రాలు. రామాయణ భాగవతాది పురాణాలు ఉపనిషత్తులు. లాంటి గ్రంధాలు.. జీవితాన్ని మధురంగా మలచుకోడానిక పరమాత్మ ప్రసాదంగా మనకు అందించాడు..రోజంతా శ్రమించిన శరీరానికి విశ్రాంతినిచ్చే నిదుర అనే దివ్యమైన ఔషధాన్ని.. అనంతమైన ప్రాణవాయువును.. అమృతతుల్యమైన తీయని జలాలను.. పుష్టినిచ్చే పృథ్వి. పాడిపంటలు..పాలు పెరుగు సమృద్ధిగా అందించే పశుసంపద.. ఇలా ఎన్నో ఎన్నెన్నో సౌకర్యాలు మన సుఖకరజీవనానికి సమకూర్చిన ఆ అపార కరుణా కరుడు దయానిధి.. అయిన పరమాత్మునికి బదులుగా ఏమివ్వగలం మనం...? మనం అనుభవించేవన్నీ ఆయనవే..!. ఏ ఒక్కటి మనది కాదు.!. అంతెందుకు.!. ఈ శరీరం ,ఈ బంధువులు, సంపదలు, ఏవీ మనవి కావు.మనం తయారు చేసినవి అసలే కాదు. ప్రకృతిని జ్ఞానాన్ని దేహాన్ని అందమైన పరిసరాలను వాడుకొమ్మని.. సద్వినియోగం చేసుకొనమని అందుకు బదులుగా .కృతజ్ఞత చూపేందుకు విజ్ఞానాన్ని ఇచ్చాడు! నిజానికి ఆయనకు తిరిగి ఇచ్చేందుకు మనదంటూ ఏమీ లేదు..! అతనిది అతనికే సమర్పించడం తప్ప మరేదారి లేదు మనవద్ద...! అందుకే ...కృతజ్ఞతగా మనం చేయగలిగింది , చేయవల్సింది భక్తితో చేతులెత్తి మనసుతో హరినామం చేయడమే !. ఒక వంద రూపాయలు ఎవరైనా ఇస్తే "థాంక్స్" అంటాము.. మరి అనంతమైన అందమైన .రమణీయమైనప్రకృతి సంపదలను.అనుభవిస్తూ ఆధ్యాత్మిక చింతనలేకుండా .జగన్నాథుని స్మరించకుండా గడిపే జీవనం పశుతుల్యం అవుతుందికదా !.పరమ ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్ధకం చేసుకోడానికి దైవభావన కలిగించే .దైవం పట్ల భక్తినిపెంచే భగవన్నామ స్మరణ ఆంటే భజనలు కీర్తనలు స్తోత్రాలు చేద్దాం. పురాణ శ్రవణం తో దైవం గురించిన జ్ఞానాన్ని విశ్వాసాన్ని. పెంచుకుందాం.. తద్వారా ఈ జన్మను ధన్యం చేసుకుందాం. ఆ సాధనా మార్గాన్ని సులభతరం చేసేందుకు ఈ భారాన్ని అప్పగిస్తూ .కావాల్సిన బుద్ధినీ శక్తినీ స్ఫూర్తినీ తెలివినీ సమయాన్నీ.. కరుణించమని ఆ దైవాన్నే శరణు వేడుదాం.!" ఓమ్ శాంతి శాంతి శ్శాంతిః ! . గౌరీ శంకర భగవాన్ కి జై...! గోపాల కృష్ణ భగవాన్ కీ జై...! పవనసుత హనుమాన్ కీ జై ! గజానన భగవాన్ కీ జై.!.భవానీ మాతా కీ జై.! సరస్వతీ మాతా కీ జై !"మహాలక్ష్మీ మాతాకి జై ! స్వామియే శరణం ..అయ్యప్పా శరణం . !.హరహర మహాదేవ శంభో హర..! సమస్త భక్తజనులకు జై..! సద్గురువులకు జై..! లలితా త్రిపురసుందరి మాతాకి జై...!

సంస్కార

మన సనాతన హిందూ ధర్మాన్ని పాటించే క్రమంలో. మన పిల్లల్ని మనం నిత్యం అనుసరించే రోజువారీ ధర్మాలను ఆచరించేలా చూద్దాం.!..నుదుట తిలకం..జుట్టు విరబోసుకొంటు ఉండకుండా చక్కగా జడవేసుకోడం మన ఆడపిల్లలకు నేర్పుదాం. ! కనీసం పండగ రోజుల్లోనైనా కాళ్ళకు పట్టా గొలుసులు.. చేతులకు గాజులు..జడా పూలు బొట్టూ లతో బాలా త్రిపురసుందరి వలె ఉండేలా అలవాటు చేద్దాం...!. మగపిల్లలకు కూడా తిలకం గంధం. లేదా భస్మధారణ. అనునిత్యం ధరించేలా చూద్దాం...! అయితే పిల్లల్లో ఇలాంటి సత్ సంప్రదాయం. అలవాటు కావడానికి. పెద్దవాళ్ళు ఆదర్శంగా ఉండాలి కదా ! ఇంటా బయటా మగాళ్లు కానీ ఆడవాళ్లు కానీ తిలకం లేదా భస్మధారణ లేకుండా ఉండరాదు..అన్న చక్కని నియమం పెట్టుకోవాలి. స్త్రీలు చక్కగా మహాలక్ష్మి కీ ప్రతిరూపం లా.. చీరకట్టు. పాపిట లో సిందూరం.. నుదుట లలితా త్రిపురసుందరి లా ఎర్రని కుంకుమ.. కళ్ళకి కాటుక.. కాళ్ళకి మట్టెలు. పట్టా గొలుసులు.చేతులకి చేరేడేసి గాజులు జడలో పూలతో భవానీ మాతవలె గృహాలక్ష్మి నిత్యం కళకళ లాడుతూ.. ఉండాలి.. పురుషులు ఇంట్లోనే కాదు ఆఫీసు లో బజారులో.నుదుట బొట్టుతో కనిపించాలి..అలాగే దేవాలయాలలో తిలకధారణ చేస్తూ ఉండాలి.! ప్యాంటు షర్ట్ కాకుండా ధోవతి లేదా లుంగీ. తువ్వాలు.తో దైవదర్శనం చేసుకోవాలి. ఇలా చేయకుండా ఆలయాలకు వెళ్లరాదన్న నియమం మనల్ని మనం నమ్ముకున్న దైవానికి దగ్గరగా తీసుకెళ్తుంది కదా.. పైగా ఇది మన.పిల్లలకు అలవాటుగా సంప్రదాయంగా.. స్పూర్తిని ఇచ్చేలా ఉంటుంది. మనంవేసుకొనే దుస్తులఅలంకరణ కట్టు బొట్టూ. ల పైనే మన చిత్తవృత్తి ఆధారపడి ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలుసు !.. ఈ సంస్కారమే ఈ సంప్రదాయమే పిల్లలకు పెద్దవారి పట్ల గౌరవమర్యాదలు దైవభక్తిని పెంచుతాయి..నిజానికి మనం రాబోయే తరానికి అందించే అద్భుతమైన సంపద. ఈ సంప్రదాయమే కదా.. !అయినా వేద ప్రోక్తము. ధర్మ సమ్మతము..ప్రపంచదేశాలకు తల మానికము .దైవానుగ్రహ సాధనము.. శ్రేయస్కరము అనుసరణీయము.. ఆచరణ యోగ్యము.. ఆరోగ్యప్రదము ఉత్తమము దీక్షలు పూజలు .వ్రతాలు యజ్ఞయాగాదులందు ఉపయుక్తముగా వర్ధిల్లుతూ వస్తున్న మన అందమైన అనందకరమైన దివ్యము అపురూపం.అద్భుతమైన భుక్తి ముక్తిదాయకం అయిన మన సనాతన ధర్మాన్ని ఆచరించడానికి భయం సిగ్గు మొహమాటం. ఎందుకు చెప్పండి..? ఆధునికత పేరుతో ఆ వ్యామోహంలో మానవ సంబంధాలను అనుబంధాలను. ప్రేమ వాత్సల్యాలను దూరం చేసుకోకుండా చూద్దాం.. దేవాలయాల లో ప్రశాంతంగా మౌనంగా. ఉంటూ చిత్తాన్ని ఏకాగ్రతతో స్మరిస్తూ సేవిస్తూ దైవదర్శనం చేసుకుందాం. .కనీసం దేవాలయ ప్రాంగణంలో నైనా వేరే విషయాల గురించి మాట్లాడకుండా పవిత్ర భావనతో పవిత్ర స్థలాల్లో పవిత్రఆత్మతో ప్రశాంతతతో పరమాత్మను దర్శనం చేసుకుందాం.!. అక్కడ కేవలం దైవం గురించిన ధ్యానం .ధ్యాస.. ఆలోచన.. చర్చలు మాత్రమే చేద్దాం.. !. భజన శ్లోకాలు స్తోత్రాలు గీతాలు కీర్తనలు పాటలు పూజలు పురాణశ్రవణాలు వ్రతాల నిర్వాహణ కొరకై మాత్రమే వినియోగించి ఇహపరాలు సాధిద్దాం ! ధర్మాన్ని మనం రక్షిస్తే అదే ధర్మంమనల్ని భావితరాలని మన భారతదేశాన్ని రక్షిస్తుందని మనకు తెలుసు.!. అందుకే సాధ్యమైనంతగా ఆచరించుదాం..! ఇతరులకు అదర్శంగా ఉందాం...! పరమేశ్వరా పరాత్పరా పరంధామా ..సద్బుద్ధితో సన్మార్గంతో సత్సంగంతో సనాతన ధర్మ సాధనలో చరించి తరించే భాగ్యాన్ని అవకాశాన్ని బుద్ధినీ అనుగ్రహించు !" మా అజ్ఞానాన్ని అహంకారాన్ని పాపాలనీ క్షమించి సన్మార్గంలోనడిపించు.. శరణు. దేవాదిదేవా మహాదేవా.. శరణు శరణు ..!"

అచ్చుకు హల్లు

శ్రీక్రిష్ణ నిర్యాణం తర్వాత అర్జునుడి పరాక్రమం నిర్వీర్యం అవుతుంది.. వ్యాసభగవాను డు కారణం చెబుతాడు.. శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహం వలన అర్జునుడు అనే పనిముట్టు శక్తివంతంగా పనిచేసింది..మనిషీ కృషికి దైవం చేయూత నిస్తే అద్భుతాలు చేస్తాడు. మనిషిలోని శక్తికి కారణం దైవం.. అచ్చుకు హల్లు కలిపితే అక్షర ప్రభావం మారినట్టు గా మనలో.అంతర్యామిగా ఉన్న సర్వాంతర్యామి కృష్ణయ్య ను ధ్యానిస్తూ చేసే ప్రతిపని విజయవంతం అవుతుంది.. యత్ర యోగీశ్వర కృష్ణో. యత్ర పార్థో ధనుర్ధర..తత్ర శ్రీ విజయో ర్ భూతి.. ధృవా నీతి ర్ మతిర్ మమ....

దేవుడు చూస్తున్నాడు

మనిషి జన్మించిన సమయం నుండి అంతిమ శ్వాస విడిచే వరకూ .ఆరాటం. జీవన పోరాటం .ప్రాణాలతో చెలగాటం చేస్తుంటాడు. .కొత్తదనం కోసం.. ప్రయత్నం.. పాత ఇల్లు కారు వస్తువులు అస్తులు మనుషులు ఉద్యోగం, బంధువులతో సరిపెట్టుకోక.. ఉన్నదానితో తృప్తి పడకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ.జీవిత లక్ష్యం మాత్రం మరచిపోతున్నాడు.. తెలియనిదాన్ని దొరికించుకునే మార్గంలో బాల్యం నుండీ వృద్ధుడయ్యేవరకు సాధన చేస్తూనే ఉన్నాడు.. ఒకటి సాదించాక ఇది కాదు..ఇది సరిపోదు.. ఇంకా కావాలి.. ఇంకా చూడాలి ఇంకా సంపాదించాలి ..ఇలాంటి అంతులేని కథల సారాంశం ఏమిటి..అసంతృప్తి అనే జవాబు వస్తుంది.. మరి తృప్తి ఎలా కలుగుతుంది అన్న ప్రశ్నకు జవాబు భగవద్భక్తి మాత్రమే అని చెప్పవచ్చును.. మన ప్రయత్నం బాహ్యంగా దొరికే లౌకిక ఆనందాల కోసమే ..అవుతోంది.. ఉద్యోగాలు చదువులు గ్రామాలు పరిశోధనలు. ఇళ్ళు. మనుషులు. ఇలా ఎన్నెన్నో తెలియనివాటికోసం సాధించి దొరికించుకుంటాం.. కానీ దేవుని విషయంలో మాత్రం ఆ ప్రయత్నం చెయ్యం.. కనీసం ఆలోచన కూడా చేయడానికి సాహసించం. .అందరిలో అన్నింటిలో అంతటా నీలో నాలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పంచభూతాల్లో దైవశక్తి ఉందని. అందుకే ఈ జగతి .లోని చరాచర ప్రాణులు. అందంగా ఆనందంగా శోభిల్లుతున్నాయని మనకు తెలుసు.. కానీ విశ్వసించం! ..గదిలో ఒంటరిగా ఉండి ఎవ్వరికీ తెలీకుండా మనం చేసే ప్రతీ పనిని దైవం గమనిస్తుంది. అన్న విషయం నమ్మలేం కదా !.. అందుకే ఈ ఆందోళనలు. అలజడులు..అల్లరులు.! "దేవుడు చూస్తున్నాడు" అన్న ఒక్కవిషయం గుర్తుంటే మనం చెడ్డపనులు. ఇతరులను బాధించే చర్యలు చేయలేం.! కుటుంబ సభ్యులను స్నేహితులను అపరిచితులను నమ్ముతాం కానీ మనకు ఇన్ని వసతులు. సంపదలను ఇచ్చిన దేవుని ఉనికిని మాత్రం నమ్మం !..." ఇదంతా దేవుడిచ్చిన వైభవమే "అని అనడం వేరు.. !నమ్మడం వేరు...! నమ్మకం అనేది ఆచరణ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అప్పుడు లక్షల డబ్బు వచ్చినా పోయినా బాధ ఉండదు.. ఎంత విశ్వాసమో అంత ఫలితం.. దేవుని విషయంలో కూడా అంతే.. !దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు.!. అయ్యప్ప భక్తులు కానీ. దుర్గాభవాని భక్తులు కానీ హనుమాన్. సుబ్రహ్మణ్య వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ తమ దీక్షసమయంలో అంతులేని దైవబలాన్ని ఆత్మానందాన్ని.. అభీష్ట పలితాలని పొందుతూ ఉంటారు..!ఇష్టదైవాన్ని తమలో భక్తులు ఆవహింప జేసుకుంటారు .నోములు వ్రతాలు చేసే స్త్రీల నమ్మకానికి దైవం చక్కని సత్ఫలితాలను ఇస్తుంది కూడా.. ప్రయత్న లోపం లేకుండా త్రికరణ శుద్ధితో చేసే ప్రతీ పనికి దైవం తోడుగా ఉంటుందని మనకు తెలుసు. దేవుడు ఎక్కడఉన్నాడు.?. ఆంటే .మన నమ్మకం లొనే ఉన్నాడు .! ఎందుకు కనపడడు.?. ఆంటే అతడు నిరాకారుడు.. సఛ్చి దానందస్వరూపుడు! ఆకారం అంటూ ఉండదు కానీ ఎవరు ఏ ఆకారాన్ని ఆరాధిస్తారో ఆ రూపంలో దైవం వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది...!అందుకే బాహ్యంలో భావంలో. ఎవరు ఆనందంగా సంతృప్తిగా ప్రశాంత చిత్తంతో ఉంటే వారే దైవ స్వరూపులు.!. పోతే ఈ సాధన ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్టుగా భక్తి తత్వం హృదయంలో అంతరంగంలో నిండిపోవాలి.. దైవం కోసం నిత్యం అన్వేషణ చేస్తూనే ఉండాలి.. కళ్ళుమూసినా కళ్ళు తెరిచినా ఏ పని చేస్తున్నా ఏ వస్తువు ను చూసినా మూలకారణభూతమైన ఆ పరమాత్ముని దివ్యదర్శనం చేయగలిగితే అదే పరమ పద సోపానం..! ఆదే మన జీవిత లక్ష్యం.!. అదే మానవజన్మ సార్థకత ! పరమావధి !... అందుచేత. పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముదాం. !మనలో ఉండి మనల్ని నడిపించేవాడు ,మన ప్రాణాధారము ,..సకల ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవాడు ,.అంతర్యామిగా మనలో ఉంటూ .మనం చేసే చర్యలకు సాక్షిగా ఉంటున్నవాడు , ..ఆ జగదానంద కారకుడు.అన్న నమ్మకం ఆలోచన ఆచరణ అంతరంగంలో ఉంటే చాలు.కదా.. జన్మధన్యం కావడానికి..! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ..! శివాయ గురవే నమః !

అందాల రాముడు

"అందాల రాముడు . !ఇందీవర శ్యాముడు...!" అన్నట్టుగా "రామచక్కదనం " అన్న అందమైన పలుకు.. రామునికే చెల్లును.. ఆ చక్కదనానికే..ఆ సొగసులకే .ఆ చిరునగవులకే త్యాగరాజు అంతటి సంగీత కారుడు. రామునిపై తెగ ప్రేమను పెంచుకొని ఆయనపై భక్తి అనే వలలో చిక్కాడు..ఆరాధనతో అతిశయంతో.. పరవశత్వంలో అమృతధారలాంటి తన కీర్తనల్లో రాముని వైభవాన్ని రూపగుణ సౌందర్యాలను అపురూపంగా తెలుగులో లిఖించి, అందంగా స్వరాలను కూర్చి, తేనెలొలికే లలిత మైన పదాల సాహిత్య సంపదగా మనకు బహుకరించారు...! ఇలా తులసీదాసు ,భక్త కబీరు, శ్రీ రామదాసు లాంటి ఎందరో మహానుభావులు , భక్తులు రామనామ గానామృత వైభవంలో పులకించి తరించారు..! "పుంసాం మోహన రూపాయ.పుణ్య శ్లోకాయ మంగళం ! " అని వాల్మీకి మహాశయుడు తన రామాయణ కావ్యంలో..రాశాడు. పురుషులను కూడా మోహింప చేసే రామచక్కదనాన్ని అద్భుతంగా ఆలా ఒక్క మాటలో చెప్పాడు.. !శ్రీరామకుటుంబాన్ని మనకుటుంబానిగా భావిస్తూ వస్తున్న మన సనాతన వారసత్వ ధర్మానికి జోహారులు. !" ధర్మో రక్షతి రక్షితః !' అన్న నానుడి రామ చరిత వల్లనే ప్రాచుర్యం అయ్యింది..! నరుడిలా అవతరించి మనకోసం ఎన్నో కష్టాలను భరించి ధర్మాన్ని గెలిపించాడు...రామచంద్రుడు ! ఎన్నిసార్లు రామాయణం వినినా చదివినా గానం చేసినా.పాడినా తనివితీరదుకదా !ఆహా !ఇక. భక్తి శ్రద్ధలతో వినే వారిలో ఇంకా ఆ ఆనందం తాదాత్మ్యం ఇంతింతై వటుడింత యై అన్నట్లుగా రెట్టింపు ఉత్సాహం మానవజీవన సాఫల్యతగుణం ..నడవడిలో ఔన్నత్యం పెరుగుతాయి.. అందుకే మనిషి గా పుట్టాక మన నడవడి ఇతరుల జీవనానికి ఒరవడి కావాలని రామకథ బోధిస్తుంది...! భద్రాచలం క్షేత్రంలో మనం దర్శించే లక్ష్మణ సహిత సీతారాముల విగ్రహాల అపురూపశిల్ప లావణ్యం దివ్యం.! వర్ణనాతీతం.! మధురాతిమధురం!.దేవాలయ గర్భగుడిలో కొలువై ఉన్న రాజారామ చంద్ర ప్రభువు అందచందాలను వీక్షించడంలో. అలౌకిక అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాం. !. ఈ మాంసపు నేత్రాలు సరిపోవు.!. ఎంతచూసినా ఇంకా చూడాలనే సౌందర్యం రామయ్యది..! రాక్షసుడైన రావణుని కూడా సమ్మోహనపరచి వివశుడిని చేసిన కోటిసూర్య ప్రకాశ తేజోపుంజం , ఆ పర బ్రహ్మ స్వరూపం..! చుట్టూ అందమైన ప్రకృతి శోభలతో , స్వచ్చంగా ప్రవహించే పరమ పవిత్ర గోదావరీ జలధారల వైభవంతో, ఎంతో సుందరంగా మనోహరంగా స్వర్ణ కాంతుల ప్రకాశంతో. మనోఙ్ఞన్గా. అగుపిస్తోంది ఈ క్షేత్రం ..!మన అంతరాళంలో ఆ సౌందర్య రాశి..ఆ రామచక్కదనం అందంగా కదుల్తూ ఆనందాన్ని కలిగిస్తుంది.!. రామ సౌందర్యమే ఇంత అందాన్ని ఆనందాన్ని కలిగిస్తుంటే ఇక రామనామ వైభవాన్ని వర్ణించతరమా ! శ్రీరామచంద్రుని శక్తి కంటే రామ నామానికే అద్భుతమైన ప్రభావం ఉందని ఎందరో రామభక్తుల ప్రసిద్ధిని కీర్తిని చూస్తే తెలుస్తోంది.. రామ భక్తాగ్రేసరుడు ఆంజనేయుడు త్రేతాయుగం నాటి తన ప్రభువుకీర్తిని రామనామ గాన వైభవంతో చిరంజీవి యై ఈ యుగంలో కూడా ఊరూరా ఖండాంతరాలలో కూడా దశదిశలా వ్యాపింప జేస్తున్నాడు ! శ్రీరామ సాక్షాత్కారం పొందిన పోతన ,భద్రుడు , తులసీదాసు , శ్రీరామ దాసులవంటి ఎందరో రామభక్తులు కేవలం రామనామ గాన ప్రభావంతో మానవజాతి ని భక్త్తమార్గంలో సన్మార్గంతో నడిపిస్తూ మానవజన్మ ను ఉద్దరిస్తూ వచ్చారు. ఇదీ మన సాకేతరాముని మర్యాద పురుషోత్తముని సీతారాముని ఆనందామృత అపురూప అద్భుత చరితం.. అదిశేషునికైనా ఆదిిదేవునికైనా బ్రహ్మకు నైనా రాముని గుణసంపద శీల వైభవము పరాక్రమము ఆదర్శము ..షోడశ గుణ సంపన్నుని పొగడుటకు తరముగాదు కదా ! శ్రీ. రామచంద్రా.!సద్గుణ సాంద్ర ! జగదానంద కారకా..! నీ స్మరణ మధురం ! నీ కీర్తన మధురం.! నీ తలపు నీపై వలపు.. నీ రూప గుణ నామ వైభవం మధురాతిమధురం.! జానకిరామా. !పట్టాభిరామా ! పావననామా !.ఈ ఆనందాన్ని ఇలానే కరుణించి శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు !.రామదాసులకు దాసానుదాసునిగా, ఆ దాసుల పదరేణువుగా ,నీ సేవ చేసుకొనే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రీ..!శ్రీ సీతారామచంద్ర స్వామీ ! ఇంతకన్నా ఆనంద మేమి. ఓ రామ శ్రీరామ ....!"..జై శ్రీరామ్ !జై జై శ్రీరామ్ !"

పదండి ముందుకు

ఉపాధ్యాయునిగా రాగంపేట high school లో పనిచేస్తున్నప్పుడు, పదవ తరగతి పిల్లలు. తమకోసం ప్రత్యేకంగా ఒక డ్రామా రాయమని నన్ను అడిగారు1982 లో...!అప్పుడు " పదండి ముందుకు !"అనే సాంఘిక నాటకం రాశాను.. అందులో ఒక యువకుడు తన అభ్యుదయ భావాలతో. తన స్వంత ఊరిని సంస్కరిస్తాడు. తన స్నేహితులతో కలిసి. ఒక team గా ఏర్పాటు చేసి తోటివారి కనీస అవసరాలు తీరుస్తాడు .విద్య, వైద్యం,రవాణా ,వ్యవసాయ ఇబ్బందులను అందరితో చర్చించి సామూహికంగా కదిలి. గ్రామస్తులను ఒక్క త్రాటిపై నడిపిస్తాడు ..ఇది సర్పంచ్ గా ఉన్న జమీందారుకు నచ్చదు ,అయినా అతడి బెదిరింపులకు భయపడకుండా మంచితనంతో. తెలివిగా. అతడు చేసే లోపాలు పొరబాట్లు. చూపుతూ, అతడి దౌర్జన్యాలు అన్యాయాలను సంఘటితం గా పోరాడి ,అతడికి కనువిప్పు కలిగిస్తాడు . ! ఇందులో.హింస లేదు,! కొట్లాటలు లేవు,!గుండాయిజం లేదు .!ప్రశాంత విప్లవం తో ,తన ఆదర్శభావాలతో, సర్పంచ్ గా నెగ్గుతాడు. !విద్యుత్తు రోడ్లు. పరిశుభ్రత. లాంటి ఆధునీకరణ తో ఉత్తమ సర్పంచ్ గా పేరు సంపాదించడం ,అదే జమీందారు కూతురుని పెళ్లి చేసుకోవడం తో. కథ సుఖాంతం అవుతుంది.....!" ఇదీ కథ సారాంశం..! అయితే అప్పుడు గ్రామాలలో ఫోన్లు సినిమాలు టీవీ లు లేవు..! కరెంట్ కనెక్షన్లు్ కూడా తక్కువే ఉండేవి..మా స్కూల్ compound లో బల్లలు వేసి. stage తయారు చేశాము..రాత్రి 7pm నుండి 10pm వరకు మూడుగంటలు పెట్రోమాక్స్ లైట్లు 5,,పెట్టి 20 మంది విద్యార్థులతో , ఉపాధ్యాయుల సహకారం తో , పాటలు గానీ డాన్సులు గానీ లేకుండా చక్కని సంభాషణలు వారి నటనకు జోడించి.. విజయవంతంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు గ్రామస్తుల ముందు ప్రదర్శించాము .ప్రక్క పాఠశాలలవారు కూడా ఇది విని మా స్కూల్ లో వేయమంటే అక్కడా చేశాము ..అలా..అందరూ మెచ్చుకునే రీతిలో పిల్లలు అద్భుతంగా నటించి,తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..డ్రామా రాయడమే నా వంతు.. కానీ తీర్చిదిద్దే వంతు మా తోటి ఉపాధ్యాయులదే అయ్యింది.. ఆదరించిన గ్రామస్తులకు, పిల్లలచేత పలికించి నటింపజేసినమా teaching staff,Headmaster గారలకు సర్వదా కృతజ్ఞుడిని...అవుతున్నాను !..... అయితే ఇక్కడితో కథ అయిపోలేదు.!. అసలు కథ ప్రారంభమే ఇప్పుడు,!" 36 సంవత్సరాల సేవాకాలం తర్వాత ,,నేను,2004 లో retirement తీసుకున్నాను..! ఒకరోజు .గుండి high school మాజీ SSC విద్యార్థుల సమావేశానికి . ఆ సంవత్సరంలో తమకు చదువు చెప్పిన విశ్రాంత ఉపాధ్యాయులను ఆహ్వానించారు.!. అందులో నేను ఒక్కణ్ణి..! సన్మానాలు అయ్యాక ఆ ఊరి గ్రామ యువకులు. జిల్లాలో ఉత్తమ సర్పంచ్ గా అవార్డ్ అందుకున్న యువకున్ని సాదరంగా అభిమానంతో స్టేజి మీదకు ఆహ్వానించి సన్మానించారు.. !అప్పుడు ఆ యువకుడు తన సందేశాన్ని వినిపించేందుకు ముందుగా. ఇలా అన్నాడు.." నేను ఉత్తమ సర్పంచ్ గా ప్రభుత్వంతో ఎన్నికైనందుకు నాకు గర్వన్గా ఉంది. ఈ పేరు నాకు రావడానికి సహకరించిన నా గ్రామస్తుల ప్రోత్సాహానికి సహకారానికి సంతోషంగా కూడా ఉంది.. అయితే నేను సర్పంచ్ కావడానికి నా గ్రామానికి ఎదో రకంగా సేవ చేయాలన్న దృఢ సంకల్పాన్ని కలిగించి ,ఆ ఆదర్శ భావాలను నా విద్యార్థిదశలోనే నాటి,, మా కోసం "పదండి ముందుకు " అనే సాంఘిక నాటకం రాసి. అందులో నన్ను ఉత్తమ సర్పంచ్ గా వ్యక్తిత్వాన్ని పెంచి, మీ ముందు ఇప్పుడు తలెత్తుకొని గర్వన్గా నిలబడే ఉన్నతస్థాయిలో పదవిలో నిలబెట్టాడు మా గురువుగారు ,మనోహర రావు గారు ! .".సర్పంచ్ " అనే శిల్పాన్ని చక్కగా చెక్కి అందంగా అందరికి అందుబాటులో ఉండేలా చేశాడు ఆయన.. ఆనాడే నన్ను "ఉత్తమ సర్పంచ్ " చేశాడు ఆయన.. ఇప్పుడు కొత్తగా నేను అయ్యింది ఏమీ లేదు.. అలా చేయకపోతే నేను ఇలా మీ ముందు ఆదర్శ ప్రజాప్రతినిధిగా నిలబడేవాడిని కాదు... మీ అందరికి గ్రామానికి సేవ చేసే భాగ్యం అబ్బేది కాదు. !అదొక అదృష్టం అయితే , మరొక అదృష్టం ఏమిటంటే .ఆ విధంగా సామాజిక దృక్పతం తో డ్రామా రాసి నాతో మంచిపనులు చేయించిన ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా నాకు ఎదురుగా కూర్చుండి ఉండడం, ! , వారి ఎదుట నాకీ సత్కారం జరగడం నా అదృష్టం !..నిజానికి ఈ సత్కారం వారికి చెందాలి...!" అంటూ కిందికి దిగి వచ్చి నాకు నమస్కరించి . నన్ను పైకి తీసుకెళ్లి సభకు నన్ను పరిచయం చేసి అదే పూలదండను నా మెడలో వేసి. ఆదే శాలువాను నాకు కప్పాడు.!.. అంతే కాదు తాను నా కాళ్ళకు వంగి దండం పెట్టాడు ..సభలో చప్పట్లు. సంతోషంతో నా కళ్ళనుండి ఆనంద భాష్పాలు జలజలా రాలాయి నా కళ్ళనుండి.. ఆనందంతో మాటలు తడబడ్డాయి.. గుండెలు పొంగే పట్టరాని భావాలు.. ఉపాధ్యాయనిగా నేను పొందిన వృత్తిపరంగా సంతృప్తి అందించిన ఆ భగ వంతునికి శతకోటి ప్రణామాలు సమర్పించడం తప్ప..ఇంతగొప్ప అనుభూతిని బ్రహ్మానందాన్ని అనుగ్రహించిన ఆ దైవానికి ప్రతిగా ఏమిచ్చి రుణం తీర్చుకోగలం...ఇది నిజంగా జరిగిన వాస్తవ గాథ.. ఒక సినిమాలో చూపించే మధురమైన సన్నివేశంలా తోచింది ఇందులో సర్పంచ్ పేరు చెప్పనేలేదు కదా.. అతడు మరెవరో కాదు ! అతడిపేరు "భద్రేశం!" తెలంగాణ వాసి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం లోని దేశరాజు పల్లె అనే గ్రామంలో పదిమందికి ఉపకారం సహాయం చేసే మానవతా దృక్పథంతో నిరంతరం గ్రామస్తులందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటున్నాడు !. .అదే సౌజన్యం !అదే ఉత్సాహం ! అదే చెదరని చిరునవ్వు.! "" .ఎప్పుడూ మీ ముందు నేను విద్యార్థినే. !ఇంకా ఎంతో నేర్చుకోవాలి.. !ఎంతో చేయాలి! ఈ గుర్తింపు అభివృద్ధి లకు కారణం ఆనాడు విద్యను చిత్తశుద్ధితో మాకు అందించిన గురువుల అనుగ్రహమే. !" అంటాడు.. అప్పటినుండి ఇంకా ఉత్సాహంగా గ్రామంలో సేవలు చేస్తూ ప్రజాదరణ పొందుతూ ఉన్నాడు.. ఎప్పుడు నన్ను కలిసినా చిరునవ్వుతో నమస్కారం చేస్తూ " మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి. ఎలాంటి సమస్య అయినా పని అయినా నేను చేసి పెడతాను .సార్ !" అంటాడు.. ఇదీ అతడి నమ్రతకు వినయ విధేయతకు ఉత్తమ సంస్కారానికి విద్యార్థికి తన గురువుగారి పట్ల ఉండే గౌరవ భావాలకు ప్రతీక రిటైర్ అయ్యాక కూడా తమ గురువులను మరవకుండా , గుర్తిస్తూ తమ ప్రతిభకు యశస్సుకు కారకులని భావించి ,ఎక్కడైనా వారు త్రోవలో కలిసినప్పుడు. కృతజ్ఞతతో వంగి చేతులు జోడించి వందనం చేస్తున్న ఇలాంటి మంచి విద్యార్థులను కలిగిన ఉపాధ్యాయుల జన్మ నిజంగా ధన్యం .! పవిత్రమైన బోధనా వృత్తి దివ్యం !అద్భుతం . ! సఫలం !. నిజాయితీతో అంకితభావం తో ,ఇతరుల సంక్షేమం కోసం చేసే ఏ వృత్తిలో నైనా సంతృప్తి నిజమైన ఆనందం ఉంటుంది..! అందులో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది.!. పిల్లల బంగారు భవితను సరిదిద్ది ఉత్తమ పౌరునిగా మలచడం ద్వారా పొందే సార్థకత లోని ఆనందం అమూల్యము.! అపురూపం !అమోఘం !పరమ పవిత్రమైన అధ్యాపక వృత్తిని అందించి.. విద్యార్థులకు స్ఫూర్తినీ చక్కని భవిష్యత్తును ఏర్పరచడానికి అవకాశం అనుగ్రహించిన దేవదేవునికి హృదయపూర్వక ధన్యవాదములు.. సాష్టాంగప్రణామాలు.. సరస్వతీ మాత చదువుల తల్లి విద్యాలక్ష్మీ కి నమస్సులు..

స్వామి

కోటి మన్మధకారుడు, జగన్మోహనుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు,, ఆదిదేవుడు,, శరణాగత వత్సలుడు,, సర్వలోక శుభంకరుడు,,కలియుగ దైవము,, అలిమేలుమంగా సహిత శ్రీ వేంకటేశ్వరుడు, ఎదుకొండవాని గా ప్రసిద్ధిగాంచిన ఆశ్రీత వత్సలుడు,, పరమ దయాలువు,, శ్రీకృష్ణ భగవానుని ప్రతి రూపముగా వెలిసిన తెలుగువారి ఇలవేలుపు మన వెంకన్న స్వామి లీలలు, ప్రాభవం, వైభవం, మహత్తు,, ఎవరినీ వర్ణింప తరము కాదు.. స్వయంభువు గా సకల మానవాళిని ఉద్ధరించడాని కి ప్రత్యక్ష కలియుగ దైవంగా ఇలలో ,వెలిసిన వెంకటేశుని అందమైన ఆనందకరమైన దివ్యమైన మోహనకారము ఎంత చూసినా ఎన్నిమారులు చూసినా,, తనివి తీరదు,,చూడాలన్న ఆశ చావదు, స్వామి ఆరాధనా ఫలాలను అరగించాలంటే, ఆసక్తి, తపన ,తత్వాన్ని నిత్యం మననం చేయడం , ఆర్ద్రత ,మాత్రమే కాదు ,,అవి మనలో మనసులో నింపి ,స్మరించి,జపించి ,సేవించి, తరించే,భాగ్యాన్ని ,ఆ స్ఫూర్తిని అనుగ్రహించమని స్వామిని వేసుకోవాలి , స్వామి కరుణతో, దయతో, మాత్రమే స్వామిని నిజ దర్శనం చేయగలం,,

జగన్నాటకం

ప్రతీ పదములో,ప్రతీ ఆలోచన, పనీ, కార్యక్రమంలో పరందాముని పర తత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయడం, కూడా పరమేశ్వరానుగ్రహమే కదా,, ఈశ్వరా,, ఎన్నో పనులు చేయడానికి టైం, ఓపిక,డబ్బు,, తపన ఉంటాయి, కానీ 24 గంటల్లో నిన్ను తలిచే ఓపికగాని తీరికగాని సమయం గాని ఉండడం లేదు,, తండ్రీ, ఏమిటీ మాయ, ఎందుకీ లీల,, ఈ పరీక్ష,, ఈ జగన్నాటకం,ఈ తోలుబొమ్మలాట..గోవిందా, నీ తలపు మధురం నీ రూపం, నామం మధురాతిమధురం... నారాయణా, నీ నామమే గతి ఇక.. కోరికలు మాకు కొనసాగుటకు.....

పంచుకో

మా అమ్మ అరటిపండు ను ముక్కలు చేసి అందరికి ఇస్తూ చివరికి మిగిలిన భాగాన్ని నోట్లో వేసుకునేది... పళ్లకు అంటకుండా.. చూస్తే నోరూరి తినాలని అనిపించే మామిడి పండ్లని బ్రహ్మణుడికో ముత్తైదువ కో పిల్లలకు ఇచ్చేసేది... ఉంచుకోడం లోకన్నా,, పంచుకోడంలో ఎక్కువగా ఆనందాన్ని తృప్తినీ పొందేది. పరమాత్మ తత్వ చింతనతో.మనసు పండితేనే అలాంటి నిష్కామ ప్రవృత్తి అలవడుతుంది కదా .హరే కృష్ణ.......

శరణాగతి

శరణాగతి అంటే ఇలా ఉంటుందేమో. !---- .శరీరమే గుడి,,! తలయే శిఖరం,,! హృదయమే శ్రీహరికి పీఠం,, కంటి చూపులే దీపాలు,!, లోన ఉన్న అంతర్యామిని ఆత్మలో దర్శించడానికి ,,,! ఇక పలుకులే మంత్రములు,,! ఇంపైన నాలుకే గణ గణ మ్రోగు జేగంట !,,భుజించే ఆహారంలో ని రుచులే నైవేద్యాలు గా లోన ఉన్న దైవానికి "అని తలవాలి...! 

అంతే గాక , తన కాలినడకలే స్వామికి అంగరంగ వైభవంగా జరిపే ఊరేగింపులు " ,అనుకుంటూ భావించి జీవించే జీవుడు నిజమైన దాసుడు,!,కాగా తాను చేసే "ఉఛ్వాస నిశ్వాస క్రియలే శ్రీవారికి ఊంజల సేవ ""గా అనుభవిస్తూన్న భావసంపదను "నిత్యపూజ "గా స్వామికి, సేవిస్తూ సమర్పిస్తే ఈ "వైభవాన్ని" స్వీకరించడానికి పరమాత్ముడు ప్రత్యక్షంగా దిగివచ్చి భక్తునికి పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, అనడానికి అన్నమయ్య, పోతన, శ్రీరామదాసు, మీరాబాయి, త్యాగరాజు లాంటి ఎందరో మహానుభావులు , భక్తశిఖామణులు మన భారతావని లో కీర్తింపబడుతూ ఉన్నారు.. 

"నీవే తప్ప ఇతః పరంబెరుగ. మన్నింపన్ దగున్ దీనునిన్ .....! " ఆలాంటి శరణాగతి లో అద్భుతమైన అనిర్వచనీయమైన బ్రహ్మానందాన్ని, అనుభవించారు..వారు !"""ఎంతో రుచిరా. శ్రీ రామ. నీ నామమెంతో రుచిరా!",అంటూ ఆనందపారవశ్యంతో జీవితాన్ని భక్తితత్పరతతో పండించి పరమాత్మను చిత్తశుద్ధితో సేవించి తరించారు ...!" ఇంతకన్నా ఆనందం ఉంటుందా..!" జై శ్రీరామ్..!


ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు నిజంగా అదృష్టవంతులు.! నాడు, నేడు, ఏనాడైనా....! గుర్తింపు, గౌరవం, సమాజసేవకు తగిన అవకాశం, అంకితభావం,నిరంతర అధ్యయనం, జ్ఞాన సముపార్జన, కొంతమంది కి వేదికపై చెప్పగలను ! అన్న దైర్యం, గర్వం, అభిమానం,, ఆదరణ, ఆనందం,పిల్లలతో మమేకమై, పెద్దరికం మరచి, బాల్య వైభవాన్ని అందుకునే మదురక్షణాలు, ! ,ఇలా ఎన్నో ఉత్తమమైన మానవతా, ధార్మిక, నీతి విలువలు అందించే భాగ్యం ఈ వృత్తిలో ఉంది. అన్నింటికీమించి job satisfaction, అద్భుతంగా ఉంటుంది, రిటైర్మెంట్ అయ్యాక కూడా ఎదురొచ్చి గుర్తించి, పరిచయం చేసుకొంటూ , గడచిన అనుభవాలను గుర్తు చేస్తూ , తమ అభ్యున్నతి కి కారణం మీరే మేష్టారూ !అంటూ వినయంగా నమస్కారం చేస్తూ వెళ్లిపోయే శిష్యులు సంప్రదాయానుసారంగా చేసే అభివాదం ,,చాలదా దేవుడిచ్చిన వరం ఫలించింది అనడానికి,!! వృత్తికి న్యాయం చేశాను అని అనడానికి...!

కష్టాలు సుఖాలు పరమేశ్వరా!

దేవుడు కష్టాల్లో గుర్తు కొస్తాడని అంటారు, సుఖాల్లో మరచిపోతామని అంటారు..!అసలు.కష్టం అంటే ఏమిటి.? అలాగే ఏది సుఖం,,?కష్టాలు లేనిది ఎవరికి. ? , ఎంత ధనవంతుడు, బలవంతుడు, విద్యావంతుడు అయినా లేదా బీదవాడు, రోగులు, అనాధాలు, అభాగ్యులు,అయినా కష్టాలు లేవని అనే వారెవరు..? జన్మించిన మానవుడు అంతిమ శ్వాస వరకు కష్టాలు పడక తప్పదు, సుఖం కూడా..! అయితే ఎవరి కష్టాలు వారికే ఎక్కువ,,! 

గుడికెళ్లని వారు ఉంటారేమో కానీ హాస్పిటల్ ను దర్శించని వారు ఉండరు,ఎందుకంటే జనన మరణాలు అక్కడే సంభవిస్తున్నాయి . ఎక్కువ కాలం బ్రతకడానికి ఎక్కువగా డాక్టర్ లను చూడాలి, వారు చేసే treatment కష్టాలను మన ఇష్టపూర్వకంగా స్వీకరించాలి .!

కానీ.దేవాలయానికి వెళ్ళాలంటే మాత్రం కష్టాలు గుర్తుకొస్తున్నాయి..దైవదర్శనానికి తీరిక ఉండదు . అన్ని విషయాలు జ్ణాపకం ఉంటాయి. కానీ దేవుని భజనలు స్తోత్రాలు మాత్రం, జ్ణాపకం ఉండవు, అలాగే అందర్నీ నమ్ముతాం కానీ దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు ,అంతటా ఉండి నిండి అన్నింటిని నడిపిస్తున్న సచ్చిదానంద స్వరూపుడు అంటే. మాత్రం నమ్మము.. 

ఇక ఈ మందులు కలిసిన ఆహార పదార్థాలు తినడం రోగాలకు మూలం కాగా,బ్రతుకు బాటలో, జీవన పోరాటంలో ఆరాటంలో మనం పడే కష్టాలు పుష్కలం,.!. అంతులేని సమస్యలు .అయితే కష్టం అంటే అసలు అర్థము ఏమిటి? తిండికి లేకపోవడమా ,తింటే అరగక పోవడమా,! డబ్బులు లేకపోవడమా, ఉన్న డబ్బులు ఎలా దాచుకోవాలో తెలీక పోవడమా.!ఇలా కష్టాలకు ఎన్నో నిర్వచనాలు, చెబుతారు... అందుచేత దైవారాదనకు కష్టాలే రావాల్సిన అవసరం లేదు, 

ఎందుకంటే దేవుణ్ణి తలవని రోజు దుర్దినం,! తలిచిన రోజు సుదినం,,! పోతన అందించిన భాగవత భక్తిమార్గము లో " దేవదేవుని నుతియించు దినము దినము ""!" అంటాడు. కావున దైవాన్ని తలచుకోవాలంటే నమ్మకం మొదటి మెట్టు,!అనగా భావం ముఖ్యం !, ఎంత విశ్వాసమో అంత ఫలితం కదా,,!,అందుచేత మన కష్టసుఖాలకి ,భగవన్తుని పూజించడానికి లంకె పెట్టగూడదు.. లోన ఉన్న అంతర్యామికి , బయట మనం అనుభవించే భౌతిక కర్మలఫలితాలకు ఏ మాత్రం సంబంధం లేదు..

మన సంచిత కర్మల ఫలితం మన ఈ కష్టాలు సుఖాలు..! అంతే గాని దైవం మూలకారణం కాదు కదా...! చూసే చూపులో, భావించే మనసులో దైవాన్ని ఆరాధించే తత్వం దాగి ఉంటుంది. తపన, సాధన,,సత్సంగం, దైవానుగ్రహం తోడైతే తప్ప హృదయంలో దైవాన్ని స్థిరంగా ఉంచుకోడం సాధ్యం కాదు కదా,,! పరమేశ్వరా!, పరంధామా,! 



ఎన్ని కష్టాలు రానీ, సుఖాలు పోనీ,, నిన్ను తలిచే, కొలిచే పూజించే, భజించే భావించే అచంచలమైన భక్తివిశ్వాసాలను అనుగ్రహించు,! భావ దారిద్ర్యం రానీకు పరమాత్మా,!, నీ స్మరణయే సుఖం,! నీ తలంపు లేని ఘడియలు కష్టం, కావున స్వామీ ! మంగళకరము, మహిమాన్వితమైన నీ దివ్యవిగ్రహ దర్శన మహాభాగ్యాన్ని ప్రసాదించు..! శరణు జగదీశా,! శరణు, ఆదిదేవా శరణు..!మా కున్న కష్టాలలో కూడా నీ ఉనికిని గుర్తించే స్పూర్తిని శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించు మహాదేవ దేవా !,శరణు !

వెన్నదొంగ

"వెన్నదొంగ, !"అని కృష్ణుని పిలుస్తుంటారు .కానీ అది నిజమా.? కాదు !".బ్రహ్మాండాలను బొజ్జలో దాచుకున్న కన్నయ్యకు వెన్న కావాలా.! అది దొంగతనం గానా..! 

అసలు సత్యం ,చిన్నికృష్ణునిపై గోపికలకు గల అపారమైన భక్తి. ! కృష్ణుని యందు అనురక్తి. ! క్షణమైనా తనను విడిచి ఉండలేని వారి నిర్మలహృదయాన్ని ,ప్రేమను అందివ్వడానికి వెన్నను గ్రహించే నెపంతో గోపికలయిండ్లు దూరి వారి నిష్కలంకమైన ప్రేమను అందుకుంటూ చివరకు వారికి మోక్షాన్ని ఇచ్చాడు.!.భక్తులందరిలో గోపికల భక్తి అత్యున్నతస్థాయి కి చెందినది ! ..కన్నయ్య చోరత్వం ఒక లీల.! శ్రీకృష్ణ లీలల అర్థము మహా యోగులకే అర్థము కాలేదు. 

యశోద మాతచే కట్టుపడకుండా త్రాడును "రెండు అంగుళాలు " తగ్గించాడు,ఇక తాను కృష్ణయ్యను కట్టలేనని తెలుసుకొని, నిరాశపడడం, చూసి, తల్లిలో అహంకార మమకారాలు తొలగడం గ్రహించి తానే స్వయంగా త్రాడు కట్టేసికుంటాడు, 



లీలమానుష విగ్రహుడు, శ్రీకృష్ణ భగవానుడు..!అంటే అన్ని వికారాలు తొలగించి తనయందలి భక్తికి యోగ్యత అందిస్తాడు.. తాను మ్రోగించిన మురళి మన శరీరమే, ! దానికి, ఉన్న రంధ్రాలు మన శరీరానికి గల రంద్రాలే !కన్నయ్యను తలచుకుంటూ చేసే పనులు కృష్ణునికి దగ్గరకు చేరుస్తాయి.. అంటే పలికే స్వరంలో కృష్ణ నామం కృష్ణభక్తి కృష్ణప్రేమ మాధుర్యం హృదయంలో పొంగిపోవాలి. .ఇక వంశీలోలుని ఊదిన సప్తస్వరాలు నాలుగు వేదాల నాదాలు . !అదే జీవన గీతం.! 

రాధారాణి కలయిక తర్వాత మాధవుడు వేణువు పట్టలేదు. రాధయే అతనికి వేణువు,!రాధయే సర్వస్వం,! రాధయే వంశీనాదం!.. రాధయే మాధవుడు,,! మాధవుడే రాధ!,.అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు ,ఆ ప్రేమమూర్తులు,,! భాగవతం లో రాధగురించిన ప్రస్తావన రాదు,,వ్యాస మహర్షికి రాధ అన్న పేరు తలచినంతనే తనను తానే మరచిపోతాడట. అంతగొప్ప భక్తి తత్వం రాధమ్మది, !. మనసును కృష్ణుని వేపు మరలిస్తే, మన శరీరం ధర్మక్షేత్రం అవుతుంది !.. శ్రీకృష్ణుని మరచితిమా అది కురుక్షేత్రం అయిపోతుంది..అంటే జీవన పోరాటాలు కదుల్తాయి . 



అందుకే మనం చేసే ప్రతి మనసా వాచా కర్మలకు ముందు సారధిగా కృష్ణుణ్ణి తలచి కొలిచి పూజించి హృదయంలో నిలిపి ,అంకితభావంతో పూర్తిగా సమర్పించుకొన్న పిదప కర్తవ్యాన్ని నిర్వహించాలి ఏ పనికైనా దేవుణ్ణి ముందు నిలిపి, మనం సంకల్పాన్ని చెయ్యాలి.ఫలితాన్ని "శ్రీకృష్ణార్పణ మస్తు "!" అనుకునే గట్టి నమ్మకం గలగాలి ..అందుకు కృష్ణయ్యనే ప్రార్తించాలి. రాధాకృష్ణా.!. నీ లీలలు అపురూపం! అద్భుతం,! అమోఘం !

దయయుంచి ఈ దీనునిపై కృపజూపి నాచే మంచి పనులు చేయించు!. కర్త కర్మ క్రియ అన్నీ నీవే తండ్రీ !.నీ పాదపద్మములనే బంగారు పంజరంలో నా మనసును బందించు.! స్వామీ. శరణు ! నందనందనా, యశోద తనయా. గోపీలోలా ,శరణు..! గోపాలకృష్ణ భగవాన్ కీ జై.! జై శ్రీరాధే !జై జై శ్రీకృష్ణ..!,గోవింద్ బోలో గోపాల్ బోలో, రాధా రమణ హరి గోపాల్ బోలో..!"


ఆనందం అంటే ఏమిటీ?

ఆనందం అంటే ఏమిటీ? కమ్మని భోజనం పుష్టిగా తినడమా.?. ఇష్టమైన సంగీతం, లేదా వృత్తిలో, వ్యవహారాల్లో లేదా భార్యాపిల్లలతో బందువుల్లో సంతోషన్గా సంసార జీవితం గడపడమా..?. డబ్బు హోదా విలాసవంతమైన కార్లు పదవులు హుందాగా ఉండటమా ?... రోజంతా ఎదో ఒకరకంగా బిజీగా ఉంటూ ,విచారం లేకుండా జీవించడమా...? 

రంది, బాధలు బాధ్యతలు, కష్టాలు దుఃఖాలు, అప్పులు ఇవేమీ లేకుండా ఉండటమా .?.ఇదే ఆనందమా..? ఈ అనుబంధాలే ఆనందమా. .?.నిజానికి ఇవన్నీ ఐహిక సుఖాలు,,! పంచేంద్రియాలను తృప్తి పరచడానికి జీవుడు పడుతున్న తపన.. 

కనీస అవసరాలు తీర్చుకునేందుకు.. జీవితంలో కొరత లేకుండా తింటూ అనుభవిస్తూ కూడా భవిష్యత్తు కోసం దాచుకునేందుకు ,చేస్తున్న నిర్విరామ కృషి ,శ్రమ,! అలుపెరుగని అంతులేని, ఆశ చావని, గమ్యం తెలీని పోరాటం !ఈ బ్రతుకులో జానెడు పొట్టకోసం నానా అవస్థలు, బాధలు, పడుతున్న ఆరాటం..! దీనినుండి విముక్తి లేదు, పుట్టిన ప్రతీ ప్రాణి కూడూ, గుడ్డా, ఆశ్రయం కోసం చచ్చేదాకా తిప్పలు పడవల్సిందే.!. ఇది మాత్రం అందరి జీవితాల్లో సర్వ సాధారణం.!. 

నీ జీవితగమ్యం ఏమిటీ. అనిముక్కుసూటిగా అడిగితే చెప్పే జవాబులు కోకొల్లలు... ! "నేనెవరిని ?"అని అడిగే ప్రశ్న లాంటిదే ఇది కూడా.. దీనికి ఏ విజ్ఞాన శాస్త్రము కూడా వివరణ ఇవ్వలేదు .ఒక్క ఆధ్యాత్మిక సాధనం ద్వారా మాత్రమే సమాధానం పొందవచ్చును.. తాత్కాలిక సౌఖ్యాలను సంతోషాలను ఇచ్చే భౌతికఅనుభూతులకు ""ఆనందము 'అని నిర్వచింప లేము.. 

"ఆనందం " అనేది శాశ్వతము. సత్యము , నిత్యము అయిన సచ్చిదానంద స్వరూపము ,ఎంతో రుచిరా,! ఓ రామ నీ నామం.. !" అని పాడుకుంటూ పొందే అద్భుతమైన అపురూపమైన, అనుభవైక వేద్యమైన దివ్యమైన అనుభూతులను మహానుభావులు ,పరమ భక్తశిఖామణులు పరమాత్మను ఆత్మదర్శనం చేసుకొని మనకు ఆ భావసంపద ను సనాతన భారతీయుల అనువంశిక వారసత్వ సంపదగా సంక్రమింప జేశారు.. ఆ కీర్తనల్లో పురాణాల్లో, గేయాల్లో, రచనల్లో శ్రుతుల్లో ,వారు ఋషిపీఠం నుండి బ్రహ్మానందాన్ని మనకు అందించారు.. త్యాగరాజు, రామదాసు పోతన, కబీర్ దాసు, మీరాబాయి, లాంటి ఆనందపు తరంగాల్లో ఓలలాడారు. భక్తిపారవశ్యంతో పులకించి పరవశించి తన్మయులయ్యారు,,

ఆనందం అంటే హరికీర్తన,హరి నామ రచన, హరి గుణగాన భజన, హరి సేవా భాగ్యం కోసం పడే తపన, హరి భక్తుల సాంగత్యం కోసం పడే ఆవేదన,,,! ఒక్కమాటలో చెప్పాలంటే పరమాత్మ రూపంలో దర్శనంలో ,సేవన ,అర్చన, పూజన ,శరణాగతి భావనలో మాత్రమే ఆనందం ,బ్రహ్మానందం,పరమానందం,,నిండి ఉంది..! ఈ సృష్టిలో అందంగా రచింపబడిన నదులు, కొండలు, కోనలు,పచ్చని చెట్లు,రంగుల పూలు, సూర్యోదయ, సూర్యాస్తమయం వేళల్లో ఆకాశంలో వెలిగే అద్భుతమైన రంగుల హంగుల దర్శనంలో ఆనందం ఉంటుంది.. ఎందుకంటే అదంతా హరిమయమే.!. 

శ్రీహరి లేని జగతి ప్రగతి,నియతి, విశ్వంలో లేదు.!. ఎటు చూసినా పరందాముని జగన్మోహన విశ్వరూపమే,! అందాలన్నీ రంగరించి కలబోసి, తన అందమైన కుంచెతో ప్రతిరోజూ తీర్చిదిద్ది మనకోసం అందిస్తున్న అపురూప అద్వితీయమైన అఖండ చాతుర్య శిల్పకళా ఖండ బాండారము.ఈ ప్రక్రుతి , !ఒక్క గులాబీ పుష్పం , రచనలో ఎన్ని కళలు, ఎన్ని రేకులు, సొగసులు,కాంతులు,సున్నితమైన సువాసనల పొరలు, అన్ని గులాబీలు ఒకే తీరు!,ఒకే సౌష్టవం,!ఒకే రంగు.. ! ఈ అందాల ఆనందాల పరిమళాల భరితమైన ఆహ్లాదకరమైన వాతావరణం ను ఇంతగా అమృతతుల్యముగా చేస్తున్నది ఎవరు,? పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణ వైభవము తప్ప,, !



ఆహా , !ప్రభూ ! నీ లీలలు వర్ణించతరమా ! అనిపిస్తుంది కదా ఆ గులాబీ పుష్పం ఉన్న ఆకులు మొక్కలు ,మొగ్గల నిగ్గులు,,!ఇలాంటి అందాలను ఒలికించే రంగు రంగుల పువ్వులు ఆకులు వృక్షాలు పచ్చిక బయళ్లు, నీలి కొండలు జగతిలో ఎన్నో కదా.! ,భగవన్తుని సృష్టి చిత్రవిచిత్రం,!అనంతం,,,! అందుకే ప్రకృతిలో ఎక్కడ చూసినా పరమాత్మ వైభవం ,దర్శించే భావించి స్పందించే అనుభూతిలో చూపులో, ప్రతిస్పందన లో ,అంతరంగంలో పొందే కమనీయము ,,రమణీయం,మనోహరము, 

మంగళ కరమైన భావసంపదలో ఉంటుంది ఆనందం యొక్క నిర్వచనం.!" .ఆనందో బ్రహ్మ !""అన్నది వేద వాక్యం,,! అందుచేత పుణ్యాత్ములు చూపిన దైవారాధన భావనా మార్గంలో మన బ్రతుకును సుసంపన్నం చేసుకుందాం !,చేసే ప్రతీ పనిలో ,వేసే ప్రతి అడుగులో,అనుభూతిలో ఆ పరందాముని ఉనికిని వైభవాన్ని,మహత్తుని, అనుభవిస్తూ,జీవితాన్ని దేవదేవుని దివ్యమైన చరణ కమలాల ముందు సమర్పించుతూ, ఆనందంగా గడుపుదాం, ! ఇంతా కన్నా ఆనందమేమి,? ఓ రామా.!. అంటూ భక్తితో భగవన్తునితో అనుబంధాన్ని ఏర్పరచు కుందాం...!.. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ.. ! హరిః ఓమ్ తత్సత్,,! సర్వమ్ శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణ మస్తు.!. స్వస్తి. !

పరమేశ్వర కృప

పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు దైవాన్ని ప్రేమించి పూజిస్తూ సంతోషంగా ఉండడం సాధారణ విషయం.. కానీ విపరీత పరిస్థితుల్లో కూడా ఆత్మస్తైర్యం కోల్పోకుండా బుద్ది జ్ఞాన సంయమనం తో ఇది కూడా దైవానుగ్రహం గా భావించి,, జరిగింది తన ప్రారబ్ద కర్మగా స్వీకరిస్తూ నిలబడే ధీరగుణం ఉండడం కూడా పరమేశ్వర కృపయే,,

ఒకటి తీయడం, అతని పనే, దానితో కృంగిపోకుండా అదే స్థానంలో మరొకటి అందించి జీవితంలో ఆశ అనే క్రొత్త చిగురుంటా కును పుట్టించడం కూడా తన బాధ్యతగా కర్తవ్యం నిర్వహిస్తాడు. ఇక మన కర్తవ్య నిర్వహణకు పెట్టిన పరీక్షలో నెగ్గే స్పూర్తిని శక్తిని బుద్ధిని కూడా అతడి ప్రేరణతో, మన దృఢమైన సంకల్పంతో ఇస్తాడు. చీకటిని కప్పిన చేతులకు, వెలుగును అందివ్వడం కూడా తెలుసు. భగవన్తుని కొలువులో అనుగ్రహానికి ఆలస్యం ఉంటుందేమో ,కానీ అతని కరుణకు కొరత ఉండదు, నన్ను పుట్టించి, ఇన్ని ఇచ్చిన వాడికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు.. అందుకే దైవాన్ని ఇది కావాలి అది వద్దు అని కోరకుండా,కృష్ణ ప్రేమను కోరాలి. జై శ్రీకృష్ణ. ..జై శ్రీరాధే...



కృష్ణలీలలు

కృష్ణలీలలు తలచినకొలదీ మధురం.! అద్భుతం.! 
మొదట వెన్న ,పిదప వస్త్రాలు, తదుపరి గోపికల చిత్తములు దొంగిలించిన బాలకృష్ణుని వన్నెలు చిన్నెలు అపురూపం, ఆనందకరం..! 

పుట్టిన శిశు రూపం నుండి తాను "సామాన్య బాలుడు కాదంటూ "అడుగడుగునా తన అసాధారణ అద్వితీయమైన దైవాంశను ప్రదర్శిస్తూ, ప్రేమానురాగాల ఆరాధనా తత్వాన్ని గోపికల ద్వారా చాటిన కన్నయ్య ను "వెన్నదొంగ " అనడం లో అమాయకం ,అజ్ఞానం ఉందని గ్రహించాలి. 

కృష్ణయ్య నడవడిని అనుసరించడం తప్పు,!అలాగే రామయ్య చరితను అనుకరించడం ఒప్పు ! 

కృష్ణ ప్రేమతత్వాన్ని,. అర్థం చేసుకొని ఆరాధించి, సాయుజ్యాన్ని పొందిన భక్త మీరాబాయి కీ కృష్ణయ్య పైన కలిగిన గాడానురాగం వలన ఎటు చూసినా , ఏది కనిపించినా ,నందగోపాలుని "దివ్యమైన మోహనరూపమే " అగుపించింది..! నీలాకాశంలో ని నల్లని మేఘం తన "కృష్ణయ్య నల్లని శరీర కాంతులను " తలపించింది.!..

 పారుతున్న యమునా తరంగాల సవ్వడి. "గోపికాలోలుని వేణుగానాన్ని "వినిపించింది. నదీతీరంలో, పచ్చన బయళ్లు ,చెట్ల పొదల్లో,,చల్లని గాలిలో, వెన్నెల కాంతుల్లో "నందనందనుని అందమైన లీలలను" తలపించాయి...! "ఇందుగలదందు లేడను సందేహము వలదు , మనసే అందాల బృందావనం ! "",అన్నట్టుగా కృష్ణ ప్రేమలో, కృష్ణుని ధ్యాసలో, ఆరాధనలో తనను తాను మరిచి, అనిర్వచనీయమైన ఆనందంతో, బాహ్యప్రపంచముతో సంబంధం తో ప్రమేయం లేకుండా ఆడుతూ పాడుతూ, గడిపింది. 

శ్రీకృష్ణభక్తితరంగాలు ఎదలో, మదిలో, హృదిలో, పొంగిపోగా, జీవించి, జన్మను ధన్యం చేసుకున్న మహా భాగ్యశాలి మీరాబాయి.!. ఆమె పాడిన ఒక్కొక్కగీతం ఆమెలో అణువణువునా నిండిన కృష్ణ ప్రేమను సూచిస్తోంది.. !ఆమె కళ్ళల్లో ,కదళికలో, కృష్ణుని పరిపూర్ణ అనుగ్రహం ఉంది. !. అందుకే తాను "నమ్మిన దైవం " పై తనకు ఎంత విశ్వాసం ఉంటుందో, అంతగా ఫలితం ఉంటుందని గీతాచార్యుడు శ్రీకృష్ణభగవాను డు ,భగవద్గీత ద్వారా అందించిన అమృత వాణి మీరాబాయి జీవితసార ము .. అది అమరము, 
 అనుభవైకవేద్యము,పరమానందకరము .

అలా శ్రీకృష్ణలీలాధ్యానామృతపానంతో ,,కృష్ణా.. సరసీరుహాక్షా, అనవరతం ,మా జీవితాలను పావనం చేయ్యి,,! గోపాలా,! నందబాలా !మురళిలో లా, !👌 ప్రకృతిలోని ప్రతికదలికలో నిండిన నీ చైతన్యాన్ని అనుభవించి, ఆనందించే యోగ్యతను, పాత్రతను ప్రసాదించు. ! యశోదా నందనా !,నీకివే శతకోటి ప్రణామాలు..!


మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...